AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday, 25 November 2017

క్రీడలు జూన్ 2014

క్రీడలు జూన్ 2014
ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ విజేత సైనా
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూ పర్ సిరీస్ టోర్నమెంట్‌లో ఛాంపియన్‌గా అవతరించింది. సిడ్నీలో జూన్ 29న జరిగిన ఫైనల్లో సైనా స్పెయిన్‌కు చెం దిన కరోలినా మారిన్‌పై విజయం సాధించింది. ఈ గెలుపుతో సైనా తన కెరీర్‌లో ఏడో సూపర్ సిరీస్ టైటిల్‌ను సొం తం చేసుకుంది. ఆమెకు రూ.34 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. 
ఐసీసీ చైర్మన్‌గా శ్రీనివాసన్
పాలనాపరమైన మార్పుల అనంతరం ఏర్పడిన తొలి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు భారత్‌కు చెందిన ఎన్. శ్రీనివాసన్ చైర్మన్‌గా అధికారికంగా ఎన్నికయ్యారు. ఐసీసీ చైర్మన్ పద వీ కాలం రెండేళ్లు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో జూన్ 26న జరిగిన వార్షిక సమావేశంలో 52 మంది సభ్యులు శ్రీనివాసన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఐసీసీ పాలనా వ్యవహారాలతో పాటు మెమోరాండమ్, ఆర్టికల్స్‌లో సవరణకు కూడా కౌన్సిల్ ఆమోదించింది. దీంతో ఇక పాలనా వ్యవహారాల్లో బిగ్-3 (భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్)దే అంతిమ నిర్ణయం.
వరల్డ్ 6-రెడ్ స్నూకర్ విజేత పంకజ్ అద్వానీ
భారత స్నూకర్ స్టార్ పంకజ్ అద్వానీ వరల్డ్ 6-రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్ విజేతగా నిలిచాడు. జూన్ 29న జరిగిన ఫైనల్లో పంకజ్ పోలెండ్‌కు చెందిన కాస్ఫర్ ఫ్లిల్పియాక్‌పై విజయం సాధించాడు. ఈ విజయంతో తొమ్మిదో ప్రపంచ టైటిల్‌ను (బిలియర్డ్స్‌లో 7, స్నూకర్‌లో 2) తన ఖాతాలో వేసుకున్నాడు.
ఉరుగ్వే ఫుట్‌బాల్ ఆటగాడు సూరెజ్‌పై నిషేధం 
బ్రెజిల్‌లో జూన్ 25న ఇటలీ- ఉరుగ్వేల మధ్య జరిగిన ప్రపంచకప్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో గియార్గియా అనే ఇటలీ ఆటగాడిని కొరికినందుకు ఉరుగ్వే ఫుట్ బాల్ క్రీడాకారుడు లూయిస్ సూరెజ్‌పై ఫిఫా నిషేధం విధించింది. తొమ్మిది అంతర్జాతీయ మ్యాచ్‌లతోపాటు నాలుగు నెలలు ఫుట్‌బాల్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా సూరెజ్‌పై చర్య తీసుకుంది.

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్‌పై ఎనిమిదేళ్ల నిషేధం
బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాడు, మాజీ కెప్టెన్ మహమ్మద్ ఆష్రాఫుల్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. ఆష్రాఫుల్‌తోపాటు ఢాకా గ్లాడియేటర్స్ జట్టు యజమాని పిహబ్ చౌదరి పదేళ్ల నిషేధానికి గురయ్యాడు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు నేరాన్నిఅంగీకరించినందుకు ఆష్రాఫుల్‌పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు జూన్ 18న క్రమశిక్షణ ఉల్లంఘన కింద చర్యలను తీసుకుంది. 
షూటర్ జీతూకు స్వర్ణం
స్లొవేనియాలోని మారిబోర్‌లో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో భారత ఆటగాడు జీతూరాయ్ స్వర్ణం సాధించాడు. ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్ రౌండ్‌లో 200.8 పాయింట్లతో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఈ పతకంతో పాటు ఇంతకు ముందే ప్రీ పిస్టల్‌లో రజతం సాధించిన జీతూ ప్రపంచకప్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. 
అత్యుత్తమ బౌలింగ్ రికార్డు నెలకొల్పిన స్టువర్ట్ బిన్నీ 
వన్డే క్రికెట్‌లో భారత బౌలర్ స్టువర్ట్ బిన్నీ అత్యుత్తమ బౌలింగ్ రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్‌లోని మిర్పూర్‌లో జూన్ 17న భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన రెండో వన్డేలో నాలుగు పరుగులకు ఆరు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఇప్పటివరకు ఉన్న అనిల్‌కుంబ్లే రికార్డును అధిగమించాడు. కుంబ్లే 1993లో వెస్టిండీస్‌పై కోల్‌కతాలో 12 పరుగులకు 6 వికెట్లు తీసిన రికార్డు ఇప్పటివరకు ఉంది. 
ఫిడే వరల్డ్ రాపిడ్ చెస్ విజేత మాగ్నస్ కార్లస్ 
ప్రపంచ నంబర్‌వన్ చెస్ ఆటగాడు మాగ్నస్ కార్లస్ ఫిడే వరల్డ్ రాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. చెస్ క్లబ్ ఆఫ్ దుబాయ్‌లో జూన్ 18న జరిగిన పోటీల్లో మాగ్నస్ 15 పాయింట్లకు గాను 11 పాయింట్లు గెలిచి విజేతగా నిలిచాడు. ఈ టోర్నమెంట్‌ను ప్రపంచ చెస్ ఫెడరేషన్ నిర్వహించడం ఇది మూడోసారి.
ఆస్ట్రియా గ్రాండ్ ప్రి విజేత రోస్‌బర్గ్
ఆస్ట్రియా గ్రాండ్ ప్రిలో మెర్సిడెస్ డ్రైవర్ జర్మనీకి చెందిన నికో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. జూన్ 22న 71 ల్యాప్‌ల రేసును రోస్‌బర్గ్ 27 నిమిషాల 54.976 సెకన్లలో పూర్తిచేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో రోస్‌బర్గ్‌కు ఇది మూడో విజయం. కాగా ఇదే జట్టుకు చెందిన లూయీస్ హామిల్టన్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.

పురుషుల ప్రపంచ హకీ కప్ విజేత ఆస్ట్రేలియా
పురుషుల ప్రపంచ హకీ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. జూన్ 15న ద హేగ్‌లో జరిగిన ఫైనల్లో నెదర్లాండ్స్‌ను ఓడించింది. అర్జెంటీనా మూడో స్థానం దక్కించుకుంది. మహిళల విభాగంలో ఆస్ట్రేలియాను ఓడించి నెదర్లాండ్స్ విజేతగా నిలిచింది.
ప్రపంచకప్ షూటింగ్‌లో జీతూకు రజతం
భారత పిస్టల్ షూటర్ జీతూ రాయ్.. ప్రపంచకప్ షూటింగ్‌లో రజత పతకం సాధించాడు. జూన్ 11న జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్స్‌లో జీతూ రెండో స్థానంలో నిలిచాడు. స్పెయిన్‌కు చెందిన పాబ్లో కారెరా స్వర్ణం దక్కించుకున్నాడు. 
ప్రారంభమైన సాకర్ వరల్డ్‌కప్
20వ ఫుట్‌బాల్ ప్రపంచకప్ బ్రెజిల్‌లోని సావోపాలో నగరంలో జూన్ 12న ప్రారంభమైంది. జూలై 13 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. 32 దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో బ్రెజిల్-క్రొయేషియాతో తలపడింది. ఈ ప్రపంచకప్ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 3417 కోట్లు. విజేత జట్టుకు దక్కే మొత్తం రూ.207 కోట్లు. రన్నరప్ జట్టుకు లభించే మొత్తం రూ. 148 కోట్లు. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను పురస్కరించుకుని భారత్‌లో రూ.5, రూ.25ల ప్రత్యేక స్టాంపులను విడుదల చేశారు. న్యూఢిల్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడి చేతుల మీదుగా జూన్ 12న వీటిని ఆవిష్కరించారు. ఇప్పటివరకు 19 ప్రపంచకప్ టోర్నమెంట్లు జరిగాయి. 1930లో జరిగిన తొలి ప్రపంచ కప్‌లో 13 జట్లు పాల్గొన్నాయి. అత్యధిక సార్లు ప్రపంచ కప్ గెలిచిన జట్టు బ్రెజిల్ (5). గత ప్రపంచకప్ 2010లో దక్షిణాఫ్రికాలో జరిగింది. ఇందులో స్పెయిన్ విజేతగా నిలిచింది.
ఫోర్బ్స్ జాబితాలో ధోని
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంపాదనతో తొలి 100 స్థానాల్లో నిలిచిన క్రీడాకారులతో ఫోర్బ్స్ వెబ్‌సైట్ జాబితా రూపొందించింది. ఇందులో భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి స్థానం దక్కింది. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ దాకా 12 నెలల కాలంలో ధోని రూ. 177 కోట్లు ఆర్జించి దేశంలోకెల్లా అత్యధిక ఆర్జన గల క్రీడాకారుడిగా ఈ జాబితాలో 22వ స్థానంలో నిలిచాడు. భారత్ నుంచి ఈ జాబితాలో నిలిచిన ఏకైక క్రీడాకారుడు ధోనియే. ఈ జాబితాలో అమెరికా బాక్సర్ మేవెదర్ అగ్రస్థానం (రూ. 621 కోట్లతో)లో నిలిచాడు. టైగర్ వుడ్స్ (రూ. 591 కోట్లతో) రెండో స్థానం పొందాడు. 
ఆసియా బిలియర్డ్స్ చాంప్ కొఠారి
ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో భారత జాతీయ చాంపియన్ సౌరవ్ కొఠారి విజేతగా నిలిచాడు. చండీగఢ్‌లో జూన్ 13న జరిగిన ఫైనల్లో కొఠారి అలోక్ (భారత్)ను ఓడించాడు. 
హాకీ మ్యాచ్ సమయం 60 నిమిషాలు
ఇప్పటిదాకా 70 నిమిషాలున్న హాకీ మ్యాచ్ నిడివి 60 నిమిషాలకు కుదించా లని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) నిర్ణయించింది. ప్రతి 15 నిమిషాలకు విరామం చొప్పున నాలుగు భాగాలుగా 60 నిమిషాల పాటు మ్యాచ్ సాగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇంచియాన్‌లో జరిగే ఆసియా క్రీడల నుంచి ఈ సమయాన్ని అమలు చేస్తున్నట్లు ఎఫ్‌ఐహెచ్ అధ్యక్షుడు లియాండ్రె నెగ్రె జూన్ 15న ప్రకటించారు.


కెనడా గ్రాండ్‌ప్రి విజేత రికియార్డో
కెనడా గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ జట్టు డ్రై వర్ డానియెల్ రికియార్డో విజేతగా నిలిచాడు. నికో రోస్‌బర్గ్ (మెర్సిడెస్) రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 

ఫ్రెంచ్ ఓపెన్-2014 విజేతలుమహిళల సింగిల్స్:ఈ విభాగంలో మరియా షరపోవా(రష్యా) విజేతగా నిలిచింది. జూన్ 7న జరిగిన ఫైనల్లో సిమోనా హలెప్ (రుమేనియా)పై విజయం సాధించింది.
పురుషుల సింగిల్స్: రాఫెల్ నాదల్ (స్పెయిన్) విజేతగా నిలిచాడు. జూన్ 8న జరిగిన ఫైనల్లో నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) పై విజం సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌ను నాదల్ గెలవడం ఇది 9వ సారి కాగా... వరుసగా ఐదో సారి (2010-2014) కావడం విశేషం. ఈ టైటిల్‌తో అతను అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. 14 టైటిల్స్‌తో పీట్ సంప్రాస్ (అమెరికా)సరసన నాదల్ ఉన్నాడు. 17 టైటిల్స్‌తో ఈ జాబితాలో ఫెదరర్ (స్విట్జర్లాండ్) అగ్రస్థానంలో ఉన్నాడు. 
మహిళల డబుల్స్ విజేతలు: సువీ హసిహ్ (తైపీ), పెంగ్ షూయ్ (చైనా) జంట;
పురుషుల డబుల్స్ విజేతలు: మార్షల్ గ్రనొల్లెర్స్, మార్క్ లోపెజ్ (స్పెయిన్) జంట; 
మిక్స్‌డ్ డబుల్స్ విజేతలు: అన్నా లీనా గ్రొనెఫెల్డ్ (జర్మనీ), జీన్ జులియెన్ రోజెర్ (నెదర్లాండ్స్) జంట.

No comments:

Post a Comment