అవార్డులు డిసెంబరు 2015
ఆంధ్రప్రదేశ్ అవార్డులు
బాలగురుకు సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుయుద్ధ ట్యాంకుల పరిశోధన, అభివృద్ధి సంస్థ (సీబీఆర్‌డీఈ) శాస్త్రవేత్త వి.బాలగురుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ)‘సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్-2013’ అవార్డు లభించింది. అర్జున్ యుద్ధ ట్యాంకుల రూపకల్పన, యంత్ర వ్యవస్థల ఆధునికీకరణకు చేసిన కృషికి గానూ ఆయనకు ఈ అవార్డు దక్కింది.
తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ‘ఆడి రిట్జ్ ఐకాన్’ అవార్డుతెలంగాణ పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుకు జాతీయస్థాయి గౌరవం దక్కింది. ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్ రిట్జ్-సీఎన్‌ఎన్ ఐబీఎన్ చానల్ సంయుక్తంగా ఇస్తున్న‘ఆడి రిట్జ్ ఐకాన్-2015’ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. ప్రజా జీవితంలో అద్భుతమైన పురోగతిని సాధించినందుకు గాను మంత్రి కేటీఆర్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు రిట్జ్ మ్యాగజైన్ ప్రకటించింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు కూడా రిట్జ్ అవార్డులను తాజాగా ప్రకటించింది. అవార్డులకు ఎంపికైన వారిలో రామ్‌చరణ్ తేజ, విద్యాబాలన్ (సినిమా), గ్రంధి మల్లిఖార్జునరావు (వ్యాపారం), గౌరంగ్ షాకి(ఫ్యాషన్), నందన్ నీలేకని (టెక్నాలజీ) ఉన్నారు.
టీఎస్‌పీఎస్సీకు స్కోచ్ అవార్డు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ‘స్కోచ్ బోర్డ్ ఆఫ్ మెరిట్ అవార్డు-2015’ దక్కింది. కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షలు నిర్వహించటంలో ఆధునిక సాంకేతికత వినియోగించినందుకు అవార్డు లభించింది. ఈ అవార్డు కోసం కేంద్ర, వివిధ రాష్ట్రాలకు చెందిన 700కు పైగా ప్రభుత్వ విభాగాలు పోటీపడ్డాయి. ఢిల్లీకి చెందిన స్కాచ్ సంస్థ ఆధునిక సాంకేతిక వినియోగం, సేవలకు సంబంధించి ప్రభుత్వ సంస్థలకు ఏటా ఈ అవార్డు అందజేస్తుంది.
తెలంగాణ పౌర సరఫరాల శాఖకు ఈ-గవర్నెన్స్ అవార్డుతెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ 2014-15 ఏడాదికిగాను సీఎస్‌ఐ నిహిలియంట్ ఈ-గవర్నెన్స్ అవార్డుకు ఎంపికయ్యింది. ఈ శాఖ పరిధిలోని జాతీయ ఆహార భద్రతా కార్డుల ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక సాంకేతికతను వాడుకోవడంలో ప్రతిభ కనబర్చినందుకు ఈ అవార్డు దక్కింది. రేషన్ కార్డు వివరాలను డేటాబేస్‌లో పొందుపరచడం, ఆధార్ సీడింగ్, చౌక ధరల దుకాణాల్లో క్లోజింగ్ బ్యాలెన్స్ నమోదు, ఈ-పాస్ అమలు, బోగస్ కార్డుల తొలగింపు వంటి వాటికి ఈ అవార్డు లభించింది.
భారతీయ అమెరికన్‌కు యూపీ రత్న అవార్డువివిధ రంగాల్లో ప్రఖ్యాతి గాంచిన ప్రవాస ఉత్తరప్రదేశ్ వాసులకు ఇచ్చే యూపీ రత్న అవార్డును ఈ ఏడాది ప్రముఖ వ్యాపారవేత్త ఫ్రాంక్ ఇస్లామ్(63)కు ఇవ్వనున్నారు. ఉత ్తరప్రదేశ్‌లో పుట్టి 1970లో అమెరికాలో స్థిరపడిన ఫ్రాంక్ అక్కడ వ్యాపారవేత్తగా పేరు గడించారు. కొలరాడో యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ పొందారు. అనంతరం సొంతంగా సంస్థను స్థాపించి దాన్ని 300 మిలియన్ డాలర్ల కంపెనీగా తీర్చిదిద్దారు.
ఇద్దరు భారతీయులకు క్వీన్స్ యంగ్ లీడర్స్ అవార్డ్ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపే అద్భుత ఆవిష్కరణలు చేసిన ఇద్దరు భారతీయులకు యూకేలో ప్రతిష్టాత్మక క్వీన్స్ యంగ్ లీడర్స్ అవార్డ్ లభించింది. క్వీన్ ఎలిజిబెత్ డైమండ్ జూబ్లీ ట్రస్ట్ ఏటా ఈ అవార్డును అందజేస్తుంది. 2016కు గాను ఈ అవార్డు గెలుపొందిన 60 మందిలో భారత్‌కు చెందిన కార్తీక్ సాహ్నీ, నేహా స్వేన్ ఉన్నారు. పుట్టుకతోనే అంధుడైన కార్తీక్ తనలాంటి వారికి విద్యనందించేందుకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టాడు. రుబరూ అనే స్వచ్ఛంద సంస్థకు సహ వ్యవస్థాపకురాలైన నేహా యువతలో నైపుణ్యాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టింది.
కిర్మాణీకి జీవితకాల సాఫల్య పురస్కారం
బీసీసీఐ ప్రతి ఏటా ఇచ్చే జీవిత కాల సాఫల్య పురస్కారానికి ఈ ఏడాది(2015) సయ్యద్ కిర్మాణీ ఎంపికయ్యారు. డిసెంబర్ 24న సమావేశమైన బీసీసీఐ అవార్డుల కమిటీ ఆయన పేరును ఏకగ్రీవంగా ఆమోదించింది. భారత తొలి టెస్టు కెప్టెన్ సీకే నాయుడు పేరిట ఏర్పాటు చేసిన ఈ అవార్డు కింద కిర్మాణీకి ట్రోఫీతో పాటు రూ.25 లక్షల నగదు బహుమతిని అందిస్తారు.
డ్యూక్ ఫ్యాషన్స్‌కు ‘హైపర్‌సిటీ యునైట్ 2 విన్’ అవార్డు
ప్రముఖ లైఫ్ స్టైల్ బ్రాండ్ డ్యూక్ ఫ్యాషన్స్ (ఇండియా) తాజాగా ‘హైపర్‌సిటీ యునైట్ 2 విన్’ అవార్డును గెలుచుకుంది. షాపర్స్ స్టాప్ హైపర్ సిటీ చైన్‌లో గతేడాది కన్నా 30 శాతం అధికంగా, నిర్దేశిత అమ్మకపు వృద్ధిని సాధించినందుకు గానూ ఈ అవార్డును గెలుపొందింది. దాదాపు 30 దేశీ, అంతర్జాతీయ బ్రాండ్లలో కేవలం డ్యూక్ ఫ్యాషన్స్ మాత్రమే లక్ష్యాన్ని చేరుకుంది. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో షాపర్స్ స్టాప్ సంస్థ ఎండీ గోవింద్ శ్రీఖండే ఈ అవార్డును డ్యూక్ ష్యాషన్స్ ఆర్‌ఎస్‌ఎం (పశ్చిమ) మనోజ్ రావత్‌కు అందించారు.
డాక్టర్ గురు ఎన్ రెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు
హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రి అధినేత డాక్టర్ గురు ఎన్ రెడ్డికి హెల్త్‌కేర్ రంగంలో ప్రతిష్టాత్మక ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. హెల్త్‌కేర్ సేవలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రెడ్డిని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ చైర్మన్ కిరీట్ సోలంకి, రక్షణ శాఖకు చెందిన ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ డెరైక్టర్ జనరల్ బీకే చోప్రాల నుంచి రెడ్డి ఈ అవార్డు అందుకున్నారు. 750 పడకల కాంటినెంటల్ ఆసుపత్రిని డాక్టర్ రెడ్డి 2013లో ప్రారంభించారు. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులతో వైద్య సేవలు అందిస్తున్నందుకు కమిటీ ఈ అవార్డును ప్రకటించింది.
గుజరాతీ రచయిత రఘువీర్‌కు జ్ఞానపీఠ్
ప్రముఖ గుజరాతీ రచయిత రఘువీర్ చౌధురి(76)కి ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కారాన్ని ప్రకటించారు. భారతీయ సాహిత్యానికి చేసిన సేవకుగాను 51వ జ్ఞానపీఠ్‌కు ఆయనను ఎంపిక చేశారు. నవలా రచయిత, కవి, సాహిత్య విమర్శకుడు, గాంధేయవాది అయిన రఘువీర్ రాసిన నవల ‘అమృత’ ఆయనకు పేరు తెచ్చింది. ‘ట్రయాలజీ ఉపర్వాస్’ నవలకుగాను ఆయన 1977లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ‘వేణు వాస్తవ’, ‘పూర్వరంగ్’, ‘రుద్రమహాలయ’ తదితర 80 రచనలు చేశారు. గుజరాత్ వర్సిటీలో అధ్యాపకుడిగా పని చేసి 1998లో రిటైర్ అయ్యారు. గుజరాత్‌కు జ్ఞానపీఠ్ దక్కడం ఇది నాలుగోసారి.
టీఎస్‌ఐఐసీ ఎండీకి ఉద్యోగ రతన్ అవార్డు
తెలంగాణ పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) వీసీ, ఎండీ ఇ.వి.నర్సింహారెడ్డికి ఉద్యోగ రతన్ అవార్డు లభించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ అందించిన ఈ అవార్డును డిసెంబర్ 30న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన అందుకున్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి విశేష కృషి చేసిన వారికి ఏటా ఈ అవార్డులను అందజేస్తారు.
ఏపీ జెన్‌కోకు ఉత్తమ జల విద్యుదుత్పత్తి అవార్డు
ఏపీ జెన్‌కోకు ఉత్తమ జల విద్యుదుత్పత్తి పురస్కారం లభించింది. కేంద్ర సాగునీటి, విద్యుత్ బోర్డు (సీబీఐపీ) ఈ అవార్డును ప్రకటించింది. ఢిల్లీలో డిసెంబర్ 29న జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఉమాభారతి చేతుల మీదుగా ఏపీ జెన్‌కో జల విద్యుత్ విభాగం డెరైక్టర్ శామ్యూల్ అవార్డును అందుకున్నారు. హైడల్ పవర్‌లో నాణ్యత ప్రమాణాలు పాటించినందుకు ఈ అవార్డు దక్కింది.
కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాలు
కేంద్ర సాహిత్య అకాడెమీ 2015 సంవత్సరానికి పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 23 భాషల్లోని రచనలు అవార్డులకు ఎంపికయ్యాయి. ఫిబ్రవరి 16న అవార్డులను అందజేయనున్నారు. తెలుగుకు సంబంధించి ప్రముఖ రచయిత్రి ఓల్గా రచించిన చిన్న కథల సంకలనం ‘విముక్త’కు కేంద్ర సాహిత్య పురస్కారం లభించింది. ప్రొ. శ్రీకాంత్ బహుల్కర్‌కు భాషా సమ్మాన్ అవార్డు లభించింది. శాస్త్రీయ, మధ్యయుగ సాహిత్యంలో చేసిన కృషికి గానూ ఆయనకు ఈ అవార్డు దక్కింది.అవార్డు విజేతల వివరాల కోసం క్లిక్ చేయండి
రాష్ట్రపతి ప్రణబ్‌కు గార్‌వుడ్ అవార్డ్
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాలిఫోర్నియాలోని ‘యూసీ బర్కేలే హాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ నుంచి గార్‌వుడ్ అవార్డును అందుకున్నారు. ఓపెన్ ఇన్నోవేషన్(పరిశోధన ఫలితాల్లో రిస్కులను, రివార్డులను పంచుకోవడం ద్వారా సంస్థలు ఇతర సంస్థలతో కలిసి వినూత్న ఆవిష్కరణలకు నాంది పలకడం)లో విశేషమైన కార్యక్రమాలను ప్రారంభించినందుకు గాను ఆయనకు ఈ ‘ఔట్‌స్టాండింగ్ గ్లోబల్ లీడర్’ అవార్డు లభించింది. గార్‌వుడ్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సోలోమన్ డార్విన్ డిసెంబర్ 17న రాష్ట్రపతి భవన్‌లో ఈ అవార్డును ప్రణబ్‌కు అందజేశారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన మూడేళ్ల కాలంలో వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రణబ్ ముఖర్జీ అనేక కార్యక్రమాలు ప్రారంభించారు. 2015 సంవత్సరం ప్రారంభంలో రాష్ట్రపతి భవన్‌లో తొలిసారిగా ‘ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
డాక్టర్ ఎం.రామయ్యకు నాయుడమ్మ అవార్డు
అమెరికాలోని కార్నెగిమెల్లాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.రామయ్య కృష్ణన్.. నాయుడమ్మ అవార్డు- 2015కు ఎంపికయ్యారు. నాయుడమ్మ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆల్టర్నేటివ్స్ సెంటర్ ఏటా ఈ అవార్డును అందజేస్తుంది. అవార్డుకు ఎంపికైన డాక్టర్ రామయ్య కృష్ణన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, ఆస్టిన్ నుంచి మేనేజ్‌మెంట్ అండ్ ఇన్ఫ్‌ర్మేషన్ సిస్టమ్స్‌లో పీహెచ్‌డీ పొందారు. జనరల్ మోటార్స్ డిస్టెన్స్ టీచింగ్ ఎక్స్‌లెన్స్ అవార్డుతోపాటు 23 ప్రతిష్టాత్మక అవార్డులను ఆయన అందుకున్నారు. అంతర్జాతీయ వైజ్ఞానిక పత్రికల్లో, 100కు పైగా వైజ్ఞానిక సదస్సుల్లో పరిశోధన పత్రాలను ప్రచురించారు. డిసెంబర్ 21వ తేదీన చెన్నైలోని ఐఐటీలో జరిగే 21వ నాయుడమ్మ స్మారకోత్సవంలో డాక్టర్ రామయ్య కృష్ణన్.. నాయుడమ్మ స్మారకోపన్యాసం చేస్తారు. ఐఐటీ డెరైక్టర్ డాక్టర్ భాస్కర్ రామమూర్తి ఆయనకు నాయుడమ్మ స్మారక అవార్డును ప్రదానం చేస్తారు.
ఈసీఐఎల్‌కు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అవార్డు
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అవార్డు-2015ను సొంతం చేసుకుంది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ చేతుల మీదుగా ఈసీఐఎల్ దక్షిణ భారత జీఎం కుల్‌దీప్‌సింగ్ దలాల్, ఎంఆర్‌కే నాయుడు అవార్డును అందుకున్నారు. ఎప్పటికప్పుడు అధునాతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఎలక్ట్రానిక్స్ రంగంలో చేస్తున్న పరిశోధనలకు గాను ఈ అవార్డును అందజేశారు.
ఆండీ ముర్రేకు బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ అవార్డు
{బిటన్ 79 ఏళ్ల తర్వాత డేవిస్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రేకు 2015 సంవత్సరానికి బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ అవార్డు లభించింది. డిసెంబర్ 20న జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ప్రపంచ రెండో నంబర్ ఆటగాడు అవార్డు అందుకున్నాడు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును ముర్రే రెండోసారి గెలుచుకోవడం విశేషం. ఐదేళ్ల పాటు తాము ఓ ప్రణాళిక ప్రకారం కష్టపడటం వల్ల డేవిస్ కప్ గెలిచామని ఈ సందర్భంగా ముర్రే వ్యాఖ్యానించాడు.
సతీశ్‌రెడ్డికి ‘ఇంజనీరింగ్ ఎక్సలెన్స్’ అవార్డు
రక్షణ శాఖ మంత్రి శాస్త్రీయ సలహాదారు, రీసెర్చ్ సెంటర్ ఇమారత్ డెరైక్టర్ సతీశ్‌రెడ్డిని మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఇంజనీరింగ్ విభాగంలో అత్యున్నత ప్రతిభ చూపిన వారికి ది ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఐఈఐ,), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ (ఐఈఈఈ) ఇచ్చే ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ అవార్డును ఆయన అందుకోనున్నారు. దేశ రక్షణ రంగ స్వావలంబనలో, జాతీయ భద్రతలో సతీశ్‌రెడ్డి పరిశోధనలు కీలకభూమిక పోషించాయని అవార్డుల న్యాయనిర్ణేతలు పేర్కొన్నారు. ఐఈఈఈ స్వర్ణోత్సవాల సందర్భంగా 2016లో జరిగే కార్యక్రమంలో అవార్డు అందజేస్తారు.
టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కి ‘స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ అవార్డులువ్యాపార రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అమలు కోసం విశేష కృషి చేసినందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్)కి రెండు ‘స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ పురస్కారాలు వరించాయి. స్మార్‌ట మీటర్ల వినియోగంతో పాటు వినియోగదారులకు బిల్లుల జారీ కోసం ఐఆర్ మీటర్లను వినియోగిస్తూ ఆటోమెటిక్ స్పాట్ బిల్లింగ్ సేవలను అందిస్తున్నందుకు ఎస్పీడీసీఎల్ ఈ పురస్కారాలకు ఎంపికైంది. ఎస్పీడీసీఎల్ సీఎండీ డిసెంబర్ 10న న్యూఢిల్లీలో ఈ అవార్డులను స్వీకరించారు.
టీఎస్‌పీఎస్సీకి స్కోచ్ స్మార్ట్ టెక్నాలజీ అవార్డుతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)కి స్కోచ్ స్మార్ట్ టెక్నాలజీ అవార్డు దక్కింది. న్యూఢిల్లీలో జరిగిన స్కోచ్ సదస్సులో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి డిసెంబర్ 11న ఈ అవార్డు అందుకున్నారు. ప్రభుత్వరంగ సంస్థల పనితీరు ఆధారంగా స్కోచ్ సంస్థ ఈ అవార్డులు ఇస్తుంది. ఇదే సదస్సులో టీఎస్‌పీఎస్సీకి డిసెంబర్ 10న ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు లభించింది. ఐటీ విస్తరణ, సేవలు, డిజిటలైజేషన్, బయోమెట్రిక్ విధానాలు ప్రవేశపెట్టడం తదితర అంశాల్లో ఈ అవార్డులు లభించాయి.
ప్రభంజన్ యాదవ్‌కు పూలే పురస్కారం తెలంగాణ రచయిత, బీసీ జనసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్‌కు మహాత్మా జ్యోతిరావు పూలే జాతీయ పురస్కారం లభించింది. డిసెంబర్ 13న ఢిల్లీలో భారతీయ దళిత సాహిత్య అకాడమీ నిర్వహించిన దళిత రచయితల 31వ జాతీయ మహాసభల్లో అకాడమీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సుమనక్షర్ చేతులు మీదుగా ప్రభంజన్ యాదవ్ అవార్డును అందుకున్నారు. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో బహుజనుల చైతన్యం, అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేసిన వారికి ప్రతి ఏటా దళిత సాహిత్య అకాడమీ ప్రతిష్టాత్మక మహాత్మా జ్యోతిరావు పూలే అవార్డుతో సత్కరిస్తోంది. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలానికి చెందిన ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ ఇప్పటి వరకు తెలుగులో తొమ్మిది, ఆంగ్లంలో ఆరు పుస్తకాలను రచించారు. ఆయన రాసిన పరిశోధన పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.
‘ఎతిహాద్’కు వరల్డ్స్ లీడింగ్ ఎయిర్‌లైన్ అవార్డువరుసగా ఏడో ఏడాది కూడా ‘వరల్డ్ లీడింగ్ ఎయిర్‌లైన్ అవార్డు’ ఎతిహాద్ ఎయిర్‌వేస్‌ను వరించింది. దీంతో పాటుగా ‘వరల్డ్స్ లీడింగ్ ఫస్ట్‌క్లాస్’, ‘వరల్డ్స్ లీడింగ్ ఇన్‌ఫ్లైట్ ఎంటర్‌టైన్‌మెంట్’, ‘వరల్డ్స్ లీడింగ్ క్యాబిన్ క్రూ’ అవార్డులను సైతం సొంతం చేసుకుంది. డిసెంబర్ 12న అబుదాబిలో జరిగిన వార్షిక ‘వరల్డ్ ట్రావెల్ అవార్డుల’ ప్రదానోత్సవ వేడుకలో వీటిని అందజేశారు.
జాతీయ ఇంధన పొదుపు అవార్డులుఇంధన పొదుపులో తెలంగాణకు 5, ఆంధ్రప్రదేశ్‌కు 6 జాతీయ అవార్డులు లభించాయి. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో డిసెంబర్ 14న నిర్వహించిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఇంధన పొదుపులో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన సంస్థల ఉన్నతాధికారులు, ప్రతినిధులకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ అవార్డులను అందచేశారు.
తెలంగాణకు వచ్చిన అవార్డులు

- డెయిరీ విభాగంలో ద్వితీయ బహుమతి - హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్, ఉప్పల్ (హైదరాబాద్)
- ఫుడ్ ప్రాసెసింగ్‌లో ద్వితీయ బహుమతి - టాటా కాఫీ లిమిటెడ్, ఇన్‌స్టంట్‌కాఫీ డివిజన్, తూప్రాన్ యూనిట్ (మెదక్)
- జనరల్ కేటగిరీలో ద్వితీయ బహుమతి - దక్షిణమధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్, కాజీపేట పంపింగ్ సెక్టర్ (సికింద్రాబాద్) నుంచి సోలంగుప్త
- మాన్యుఫాక్చరర్స్ ఆఫ్ బీఈఈ స్టార్ లేబుల్డ్ అప్లియెన్స్(డిస్ట్రిబ్యూషన్ ట్రాన్సుఫార్మర్) విభాగంలో ప్రథమ బహుమతి - తోషిబా ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్(ఇండియా) మెదక్
- కార్యాలయ భవనం విభాగంలో ప్రథమ బహుమతి - దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ సీ-టీఏఆర్‌ఏ బిల్డింగ్(సికింద్రాబాద్)
ఆంధ్రప్రదేశ్ అవార్డులు
- డెయిరీ విభాగంలో ప్రథమ బహుమతి - హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్(చిత్తూరు)
- విద్యుత్ పంపిణీ కంపెనీ(డిస్కమ్స్) విభాగంలో ప్రథమ బహుమతి - సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(చిత్తూరు)
- జనరల్ కేటగిరీలో ప్రథమ బహుమతి - గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(విశాఖ)
- స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీస్ విభాగంలో ప్రథమ బహుమతి - స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్(ఎస్‌ఈసీఎం), ఇంధన శాఖ విభాగం, ఐఎండీఐ, (ఏపీ ప్రభుత్వం)
- బిజినెస్ మోడల్ విభాగంలో ప్రథమ బహుమతి - ఎస్పీడీసీఎల్(తిరుపతి)
- బిజినెస్ మోడల్ విభాగంలో ద్వితీయ బహుమతి - గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్
బాలగురుకు సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుయుద్ధ ట్యాంకుల పరిశోధన, అభివృద్ధి సంస్థ (సీబీఆర్‌డీఈ) శాస్త్రవేత్త వి.బాలగురుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ)‘సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్-2013’ అవార్డు లభించింది. అర్జున్ యుద్ధ ట్యాంకుల రూపకల్పన, యంత్ర వ్యవస్థల ఆధునికీకరణకు చేసిన కృషికి గానూ ఆయనకు ఈ అవార్డు దక్కింది.
తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ‘ఆడి రిట్జ్ ఐకాన్’ అవార్డుతెలంగాణ పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుకు జాతీయస్థాయి గౌరవం దక్కింది. ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్ రిట్జ్-సీఎన్‌ఎన్ ఐబీఎన్ చానల్ సంయుక్తంగా ఇస్తున్న‘ఆడి రిట్జ్ ఐకాన్-2015’ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. ప్రజా జీవితంలో అద్భుతమైన పురోగతిని సాధించినందుకు గాను మంత్రి కేటీఆర్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు రిట్జ్ మ్యాగజైన్ ప్రకటించింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు కూడా రిట్జ్ అవార్డులను తాజాగా ప్రకటించింది. అవార్డులకు ఎంపికైన వారిలో రామ్‌చరణ్ తేజ, విద్యాబాలన్ (సినిమా), గ్రంధి మల్లిఖార్జునరావు (వ్యాపారం), గౌరంగ్ షాకి(ఫ్యాషన్), నందన్ నీలేకని (టెక్నాలజీ) ఉన్నారు.
టీఎస్‌పీఎస్సీకు స్కోచ్ అవార్డు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ‘స్కోచ్ బోర్డ్ ఆఫ్ మెరిట్ అవార్డు-2015’ దక్కింది. కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షలు నిర్వహించటంలో ఆధునిక సాంకేతికత వినియోగించినందుకు అవార్డు లభించింది. ఈ అవార్డు కోసం కేంద్ర, వివిధ రాష్ట్రాలకు చెందిన 700కు పైగా ప్రభుత్వ విభాగాలు పోటీపడ్డాయి. ఢిల్లీకి చెందిన స్కాచ్ సంస్థ ఆధునిక సాంకేతిక వినియోగం, సేవలకు సంబంధించి ప్రభుత్వ సంస్థలకు ఏటా ఈ అవార్డు అందజేస్తుంది.
తెలంగాణ పౌర సరఫరాల శాఖకు ఈ-గవర్నెన్స్ అవార్డుతెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ 2014-15 ఏడాదికిగాను సీఎస్‌ఐ నిహిలియంట్ ఈ-గవర్నెన్స్ అవార్డుకు ఎంపికయ్యింది. ఈ శాఖ పరిధిలోని జాతీయ ఆహార భద్రతా కార్డుల ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక సాంకేతికతను వాడుకోవడంలో ప్రతిభ కనబర్చినందుకు ఈ అవార్డు దక్కింది. రేషన్ కార్డు వివరాలను డేటాబేస్‌లో పొందుపరచడం, ఆధార్ సీడింగ్, చౌక ధరల దుకాణాల్లో క్లోజింగ్ బ్యాలెన్స్ నమోదు, ఈ-పాస్ అమలు, బోగస్ కార్డుల తొలగింపు వంటి వాటికి ఈ అవార్డు లభించింది.
భారతీయ అమెరికన్‌కు యూపీ రత్న అవార్డువివిధ రంగాల్లో ప్రఖ్యాతి గాంచిన ప్రవాస ఉత్తరప్రదేశ్ వాసులకు ఇచ్చే యూపీ రత్న అవార్డును ఈ ఏడాది ప్రముఖ వ్యాపారవేత్త ఫ్రాంక్ ఇస్లామ్(63)కు ఇవ్వనున్నారు. ఉత ్తరప్రదేశ్‌లో పుట్టి 1970లో అమెరికాలో స్థిరపడిన ఫ్రాంక్ అక్కడ వ్యాపారవేత్తగా పేరు గడించారు. కొలరాడో యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ పొందారు. అనంతరం సొంతంగా సంస్థను స్థాపించి దాన్ని 300 మిలియన్ డాలర్ల కంపెనీగా తీర్చిదిద్దారు.
ఇద్దరు భారతీయులకు క్వీన్స్ యంగ్ లీడర్స్ అవార్డ్ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపే అద్భుత ఆవిష్కరణలు చేసిన ఇద్దరు భారతీయులకు యూకేలో ప్రతిష్టాత్మక క్వీన్స్ యంగ్ లీడర్స్ అవార్డ్ లభించింది. క్వీన్ ఎలిజిబెత్ డైమండ్ జూబ్లీ ట్రస్ట్ ఏటా ఈ అవార్డును అందజేస్తుంది. 2016కు గాను ఈ అవార్డు గెలుపొందిన 60 మందిలో భారత్‌కు చెందిన కార్తీక్ సాహ్నీ, నేహా స్వేన్ ఉన్నారు. పుట్టుకతోనే అంధుడైన కార్తీక్ తనలాంటి వారికి విద్యనందించేందుకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టాడు. రుబరూ అనే స్వచ్ఛంద సంస్థకు సహ వ్యవస్థాపకురాలైన నేహా యువతలో నైపుణ్యాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టింది.
No comments:
Post a Comment