AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

క్రీడలు ఆగష్టు 2013

క్రీడలు ఆగష్టు 2013
రిటైర్మెంట్ ప్రకటించిన బర్తోలివింబుల్డన్-2013 చాంపియన్ మరియన్ బర్తోలి (28) టెన్నిస్ నుంచి వైదొలుగుతున్నట్లు ఆగస్టు 15న ప్రకటించింది. ఫ్రాన్స్కు చెందిన బర్తోలికి వింబుల్డన్ మాత్రమే తొలి గ్రాండ్స్లామ్ టైటిల్. ఆమె కెరీర్లో 2000 నుంచి ఏడు డబ్ల్యూటీఏ టైటిల్స్, ఒక గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించింది.

క్రికెట్ కోచ్ ఆజాద్ మృతిప్రముఖ క్రికెట్ కోచ్ దేశ్ ప్రేమ్ ఆజాద్ (75) మొహాలిలో ఆగస్టు 16న మరణించారు. ఆయన భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్తోపాటు చేతన్ శర్మ, యోగ రాజ్సింగ్, అశోక్ మల్హోత్రాలకు కోచ్గా వ్యవహరించారు. ఆయనను ప్రభుత్వం ద్రోణాచార్య అవార్డుతో సత్కరించింది.

ఆసియా యూత్ క్రీడల్లో కుశ్కుమార్కు స్వర్ణంఆసియా యూత్ గేమ్స్లో స్క్వాష్లో భారత క్రీడాకారుడు కుశ్కుమార్ స్వర్ణ పతకం సాధించాడు. నాన్జింగ్ (చైనా) లో జరుగుతున్న పోటీల్లో ఆగస్టు 19న జరిగిన ఫైనల్స్లో మహ్మద్ కమల్ (మలేిషియా)ను కుశ్కుమార్ ఓడించాడు. ఈ పోటీల్లో భారత్కు ఇదే తొలి స్వర్ణ పతకం. టేబుల్ టెన్నిస్లో అభిషేక్ యాదవ్ కాంస్య పతకం సాధించాడు.

ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్షిప్లో రష్యాకు మొదటి స్థానంప్రపంచ అథ్లెటిక్ చాంపియన్షిప్లో ఏడు స్వర్ణ పతకాలతో రష్యా మొదటిస్థానంలో నిలిచింది. మాస్కోలో ఆగస్టు 18న ముగిసిన పోటీల్లో రష్యా మొదటిస్థానంలో నిలవగా, అమెరికా, జమైకాలు రెండు, మూడు స్థానాలు పొందాయి.

పతకాల పట్టిక (మొదటి ఐదు స్థానాలు)
 
దేశంస్వర్ణంరజతంకాంస్యంమొత్తం
రష్యా74617
అమెరికా613625
జమైకా6219
కెన్యా54312
జర్మనీ4217

ముఖ్యాంశాలు: ఈ చాంపియన్షిప్లో ఉసేన్ బోల్ట్ 
(జమైకా)100 మీటర్లు, 200 మీటర్లు, 4ణ100 మీటర్ల రేసుల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించాడు. 200 మీటర్లలో వరుసగా మూడోసారి స్వర్ణం సాధించాడు. తద్వారా ప్రపంచ చాంపియన్షిప్లలో మొత్తం ఎనిమిది స్వర్ణ పతకాలు సాధించి ఈ ఘనత సాధించిన కార్ల్ లూయిస్, మైకేల్ జాన్సన్, అలిసన్ ఫిలిక్స్ (అమెరికా)ల సరసన చేరాడు. బోల్ట్ 2009లో 100 మీ, 200 మీ, 4ణ100 మీ, 2011లో 200 మీ, 4ణ100 మీ విభాగాల్లో స్వర్ణాలు సాధించాడు. పురుషుల 1500 మీటర్ల పరుగులో అబ్డెల్ కిప్రొస్ (కెన్యా) టైటిల్ నిలబెట్టుకున్నాడు. మహిళల విభాగంలో షెల్లీ ఆన్ ఫ్రేజర్ హ్యాట్రిక్ నమోదు చేసింది. ఆమె 100, 200 మీటర్ల రేసుల తోపాటు 4ణ100 మీటర్ల రిలేలో జమైకాకు స్వర్ణాలు సాధించిపెట్టింది.

నాదల్, అజరెంకాలకు సిన్సినాటి టైటిల్స్సిన్సినాటి పురుషుల సింగిల్స్ టైటిల్ను రఫెల్ నాదల్ (స్పెయిన్) గెలుచుకున్నాడు. సిన్సినాటిలో ఆగస్టు 19న జరిగిన ఫైనల్స్లో జాన్ ఇస్నర్ (అమెరికా)ను నాదల్ ఓడించాడు. మహిళల సింగిల్స్ను విక్టోరియా అజరెంకా (బెలారస్) గెలుచుకుంది. ఫైనల్స్లో సెరెనా విలియమ్స్ (అమెరికా) ను ఓడించింది. సిన్సినాటి టైటిల్ను గెలుపొందడం నాదల్, అజరెంకాలకు ఇదే తొలిసారి.

కార్తికేయన్కు టైటిల్ భారత ఫార్ములావన్ డ్రైవర్ నారాయణ్ కార్తికేయన్... ఆటో జీపీ సిరీస్లో మూడో గెలుపును నమోదు చేశాడు. ఆగస్టు 17న హోరాహోరీగా సాగిన రేసులో కార్తికేయన్ టైటిల్ గెలుచుకున్నాడు.

పోల్వాల్ట్లో ఇసిన్ బయేవాకు స్వర్ణంమాస్కోలో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఆగస్టు 13న రష్యా అథ్లెట్ ఎలీనా ఇసిన్ బయేవా పోల్వాల్ట్లో స్వర్ణం సాధించింది. ఆమె 4.89 మీటర్ల ఎత్తు దూకి అగ్రస్థానంలో నిలిచింది. ఆమె 2005, 2007 ప్రపంచ చాంపియన్షిప్లలో కూడా స్వర్ణ పతకాలు సాధించింది.

వరల్డ్ మాస్టర్‌‌స వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు స్వర్ణంఐడబ్ల్యుఎఫ్ వరల్డ్ మాస్టర్‌‌స వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ సుధాకర్ జయంత్ స్వర్ణపతకం గెలుచుకున్నాడు. ఇటలీలోని టురిన్‌లో ఆగస్టు 8న జరిగిన పోటీల్లో జయంత్ స్వర్ణం సాధించగా, ఫిన్‌లాండ్‌కు చెందిన జారీ హుస్కో సెన్ రజతం, స్వీడన్‌కు చెందిన జాన్‌ఒలో ఫ్యూసున్ కాంస్య పతకాలు గెలుచుకున్నారు.

బధిరుల ఒలింపిక్స్‌లో వీరేందర్‌కు కాంస్యం
బల్గేరియాలోని సోఫియాలో ముగిసిన బధిరుల ఒలింపిక్స్ క్రీడల్లో పురుషుల 74 కిలోల రెజ్లింగ్ ఫ్రీస్టయిల్ విభాగంలో వీరేందర్ సింగ్ పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు. ఫైనల్లో అతను టర్కీకి చెందిన ఒగుజ్ డొండెర్‌ను ఓడించాడు. ఈ ప్రత్యేక ఒలింపిక్స్‌లో వీరేందర్ పతకం నెగ్గడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. 2005 మెల్‌బోర్న్‌లో స్వర్ణం సాధించగా,..2009 చైనీస్ తైపీలో కాంస్యం నెగ్గాడు.

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్చైనాలోని గ్వాంగ్‌జులో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి పీవీ సింధు కాంస్య పతకం గెలుచుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది. సెమీఫైనల్‌కు ముందు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ యిహాన్ వాంగ్ (చైనా)ను... 2010 ఆసియా క్రీడల విజేత షిజియాన్ వాంగ్ (చైనా)ను ఓడించిన సింధు సెమీఫైనల్‌లో థాయ్‌లాండ్ క్రీడాకారిణి ఇంతనోన్ రత్చనోక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది. మొత్తం మీద ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో భారత్‌కు ఇది మూడో పతకం. ఇంతకుముందు 1983లో డెన్మార్క్‌లో ప్రకాశ్ పదుకొనే పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం గెలుచుకోగా, 2011లో ఇంగ్లండ్‌లో మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప కాంస్య పతకం గెలుచుకున్నారు. 

పురుషుల సింగిల్స్: చైనా క్రీడాకారుడు లిన్‌డాన్ మలేసియాకు చెందిన లీచోంగ్ వీపై గెలిచి విజేతగా నిలిచాడు. తద్వారా ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను ఐదోసారి నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సష్టించాడు. 

మహిళల సింగిల్స్: మహిళల సింగిల్స్ విభాగంలో థాయ్‌లాండ్ క్రీడాకారిణి ఇంతనోన్ రత్చనోక్ విజేతగా నిలిచింది. ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ లీ జురుయ్ (చైనా)పై గెలుపొందింది. థాయ్‌లాండ్ నుంచి విశ్వవిజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా కూడా రత్చనోక్ గుర్తింపు పొందింది.

డబుల్స్: పురుషుల డబుల్స్‌లో మహ్మద్ అహసాన్-హెంద్రా సెతియవాన్ (ఇండోనేసియా); మహిళల డబుల్స్‌లో జియోలి వాంగ్-యాంగ్ యూ (చైనా); మిక్స్‌డ్ డబుల్స్‌లో తొంతోవి అహ్మద్-నాత్సిర్ (ఇండోనేసియా) జోడిలు టైటిల్స్ నెగ్గాయి. 

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్రష్యాలోని మాస్కోలో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో వివిధ విభాగాల్లో విజేతలు..
100 మీటర్ల పరుగు: 
ఉసేన్ బోల్ట్ (జమైకా)
మహిళల 10 వేల మీటర్ల రేసు: ఒలింపిక్ చాంపియన్ తిరునిష్ దిబాబా (ఇథియోపియా) 
పురుషుల 20 కిలోమీటర్ల నడక: 
అలెగ్జాండర్ ఇవనోవ్ (రష్యా) 
10 వేల మీటర్ల రేసు:
పురుషుల్లో మహ్మద్ ఫరా (బ్రిటన్) స్వర్ణ పతకం సాధించగా... మహిళల మారథాన్ రేసులో డిఫెండింగ్ చాంపియన్ ఎద్నా కిప్లాగత్ టైటిల్ నిలబెట్టుకుంది. 
షాట్‌ఫుట్: వాలెరి ఆడమ్స్ (న్యూజిలాండ్) స్వర్ణ పతకం గెలుచుకుంది. ఈ క్రమంలో 30 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఒకే క్రీడాంశంలో వరుసగా నాలుగు స్వర్ణాలు నెగ్గిన తొలి అథ్లెట్‌గా చరిత్ర సష్టించింది. 
మహిళల 100 మీటర్ల పరుగు:
మహిళల 100 మీటర్ల రేసులో షెల్లీ ఆన్ ఫ్రేజర్ (జమైకా) స్వర్ణ పతకం గెలుచుకుంది.
పురుషుల 110 మీటర్ల హార్డిల్స్: ఒలివెర్ (అమెరికా) 
మహిళల 400 మీటర్ల రేసు: ఒహురుగు (బ్రిటన్) 
పురుషుల పోల్‌వాల్ట్: రాఫెల్ హోల్జ్‌డెపి (జర్మనీ) 

నాదల్‌కు రోజర్స్ కప్
స్పెయిన్ క్రీడాకారుడు రఫెల్ నాదల్ రోజర్ కప్ గెలుచుకున్నాడు. మాంట్రియల్‌లో ఆగస్టు 12న జరిగిన ఫైనల్స్‌లో రవోనిక్ (కెనడా)ను నాదల్ ఓడించాడు.

ఐసీసీ నంబర్‌వన్ వన్డే బౌలర్ జడేజా
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. సునీల్ నరైన్ (వెస్టిండీస్)తో కలిసి సంయుక్తంగా టాప్ ర్యాంకులో ఉన్నా దశాంశమానాల్లో తేడాతో జడేజా నంబర్‌వన్‌గా నిలిచాడు. మాజీ కెప్టెన్, స్పిన్నర్ అనిల్ కుంబ్లే (1996) తర్వాత ఈ ర్యాంకు పొందిన భారత బౌలర్‌గా జడేజా ఘనత వహించాడు. మొత్తం మీద కపిల్‌దేవ్ (1989), మణీందర్ సింగ్ (1987 డిసెంబర్, 1988 నవంబర్)ల తర్వాత టాప్ ర్యాంకు పొందిన నాలుగో బౌలర్ జడేజా.

‘శాఫ్’ ఫుట్‌బాల్ విజేత భారత్ దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య అండర్-16 చాంపియన్‌షిప్‌ను భారత్ గెలుచుకుంది. ఖాట్మండు (నేపాల్)లో జూలై 30న జరిగిన ఫైనల్స్‌లో నేపాల్‌ను ఓడించి భారత్ విజేతగా నిలిచింది.

జూనియర్ మహిళల హాకీలో భారత్‌కు కాంస్యంమెంచెన్‌గ్లాడ్‌బాచ్ (జర్మనీ)లో ఆగస్టు 4న జరిగిన జూనియర్ మహిళల హాకీ ప్రపంచకప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి భారత్ కాంస్య పతకం గెలుపొందింది. ఫైనల్లో నెదర్లాండ్స్.. అర్జెంటీనాపై నెగ్గి స్వర్ణం సాధించింది. కాంస్య పతకం గెలిచిన భారత జూనియర్ జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి రూ. లక్ష నగదు పురస్కారాన్ని హాకీ ఇండియా (హెచ్‌ఐ) ప్రకటించింది.

సౌమ్యకు ఉమెన్స్ ఛాలెంజర్స్ టైటిల్నేషనల్ ఉమెన్స్ ఛాలెంజర్స్ చెస్ చాంపియన్‌షిప్‌ను సౌమ్య గెలుచుకుంది. త్రిసూర్‌లో ఆగస్టు 4న ముగిసిన పోటీల్లో సౌమ్య మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో స్వాతీ గాటే, మూడో స్థానంలో బక్తీ నిలిచారు.

మిస్సీ ఫ్రాంక్లిన్‌కు స్విమ్మింగ్‌లో ఆరు స్వర్ణాలుస్పెయిన్‌లో జరిగిన ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో అమెరికా మహిళా స్విమ్మర్ మిస్సీ ఫ్రాంక్లిన్ ఆరు స్వర్ణాలు గెలుచుకుని రికార్డు సష్టించింది. తద్వారా ఒకే చాంపియన్‌షిప్‌లో అత్యధిక స్వర్ణాలు గెలిచిన మహిళా స్విమ్మర్‌గా గుర్తింపు పొందింది. ఆగస్టు 4న జరిగిన 4ఁ100 మీటర్ల మెడ్లే రిలేలో స్వర్ణం నెగ్గి ఆరో బంగారు పతకం సాధించిన మిస్సీ, అంతకుముందు 100, 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్, 200 మీటర్ల ఫ్రీస్టయిల్, 4ఁ100, 4ఁ200 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలే విభాగాల్లో స్వర్ణ పతకాలను గెలుచుకుంది. మిస్సీ మెరుపులతో గతంలో ఐదు స్వర్ణాలతో ట్రేసీ కాల్కిన్స్ (అమెరికా-1978), లిబ్బీ ట్రికెట్ (ఆస్ట్రేలియా-2007) పేరిట ఉన్న ఈ రికార్డు కనుమరుగైంది. తాజా ఘనతతో ఒకే ప్రపంచ చాంపియన్‌షిప్‌లోగానీ, ఒకే ఒలింపిక్స్‌లోగానీ అత్యధికంగా ఆరు స్వర్ణాలు నెగ్గిన మైకేల్ ఫెల్ప్స్ (అమెరికా), మార్క్ స్పిట్జ్ (అమెరికా), ఇయాన్ థోర్ప్ (ఆస్ట్రేలియా), క్రిస్టిన్ ఒట్టో(తూర్పు జర్మనీ) సరసన కూడా మిస్సీ చేరింది. 

బెయిల్ ఓపెన్ చెస్ విజేత హరికష్ణఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికష్ణ 46వ బెయిల్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్‌లో మాస్టర్స్, ర్యాపిడ్ కేటగిరీ టైటిల్స్‌ను గెలుచుకున్నాడు. స్విట్జర్లాండ్‌లోని బెయిల్‌లో ఆగస్టు 3న ముగిసిన పోటీల్లో గ్రాండ్‌మాస్టర్ టోర్నమెంట్ టైటిల్‌ను ఫ్రాన్స్‌కు చెందిన వాచీర్ లాగ్రేల్ దక్కించుకున్నాడు.
ఆసియా గ్రాండ్ ప్రి ఆర్చరీలో చరణ్ రెడ్డికి మూడు పతకాలు
ఆసియా గ్రాండ్ ప్రి ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వై.చరణ్ రెడ్డి మూడు పతకాలు సాధించాడు. పురుషుల టీమ్ కాంపౌండ్ విభాగంలో రవికాంత్ శర్మ, రవిశర్మలతో కలిసి స్వర్ణ పతకం, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మిహు మసెలోలతో కలిసి రజతం, వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెల్చుకున్నాడు. మంగోలియాలోని ఉలాన్‌బాటర్‌లో ఆగస్టు 2న ముగిసిన ఈ పోటీల్లో భారత్‌కు మొత్తం నాలుగు పతకాలు వచ్చాయి. మహిళల టీమ్ కాంపౌండ్ విభాగంలో మిహు, దుద్‌వాల్ స్వాతి, యుమి సొరాంగ్‌లతో కూడిన భారత జట్టుకు కాంస్యం లభించింది. 

జింబాబ్వే వన్డే సిరీస్ విజేత భారత్జింబాబ్వేతో జరిగిన ఐదు వన్డేల క్రికెట్ సిరీస్‌ను 5-0 తేడాతో గెలుచుకుని భారత్ సెల్‌కాన్ కప్‌ను దక్కించుకుంది. విదేశంలో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం భారత్‌కు ఇదే తొలిసారి. ఈ సిరీస్‌కు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. చివరి వన్డేలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా, టోర్నమెంట్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా అమిత్ మిశ్రా ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో అమిత్ మిశ్రా 18 వికెట్లు తీసి భారత మాజీ పేస్ బౌలర్ జవగళ్ శ్రీనాథ్ రికార్డును సమం చేశాడు. 2002-03లో ఏడు వన్డేల భారత్ - న్యూజిలాండ్ సిరీస్‌లో శ్రీనాథ్ 18 వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు. ముఖాముఖి సిరీస్‌ల్లో ఇదే ఇప్పటివరకు రికార్డు.

స్నూకర్‌లో మెహతాకు స్వర్ణంప్రపంచ క్రీడల్లో (వరల్డ్ గేమ్స్) భారత నెంబర్‌వన్ స్నూకర్ ఆటగాడు ఆదిత్య మెహతా స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. కొలంబియాలోని కాలీలో జరిగిన ఫైనల్స్‌లో చైనాకు చెందిన లియాంగ్ వెంబోను మెహతా ఓడించాడు. 1981లో ప్రకాశ్ పదుకొనే బ్యాడ్మింటన్‌లో కాంస్యం సాధించిన తర్వాత ప్రపంచ క్రీడల్లో భారత్‌కు పతకం లభించడం ఇదే తొలిసారి.

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ విజేత శ్రీలంకదక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 4-1 తేడాతో శ్రీలంక గెలుచుకుంది. దిల్షాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా, కుమార సంగక్కర మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. 2008 ఆగస్టులో ఇంగ్లండ్ చేతిలో 0-4 తేడాతో పరాజయం పాలైన తర్వాత ఇంత తేడాతో దక్షిణాఫ్రికా ఓడిపోవడం ఇదే మొదటిసారి.

No comments:

Post a Comment