AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday, 25 November 2017

క్రీడలు అక్టోబరు 2014

క్రీడలు అక్టోబరు 2014
ఫెదరర్‌కు స్విస్ టైటిల్
రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) స్విస్ ఇండోర్స్ (బాసెల్) టైటిల్‌ను గెలుచుకున్నాడు. అక్టోబరు 26న జరిగిన ఫైనల్‌లో డేవిడ్ గోఫిన్(బెల్జియం)పై విజయం సాధించాడు. ఫెదరర్ ఈ టెర్నీని గెలుచుకోవడం ఆరోసారి. 
బాక్సర్ సరితా దేవి సస్పెన్షన్
ఆసియా క్రీడల్లో పతకాన్ని స్వీకరించేందుకు నిరాకరించిన భారతీయ మహిళా బాక్సర్ సరితాదేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) తాత్కాలికంగా వేటు వేసింది. దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో జినా పార్క్ (దక్షిణ కొరియా)తో జరిగిన పోటీలో సరితా ఆధిక్యాన్ని కాదని పార్క్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో ఆమె కలతచెంది పతకాన్ని తిరస్కరించడాన్ని ఏఐబీఏ తప్పు పట్టింది.
సాకేత్‌కు ఏటీపీ డబుల్స్ టైటిల్
ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేని పుణె ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అక్టోబరు 24న జరిగిన ఫైనల్‌లో సాకేత్-సనమ్ సింగ్ జోడి థాయ్‌లాండ్‌కు చెందిన రటి వటానా-సొంచాట్ జోడీపై విజయం సాధించారు. సాకేత్‌కు ఇది మూడో ఏటీపీ చాలెంజర్ టోర్నీ డబుల్స్ టైటిల్. 
సానియా జోడీకి డబ్ల్యూటీఏ టోర్నీ టైటిల్ 
సానియామీర్జా (భారత్)-కారాబ్లాక్ (జింబాబ్వే) జోడీ డబ్ల్యూటీఏ పైనల్స్ టోర్నీ టైటిల్ గెలుచుకుంది. అక్టోబరు 26న జరిగిన ఫైనల్‌లో సు వి సై (చైనీస్ తైపీ), సువయ్ పెంగ్ (చైనా) జోడీని ఓడించారు. సానియాకిది తొలి డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ టైటిల్ కాగా కారా బ్లాక్‌కు మూడోది. ప్రైజ్‌మనీ రూ. 3 కోట్లు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను సెరెనా విలియమ్స్ గెలుచుకుంది. ఫైనల్లో ఆమె సిమోనా హలెప్ (రొమేనియా)ను ఓడించింది. సెరెనాకు ఇది వరుసగా మూడో డబ్ల్యూటీఏ టైటిల్.
ఆసియా పారాగేమ్స్‌లో శరత్ రికార్డు
భారత స్విమ్మర్ శరత్ మహదేవరావు గైక్వాడ్ ఆసియా పారాగేమ్స్‌లో ఆరు పతకాలతో రికార్డు నెలకొల్పాడు. ఇంచియాన్ (దక్షిణ కొరియా)లో అక్టోబరు 24న పురుషుల మెడ్లీ రిలే రేసులో శరత్‌తోపాటు, భారత బృందం కాంస్యం సాధించింది. అంతకు ముందు శరత్ ఐదు ఈవెంట్లలో కాంస్యాలు సాధించాడు. దీంతో ఆసియా క్రీడల్లో (పారా గేమ్స్‌తో కలిపి) అత్యధిక పతకాలు సాధించిన భారత క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో పి.టి.ఉష 1986లో నాలుగు స్వర్ణాలు, ఒక రజతంతో ఐదు పతకాలు సాధించింది.
పంకజ్ అద్వానీకి ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్ టైటిల్
భారత్‌కు చెందిన పంకజ్ అద్వానీ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్ షిప్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అక్టోబరు 24న లీడ్స్‌లో జరిగిన 150 అప్ పాయింట్స్ ఫార్మేట్ పోటీ ఫైనల్‌లో మాజీ చాంపియన్ పీటర్ గిల్ క్రిస్ట్ (సింగపూర్) ను పంకజ్ ఓడించాడు. పంకజ్ కెరీర్‌లో ఇది 11వ ప్రపంచ టైటిల్.

సాకేత్‌కు ఇండోర్ ఓపెన్ టైటిల్ 
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేని ఇండోర్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. అక్టోబరు 19న జరిగిన సింగిల్స్ ఫైనల్‌లో అలెగ్జాండర్ (కజకిస్థాన్)ను సాకేత్ ఓడించాడు. ఇది అతనికి తొలి ఏటీపీ చాలె ంజర్ టోర్నీ టైటిల్.
జాతీయ సీనియర్ ఆర్చరీ చాంప్ 
జాతీయ సీనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్ టైటిల్‌ను తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కైవసం చేసుకుంది. అక్టోబరు 16న జరిగిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఫైనల్‌లో పూర్వాషా షిండేపై ఆమె విజయం సాధించింది. ఈ చాంపియన్‌షిప్‌ను జ్యోతి రెండుసార్లు గెలుచుకుంది. 
భారత్‌కు సుల్తాన్ జొహర్ కప్ 
హాకీ సుల్తాన్ జొహర్ కప్ అండర్ -21 టోర్నమెంట్‌ను భారత జట్టు గెలుచుకుంది. మలేసియాలో జరిగిన ఫైనల్‌లో బ్రిటన్‌ను భారత్ ఓడించింది. దీంతో ఈ టోర్నమెంట్‌ను వరుసగా రెండు సార్లు సాధించిన తొలి జట్టుగా భారత్ గుర్తింపు పొందింది.

ఫోర్బ్స్ విలువైన క్రీడాకారుల్లో ధోనీ
ఫోర్బ్స్ అక్టోబరు 8న విడుదల చేసిన ప్రపంచ విలువైన క్రీడాకారుల జాబితాలో భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని ఐదో స్థానంలో నిలిచాడు. ధోనీ బ్రాండ్ విలువ 20 మిలియన్ డాలర్లు (రూ. 122 కోట్లు). అమెరికా బాస్కెట్ బాల్ ప్లేయర్ లీ బ్రాన్ జేమ్స్ 37 మిలియన్ డాలర్లతో ఒకటో స్థానంలో ఉన్నాడు. టైగర్ ఉడ్స్ (గోల్ఫ్), రోజర్ ఫెదరర్ (టెన్నిస్) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 
ఫెదరర్‌కు షాంఘై మాస్టర్స్ టోర్నీ 
చైనాలో జరిగిన షాంఘై మాస్టర్స్ టోర్నీ విజేతగా రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) నిలిచాడు. అక్టోబర్ 12న జరిగిన ఫైనల్లో గైల్స్ సైమన్‌పై గెలిచాడు. 
జయరామ్‌కు డచ్ ఓపెన్ టైటిల్
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అజయ్ జయరామ్ డ చ్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఇది అతనికి తొలి గ్రాండ్ ప్రి టైటిల్. గతంలో చేతన్ ఆనంద్ (2009), ప్రకాశ్ పదుకొనె(1982)లు ఈ టైటిల్‌ను గెలుచుకున్నారు.

ఆసియా క్రీడల్లో భారత్‌కు ఎనిమిదో స్థానం 
ఆసియా క్రీడల్లో చైనా 151 స్వర్ణపతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. 79 స్వర్ణాలతో దక్షిణకొరియా రెండో స్థానం, 47తో జపాన్ మూడో స్థానం సాధించాయి. 11 బంగారు పతకాలతో భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో సెప్టెంబర్ 17న ఆరంభమైన 17వ ఆసియా క్రీడలు అక్టోబర్ 4న ముగిసాయి. నాలుగు వ్యక్తిగత స్వర్ణాలు సాధించిన జపాన్ స్విమ్మర్ కొనుగో హగినో అత్యంత విలువైన ఆటగాడి అవార్డుకు ఎంపికయ్యాడు. 2018 ఆసియా క్రీడలు ఇండోనేసియాలోని జకార్తాలో జరుగుతాయి. 

భారత్ సాధించిన స్వర్ణాలు-వివరాలు:
  • షూటింగ్: భారత్ తరపున తొలిస్వర్ణం షూటర్ జీతూరాయ్‌కి లభించింది.
  • ఆర్చరీ: పురుషుల కాంపౌండ్ టీం ఈవెంట్‌లో స్వర్ణం గెలుచుకుంది. అభిషేక్‌వర్మ, రజత్ చౌహాన్, సందీప్ కుమార్‌ల జట్టు కొరియాను ఓడించింది.
  • స్క్వాష్: పురుషుల జట్టు మలేసియాపై గెలిచింది.
  • రెజ్లింగ్: పురుషుల 65 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లర్ యోగేశ్వర్‌దత్ సాధించాడు. 28 ఏళ్ల తర్వాత భారత్‌కు ఆసియా క్రీడల్లో రెజ్లింగ్ (కుస్తీ)లో స్వర్ణం లభించింది. 1986లో సియోల్ క్రీడల్లో కర్తార్ సింగ్ స్వర్ణాన్ని గెలిచాడు.
  • డిస్కస్‌త్రో: మహిళల విభాగంలో సీమా పూనియా విజేత. అథ్లెటిక్స్‌లో ఇది తొలి స్వర్ణం.
  • టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్: సానియామీర్జా, సాకేత్ మైనేనిల జోడి.
  • సెయిలింగ్: ఆసియా క్రీడల్లో మహిళలు తొలిసారి సెయిలింగ్‌లో పతకం సాధించారు.
  • బాక్సింగ్: విజేత మేరీకోమ్. కజకిస్థాన్‌కు చెందిన జైనా షెకెర్బెకోవాను ఓడించింది.
  • హాకీ: ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ విజయంతో 2016 రియో డిజెనిరోలో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు భారత్ అర్హత సాధించింది. చివరిగా 1998లో బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణం గెలిచింది.
  • రిలే పరుగు: మహిళల 4,400 మీటర్ల పరుగులో పూవమ్మ, టింటూ లుకా, మన్‌దీప్ కౌర్, ప్రియాంక పన్వర్‌ల బృందం స్వర్ణం గెలిచింది.
  • కబడ్డీ: పురుషుల,మహిళల విభాగాల్లో రెండు స్వర్ణాలు దక్కాయి. పురుషుల జట్టుకిది వరుసగా ఏడో విజయం కాగా మహిళల జట్టుకు రెండో వరుస విజయం.
పతకాల పట్టిక:
దేశంస్వర్ణంరజతంకాంస్యంమొత్తం
చైనా15110883342
దక్షిణకొరియా797184234
జపాన్477677200
భారత్11103657


చైనా ఓపెన్ విజేతలు షరపోవా, జొకొవిచ్
చైనా ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్‌లో జొకొవిచ్, మహిళల సింగిల్స్‌లో షరపోవా గెలుపొందారు. ఫైనల్లో పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)ను షరపోవా ఓడించింది. చైనా గడ్డపై తొలిసారి ఓ టోర్నీలో విజేతగా నిలవడం ఆమెకిది తొలిసారి. నొవాక్ జొకొవిచ్ వరుసగా ఐదోసారి చైనా ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. 

హామిల్టన్‌కు జపాన్ గ్రాండ్ ప్రి టైటిల్జపాన్‌లో జరిగిన ఫార్ములావన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. నికో రోస్‌బర్గ్ రెండో స్థానంలో నిలిచాడు. 

నిషికోరికి జపాన్ ఓపెన్ టైటిల్జ పాన్ టెన్నిస్ స్టార్ కీ నిషికోరి జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు. అక్టోబర్ 5న జరిగిన ఫైనల్‌లో మిలోస్ రావ్‌నిక్(కెనడా)ను ఓడించాడు.

చెన్నై సూపర్ కింగ్స్‌దే చాంపియన్స్‌లీగ్ టైటిల్చాంపియన్స్ లీగ్ టీ-20 క్రికెట్ టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకుంది. అక్టోబర్ 4న జరిగిన ఫైనల్లో కోల్‌కత నైట్ రైడర్స్‌ను ఓడించి విజేతగా నిలిచింది. 2010లో కూడా ఈ టైటిల్‌ను చెన్నై జట్టు గెలుచుకుంది. మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా సురేశ్‌రైనా ఎంపికయ్యాడు.

No comments:

Post a Comment