AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

అవార్డులు మార్చి 2014

అవార్డులు మార్చి 2014
జపాన్ ఆర్కిటెక్ట్ షిగెరు బాన్‌కు ప్రిట్జ్‌కెర్ బహుమతి 2014 సంవత్సరానికి ప్రిట్జ్‌కెర్ ఆర్కిటెక్చర్ ప్రై జ్ జపాన్‌కు చెందిన ఆర్కిటెక్ట్ షిగెరు బాన్ కు లభించింది. విపత్తు సహాయ కేంద్రాలను సృజనాత్మకంగా, తక్కువ ఖర్చుతో రూపొందించినందుకు గాను ఈ పురస్కారం వరించింది. 1995లో వాలంటరీ ఆర్కిటెక్ట్స్ నెట్‌వర్క్ అనే స్వచ్ఛంద సంస్థను పారంభించారు. శ్రీలంక, భారత్,హైతీ,ఇటలీ, న్యూజిలాండ్ దేశాల్లో తక్కువ ఖర్చుతో సులభంగా నిర్మించి, తొలగించే నిర్మాణాలను చేపట్టారు. ఈ అవార్డును ఆర్కిటెక్చర్ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదిగా పరిగణిస్తారు. మానవ అవసరాల కోసం తోడ్పడేదిగాను, నిర్మాణంలో విశిష్ఠమైనదిగా రూపొందించిన డిజైనర్లకు ఏటా ఈ బహుమతిని ప్రదానం చేస్తారు. హయత్ ఫౌండేషన్ నెలకొల్పిన ఈ అవార్డు కింద లక్ష డాలర్ల నగదు, ప్రశంసాపత్రం అందజేస్తారు. 

వెటెల్, మిస్సీ ఫ్రాంక్లిన్‌లకు లారెస్ స్పోర్ట్స్ అవార్డులు లారెస్ స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ద ఇయర్‌గా సెబాస్టియన్ వెటెల్ (ఫార్ములా వన్), స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్‌గా మిస్సీ ఫ్రాంక్లిన్ (స్విమ్మింగ్) ఎంపికయ్యారు. ఈ అవార్డులను కౌలాలంపూర్‌లో మార్చి 26న ప్రదానం చేశారు. టీమ్ ఆఫ్ ద ఇయర్‌గా బాయెర్న్ మ్యూనిచ్ (ఫుట్‌బాల్), స్పిరిట్ ఆఫ్‌స్పోర్ట్ అవార్డుగా ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ టీమ్, స్పోర్ట్ ఫర్ గుడ్ అవార్డుగా మ్యాజిక్ బస్ (ఇండియా) ఎంపికయ్యాయి. జర్మనీకి చెందిన ఫార్ములావన్ డ్రై వర్ సెబాస్టియన్ వెటెల్ నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. అమెరికాకు చెందిన స్విమ్మర్ మిస్సీ ఫ్రాంక్లిన్ 2012 ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణ పతకాలతో రికార్డు నెలకొల్పింది.

రాజేశ్ గోపకుమార్‌కు జి.డి.బిర్లా అవార్డు 2013 సంవత్సరానికి జి.డి. బిర్లా అవార్డు భౌతిక శాస్త్రవేత్త రాజేశ్ గోపకుమార్‌కు లభించింది. క్వాంటమ్ ఫీల్డ్ థియరీలో, స్ట్రింగ్ థియరీలో ఆయన చేసిన కషికి ఈ పురస్కారం దక్కింది. శాస్త్ర పరిశోధనలో విశేష కృషి చేసిన వారికి ఈ పురస్కారం అందజేస్తారు. 

సుబ్రాన్సు చౌదరికి డిజిటల్ యాక్టివిజమ్ అవార్డు 
ఇండిపెండెంట్ జర్నలిస్ట్ సుబ్రాన్సు చౌదరికి యునెటైడ్ కింగ్‌డమ్ సంస్థ అందించే 2014 డిజిటల్ యాక్టివిజమ్ అవార్డు లభించింది. సెంట్రల్ గోండ్వానా నెట్ (సీజీ నెట్) స్వర కమ్యూనిటీ రేడియో నిర్వహణకుగాను ఈ అవార్డు దక్కింది. ఈ రేడియోను రాయ్‌పూర్‌లో 2004లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ రేడియోను మధ్యప్రదేశ్‌లోని హాకర్ గ్రామం నుంచి నిర్వహిస్తున్నారు. మహిళా సంఘాల భాగస్వామ్యంతో ఈ రేడియో మధ్యప్రదేశ్‌లో బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ రేడియో తొలుత ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైనప్పటికీ దీని కార్యక్రమాలు ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు కూడా విస్తరించాయి.

జ్ఞాన్ కొర్రేకు గొల్లపూడి అవార్డు
గొల్లపూడి శ్రీనివాస్ (జీఎస్) మెమోరియల్ ఫౌండేషన్ అందజేసే జీఎస్ జాతీయ అవార్డు- 2013కు దర్శకుడు జ్ఞాన్ కొర్రే ఎంపికయ్యారు. గుజరాతీ సినిమా ‘ది గుడ్ రోడ్’కు దర్శకత్వం వహించినందుకుగాను కొర్రేను ఈ పురస్కారం వరించింది.

భారతీయ అమెరికన్ విద్యార్థులకు ఇంటెల్ అవార్డులు
ఇద్దరు భారతీయ అమెరికన్ విద్యార్థులు ఆనంద్ శ్రీనివాసన్(17), శౌన్ దత్తా(18) మార్చి 12న ప్రతిష్టాత్మక ఇంటెల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ అవార్డులు గెలుచుకున్నారు. ఇంటెల్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ సైన్స్ అవార్డుల పోటీలో ఎనిమిది, పదో స్థానాలను వీరిద్దరూ కైవసం చేసుకున్నారు. అవార్డు కింద చెరో రూ. 12.23 లక్షల నగదును అందజేశారు. డీఎన్‌ఏలోని అతి సూక్ష్మ భాగాలను సైతం తెలుసుకునేందుకు ఉపయోగపడే ‘ఆర్‌ఎన్‌ఎన్‌స్కాన్’ అనే న్యూరల్ నెట్‌వర్క్ సంబంధిత కంప్యూటర్ మోడల్‌ను శ్రీనివాసన్ ఆవిష్కరించగా.. అణు పదార్థాల చర్యలను మరింత బాగా అర్థం చేసుకునేందుకు దోహదపడే కంప్యూటర్ మోడల్స్‌ను, సూత్రాలను శౌన్ దత్తా అభివృద్ధిపర్చాడు.

నలిమెల భాస్కర్‌కు సాహిత్య అకాడమీ అవార్డు
ప్రముఖ కవి, భాషావేత్త డాక్టర్ నలిమెల భాస్కర్‌కు ‘అనువాద సాహిత్యం’లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ప్రఖ్యాత మలయాళ రచయిత పుణత్తిల్ కుంజబ్దుల్లా రచించిన ‘స్మారక శిలగళ్’ నవలను ‘స్మారక శిలలు’ పేరుతో 2010లో భాస్కర్ తెలుగులోకి అనువదించారు. అవార్డు కింద రూ. 50 వేల నగదు, ప్రశంసా పత్రం బహూకరిస్తారు. సాహిత్య అకాడమీ ఈ పురస్కారాన్ని 1989 నుంచి 24 భాషల్లోని అత్యున్నత అనువాదాలకు అందజేస్తోంది.

టోమస్ హలిక్‌కు టెంపుల్‌టన్ ప్రైజ్
చెక్‌కు చెందిన మతగురువు, మేధావి టోమస్ హలిక్‌కు 2014 టెంపుల్‌టన్ ప్రైజ్ లభించింది. పురస్కారాన్ని అందజేసే జాన్ టెంపుల్‌టన్ ఫౌండేషన్ మార్చి 13న ఈ విషయాన్ని ప్రకటించింది. అవార్డు కింద 1.1 మిలియన్ పౌండ్లు బహూకరిస్తారు.

అమెరికా స్పెల్లింగ్ బీ విజేత కుష్ శర్మఅమెరికాలోని మిస్సోరి కౌంటీ స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతికి చెందిన కుష్ శర్మ (13) విజేతగా నిలిచాడు. మార్చి 8న ముగిసిన పోటీల్లో కుష్ శర్మ జాక్సన్ కౌంటీ స్పెల్లింగ్ బీ టైటిల్ దక్కించుకున్నాడు.

స్త్రీ శక్తి పురస్కారాలు- 20132013 సంవత్సరానికి సంబంధించి స్త్రీ శక్తి పురస్కారాలను ఆరుగురికి 2014 మార్చి 8న (మహిళా దినోత్సవం) రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. ఈ అవార్డుల కింద ఒక్కొక్కరికి రూ. 3 లక్షల నగదు, ప్రశంసా పత్రం అందించారు. 

అవార్డు-విజేతలు
  1. రాణి లక్ష్మీబాయి అవార్డు (మహిళా సాధికారత): మనసి ప్రధాన్ (ఒడిశా)
  2. రుద్రమదేవి అవార్డు (మహిళా ఆరోగ్యంలో కృషి): డా. ఎం. వెంకయ్య (ఆంధ్ర ప్రదేశ్)
  3. మాతా జిజియాబాయ్ అవార్డు (విద్య, శిక్షణలో కృషి): బినా సేత్ లష్కరి (మహా రాష్ర్ట)
  4. కన్నగి అవార్డు (అనాథలు, వికలాంగులు, నిరాశ్రయులకు ఆర్థిక సహాయం): టి.రాధా కె. ప్రశాంతి (ఆంధ్రప్రదేశ్)
  5. రాణి గైదినీ జీలియాంగ్ అవార్డు (మీడియా ద్వారా మహిళా సమస్యల పట్ల అవగాహన): డా. వర్టికా నందా (ఢిల్లీ)
  6. దేవి అహల్యబాయ్ హోల్కర్ అవార్డు (మహిళలు బాలికలకు మహిళా హక్కులు, లింగ పరమైన సమస్యలు, న్యాయ పరమైన సలహాలు, వ్యవస్థాపరమైన మద్ధతు): డా. సీమసఖారే (మహారాష్ర్ట)
పంకజ్ మిశ్రాకు యేల్ సాహిత్య బహుమతిభారతీయ రచయిత పంకజ్ మిశ్రాకు యేల్ సాహిత్య బహుమతి లభించింది. ఈయనతోపాటు ఏడు దేశాలకు చెందిన ఎనిమిది మందికి ఈ అవార్డు దక్కింది. యేల్ యూనివర్సిటీ అందజేసే ఈ అవార్డు కింద 1,50,000 డాలర్లు విజేతలకు బహూకరిస్తారు. కాల్పనికేతర సాహిత్యంలో ఆయనకు ఈ బహుమతి లభించింది.

లక్ష్మీకి అమెరికా ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ ద కరేజ్భారత్‌కు చెందిన లక్ష్మీకి అమెరికా ప్రభుత్వ ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ ద కరేజ్ అవార్డును మార్చి 3న వాషింగ్టన్‌లో ఆ దేశ అధ్యక్షుడు ఒబామా భార్య మిషల్ ఒబామా ప్రదానం చేశారు. లక్ష్మీతో పాటు ప్రపంచవ్యాప్తంగా మరికొందరు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2005లో ఢిల్లీలో యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ శాశ్వతంగా తన సహజరూపాన్ని కోల్పోయింది. దీంతో ఆమె యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపారు. ఆమె పిటీషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు యాసిడ్ అమ్మకాలను క్రమబద్ధీకరించాలని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను ఆదేశించింది. యాసిడ్ దాడుల కేసుల విచారణను సులభతరం చేయాలని పార్లమెంట్‌ను ఆదేశించింది.

86వ ఆస్కార్ అవార్డులు ప్రదానం86వ ఆస్కార్ అవార్డులు 2014 మార్చి 1న లాస్ ఏంజిల్స్‌లో ప్రదానం చేశారు. అంతరిక్ష నేపథ్యంలో తీసిన గ్రావిటీ చిత్రానికి అత్యధికంగా ఏడు అవార్డులు దక్కాయి.
  • ఉత్తమ చిత్రం: 12 ఇయర్‌‌స ఎ స్లేవ్
  • ఉత్తమ నటుడు: మాథ్యూ మెక్ కొనావ్‌గె (చిత్రం: డల్లాస్ బయ్యర్‌‌స క్లబ్)
  • ఉత్తమ నటి: కేట్ బ్లాన్‌చెట్ (చిత్రం: బ్లూ జాస్మిన్)
  • ఉత్తమ దర్శకుడు: అల్ఫాన్సో క్యూరోన్ (చిత్రం: గ్రావిటీ)
  • ఉత్తమ సహాయ నటి: ల్యూపిటా న్యోన్‌‌గ ఓ (చిత్రం: 12 ఇయర్‌‌స ఎ స్లేవ్)
  • ఉత్తమ సహాయ నటుడు: జార్డ్ లెటో(చిత్రం: డల్లాస్ బయ్యర్‌‌స క్లబ్)
  • ఉత్తమ విదేశీ భాషా చిత్రం: ద గ్రేట్ బ్యూటీ (ఇటలీ)
  • ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: 20 ఫీట్ ఫ్రమ్ స్టార్‌డమ్
  • ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ఫ్రోజన్
  • ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: స్పైక్ జోన్‌‌డ (చిత్రం: హెర్)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఎమ్మాన్యుల్ లుబెస్కీ (చిత్రం: గ్రావిటీ)
  • ఉత్తమ ఒరిజినల్ స్కోర్: స్టీవెన్ ప్రైస్ (చిత్రం: గ్రావిటీ)
  • ఉత్తమ ఒరిజినల్ సాంగ్: లెట్ ఇట్ గో (చిత్రం: ఫ్రోజన్)

No comments:

Post a Comment