AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

క్రీడలు ఏప్రిల్ 2013

క్రీడలు ఏప్రిల్ 2013
ఐపీఎల్‌లో గేల్ రికార్‌‌డ స్కోర్ఆరో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో బెంగళూరు జట్టు తరపున ఆడుతున్న క్రిస్‌గేల్ అత్యధికంగా 175 పరుగులు చేసి రికార్డు సష్టించాడు. ఏప్రిల్ 23న పుణె వారియర్‌‌సతో జరిగిన మ్యాచ్‌లో గేల్ 66 బంతుల్లో 175 పరుగులు చేయడంతో మొత్తం స్కోరు 263కు చేరింది. గేల్ తొలి 30 బంతుల్లోనే 100 పరుగులు పూర్తిచేశాడు. ఇందులో 17 సిక్స్‌లు, 13 బౌండరీలు ఉన్నాయి. 

ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ విజేతలు చోంగ్ వీ, ఇంతనోవ్ రత్సనోక్ఇండియా ఓపెన్ సూపర్ సీరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను లీ చోంగ్ వీ (మలేషియా), మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఇంతనోవ్ రత్సనోక్ (థాయ్‌లాండ్) గెలుచుకున్నారు. న్యూఢిల్లీలో ఏప్రిల్ 28న ముగిసిన ఫైనల్స్‌లో కెనిచి టాగో (జపాన్)ను లీ చోంగ్‌లీ, మహిళా విభాగంలో జులియన్ షెంకో (జర్మనీ)ని ఇంతనోవ్ రత్సనోక్ ఓడించారు.
మహిళల డబుల్స్ మియుకి మేదా - సటోకో సుయోత్సవా (జపాన్), పురుషుల డబుల్స్ టైటిల్‌ను జియోలాంగ్ లియు - జిహాన్ కియు (చైనా)లు గెలుచుకున్నారు.
మిక్స్‌డ్ డబుల్స్‌లో తొంతోవీ అహ్మద్ - లిలి యానా నాత్సినో (ఇండోనేషియా) విజయం సాధించారు.

నాదల్‌కు బార్సిలోనా ఓపెన్బార్సిలోనా ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను రాఫెల్ నాదల్ గెలుచుకున్నాడు. బార్సిలోనాలో ఏప్రిల్ 28న జరిగిన ఫైనల్స్‌లో నికోలస్ అల్మాగ్రోను నాదల్ ఓడించాడు. నాదల్‌కు ఇది 8వ బార్సిలోనా ఓపెన్ టైటిల్.

వెటెల్‌కు బహ్రెయిన్ గాండ్ ప్రిఫార్ములా వన్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిలో రెడ్‌బుల్ డ్రెవర్ సెబాస్టియన్ వెటెల్ విజయం సాధించాడు. మనామాలో ఏప్రిల్ 21న జరిగిన పోటీలో లోటస్ డ్రెవర్ రైకోనెస్ రెండో స్థానంలో నిలిచాడు. 

ఆసియా రెజ్లింగ్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలుఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ క్రీడాకారుడు అమిత్ కుమార్ స్వర్ణం సాధించాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 55 కిలోల విభాగంలో అమిత్‌కు ఈ పతకం దక్కింది. ఏప్రిల్ 20న ఫైనల్లో ఉత్తర కొరియాకు చెందిన క్యోంగ్ యాంగ్‌పై విజయం సాధించాడు. ఫ్రీస్టెయిల్ 66 కిలోల విభాగంలో అమిత్ కుమార్ దంకర్ స్వర్ణం సాధించాడు ఈ పోటీల్లో భారత్ మొత్తం 9 పతకాలు సాధించింది. ఫ్రీస్టెల్ విభాగంలో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా ఓవరాల్ చాంపియన్‌గా నిలవగా భారత్‌కు మూడో స్థానం దక్కింది. 

మాంటెకార్లో విజేత జకోవిచ్మాంటెకార్లో మాస్టర్స్ టెన్నిస్ టైటిల్‌ను నోవాక్ జకోవిచ్ గెలుచుకున్నాడు. మాంటెకార్లోలో ఏప్రిల్ 21న జరిగిన ఫైనల్లో రఫెల్ నాదల్‌ను ఓడించాడు.

ఆసియా సీనియర్ జూడోలో భారత్‌కు కాంస్యంబ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా సీనియర్ జూడో టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణి అనితా చాను కాంస్య పతకం సాధించింది.

సిడ్నీ గ్రౌండ్‌లో సచిన్ మైనపు బొమ్మఆస్ట్రేలియాలోని ప్రతిష్టాత్మక సిడ్నీ క్రికెట్ గ్రౌండ్(ఎస్‌సీజీ)లో భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మైనపు బొమ్మను ఏప్రిల్ 18న ఆవిష్కరిం చారు. త్వరలో దీన్ని మేడమ్ టుస్సాడ్‌‌స సిడ్నీ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు.

అలోన్సోకు చైనీస్ గ్రాండ్ ప్రి
ఫెరారీ డ్రెవర్ ఫెర్నాండో అలోన్సో ఫార్ములా వన్ చైనీస్ గ్రాండ్ ప్రి టైటిల్ గెలుచుకున్నాడు. షాంఘైలో ఏప్రిల్ 14న ముగిసిన రేసులో అలోన్సో మొదటి స్థానం సాధించగా, రెండు, మూడు స్థానాల్లో రైకోనెస్, హోమిల్టన్‌లు నిలిచారు. రెడ్‌బుల్ డ్రైవర్ వెటల్‌కు నాలుగో స్థానం దక్కింది.

తమిళనాడు, రైల్వేలకు బాస్కెట్‌బాల్ టైటిల్స్నేషనల్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో తమిళనాడు జట్టు విజేతగా నిలిచింది. న్యూఢిల్లీలో ఏప్రిల్ 11న ముగిసిన ఫైనల్లో రైల్వేస్‌ను ఓడించింది. మహిళల విభాగంలో రైల్వేస్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో తమిళనాడును ఓడించింది.

అగస్టా మాస్టర్స్ విజేత స్కాట్అగస్టా మాస్టర్స్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌ను ఆస్ట్రేలియాకు చెందిన అడమ్ స్కాట్ గెలుచుకున్నాడు. ఏప్రిల్ 14న ముగిసిన ఈ టోర్నమెంట్‌లో ఏంజెల్ కాబ్రెరా రన్నరప్‌గా నిలిచాడు.

నార్త్-ఈస్ట్ గేమ్స్నార్త్-ఈస్ట్ గేమ్స్ ఏప్రిల్ 8 నుంచి 11 వరకు మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో జరిగాయి. ఇందులో మణిపూర్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. నార్త్-ఈస్ట్ రీజియన్‌లో క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ క్రీడలను ప్రారంభించారు. ఈ క్రీడలను తొలిసారి 1986-87 సీజన్‌లో ఇంఫాల్‌లో నిర్వహించారు.

డేవిస్ కప్ అవార్డులుభారత్‌కు చెందిన నలుగురు టెన్నిస్ క్రీడాకారులకు ఏప్రిల్ 6న బెంగళూరులో డేవిస్ కప్ కమిట్‌మెంట్ అవార్డులను ప్రదానం చేశారు. పురస్కారాలను అందుకున్న వారీలో రామనాథన్ కష్ణన్, రమేష్ కష్ణన్ , ఆనంద్ అమత్‌రాజ్, మహేశ్ భూపతి ఉన్నారు. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) ఈ అవార్డులను ఏర్పాటు చేసింది.

షూటింగ్‌లో రాహీకి స్వర్ణందక్షిణ కొరియాలోని చాంగోవాన్‌లో ఏప్రిల్ 4న జరిగిన అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్‌లో మహిళల 25 మీటర్ల ఫిస్టల్ విభాగంలో భారత మహిళ షూటర్ రాహీ సర్నోబత్ స్వర్ణ పతకం సాధించింది. దీంతో ఈ టోర్నమెంట్‌లో స్వర్ణం గెలుచుకున్న తొలి భారత ఫిస్టల్ షూటర్‌గా గుర్తింపు పొందింది. ఇదే టొర్నమెంట్‌లో భారత షూటర్ ప్రకాశ్ సంజప్ప కాంస్య పతకం గెలుచుకున్నాడు.

రూపేష్‌కు ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్‌ను ప్రపంచ చాంపియన్ రూపేష్ షా(భారత్) గెలుచుకున్నాడు. ఇండోర్‌లో ఏప్రిల్ 7న జరిగిన ఫైనల్లో అలోక్ కుమార్‌ను ఓడించాడు. గతంలో భారత్‌కు చెందిన గీత్ సేథీ, దేవేందర్ జోషి, పంకజ్ అద్వానీ, అలోక్ కుమార్ ఈ చాంపియన్ షిప్‌ను గెలుచుకున్నారు.

ఓర్మ్‌బేకి పానాసోనిక్ ఓపెన్ గోల్ప్ టైటిల్ ఆస్ట్రేలియాకు చెందిన వాడే ఓర్మ్‌బే పానాసోనిక్ ఓపెన్ గోల్ఫ్ చాంపియన్ షిప్‌ను గెలుచుకున్నాడు. న్యూఢిల్లీలో 2013 ఏప్రిల్ 7న జరిగిన పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన భూచు రువాంగిట్ రెండోస్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన శివ్ కపూర్‌కు నాల్గో స్థానం దక్కింది.

ఏషియన్ చెస్ జూనియర్ చాంపియన్‌షిప్భారత్‌కు చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ నారాయణన్ శ్రీనాథ్ ఏషియన్ జానియర్ చెస్ చాంపియన్‌షిప్ బాలుర టైటిల్ గెలుచుకున్నాడు. షార్జాలో ఏప్రిల్ 6న ముగిసిన పోటీల్లో భారత్‌కు చెందిన సహజ్ గ్రోవర్ రెండోస్థానంలో నిలిచాడు. బాలికల టైటిల్‌ను వియత్నాంకు చెందిన థీ కిమ్ ఫుంగ్ గెలుచుకుంది. భారత్‌కు చెందిన జె. శరణ్య రెండోస్థానంలో నిలిచింది. 

No comments:

Post a Comment