AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday, 25 November 2017

క్రీడలు డిసెంబరు 2013

క్రీడలు డిసెంబరు 2013
57వ జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్
57వ జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్ న్యూఢిల్లీలో 2013 డిసెంబర్ 24న ముగిసింది. ప్రపంచ ఒలింపిక్ ఛాంపియన్ అభినవ్ బింద్రా పురుషుల ఎయిర్ రైఫిల్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. మిక్స్‌డ్ రైఫిల్ ఈవెంట్‌లో ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ టైటిల్ రవికుమార్‌కు దక్కింది. ఉమెన్‌‌స ఎయిర్ రైఫిల్ ఛాంపియన్‌గా మంపీదేవి నిలిచింది.
పురుషుల్లో ఉత్తమ షూటర్
సీనియర్: విజయ్‌కుమార్
జూనియర్: సమర్‌జిత్ సింగ్
మహిళల్లో ఉత్తమ షూటర్
సీనియర్: రాజ్‌చౌదరి
జూనియర్: ఎలిజిబెత్ సుసాన్ కోషీ

34వ జాతీయ సీనియర్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్
34వ జాతీయ సీనియర్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ 2013 డిసెంబర్ 25న జంషెడ్‌పూర్‌లో ముగిసింది.
రికర్వీ:
పురుషుల టైటిల్:
 ఈ టైటిల్ అతాను దాస్ (పీయస్‌పీబీ) గెలుచుకున్నాడు. ఫైనల్‌లో ఎం.ఆర్. తిర్కే (సర్వీసెస్)ను అతానుదాస్ ఓడించాడు.
పురుషుల టీం టైటిల్: సర్వీసెస్ గెలుచుకుంది. ఫైనల్స్‌లో అస్సాంను ఓడించింది.
మహిళల టైటిల్: దీపికా కుమారి (జార్ఖండ్) గెలుచుకుంది. ఫైనల్స్‌లో వి. ప్రణీత (గుజరాత్)ను దీపికా ఓడించింది.
మహిళల టీం టైటిల్: జార్ఖండ్ గెలుచుకుంది. ఫైనల్స్‌లో పంజాబ్‌ను జార్ఖండ్ ఓడించింది.
మిక్స్‌డ్ టైటిల్: జార్ఖండ్ గెలుచుకుంది. ఫైనల్స్‌లో అస్సాంను జార్ఖండ్ ఓడించింది.

కాంపౌండ్: 
పురుషుల టైటిల్: ఈ టైటిల్‌ను రజత్ చౌహాన్ (రాజస్థాన్) గెలుచుకున్నాడు. ఫైనల్స్‌లో కాపల్‌ప్రీత్‌సింగ్ (పంజాబ్)ను చౌహాన్ ఓడించాడు.
పురుషుల టీం టైటిల్: పంజాబ్ గెలుచుకుంది. ఫైనల్స్‌లో హిమాచల్ ప్రదేశ్‌ను పంజాబ్ ఓడించింది.
మహిళల టైటిల్: జాను హన్‌‌సదా (జార్ఖండ్) గెలుచుకుంది. ఫైనల్స్‌లో రమణ్‌దీప్ కౌర్ (పంజాబ్)ను ఓడించింది.
మహిళల టీం టైటిల్: బీహార్ గెలుచుకుంది. ఫైనల్స్‌లో మణిపూర్‌ను బీహార్ ఓడించింది.
మిక్స్‌డ్ టైటిల్: జార్ఖండ్ గెలుచుకుంది. ఫైనల్స్‌లో రాజస్థాన్‌ను ఓడించింది.

తమిళనాడు, రైల్వేలకు జాతీయ వాలీబాల్ టైటిల్స్
62వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ 2013 డిసెంబర్ 29న మొరాదాబాద్‌లో ముగిసింది.
విజేతలు:
పురుషుల టైటిల్: తమిళనాడు గెలుచుకుంది. ఫైనల్స్‌లో ఉత్తరప్రదేశ్‌ను తమిళనాడు ఓడించింది.
ఈ టైటిల్‌ను తమిళనాడు గెలుచుకోవడం ఇది తొమ్మిదోసారి.
మహిళల టైటిల్: రైల్వేలు గెలుచుకుంది. ఫైనల్స్‌లో కేరళను రైల్వేలు ఓడించింది. వరుసగా ఆరోసారి, మొత్తానికి 29వ సారి రైల్వేలు ఈ టైటిల్ సాధించింది.

దక్షిణాఫ్రికాకు టెస్ట్ సిరీస్భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ సీరియస్‌ను దక్షిణాఫ్రికా 1-0తో గెలుచుకుంది. దర్బన్‌లో 2013 డిసెంబర్ 30న ముగిసిన రెండో టెస్ట్‌ను 10 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా గెలుచుకోవడంతో సిరీస్ దక్షిణాఫ్రికాకు దక్కింది. మొదటి టెస్ట్ డ్రాగా ముగిసింది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా డివీలియర్‌‌స ఎంపికయ్యారు.

కపిల్‌దేవ్‌కు కల్నల్ సి.కె.నాయుడు అవార్డుభారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌ను 2013 సంవత్సరానికి సి.కె.నాయుడు జీవిత కాల సాఫల్య పురస్కారానికి బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ అవార్డు కింద ప్రశంస పత్రం, రూ.25 లక్షల నగదు బహూకరిస్తారు. కపిల్ 1978- 94 మధ్య కాలంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. టెస్టుల్లో 5,000 పరుగులు, 400 వికెట్లు తీసిన తొలి క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పారు. మొత్తం 131 టెస్టులు ఆడి 5248 పరుగులు చేసి, 434 వికెట్లు తీశారు. 225 వన్డేల్లో 253 వికెట్లు తీసి, 3,783 పరుగులు చేశారు. తన కెప్టెన్సీలో 1983లో తొలిసారి భారత్‌కు ప్రపంచ్‌కప్‌ను సాధించి పెట్టారు. కల్నల్ సి.కె. నాయుడు అవార్డు 2010లో సలీం దురానీకి, 2011లో అజిత్ వాడేకర్‌కు, 2012లో సునీల్ గవాస్కర్‌కు లభించింది.

అత్యధిక టెస్టులకు కెప్టెన్‌గా ధోని రికార్డుభారత్ తరపున 50 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించి ఎంఎస్ ధోని రికార్డు నెలకొల్పాడు. డిసెంబర్ 18న జోహన్నెస్‌బర్గ్‌లో మొదలైన తొలి టెస్టు అతనికి 50వది. ఇంతకు ముందు ఈ రికార్డు సౌరవ్ గంగూలీ పేరిట ఉంది. గంగూలీ మొత్తం 49 టెస్టుల్లో భారత్‌కు నాయకత్వం వహించాడు.

ఏఐఎఫ్‌ఎఫ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా సునీల్ ఛెత్రిభారత ఫుట్‌బాల్ టీం కెప్టెన్ సునీల్ ఛెత్రి ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఎఫ్) ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యాడు. ఈ అవార్డు 2007, 2011లో కూడా ఛెత్రికి దక్కింది. అవార్డు కింద రూ. 2 లక్షలు, ట్రోఫీ బహూకరిస్తారు. ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు బెంబెమ్ దేవి ఎంపికైంది.

శ్రీకాంత్, సింధులకు జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ టైటిల్స్జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ న్యూఢిల్లీలో డిసెంబర్ 23న ముగిసింది. 
విజేతలు:- పురుషుల సింగిల్స్: ఈ టైటిల్‌ను కె.శ్రీకాంత్ గెలుచుకున్నాడు. ఫైనల్స్‌లో గురుసాయిదత్‌ను ఓడించాడు.
- మహిళల సింగిల్స్: ఈ టైటిల్‌ను పీవీ సింధు గెలుచుకుంది. ఫైనల్స్‌లో రీతూపర్ణదాస్‌ను ఓడించింది. సింధుకు ఇది రెండో మహిళల టైటిల్.
- పురుషుల డబుల్స్: ప్రణవ్ చోప్రా, అక్షయ్ దివాల్కర్ గెలుచుకున్నారు. వీరు ఫైనల్స్‌లో సుమీత్ రెడ్డి, మనూ అత్రిలను ఓడించారు.
- మహిళల డబుల్స్: గుత్తా జ్వాల, అశ్వినీ పొన్నప్ప గెలుచుకున్నారు. వీరు ఫైనల్స్‌లో సిక్కి రెడ్డి, ప్రద్న్యా గాద్రెలను ఓడించారు. జ్వాలకిది 14వ జాతీయ డబుల్స్ టైటిల్.
- మిక్స్‌డ్ డబుల్స్: అరుణ్ విష్ణు, అపర్ణా బాలన్ జోడి.. తరుణ్, అశ్విని జోడిని ఓడించి టైటిల్ గెలుచుకున్నారు.

వన్డే సిరీస్ విజేత దక్షిణాఫ్రికాభారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0 తేడాతో గెలుచుకుంది. డిసెంబర్ 11న జరిగిన మూడో వన్డే వర్షం వల్ల రద్దు కావడంతో సిరీస్ దక్షిణాఫ్రికాకు దక్కింది. అంతకుముందు జరిగిన రెండు వన్డేల్లో దక్షిణాఫ్రికా గెలిచింది.దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డికాక్ వరుసగా మూడు వన్డేలలో మూడు సెంచరీలు సాధించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. డికాక్ కంటే ముందు జహీర్ అబ్బాస్, సయీద్ అన్వర్, గిబ్స్, డివిలియర్స్ వరుసగా సెంచరీలు చేశారు. ఒకే సిరీస్‌లో వరుసగా మూడు వన్డే సెంచరీలు చేసిన తొలి ఆటగాడు డికాక్.

ప్రపంచ మహిళల, పురుషుల కబడ్డీ టైటిల్ విజేత భారత్ప్రపంచ కప్ మహిళల కబడ్డీ టైటిల్‌ను భారత్ జట్టు గెలుచుకుంది. జలంధర్‌లో డిసెంబర్ 12న జరిగిన ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ను భారత్ ఓడించింది. ఈ టైటిల్‌ను భారత్ గెలుచుకోవడం ఇది వరుసగా మూడోసారి. టైటిల్ సాధించిన భారత్‌కు కోటి రూపాయల నగదు బహుమతి లభించింది. ఉత్తమ స్టాపర్‌గా అనురాణి, ఉత్తమ రైడర్‌గా రామ్ బతేరి ఎంపికయ్యారు. అదేవిధంగా భారత్ వరుసగా నాలుగోసారి పురుషుల ప్రపంచ కప్ కబడ్డీ టైటిల్‌ను గెలుచుకుంది. లూథియానాలో డిసెంబర్ 14న జరిగిన ఫైనల్స్‌లో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ గెలుపుతో భారత్‌కు ట్రోఫీతోపాటు రూ. 2 కోట్ల నగదు బహుమతి లభించింది. పాకిస్థాన్‌కు కోటి రూపాయలు దక్కాయి.

2013 ఐసీసీ అవార్డులుఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2013 సంవత్సరానికి వార్షిక అవార్డులను డిసెంబర్ 13న దుబాయ్‌లో ప్రకటించింది. 
- క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (సర్ సోబర్‌‌స ట్రోఫీ): మైకేల్ క్లార్‌‌క (ఆస్ట్రేలియా)
- టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: మైకేల్ క్లార్‌‌క (ఆస్ట్రేలియా)
- ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: చటేశ్వర్ పుజారా (భారత్)
- వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: కుమార సంగక్కర(శ్రీలంక)
- ఉమెన్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: సుజీ బేట్స్ (న్యూజిలాండ్)
- స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు: మహేల జయవర్ధనే(శ్రీలంక)
- అంపైర్ ఆఫ్ ద ఇయర్ (డేవిడ్ షెపర్‌‌డ ట్రోఫీ):రిచర్‌‌డ కెట్లెబరో
- ఎల్‌జీ పీపుల్స్ ఛాయిస్ అవార్‌‌డ: ఎం.ఎస్. ధోని

జర్మనీకి పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ టైటిల్
డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. న్యూఢిల్లీలో డిసెంబర్ 15న జరిగిన ఫైనల్స్‌లో ఫ్రాన్‌‌సను ఓడించింది. ఇది జర్మనీకి వరుసగా రెండో టైటిల్. మొత్తానికి ఆరో టైటిల్. నెదర్లాండ్‌‌సకు మూడు, మలేషియాకు నాలుగో స్థానం దక్కగా భారత్ పదో స్థానంలో నిలిచింది. 

లీ చోంగ్ వీకు వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టైటిల్బ్యాడ్మింటన్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టైటిల్‌ను మలేషియాకు చెందిన లీ చోంగ్ వీ గెలుచుకున్నాడు. కౌలాలంపూర్‌లో డిసెంబర్ 15న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో టామీ సుగియార్తో (ఇండోనేషియా)ను లీ చోంగ్ వీ ఓడించాడు. ఈ టైటిల్‌ను లీ చోంగ్ వీ గెలుచుకోవడం ఇది నాలుగోసారి. 2008, 2009, 2010లో ఈ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

ధోనీకి ఐసీసీ పీపుల్స్ చాయిస్ అవార్డు -2013భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 2013 సంవత్సరానికి ఐసీసీకి చెందిన ఎల్‌జీ పీపుల్స్ చాయిస్ అవార్డుకు ఎంపికయ్యాడు. సచిన్ (2010) తర్వాత ఈ అవార్డుకు ఎంపికైన రెండో భారత క్రికెటర్ ధోని. 2011లో, 2012లో రెండుసార్లు ఈ అవార్డు శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కరకు దక్కింది. ఐసీసీ వెబ్‌సైట్, ట్విట్టర్ ద్వారా జరిగిన ఓటింగ్‌లో రెండు లక్షల మంది విజేతను ఎంపిక చేశారు.

కామన్‌వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్‌బర్గ్‌లో డిసెంబర్ 8న ముగిసిన కామన్‌వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ 16 స్వర్ణ పతకాలు గెలుచుకుంది. 13 రజతాలు, 11 కాంస్య పతకాలతోపాటు మొత్తం 38 పతకాలు భారత్‌కు దక్కాయి. పురుషుల ఫ్రీ స్టైల్, గ్రీక్-రోమన్ స్టైల్ టీం చాంపియన్‌షిప్ భారత్‌కు లభించాయి. మహిళా విభాగంలో భారత్ రన్నరప్‌గా నిలిచింది.

పి.వి.సింధుకు మకావు గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్మకావు గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను భారత క్రీడాకారిణి పి.వి.సింధు గెలుచుకుంది. మకావులో డిసెంబర్ 1న జరిగిన ఫైనల్‌లో కెనడాకు చెందిన మిచెల్లి లీని ఓడించింది. ఈ ఏడాది సింధుకు ఇది రెండో గ్రాండ్ ప్రి టైటిల్. గత మేలో మలేషియా ఓపెన్ టైటిల్ సాధించింది.

బుల్లర్‌కు ఇండోనేషియా ఓపెన్ గోల్ఫ్ టైటిల్ఇండోనేషియా ఓపెన్ గోల్ఫ్ టైటిల్‌ను గగన్‌జిత్ బుల్లర్ గెలుచుకున్నాడు. డిసెంబర్ 1న జకార్తాలో జరిగిన పోటీలో విజేతగా నిలిచాడు. ఈ ఏడాదిలో బుల్లర్‌కు ఇది మొదటి టైటిల్. కాగా ఇండోనేషియాలో రెండో టైటిల్.

కామన్‌వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు 117 పతకాలుమలేషియాలోని పెనాంగ్‌లో నవంబర్ 30న ముగిసిన కామన్‌వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 117 పతకాలు లభించాయి. ఇందులో 57 స్వర్ణం, 39 రజతం, 21 కాంస్య పతకాలు ఉన్నాయి. ఉత్తమ లిఫ్టర్ అవార్డు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాగాల్ వెంకట్ రాహుల్‌కు దక్కింది. రాహుల్ మొత్తం ఆరు స్వర్ణ పతకాలు గెలిచాడు. జూనియర్, యూత్, సీనియర్ విభాగాల్లో ఈ పోటీలు జరిగాయి. భారత్ యూత్ బాయ్స్, గర్ల్స్, జూనియర్ మెన్, ఉమెన్, సీనియర్ మెన్ విభాగాల్లో టీమ్ టైటిల్స్ సాధించింది. సీనియర్ ఉమెన్ విభాగంలో రన్నరప్ ట్రోఫీ దక్కింది.

కరణ్ ఠాకూర్ రికార్డుసీకే నాయుడు ట్రోఫీ (బీసీసీఐ అండర్-25 మీట్)లో రైల్వేస్ పేసర్ కరణ్ ఠాకూర్ ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టి చరిత్ర సష్టించాడు. దీంతో ఈ టోర్నీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. వడోదరాలో బరోడాతో జరిగిన ఈ మ్యాచ్‌లో అతను పది వికెట్లు పడగొట్టాడు. భారత్‌లో పి.ఎం.చటర్జీ, దేబాశిష్ మొహంతి, ఎస్.పి.గుప్తే, పి.సుందరం... ఈ నలుగురూ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీశారు.

శ్రీజకు స్వర్ణంభారత్‌కు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి శ్రీజ ఇరాన్‌లో జరిగిన ఫజర్ కప్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ టోర్నీ జూనియర్ విభాగంలో సింగిల్స్ టైటిల్ గెలిచింది. నవంబర్ 30న జరిగిన సింగిల్స్ ఫైనల్లో బెలారస్‌కు చెందిన బరవోక్‌ను ఓడించింది. టీమ్ విభాగంలో భారత్ ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. 

వసీం జాఫర్ రికార్డుఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 50 సెంచరీలు సాధించిన ఎనిమిదో భారత బ్యాట్స్‌మెన్‌గా ముంబై బ్యాట్స్‌మెన్ వసీం జాఫర్ రికార్డులకెక్కాడు. నవంబర్ 27న విదర్భతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీ చేసి ఈ ఘనతను సాధించాడు. ఇంతకుముందు గవాస్కర్, సచిన్, ద్రవిడ్, విజయ్ హజారే, వెంగ్‌సర్కార్, లక్ష్మణ్, అజహర్ ఈ జాబితాలో ఉన్నారు. 

వన్డే సిరీస్ విజేత భారత్వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల క్రికెట్ సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో గెలుచుకుంది. కాన్పూర్‌లో నవంబర్ 27న జరిగిన మూడో వన్డేలో భారత్ విజయం సాధించడంతో మూడు వన్డేల సిరీస్ భారత్ వశమైంది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా విరాట్ కోహ్లి ఎంపిక య్యాడు.

No comments:

Post a Comment