AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday, 25 November 2017

క్రీడలు మార్చి 2014

క్రీడలు మార్చి 2014
దేవ్‌ధర్ ట్రోఫీ విజేత వెస్ట్‌జోన్ దేశవాళీ జోనల్ వన్డే క్రికెట్ టోర్నీ దేవ్‌ధర్ ట్రోఫీని వెస్ట్‌జోన్ గెలుచుకుంది. విశాఖలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో మార్చి 28న జరిగిన అంతిమపోరులో వెస్ట్‌జోన్ 133 పరుగుల భారీ తేడాతో నార్త్‌జోన్‌ను ఓడించింది. ఈ ట్రోఫీని వెస్ట్ జోన్ గెలవడం ఇది మూడోసారి.

క్యాండిడేట్ టోర్నీ టైటిల్ విజేత ఆనంద్రష్యాలో జరిగిన క్యాండిడేట్ టోర్నీ చెస్ టైటిల్‌ను భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో నవంబర్లో జరిగే ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలకు నిరుటి విజేత మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)తో తలపడేందుకు అర్హత సాధించాడు. 

ప్రపంచకప్ షూటింగ్‌లో హీనాకు రజతంభారత స్టార్ ఎయిర్ పిస్టల్ షూటర్ హీనా సిద్దూ అమెరికాలో జరిగిన ఐ.ఎస్.ఎస్.ఎఫ్ ప్రపంచ కప్‌లో రజత పతకం సాధించింది. ఫైనల్లో బల్గేరియాకు చెందిన బెనోవా అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకుంది.

సంతోషికి స్వర్ణంనాగ్‌పూర్‌లో జరిగిన జాతీయ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన లిఫ్టర్లు నాలుగు పతకాలు సాధించారు. మహిళల 53కిలోల విభాగంలో మత్స్య. సంతోషి స్వర్ణపతకం గెలుచుకుంది. ఆమె క్లీన్ అండ్ జర్క్‌లో 104 కిలోల బరువు ఎత్తి అగ్రస్థానంలో నిలిచింది. అలాగే మొత్తంగా 174 కిలోల బరువు ఎత్తిన సంతోషికి కాంస్యం కూడా వరించింది. కాగా పురుషుల 62 కిలోల కేటగిరీలో కె.గౌరీబాబు, పురుషుల 69 కిలోల విభాగంలో ఎం. రామకృష్ణ కాంస్యపతకాలు సాధించారు. ఈ ముగ్గురూ విజయనగరం జిల్లాకు చెందిన వారు కావడం విశేషం.

బీసీసీఐకి ఇద్దరు అధ్యక్షులుఐపీఎల్‌కు సంబంధించినంతవరకు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా సునీల్‌గవాస్కర్, ఐపీఎల్ మినహా మిగిలిన బోర్డు వ్యవహారాలన్నింటికీ సంబంధించి శివలాల్‌యాదవ్ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రస్తుతం అధ్యక్షుడి హోదాలో కొనసాగుతున్న శ్రీనివాసన్‌ను పక్కనబెట్టాలని స్పష్టం చేసింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై కేసును విచారిస్తున్న ఏకే పట్నాయక్, ఇబ్రహీం ఖలీవుల్లాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. కేసు విచారణ ముగిసేవరకు తమ ఆదేశాలమేర అప్పగించిన బాధ్యతలను నిర్వహించాలని సూచించింది.

ఎయిరిండియాకు నేషనల్ ఎ డివిజన్ హాకీ చాంపియన్‌షిప్నేషనల్ ఎ డివిజన్ హాకీ చాంపియన్‌షిప్‌ను ఎయిరిండియా గెలుచుకుంది. లక్నోలో మార్చి 23న జరిగిన ఫైనల్లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) జట్టును ఓడించింది. మూడో స్థానాన్ని ఉత్తర ప్రదేశ్ హాకీ సాధించింది. 

రైల్వేలకు హాకీ ఇండియా ఉమెన్స్ నేషనల్ చాంపియన్ షిప్నాలుగో హాకీ ఇండియా ఉమెన్స్ నేషనల్ చాంపియన్‌షిప్‌ను రైల్వేస్ గెలుచుకుంది. మార్చి 23న భోపాల్‌లో జరిగిన ఫైనల్లో హర్యానాను ఓడించింది. జార్ఖండ్ మూడో స్థానంలో నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా హర్యానా జట్టుకు చెందిన మోనిక ఎంపికైంది.

ఇండియన్ వెల్స్ విజేత జొకోవిచ్
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) గెలుచుకున్నాడు. ఫైనల్లో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)ను ఓడించాడు. జొకోవిచ్ కెరీర్‌లో ఓవరాల్‌గా ఇది 42వ టైటిల్. ఇందులో 17 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ ఉన్నాయి. ఈ క్రమంలో అత్యధికంగా మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో ఆండ్రీ అగస్సీ (అమెరికా) సరసన జొకోవిచ్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో రాఫెల్ నాదల్ (26 టైటిల్స్), ఫెడరర్ (21 టైటిల్స్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 

విజయ్ హజారే విజేత కర్ణాటక
దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీని కర్ణాటక గెలుచుకుంది. మార్చి 16న కోల్‌కతాలో జరిగిన ఫైనల్లో రైల్వేస్‌ను ఓడించింది. ఈ విజయంతో కర్ణాటక ఈ ఏడాది వరుసగా మూడో టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పటికే రంజీ, ఇరానీ ట్రోఫీలలో విజేతగా నిలిచింది.

ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రి విజేత రోస్‌బర్గ్
ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రై వర్ నికో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. మాగ్నుసన్ (మెక్‌లారెన్) రెండో స్థానంలో నిలిచాడు. ఇదే రేసులో ఎఫ్1 చరిత్రలో పిన్న వయస్సులో (19 ఏళ్ల 10 నెలల 18 రోజులు) పాయింట్లు నెగ్గిన డ్రై వర్‌గా డానిల్ క్వియాట్ (రష్యా) రికార్డు నెలకొల్పాడు.

హాకీ జూనియర్ ఉమెన్‌‌స చాంపియన్‌షిప్
హాకీ ఇండియా జూనియర్ ఉమెన్‌‌స చాంపియన్‌షిప్‌ను ఛత్తీస్‌గఢ్ గెలుచుకుంది. మైసూర్‌లో మార్చి 13న జరిగిన ఫైనల్లో కేరళను ఓడించింది. 

క్రికెటర్ ఆఫ్ ది జనరేషన్ సచిన్
భారత మాజీ ఆటగాడు, మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్‌ను ‘క్రికెటర్ ఆఫ్ ది జనరేషన్’ అవార్డుకు ఈఎస్‌పీఎన్-క్రిక్ ఇన్ఫో సంస్థ ఎంపిక చేసింది. 

ఇతర అవార్డుల విజేతలు:
టెస్టు బ్యాటింగ్ అవార్డు: శిఖర్ ధావన్ (ఆస్ట్రేలియాపై తొలి టెస్టులో 187 పరుగుల ఇన్నింగ్స్)
వన్డే బ్యాటింగ్ అవార్డు: రోహిత్ శర్మ (ఆస్ట్రేలియాపై వన్డే డబుల్ సెంచరీ);
తొలి ఏడాది అత్యుత్తమ ప్రదర్శన అవార్డు:షమీ (2013లో టెస్టులు, వన్డేలు కలిపి 47 వికెట్లు);
ఉత్తమ టెస్టు బౌలింగ్ అవార్డు: మిచెల్ జాన్సన్ (7/40, ఇంగ్లండ్‌పై); 
ఉత్తమ వన్డే బౌలింగ్ అవార్డు: షాహిద్ ఆఫ్రిది (7/12, వెస్టిండీస్‌పై).

పంకజ్ అద్వానీకి నేషనల్ స్నూకర్ టైటిల్నేషనల్ స్నూకర్ టైటిల్‌ను పంకజ్ అద్వానీ గెలుచుకున్నాడు. లక్నోలో మార్చి 7న ముగిసిన పురుషుల పోటీలో కమల్ చావ్లాను పంకజ్ ఓడించాడు. పంకజ్‌కు ఇది 6వ నేషనల్ స్నూకర్ టైటిల్. మహిళల టైటిల్‌ను విద్యా పిళై ్ల గెలుచుకుంది. ఈమె ఫైనల్స్‌లో చిత్రా మగిమైరాజ్‌ను ఓడించింది.

నేషనల్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్నేషనల్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌ను మిజోరాం గెలుచుకుంది. సిలిగురిలో మార్చి 9న జరిగిన ఫైనల్స్‌లో రైల్వేస్‌ను ఓడించింది. 68 ఏళ్ల ఈ చాంపియన్‌షిప్ చరిత్రలో మిజోరాం తొలిసారి టైటిల్‌ను గెలుచుకుంది.

చోంగ్ వీ, షిజియాన్‌లకు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బాడ్మింటన్ టైటిల్స్బర్మింగ్‌హామ్‌లో మార్చి 9న ముగిసిన ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో చోంగ్ వీ పురుషుల, షిజియాన్ మహిళల టైటిల్స్ గెలుచుకున్నారు.
పురుషుల సింగిల్స్: మలేషియాకు చెందిన లీ చోంగ్ వీ చైనాకు చెందిన చెన్ లాంగ్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకున్నాడు.
మహిళల సింగిల్స్: చైనాకు చెందిన షిజియాన్ వాంగ్ చైనాకే చెందిన జురుయ్ లీని ఓడించి టైటిల్ సాధించింది.
పురుషుల డబుల్స్: మహ్మద్ ఆషాన్, హెంద్రా సెతియవాన్ (ఇండోనేషియా) టైటిల్ గెలుచుకున్నారు. వీరు హీరోయుకీ ఎండో, కెనిచి హయకావాలను ఓడించారు.
మహిళల డబుల్స్: యు యాంగ్, వాంగ్ జియోలీ గెలుచుకున్నారు. వీరు మా జిన్, తాంగ్ యవాంతింగ్‌లను ఓడించారు. 

శ్రీలంకకు ఆసియా కప్ ఆసియా కప్ క్రికెట్ టైటిల్‌ను శ్రీలంక గెలుచుకుంది. బంగ్లాదేశ్‌లో మార్చి 8న ముగిసిన ఫైనల్స్‌లో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ కప్‌ను శ్రీలంక గెలుచుకోవడం ఇది ఐదోసారి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా మలింగ, మ్యాన్ ఆఫ్ ద సీరిస్‌గా తిరిమన్నె ఎంపికయ్యారు. ఈ టోర్నమెంట్ ఇప్పటివరకూ 12 సార్లు జరిగింది.

నేషనల్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్చత్తీస్‌గఢ్ మహిళల జట్టు, తమిళనాడు పురుషుల జట్టు 64వ నేషనల్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ టైటిల్స్ గెలుచుకున్నాయి. న్యూఢిల్లీలో మార్చి 5న ముగిసిన పోటీల్లో రైల్వేస్‌ను చత్తీస్‌గఢ్, పంజాబ్‌ను తమిళనాడు ఓడించాయి. మహిళా విభాగంలో కవితా కుమారి, పురుషుల విభాగంలో రికిన్ పితానీలకు అత్యంత విలువైన ఆటగాళ్లకు ఇచ్చే హరీశ్‌శర్మ ట్రోఫీని బహూకరించారు. 

సాకేత్ మైనేనికి ఐటీఎఫ్ టైటిల్అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. భీమవరం (ఆంధ్రప్రదేశ్)లో మార్చి 8న జరిగిన ఫైనల్స్‌లో సనమ్‌సింగ్‌ను సాకేత్ ఓడించాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను సాకేత్ మైనేని, సనమ్‌సింగ్‌లు గెలుచుకున్నారు. వీరు ఫైనల్స్‌లో శ్రీరామ్ బాలాజీ, వి.ఎం. రంజిత్‌లను ఓడించారు. 

దక్షిణాఫ్రికాకు క్రికెట్ అండర్-19 ప్రపంచకప్అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌ను దక్షిణాఫ్రికా గెలుచుకుంది. దుబాయ్‌లో 2014 మార్చి 1న జరిగిన ఫైనల్స్‌లో పాకిస్థాన్ ఓడించి కప్‌ను కైవసం చేసుకుంది. ఈ కప్‌ను దక్షిణాఫ్రికా గెలుచుకోవడం ఇదే తొలిసారి. దక్షిణాఫ్రికాకు చెందిన అబిడెన్ మర్‌క్రమ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా, కోర్బిన్ బోష్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా ఎంపికయ్యారు. 

అరవింద్ భట్‌కు జర్మన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్భారత క్రీడాకారుడు అరవింద్‌భట్ జర్మన్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. జర్మనీలో 2014 మార్చి 1న జరిగిన ఫైనల్స్‌లో డెన్మార్‌‌కకు చెందిన విటింగ్‌హస్‌ను ఓడించాడు. ఈ టైటిల్ ను గెలుచుకున్న మొదటి భారతీయుడు అరవింద్. ఈయనకు ఇది ఏడో అంతర్జాతీయ టైటిల్. గోపీచంద్, శ్రీకాంత్ తర్వాత విదేశంలో గ్రాండ్ ప్రీ గోల్డ్ టైటిల్ గెలుచుకొన్న మూడో భారతీయ క్రీడా కారుడిగా అరవింద్ గుర్తింపు పొందాడు.

డెల్‌బోనిస్‌కు బ్రెజిల్ ఓపెన్ టైటిల్అర్జెంటీనాకు చెందిన ఫెడెరికో డెల్‌బోనిస్ బ్రెజిల్ ఓపెన్ టోర్నమెంట్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. సావో పౌలోలో 2014 మార్చి 2న జరిగిన ఫైనల్స్‌లో ఇటలీకి చెందిన పావొలో లోరెంజీని డెల్‌బోనిస్ ఓడించాడు.

No comments:

Post a Comment