AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday, 25 November 2017

క్రీడలు నవంబరు 2013

క్రీడలు నవంబరు 2013
బ్రెజిల్ గ్రాండ్ ప్రి విజేత వెటెల్రెడ్‌బుల్ డ్రై వర్ సెబాస్టియన్ వెటెల్ ఫార్ములావన్ బ్రెజిల్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను గెలుచుకున్నాడు. బ్రెజిల్‌లో నవంబర్ 24న జరిగిన రేసులో వెటెల్ విజయం సాధించాడు. తద్వారా ఈ సీజన్‌లో వరుసగా తొమ్మిదో గెలుపు నమోదు చేశాడు. దీంతో 1952-53 సీజన్‌లో వరుసగా ఆల్బర్ట్ ఆస్కారి (ఇటలీ) నెలకొల్పిన తొమ్మిది విజయాల రికార్డును వెటెల్ సమం చేశాడు. 

స్కూల్ క్రికెట్‌లో వృధ్వీ పంకజ్ రికార్డుస్కూల్ క్రికెట్‌కు చెందిన హారిస్ షీల్డ్ టోర్నీలో వృధ్వీ పంకజ్ షా (14) 546 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ముంబైలో నవంబర్ 20న సెయింట్‌ఫ్రాన్సిస్‌తో జరిగిన మ్యాచ్‌లో రిజ్వీస్ప్రింగ్ ఫీల్డ్ జట్టు తరపున పధ్వీ బ్యాటింగ్ చేసి ఈ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు స్కూల్ క్రికెట్‌లో 2010లో ముంబైలో ఆర్మాన్ చేసిన 498 పరుగులు అత్యధికం. మనదేశంలో 1933-34 సీజన్‌లో దాదాబాయ్ హలేవాలా కాలేజ్ క్రికెట్‌లో చేసిన 515 పరుగులు అన్ని రకాల క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత స్కోర్ ఇంగ్లండ్ ఆటగాడు కొలిన్స్ పేరిట ఉంది. ఆయన 1899లో 628 పరుగులు చేశాడు. తర్వాత 1901లో సి.కె.ఈడీ పేరిట 566 పరుగుల రికార్డు ఉంది.

ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ విజేత మాగ్నస్ కార్ల్‌సన్నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్‌సన్ (22) కొత్త ప్రపంచ చెస్ చాంపియన్‌గా అవతరించాడు. చెన్నైలో నవంబర్ 21న ముగిసిన పోటీలో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ (43)ను ఓడించాడు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆనంద్ ఈసారి ఒక్క గేమ్‌లో కూడా గెలవలేదు. ఆన ంద్ తొలిసారి 2000లో ఈ టైటిల్ సాధించాడు. తర్వాత 2007, 2008, 2010, 2012ల్లో చాంపియన్‌గా నిలిచాడు. మొత్తం రూ.14 కోట్ల ప్రై జ్‌మనీలో కార్ల్‌సన్‌కు రూ.8.4 కోట్లు, ఆనంద్‌కు రూ.5.6 కోట్లు లభించాయి. 

జొకోవిచ్‌కు ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్
నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ టైటిల్ గెలుచుకున్నాడు. లండన్‌లో నవంబర్ 12న జరిగిన ఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్‌వన్ రఫెల్ నాదల్ (స్పెయిన్)ను జొకోవిచ్ ఓడించాడు.
దక్షిణాసియా జూనియర్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు అగ్రస్థానం
దక్షిణాసియా జూనియర్ అథ్లెటిక్స్‌లో భారత్ మొత్తం 52 పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది. రాంచీలో నవంబర్ 12న ముగిసిన పోటీల్లో భారత్ 20 స్వర్ణాలు, 20 రజతాలు, 12 కాంస్య పతకాలతో మొత్తం 52 పతకాలు సాధించింది. శ్రీలంక 10 స్వర్ణాలు, 10 రజతాలు, 14 కాంస్య పతకాలు సాధించి రెండో స్థానం దక్కించుకుంది.
అథ్లెట్స్ ఆఫ్ ది ఇయర్‌గా బోల్ట్, ప్రాసెర్ - ప్రెసి
జమైకా స్ప్రింట్ క్రీడాకారులు ఉసేస్ బోల్ట్, షెల్లీ ఆన్ ప్రాసెర్-ప్రెసిలు 2013 సంవత్సరానికి ఐఏఏఎఫ్ పురుషుల, మహిళల వరల్డ్ అథ్లెట్స్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. ఈ అవార్డులను నవంబర్ 16న మాంటెకార్లోలో బహూకరించారు. ఈ అవార్డును బోల్ట్ 2008, 2009, 2011, 2012లో కూడా దక్కించుకున్నాడు.
టెస్ట్ సిరీస్ విజేత ఇండియా
వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. నవంబర్ 16న ముగిసిన రెండో టెస్టును కూడా భారత్ గెలుచుకోవడంతో సిరీస్ భారత్ వశమైంది. తన చివరి టెస్ట్‌లో సచిన్ 74 పరుగులు చేశారు. రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా, ప్రజ్ఞాన్ ఓజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యారు.
చెక్ రిపబ్లిక్‌కు డేవిస్ కప్
ప్రపంచ టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ డేవిస్ కప్ టైటిల్‌ను చెక్ రిపబ్లిక్ నిలబెట్టుకుంది. బెల్‌గ్రేడ్‌లో నవంబర్ 18న ముగిసిన ఫైనల్స్‌లో సెర్బియాను ఓడించి చెక్ రిపబ్లిక్ విజేతగా నిలిచింది.
వెటెల్‌కు యూఎస్ గ్రాండ్ ప్రి టైటిల్
రెడ్‌బుల్ డ్రై వర్ సెబాస్టియన్ వెటెల్ ఫార్ములావన్ యూఎస్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను గెలుచుకున్నాడు. నవంబర్ 18న వెస్టిన్‌లో జరిగిన రేసులో వెటెల్ మొదటి స్థానంలో నిలిచాడు. లోటస్ డ్రై వర్ గ్రోస్యెన్‌కు రెండో స్థానం దక్కింది. ఈ గెలుపుతో ఈ సీజన్‌లో వరుసగా ఎనిమిది విజయాలు సాధించిన తొలి డ్రై వర్‌గా వెటెల్ రికార్డు నెలకొల్పాడు.
టైమ్ ‘పర్సన్ ఆఫ్ ద వీక్’ సచిన్
ప్రఖ్యాత ‘టైమ్’ మ్యాగజైన్ సచిన్ టెండ్కూలర్‌ను ‘పర్సన్ ఆఫ్ ద వీక్’ గౌరవంతో సత్కరించింది. మ్యాగజైన్ ఆన్‌లైన్ పోల్‌లో సచిన్‌కు 54 (88 శాతం) ఓట్లు వచ్చాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ హెడ్ నోమిని జనెట్ యెలెన్ 13.41 శాతం, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ 6.1 శాతం ఓట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. 

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ నెంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా అశ్విన్
భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ఆల్‌రౌండర్ల విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. అశ్విన్ 405 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్ ఆటగాడు షకిబుల్ (362 పాయింట్లు), దక్షిణాఫ్రికాకు చెందిన కలిస్ (332 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 
భారత్‌కు బహ్రెయిన్ బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్స్
బహ్రెయిన్‌లో నవంబర్ 9న ముగిసిన బహ్రెయిన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఐదు టైటిల్స్‌ను భారత్ క్రీడాకారులు గెలుచుకున్నారు. పురుషుల సింగిల్స్:ఈ టైటిల్‌ను సమీర్‌వర్మ దక్కించుకున్నాడు. ఫైనల్‌లో సుభాంకర్ దేను ఓడించాడు.మహిళల సింగిల్స్: తన్వీలాద్ గెలుచుకుంది. ఫైనల్‌లో సైలీ రాణిపై విజయం సాధించింది.పురుషుల డబుల్స్:రూపేశ్‌కుమార్, సవానె థామస్ విజేతలుగా నిలిచారు. ఫైనల్‌లో నందగోపాల్, వి.దిజును ఓడించారు.మహిళల డబుల్స్: సిక్కిరెడ్డి, ప్రద్న్యగాద్రే జోడి మహిళల డబుల్స్ టైటిల్ దక్కించుకున్నారు. ఫైనల్‌లో అపర్ణా బాలన్-సాన్యాగిత గోర్పడేలను ఓడించారు. మిక్స్‌డ్ డబుల్స్:ఈ టైటిల్‌ను సనావె థామస్, ప్రజక్తా జంట గెలుచుకుంది. వీరు ఫైనల్‌లో సిక్కిరెడ్డి - దిజు జంటపై విజయం సాధించారు.
సిద్దీకుర్‌కు హీరో ఇండియా ఓపెన్ గోల్ఫ్ టైటిల్
బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ సిద్దీకుర్ హీరో ఇండియా ఓపెన్ గోల్ఫ్ టైటిల్ గెలుచుకున్నాడు. న్యూఢిల్లీలో నవంబర్ 10న జరిగిన 50వ ఇండియన్ ఓపెన్ టైటిల్ విజేతగా సిద్దీకుర్ నిలిచాడు.
స్కేటింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో అనూప్ కుమార్‌కు స్వర్ణం
వరల్డ్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనూప్ కుమార్ స్వర్ణ పతకం సాధించాడు. చైనీస్ తైపీలో నవంబర్ 10న జరిగిన టోర్నీలో ఇన్‌లైన్ ఆర్టిస్టిక్ స్కేటింగ్‌లో అనూప్ పసిడి నెగ్గాడు. ప్రపంచ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం రావడం ఇదే తొలిసారి.
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ మహిళల రన్నరప్ భారత్
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ పురుషుల టైటిల్‌ను పాకిస్థాన్ గెలుచుకుంది. జపాన్‌లో నవంబర్ 11న జరిగిన ఫైనల్‌లో జపాన్‌ను ఓడించింది. చైనాను ఓడించి మలేషియా మూడో స్థానం, ఒమన్‌ను ఓడించి భారత్ ఐదో స్థానం దక్కించుకున్నాయి. మహిళల టైటిల్‌లో జపాన్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో భారత్‌పై నెగ్గింది. చైనాను ఓడించి మలేషియా మూడో స్థానం పొందింది.
ప్రపంచకప్ షూటింగ్‌లో హీనాకు స్వర్ణం
భారత షూటర్ హీనా సిద్ధూ ప్రపంచకప్ షూటింగ్‌లో స్వర్ణ పతకం గెలుచుకుంది. జర్మనీలో మ్యూనిచ్‌లో నవంబర్ 11న జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచింది. 2003లో అంజలి భగవత్, 2008లో గగన్ నారంగ్ తర్వాత ప్రపంచకప్‌లో స్వర్ణం గెలిచిన మూడో భారత వ్యక్తిగా హీనా రికార్డు సష్టించింది.


స్క్వాష్‌లో సౌరవ్ ఘోశల్ రికార్డు

ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రవేశించిన తొలి భారత క్రీడాకారుడుగా సౌరవ్ ఘోశల్ రికార్డు నెలకొల్పాడు. మాంచెస్టర్‌లో అక్టోబర్ 31 జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో ప్రపంచ 17వ ర్యాంకర్ ఘోశల్ అన్‌సీడెడ్ హెన్రిక్ ముస్టోనెన్‌ను ఓడించాడు.

ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల నుంచి వైదొలగిన సచిన్ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్‌ల నుంచి సచిన్ టెండ్కూలర్ విరమించుకున్నాడు.అక్టోబర్ 30న హర్యానాతో ముగిసిన రంజీ మ్యాచ్ సచిన్‌కు చివరిది. సచిన్ 1987-88లో గుజరాత్‌పై సెంచరీ చేసి తన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ను మొదలుపెట్టాడు. మొత్తం తన కెరీర్‌లో 308 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.

జకోవిచ్‌కు పారిస్ మాస్టర్స్ టైటిల్
పారిస్ మాస్టర్స్ టెన్నిస్ టైటిల్‌ను సెర్బియాకు చెందిన నొవాక్ జకోవిచ్ గెలుచుకున్నాడు. పారిస్‌లో నవంబర్ 3న జరిగిన ఫైనల్స్‌లో డేవిడ్ ఫై (స్పెయిన్)ను జకోవిచ్ ఓడించాడు.

వన్డే సిరీస్ విజేత భారత్
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 3-2 తేడాతో గెలుచుకుంది. ఏడు వన్డేల్లో రెండు వర్షం వల్ల రద్దవగా చివరిదైన బెంగళూరు వన్డేలో భారత్ విజేతగా నిలిచి సిరీస్‌ను దక్కించుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. చివరి వన్డేలో 16 సిక్సర్లు కొట్టి వన్డే మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్‌శర్మ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు షేన్‌వాట్సన్ (ఆస్ట్రేలియా, 15 సిక్సర్లు) పేరిట ఉంది. ఇదే మ్యాచ్‌లో రోహిత్ శర్మ 209 పరుగులు చేసి మరో రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన మూడో క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. ఇంతకుముందు సచిన్ టెండ్కూలర్ 2010లో దక్షిణాఫ్రికాపై 200 పరుగులతో నౌటౌట్‌గా నిలిచాడు. అదేవిధంగా 2011లో వెస్టిండీస్‌పై వీరేంద్ర సెహ్వాగ్ 219 పరుగులు సాధించి వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన క్రీడాకారుడిగా రికార్డు సష్టించాడు.

వెటెల్‌కు అబుదాబీ గ్రాండ్ ప్రి
ఫార్ములావన్ అబుదాబీ గ్రాండ్ ప్రి టైటిల్‌ను రెడ్‌బుల్ డ్రై వర్ సెబాస్టియన్ వెటెల్ గెలుచుకున్నాడు. నవంబర్ 3 అబుదాబీలో ముగిసిన రేసులో మార్క్‌వెబర్ రెండోస్థానంలో నిలవగా, నికో రోస్‌బర్గ్ మూడో స్థానం సాధించాడు.

ఆసియా ఆర్చరీలో భారత్‌కు రెండో స్థానం
18వ ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్ ఆరు పతకాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది. నవంబర్ 3న చైనీస్ తైపీలో ముగిసిన పోటీల్లో పది పతకాలతో దక్షిణ కొరియా ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. రికర్వ్ విభాగంలో జయంతా తాలుక్‌దార్, దీపికా కుమారిలతో కూడిన మిక్స్‌డ్ టీం ప్రపంచ చాంపియన్ దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణం సాధించింది. కాంపౌండ్ ఆర్చరీలో భారత పురుషుల బృందం దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పతకం గెలుచుకుంది.

No comments:

Post a Comment