AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday, 25 November 2017

అవార్డులు జనవరి 2015

అవార్డులు జనవరి 2015
తొమ్మిది మందికి పద్మ విభూషణ్
దేశంలో ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలు ‘పద్మ’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం జనవరి 25న ప్రకటించింది. 9 మందికి పద్మ విభూషణ్, 20మందికి పద్మ భూషణ్, 75 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు.
పద్మ విభూషణ్: ఎల్‌కే అద్వానీ (రాజకీయాలు), అమితాబ్ బచ్చన్ (కళలు), ప్రకాశ్ సింగ్ బాదల్ (రాజకీయాలు), డాక్టర్ డి.వీరేంద్ర హెగ్గడే (సామాజిక సేవ), దిలీప్ కుమార్ (కళలు), స్వామి రామభద్రాచార్య(ఆధ్యాత్మికం), ప్రొఫెసర్ రామస్వామి శ్రీనివాసన్ (సైన్స్), కొట్టాయన్ వేణుగోపాల్ (రాజకీయాలు), అల్ హుస్సేనీ అగాఖాన్ (వాణిజ్యం).
తెలుగువారికి పద్మశ్రీ అవార్డులు:మిథాలీ రాజ్ (క్రీడలు), పీవీ సింధు(క్రీడలు), డాక్టర్ మంజుల అనగాని (వైద్యం), కోట శ్రీనివాసరావు (కళలు). వైద్యులు నోరి దత్తాత్రేయుడు, పిళ్లరిశెట్టి రఘురామ్.
అరుంధతీ సుబ్రహ్మణ్యంకు కుశ్వంత్‌సింగ్ అవార్డు
ప్రముఖ రచయిత కుశ్వంత్‌సింగ్ స్మారక అవార్డుకు రచయిత్రి అరుంధతీ సుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన సాహితీ ఉత్సవాల్లో జనవరి 24న ఈ అవార్డును ప్రకటించారు. ఆమె రాసిన ‘వెన్ గాడ్ ఈజ్ ఏ ట్రావెలర్’కు పురస్కారం దక్కింది. తొలిసారిగా అందిస్తున్న ఈ అవార్డును ఇంగ్లిష్‌లో చేసిన రచనలకు, భారతీయ భాషల నుంచి ఇంగ్లిష్‌లోకి అనువదించే కవులకు అందజేస్తారు. రూ.2 లక్షల నగదును బహూకరిస్తారు.
ఎన్‌ఎండీసీకు బంగారు నెమలి అవార్డు
సామాజిక సేవలో మంచి పనితీరు కనపర్చినందుకుగాను 2014 సంవత్సరానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) విభాగంలో నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) బంగారు నెమలి అవార్డును గెలుచుకుంది.
సీవీ ఆనంద్‌కు జాతీయ పురస్కారం 
సార్వత్రిక ఎన్నికల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) జాతీయ ప్రత్యేక అవార్డును జనవరి 21న ప్రకటించింది. ఓటర్లను మభ్యపెట్టకుండా నగదు రవాణాను అడ్డుకోవడం, ఎన్నికల ప్రచారం, పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించినందుకు అవార్డును ప్రకటించారు.

గోల్డెన్ గ్లోబ్ అవార్డులు- 2015
72వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులను కాలిఫోర్నియాలో జనవరి 12న ప్రదానం చేశారు. వివరాలు..
  • ఉత్తమ చిత్రం (డామా): బాయ్ హుడ్
  • ఉత్తమ చిత్రం (మ్యూజికల్/కామెడీ): ద గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్
  • ఉత్తమ దర్శకుడు: రిచర్డ్ లింక్లేటర (బాయ్ హుడ్)
  • ఉత్తమ విదేశీ చిత్రం: లెవియాథన్ (రష్యా)
  • ఉత్తమ నటుడు: ఎడ్డీ రెడ్ మెయెనీ (చిత్రం: ద థియరీ ఆఫ్ ఎవిరీథింగ్)
  • ఉత్తమ నటి (డ్రామా): జులియినే మోరె (చిత్రం: స్టిల్ అలైస్)
  • ఉత్తమ నటుడు (మ్యూజికల్/ కామెడీ): మైఖల్ కీటన్ (బర్డ్ మెన్)
  • ఉత్తమ నటి (మ్యూజికల్ /కామెడీ): అమీ ఆడమ్స్ (బిగ్ ఐస్)
ఇస్రోకు స్పేస్ పయనీర్ -2015 అవార్డుఅమెరికాకు చెందిన జాతీయ అంతరిక్ష సంఘం (నేషనల్ స్పేస్ సొసైటీ ) స్పేస్ పయనీర్- 2015 అవార్డును భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు ఇవ్వనున్నట్లు జనవరి 13న ప్రకటించింది. ఇస్రో అంగారక యాత్ర మంగళ్‌యాన్ చేపట్టిన బృందానికి ఈ పురస్కారాన్ని అందించనున్నట్లు తెలిపింది. 

జమ్మూకాశ్మీర్‌కు ఈ- గవర్నెన్స్ అవార్డు2014-15 సంవత్సరానికి ఈ- గవర్నెన్స్ జాతీయ అవార్డు జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి లభించింది. జిల్లా స్థాయిలో సమర్థవంతంగా సేవలు అందించినందుకు బహుమతిని అందజేస్తున్నట్లు జనవరి 16 ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డును ప్రధానమంత్రి కార్యాలయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని పరిపాలనా సంస్కరణల విభాగం అందజేస్తుంది.

No comments:

Post a Comment