క్రీడలు మే 2014
ఐపీఎల్ విజేత కోల్‌కత నైట్‌ైరె డర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-7 క్రికెట్ టోర్నమెంట్ విజేతగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నిలిచింది. జూన్ 1న బెంగళూరులో జరిగిన ఫైనల్లో కింగ్‌స ఎలెవన్ పంజాబ్‌ను ఓడించి రెండోసారి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది (2012లో జరిగిన ఐపీఎల్-5 టైటిల్ కోల్‌కతా మొదటిసారి గెలుచుకుంది). తద్వారా రూ. 15 కోట్ల ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది. రన్నరప్‌గా నిలిచిన పంజాబ్‌కు రూ.10 కోట్లు లభించింది. ఐపీఎల్-7 విశేషాలు మ్యాన్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్: మనీష్ పాండే (కోల్‌కత); అత్యంత విలువైన ఆటగాడు: మాక్స్‌వెల్ (పంజాబ్); ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు): రాబిన్ ఉతప్ప (కోల్‌కత); పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు): మోహిత్‌శర్మ (చెన్నై); ఎమర్జింగ్ క్రికెటర్: అక్షర్ పటేల్ (పంజాబ్); ఫెయిర్ ప్లే అవార్డు: చెన్నై సూపర్ కింగ్స్.
సియట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా కోహ్లి
2014 సంవత్సరానికి సియట్ క్రికెట్ అవార్డులను జూన్ 2న ముంబైలో ప్రదానం చేశారు. వివరాలు... క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: విరాట్ కోహ్లి (2010-11లోనూ ఈ అవార్డును కోహ్లియే అందుకున్నాడు); వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్: శిఖర్ ధావన్ (భారత్); ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్: రవి చంద్రన్ అశ్విన్; ఉత్తమ అంతర్జాతీయ టెస్ట్ క్రికెటర్: మిచెల్ జాన్సన్ (ఆస్ట్రేలియా); టి20 క్రికెటర్: షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్). పాపులర్ వాయిస్ అవార్డు: గ్లెన్ మ్యాక్స్ వెల్ (ఆస్ట్రేలియా); యంగ్ ప్లేయర్ అవార్డు: విజయ్‌జోల్ (మహారాష్ట్ర); లైఫ్ టైం అఛీవ్‌మెంట్ అవార్డు: సయ్యద్ కిర్మానీ (భారత్).
ఉబెర్‌కప్ విజేత చైనా
మహిళల ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఉబెర్‌కప్‌ను చైనా గెలుచుకుంది. న్యూఢిల్లీ వేదికగా మే 24న జరిగిన పైన ల్లో జపాన్‌ను ఓడించింది. తద్వారా 13వ సారిగా ఈ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న ఘనతను సాధించింది. సెమీఫైనల్‌లో ఓడిన భారత్, దక్షిణకొరియా జట్లకు కాంస్య, రజత పతకాలు దక్కాయి.
జపాన్‌కు థామస్‌కప్
పురుషుల ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ థామస్ కప్‌ను జపాన్ జట్టు గెలుచుకుంది. న్యూఢిల్లీలో మే 25న జరిగిన ఫైనల్లో మలేషియాను ఓడించి తొలిసారి థామస్ కప్ విజేతగా నిలిచింది. ఈ ఏడాది ప్రతిష్టాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య అవార్డులకు పురుషుల విభాగంలో లీ చోంగ్ వీ (మలేషియా), మహిళల విభాగంలో లీజురుయ్ (చైనా) ఎంపికయ్యారు.
మొనాకో గ్రాండ్ ప్రీ విజేత రోస్‌బర్గ్
మొనాకో గ్రాండ్ ప్రీ విజేతగా మెర్సిడెస్ జట్టు డ్రైవర్ రోస్‌బర్గ్ నిలిచాడు. ఈ సీజన్‌లో రోస్‌బర్గ్‌కు ఇది రెండో విజయం. మోంటెకార్లోల్లో జరిగిన రేస్‌లో మెర్సిడెస్ జట్టుకు చెందిన హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు.
ఐపీఎల్ ఫిక్సింగ్‌పై విచారణకు ముద్గల్ కమిటీ
2013 ఐపీఎల్‌లో నెలకొన్న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌లపై పూర్తి స్థాయి విచారణకు రిటైర్డ్ జడ్జి ముకుల్ ముద్గల్ నేతృత్వంలోని కమిటీకి సుప్రీంకోర్టు అంగీకరించింది. కమిటీలో సభ్యులుగా ఎల్. నాగేశ్వరరావు, నిలయ్‌దత్తా కొనసాగనున్నారు. గతంలో ఇదే విషయంపై ప్రాథమిక విచారణను పూర్తి చేసి సీల్డ్‌కవర్‌లో కోర్టుకు అప్పగించినది ముద్గల్ కమిటీయే.
20వ జాతీయ మహిళా ఫుట్‌బాల్ ఛాంప్స్ మణిపూర్
20వ జాతీయ మహిళల సీనియర్ ఫుట్‌బాల్ చాంపియన్ షిప్‌ను మణిపూర్ జట్టు కైవసం చేసుకొంది. మణిపూర్ జట్టుకు ఈ టైటిల్ 17వది.
జకోవిచ్‌కు రోమ్ మాస్టర్స్‌టైటిల్
రోమ్ మాస్టర్స్ టైటిల్‌ను నోవాక్ జొకోవిచ్ గెలుచుకున్నాడు. రోమ్‌లో మే 18న జరిగిన ఫైనల్లో నాదల్‌ను జొకోవిచ్ ఓడించాడు. కాగా ఇటాలియన్ ఓపెన్ టైటిల్ విజేతగా సెరెనా విలియమ్స్ నిలిచింది. ఫైనల్లో అన్న ఇవనోవిచ్‌ను ఓడించింది.
భారత్‌కు దక్షిణాసియా బాస్కెట్‌బాల్ టైటిల్ దక్షిణాసియా
బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు విజేతగా నిలిచింది.ఈ విజయంతో దక్షిణాసియాలో నంబర్ వన్ జట్టుగా నిలిచిన భారత్ జులైలో చైనాలో జరిగే ఆసియాకప్‌కు అర్హత సాధించింది.
టేబుల్‌టెన్నిస్ చాంపియన్ చైనా
వరల్డ్ టీం టేబుల్‌టెన్నిస్ చాంపియన్ షిప్‌లో చైనాకు చెందిన పురుషుల, మహిళల జట్లు విజేతలుగా నిలిచాయి. టోక్యోలో మే 4న ముగిసిన పోటీల్లో పురుషుల జట్టు జర్మనీని, మహిళల జట్టు జపాన్‌ను ఓడించాయి. కాగా మహిళల జట్టు ఈ టైటిల్‌ను 19 వసారి గెలవడం విశేషం.
హామిల్టన్‌కు స్పానిష్ గ్రాండ్ ప్రి
ప్రపంచ మాజీ చాంపియన్ హామిల్టన్ స్పానిష్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను గెలుచుకున్నాడు. బార్సిలోనాలో మే 11న జరిగిన ఫార్ములావన్ స్పానిష్ గ్రాండ్ ప్రి ని మెర్సిడెస్ జట్టు డ్రై వర్ లూయిస్ హామిల్టన్ తొలిస్థానంలో నిలిచి టైటిల్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుత సీజన్‌లో హామిల్టన్‌కు ఇది వరుసగా నాలుగో గ్రాండ్ ప్రి టైటిల్. కాగా రెండో స్థానంలో నిలిచిన రోస్‌బర్గ్ కూడా మెర్సిడెస్ జట్టుకు చెందిన వాడే కావడం విశేషం.
నాదల్, షరపోవాలకు మాడ్రిడ్ టైటిల్
మాడ్రిడ్ మాస్టర్స్ టైటిల్ విజేతగా రఫెల్ నాదల్ నిలిచాడు. ఫైనల్‌లో ప్రత్యర్థి నిషికోరి (జపాన్) మ్యాచ్ మధ్యనుంచి అర్థంతరంగా వైదొలగడంతో నాదల్‌ను విజేతగా ప్రకటించారు. నాదల్ కెరీర్‌లో ఇది నాలుగో మాడ్రిడ్ మాస్టర్స్ టైటిల్. మహిళల విభాగంలో మరియా షరపోవా టైటిల్‌ను సొంతం చేసుకుంది. మాడ్రిడ్‌లో మే 11న జరిగిన ఫైనల్స్‌లో సిమోనా హలీస్‌ను షరపోవా ఓడించింది. ప్రస్తుత సీజన్‌లో షరపోవాకు ఇది రెండో క్లే కోర్టు టైటిల్.
ప్రపంచ స్నూకర్ విజేత మార్క్ సెల్బీ
వరల్డ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌ను మార్క్ సెల్బీ గెలుచుకున్నాడు. షీఫీల్డ్‌లో మే 6న ముగిసిన పోటీల్లో రోనీ ఓ సల్లివాన్‌ను సెల్బీ ఓడించాడు. సెల్బీ ఈ టైటిల్ విజేతగా నిలవడం ఇదే తొలిసారి. సల్లివాన్ గతంలో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు.
మాడ్రిడ్ నగర దత్త పుత్రుడిగా నాదల్ ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారుడు రఫెల్‌నాదల్‌ను మాడ్రిడ్ నగరం తమ దత్త పుత్రుడిగా ప్రకటించింది. ఈ అవార్డును మాడ్రిడ్ నగర మేయర్ అనా బొటెల్లా మే 5న నాదల్‌కు అందించారు. 2013లో జరిగిన ఓటింగ్‌లో నాదల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఎవరినైనా దత్తపుత్రుడిగా కానీ, దత్త పుత్రికగా కానీ స్వీకరించడం మాడ్రిడ్ నగరవాసుల దృష్టిలో అతి పెద్ద గౌరవం.
ప్రపంచ వాకింగ్‌లో ఇర్ఫాన్‌కు 26వ స్థానంచైనాలోని తైసాంగ్‌లో జరిగిన ప్రపంచ రేస్ వాకింగ్ కప్‌లో భారత వాకర్ తోడి ఇర్ఫాన్ 26వ స్థానంలో నిలిచాడు. ఈ పోటీలో 20 కిలోమీటర్ల దూరాన్ని ఇర్ఫాన్ 1:21:09 గంటల సమయంలో పూర్తి చేశాడు. ఐదుగు రు సభ్యుల భారత బృందంలో ఇదే అత్యుత్తమ ప్రతిభ. 17 జట్లు పాల్గొన్న ఈ పోటీ లో భారత్‌కు 8వ స్థానం దక్కింది. ఉక్రెయిన్‌కు చెందిన రుస్లాన్ డిమెంట్రెంకో మొదటి, కాయ్‌జెలీన్ రెండోస్థానంలో నిలిచారు.
పోర్చుగల్ ఓపెన్‌లో సానియా జంటకు టైటిల్ పోర్చుగ ల్ ఓపెన్ టెన్నిస్ డబుల్స్ విజేతగా సానియా మీర్జా జంట నిలిచింది. మే 3న జరిగిన ఫైనల్లో సానియా, ఆమె సహచర క్రీడాకారిణి కారాబ్లాక్ (జింబాబ్వే) తో కలిసి ఇవా హిదినోవా (చెక్ రిపబ్లిక్), వలెరియా సొలోవ్యెవా (రష్యా) జంటపై నెగ్గి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.
ఆసియా స్నూకర్‌లో కమల్‌కు కాంస్యంఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత స్నూకర్ ఆటగాడు కమల్ చావ్లా కాంస్యం సాధించాడు. మే 3న యూఏఈలో నిర్వహిం చిన సెమీ ఫైనల్‌లో మలేషియాకు చెందిన చువాన్ లియోంగ్‌ధోర్ చేతిలో చావ్లా ఓటమిపాలై మూడో స్థానంలో నిలిచాడు.
డోపీంగ్‌లో పట్టుబడిన టైసన్ గే అమెరికా అథ్లెటిక్ స్ప్రింట్ స్టార్ టైసన్ గే డోపింగ్‌లో పట్టుబడ్డాడు. పోటీలు లేనప్పుడు (ర్యాండమ్ అవుట్ ఆఫ్ కాంపిటీషన్) నిర్వహించిన రెండు పరీక్షలతో పాటు మరో ఈవెంట్ పరీక్షలోనూ టైసన్ నిషేధిత ఉత్ప్రేరకాలను వాడినట్లు రుజువైంది. దాంతో అమెరికా యాంటీ డోపింగ్ అసోసియేషన్ అతనిపై ఏడాది పాటు నిషేధం విధించింది.

No comments:
Post a Comment