AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

అవార్డులు సెప్టెంబరు 2016

అవార్డులు సెప్టెంబరు 2016
మహబూబ్‌నగర్ ఎస్పీకి ‘దేవి’ అవార్డు 
జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా భావించే దేవి అవార్డుకు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఎంపికయ్యారు. రాజేశ్వరి జిల్లా ఎస్పీగా హైదరాబాద్‌లో పనిచేసిన సమయంలో షీ టీమ్‌ల ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించడంతో పాటు సాధారణ, ఉప ఎన్నికల నిర్వహణ, కృష్ణా పుష్కరాలలో అత్యుత్తమంగా పని చేసినందుకు ఈ అవార్డును అందచేశారు. దేవి అవార్డును ఢిల్లీకి చెందిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అనే స్వచ్ఛంద సంస్థ వారు ప్రతి ఏడాది అందజేస్తారు. 
కొలకలూరి ఇనాక్‌కు మూర్తిదేవి పురస్కారం 
ప్రముఖ తెలుగు రచయిత ఆచార్య కొలకలూరి ఇనాక్‌కు 2015 సంవత్సరానికిగాను ప్రతిష్టాత్మక మూర్తిదేవి పురస్కారాన్ని ప్రకటించారు. ఆయన రాసిన ‘అనంత జీవనం’ నవలకు భారతీయ జ్ఞానపీఠ్ సంస్థ అవార్డును అందచేయనుంది. అనంతపురం జిల్లాలో ఓరోజు కురిసిన భారీ వర్షపు నీటిని ప్రజలు ఎలా వాడుకున్నారో ‘అనంత జీవనం’లో చిత్రించారు. ఎస్‌వీ వర్సిటీ వైన్స్‌చాన్స్‌లర్‌గా పనిచేసిన ఇనాక్ పద్మశ్రీతో సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 
హెచ్‌సీయూ ప్రొఫెసర్ కు భట్నాగర్ అవార్డు 
మానవులకు హాని చేసే మూడు రకాల క్రిములపై పరిశోధనలు చేస్తున్న హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఏఎస్ నియాజ్ అహ్మద్ 2016 సంవత్సరానికి గాను శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుకు ఎంపికయ్యాడు. గ్యాస్ట్రిక్, క్యాన్సర్, అల్సర్లకు కారణమయ్యే హెలికోబ్యాక్టర్ పైలోరీ, క్షయ వ్యాధికి కారణమయ్యే మైకోబ్యాక్టీరియం ట్యుబర్ క్యులోసిస్‌ను నిద్రాణంలో ఉంచడం, మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ కలిగించే యూరో పాథోజెనిక్ ఈ కోలై బ్యాక్టీరియాపై చేస్తున్న పరిశోధనలకు ఆయనకు మెడికల్ సైన్స్ విభాగంలో ఈ అవార్డు దక్కింది. 

నియాజ్ అహ్మద్ మహారాష్ట్రలోని అకోలా జిల్లాకు చెందినవాడు. వెటర్నరీ మెడిసిన్, పీహెచ్‌డీ చేసిన అహ్మద్ 1998లో హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్‌ఏ, ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోసిస్‌లో చేరి పదేళ్లపాటు పనిచేశాడు. 2008 నుంచి హెచ్‌సీయూలో పనిచేస్తున్నాడు. 

శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును శాస్త్రసాంకేతిక రంగంలో విశేష కృషి చేసిన వారికి సీఎస్‌ఐఆర్ ప్రదానం చేస్తుంది. దీనిని సీఎస్‌ఐఆర్ వ్యవస్థాపకుడు శాంతి స్వరూప్ భట్నాగర్ పేరు మీద 1958 నుంచి ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా 2016కు గాను 11 మందికి భట్నాగర్ అవార్డును ప్రకటించింది. 
2016 భట్నాగర్ అవార్డు గ్రహీతలు Recipients - Category 
Rishikesh Narayanan and Suvendra Nath Bhattacharya -
Biologial science 
Partha Sarthi Mukherjee - Chemical Sciences 
Sunil Kumar Singh - Earth, Atmosphere, Ocean and Planetary Sciences 
Avinash Kumar Agarwal and Venkata Narayana Padmanabhan - Engineering Sciences 
Amlendu Krishna and Naveen Garg - Mathematical Sciences 
Niyaz Ahmed A S- Medical Sciences 
Subramanian Anantha Ramakrishna and Sudhir Kumar Vempati - Physical Sciences


అబ్రహాంకు యూఎస్ జాతీయ మానవీయ పతకం
భారత అమెరికన్ వైద్యుడు, రచయిత అబ్రహాం వర్గీస్ ప్రతిష్టాత్మక అమెరికా జాతీయ మానవీయ పతకానికి (నేషనల్ హ్యుమానిటీస్ మెడల్) ఎంపికయ్యారు. వైద్య సంస్థలో రోగిని కేంద్ర బిందువుగా మనందరికీ గుర్తుచేసినందుకు ఆయనకు ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు అమెరికా అధ్యక్ష భవనం (వైట్‌హౌస్) తెలిపింది.
రమేశ్ రాస్కర్‌కు యూఎస్ ఈ లెమెల్సెన్-ఎంఐటీ అవార్డు
భారత సంతతి శాస్త్రవేత్త రమేశ్ రాస్కర్‌కు 2016 సంవత్సరానికి అమెరికాకు చెందిన ఈ లెమెల్సెన్-ఎంఐటీ అవార్డు లభించింది. మానవాళి జీవనాన్ని మెరుగుపర్చేందుకు చేసిన కృషికి ఆయనకు ఈ బహుమతి దక్కింది. దీని కింద ఐదు లక్షల డాలర్లు బహూకరిస్తారు.
లతా మంగేష్కర్‌కు బంగ విభూషణ్ అవార్డు
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్‌కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సెప్టెంబర్ 18న బంగ విభూషణ్ అవార్డు ప్రకటించింది. 2011లో ప్రారంభించిన ఈ అవార్డు కింద 2 లక్షల నగదు, మెమెంటో అందచేస్తారు. అవార్డు మొదటి గ్రహీత అమలా శంకర్.

ముంబై రచయిత్రికి ఎఫ్‌ఓఎన్ పురస్కారం
కుమొన్ లిటరరీ ఫెస్టివల్ ‘ఎఫ్‌ఓఎన్ (ఫెలోస్ ఆఫ్ నేచర్) సౌత్ ఏషియా స్టోరీ’ పురస్కారానికి ముంబై రచయిత్రి మేఘనా పంత్ ఎంపికయ్యారు. ‘పీపుల్ ఆఫ్ ది సన్’ అనే కథకు గాను మేఘనకు ఈ గౌరవం దక్కింది. ఫ్రెంచ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో కుమొన్ లిటరరీ ఫెస్టివల్ నిర్వాహకులు ఈ అవార్డును అందచేస్తున్నారు. ప్రకృతి సంబంధిత అంశాల్లో సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఈ పురస్కారం కింద గ్రహీతకు రూ.లక్ష నగదు అందజేస్తారు.
 
విశాఖ ఉక్కుకు సీఐవో-100 అవార్డు
సాంకేతిక పరిజ్ఞానం (ఐటీ)లో చూపిన ప్రతిభకు గాను విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సీఐవో-100 అవార్డు వరించింది. ప్రపంచంలో అతి  పెద్ద టెక్నాలజీ మీడియా, ఈవెంట్స్, రీసెర్చ్ సంస్థ ఇంటర్నేషనల్ డాటా గ్రూప్ (ఐడీజీ) ఐటీలో ప్రతిభ చూపిన ప్రపంచంలోని వంద సంస్థలకు ఈ అవార్డును ఇస్తుంది. సీఐవో మ్యాగజీన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11న పుణేలో జరిగిన పదకొండో వార్షిక సీఐవో సింపోజియం కార్యక్రమంలో అవార్డును అందచేశారు.

విల్సన్, కృష్ణలకు రామన్ మెగసెసే ప్రదానం
సఫారు కర్మచార్ జాతీయ అధ్యక్షుడు బెజవాడ విల్సన్, కర్ణాటక సంగీత విధ్వాంసుడు టీఎం కృష్ణతోపాటు మరో నలుగురు(ఫిలిప్పీన్‌‌స, ఇండోనేషియా, జపాన్‌కు చెందినవారు) 2016 సంవత్సరానికిగాను ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డును అందుకున్నారు. ఆసియా నోబెల్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కార ప్రదానోత్సవం మనీలాలో ఆగస్టు 31న జరిగింది.
 
జాకీచాన్‌కు లైఫ్‌టైమ్ ఆస్కార్ 
మార్షల్ ఆర్‌‌ట్స నిపుణుడు, నటుడు జాకీచాన్‌కు జీవిత సాఫల్య ఆస్కార్ అవార్డు దక్కింది. నవంబర్‌లో లాస్ ఏంజెల్స్‌లో నిర్వహించే 2016 గవర్నర్స్ అవార్డుల ప్రదానోత్సవంలో జాకీచాన్‌కు ఆస్కార్‌ను అందచేస్తారు. హాంగ్‌కాంగ్‌లో పుట్టిన జాకీచాన్ ఎనిమిదేళ్ల వయసులో నటనా రంగంలో అడుగుపెట్టి ముప్పైకి పైగా మార్షల్ ఆర్‌‌ట్స ప్రధాన చిత్రాల్లో నటించారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన జాబితాలో ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకునే సెలబ్రిటీల జాబితాలో జాకీ చాన్ రెండో స్థానంలో నిలిచారు.
 
యోగాలో నెల్లూరు బాలికకు మూడు స్వర్ణాలు
వియత్నాం రాజధాని హునాయ్‌లో జరిగిన 6వ ఏషియన్ యోగా చాంపియన్‌షిప్-2016 పోటీల్లో నెల్లూరుకు చెందిన ఏకాంబరం జ్యోష్ణవి మూడు బంగారు పతకాలు సాధించింది. అండర్-17 విభాగంలో పోటీ పడి వ్యక్తిగత యోగాసన, ఆర్టిస్టిక్, రిథమిక్ యోగా పోటీల్లో విజేతగా నిలిచి మూడు బంగారు పతకాలు, వ్యక్తిగత సోలో ఆర్టిస్టిక్ పోటీల్లో రజత పతకాన్ని సాధించింది. దీంతో డిసెంబర్‌లో దక్షిణ అమెరికాలో జరిగే వరల్డ్ యోగా చాంపియన్‌షిప్ పోటీలకు జ్యోష్ణవి అర్హత సాధించింది.
 
ఎస్‌బీఐకి ఐదు అవార్డులుప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్‌బీఐ తాజాగా ‘డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్’ ‘ఇండియా టాప్ బ్యాంక్స్ అండ్ బ్యాకింగ్ అవార్డ్స్-2016’ పదవ ఎడిషన్‌లో ఐదు అవార్డులను పొందింది. ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఎనిమిది కేటగిరిలకు గానూ రిటైల్ బ్యాంకింగ్, రూరల్ రీచ్, గ్లోబల్ బిజినెస్ డెవలప్‌మెంట్, టెక్నాలజీ అడాప్షన్, ఓవరాల్ బెస్ట్ బ్యాంక్ అనే ఐదు కేటగిరిలలో ఎస్‌బీఐకి అవార్డు దక్కింది.
 
యార్లగడ్డకు శ్రీకృష్ణదేవరాయ పురస్కారం
కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు 2016 ఏడాదికిగాను శ్రీకృష్ణదేవరాయ పురస్కారం దక్కింది. తెలుగు, హిందీల్లో 70 పుస్తకాలు రచించిన యార్లగడ్డ సాహిత్యరంగంలో చేసిన విశేష సేవలకుగాను తెలుగు విజ్ఞాన సమితి సెప్టెంబర్ 3న ఈ అవార్డును ప్రకటించింది.
గతంలో ఈ పురస్కారాన్ని ఎన్టీఆర్, ఏఎన్నార్, సినారె, ఎస్పీ బాలసుబ్రమణ్యం, సుశీల, జేసుదాస్, సరోజా దేవి, యూఆర్ అనంతమూర్తికి అందించారు. యార్లగడ్డతోపాటు నటులు సాయికుమార్, డా.జయప్రదలకూ ఈ పురస్కారాన్ని ప్రకటించారు.
 
పట్నాయక్ సైకత శిల్పానికి రష్యాలో పురస్కారం
ఇసుకతో శిల్పాలకు ప్రాణం పోసే ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్‌కు రష్యాలో పీపుల్స్ చాయిస్ అవార్డు దక్కింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రష్యాలో జరిగిన సైకత శిల్ప పోటీలో వివిధ దేశాలకు చెందిన 20 మంది సైకత శిల్పులు పాల్గొన్నారు. ఇందులో అహింస, శాంతి కోసం మహాత్మాగాంధీ పేరుతో పట్నాయక్ సృజించిన సైకత శిల్పం అత్యధిక ప్రజాదరణ పొంది బహుమతి గెలుచుకుంది.

No comments:

Post a Comment