AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

క్రీడలు డిసెంబరు 2012

క్రీడలు డిసెంబరు 2012
జయవర్ధనే రికార్డుశ్రీలంక కెప్టెన్ మహేల జయవర్ధనే క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల (టెస్ట్, వన్డే, టీ20)లో కలిపి 400 క్యాచ్‌లు అందుకున్న ఏకైక ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వికెట్ కీపర్లను మినహాయిస్తే ఇన్ని క్యాచ్‌లు అందుకున్న ఏకైక ఫీల్డర్‌గా మహేల రికార్డు సష్టించాడు. ఇతని తర్వాతి స్థానంలో జాక్ కలిస్ (దక్షిణాఫ్రికా- 324 క్యాచ్‌లు) ఉన్నాడు.

కశ్యప్‌కు ఇండియా గ్రాండ్ ప్రి టైటిల్సయ్యద్ మోడీ ఇండియా గ్రాండ్ ప్రి టైటిల్‌ను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పారుపల్లి కశ్యప్ గెలుచుకున్నాడు. ముంబైలో ముగిసిన ఈ టోర్నమెంట్‌లో మహిళల విభాగంలో ఫానెత్రి (ఇండోనేషియా) విజేతగా నిలిచింది.

పాక్‌కు ఆసియా చాంపియన్స్ ట్రోఫీఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌ను పాకిస్థాన్ గెలుచుకుంది. దోహాలో 2012, డిసెంబర్ 27న జరిగిన ఫైనల్లో భారత్‌ను ఓడించింది.

టోనీ గ్రెగ్ మతిప్రఖ్యాత క్రికెట్ కామెంటేటర్, మాజీ క్రికెటర్ టోనీ గ్రెగ్ (66) 2012, డిసెంబర్ 29న ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మరణించారు. ఈయన ఇంగ్లండ్ జట్టుకు 58 టెస్టు మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం వహించారు. 1977లో క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వాత గ్రెగ్ కామెంటేటర్‌గా స్థిరపడ్డారు.

అంధుల ప్రపంచ కప్ విజేత భారత్అంధుల క్రికెట్‌లో తొలి టి20 ప్రపంచ కప్‌ను భారత్ కైవసం చేసుకుంది. డిసెంబర్ 13న బెంగళూరులో జరిగిన ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. 

సిరీస్ విజేత ఇంగ్లండ్భారత్‌తో జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ జట్టు 2-1 తేడాతో గెలుచుకుంది. ఈ గెలుపుతో 28 ఏళ్ల (1984-85) తర్వాత ఇంగ్లండ్ జట్టు భారత్‌లో టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్) ఎంపికయ్యారు.

ప్రపంచ మైండ్ గేమ్ చెస్చైనా రాజధాని బీజింగ్‌లో డిసెంబర్ 15న ముగిసిన ప్రపంచ మైండ్ గేమ్ చెస్ టోర్నమెంట్‌లో ఉక్రెయిన్ క్రీడాకారిణి కేటరీనా మొదటి స్థానంలో నిలిచింది. చైనా క్రీడాకారిణి హోయిఫాన్ రెండో స్థానంలో నిలవగా, భారత్‌కు చెందిన కోనేరు హంపి మూడో స్థానం దక్కించుకుంది.

భారత్‌కే ప్రపంచ కబడ్డీ టైటిల్స్‘సర్కిల్ స్టయిల్’ క బడ్డీ ప్రపంచ కప్‌లో భారత్ ‘డబుల్’ సాధించింది. పురుషుల, మహిళల రెండు విభాగాలలో విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలో డిసెంబర్ 14న జరిగిన ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. మహిళల ఫైనల్లో భారత్ మలేషియాను ఓడించింది. భారత పురుషుల జట్టుకు ట్రోఫీలతో పాటు రూ.2 కోట్ల ప్రెజ్‌మనీ దక్కింది. 

ప్రపంచ జూనియర్ టీటీలో చైనా క్లీన్‌స్వీప్హైదరాబాద్‌లో ముగిసిన ప్రపంచ జూనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో చైనా క్లీన్‌స్వీప్ చేసింది. డిసెంబర్ 16న ముగిసిన ఈ పోటీల్లో ఐదు విభాగాల్లో చైనా ఆటగాళ్లే విజేతలుగా నిలిచారు. వారి వివరాలు: బాలుర సింగిల్స్-జెన్‌డాంగ్. బాలికల సింగిల్స్: జు యులింగ్ . బాలుర డబుల్స్: లిన్ గయూన్-జు చెన్హావో జోడి. బాలికల డబుల్స్: గు యుటింగ్- జు యులింగ్ జంట. మిక్స్‌డ్ డబుల్స్: ఫాన్ జెన్‌డాంగ్-లి గయాంగ్ జంట. బాలుర, బాలికల టీమ్ టైటిల్స్‌ను కూడా చైనానే నెగ్గింది.

ఐఓఏపై ఐఓసీ సస్పెన్షన్భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ)పై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) డిసెంబర్ 4న సస్పెన్షన్‌ను విధించింది. ఐఓఏ ఎన్నికల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ మేరకు లుసానేలో జరుగుతున్న ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని భారత్ కోల్పోతుంది. ఈ సస్పెన్షన్‌ను ఐఓఏ ‘కోర్టు ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్’లో మాత్రమే సవాల్ చేసే అవకాశం ఉంటుంది. భారత ప్రభుత్వం రూపొందించిన ‘స్పోర్ట్స్ కోడ్’ ప్రకారం ఎన్నికలు నిర్వహించొద్దని, ఒలింపిక్ చార్టర్ ప్రకారమే జరపాలని ఐఓసీ చాలాసార్లు హెచ్చరించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్నికలు జరిపితే వాటి ఫలితాలను పరిగణనలోకి తీసుకోబోమని కూడా పలుమార్లు పేర్కొంది. అయినప్పటికీ ప్రభుత్వ స్పోర్ట్స్ కోడ్ ప్రకారం ఎన్నికలు నిర్వహించడంతో ఐఓసీ సస్పెన్షన్ విధించింది. సస్పెన్షన్ అమలైతే ఐఓసీ నుంచి నిధులు రావు. ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్, ఆసియా క్రీడలతో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో పాల్గొనే అర్హతను భారత్ కోల్పోతుంది. అథ్లెట్లెవరూ భారత్ తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ఉండదు. ఒకవేళ పాల్గొనాల్సి వస్తే ఐఓసీ పతాకం కింద బరిలోకి దిగాల్సి ఉంటుం ది. గతంలో జాతి వివక్ష కారణంగా దక్షిణాఫ్రికా, ప్రభుత్వ జోక్యంతో కువైట్‌లపై ఐఓసీ సస్పెన్షన్ వేటు వేసింది. ఒలింపిక్ కమిటీలను ఏర్పాటు చేయనందుకు నెదర్లాండ్స్, దక్షిణ సుడాన్‌లు ఇలాంటి నిషేధాలకే గురయ్యాయి.

మెస్సీ ప్రపంచ రికార్డుఅర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఒకే ఏడాది అత్యధిక గోల్స్ సాధించిన క్రీడాకారుడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. స్పానిష్ లీగ్‌లో బార్సిలోనా క్లబ్ జట్టుకు ఆడుతున్న మెస్సీ ఈ సంవత్సరం 86 గోల్స్ చేశాడు. దాంతో 85 గోల్స్‌తో 1972లో జర్మనీ దిగ్గజం గెర్డ్ ముల్లర్ నెలకొల్పిన రికార్డు తెరమరుగైంది.

చాంపియన్స్ ట్రోఫీ విజేత ఆస్ట్రేలియాచాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌ను ఆస్ట్రేలియా జట్టు గెలుచుకుంది. మెల్‌బోర్న్‌లో డిసెంబర్ 9న ముగిసిన ఫైనల్లో నెదర్లాండ్స్‌ను ఓడించి ఐదోసారి ఈ టైటిల్‌ను సాధించింది. ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు నాలుగో స్థానం దక్కింది.

హైదరాబాద్‌లో ప్రపంచ జూనియర్ టీటీ టోర్నీప్రపంచ జూనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్ డిసెంబర్ 9న ప్రారంభమైంది. భారత్‌తో పాటు చైనా, జపాన్, జర్మనీ, పోలండ్, బెల్జియం, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, చెక్ రిపబ్లిక్ తదితర దేశాల నుంచి దాదాపు 170 మంది ఆటగాళ్లు ఇందులో పాల్గొంటున్నారు. ఈ నెల 16 వరకు టోర్నీ జరుగుతుంది.

హాకీ టోర్నీ విజేత ఆస్ట్రేలియా
నాలుగు దేశాల సూపర్-9 హాకీ టోర్నమెంట్‌ను ఆస్ట్రేలియా జట్టు గెలుచుకుంది. పెర్త్ (ఆస్ట్రేలియా) లో నవంబర్ 26న ముగిసిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు నాలుగో స్థానం దక్కింది.

కామన్వెల్త్ చాంప్ లలిత్ కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ లలిత్‌బాబు గెలుచుకున్నాడు. డిసెంబర్ 1న చెన్నైలో ముగిసిన ఈ టోర్నీలో చెన్నై ఆటగాళ్లు శ్యామ్‌సుందర్, సేతురామన్ వరుసగా కామన్వెల్త్ రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. మహిళల విభాగంలో సౌమ్య స్వామినాథన్ స్వర్ణం గెలుపొందగా, నిషా మెహతా రజతం, మేరీ అన్ గోమ్స్ కాంస్యం చేజిక్కించుకున్నారు. ఇదే టోర్నీ అండర్-16 విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి ప్రత్యూష స్వర్ణం సాధించింది. 

డబ్ల్యూటీఏ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ సెరెనాఅమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ డబ్ల్యూటీఏ (ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్) ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికైంది. సెరెనా 2012లో వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిళ్లతోపాటు లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకుంది. ఈ అవార్డు గెలుచుకోవడం సెరెనాకు ఇది నాలుగోసారి. స్టెఫీ గ్రాఫ్ (8 సార్లు), మార్టినా నవ్రతిలోవా (7 సార్లు) మాత్రమే సెరెనా కంటే ఎక్కువ సార్లు ఈ ఘనత సాధించారు. 

జడేజా రికార్డుఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్‌లో మూడు ట్రిపుల్ సెంచరీలు సాధించిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్ రవీంద్ర జడేజా రికార్డు సృష్టించాడు. రైల్వేస్‌తో డిసెంబర్ 4న ముగిసిన రంజీ మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఎనిమిదో ఆటగాడు జడేజా. ఈ జాబితాలో మిగతా ఆటగాళ్లు డాన్ బ్రాడ్‌మన్, డబ్ల్యుజీ గ్రేస్, పాన్స్‌ఫోర్డ్, వాలీ హామండ్, గ్రేమ్ హిక్, లారా, మైక్ హస్సీ. 

ప్రపంచ చెస్ చాంపియన్ ఉషెనినాఉక్రెయిన్ క్రీడాకారిణి అన్నా ఉషెనినా మహిళల ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌ను దక్కించుకుంది. ఖాంటి మాన్సిస్క్ (రష్యా)లో ముగిసిన టోర్నమెంట్‌లో స్టెఫనోనా (బల్గేరియా) పై గెలిచింది.

No comments:

Post a Comment