క్రీడలు ఫిబ్రవరి 2015
ప్రపంచకప్‌లో గేల్ డబుల్ సెంచరీ
క్రికెట్ ప్రపంచకప్‌లో వెస్టిండీస్ ఆటగాడు క్రిస్‌గేల్ 215 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. కాన్‌బెర్రాలో ఫిబ్రవరి 24న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో గేల్ డబుల్ సెంచరీ చేసి ప్రపంచకప్‌లో ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా రికార్డుకెక్కాడు. ఈ మ్యాచ్‌లో గేల్ 147 బంతుల్లో 215 పరుగులు చేశాడు. శామ్యూల్ (133)తో కలిసి గేల్ చేసిన 372 పరుగులు వన్డేలో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యంగా నమోదైంది. గతంలో టెండూల్కర్, సెహ్వాగ్, రోహిత్ శర్మ వన్డేల్లో డబుల్ సెంచరీలు సాధించారు.
సోమ్‌దేవ్‌కు ఢిల్లీ ఓపెన్ టైటిల్
ఢిల్లీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్‌ను సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ (భారత్) గెలుచుకున్నాడు. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 22న ముగిసిన పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో యూకీ బాంబ్రీ (భారత్)ని సోమ్‌దేవ్ ఓడించాడు.
పురుషుల డబుల్స్ టైటిల్‌ను అలెగ్జాండర్ కుద్రెత్సవ్ (రష్యా), ఇగోర్ జెరసిమోవ్ (బెలారస్) గెలుచుకున్నారు.
జ్యూరిచ్ క్లాసిక్ చెస్ టోర్నీ టైటిల్
హికారు నకముర (అమెరికా) జ్యూరిచ్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్ గెలుచుకున్నాడు. విశ్వనాథన్ ఆనంద్ 2వ స్థానంలో నిలిచాడు.
రాంచీ రేస్‌కు హాకీ ఇండియా లీగ్ టైటిల్
హాకీ ఇండియా లీగ్ 3వ సీజన్ టైటిల్ ధోని జట్టు రాంచీ రేస్ గెలుచుకుంది. ఫిబ్రవరి 22న జరిగిన తుది పోరులో పంజాబ్ వారియర్స్‌ను రాంచీ ఓడించింది.
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో కుంబ్లే
భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేకు అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో తనకు 77వ సభ్యుడిగా చోటు కల్పించనున్నారు. ఫిబ్రవరి 22న దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సందర్భంగా కుంబ్లే పేరును హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చనున్నారు. ప్రస్తుత ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కుంబ్లే ఈ ఘనత దక్కించుకున్న నాలుగో భారత క్రికెటర్. గతంలో బిషన్ సింగ్ బేడి, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్‌లకు ఈ గౌరవం దక్కింది. కుంబ్లేతో పాటు 78వ క్రికెటర్‌గా మహిళల క్రికెట్‌లో అత్యుత్తమ క్రీడాకారిణిగా నిలిచిన దివంగత బెట్టీ విల్సన్ కూడా ఉండనున్నారు. మురళీధరన్ (800), షేన్ వార్న్ 708)ల తర్వాత అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా కుంబ్లే (619) రికార్డులకెక్కాడు. అంతేకాకుండా 138 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసిన ఇద్దరిలో కుంబ్లే ఒకడు కావడం విశేషం.
ప్రపంచకప్‌లో మెకల్లమ్ సరికొత్త రికార్డు
న్యూజిలాండ్ విధ్వంసక ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ ప్రపంచకప్ చరిత్రలో సరికొత్త రికార్డును నమోదు చేశాడు. వెల్లింగ్టన్‌లో ఫిబ్రవరి 21న ఇంగ్లండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 18 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. ప్రపంచకప్‌లో ఇదే వేగవంతమైన అర్ధ శతకం. అయితే వన్డేల్లో మూడో వేగవంతమైంది. డివిలియర్స్ (16), జయసూర్య (17) ముందున్నారు.
ప్రారంభమైన క్రికెట్ ప్రపంచ కప్
క్రికెట్ ప్రపంచ కప్ 2015 వేడుకలు ఫిబ్రవరి 12న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్‌న, న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్‌చలో ప్రారంభమయ్యాయి. ఈ కప్‌లో పాల్గొనే మొత్తం 14 జట్లలో 10 జట్లు మెల్‌బోర్‌నలో, 4 జట్లు క్రైస్ట్‌చర్‌చలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నాయి. ఫిబ్రవరి 14న క్రైస్ట్‌చర్‌చలో న్యూజిలాండ్, శ్రీలంక మధ్య తొలి మ్యాచ్ జరిగింది. మొత్తం 44 రోజుల పాటు 49 మ్యాచ్‌లు జరుగుతాయి. మెల్‌బోర్‌నలో మార్చి 29న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
గ్రెన్‌కే చెస్ టోర్నమెంట్ విజేతగా కార్‌లసన్
చదరంగంలో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్‌లసన్ (నార్వే) గ్రెన్‌కే చెస్ టోర్నమెంట్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. జర్మనీలోని బాడెన్-బాడెన్‌లో ఎనిమిది మంది గ్రాండ్ మాస్టర్ల మధ్య నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు ఏడో స్థానం దక్కింది.
ఐపీఎల్ వేలంలో యువీకి రూ.16 కోట్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ పోటీలకు సంబంధించిన క్రీడాకారుల వేలంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ యువరాజ్ సింగ్‌ను రూ. 16 కోట్లకు కొనుగోలు చేసింది. 2015 ఫిబ్రవరి 16న బెంగళూరులో వచ్చే సీజన్ కోసం ఈ వేలం నిర్వహించారు. దినేశ్ కార్తీక్‌ను రూ.10.5 కోట్లకు బెంగళూరు ఫ్రాంచైజీ, శ్రీలంక ఆల్ రౌండర్ మాథ్యూస్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ.7.5 కోట్లకు దక్కించుకున్నాయి.
జాతీయ క్రీడల్లో సర్వీసెస్‌కు మొదటి స్థానం
35వ జాతీయ క్రీడల్లో సర్వీసెస్ స్పోర్‌ట్స కంట్రోల్ బోర్‌డ (ఎస్‌ఎస్‌సీబీ) వరసగా మూడోసారి అగ్రస్థానంలో నిలిచింది. కేరళ రెండో స్థానం, హర్యానా మూడో స్థానం సాధించాయి. తెలంగాణకు 12 స్థానం, ఆంధ్రప్రదేశ్‌కు 18 స్థానం దక్కాయి. 35వ జాతీయ క్రీడల్లో మొదటి స్థానంలో నిలిచినందుకు సర్వీసెస్ రాజా భలేంద్ర సింగ్ ట్రోఫీ గెలుచుకుంది. ఉత్తమ అథ్లెట్స్: పురుషుల విభాగంలో స్విమ్మర్ సజన్ ప్రకాశ్, మహిళల విభాగంలో స్విమ్మర్ ఆకాంక్ష వోరా పురస్కారాలు అందుకున్నారు. సర్వీస్ జట్టు ఓవరాల్ ట్రోఫీ గెలుచుకుంది.మస్కట్:తిరువనంతపురంలో నిర్వహించిన ఈ క్రీడలకు కేరళ రాష్ట్ర పక్షి గ్రేట్ ఇండియన్ హార్‌నబిల్‌ను మస్కట్‌గా ఎంపిక చేశారు. దీనికి ‘అమ్ము’గా పేరు పెట్టారు.36వ జాతీయ క్రీడలను గోవాలో, 37వ క్రీడలను ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించనున్నారు.
వీవీఎస్ లక్ష్మణ్‌కు గౌరవ డాక్టరేట్
మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను ‘టేరీ యూనివర్సిటీ’ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఫిబ్రవరి 4న జరిగిన కార్యక్రమంలో మరో ముగ్గురుతోపాటు వీవీఎస్ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు.
విన్నిపెగ్ విజేత దీపికవిన్నిపెగ్ వింటర్ క్లబ్ స్క్వాష్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన దీపిక పళ్లికల్ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో దీపిక హెబా ఎల్ టోర్కీ (ఈజిప్టు)పై గెలిచింది. 2013లోనూ దీపిక ఈ టైటిల్ సాధించింది.
మలేషియన్ ఓపెన్ గోల్ఫ్ మలేషియన్ ఓపెన్ గోల్ఫ్ టైటిల్‌ను భారత్‌కు చెందిన ఆనీర్‌బన్ లహరి గెలుచుకున్నాడు. ఫిబ్రవరి 8న జరిగిన పోటీలో లహరి మొదటి స్థానంలో, బెర్డ్న్ విస్‌బర్గ్ (ఆస్ట్రేలియా) రెండో స్థానంలో నిలిచాడు.
జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్విజయవాడలో ముగిసిన జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పురుషుల విభాగంలో సాయిప్రణీత్ (పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్), మహిళల విభాగంలో రుత్వికా శివానీ (తెలంగాణ) విజేతలుగా నిలిచారు. ఫిబ్రవరి 5న జరిగిన ఫైనల్స్‌లో సాయిప్రణీత్ సమీర్‌వర్మ(ఎయిర్‌ఇండియా)పై గెలవగా... మహిళల ఫైనల్లో రుత్విక రీతుపర్ణాదాస్ (తెలంగాణ)పై నెగ్గింది. పురుషుల డబుల్స్ టైటిల్‌ను మనూఅత్రి (ఏఏఐ), సుమీత్ రెడ్డి(ఏపీ) జోడీ గెలుచుకుంది. మహిళల డబుల్స్‌లో ప్రద్య్నాగాద్రే, సిక్కిరెడ్డి(ఏఏఐ)జోడీ విజేతగా నిలిచింది. మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను అరుణ్‌విష్ణు, అపర్ణాబాలన్(పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్) జోడీ గెలుచుకుంది.

No comments:
Post a Comment