AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

అవార్డులు సెప్టెంబరు 2014

అవార్డులు సెప్టెంబరు 2014
గోవింద్ మిశ్రాకు 2013 సరస్వతీ సమ్మాన్ 
ప్రముఖ హిందీ ర చయిత గోవింద్ మిశ్రా 2013 సరస్వతీ సమ్మాన్ పురస్కారాన్ని సెప్టెంబర్ 23న అందుకున్నారు. ఆయన రచించిన ధూల్ పౌదోన్ పర్ అనే నవల ఈ పురస్కారానికి ఎంపికైంది. ఈ అవార్డుకు ఎంపికైన తొలి హిందీ రచయిత హరివంశ్ రాయ్ బచ్చన్ కాగా రెండో హిందీ రచయిత గోవింద్‌మిశ్రా.
రైట్ లైవ్‌లీ హుడ్ అవార్డు -2014
2014 రైట్ లైవ్‌లీ హుడ్ అవార్డుకు నాసా మాజీ కాంట్రాక్టర్ ఎడ్వర్డ్ స్నోడెన్, బ్రిటీష్ న్యూస్ పేపర్ ఎడిటర్ అలన్ రుస్ బ్రిడ్జెర్, పాకిస్థాన్ మానవ హక్కుల కార్యకర్త అస్మా జహంగీర్, ఆసియన్ మానవ హక్కుల కమిషన్‌కు చెందిన బాసిల్ ఫెర్నాండో, పర్యావరణ వేత్త బిల్ మాక్ కిబ్బెన్ ఎంపికయ్యారు. ప్రత్యామ్నాయ నోబెల్‌గా పిలిచే ఈ అవార్డును 1980లో ఏర్పాటు చేశారు.

వర్దీకి ప్రొఫెషనల్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 
విశ్వంలో ప్రతీ పదార్ధానికి ద్రవ్యరాశి ఉంటుందని భావిస్తున్న దైవకణం (హిగ్స్ బోసాన్) ఉనికిని కనిపెట్టడంలో కీలకపాత్ర పోషించిన ప్రవాస భారత శాస్త్రవేత్త తేదీందర్ వర్దీ ప్రతిష్ఠాత్మక ప్రొఫెషనల్ ఆఫ్ ద ఇయర్ -2014 అవార్డుకు ఎంపికయ్యారు. లండ న్‌లో ఏసియన్ అచీవర్స్ అవార్డుల కార్యక్రమంలో దీన్ని అందుకున్నారు.
అమితాబ్‌కి అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం
అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం -2013ను బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు ప్రకటించారు. అవార్డుల కమిటీ అధ్యక్షుడు టి సుబ్బరామిరెడ్డి సెప్టెంబర్ 20న తెలిపారు. 
భారత యువ ఆర్కిటెక్టుకు టైమ్ పత్రిక గౌరవం
భారత్‌కు చెందిన ఆర్కిటెక్టు అలోక్ శెట్టి (28)ని రేపటి యువనేత (యంగ్ లీడర్ ఆఫ్ టుమారో)గా టైమ్ పత్రిక పేర్కొంది. మురికివాడల్లో నివసించే పేదల కోసం వరదలను తట్టుకునే చౌకైన ఇళ్లను డిజైన్ చేస్తున్నందుకు ఈ గౌరవం లభించింది. కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందిన అలోక్ బెంగళూరుకు చెందిన స్వచ్చంద సంస్థ పరిణామ్ ఫౌండేషన్‌లో పనిచేస్తున్నాడు.

ప్రొ. కమల్‌బవాకు మిడోరి పురస్కారం
భారతీయ పర్యావరణ శాస్త్రవేత్త, బోస్టన్‌లోని మసాచుసెట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కమల్ బవా ప్రతిష్టాత్మక మిడోరి-2014 పురస్కారానికి ఎంపికయ్యారు. జపాన్‌కు చెందిన పర్యావరణ ఫౌండేషన్ జీవ వైవిధ్యంలో కృషి చేసిన వారికి ఈ అవార్డును అందిస్తుంది. హిమాలయాల్లో వాతావరణ మార్పులపై పలు పరిశోధనలు చేసినందుకు కమల్‌బవా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన బెంగళూరులోని అశోకా ట్రస్టు ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. బహుమతికి ఎంపికైన వారిలో ఘనా నేషనల్ బయో డైవర్సిటీ కమిటీ చైర్మన్ ఆల్‌ఫ్రెడ్ ఓటెంగ్-యెబోహ, అర్జెంటీనా జాతీయ పరిశోధన మండలి ప్రధాన పరిశోధకుడు బిబియానా విలో కూడా ఉన్నారు. ఈ అవార్డును జపాన్‌లోని అయోన్ ఎన్విరాన్‌మెంటల్ ఫౌండేషన్, కన్వెన్షన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ సెక్రటేరియట్ 2010 నుంచి అందజేసున్నాయి. అవార్డుకు ఎంపికైన వారికి లక్ష డాలర్ల బహుమతి ప్రదానం చేస్తారు. అక్టోబర్ 15న దక్షిణ కొరియాలోని పియాంగ్ చాంగ్‌లో జరిగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్)-12లో పురస్కారాన్ని అందజేస్తారు.
బంగ్లాదేశ్, తూర్పు తైమూర్‌లకు ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రజారోగ్య పురస్కారాలు
ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రజారోగ్య పురస్కారానికి బంగ్లాదేశ్ కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ జాతీయ సలహా కమిటీ చైర్‌పర్సన్ సైమా హుస్సేన్ ఎంపికయ్యారు. దక్షిణాసియాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా అటిజం (నాడీ సంబంధిత వ్యాధి)పై విస్తృత అవగాహన కల్పించినందుకు ఈమెకు ఈ అవార్డు దక్కింది. కాగా తైమూర్ దేశానికి చెందిన జాతీయ మలేరియా నివారణ కార్యక్రమం ప్రాంతీయ విభాగంలో అవార్డుకు ఎంపికయింది. దేశంలో మలేరియాను అరికట్టడానికి చేపట్టిన సమర్థమెన చర్యలకు ఈ గౌరవం లభించింది. సెప్టెంబర్ 10న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఈ అవార్డుల ప్రదానం చేశారు. 
ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు సాక్షర భారత్ పురస్కారం
ప్రకాశం జిల్లా కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయ్‌కుమార్ సాక్షర భారత్ - 2014 పురస్కారాన్ని అందుకున్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో సెప్టెంబర్ 8న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. అక్షర విజయం కార్యక్రమం ద్వారా ప్రకాశం జిల్లాలో కేవలం 9 నెలల కాలంలో 4.75 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దినందుకు జాతీయ సాక్షరతా మిషన్ ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. 
నీలేకనికి వి.కృష్ణమూర్తి ఎక్స్‌లెన్స్ అవార్డు
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఆర్గనైజేషన్ డెవలప్‌మెంట్‌ను నెలకొల్పిన వి.కృష్ణమూర్తి ఎక్సలెన్స్ అవార్డు-2014కు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, యూఐడీఏఐ మాజీ చైర్మన్ నందన్ నీలేకని ఎంపికయ్యారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య చేతులమీదుగా అవార్డును అందుకున్నారు.

దక్షిణాఫ్రికా సేవా సంస్థకు అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతి
ప్రపంచ వ్యాప్తంగా శాంతి సాధనకు, దక్షిణాఫ్రికాలో వివిధ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ‘ది ఆఫ్రికన్ సెంటర్ ఫర్ కన్‌స్ట్రక్టివ్ రిసల్యూషన్ ఆఫ్ డిస్‌ప్యూట్స్’ అనే సంస్థకు ప్రతిష్టాత్మక మహాత్మాగాంధీ అంతర్జాతీయ శాంతి బహు మతి-2014 లభించింది. దివంగత నెల్సన్ మండేలా భార్య గ్రాకామషేల్ ఈ సంస్థ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, పిల్లల హక్కుల కోసం మషేల్ ఈ సంస్థ ద్వారా కృషి చేస్తున్నారు. డర్బన్‌లోని గాంధీ అభివృద్ధి ట్రస్టు ఏటా ఈ అవార్డును ప్రకటిస్తుంది. 
రైస్ బకెట్ తోడ్పాటుకు యు.ఎన్. అవార్డు
రైస్ బకెట్ ఛాలెంజ్‌ను చేపట్టి ఆన్‌లైన్‌లో ప్రాచుర్యంలోకి తెచ్చిన హైదరాబాద్‌కు చెందిన మంజులత కళానిధి (38) అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు, ఐక్యరాజ్య సమితి అందించే అవార్డుకు ఎంపికయ్యారు. ఐస్ బకెట్ ఛాలెంజ్ తరహాలో పేదలకు బియ్యం అందించే రైస్ బకెట్ ఛాలెంజ్‌ని ఆమె చేపట్టి ఆన్‌లైన్‌లో ప్రాచుర్యం కల్పించారు. దీంతో 10 వేల కిలోల బియ్యం పేదలకు అందించేందుకు తోడ్పడ్డారు. అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు, ఐక్యరాజ్యసమితితో కూడిన సమాఖ్య ఐసీఓఎన్‌జీఓ ఆమెకు కర్మవీర చక్ర అవార్డు, రెక్స్ కర్మవీర్ గ్లోబల్ ఫెలోషిప్ ప్రకటించింది. ఈ అవార్డును 2015 మార్చి 25న న్యూఢిల్లీలో ప్రదానం చేస్తారు. 
బోయిభీమన్న సాహితీ పురస్కారాలు
డాక్టర్ బోయి భీమన్న సాహితీ పురస్కారాలను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం సెప్టెంబర్ 4న ప్రకటించింది. డాక్టర్ సి. నారాయణరెడ్డికి జీవన సాఫల్య పురస్కారానికి, పద్య కవితా పురస్కారాలకు కేశవరెడ్డి, డా. నలిమెల భాస్కర్, పి సత్యవతిలను ఎంపిక చేసింది. 
టాటా ఇంటికి యునెస్కో అవార్డు 
టాటా సంస్థ స్థాపకుడు జెంషెడ్‌జీ టాటాకు చెందిన ముంబైలోని ఎస్‌ప్లాండే హౌస్‌కు యునెస్కో ఆసియా-పసిఫిక్ వారసత్వ అవార్డు లభించింది. మహారాష్ట్ర కిన్హాల్ గ్రామం సతారాలోని శ్రీ సఖరగద్ నివాసిని దేవి దేవాలయ ప్రాంగణం కూడా ఈ అవార్డుకు ఎంపికైంది. వారసత్వ నిర్మాణాలు, భవనాల సంరక్షణకు కృషి చేసిన సంస్థలు, వ్యక్తులకు గుర్తుగా ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

పాకిస్థాన్ మహిళకు పీటర్ మాక్లేర్ అవార్డు
ధైర్య సాహసాలు, నైతిక విలువలతో కూడిన జర్నలిజానికి ఇచ్చే పీటర్ మాక్లేర్ అవార్డు-2014 పాకిస్థాన్ తొలి మహిళా వార్ కరస్పాండెంట్, టీవీ వ్యాఖ్యాత అస్మా షిరాజికి లభించింది. షిరాజి 2006 ఇజ్రాయెల్-లెబనాన్ పోరాటం, 2009లో పాక్-అఫ్గానిస్థాన్ సరిహద్దులో తాలిబన్ యుద్ధం, 2007లో జనరల్ ముషారఫ్ ఎమర్జెన్సీ పాలన వంటి సంఘటనలపై ఆమె వార్తా సమాచారం అందించారు. ఈ అవార్డును 2008లో ఏజెన్సీ ఫ్రాన్సి-ప్రెస్సి జర్నలిస్ట్ పీటర్ మాక్లేర్ పేరిట ఏర్పాటు చేసింది. ఈ పురస్కారం అందుకున్న రెండో మహిళ షిరాజి. 

బెలఫాంటెకు హ్యుమానిటేరియన్ ఆస్కార్ అమెరికాకు చెందిన నటుడు, గాయకుడు హ్యారీ బెలఫాంటెకు జీన్ హెర్‌షాల్ట్ హ్యుమానిటేరియన్ ఆస్కార్ అవార్డు లభించింది. మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సెన్సైస్ అకాడమీ అందించే మూడు జీవిత కాల సాఫల్య పురస్కారాల్లో ఈ అవార్డు ఒకటి. బెలఫాంటె ఎయిడ్స్ నివారణ, విద్య, పౌర హక్కుల రక్షణతోపాటు పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్ నిర్వహించిన లాంగ్‌మార్చ్‌కు మద్దతు తెలిపారు. 1987లో యూనిసెఫ్ సౌహార్థ్ర రాయబారి (గుడ్‌విల్ అంబాసిడర్)గా వ్యవహరించారు. 

రాజీవ్‌గాంధీ నేషనల్ క్వాలిటీ అవార్డులు2012 సంవత్సరానికి రాజీవ్‌గాంధీ నేషనల్ క్వాలిటీ అవార్డులను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఆగస్టు 26న ప్రకటించింది. వివరాలు.. బెస్ట్ ఆఫ్ ఆల్ అవార్డు (అన్నింటా ఉత్తమం)ను రైలు చక్రాల కర్మాగారానికి(బెంగళూరు) దక్కింది. పెద్ద సేవా సంస్థల కేటగిరీలో టాటా బిజినెస్ సపోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్-హైదరాబాద్, పెద్ద తరహా ఉత్పత్తి పరిశ్రమ విభాగంలో శక్తి మసాలా ప్రైవేట్ లిమిటెడ్ -తమిళనాడు, చిన్న తరహా ఉత్పత్తి పరిశ్రమ కేటగిరీలో ఎలీన్ గృహోపకరణాల లిమిటెడ్ -హిమాచల్ ప్రదేశ్‌లకు అవార్డులు లభించాయి. 

యువరాజ్, పాక్ జర్నలిస్టుకు ‘రాజీవ్ ఎక్స్‌లెన్స్’భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ , పాకిస్థాన్ జర్నలిస్టు రీమా అబాసీ సహా 24 మంది ఐదో రాజీవ్ గాంధీ ఎక్స్‌లెన్స్ అవార్డులకు ఎంపికయ్యారు. కేన్సర్ నివారణ ప్రచారంలో విశేష కృషికి గాను యువరాజ్ స్థాపించిన ‘యువీకెన్’ అనే స్వచ్ఛంద సంస్థకు ఈ అవార్డు లభించింది. ‘హిస్టారిక్ టెంపుల్స్ ఇన్ పాకిస్థాన్: ఏ కాల్ టు కాన్‌సైన్స్(పాకిస్థాన్‌లో చారిత్రక దేవాలయాలు: అంతరాత్మకు పిలుపు)’ అనే గ్రంథం ద్వారా పాకిస్థాన్‌లోని దేవాలయాల ఖ్యాతిని చాటినందుకు రీమా అబాసీని ఈ అవార్డు వరించింది.

No comments:

Post a Comment