AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday, 25 November 2017

క్రీడలు మే 2013

క్రీడలు మే 2013
భారత బాక్సర్ల పతకాల రికార్డులిమాసోల్ బాక్సింగ్ కప్ అంతర్జాతీయ టోర్నీలో భారత బాక్సర్లు చరిత్ర సృష్టించారు. సైప్రస్‌లోని లిమాసోల్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో పది పతకాలు సాధించారు. ఇందులో నాలుగు స్వర్ణాలున్నాయి. కర్ణాటకలో స్థిరపడిన తెలుగుతేజం వి.దుర్గారావు (56 కిలోలు) సహా మదన్‌లాల్ (52 కిలోలు), మన్‌దీప్ జంగ్రా (69 కిలోలు), ప్రవీణ్ (ప్లస్ 91 కిలోలు) పసిడి పతకాలు గెలుపొందారు.

ఐపీఎల్ నుంచి తప్పుకున్న పుణే వారియర్స్ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి వైదొలుగుతున్నట్లు పుణే వారియర్స్ యజయాని సహారా గ్రూప్ ప్రకటించింది.బీసీసీఐతో ఉన్న ఆర్థిక విభేదాలే ఇందుకు కారణం. ఫ్రాంఛైజీ ఫీజును తగ్గించకపోవడం, జట్టు బ్యాంక్ గ్యారెంటీని సొమ్ము చేసుకోవాలని బీసీసీఐ నిర్ణయించడంతో ఐపీఎల్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు సహారా పేర్కొంది. బీసీసీఐ వైఖరితో విసుగుచెందిన తాము వచ్చే ఏడాది నుంచి టీమ్ ఇం డియా స్పాన్సర్‌గా కూడా తప్పుకుంటామని స్పష్టం చేసింది.

ఐపీఎల్ తరహాలో టెన్నిస్ లీగ్ఐపీఎల్ తరహా టెన్నిస్ లీగ్‌కు భారత అగ్రశ్రేణి ఆటగాడు మహేశ్ భూపతి శ్రీకారం చుట్టాడు. అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) పేరిట నిర్వహించనున్న ఈ టోర్నీకి ప్రపంచ నెంబర్‌వన్ నోవక్ జోకోవిచ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. పారిస్‌లో వచ్చే ఏడాది చివర్లో ఈ లీగ్ జరగనుంది. ఆసియాకు సంబంధించిన ఆరు ఫ్రాంచైజీలతో ఐపీటీఎల్ జరుగుతుంది. ఒక్కో ఫ్రాంచైజీలో 6 నుంచి 10 మంది క్రీడాకారులుంటారు. వీరి కోసం ఆయా ఫ్రాంచైజీలు రూ. 22 కోట్ల (4 మిలియన్ డాలర్లు) నుంచి రూ. 55 కోట్లు (10 మిలియన్ డాలర్లు) వెచ్చించాల్సి ఉంటుంది.

రోస్‌బర్గ్‌కు మొనాకో గ్రాండ్ ప్రిఫార్ములా వన్ మొనాకో గ్రాండ్ ప్రి టైటిల్‌ను మెర్సిడస్ జట్టు డ్రై వర్ నికో రోస్‌బర్గ్ సాధించాడు. మోంటెకార్లోలో మే 26న జరిగిన రేసులో రోస్‌బర్గ్ మొదటిస్థానంలో నిలవగా, రెడ్‌బుల్ డ్రై వర్ వెటెల్ రెండో స్థానం సాధించాడు.

ఐపీఎల్-6 విజేత ముంబైఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)- 6 విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచింది. కోల్‌కతాలో మే 26న జరిగిన ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను 23 పరుగుల తేడాతో ఓడించింది. ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకోవడం ఇదే తొలిసారి. చెన్నై జట్టు ఐదుసార్లు ఫైనల్స్‌కు వెళ్లి రెండుసార్లు టైటిల్ గెలుపొందింది. విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు రూ.10 కోట్లు, రన్నరప్ చెన్నైకు రూ.7.5 కోట్లు ప్రై జ్‌మనీ దక్కింది.

ఐపీఎల్ విశేషాలు:మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్- కీరన్ పొలార్డ్
వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు చేసినవారికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్-చెన్నై సూపర్‌కింగ్స్‌కు చెందిన మైక్ 
హస్సీ (733 పరుగులు)అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడికి ఇచ్చే పర్పుల్ క్యాప్ - చెన్నై సూపర్‌కింగ్స్‌కు చెందిన డ్వేన్ బ్రేవో (32 వికెట్లు)

ఉత్తమ యువ ఆటగాడు-సంజు శామ్సన్ (రాజస్థాన్ రాయల్స్)
అత్యంత విలువైన ఆటగాడు - షేన్ వాట్సన్ (రాజస్థాన్ రాయల్స్)
ఫెయిర్ ప్లే అవార్డు - చెన్నై సూపర్ కింగ్స్ 

ఆర్చరీ ప్రపంచకప్‌లో దీపికకు 2 రజతాలుచైనాలోని షాంఘైలో జరిగిన ప్రపంచకప్ ఆర్చరీ టోర్నమెంట్‌లో భారత్‌కు నాలుగో స్థానం లభించింది. జార్ఖండ్‌కు చెందిన ఆర్చర్ దీపిక కుమారి రెండు రజత పతకాలు సాధించింది. మహిళల రికర్వ్ వ్యక్తిగత ఫైనల్లో దీపిక.. ఓక్ హీ యున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. రికర్వ్ మిక్స్‌డ్ విభాగం ఫైనల్లో దీపిక-జయంత తాలుక్‌దార్ జోడీ లోరిగ్ ఖాతునా-బ్రాడీ ఎలిసన్ (అమెరికా) చేతిలో ఓడి రజతం దక్కించుకుంది.

కర్ణాటకకు రంగస్వామి కప్ హాకీ టైటిల్64వ సీనియర్ (మెన్) నేషనల్ హాకీ చాంపియన్‌షిప్- రంగస్వామి కప్‌ను కర్ణాటక గెలుచుకుంది. మే 16న బెంగళూరులోని కేఎస్‌హెచ్‌ఏ హాకీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఉత్తరప్రదేశ్ జట్టును కర్ణాటక జట్టు ఓడించింది. టోర్నీ చరిత్రలో టైటిల్‌ను కర్ణాటక గెలుచుకోవడం ఇదే తొలిసారి.

నార్వే సూపర్ చెస్ టోర్నమెంట్‌లో ఆనంద్‌కు నాలుగో స్థానంనార్వే సూపర్ చెస్ టోర్నమెంట్ టైటిల్‌ను సెర్జీ కర్జాకిన్ (రష్యా) గెలుచుకున్నాడు. నార్వేలో మే 18న ముగిసిన పోటీల్లో కర్జాకిన్ టైటిల్ గెలుచుకోగా, భారత్‌కు చెందిన విశ్వనాథన్ ఆనంద్ నాలుగో స్థానంలో నిలిచాడు. 

భారత్‌కు ఆసియన్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్తొలిసారిగా జరిగిన ఆసియన్ బాస్కెట్‌బాల్ 3 ణ 3 చాంపియన్‌షిప్‌లో భారత మహిళాజట్టు టైటిల్‌ను గెలుచుకుంది. దోహా (ఖతార్)లో మే 16న జరిగిన ఫైనల్లో మంగోలియాను భారత్ ఓడించింది. పురుషుల టైటిల్‌ను ఖతార్ జట్టు గెలుచుకుంది. ఇది ఫైనల్లో సౌదీ అరేబియాను ఓడించింది. 

నాదల్, సెరెనాలకు రోమ్ మాస్టర్స్ టైటిల్స్రోమ్ మాస్టర్స్ టెన్నిస్ టైటిల్స్‌ను రాఫెల్ నాదల్ (స్పెయిన్), సెరెనా విలియమ్స్ (అమెరికా) గెలుచుకున్నారు. మే 19న రోమ్‌లో ముగిసిన పోటీల్లో రోజర్ ఫెదరర్‌ను ఓడించి నాదల్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. ఇది నాదల్‌కు ఏడో రోమ్ మాస్టర్స్ టైటిల్. విక్టోరియా అజరెంకాను ఓడించి సెరెనా విలియమ్స్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకుంది. సెరెనాకు ఇది 51వ టైటిల్. పురుషుల డబుల్స్ టైటిల్‌ను భూపతి, బోపన్న (భారత్) జోడీని ఓడించి బ్రయాన్ బ్రదర్స్ (అమెరికా) గెలుచుకున్నారు. 

ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ పోటీల్లో స్పాట్ ఫిక్సింగ్ జరిగింది. ఫిక్సింగ్‌కు పాల్పడిన ముగ్గురు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాళ్లను ఢిల్లీ పోలీసులు మే 16న అరెస్టు చేశారు. వీరిలో శాంతకుమారన్ శ్రీశాంత్, అజిత్ చండిలా, అంకిత్ అనిల్ చవాన్‌లు ఉన్నారు. వీరితో పాటు నేరానికి పాల్పడిన 11 మంది బుకీలను కూడా అరెస్టు చేశారు. ముగ్గురు క్రికెటర్లను సస్పెండ్ చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు మే 5, 9, 15న ఆడిన మ్యాచ్‌ల్లో స్పాట్ ఫిక్సింగ్ జరిగినట్లు తెలిసింది. 

స్పెయిన్ గ్రాండ్‌ప్రి విజేత అలోన్సో
స్పెయిన్ గ్రాండ్‌ప్రి రేసులో ఫెరారీ డ్రైవర్ ఫెర్నాండో అలోన్సో విజేతగా నిలిచాడు. మే 12న జరిగిన 66 ల్యాప్‌ల రేసును గంటా 39 నిమిషాల 16.596 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో అలోన్సోకిది రెండో విజయం కాగా, మొత్తం మీద కెరీర్‌లో 32వ విజయం. తాజా విజయంతో ఫార్ములావన్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ నెగ్గిన వారి జాబితాలో నాలుగోస్థానంలో నిలిచాడు. 91 టైటిల్స్‌తో ైమైకేల్ షుమాకర్ మొదటి స్థానంలో ఉన్నాడు. 

సుల్లీవాన్‌కు ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను ఇంగ్లండ్‌కు చెందిన రోన్నీ ఓ సుల్లీవాన్ గెలుచుకున్నాడు. ఇంగ్లండ్‌లోని షీ ఫీల్డ్‌లో మే 7న ముగిసిన పోటీలో బార్రీ హాకిన్స్‌ను సుల్లీవాన్ ఓడించాడు. ఇది సుల్లీవాన్‌కు ఐదో టైటిల్. 

కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్పురుషుల సింగిల్స్: జాన్ జియాన్(సింగపూర్) గెలుచుకున్నాడు. మే 10న న్యూఢిల్లీలో జరిగిన ఫైనల్లో లీహూ (సింగపూర్)ను ఓడించాడు. 

మహిళల సింగిల్స్: మో జాంగ్ (కెనడా) మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకుంది. ఫెనల్లో మెంగ్యూ (సింగపూర్)ను ఓడించింది. 

పురుషుల డబుల్స్: 
జాన్ జియాన్, యాంగ్ జీ (సింగపూర్) గెలుచుకున్నారు. వీరు క్రిస్టఫర్ దొరాన్, శామ్యూల్ వాల్కర్ (ఇంగ్లండ్) జోడీని ఓడించారు. 

మహిళల డబుల్స్: 
ఫెంగ్ తియాన్వీ, యు యెంగ్యూ (సింగపూర్) గెలుచుకున్నారు. వీరు జొయన్నా పార్కర్, కెల్లీ సిబ్లే (ఇంగ్లండ్) జోడీని ఓడించారు. 

సెరెనాకు 50వ టైటిల్
అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ మరో మైలురాయిని చేరుకుంది. మే 12న ముగిసిన మాడ్రిడ్ మాస్టర్స్ ప్రీమియర్ టెన్నిస్ టోర్నీలో విజేతగా నిలిచి 50వ డబ్ల్యూటీఏ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో రష్యా క్రీడాకారిణి మరియా షరపోవాపై విజయం సాధించింది. తద్వారా ప్రస్తుతం కెరీర్‌ను కొనసాగిస్తున్న క్రీడాకారిణుల్లో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా సెరెనా గుర్తింపు సాధించింది. మొత్తంమీద చూస్తే 50 అంతకంటే ఎక్కువ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన పదో క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. 

హర్యానాకు జాతీయ మహిళా హాకీ ఛాంపియన్‌షిప్జాతీయ మహిళా హాకీ ఛాంపియన్‌షిప్‌ను హర్యానా గెలుచుకుంది. ఏప్రిల్ 30న లక్నోలో జరిగిన ఫైనల్స్‌లో రైల్వేస్‌ను ఓడించి హర్యానా టైటిల్ సాధించింది.

సింధుకు మలేసియా ఓపెన్ టైటిల్ ఆంధ్రప్రవేశ్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు మలేసియా ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ సాధించింది. దీంతో సైనా నెహ్వాల్ తర్వాత గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీ గెలిచిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. పిన్నవయసులో ఈ ఘనత సాధించిన భారతీయ క్రీడాకారిణిగా సింధు రికార్డు సష్టించింది.

ఐసీసీలో ప్రతినిధిగా శివరామకష్ణన్భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామ కష్ణన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లో ఆటగాళ్ల తరపున ప్రతినిధిగా మే 6న నియమితులయ్యారు. మరో సభ్యుడిగా శ్రీలంకకు చెందిన సంగక్కర ఉన్నారు. ఈ కమిటీకి భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

No comments:

Post a Comment