క్రీడలు మే 2012
ఆదిత్య మెహతాకు కోల్‌కత ఓపెన్ స్నూకర్ టైటిల్ఆసియన్, నేషనల్ స్నూకర్ చాంపియన్ ఆదిత్య మెహతా.. కోల్‌కత ఓపెన్ నేషనల్ స్నూకర్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. కోల్‌కతాలో మే 9న జరిగిన ఫైనల్‌లో సౌరవ్ కొతారీని ఆదిత్య మెహతా ఓడించాడు.
మాంచెస్టర్ సిటీకి ఈపీఎల్ టైటిల్ప్రతిష్టాత్మక ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్(ఈపీ ఎల్) ఫుట్‌బాల్ టైటిల్‌ను 44 ఏళ్ల విరామం తర్వాత మాంచెస్టర్ సిటీ జట్టు గెలుచుకుంది. చివరి రౌండ్ మ్యాచ్‌లో క్వీన్స్ పార్క్ రేంజర్స్ జట్టును మాంచెస్టర్ సిటీ జట్టు ఓడించి ఈ టైటిల్ కైవసం చేసుకుంది.
రోనీకి వరల్డ్ స్నూకర్ టైటిల్రోనీ ఒ సుల్లీవన్ వరల్డ్ స్నూకర్ టైటిల్ గెలుచుకున్నాడు. షీఫీల్డ్‌లో మే 7న జరిగిన ఫైనల్‌లో ఆలీ కార్టన్ (ఇంగ్లండ్)ను సుల్లీవన్ (ఇంగ్లండ్) ఓడించాడు.
ఆసియా చాంప్ నేగిగ్రాండ్ మాస్టర్ పరిమార్జన్ నేగి ఆసియా కాంటినెంటల్ చెస్ టైటిల్‌ను సాధించాడు. యూ యాంగ్యీ (చైనా)కి కూడా సమాన పాయింట్లు ఉండటంతో తొలి స్థానం కోసం టై ఏర్పడింది. ఈ చాంపియన్‌షిప్‌లో యూతో జరిగిన గేమ్‌లో నేగి నెగ్గాడు. దీంతో స్వర్ణం దక్కించుకున్నాడు.
లండన్ ఒలింపిక్స్‌కు ఐదుగురు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులులండన్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ క్రీడాంశంలో భారత్ తరపున ఐదుగురు ఆటగాళ్లు పాల్గొననున్నారు. రెండుకు మించి ఐదుగురు ఈ టోర్నమెంట్‌కు ఎంపిక కావడం ఇదే తొలిసారి. మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్ అర్హత సాధించారు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప, మిక్స్‌డ్ డబుల్స్ గుత్తా జ్వాల, వి. దిజు క్వాలిఫై అయ్యారు. మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ రెండింటిలోనూ గుత్తా జ్వాల అర్హత సాధించింది. రెండు విభాగాల్లోనూ నేరుగా అర్హత సాధించిన తొలి భారత క్రీడాకారిణి జ్వాల కావడం విశేషం.
ప్రపంచకప్ ఆర్చరీలో దీపికకు స్వర్ణంఆర్చరీ ప్రపంచ కప్‌లో భారత్‌కు చెందిన దీపిక కుమారి వ్యక్తిగత రికర్వ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఈ నెల 5న అంటాల్యా(టర్కీ)లో జరిగిన ఫైనల్లో లీ సుంగ్ జిన్(కొరియా)పై విజయం సాధించింది. ఇప్పటికే లండన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన దీపిక జూనియర్ ప్రపంచ చాంపియన్ కూడా. ఆమె 2009లో క్యాడెట్ ప్రపంచ టైటిల్‌ను కూడా గెలిచింది. పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో భారత్‌కు రజతం ద క్కింది.
ఆసియా స్క్వాష్ విజేత భారత్ఆసియా స్క్వాష్ మహిళల టీమ్ చాంపియన్‌షిప్‌ను భారత మహిళల జట్టు గెలుచుకుంది. ఈ నెల 6న కువైట్‌లో జరిగిన ఫైనల్లో హాంకాంగ్‌ను ఓడించింది. పురుషుల విభాగంలో భారత జట్టుకు రెండో స్థానం దక్కింది.
దేవేంద్రోకు రజతంకజికిస్థాన్‌లోని అల్మాటిలో ముగిసిన రిపబ్లిక్ ఆఫ్ కజికిస్థాన్ ప్రెసిడెంట్స్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన దేవేంద్రోసింగ్‌కు రజత పతకం లభించింది.
No comments:
Post a Comment