AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday, 25 November 2017

అవార్డులు ఏప్రిల్ 2015

అవార్డులు ఏప్రిల్ 2015
శాస్త్రవేత్త సంగీత భాటియాకు హీంజ్ అవార్డు
భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త సంగీత భాటియాకు 2015 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మక హీంజ్ అవార్డు దక్కింది. ఆమె మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో శాస్త్రవేత్తగా ఉన్నారు. వ్యాధి శోధన, కణజాల ఇంజనీరింగ్ రంగాల్లో ఔషధ పరీక్షలకు తోడ్పడే కృత్రిమ సూక్ష్మ కాలేయాలను అభివృద్ధి చేసినందుకు ఆమె ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
సునీతా కృష్ణన్‌కు యుధ్‌వీర్ అవార్డు
మహిళల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోరాడుతున్న సామాజిక కార్యకర్త, ప్రజ్వల సంపాదకురాలు డాక్టర్ సునీతా కృష్ణన్‌కు ప్రతిష్టాత్మక యుధ్‌వీర్ అవార్డు లభించింది. ఈ అవార్డును ఏప్రిల్ 30న హైదరాబాద్‌లో యుధ్‌వీర్ జయంతి రోజున ఆమెకు బహూకరిస్తారు. స్వాతంత్ర సమరయోధుడు, హిందీ మిలాప్ వ్యవస్థాపకుడు దివంగత యుధ్‌వీర్ పేరిట ఈ అవార్డును నెలకొల్పారు. ఈ అవార్డును పొందుతున్న 23వ వ్యక్తి సునీతా కృష్ణన్.
బాలచంద్ర నెమాడేకు జ్ఞానపీఠ్ అవార్డు ప్రదానం
ప్రముఖ మరాఠీ సాహిత్యవేత్త బాలచంద్ర నెమాడే (76) 2014 సంవత్సరానికి దేశంలో అత్యున్నత సాహితీ అవార్డు జ్ఞానపీఠ్ పురస్కారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 25న పార్లమెంట్ హౌస్‌లో బహూకరించారు. 50వ జ్ఞానపీఠ్ అవార్డుకు సాహిత్య రంగానికి చేసిన సేవకు నెమాడేను నమ్‌వర్‌సింగ్ నేతృత్వంలోని అవార్డు బోర్డు ఎంపిక చేసింది. కొసాలా, జరీలా, జూల్, బిడార్, హిందూ-ఏక్ సముద్ ్రవంటి ప్రాచుర్యం పొందిన నవలలు, కవితలు ఎన్నో రాశారు. 1963లో వచ్చిన నెమాడే నవల కోసల మరాఠీ నవలల తీరును మార్చేసింది. ఆయనకు 1991లో సాహిత్య అకాడమీ పురస్కారం, 2001లో పద్మశ్రీ లభించాయి.
న్యూయార్క్ టైమ్స్‌కు పులిట్జర్ ప్రైజ్
పశ్చిమ ఆఫ్రికాలో చెలరేగిన ఎబోలా వ్యాధిపై వార్తలను అందజేసినందుకు ద న్యూయార్క్ టైమ్స్ పత్రికకు పులిట్జర్ ప్రైజ్ లభించింది. ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ అవార్డు న్యూయార్క్ టైమ్స్‌కు దక్కింది. ఈ అవార్డులను న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో పులిట్జర్ కమిటీ ఏప్రిల్ 20న ప్రకటించింది. బ్రేకింగ్ న్యూస్ ఫోటోగ్రఫీ అవార్డు సెయింట్ లూయిస్ న్యూస్ పేపర్‌కు దక్కింది. మిస్సోరిలోని ఫెగ్యూసన్‌లో చెలరేగిన జాతి వ్యతిరేక అల్లర్లను చిత్రించినందుకు ఈఅవార్డు దక్కింది.

సీసీఎంబీ శాస్త్రవేత్తకు ‘మాస్ స్పెక్ట్రోమెట్రిస్ట్’ అవార్డు
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) శాస్త్రవేత్త డాక్టర్ ఎంవీ జగన్నాథంను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. రసాయనాల విశ్లేషణ కు సంబంధించిన బయాలజికల్ మాస్ స్పెక్ట్రోమెట్రీ రంగంలో విశేష సేవలు అందించినందుకు గాను ఆయనను ‘ఎమినెంట్ మాస్ స్పెక్ట్రోమెట్రిస్ట్’ అవార్డుతో ‘ఇండియన్ సొసైటీ ఫర్ మాస్ స్పెక్ట్రోమెట్రీ’ సత్కరించింది. జోధ్‌పూర్‌లో ఇటీవల జరిగిన కార్యక్రమంలో డాక్టర్ జగన్నాథం ఈ అవార్డును అందుకున్నారు.

డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి హాంగ్‌కాంగ్ పురస్కారం
 
హాంగ్‌కాంగ్ అత్యున్నత వైద్య పురస్కారాన్ని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి అందుకున్నారు. ఎండోస్కోపీ శస్త్రచికిత్సల రంగంలో అనేక కొత్త విధానాలు ఆవిష్కరించినందుకు గుర్తింపుగా రెండు రోజుల కిందట హాంగ్‌కాంగ్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో హాంగ్‌కాంగ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ సొసైటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ లావై ఛుంగ్ ఈ పురస్కారాన్ని అందజేశారు. తక్కువ మొత్తానికి అత్యాధునిక ఎండోస్కోపీ చికిత్సలను అందించడానికి కొత్త వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకురావడంలో డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి అభినందనీయమని ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఛుంగ్ కొనియాడారు. వైద్యరంగంలో అత్యున్నతమైన సేవలందించిన వారికి ఇచ్చే ఈ పురస్కారాన్ని 40 ఏళ్లలో కేవలం 12 మంది మాత్రమే అందుకున్నారు.

ఆఫ్రికా గ్రూపునకు ఆస్ట్రిడ్ లిండ్‌గ్రెన్ ప్రైజ్పిల్లల్లో చదివే అలవాటును ప్రోత్సహిస్తున్న ఆఫ్రికన్ గ్రూపు ప్రాజెక్టు ఫర్ ద స్టడీ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ ఇన్ సౌత్ ఆఫ్రికా (పిఆర్‌ఎఇఎస్‌ఎ-ప్రయిసా)కు తొలిసారి పిల్లల సాహిత్యంలో అందజేసే ఆస్ట్రిడ్ లిండ్‌గ్రెన్ ప్రైజ్ దక్కింది.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు అవార్డుఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్(డీఐఏఎల్) కు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ పీకాక్ నేషనల్ క్వాలిటీ అవార్డు దక్కింది. ఈ అవార్డును ఏప్రిల్ 5న ప్రకటించారు. ఈ అవార్డును యూఏఈ మినిస్టర్ ఆఫ్ కల్చర్ దుబాయ్‌లో ఏప్రిల్ 20న ప్రదానం చేస్తారు.

No comments:

Post a Comment