AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday, 25 November 2017

క్రీడలు జూన్ 2012

క్రీడలు జూన్ 2012
28 జూన్ - 04 జూలై 2012 క్రీడలు

క్రీడలు
ఐసీసీ చీఫ్‌గా ఇశాక్ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చీఫ్‌గా న్యూజిలాండ్‌కు చెందిన అలెన్ ఇశాక్ జూన్ 28న బాధ్యతలు స్వీకరించారు. శరద్ పవార్(భారత్) నుంచి బాధ్యతలు స్వీకరించిన ఇశాక్ రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఈయన ఐసీసీకి ఎనిమిదో అధ్యక్షుడు. దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ రిచర్డ్ సన్ ఐసీసీ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు.

ఐదుగురు క్రికెటర్లపై బీసీసీఐ నిషేధందేశవాళీ క్రికెట్‌లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐదుగురు క్రికెటర్లపై నిషేధం విధించింది. వీరిలో..మధ్యప్రదేశ్ బౌలర్ టీపీ సుధీంద్ర (జీవిత కాల నిషేధం), పేసర్ శలభ్ శ్రీవాత్సవ (ఐదేళ్ల నిషేధం), బ్యాట్స్‌మెన్ మోనిష్ మిశ్రా, ఆఫ్ స్పిన్నర్ అమిత్ యాదవ్, ఆల్‌రౌండర్ అభినవ్ బాలి (ఏడాదిపాటు నిషేధం) ఉన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఐదో సీజన్ సమయంలో ఇండియా టీవీ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ ఐదుగురు క్రికెటర్లు పట్టుబడ్డారు. జీవిత కాల నిషేధం ఎదుర్కొన్న మూడో క్రికెటర్ సుధీంద్ర. గతంలో 1999-2000 మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో భారత జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత ఎంపీ మహ్మద్ అజ్హరుద్దీన్, ఓపెనర్ అజయ్ శర్మలపై కూడా బీసీసీఐ జీవిత కాల నిషేధం విధించింది (ఇదే కుంభకోణంలో అజయ్ జడేజా, మనోజ్ ప్రభాకర్‌లు ఐదేళ్ల నిషేధానికి గురయ్యారు).

యూరో కప్ విజేత స్పెయిన్యూరో కప్-2012 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను స్పెయిన్ గెలుచుకుంది. కీవ్(ఉక్రెయిన్)లో జూలై 2న జరిగిన ఫైనల్లో ఇటలీపై విజయం సాధించింది. స్పెయిన్‌కు ఇది వరుసగా రెండో యూరో కప్ విజయం. మొత్తం మీద యూరో చరిత్రలో మూడో విజయం. 1964, 2008, 2012లలో స్పెయిన్ విజేతగా నిలిచింది. 2010 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌ను కూడా స్పెయిన్ గెలుచుకుంది. యూరో-2012 టోర్నమెంట్‌లో అత్యధిక గోల్స్ చేసిన స్పెయిన్ ఫార్వర్డ్ ఫెర్నాండో టోరెస్‌కు ‘గోల్డెన్ బూట్’ అవార్డు దక్కింది.

అండర్-19 ఆసియా క్రికెట్ కప్అండర్-19 ఆసియా క్రికెట్ కప్ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో జూలై 1న ఈ టోర్నమెంట్ ముగిసింది. భారత జట్టు కెప్టెన్ ఉన్మక్త్ చంద్, సమీ అస్లామ్ (పాకిస్థాన్)కు సంయుక్తంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 21- 27 జూన్ 2012
క్రీడలు

ఫిడే మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నీ విజేత హంపిఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్ టైటిల్‌ను సాధించింది. కజాన్ (రష్యా)లో జూన్ 22న ముగిసిన ఈ టోర్నీలో హంపి, అనా ముజిచుక్ (స్లొవేనియా) నిర్ణీత రౌండ్ల తర్వాత సమాన పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. టైబ్రేక్ స్కోరు ఆధారంగా హంపికి తొలి స్థానం లభించింది.
ఆసియా బీచ్ కబడ్డీ విజేత భారత్ఆసియా బీచ్ క్రీడల్లో భారత మహిళల కబడ్డీ జట్టు చాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. జూన్ 19న హయాంగ్(చైనా) లో జరిగిన ఫైనల్లో థాయ్‌లాండ్‌ను ఓడించింది. పురుషుల విభాగంలో భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. బాస్కెట్‌బాల్ ఈవెంట్‌లో భారత మహిళల జట్టు టైటిల్‌ను గెలుచుకుంది. జూన్ 19న జరిగిన ఫైనల్లో చైనాను ఓడించింది. పురుషుల విభాగంలో తుర్‌‌కమెనిస్థాన్ స్వర్ణ పతకాన్ని సాధించింది.
యూరోపియన్ గ్రాండ్‌ప్రి విజేత అలోన్సోయూరోపియర్ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను ఫెరారీ డ్రైవర్ ఫెర్నాండో అలోన్సో గెలుచుకున్నాడు. వాలెన్సియా (స్పెయిన్)లో జూన్ 24న జరిగిన రేస్‌లో కిమీ రైకోనెన్(లోటస్) రెండో స్థానంలో నిలిచాడు.
భారత క్రికెట్‌కు 80 ఏళ్లుభారత జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేసి జూన్ 25 నాటికి 80 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1932 జూన్ 25న ఇంగ్లండ్‌లోని చారిత్రక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో భారత జట్టు తొలి టెస్ట్ మ్యాచ్ ఆడింది. తొలి మ్యాచ్‌లో భారత జట్టుకు కల్నల్ సి.కె.నాయుడు సారథిగా వ్యవహరించారు.
ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఆర్చరీ జట్టులండన్ ఒలింపిక్స్‌కు భారత పురుషుల ఆర్చరీ జట్టు అర్హత సాధించింది. అమెరికాలోని ఒగ్డెన్‌లో జరిగిన చివరి క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో భారత జట్టు 2వ స్థానంలో నిలిచి ఒలింపిక్స్‌కు అర్హత పొందింది.
14- 20 జూన్ 2012
క్రీడలు
సైనాకు ఇండోనేషియా ఓపెన్ టైటిల్ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గెలుచుకుంది. జూన్ 17న జకార్తాలో జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన జురుయ్ లీపై విజయం సాధించి మూడోసారి ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది. 2009, 2010లలో ఈ టైటిల్‌ను సాధించింది. 2011లో ఫైనల్‌లో పరాజయం పాలై రన్నరప్‌గా మిగిలింది. తాజా విజయంతో ఈ ఏడాదిలో సైనాకిది మూడో టైటిల్. గత మార్చిలో ఆమె స్విస్ ఓపెన్, ఇదే నెలలో థాయ్‌లాండ్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల విభాగంలో సియోన్ సాంతాసో విజేతగా నిలిచాడు.
యుఎస్ ఓపెన్ గోల్ఫ్ విజేత సింప్సన్యుఎస్ ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్‌ను అమెరికాకు చెందిన వెబ్ సింప్సన్ గెలుచుకున్నాడు. జూన్ 18న జరిగిన పోటీలో మైఖేల్ థామ్సన్‌పై విజయం సాధించాడు.
నేపాల్ క్రికెట్ బ్రాండ్ అంబాసిడర్‌గా ధోనినేపాల్ క్రికెట్ బ్రాండ్ అంబాసిడర్‌గా భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నియమితులయ్యారు. నేపాల్‌లో క్రికెట్ వ్యాప్తి కోసం అంబాసిడర్ హోదాలో ధోని కృషి చేస్తాడు.
07- 13 జూన్ 2012
మునాఫ్, యూసుఫ్‌లకు ఏకలవ్య ప్రదానంగుజరాత్ ప్రభుత్వం జూన్ 6న క్రికెటర్లు యూసుఫ్ పఠాన్, మునాఫ్ పటేల్‌లకు ఏకలవ్య అవార్డులను ప్రదానం చేసింది. భారత జట్టు క్రికెట్ ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించినందుకుగాను వీరిద్దరికి ఈ పురస్కారాలను అందజేశారు.
ఫ్రెంచ్ ఓపెన్-2012 విజేతల వివరాలుపురుషుల సింగిల్స్: ఈ టైటిల్‌ను రఫెల్ నాదల్(స్పెయిన్) గెలుచుకున్నాడు. జూన్ 11న జరిగిన ఫైనల్లో సెర్బియాకు చెందిన నొవాక్ జొకోవిచ్‌ను ఓడించాడు. నాదల్‌కు ఇది ఏడో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్. ఈ విజయంతో ఇప్పటిదాకా ఆరు టైటిల్స్‌తో స్వీడన్ ఆటగాడు జాన్ బోర్గ్ పేరిట ఉన్న ఫ్రెంచ్ ఓపెన్ రికార్డును బ్రేక్ చేశాడు. కెరీర్ మొత్తంలో నాదల్‌కిది 11వ గ్రాండ్ స్లామ్ టైటిల్. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకున్న రికార్డు రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్-16 టైటిల్స్) పేరిట ఉంది.
మహిళల సింగిల్స్: ఈ విభాగంలో మరియా షరపోవా(రష్యా) విజేతగా నిలిచింది. ఫైనల్లో సారా ఎరాని (ఇటలీ) పై విజయం సాధించింది. షరపోవాకిది నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఈ క్రమంలో టెన్నిస్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్)ను గెలుచుకున్న పదో క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.
మిక్స్‌డ్ డబుల్స్: ఈ విభాగంలో మహేష్ భూపతి-సానియా మీర్జా(భారత్) జోడి విజేతగా నిలిచింది. జూన్ 7న జరిగిన ఫైనల్లో జాన్స్ ఇగ్నాసిక్(పోలెండ్), సాంటియాగో గోంజాలెజ్(మెక్సికో) జంటపై విజయం సాధించారు. భూపతికి ఇది ఎనిమిదో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కాగా సానియాకు రెండో టైటిల్. ఈ జంటకు ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2009లో ఈ జంట ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకుంది.
మహిళల డబుల్స్: ఈ టైటిల్‌ను ఇటలీకి చెందిన సారా ఎరానీ, రాబెర్టా విన్సి జంట గెలుచుకుంది. మరియా కిర్లెంకో, నడియా పెట్రోవా జంటపై విజయం సాధించారు.
పురుషుల డబుల్స్: ఈ టైటిల్‌ను డేనియల్ నెస్టర్
(కెనడా), మ్యాక్స్ మిర్ని(బెలారస్) జోడీ గెలుచుకుంది. ఫైనల్లో బాబ్ బ్రయాన్-మైక్ బ్రయాన్(అమెరికా) జంటపై విజయం సాధించారు.
యూరో కప్ ప్రారంభంఫుట్‌బాల్ క్రీడలో ప్రపంచకప్ తర్వాత అత్యంత పెద్ద ఈవెంట్ యూరోకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ పోలెండ్‌లోని వార్సాలో జూన్ 8న ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌కు పోలెండ్, ఉక్రెయిన్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. 16 జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. జూలై 1న ఉక్రెయిన్‌లోని కీవ్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌తో టోర్నీ ముగుస్తుంది.
కామన్వెల్త్ ఓవరాల్ చాంపియన్ భారత్సమోవాలో జూన్ 9న ముగిసిన కామన్వెల్త్ వెయిట్
లిఫ్టింగ్ ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను భారత జట్టు గెలుచుకుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్ మొత్తం 45 (29 స్వర్ణాలు, 10 రజతాలు, 6 కాంస్య) పతకాలను సాధించింది.
సచిన్‌కు విజ్డెన్ అవార్డుఅంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు పూర్తి చేసుకున్న భారత స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు ‘విజ్డెన్ ఇండియా అవుట్ స్టాండింగ్ అఛీవ్‌మెంట్’ అవార్డు దక్కింది. దుబాయ్‌లో జూన్ 11న ఫెడిలిస్ వరల్డ్ నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని సచిన్ అందుకున్నాడు.
థాయ్ ఓపెన్ విజేత సైనాథాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గెలుచుకుంది. బ్యాంకాక్ (థాయ్‌లాండ్)లో జూన్ 10న జరిగిన ఫైనల్లో రత్చనోక్ ఇంతానోన్(థాయ్‌లాండ్)ను ఓడించింది. ఈ ఏడాది సైనాకిది రెండో టైటిల్. గత మార్చిలో ఆమె స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సాధించింది.
హామిల్టన్‌కు కెనడా గ్రాండ్ ప్రీకెనడా గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ టైటిల్‌ను మెక్‌లారెన్ డ్రైవర్ హామిల్టన్ గెలుచుకున్నాడు. జూన్ 11న మాంట్రియల్(కెనడా)లో జరిగిన రేస్‌లో ఫెరారీ డ్రైవర్ అలోన్సో రెండో స్థానంలో నిలిచాడు.
క్రీడలువిశ్వనాథన్ ఆనంద్‌కు ప్రపంచ చెస్ టైటిల్ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌ను భారత చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ గెలుచుకున్నాడు. మాస్కో (రష్యా)లో మే 30న ముగిసిన పోటీలో ఆనంద్, ఇజ్రాయెల్‌కు చెందిన బోరిస్ గెల్ఫాండ్ పై విజయం సాధించారు. ఆనంద్ ఐదో సారి ఈ టైటిల్‌ను దక్కించుకున్నాడు. గతంలో 2000, 2007, 2008, 2010లలో ఈ చాంపియన్‌షిప్‌ను సాధించాడు. ఆనంద్‌కు పద్మవిభూషణ్ పురస్కారం(2007)తోపాటు ఆరు చెస్ ఆస్కార్‌లు కూడా లభించాయి. తదుపరి ప్రపంచ చాంపియన్‌షిప్ 2014లో జరుగుతుంది.
ఫెదరర్ విజయాల రికార్డుఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో మే 30న మూడో రౌండ్‌కు చేరుకోవడం ద్వారా గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లలో అత్యధిక విజయాలు సాధించిన క్రీడాకారుడిగా రోజర్ ఫెదరర్(స్విట్జర్లాండ్) రికార్డు సృష్టించాడు. 233 విజయాలతో ఇప్పటిదాకా జిమ్మీ కానర్స్(అమెరికా) పేరిట ఉన్న రికార్డును ఫెదరర్ 234వ విజయంతో అధిగమించాడు.
అజ్లాన్‌షా హాకీ టోర్నీ విజేత న్యూజిలాండ్మలేషియాలో జూన్ 3న ముగిసిన 21వ అజ్లాన్‌షా హాకీ టోర్నమెంట్‌ను న్యూజిలాండ్ గెలుచుకుంది. ఫైనల్లో అర్జెంటీనాను ఓడించింది. ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు మూడో స్థానం దక్కింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా సర్దారా సింగ్(భారత్) నిలిచాడు.
రాజ్యసభ సభ్యుడిగా సచిన్ ప్రమాణంక్రికెటర్ సచిన్ టెండూల్కర్ రాజ్యసభ సభ్యుడిగా జూన్ 4న రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత పార్లమెంట్ సభ్యుల్లో సచిన్ నాలుగో అంతర్జాతీయ క్రికెటర్. మిగతా ముగ్గురు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ జాబితాలో మాజీ క్రికెటర్లు మహమ్మద్ అజహరుద్దీన్(మొరాదాబాద్), నవజ్యోత్ సింగ్ సిద్దూ (అమృత్‌సర్), కీర్తి ఆజాద్(దర్బంగ) ఉన్నారు. కానీ క్రీడలో కొనసాగుతున్నప్పుడే ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి ఆటగాడిగా సచిన్ నిలిచాడు.

No comments:

Post a Comment