AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

అవార్డులు డిసెంబరు 2014

అవార్డులు డిసెంబరు 2014
చంద్రశేఖరరెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతెలుగు రచయిత, విమర్శకుడు రాచపాళెం చంద్రశేఖరరెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన తెలుగులో రాసిన ‘మన నవలలు, మన కథానికలు’ అనే పుస్తకానికి ఉత్తమ విమర్శకుడిగా ఎంపికయ్యారు. చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రశేఖరరెడ్డి ప్రస్తుతం సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రానికి ప్రధాన బాధ్యులుగా సేవలందిస్తున్నారు. 22 భాషలకు చెందిన వారికి సాహిత్య అకాడమీ డిసెంబర్ 19న పురస్కారాలు ప్రకటించింది. పురస్కారం కింద తామ్ర పత్రం, లక్ష రూపాయలు ప్రదానం చేస్తారు.

No comments:

Post a Comment