AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

అవార్డులు ఏప్రిల్ 2016

అవార్డులు ఏప్రిల్ 2016
ఇద్దరు భారతీయులకు మంగోలియా అత్యున్నత పౌర పురస్కారం
మంగోలియా ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారం ‘నార్త్ స్టార్’ను ఇద్దరు భారతీయ విద్యావేత్తలకు ప్రదానం చేసింది. న్యూఢిల్లీలోని మంగోలియా దౌత్య కార్యాలయంలో ఏప్రిల్ 28న నిర్వహించిన కార్యక్రమంలో ఆ దేశ విదేశాంగ మంత్రి లుండెగ్ పురేవ్‌సురెన్ ఈ అవార్డును భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి (ఐసీసీఆర్) అధ్యక్షుడు లోకేశ్ చంద్ర, ఇందిరా గాంధీ జాతీయ కళా కేంద్ర మాజీ సలహాదారు మన్సూరా హైదర్‌లకు అందచేశారు.

తారా గాంధీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం 
ఫ్రాన్స్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్‌ను మహాత్మాగాంధీ మనవరాలు తారా గాంధీ భట్టాచార్జీ ఏప్రిల్ 20న న్యూఢిల్లీలో అందుకున్నారు. శాంతి, సామరస్యం, సంస్కృతి, విద్య రంగాల్లో చేసిన కృషికి గానూ ఆమెకు ఈ అవార్డు దక్కింది. తారా గాంధీ గత 28 ఏళ్లుగా గాంధీజీ స్థాపించిన కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, పిల్లలకు సేవలందిస్తున్నారు.

దక్షిణ మధ్య రైల్వేకు అవార్డుల పంట
2015-16 సంవత్సరానికి గాను పలు విభాగాల్లో దక్షిణ మధ్య రైల్వే ఆరు జాతీయస్థాయి అవార్డులను దక్కించుకుంది. 61వ జాతీయ రైల్వే వారోత్సవాల ముగింపు వేడుకలు ఏప్రిల్ 16న భువనేశ్వర్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభు నుంచి దక్షిణ మధ్య రైల్వే జి.ఎం. రవీంద్రగుప్తా అవార్డులు అందుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే.. ఆరోగ్య సంరక్షణ, స్టోర్స్, సివిల్ ఇంజనీరింగ్, భద్రత, వాణిజ్య విభాగం, పర్యావరణ పరిరక్షణ విభాగాల్లో అవార్డులు అందుకుంది. 
ఎయిర్ కోస్టాకు ఇండియా ట్రావెల్ అవార్డు
విమానయాన రంగ సంస్థ ఎయిర్ కోస్టా ‘మోస్ట్ ప్రామిసింగ్ ఎయిర్‌లైన్ 2016’ అవార్డును అందుకుంది. ‘ఇండియా ట్రావెల్ అవార్డ్స్’ దక్షిణాది ఎడిషన్ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించడంపై దృష్టి పెట్టిన తమకు ఈ అవార్డు రావడం ప్రోత్సాహకరంగా ఉంటుందని ఎయిర్ కోస్టా డిప్యూటీ సీఈవో వివేక్ చౌదరి తెలిపారు.
జొకోవిచ్, సెరెనాలకు లారెస్ స్పోర్ట్స్ అవార్డులు
ప్రపంచ టెన్నిస్ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్‌కు ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు దక్కింది. ‘స్టోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’ విభాగంలో జకోవిచ్ వరుసగా రెండో ఏడాది కూడా ఈ అవార్డు దక్కించుకోగా మొత్తంగా ఇది మూడోది. ఇక మహిళల విభాగంలో ‘స్పోర్ట్స్‌వుమెన్ ఆఫ్ ద ఇయర్’గా సెరెనా విలియమ్స్ నిలిచింది. వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్‌గా ఆల్ బ్లాక్స్ (కివీస్ రగ్బీ జట్టు) అవార్డు దక్కించుకోగా... జీవిత సాఫల్య పురస్కారాన్ని మూడుసార్లు ఎఫ్1 చాంపియన్‌గా నిలిచిన నికీ లాడా అందుకున్నారు.

జంగిల్ బుక్ దర్శకుడికి పెటా అవార్డు
జంగిల్ బుక్ సినిమా దర్శకుడు జాన్ ఫావ్‌రీయ్ ‘పెటా యూఎస్’ అవార్డుకు ఎంపికయ్యారు. జంగిల్ బుక్ సినిమాలో నిజమైన జంతువులకు బదులు కంప్యూటర్‌లో సృష్టించిన జంతు బొమ్మలను వినియోగించినందుకు ఆయన్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
మదర్ థెరిసాకు ఫౌండర్స్ అవార్డు
సేవాశీలి మదర్ థెరిసాకు ప్రఖ్యాత ఫౌండర్స్ అవార్డు లభించింది. అందరికీ ఆదర్శ ప్రాయంగా నిలిచే విజయాలను సాధించిన ఆసియా వారికి ఈ అవార్డులను ఏటా అందజేస్తారు. మొత్తం 14 విభాగాల్లో అవార్డులు ప్రదానం చే స్తారు. మదర్ థెరిసా భారత్‌లో చారిటీని స్థాపించి 45 ఏళ్లపాటు పేద ప్రజలకు, రోగులకు, అనాథలకు సేవ చేశారు. 1997లో కలకత్తాలో మరణించారు. థెరిసాకు దూరపు బంధువైన ఆమె మేనకొడలు అగి బొజాజియు ఈ అవార్డును అందుకున్నారు. 2010 నుంచి పాల్ సాగు అనే వ్యాపారవేత్త ఈ అవార్డులను అందజేస్తున్నారు.

కమల్ హాసన్‌కు హెన్రీ లాంగ్లోయిస్ అవార్డు
 
 విశ్వనటుడు కమల్ హాసన్‌కు ప్రతిష్టాత్మక హెన్రీ లాంగ్లోయిస్ అవార్డు దక్కింది. చలన చిత్రాలను భద్రపర్చే ప్రక్రియకు ఆద్యుడైన ఫ్రాన్స్ కళాకారుడు ఆర్చివిస్ట్ హెన్రీ లాంగ్లోయిస్ పేరుతో ప్రదానం చేస్తున్న ఈ అవార్డును ఇటీవల పారిస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కమల్‌కు అందజేశారు. తాను అవార్డు అందుకున్న విషయాన్ని కమల్ స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు.

విశ్వనాథన్ ఆనంద్‌కు ‘హృదయనాథ్ అవార్డు’భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ప్రతిష్టాత్మక హృదయనాథ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఏప్రిల్ 12న మహారాష్ట్ర గవర్నర్ సి.విద్యాసాగర్ రావు చేతుల మీదుగా ఆనంద్ ఈ అవార్డును అందుకుంటారు. అవార్డు కింద రూ.2 లక్షల నగదుతోపాటు ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేస్తారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వ్యక్తులకు ఏటా ఈ అవార్డును అందజేస్తున్నారు. గాయకురాలు లతా మంగేష్కర్, బాబాసాహెబ్ పురంధరే, ఆశా భోంస్లే, బాలీవుడ్ నటుడు అమితాబ్‌బచ్చన్, హరిప్రసాద్ చౌరాసియా, సంగీత దర్శకుడు రెహ్మాన్ తదితరులు ఈ అవార్డును అందుకున్నవారిలో ఉన్నారు.

No comments:

Post a Comment