AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday, 25 November 2017

క్రీడలు ఏప్రిల్ 2014

క్రీడలు ఏప్రిల్ 2014
చిత్ర మగిమైరాజ్‌కు ప్రపంచ మహిళల స్నూకర్ టైటిల్బెంగళూరుకు చెందిన చిత్రమగిమైరాజ్ ప్రపంచ మహిళల స్నూకర్ చాంపియన్ టైటిల్ గెలుచుకుంది. లీడ్స్ (ఇంగ్లండ్)లో ఏప్రిల్ 22న జరిగిన ఫైనల్‌లో బెలారస్‌కు చెందిన అలెనా అస్మోలోవను చిత్ర ఓడించి విజేతగా నిలిచింది. 

లిన్ డాన్, సుంగ్ జీలకు ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టైటిల్స్దక్షిణ కొరియాలో ఏప్రిల్ 27న ముగిసిన ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను లిన్‌డాన్, మహిళల సింగిల్స్ టైటిల్‌ను సుంగ్ జీ యున్ గెలుచుకున్నారు.
విజేతలుపురుషుల సింగిల్స్:లిన్ డాన్ (చైనా) ఫైనల్స్‌లో ససాకి షో (జపాన్)ను ఓడించి టైటిల్ గెలుచుకున్నాడు.
మహిళల సింగిల్స్: సుంగ్ జీ యున్ (కొరియా) గెలుచుకుంది. ఈమె ఫైనల్స్‌లో షిజియాన్ వాంగ్ (చైనా)ను ఓడించింది.
పురుషుల డబుల్స్: షిన్ బీక్ చోయెల్ - యు యోన్ సియోంగ్ (కొరియా) గెలుచుకున్నారు. వీరు లియు, యుచెన్ (చైనా)లను ఓడించారు. మహిళల డబుల్స్: లూ యింగ్ - లు యు (చైనా) గెలుచుకున్నారు. వీరు కిమ్ హ నా-జుంగ్ యుంగ్ యున్ (కొరియా)లను ఓడించారు. మిక్స్‌డ్ డబుల్స్: లీ చున్ హె - చావు హో వా (హాంకాంగ్) గెలుచుకున్నారు. వీరు ఫైనల్స్‌లో షిన్ బీక్ చోయెల్ - జాంగ్ యె నా (కొరియా)లను ఓడించారు. ఈ చాంపియన్‌షిప్ లో భారత్‌కు చెందిన సింధు, జ్వాల-అశ్విని జోడికి కాంస్య పతకాలు లభించాయి.

లాహిరికి గోల్ఫ్ ఆసియన్ టూర్ టైటిల్భారత్‌కు చెందిన అనిర్బన్ లాహిరి గోల్ఫ్ ఆసియన్ టూర్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. జకర్తాలో ఏప్రిల్ 27న ముగిసిన పోటీలో లాహిరి టైటిల్ సాధించగా కొరియాకు చెందిన బేక్ సెయుహైన్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ టైటిల్ లాహిరి గెలుచుకోవడం ఇది నాలుగోసారి.

ఎమ్మా బొన్నీకి ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్స్ టైటిల్ఎమ్మాబొన్నీ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంది. లీడ్స్‌లో ఏప్రిల్ 24న జరిగిన ఫైనల్‌లో భారత్‌కు చెందిన ఉమాదేవి నాగరాజ్‌ను బోన్నీ ఓడించింది. ఈ టైటిల్‌ను భారత్ నుంచి తొలిసారి 2005లో అనూజ ఠాకూర్ గెలుచుకుంది. తర్వాత 2006, 2007లో చిత్ర గెలుచుకుంది.

షరపోవాకు పోర్షే గ్రాండ్ ప్రి టైటిల్పోర్షే గ్రాండ్ ప్రి టెన్నిస్ టైటిల్‌ను మరియా షరపోవా గెలుచుకుంది. స్టుట్‌గార్‌‌టలో ఏప్రిల్ 27న జరిగిన ఫైనల్స్‌లో అనా ఇవనోవిక్‌ను షరపోవా ఓడించింది.
మొదలైన ఐపీఎల్ -7
దుబాయ్ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-7 పోటీలు ఏప్రిల్ 16న ప్రారంభమయ్యాయి. ఇందులో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం ప్రైజ్ మనీ: రూ.30 కోట్లు (అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ టోర్నీలోనూ ఇంత ప్రైజ్‌మనీ లేదు; విజేతకు ప్రైజ్ మనీ: రూ. 13 కోట్లు, రన్నరప్‌కు: రూ. 8 కోట్లు).
ఆసియా క్రీడలను నిర్వహించలేమన్న వియత్నాం
2019లో జరిగే 18వ ఆసియా క్రీడల నిర్వహణ నుంచి వైదొలుగుతున్నట్లు వియత్నాం ప్రకటించింది. ఇలాంటి పెద్ద ఈవెంట్స్‌ను గతంలో నిర్వహించిన అనుభవం లేకపోవడంతో పాటు, దేశంలో నెలకొన్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వియత్నాం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
రిచ్‌మండ్ ఓపెన్‌టోర్నీ విజేత జోష్నా 
అమెరికాలో జరిగిన రిచ్‌మండ్ ఓపెన్‌టోర్నీలో భారత క్రీడాకారిణి జోష్నా చినప్ప విజేతగా నిలిచింది. ఏప్రిల్ 19న జరిగిన ఫైనల్లో ప్రపంచ మాజీ చాంపియన్ రాచల్ గ్రిన్‌హమ్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది. ఈ గెలుపుతో జోష్నా తొమ్మిదో సారి మహిళల స్వ్కాష్ అసోసియేషన్ టూర్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.
వావ్రింకాకు మోంటెకార్లో మాస్టర్స్ టైటిల్ 
మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను స్విట్జర్లాండ్ టెన్నిస్ ఆటగాడు వావ్రింకా గెలుచుకున్నాడు. ఏప్రిల్ 20న జరిగిన ఫైనల్లో తన దేశానికే చెందిన రోజర్‌ఫెదరర్‌ను ఓడించాడు. మాస్టర్స్‌సిరీస్‌ను గెలుచుకోవడం వావ్రింకాకు ఇది మొదటిసారి. టోర్నీలో డబుల్స్ విభాగంలో బ్రయాన్ సోదరులు (మైక్ బ్రయాన్, బాబ్ బ్రయాన్) విజేతలుగా నిలిచారు. కాగా వీరిలో మైక్ బ్రయాన్‌కు ఇది 100వ టైటిల్. తద్వారా డబుల్స్ ఈవెంట్స్‌లో వంద టైటిల్స్ నెగ్గిన తొలి క్రీడాకారుడిగా మైక్ గుర్తింపు పొందాడు. 
చైనాగ్రాండ్ ప్రి విజేత హామిల్టన్ 
మెర్సిడెస్ జట్టు డ్రై వర్ లూయిస్ హామిల్టన్ ఫార్ములా వన్ చైనా గ్రాండ్ ప్రి విజేతగా నిలిచాడు. షాంఘైలో ఏప్రిల్ 20న జరిగిన పోటీలో హామిల్టన్ మొదటి స్థానంలో నిలవగా, మరో మెర్సిడెస్ డ్రై వర్ రోస్‌బర్గ్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కు ఇది వరుసగా మూడో విజయం. ఇదివరకే మలేసియా, బహ్రెయిన్ గ్రాండ్ ప్రిలను కైవసం చేసుకున్నాడు.
ఆసియా బ్లిట్జ్ చెస్‌లో హారిక, హరికృష్ణలకు రజతాలు
ఆసియా బ్లిట్జ్‌చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్లు పెంటేల హరికృష్ణ, ద్రోణవల్లి హారికలు రజత పతకాలను సాధించారు. ఏప్రిల్ 19 న షార్జాలో జరిగిన టోర్నీ ఓపెన్ విభాగంలో యూయాంగ్వీ (చైనా) తొలి స్థానంలో నిలిచి స్వర్ణం సొంతం చేసుకోగా, హరికష్ణ రెండోస్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో టాన్‌జోంగ్యీ (చైనా)కు స్వర్ణం లభించగా, హారిక రజత పతకాన్ని కైవసం చేసుకుంది.

ప్రపంచ టి-20 జట్టు కెప్టెన్‌గా ధోని
ఐసీసీ ప్రపంచ టి-20 జట్టు కెప్టెన్‌గా భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎంపికయ్యాడు. ధోనితోపాటు మరో ముగ్గురు భారత క్రికెటర్లు రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లి, అశ్విన్‌లకు కూడా ఈ జట్టులో స్థానం లభించింది.
విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా శిఖర్ ధావన్ 
భారత క్రికెటర్ శిఖర్ ధావన్ విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యాడు. ధావన్‌తోపాటు మరో నలుగురు క్రికెటర్లు.. ర్యాన్‌హారిస్ (ఆస్ట్రేలియా), క్రిస్‌రోజర్స్ (ఆస్ట్రే లియా), జో రూట్ (ఇంగ్లండ్), ఇంగ్లండ్ మహిళల జట్టు కెప్టెన్ ఎడ్వర్డ్స్ కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2013లో కనబరిచిన ఉత్తమ ఆటతీరుకు వీరిని ఎంపిక చేశారు. విజ్డన్ లీడింగ్ క్రికెటర్‌గా డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) నిలిచాడు. 
మానవ్‌జిత్‌కు స్వర్ణం 
ఐఎస్‌ఎస్‌ఎఫ్ షాట్‌గన్ ప్రపంచకప్ పురుషుల ట్రాప్ విభాగంలో భారత షూటర్ మానవ్‌జిత్ సింగ్ సంధు స్వర్ణం సాధించాడు. సంధు నాలుగేళ్ల క్రితం ప్రపంచకప్‌లోను విజేతగా గెలిచాడు. రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచిన మైకేల్ డైమండ్ రజతంతో సరిపెట్టుకున్నాడు.
ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత బరోడా
సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టీ-20 టోర్నీ విజేతగా బరోడా జట్టు నిలిచింది. ఏప్రిల్ 14న జరిగిన ఫైనల్లో ఉత్తరప్రదేశ్‌పై గెలిచింది.
దక్షిణాసియా జూడోలో భారత్‌కు పది స్వర్ణాలు
నేపాల్ రాజధాని ఖాట్మాండులో జరిగిన దక్షిణాసియా జూడో ఛాంపియన్‌షిప్‌లో భారత్ 10 స్వర్ణాలతో ఆధిపత్యం ప్రదర్శించింది. ఏప్రిల్ 10 నుంచి 13 వరకు జరిగిన ఈ పోటీల్లో 12 మందితో కూడిన భారత జుడోకాల బృందం 10 స్వర్ణాలతో పాటు చెరో రజతం, కాంస్యం సాధించింది. 
టెక్సాస్ రన్నరప్ దీపిక
భారత నంబర్‌వన్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ టెక్సాస్ ఓపెన్‌టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈజిప్ట్ క్రీడాకారిణి నూర్‌ఎల్ షెర్బినితో జరిగిన ఫైనల్లో దీపిక ఓడిపోయింది.

టి-20 ప్రపంచ చాంపియన్ శ్రీలంక
బంగ్లాదేశ్‌లో జరిగిన టి-20 ప్రపంచకప్‌ను శ్రీలంక గెలుచుకుంది. ఫైనల్లో భారత్‌ను ఓడించింది. దీంతో 1996 తర్వాత ఐసీసీ నిర్వహించిన పోటీలో శ్రీలంక విజేతగా నిలిచింది. విజేతగా నిలిచిన శ్రీలంకకు 11 లక్షల డాలర్లు (రూ.6.6 కోట్లు), రన్నరప్ భారత్‌కు 3.3 కోట్లు ప్రై జ్‌మనీ లభించింది. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు విరాట్‌కోహ్లికి దక్కింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా శ్రీలంక బ్యాట్స్‌మన్ కుమార సంగక్కర ఎంపికయ్యాడు. ఇదే టోర్నీకి సమాంతంగా జరిగిన టి-20 మహిళల ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఇప్పటివరకు నాలుగుసార్లు టి-20 ప్రపంచకప్ పో టీలు జరగ్గా... ఆస్ట్రేలియా మహిళల జట్టు వరుసగా 2010, 2012, 2014లలో టైటిల్స్ గెలిచి హ్యాట్రిక్ సాధించింది. 

అంజూబాబీకి స్వర్ణం- ఐఏఏఎఫ్ ప్రకటన 2005 ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్లో భారత లాంగ్ జంపర్ అంజూ బాబీ జార్జ్ స్వర్ణపతకం గెలుచుకున్నట్లుగా ఏప్రిల్ 1న ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ (ఐఏఏఎఫ్) అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్ పోటీల్లో స్వర్ణపతకం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా అంజూ చరిత్ర సష్టించింది. మొనాకోలో జరిగిన 2005 ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్లో రష్యా క్రీడాకారిణి తత్యనా కోటోవా ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణం సాధించింది. అయితే ఆమెపై అనర్హత వేటుపడిన కారణంగా రెండో స్థానంలో నిలిచిన అంజూ స్వర్ణ పతకం గెలిచినట్లు దృవీకరించారు.

ధోనికి 2014-ఆసియా అవార్డుటీమిండియా క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్‌ధోనికి 2014 ఆసియా అవార్డు వరించింది. క్రీడా రంగంలో అద్వితీయ ప్రతిభను కనబరిచినందుకు ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు అవార్డు ఎంపిక కమిటీ పేర్కొంది.

మార్టినా హింగిస్ జోడికి సోనీ ఓపెన్ టైటిల్మార్టినా హింగిస్, సబినా లిసికి జోడి సోనీ ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను గెలుచుకుంది. మియామిలో మార్చి 31న జరిగిన ఫైనల్లో ఎక్టెరినా మకరోవా, ఎవెనా వెస్నినా జంటను హింగిస్ జంట ఓడించింది. 

భారత బాక్సింగ్ సమాఖ్య గుర్తింపు రద్దుప్రభుత్వ మార్గదర్శకాలను పాటించేందుకు తిరస్కరించిన భారత అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్య (ఐఏబీఎఫ్) గుర్తింపును కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 1న రద్దుచేసింది. మార్చి 4న ఇదే సమాఖ్యపై అంతర్జాతీయ అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్య (ఏఐబీఏ) సస్పెన్షన్ వేటువేసింది. ఐఏబీఎఫ్ నియమావళిని సవరించి తాజాగా ఎన్నికలు నిర్వహించాలని అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య సూచించింది. ఇలా అంతర్జాతీయ సమాఖ్య, క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశాలను, సూచనలను భారత బాక్సింగ్ సమాఖ్య ఇప్పటివరకూ పాటించలేదు. అలాగే ఇంతకు ముందు నిర్వహించిన ఎన్నికలను రద్దుచేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో ఐఏబీఎఫ్ గుర్తింపును రద్దు చేసినట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వివరించింది. గతంలోనూ ఈ సమాఖ్యపై 2012 డిసెంబర్‌లో తాత్కాలిక సస్పెన్షన్‌ను క్రీడామంత్రిత్వ శాఖ విధించింది.

జకోవిచ్‌కు మియామి ఓపెన్ టైటిల్మియామి ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను నోవాక్ జకోవిచ్ గెలుచుకున్నాడు. మియామిలో మార్చి 31న జరిగిన ఫైనల్లో రాఫెల్ నాదల్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. 

ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ విజేతలు 
న్యూఢిల్లీలో ఏప్రిల్ 6తో ముగిసిన ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్ విజేతలు - విభాగాల వారీగా పురుషుల సింగిల్స్: లీచోంగ్‌వీ (మలేషియా); పురుషుల డబుల్స్: డెన్మార్క్‌కు చెందిన మాథియాస్‌బో, కార్‌స్టెన్ మోగెన్సన్; మహిళల సింగిల్స్: షిజియాన్ వాంగ్ (చైనా); మహిళల డబుల్స్: యువాన్‌తింగ్, యాంగ్‌యూ (చైనా); మిక్స్‌డ్ డబుల్స్: జోచిమ్ నీల్సన్, క్రిస్టినా పెడర్సన్ (డెన్మార్క్).

No comments:

Post a Comment