AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday, 25 November 2017

అవార్డులు ఏప్రిల్ 2014

అవార్డులు ఏప్రిల్ 2014
సురైయా బోస్‌కు యుధ్‌వీర్ అవార్డు23వ యుధ్‌వీర్ ఫౌండేషన్ మెమోరియల్ అవార్డు సురైయా హస్సన్ బోస్‌కు లభించింది. అంతరించిపోతున్న హిమారో, పైథాని, జమవర్, మస్రూ, నిజామీ-పర్షియన్ నైపుణ్యాలను పునరుజ్జీవింప చేసినందుకు ఆమె యుధ్‌వీర్ అవార్డుకు ఎంపికయ్యారు.

సౌరవ్‌గోసాల్‌కు ఆసియన్ స్క్వాష్ ఫెడరేషన్ అవార్డుభారత ఏస్ క్రీడాకారుడు సౌరవ్‌గోసాల్‌ను 2013 అత్యుత్తమ ఆసియా పురుషుల క్రీడాకారుడిగా డాటో అలెక్స్‌లీ అవార్డుకు ఆసియా స్క్వాష్ ఫెడరేషన్ ఎంపిక చేసింది. హాంగ్‌కాంగ్‌కు చెందిన అన్నీ ఆయు వింగ్ చి అత్యుత్తమ మహిళా క్రీడాకారిణిగా ఎంపికైంది. అత్యుత్తమ పురుషుల టీమ్‌గా భారత పురుషుల జట్టు నిలిచింది. అత్యుత్తమ మహిళల టీమ్‌గా హాంగ్‌కాంగ్ జూనియర్ జట్టు ఎంపికైంది.

రమేశ్ అగర్వాల్‌కు గ్రీన్ నోబెల్ అవార్డుచత్తీస్‌గఢ్ పర్యావరణ కార్యకర్త రమేశ్ అగర్వాల్‌కు గోల్డ్‌మాన్ పర్యావరణ బహుమతి లభించింది. గ్రీన్ నోబెల్ అని కూడా పిలిచే ఈ అవార్డును ఏప్రిల్ 27న శాన్‌ఫ్రాన్సిస్కోలో ప్రకటించారు. ఈ అవార్డు కింద రూ. 1.06 కోట్ల నగదు బహుకరిస్తారు.
జాతీయ చలన చిత్ర అవార్డులు
2013 సంవత్సరానికి 61వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 16న ప్రకటించింది. ప్రముఖ దర్శకుడు సయీద్ అక్తర్ మీర్జా నేతత్వంలోని జ్యూరీ ఈ అవార్డు విజేతలను ఎంపిక చేసింది. వివరాలు ఉత్తమ చిత్రం:షిప్ ఆఫ్ థీసీయస్ (హిందీ-ఇంగ్లీష్) ఉత్తమ దర్శకుడు: హన్సల్ మెహతా (షాహిద్ - హిందీ) ఉత్తమ నటుడు (ఇద్దరికి సంయుక్తంగా):రాజ్‌కుమార్ రావ్ (షాహిద్ - హిందీ), సూరజ్ వెంజారమూడు (పెరారియావతర్ - మలయాళం)ఉత్తమనటి:గీతాంజలి థాపా (లయర్‌‌స డైస్ - హిందీ)ఉత్తమ సామాజికాంశ చిత్రం: గులాబ్ గ్యాంగ్ (హిందీ)ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: భాగ్ మిల్కా భాగ్ (హిందీ)ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం (నర్గీస్ దత్ అవార్డు):బాలు మహేంద్ర (తలైమురైగల్ - తమిళం)ఉత్తమ బాలల చిత్రం: కపాల్ (హిందీ)ఉత్తమ హిందీ చిత్రం:జాలీ ఎల్ ఎల్ బీఉత్తమ నేపథ్య గాయకుడు:రూపాంకర్ (జాతీశ్వర్ - బెంగాలీ)ఉత్తమ నేపథ్య గాయనీ:బెలా షిండే (తుహ్యా ధర్మ కొంచా - మరాఠీ)ఉత్తమ మాటల రచయిత:సుమిత్రాభావే (అస్తు - మరాఠీ)ఉత్తమ పాటల రచయిత:ఎన్ ఎ ముత్తుకుమార్ (తంగా మింకాల్ - తమిళం)ఉత్తమ నత్య దర్శకత్వం:గణేశ్ ఆచార్య (భాగ్ మిల్కాభాగ్- హిందీ)ఉత్తమ సంగీత దర్శకత్వం:కబీర్ సుమన్ (జాతీశ్వర్ - బెంగాలీ). 
అవార్డులు పొందిన తెలుగు చిత్రాలు: ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం:నాబంగారు తల్లి ఉత్తమ నేపథ్య సంగీతం:శంతనూ మొయిత్రా (నా బంగారు తల్లి)స్పెషల్ జూరీ పురస్కారం:అంజలీ పాటిల్ (నా బంగారు తల్లి)ఉత్తమ సినిమా పుస్తకం: సినిమాగా సినిమా (నందగోపాల్-తెలుగు)
రాజేంద్ర సింగ్‌కు ‘సోలార్ చాంపియన్స్ ఆఫ్ ఛేంజ్’ 
ఇండో-అమెరికన్ రాజేంద్ర సింగ్‌కు ‘సోలార్ చాంపియన్స్ ఆఫ్ ఛేంజ్’ పురస్కారం దక్కింది. సోలార్ విద్యుత్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నందుకుగాను అమెరికా ప్రభుత్వం రాజేంద్ర సింగ్‌ను ఈ అవార్డుతో గౌరవించింది. రాజేంద్ర సింగ్ క్లెమ్సన్ యూనివర్సిటీలో సిలికాన్ నానోఎలక్ట్రానిక్స్ విభాగానికి డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అమెరికాలో సోలార్ విద్యుత్ విస్తరణ కృషి చేసిన 10 మందిని ఆ దేశ ప్రభుత్వం ప్రతి ఏటా ‘సోలార్ చాంపియన్స్ ఆఫ్ ఛేంజ్’ పురస్కారంతో సత్కరిస్తుంది.

గుల్జార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం 
ప్రముఖ కవి, సినీ గేయరచయిత, దర్శక-నిర్మాత గుల్జార్‌ను ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. గుల్జార్ బహుముఖ ప్రజ్ఞాశాలి. పాటలు, కథ, మాటల రచయితగా , దర్శకునిగా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించి దేశంలోనే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే. ఈ పురస్కారాన్ని అందుకున్న 45వ వ్యక్తి గుల్జార్. అవార్డు కింద రూ. 10 లక్షల నగదుతోపాటు స్వర్ణకమలం అందజేస్తారు. 79 ఏళ్ల గుల్జార్ అసలుపేరు సంపూరణ్ సింగ్ కల్రా. 1934లో పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో జన్మించారు. దేశ విభజన అనంతరం గుల్జార్ కుటుంబం అమత్‌సర్‌లో స్థిరపడింది. 2002లో ఆయనకు సాహిత్య అకాడమీ, 2004లో పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. 2009లో స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంలోని జయహో పాటకు గాను ఏఆర్‌రెహ్మాన్‌తో కలిసి ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్నారు. 2010లో జయహో పాటకు గ్రామీ అవార్డు దక్కింది.

రతన్‌టాటాకు బ్రిటిష్ అవార్డు టాటాగ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటాకు బ్రిటన్‌లోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన నైట్ గ్రాండ్ క్రాస్ లభించింది. బ్రిటన్, భారత్‌ల మధ్య సంబంధాలు, బ్రిటన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు చేసిన కృషి, దాతృత్వానికి గుర్తింపుగా ఈ అవార్డును ఏప్రిల్10న ప్రకటించారు. క్వీన్ ఎలిజబెత్ చేతుల మీదుగా దీన్ని అందుకుంటారని బ్రిటన్‌కు చెందిన ఫారెన్ అండ్ కామన్ వెల్త్ ఆఫీస్ వెల్లడించింది. 2014కి ఐదుగురు విదేశీయులకు గౌరవ బ్రిటీష్ అవార్డులను ప్రకటించారు. అందులో రతన్‌టాటా ఒకరు. 2009లో టాటాకు నైట్ కమాండర్ అవార్డు ఇచ్చి బ్రిటన్ సత్కరించింది. 

విజయ్ శేషాద్రికి పులిట్జర్భారత సంతతికి చెందిన విజయ్‌శేషాద్రికి 2014 పులిట్జర్ అవార్డు వరించింది. శేషాద్రి కవితా సంకలనం ‘3-సెక్షన్స్’ కుగాను ఈ పురస్కారం లభించింది. 98 వార్షికోత్సవం సందర్భంగా అవార్డుల ఎంపిక కమిటీ జర్నలిజం, లెటర్స్, డ్రామా, సంగీతం, విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులను ప్రకటించింది. అవార్డు కింద 10 వేల డాలర్లను అందజేస్తారు. శేషాద్రి 1954లో బెంగళూర్‌లో జన్మించారు. అమెరికాలోని కొలంబియాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆయన న్యూయార్క్‌లో సారాలారెన్స్‌లిబరల్ ఆర్ట్స్ కళాశాలలో పద్యవిభాగంలో అధ్యాపకునిగా పని చేస్తున్నారు.

No comments:

Post a Comment