AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

అవార్డులు నవంబరు 2017

అవార్డులు నవంబరు 2017
కృష్ణ సోబతీకి జ్ఞానపీఠ్ పురస్కారం ప్రముఖ హిందీ సాహితీవేత్త కృష్ణ సోబతీ(92) ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కారం 2017 కు ఎంపికైంది. ఆమె ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న గుజరాత్‌లో జన్మించారు. ప్రయోగాత్మక, విలక్షణ శైలి కృష్ణ సోబతి ప్రత్యేకత. ఆమె రాసిన ‘దార్ సే బిఛుడీ, మిత్రో మర్జానీ, జిందగీనామా’ తదితర రచనలు ప్రఖ్యాతి గాంచాయి. దేశ విభజన, స్త్రీ, పురుష సంబంధాలు, మారుతున్న భారతీయ సమాజ స్థితిగతులు, పతనమవుతున్న మానవ విలువలు వంటివి ఆమె రచనల్లో ముఖ్యంగా కన్పిస్తాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : జ్ఞాన్‌పీఠ్ పురస్కారం 2017
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : కృష్ణ సోబతీ
ఎందుకు : హిందీ సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు

బ్రహ్మానందం, జగపతిబాబులకు జీవన సాఫల్య పురస్కారంతెలుగు నటులు బ్రహ్మానందం, జగపతిబాబుకు ఢిల్లీ తెలుగు అకాడమీ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. ఈ మేరకు నవంబర్ 5న అకాడమీ 29వ వార్షికోత్సవంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ వారికి అవార్డులు ప్రదానం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రహ్మానందం, జగపతిబాబులకు జీవన సాఫల్య పురస్కారం
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : ఢిల్లీ తెలుగు అకాడమీ

పవర్‌గ్రిడ్‌కు ఇన్‌ఫ్రా అవార్డుప్రభుత్వ రంగ విద్యుత్తు కంపెనీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు పవర్ ట్రాన్స్‌మిషన్ రంగంలో 2017 సంవత్సరానికి గాను డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఇన్‌ఫ్రా అవార్డు లభించింది. నవంబర్ 6న ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో పవర్ గ్రిడ్ ఈడీ వి.కె. ఖరే, జీఎమ్(హెచ్‌ఆర్) అనిల్ గైక్వాడ్, ఏజీఎమ్ అజయ్ హొలాని ఈ అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఇన్‌ఫ్రా అవార్డు 2017
ఎప్పుడు : నవంబర్ 6 
ఎవరు : పవర్‌గ్రిడ్ కార్పోరేషన్

No comments:

Post a Comment