AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday, 25 November 2017

క్రీడలు జూలై 2013

క్రీడలు జూలై 2013
రిటైర్మెంట్ ప్రకటించిన ఇసిన్బయేవావచ్చే ఆగస్టులో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ తర్వాత కెరీర్కు వీడ్కోలు పలుకుతున్నట్లు రష్యాకు చెందిన ప్రముఖ పోల్వాల్ట్ క్రీడాకారిణి ఎలెనా ఇసిన్బయేవా (31) ప్రకటించింది. జూలై 24న మాస్కోలో జరిగిన రష్యా జాతీయ చాంపియన్షిప్లో స్వర్ణ పతకం గెలిచిన తర్వాత తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించింది. 

ఇసిన్బయేవా ఘనతలు:2004 ఏథెన్స్, 2008 బీజింగ్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకాలు. 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకం.
2005, 2007 ప్రపంచ చాంపియన్షిప్లలో పసిడి.
2005 నుంచి 2009 వరకు ప్రపంచ నంబర్వన్.
2005లో మహిళల పోల్వాల్ట్లో 5 మీటర్ల ఎత్తును అధిగమించిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు.

ప్రపంచ వికలాంగుల చెస్ చాంపియన్గా జెనితాతమిళనాడుకు చెందిన జెనితా ఆంటో (26) ప్రపంచ వికలాంగుల చెస్ చాంపియన్షిప్ను గెలుచుకుంది. చెక్ రిపబ్లిక్లో జూలై 24న ముగిసిన పోటీల్లో జెనితా విజేతగా నిలవడంతోపాటు మహిళా అంతర్జాతీయ మాస్టర్ టైటిల్ను దక్కించుకుంది. ఈ హోదాతో ఆమెకు ప్రీమియర్ ఈవెంట్ మినహా మిగతా జాతీయ చాంపియన్షిప్లలో నేరుగా ఎంట్రీ లభిస్తుంది. అంతర్జాతీయ వికలాంగుల చెస్ సంఘం (ఐపీసీఏ) ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈవెంట్లో 15 దేశాల నుంచి 49 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 

జూడో క్రీడాకారిణి బ్రోజేశ్వరి దేవి మృతిఒలింపిక్స్ క్రీడల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళా జూడో క్రీడాకారిణి బ్రోజేశ్వరి దేవి (32) జూలై 21న మృతి చెందింది. ‘ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ’ కారణంగా ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. మణిపూర్కు చెందిన బ్రోజేశ్వరి 2000 సిడ్నీ ఒలింపిక్స్లో 52 కిలోల విభాగంలో బరిలోకి దిగి క్వార్టర్ ఫైనల్ వరకు చేరింది.

హంగేరి గ్రాండ్ పి విజేత హామిల్టన్హంగేరి గ్రాండ్ ప్రి టైటిల్ను మెర్సిడెస్ డ్రైవర్ హామిల్టన్ గెలుచుకున్నాడు. లోటస్కు చెందిన రైకోనన్కు రెండో స్థానం.. వెటెల్కు మూడో స్థానం లభించాయి.

ఉసేన్బోల్ట్కు స్వర్ణంజమైకన్ స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ లండన్ డైమండ్ లీగ్ ఈవెంట్లో 100 మీటర్ల పరుగులో చాంపియన్గా నిలిచాడు. లండన్లో జూలై 20న జరిగిన 100 మీటర్ల పరుగుపందెంలో బోల్ట్ 9.85 సెకన్లలో పరుగు పూర్తిచేసి విజేతగా నిలిచాడు. 

ఆసియా రెజ్లింగ్లో భారత్కు టీంటైటిల్ఆసియా క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత్కు టీంటైటిల్ లభించింది. ఈ పోటీలు జూలై 27న మంగోలియాలోని ఉలాన్బాతర్లో ముగిశాయి. ఈ పోటీల్లో భారత్ మొత్తం 15 పతకాలు సాధించింది. ఇందులో మూడు స్వర్ణ, తొమ్మిది రజతాలు, మూడు కాంస్య పతకాలున్నాయి.

దివిజ్-పురవ్రాజా జోడికి తొలి ఏటీపీ టైటిల్జంటగా బరిలోకి దిగిన తొలి ఏటీపీ వరల్డ్ టూర్ టోర్నమెంట్ కార్లో ఓపెన్లో దివిజ్ శరణ్-పురవ్ రాజా జోడి విజేతగా నిలిచింది. జూలై 21న కొలంబియాలో జరిగిన క్లారో ఓపెన్ ఫైనల్లో వాసెలిన్ (ఫ్రాన్స్)-సిస్లింగ్ (నెదర్లాండ్స్) జంటను ఓడించింది. విజేతగా నిలిచిన దివిజ్-పురవ్ జంటకు 35 వేల డాలర్ల (రూ. 20 లక్షల 78 వేలు) ప్రైజ్మనీతోపాటు 250 ఏటీపీ ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 

సింగిల్స్ చాంప్ సాయిప్రణీత్ ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో సాయిప్రణీత్ సింగిల్స్ చాంపియన్గా నిలిచాడు. జూలై 21న పుణేలో జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్కే చెందిన కిడాంబి శ్రీకాంత్ను ఓడించాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్ రెడ్డి, మనూ అత్రి (ఏఏఐ) జంట కోనా తరుణ్-అరుణ్ విష్ణులపై గెలిచి టైటిల్ సాధించింది. మహిళల డబుల్స్ ఫైనల్లో అశ్విని పొన్నప్ప (పీఎస్పీబీ)-ప్రద్న్యా గాద్రె (ఏఏఐ) జోడి సిక్కి రెడ్డి (ఏఏఐ)-అపర్ణ బాలన్ (పీఎస్పీబీ)లపై గెలిచి మహిళల డబుల్స్ టైటిల్ గెలుపొందారు. 

దక్షిణాసియా టీటీలో భారత్కు పసిడిదక్షిణాసియా జూనియర్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో రాష్ట్రానికి చెందిన ఆకుల శ్రీజ ప్రాతినిధ్యం వహించిన భారత క్యాడెట్ బాలికల జట్టు టోర్నీలో చాంపియన్గా నిలిచింది. జూనియర్ బాలబాలికల టైటిళ్లను సుధాన్షు గ్రోవర్, సుతీర్థ ముఖర్జీలు చేజిక్కించుకోగా, అనిర్బన్ ఘోష్, సాగరిక ముఖర్జీ క్యాడెట్ బాలబాలికల విభాగంలో చాంపియన్లుగా నిలిచారు. దీంతో భారత్ పది బంగారు పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. పలు రజతాలతో సరిపెట్టుకున్న శ్రీలంక రన్నరప్గా నిలిచింది. ఈ ఇరు జట్లు దోహాలో జరిగే ఆసియా జూనియర్ చాంపియన్షిప్కు అర్హత సంపాదించాయి. జూనియర్ బాలికల డబుల్స్ టైటిల్ను మానిక బాత్రా-సుతీర్థ జోడి గెలుచుకోగా, బాలుర డబుల్స్లో అభిషేక్ యాదవ్-సుధాన్షు గెలుపొందారు.

ఆర్చరీలో భారత మహిళల టీమ్కు స్వర్ణంఆర్చరీ ప్రపంచ కప్ టోర్నమెంట్లో దీపిక కుమారి, రిమిల్ బురులీ, బొంబేలా దేవిలతో కూడిన భారత జట్టు రికర్వ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. జూలై 21న టాప్ సీడ్ చైనా జట్టుతో జరిగిన ఫైనల్లో భారత్ విజేతగా నిలిచింది. 2011లో షాంఘై వరల్డ్ కప్ తర్వాత భారత్కు బంగారు పతకం లభించడం ఇదే తొలిసారి. 

కామన్వెల్త్ చెస్లో భారత్కు స్వర్ణంగ్రాండ్మాస్టర్ అభిజిత్ గుప్తా కామన్వెల్త్ చెస్ చాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించాడు. జూలై 14న దక్షిణాఫ్రికాలోని పోర్ట్ ఎలిజబెత్లో ముగిసిన పోటీల్లో ఓపెన్ విభాగంలో అభిజిత్ స్వర్ణం సాధించగా, మరో గ్రాండ్మాస్టర్ దివ్యేందు బారువా రజత పతకం గెలుచుకున్నాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన గ్రాండ్మాస్టర్ ఎం.ఆర్.లలిత్బాబు కాంస్య పతకం గెలుపొందాడు.

ఐబీఎల్ వేలంతొలిసారి నిర్వహిస్తున్న ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ కోసం జూలై 22న జరిగిన వేలంలో సైనా నెహ్వాల్ను 71 లక్షల 67,000 రూపాయలకు హైదరాబాద్ హాట్షాట్స్ సొంతం చేసుకుంది. వేలంలో అత్యధిక ధర మాత్రం పురుషుల సింగిల్స్ వరల్డ్ నంబర్వన్ లీ చోంగ్ వీకే పలికింది. ముంబై మాస్టర్ టీమ్ దాదాపు రూ. 80 లక్షల 63 వేలు వెచ్చించి చోంగ్ వీని తమ జట్టు కోసం ఎంచుకుంది. ఐబీఎల్ కోసం ఒక్కో ఫ్రాంచైజీ తమ జట్టులో 10 మంది చొప్పున ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది.

భారతరత్నకు ధ్యాన్చంద్ పేరు సిఫార్సుదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు నాటి ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ పేరును కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ధ్యాన్చంద్ ప్రతిభతో 1928 ఆమ్స్టర్డామ్, 1932 లాస్ఏంజెల్స్, 1936 బెర్లిన్ ఒలింపిక్స్లో భారత్ హాకీలో మూడు స్వర్ణ పతకాలు సాధించింది. 1979లో ఆయన మరణించారు.

సెరెనాకు 53వ సింగిల్స్ టైటిల్అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ కెరీర్లో 53వ సింగిల్స్ టైటిల్ సాధించింది. జూలై 21న జరిగిన స్వీడిష్ ఓపెన్ ఫైనల్లో సెరెనా స్వీడన్కు చెందిన జోనా లార్సెన్పై విజయం సాధించింది.

మహుత్కు హాల్ ఆఫ్ ఫేమ్ టెన్నిస్ టైటిల్ఫ్రాన్స్కు చెందిన నికోలస్ మహుత్ హాల్ ఆఫ్ ఫేమ్ టెన్నిస్ చాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్నాడు. న్యూపోర్ట్ (అమెరికా)లో జూలై 14న జరిగిన ఫైనల్స్లో లీటన్ హెవిట్ను మహుత్ ఓడించాడు.

పారా అథ్లెటిక్స్లో దేవేంద్రకు స్వర్ణంఫ్రాన్స్లోని లియోన్లో జరుగుతున్న ఐపీసీ అథ్లెటిక్స్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత్కు చెందిన పారా అథ్లెట్ దేవేంద్ర జజారియా జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించాడు. తద్వారా ఈ మెగా టోర్నీలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. దేవేంద్ర రికార్డుపై భారత పారాలింపిక్స్ కమిటీ హర్షం వ్యక్తం చేస్తూ రూ.5 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. దేవేంద్ర 2012లో పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు.

ప్రపంచకప్ షూటింగ్లో భారత్కు రజతంస్పెయిన్లో ముగిసిన అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ కప్ టోర్నమెంట్లో జూలై 9న జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత్కు చెందిన లజ్జా గోస్వామి రజత పతకం సాధించింది. 

ఆసియా జూనియర్ వెయిట్లిఫ్టింగ్ చాంప్ఆసియా జూనియర్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్ మహిళల టీమ్ టైటిల్ను భారత జట్టు గెలుచుకుంది. కిర్గిజిస్థాన్లో ముగిసిన ఈ టోర్నమెంట్లో భారత జూనియర్ మహిళల జట్టు మూడు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు నెగ్గి అగ్రస్థానాన్ని సంపాదించింది. చైనా రెండో స్థానంతో సరిపెట్టుకోగా కిర్గిజిస్థాన్ మూడో స్థానంలో నిలిచింది. 

ముక్కోణపు సిరీస్ విజేత భారత్వెస్టిండీస్లో భారత్, శ్రీలంక, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన ముక్కోణపు క్రికెట్ టోర్నమెంట్ను భారత జట్టు గెలుచుకుంది. జూలై 11న జరిగిన ఫైనల్లో శ్రీలంకను ఓడించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా మహేంద్ర సింగ్ ధోని (భారత్), మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా భువనేశ్వర్ కుమార్ (భారత్) నిలిచారు.

హాల్ ఆఫ్ ఫేమ్లో వార్న్ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్లో ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్కు చోటు దక్కింది. ఈ ఏడాది ఇప్పటికే బ్రియాన్ లారా (వెస్టిండీస్), బేక్వెల్, గ్లెన్ మెక్గ్రాత్ (ఆస్ట్రేలియా)లను హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చేర్చారు.

ఎగర్ రికార్డుయాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జూలై 10-14 తేదీల్లో నాటింగ్హామ్ (ఇంగ్లండ్)లో జరిగిన తొలి టెస్ట్లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్సలో ఆ జట్టు ఆటగాడు ఆస్టన్ ఎగర్ 98 పరుగులు సాధించాడు. తద్వారా టెస్ట్ క్రికెట్ చరిత్రలో 11వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

‘హాల్ ఆఫ్ ఫేమ్’లో హింగిస్అంతర్జాతీయ టెన్నిస్లో అత్యున్నత గౌరవంగా భావించే ‘హాల్ ఆఫ్ ఫేమ్’ లో మహిళల టెన్నిస్ మాజీ నంబర్వన్ మార్టినా హింగిస్కు స్థానం లభించింది. హింగిస్తోపాటు థెల్మా కోన్ లాంగ్ (ఆస్ట్రేలియా), క్లిఫ్ డ్రైస్డేల్ (దక్షిణాఫ్రికా), చార్లీ పాసరెల్ (అమెరికా)లను కూడా ‘హాల్ ఆఫ్ ఫేమ్’లోకి ఎంపిక చేశారు.

కబడ్డీలో భారత్కు పసిడి దక్షిణ కొరియాలోని ఇంచియాన్లో జరిగిన నాలుగో ఆసియా ఇండోర్ క్రీడల కబడ్డీలో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలు సాధించాయి. పురుషుల, మహిళల జట్లు రెండూ ఫైనల్లో ఇరాన్పై విజయం సాధించాయి. 

ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ఐదు రోజుల పాటు పుణేలోని శివ్ ఛత్రపతి స్టేడియంలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ పోటీలు జూలై 7న ముగిశాయి. ఓవరాల్గా భారత్ ఈ ఈవెంట్లో రెండు స్వర్ణాలు, ఐదు రజతాలు, పది కాంస్య పతకాలు సాధించి ఆరో స్థానంలో నిలిచింది. చైనా అగ్రస్థానం పొందింది.

వెటెల్కు జర్మనీ గ్రాండ్ప్రి టైటిల్జూలై 7న జరిగిన జర్మనీ గ్రాండ్ప్రిలో రెడ్బుల్ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో ‘షుమాకర్ బ్రదర్స్’ మైకేల్, రాల్ఫ్ తర్వాత జర్మనీ గ్రాండ్ప్రి టైటిల్ నెగ్గిన మూడో జర్మన్ డ్రైవర్గా వెటెల్ గుర్తింపు పొందాడు. కిమీ రైకోనెన్ (లోటస్) రెండో స్థానంలో, గ్రోస్యెన్ (లోటస్) మూడో స్థానంలో నిలిచారు. 

వింబుల్డన్ విజేతలుపురుషుల సింగిల్స్: లండన్లో జూలై 7న జరిగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) విజేతగా నిలిచాడు. ప్రపంచ నంబర్వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)పై గెలిచి కెరీర్లో రెండో గ్రాండ్స్లామ్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. విజేతగా నిలిచిన ముర్రేకు 16 లక్షల పౌండ్లు (రూ.14 కోట్ల 36 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. ఈ క్రమంలో 1936లో ఫ్రెడ్ పెర్రీ తర్వాత బ్రిటన్ నుంచి వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ నెగ్గిన క్రీడాకారుడిగా ముర్రే నిలిచాడు. 

మహిళల సింగిల్స్:వింబుల్డన్ మహిళల సింగిల్స్ చాంపియన్గా 15వ సీడ్ మరియన్ బర్తోలీ (ఫ్రాన్స్) నిలిచింది. జూలై 6న జరిగిన ఫైనల్లో ఆమె జర్మనీకి చెందిన సబైన్ లిసికిపై గెలిచి కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ను సాధించింది. ఈ క్రమంలో అమెలీ మౌరెస్మో తర్వాత గ్రాండ్స్లామ్ టైటిల్ నెగ్గిన తొలి ఫ్రాన్స్ క్రీడాకారిణిగా బర్తోలీ నిలిచింది. విజేతగా నిలిచిన బర్తోలీకి 16 లక్షల పౌండ్లు (రూ. 14 కోట్ల 36 లక్షలు) ప్రైజ్మనీ లభించింది. రన్నరప్ లిసికి ఖాతాలో 8 లక్షల పౌండ్లు (రూ. 7 కోట్ల 18 లక్షలు) చేరాయి. 

పురుషుల డబుల్స్:
 పురుషుల డబుల్స్ టైటిల్ను టాప్ సీడ్ బాబ్ బ్రయాన్-మైక్ బ్రయాన్ (అమెరికా) జోడి చేజిక్కించుకుంది. ఫైనల్లో బ్రయాన్ బ్రదర్స్.. డోడిగ్ (క్రొయేషియా)-మెలో (బ్రెజిల్) జంటపై గెలిచారు.

మహిళల డబుల్స్: వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్ను సువుయ్ (తైవాన్)- పెంగ్ (చైనా) జంట కైవసం చేసుకుంది. ఫైనల్లో ఈ జోడీ యాష్లీ బర్టీ- కాసె డెల్లాక్వా (ఆస్ట్రేలియా) జంటను ఓడించింది.

No comments:

Post a Comment