AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

క్రీడలు ఏప్రిల్ 2012

క్రీడలు ఏప్రిల్ 2012
26 ఏప్రిల్- 02 మే 2012
క్రీడలువాన్ హో షాన్‌కు ఇండియన్ ఓపెన్ టైటిల్2012ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను హాన్ హో షాన్ (దక్షిణ కొరియా) గెలుచుకున్నాడు. న్యూ ఢిల్లీలో ఏప్రిల్ 29న జరిగిన ఫైనల్‌లో లీ చోంగ్ లీ(మలేషియా)ను షాన్ ఓడించాడు. మహిళల సింగిల్స్-జురుమ్ లీ(చైనా); మహిళల డబు ల్స్- క్యూంగ్ యునో జంగ్, హానా కిమ్(కొరియా); పురుషుల డబుల్స్-ఇసారా, జోంగ్ జిత్ (థాయిలండ్); మిక్స్‌డ్ డబుల్స్- తొంతొవి అహ్మద్, నాత్సిరో(ఇండోనేసియా) లు గెలుచుకున్నారు.
 
ఆదిత్యకు ఆసియా స్నూకర్ ఛాంపియన్‌షిప్దోహాలో ఏప్రిల్ 29న ముగిసిన ఆసియా స్నూకర్ ఛాంపియన్ షిప్‌లో పంకజ్ అద్వానీ(భారత్)ని ఓడించి ఆదిత్య మెహతా (భారత్) గెలుచుకున్నాడు.
19- 25 ఏప్రిల్ 2012 కరెంట్ అఫైర్స్
క్రీడలు
 
బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి విజేత వెటెల్బహ్రెయిన్ ఫార్ములావన్ గ్రాండ్‌ప్రి రేస్‌ను రెడ్‌బుల్ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ గెలుచుకున్నాడు. ఏప్రిల్ 22న మనామలో జరిగిన రేస్‌లో లోటస్-రేనాల్ట్ జట్టుకు చెందిన కిమీ రైకోనెన్ రెండో స్థానంలో నిలవగా, రొమైన్ గ్రోస్యెన్(లోటస్-రేనాల్ట్)కు మూడో స్థానం దక్కింది.
మోంటెకార్లో విజేత నాదల్మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నీ సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్‌కు చెందిన రాఫెల్ నాదల్ గెలుచుకున్నాడు.ఏప్రిల్ 22న మోంటెకార్లోలో జరిగిన ఫైన ల్లో నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)పై విజయం సాధించాడు. తద్వారా అత్యధికంగా 20 ఏటీపీ మాస్టర్స్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన క్రీడాకారుడిగా నాదల్ రికార్డు నెలకొల్పాడు (గత రికార్డు 19 టైటిల్స్‌తో స్విట్జర్లాండ్‌కు చెందిన రోజర్ ఫెడరర్ పేరిట ఉంది).
ఒలింపిక్స్‌కు సౌమ్యజిత్, అంకితభారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు సౌమ్యజిత్ గోష్, అంకితా దాస్‌లు లండన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఏప్రిల్ 22న హాంకాంగ్‌లో ముగిసిన ఆసియా ఒలింపిక్స్ క్వాలిఫై టోర్నీలో రాణించడం ద్వారా వీరిద్దరు ఒలింపిక్స్ బెర్తు దక్కించుకున్నారు. ఈ క్రమంలో అంకితా దాస్ భారత్ తరపున ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది.

12- 18 ఏప్రిల్ 2012 కరెంట్ అఫైర్స్
లండన్ ఒలింపిక్స్‌కు శివ థాపా అర్హత
కజకిస్థాన్‌లోని అస్తానాలో జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయింగ్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా.. భారత యువ బాక్సర్ శివ థాపా లండన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఈ క్రమంలో పిన్న వయసు(18)లో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన భారతీయ బాక్సర్‌గా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా లండన్ ఒలింపిక్స్‌లో ఉన్న వెయిట్ కేటగిరీలలో భారత్ నుంచి మొత్తం ఏడుగురు బాక్సర్లు బరిలోకి దిగనున్నారు. భారత్ నుంచి ఒకే ఒలింపిక్స్‌లో అత్యధికంగా ఏడుగురు బాక్సర్లు పాల్గొననుండటం ఇదే ప్రథమం.
ప్రపంచ కప్ ఆర్చరీలో భారత్‌కు రజతం
ప్రపంచ కప్ ఆర్చరీ టోర్నమెంట్‌లో దీపికా కుమారి, బొంబేలా దేవి, చెక్రోవోలు స్వారోలతో కూడిన భారత మహిళల జట్టు రజత పతకం గెలుచుకుంది. షాంఘై(చైనా)లో ఏప్రిల్ 14న జరిగిన ఫైనల్లో కొరియా చేతిలో భారత జట్టు ఓడిపోయింది.
చైనా గ్రాండ్ ప్రి విజేత రోస్‌బర్గ్
చైనా గ్రాండ్ ప్రి చాంపియన్‌షిప్‌ను మెర్సిడెస్ జట్టు డ్రైవర్ రోస్‌బర్గ్ (జర్మనీ) గెలుచుకున్నాడు. 57 సంవత్సరాల తర్వాత మెర్సిడెస్ జట్టుకు గ్రాండ్ ప్రి టైటిల్ దక్కింది. షాంఘై(చైనా) లో ఏప్రిల్ 17న ముగిసిన రేస్‌లో జెన్సన్ బటన్ రెండో స్థానంలో, హామిల్టన్ మూడో స్థానంలో నిలిచారు.
5- 11 ఏప్రిల్ 2012 కరెంట్ అఫైర్స్ఆసియా బిలియర్డ్స్ చాంప్ అద్వానీఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌ను పంకజ్ అద్వానీ(భారత్) గెలుచుకున్నాడు. ఏప్రిల్ 8న గోవా రాజధాని పనాజీలో జరిగిన ఫైనల్లో తవత్ సుజారిత్ తౌకర్న్(థాయ్‌లాండ్)పై విజయం సాధించాడు. పంకజ్‌కు ఇది ఐదో ఆసియా టైటిల్. ఇంతకు ముందు ఎవరూ ఈ ఘనత సాధించలేదు. గతంలో అద్వానీ ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కూడా గెలుచుకున్నాడు.

ఒలింపిక్స్‌కు విజేందర్ అర్హతకజకిస్థాన్‌లోని అస్తానాలో జరుగుతున్న ఆసియా ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు చేరుకోవడం ద్వారా భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. తద్వారా వరుసగా మూడు ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ బాక్సర్‌గా చరిత్ర సష్టించాడు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో తొలి రౌండ్‌లో ఓడిన విజేందర్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యపతకం సాధించాడు. 

29 మార్చి- 4 ఏప్రిల్ 2012 కరెంట్ అఫైర్స్ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత బరోడాదేశవాళీ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని బరోడా జట్టు గెలుచుకుంది. ముంబైలో మార్చి 27న జరిగిన ఫైనల్లో పంజాబ్‌ను ఓడించింది. ఇర్ఫాన్ పఠాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. భారత మాజీ క్రికెటర్ సయ్యద్ ముస్తాక్ అలీ పేరిట ఈ టోర్నమెంట్‌ను ప్రారంభించారు.

పేస్ జోడికి మియామి టైటిల్ఏటీపీ మియామి మాస్టర్స్ టోర్నమెంట్ డబుల్స్ టైటిల్‌ను లియాండ్ పేస్(భారత్), రాడెక్ స్టెపానెక్ (చెక్) జోడి గెలుచుకుంది. ఫైనల్లో మాక్స్ మిర్నీ (బెలారస్), డానియల్ నెస్టర్(కెనడా) జంటపై విజయం సాధించారు. పేస్ కెరీర్‌లో ఇది 50వ అంతర్జాతీయ టైటిల్. మహేశ్ భూపతి(50 టైటిల్స్) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ క్రీడాకారుడిగా..ఏటీపీ చరిత్రలో 24వ ప్లేయర్‌గా పేస్ గుర్తింపు పొందాడు. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నోవాక్ జొకోవిచ్ గెలుచుకోగా, మహిళల విభాగంలో అగ్నెజెకా రాడ్వాన్సికా విజేతగా నిలిచింది.

ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన గీత
భారత రెజ్లర్ గీత లండన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. కజకిస్థాన్‌లోని ఆస్తానాలో జరిగిన ఆసియా క్వాలిఫైయింగ్ ఈవెంట్‌లో 55 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించడం ద్వారా ఈ ఘనతను సొంతం చేసుకుంది. తద్వారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయురాలిగా(మహిళల రెజ్లింగ్ విభాగంలో) చరిత్ర సృష్టించింది. 

వరల్డ్ టీటీ విజేత చైనావరల్డ్ టేబుల్ టెన్నిస్(టీటీ) పురుషుల చాంపియన్‌షిప్‌ను చైనా గెలుచుకుంది. ఏప్రిల్ 1న డోర్ట్‌ముండ్(జర్మనీ)లో జరిగిన ఫైనల్లో జర్మనీని ఓడించింది. ఈ టోర్నమెంట్‌లో భారత్ 27వ స్థానంలో నిలిచింది.

No comments:

Post a Comment