AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

క్రీడలు జూన్ 2013

క్రీడలు జూన్ 2013
ఐసీసీ జట్టు కెప్టెన్గా ధోని చాంపియన్స్ ట్రోఫీలో ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేసిన ఐసీసీ జట్టుకు ధోనిని కెప్టెన్గా ఎన్నుకున్నారు. ఐదుగురు సభ్యుల ప్యానల్ ప్రకటించిన జట్టులో ధోని (కెప్టెన్), ధావన్, కోహ్లి, జడేజా, భువనేశ్వర్(భారత్), ట్రాట్, అండర్సన్(ఇంగ్లండ్), మిస్బా (పాక్), సంగక్కర (శ్రీలంక), మెక్లారెన్ (దక్షిణాఫ్రికా), మెక్లీంగన్ (న్యూజిలాండ్) చోటు దక్కించుకున్నారు.

ప్రత్యూషకు స్వర్ణంఇరాన్లో జరుగుతున్న ఆసియా యూత్ చెస్ చాంపియన్షిప్లో అండర్-18 బాలికల విభాగంలో బొడ్డు ప్రత్యూష స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆసియా ఈవెంట్స్లో ప్రత్యూషకిది మూడో పతకం కావడం విశేషం. 2006లో అండర్-10 విభాగంలో ప్రత్యూషకు కాంస్యం దక్కగా... 2008లో అండర్-12 విభాగంలో పసిడి పతకం సాధించింది. 

భారత షూటర్లకు నాలుగు పతకాలుభారత స్టార్ షూటర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కుమారుడు మానవదిత్య రాథోడ్ జూనియర్ అంతర్జాతీయ షాట్గన్ ఈవెంట్లో స్వర్ణ, రజత పతకాలతో సత్తా చాటాడు. ఫిన్లాండ్లోని ఒరిమటిలాలో జరుగుతున్న ఈ పోటీల్లో మానవదిత్య వ్యక్తిగత ట్రాప్ ఈవెంట్లో రజత పతకం గెలుపొందాడు. తర్వాత సునీల్ శరణ్, అభయ్ రాథోడ్లతో కలిసి టీమ్ ఈవెంట్లో పసిడి పతకం నెగ్గాడు. అదేవిధంగా ‘డబుల్ ట్రాప్’ వ్యక్తిగత విభాగంలో ప్రియాన్షు పాండే స్వర్ణ పతకం సాధించాడు. టీమ్ విభాగంలో సంజయ్ రాథోడ్, అహవర్ రిజ్వీ, ప్రియాన్షులతో కూడిన బృందం రజత పతకం దక్కించుకుంది. 

కాన్ఫెడరేషన్స్ కప్ టైటిల్ విజేత బ్రెజిల్ప్రతిష్టాత్మక కాన్ఫెడరేషన్స్ పుట్బాల్ కప్ను బ్రెజిల్ చేజిక్కించుకుంది. జూన్ 30న స్పెయిన్తో జరిగిన ఫైనల్లో బ్రెజిల్ విజేతగా నిలిచింది. బ్రెజిల్ ఈ కప్ను గెలుపొందడం వరుసగా ఇది మూడోసారి.

‘ఫిడే’ మహిళల గ్రాండ్ ప్రి టైటిల్ విజేత హంపిఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తన కెరీర్లో మరో గ్రాండ్ ప్రి టైటిల్ను కైవసం చేసుకుంది. ఆర్మేనియాలో జూన్ 28న ముగిసిన ‘ఫిడే’ మహిళల గ్రాండ్ ప్రి టోర్నమెంట్లో హంపి విజేతగా నిలిచింది. మొత్తం 12 మంది అగ్రశ్రేణి క్రీడాకారిణులు పాల్గొన్న ఈ మెగా ఈవెంట్లో హంపి అజేయంగా నిలవడం విశేషం.

జస్టిన్‌ రోస్‌కు యూఎస్‌ ఓపెన్‌ గోల్ఫ్‌ టైటిల్‌ఇంగ్లండ్‌కు చెందిన జస్టిన్‌ రోస్‌ యూఎస్‌ ఓపెన్‌ గోల్ఫ్‌ టైటిల్‌ గెలుచుకున్నాడు. జూన్‌ 17న అమెరికాలో ముగిసిన పోటీలో జసోన్‌ డే(ఆస్ట్రేలియా)రెండో స్థానంలో నిలిచాడు.

ఇండోనేసియా ఓపెన్‌ చాంప్స్‌ లీచోంగ్‌ వీ, జురుయ్‌ లీఇండోనేసియా ఓపెన్‌ ప్రీమియర్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో టాప్‌ సీడ్స్‌ లీ చోంగ్‌ వీ (మలేసియా), జురుయ్‌ లీ (చైనా) విజేతలుగా నిలిచారు. జూన్‌ 16న జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో లీ చోంగ్‌ వీ జర్మనీకి చెందిన మార్క్‌ జ్విబ్లెర్‌పై విజయం సాధించగా, మహిళల సింగిల్స్‌ ఫైనల్లో జురుయ్‌ లీ (చైనా) జర్మనీకి చెందిన జూలియన్‌ షెంక్‌ను ఓడించింది.

ఆసియా జూనియర్‌ రెజ్లింగ్‌ చాంప్‌ భారత్‌థాయ్‌లాండ్‌లో జూన్‌ 15న ముగిసిన ఆసియా జూనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఫ్రీ స్టయిల్‌ విభాగంలో భారత రెజ్లర్లు టీమ్‌ టైటిల్‌ను దక్కించుకున్నారు. ఓవరాల్‌గా భారత రెజ్లర్లు మొత్తం 17 పతకాలు సాధించారు. ఇందులో మూడు స్వర్ణాలు, ఐదు రజతాలు, తొమ్మిది కాంస్య పతకాలు ఉన్నాయి.

స్లోవేక్ జూనియర్ టీటీలో భారత్‌కు ఆరు పతకాలుసెనెక్‌లో జరిగిన స్లోవేక్ జూనియర్ ఓపెన్ టీటీలో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు నాలుగు స్వర్ణ పతకాలతో సహా ఆరు పతకాలు సాధించారు. 15 ఏళ్ల సుతీర్థ ముఖర్జీ బాలికల సింగిల్స్ టైటిల్ గెలుపొందింది.

అష్రాఫుల్‌పై నిషేధంబంగ్లా ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) లో రెండు మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేసినట్లు అంగీకరించిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ అష్రాఫుల్‌పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (బీసీబీ) వేటు వేసింది. ఇకపై అతను ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడకుండా సస్పెండ్ చేసింది. ఫిక్సింగ్‌పై విచారణ జరుపుతున్న ఐసీసీ అవినీతి నిరోధక, భద్రతా విభాగం (ఏసీఎస్‌యూ) పూర్తిస్థాయి నివేదిక ఇచ్చే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని బంగ్లా బోర్డ్ ప్రకటించింది. బీపీఎల్‌లో అష్రాఫుల్ ఢాకా గ్లాడియేటర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

వైజాగ్‌లో అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ టోర్నీఎఫ్‌ఐవీబీ ఇండియా ఓపెన్ బీచ్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌కు విశాఖపట్నం ఆతిథ్యమివ్వనుంది. పురుషులు, మహిళల విభాగాల్లో సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు ఐదురోజులపాటు ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఇందులో రెండు విభాగాల్లో 32 జట్ల చొప్పున మొత్తం 64 జట్లు పోటీపడతాయని భారత వాలీబాల్ సమాఖ్య (వీఎఫ్‌ఐ) ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఫ్రెంచ్ ఓపెన్ విజేతలు సెరెనా, నాదల్పురుషుల సింగిల్స్: ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్‌కు చెందిన రాఫెల్ నాదల్ సాధించాడు. జూన్ 9న పారిస్‌లో జరిగిన ఫైనల్లో తన దేశానికే చెందిన డేవిడ్ ఫెరర్‌ను ఓడించి ఎనిమిదోసారి ఈ టైటిల్‌ను గెలుచుకున్నాడు. తద్వారా పురుషుల విభాగంలో ఒక గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టైటిల్‌ను అత్యధికసార్లు గెలుచుకున్న ఆటగాడిగా రికార్డు సష్టించాడు. నాదల్ కెరీర్‌లో ఇది 12వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఈ విజయంతో ట్రోఫీతోపాటు 15 లక్షల యూరోలు (’11 కోట్ల 31 లక్షలు) ప్రెజ్‌మనీగా లభించాయి.

మహిళల సింగిల్స్: మహిళల సింగిల్స్ టైటిల్‌ను సెరెనా విలియమ్స్ (అమెరికా) గెలుచుకుంది. జూన్ 8న పారిస్‌లో జరిగిన ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ మరియా షరపోవా (రష్యా)ను ఓడించి సెరెనా విలియమ్స్ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 16వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో జమ చేసుకుంది. విజేతగా నిలిచిన సెరెనాకు 15 లక్షల యూరోలు (’11 కోట్ల 31 లక్షలు), రన్నరప్‌గా నిలిచిన షరపోవాకు 7 లక్షల 50 వేల యూరోలు (’ 5 కోట్ల 65 లక్షలు) ప్రెజ్‌మనీగా లభించాయి. తాజా విజయంతో 31 ఏళ్ల 247 రోజుల వయస్సులో ఫ్రెంచ్ ఓపెన్‌ను నెగ్గిన పెద్ద వయస్కురాలిగా సెరెనా గుర్తింపు పొందింది.

మహిళల డబుల్స్: ఎకటెరినా మకరోవా, ఎలెనా వెస్నినా (రష్యా)లు మహిళల డబుల్స్ టైటిల్‌ను గెలుపొందారు. వీరు ఫైనల్స్‌లో సారా ఎరానీ, రోబెర్టా విన్సీ (ఇటలీ)లను ఓడించారు.
పురుషుల డబుల్స్: బాబ్ బ్రయాన్, మైక్ బ్రయాన్ (అమెరికా)లు గెలుచుకున్నారు. వీరు మైకేల్‌లోద్రా, నికోలస్ మహుత్ (ఫ్రాన్స్)లను ఓడించారు.

ఐబీఎల్‌లో ఢిల్లీ టీమ్ ఓనర్‌గా సచిన్ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో పాల్గొనే ఒక జట్టుకు సచిన్ టెండ్కూలర్ యజమానిగా వ్యవహరించనున్నాడు. ఢిల్లీ ఫ్రాంచైజీని అతడు సొంతం చేసుకున్నట్లు ఏపీ బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి పున్నయ్య చౌదరి వెల్లడించారు. క్రికె ట్‌లోని ఐపీఎల్ తరహాలో సాగే ఐబీఎల్‌ను ఆగస్టు 14 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు. లీగ్‌లో హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, పుణే, లక్నో, ముంబై, బెంగళూరు జట్లు పాల్గొంటాయి.

థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్ విజేత శ్రీకాంత్థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిదాంబి శ్రీకాంత్ విజేతగా నిలిచాడు. జూన్ 9న బ్యాంకాక్‌లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ప్రపంచ ఏడో ర్యాంకర్ బూన్‌సక్ పొన్సానాను ఓడించి శ్రీకాంత్ టైటిల్ సాధించాడు. ఈ క్రమంలో విదేశీగడ్డపై గ్రాండ్ ప్రి గోల్డ్ స్థాయి టోర్నీ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా శ్రీకాంత్ గుర్తింపు పొందాడు. ఛాంపియన్‌గా నిలిచిన శ్రీకాంత్‌కు 9వేల డాలర్ల ప్రెజ్‌మనీ (5 లక్షల 13 వేలు)తోపాటు ఏడువేల ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.

కెనడా గ్రాండ్ ప్రి టైటిల్ విజేత వెటెల్కెనడా గ్రాండ్ ప్రి టైటిల్‌ను రెడ్‌బుల్ డ్రెవర్ సెబాస్టియన్ వెటెల్ సాధించాడు. 70 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్ గంటా 32 నిమిషాల 09.143 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు.

ఆసియన్ కాంటినెంటల్ చెస్ ఛాంపియన్‌షిప్మనీలాలో ముగిసిన ఆసియన్ కాంటినెంటల్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల టైటిల్‌ను చైనీస్ గ్రాండ్ మాస్టర్ లిచోవో గెలుచుకున్నాడు. మహిళల టైటిల్‌ను గ్రాండ్ మాస్టర్ హు ఆంగ్‌కియన్ సాధించింది. భారత్‌కు చెందిన అధిబాన్ భాస్కరన్ ఐదో స్థానంలో నిలిచి ప్రపంచకప్‌నకు అర్హత సాధించాడు. మరో క్రీడాకారుడు శశికిరణ్ కూడా ప్రపంచకప్‌నకు ఎంపికయ్యాడు.

రాహుల్‌కు మూడు స్వర్ణాలుఆసియా యూత్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ మూడు స్వర్ణ పతకాలను సాధించాడు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ స్కూల్ (ఏపీఎస్‌ఎస్) విద్యార్థిగా ఉన్న రాహుల్ ఇటీవల తాష్కెంట్‌లో ముగిసిన ప్రపంచ యూత్ వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు రెండు పతకాలను అందించాడు.

కి వీస్‌తో టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్న్యూజిలాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్ (2-0) చేసింది. మే 28న ముగిసిన చివరి టెస్టులో ఇంగ్లండ్ 247 పరుగుల తేడాతో కివీస్‌ను ఓడించింది.

బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా దాల్మియాఅధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని కొన్ని రోజులగా వస్తోన్న డిమాండ్‌లకు శ్రీనివాసన్ తలొగ్గారు. స్పాట్ ఫిక్సింగ్‌లో తన అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్ వ్యవహారంపై త్రిసభ్య కమిటీ విచారణ ముగిసేవరకు అధ్యక్ష బాధ్యతలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తాత్కాలిక అధ్యక్షుడిగా బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు జగన్మోహన్ దాల్మియా నియమితులయ్యారు. స్పాట్ ఫిక్సింగ్ నేపథ్యంలో ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి సంజయ్ జగ్దాలేతోపాటు కోశాధికారి అజయ్ షిర్కే, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తమ పదవులకు రాజీనామా చేశారు.

స్నూకర్ ఛాంప్ భారత్ఆసియా టీమ్ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ విజేతగా నిలిచింది. దోహాలో జరిగిన ఈవెంట్‌లో మానన్ చంద్ర, బ్రిజేష్ దమాని, అలోక్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్లో ఇరాన్‌ను ఓడించింది.

No comments:

Post a Comment