అవార్డులు జనవరి 2017
పద్మ పురస్కారాలు - 2017
2017 సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం 89 మందికి పద్మా పురస్కారాలు ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని పద్మా అవార్డులకు ఎంపికైన వారి జాబితాను జనవరి 25న విడుదల చేసింది. ఇందులో ఏడుగురికి రెండో అత్యున్నత భారత పౌరపురస్కారం పద్మ విభూషణ్, మరో ఏడుగురికి పద్మ భూషణ్, 75 మందికి పద్మశ్రీ లభించాయి. పురస్కారాలకు ఎంపికైన వారిలో 19 మంది మహిళలు, ఐదుగురు విదేశీయులు-ఎన్నారైలు ఉన్నారు. ఆరుగురు మరణానంతరం అవార్డులకు ఎంపికయ్యారు. అవార్డుల కోసం దేశవ్యాప్తంగా 18 వేల నామినేషన్లు వచ్చాయి. సామాజిక, రాజకీయ, శాస్త్రసాంకేతిక, వైద్య, సంగీత, ఆధ్యాత్మిక, క్రీడా రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఏటా ఈ అవార్డులను అందిస్తారు.
తెలంగాణ నుంచి ఆరుగురిని, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరిని పద్మశ్రీ పురస్కారాలు వరించాయి.
తెలుగు రాష్ట్రాల నుంచి గ్రహీతలు
పద్మ విభూషణ్ గ్రహీతలు1. యేసుదాసు (కేరళ)
2. సద్గురు జగ్గీ వాసుదేవ్ (తమిళనాడు)
3. శరద్ పవార్ (మహారాష్ట్ర)
4. మురళీ మనోహర్ జోషి (ఉత్తరప్రదేశ్)
5. ప్రొఫెసర్ ఉడిపి రామచంద్రరావు(కర్ణాటక)
6. సుందర్‌లాల్ పట్వా (మరణానంతరం)(మధ్యప్రదేశ్)
7. పీఏ సంగ్మా (మరణానంతరం) ( మేఘాలయ)
పద్మ భూషణ్ గ్రహీతలు1. విశ్వమోహన్ భట్ (రాజస్తాన్)
2. ప్రొఫెసర్ దేవీ ప్రసాద్ ద్వివేది (ఉత్తరప్రదేశ్)
3. తెహంతోన్ ఉద్వాదియా (మహారాష్ట్ర)
4. రత్న సుందర్ మహారాజ్ (గుజరాత్)
5. స్వామి నిరంజనానంద సరస్వతి (బిహార్)
6. చో రామస్వామి (మరణానంతరం) ( తమిళనాడు)
7. యువరాణి మహాచక్రి సిరింధోర్న్ (థాయ్‌లాండ్)
పద్మశ్రీ గ్రహీతలు
డాక్టర్ రఘురామ్‌కు బీసీ రాయ్ అవార్డు హైదరాబాద్‌కు చెందిన రొమ్ము కేన్సర్ నిపుణుడు డాక్టర్ పి.రఘురామ్ ప్రతిష్టాత్మక బీసీ రాయ్ జాతీయ అవార్డు-2016కు ఎంపికయ్యారు. ‘అవుట్‌స్టాండింగ్ సర్వీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సోషియో మెడికల్ రిలీఫ్’ సేవకు గుర్తింపుగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆయనకు ఈ అవార్డు ప్రకటించింది. జూలై 1న వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకోనున్నారు.
డా.రఘునాథరావుకు బీసీ రాయ్ పురస్కారంవిశాఖలోని అగనంపూడి హోమీబాబా క్యాన్సర్ ఆసుపత్రి డెరైక్టర్ డాక్టర్ దిగమర్తి రఘునాథరావు 2016 సంవత్సరానికిగానూ ప్రతిష్టాత్మక డాక్టర్ బి.సి.రాయ్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. క్యాన్సర్ నిరోధక సేవలతోపాటు వైద్య రంగంలోని భిన్న విభాగాల నిపుణులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నందుకు ఆయన్ను అవార్డుకు ఎంపిక చేసినట్టు భారతీయ వైద్య మండలి ప్రకటించింది.
సైనిక పతకాలు ప్రకటించిన కేంద్రంగణతంత్ర దినోత్సవాల సందర్భంగా వివిధ దళాల సైనికులకు 398 శౌర్య, కీర్తి చక్ర ప్రకటించారు. ఉడీ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముష్కర స్థావరాలపై సర్జికల్ దాడి చేసిన 19 మంది సైనికులను కీర్తిచక్ర, యుధ్ సేవా తదితర మెడళ్లు, శౌర్యపతకాలతో సత్కరించారు.
4వ పటాలానికి చెందిన మేజర్ రోహిత్ సూరికి శాంతి సమయంలో ఇచ్చే రెండో అత్యున్నత శౌర్య పతకమైన కీర్తిచక్ర ప్రకటించారు. కమాండింగ్ అధికారులైన కపిల్ యాదవ్, హర్‌ప్రీత్ సంధులకు యుధ్‌సేవా అవార్డును ప్రకటించారు.
హంగ్‌పన్ దాదాకు అశోక్‌చక్రవీర జవాన్ హంగ్‌పన్ దాదాకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అశోక్‌చక్ర పురస్కారాన్ని ప్రకటించింది. ఈ పురస్కారాన్ని జనవరి 26న జరిగిన 68వ గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా హంగ్‌పన్ దాదా సతీమణి అందుకున్నారు. హంగ్‌పన్ జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టి వారి తూటాలకు బలయ్యారు.
అవార్డుల జాబితా
భారత సంతతి వ్యక్తులకు ఆస్ట్రేలియా అత్యున్నత పురస్కారం
ఆస్ట్రేలియా అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అవార్డు-2017 కు భారత సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఎంపికయ్యారు. వెద్యుడు పురుషోత్తమ్ సారికర్, న్యూరోరేడియాలజిస్ట్ మఖన్‌సింగ్ ఖన్గురే, న్యూక్లియర్ మెడిసన్ పరిశోధకుడు విజయ్ కుమార్‌లకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. వైద్య, సామాజిక సేవా రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఏటా ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారం ప్రదానం చేస్తారు.
జేఎన్‌టీయూహెచ్ కళాశాలకు ఎడ్యుకేషన్ లీడర్‌షిప్ అవార్డు హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలకు ప్రతిష్టాత్మక ఎడ్యుకేషన్ లీడర్‌షిప్ అవార్డు దక్కింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రెజైస్-IPE అందించే దివాంగ్ మెహతా జాతీయ విద్యా అవార్డుల్లో భాగంగా ఈ కళాశాలకు పురస్కారం దక్కింది. ఉత్తమ సాంకేతిక విద్య, సమర్థవంతంగా యూజీ కార్యక్రమాల అమలు, పరిశోధనా కార్యక్రమాల్లో విశేష కృషి చేస్తున్న దేశంలోని పది అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటిగా జేఎన్‌టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాల గుర్తింపు పొందింది.
సైన్స్ సిటీ సీఈవో కృష్ణారావుకు ఎల్లాప్రగడ అవార్డు ప్రతిష్ఠాత్మక డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు అవార్డుకు ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ సీఈవో, అమెరికన్ డాక్టర్ అప్పసాని కృష్ణారావు ఎంపికయ్యారు. బయాలజీ, కెమిస్ట్రీ, జెనటిక్స్, మెడికల్ సైన్‌సలో ఆయన చేసిన విశేష కృషికి ఈ అవార్డు లభించింది. నోబెల్ అవార్డ్ గ్రహీత ప్రొఫెసర్ హర్ గోవింద్ ఖొరానా లేబొరేటరీలో సింతటిక్ రోడోస్పిన్ జీన్‌ను మెదటిసారిగా కృష్ణారావు కనుగొన్నారు. పలు వ్యాధులకు మందులు కనుగొన్న ఎల్లాప్రగడ సుబ్బారావు పేరిట ఏటా ఫౌండేషన్ ఈ అవార్డు అందజేస్తుంది.
ప్రియాంకకు మరోసారి పీపుల్స్ చాయిస్ అవార్డు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా వరుసగా రెండోసారి పీపుల్స్ చాయిస్ అవార్డు అందుకుంది. అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికోలో ఆమె నటనకుగాను (ఫేవరేట్ డ్రమటిక్ టీవీ నటి విభాగం) ఆమె పీపుల్స్ చాయిస్ అవార్డు 2017 కు ఎంపికైంది. జనవరి 19న అమెరికాలోని లాస్ ఏంజిలెస్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రియాంక పురస్కారాన్ని అందుకుంది. 2016లోనూ క్వాంటికో సిరీస్ విభాగంలో ప్రియాంక పీపుల్స్ చాయిస్ అవార్డు పొందింది.
జానీ డెప్‌కు ‘పీపుల్స్ చాయిస్’ పురస్కారం పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్ చిత్రాల నటుడు జానీ డెప్ 2016కు గాను పీపుల్స్ చాయిస్ అవార్డు గెలుచుకున్నాడు. ‘ఫేపరేట్ మూవీ ఐకన్’ విభాగంలో డెప్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. జనవరి 18న లాస్ ఏంజెల్స్‌లో జరిగిన కార్యక్రమంలో జానీ డెప్ అవార్డు అందుకున్నాడు.
తెలుగు రాష్ట్రాల పోలీసులకు రాష్ట్రపతి సేవా పథకాలు విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసులకు గణతంత్ర దినోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పతకాలు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి 29 పతకాలు దక్కగా తెలంగాణ పోలీసులకు 16 పతకాలు లభించాయి.
ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన పతకాలు రాష్ట్రపతి ఉత్తమ సేవాపతకం: ఐజీ పి.వి సునీల్ కుమార్, ఏఎస్పీ వి సురేశ్ బాబు
25 మంది బాలలకు సాహస పురస్కారాల ప్రదానం 2016 జాతీయ సాహస బాలల పురస్కారాలను ప్రధాని మోదీ జనవరి 23న న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవార్డులకు ఎంపికైన 25 మంది చిన్నారులకు జ్ఞాపికలను అందచేశారు. సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని ఏటా జనవరి 23న సాహస అవార్డులను ప్రదానం చేస్తారు.
ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తకు జాతీయ అవార్డుహైదరాబాద్‌లోని ఎన్‌జీఆర్‌ఐ చీఫ్ సైంటిస్టు ఎన్.పూర్ణచందర్‌రావు నేషనల్ జియోసైన్స్ అవార్డు - 2016కు ఎంపికయ్యారు. భూగర్భ అంశాల్లో అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్రం ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది. భూకంపాలు, భూగర్భంలో జరిగే అంతర్గత మార్పులపై పూర్ణచందర్‌రావు పలు పరిశోధనలు జరిపారు.
62వ ఫిలింఫేర్ అవార్డులు62వ ఫిలింఫేర్ అవార్డులను జనవరి 14న ముంబైలో ప్రదానం చేశారు.
ఉత్తమ చిత్రం: దంగల్, ఉత్తమ నటుడు: అమీర్‌ఖాన్ (దంగల్)
ఉత్తమ నటి: అలియాభట్ (ఉడ్తా పంజాబ్)
ఉత్తమ దర్శకుడు : నితేష్ తివారి (దంగల్)
జీవితకాల సాఫల్య పురస్కారం: శత్రుఘ్నసిన్హా
ఒడిషా బాలికకు జాతీయ బాలశ్రీ పురస్కారంఒడిశాకు చెందిన సిమ్రన్ స్వెయిన్‌కు 2015 సంవత్సరానికి గాను జాతీయ బాలశ్రీ పురస్కారం దక్కింది. ఒడిస్సీ నృత్యంలో చూపిన ప్రతిభకుగాను ఆమెకు ఈ అవార్డును ప్రకటించారు. పిల్లల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు జాతీయ బాల్ భవన్ 2015 నుంచి జాతీయ బాలశ్రీ పురస్కారాలను అందజేస్తోంది.
తమిళనాడు వాసికి ఆస్కార్ అవార్డు తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన కిరణ్ భట్ టెక్నికల్ అచీవ్‌మెంట్స్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. ఐఎల్‌ఎం ఫేషియల్ పర్‌ఫార్మెన్‌స - క్యాప్చర్ సాల్వింగ్ సిస్టమ్‌ని డెవలప్ చేసినందుకుగాను మరో ముగ్గురితో కలిసి కిరణ్‌కు ఈ అవార్డును ప్రకటించారు. ఫిబ్రవరిలో జరిగే 89వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ఆస్కార్‌ను అందుకుంటారు.
బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్‌లో డ్యూయల్ డిగ్రీ చేసిన కిరణ్ అమెరికాలోని కార్నీజ్ మెల్లన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో డాక్టరేట్ పూర్తిచేశారు. 2010లో సహోద్యోగులు మైకెల్ కూపర్వాస్, బ్రియాన్ క్యాంట్వెల్, పైగ్ వార్నర్‌తో కలిసి ఫేషియల్ పర్‌ఫార్మెన్స్ క్యాప్చరింగ్ సిస్టమ్‌ని డెవలప్‌చేశారు. దీనిని మొదటిసారిగా అవెంజర్స్ మూవీలో హక్ పాత్రకు హావభావాలు పలికించడం కోసం ఉపయోగించారు.
లాన్‌సనాయక్ హనుమంతప్పకు సేనా మెడల్హిమాలయాల్లో మంచు తుపాను వల్ల మరణించిన సైనికుడు లాన్‌స నాయక్ హనుమంతప్పను జనవరి 15న ఆర్మీడే సందర్భంగా సేనా పతకంతో సత్కరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సియాచిన్ యుద్ధభూమిలో 2016 ఫిబ్రవరి 3న మంచుతుపాన్‌లో 10 మంది సైనికులు సజీవ సమాధి కాగా, హనుమంతప్ప మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 11న మరణించాడు. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లా బెటాదుర్ గ్రామానికి చెందిన హనుమంతప్ప మద్రాస్ రెజిమెంట్‌లో సైనికుడిగా పనిచేశాడు.
జాతీయ సాహస పురస్కారాలు - 20162016వ సంవత్సరానికి జాతీయ సాహస పురస్కారాలను జనవరి 17న ప్రకటించారు. మొత్తం 25 మంది పిల్లల (13 మంది బాలురు, 12 మంది బాలికలు)ను ఈ ఏడాది సాహస పురస్కారాలకు ఎంపిక చేశారు. బాలికల అక్రమ రవాణాను అరికట్టేందుకు సహాయం చేసిన పశ్చిమ బెంగాల్ అమ్మాయిలు తేజస్వితా (18), శివాని(17)లు గీతా చోప్రా అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లో పచిన్ నదిలో కొట్టుకుపోతున్న ఇద్దరు పిల్లలను కాపాడుతుండగా మరణించిన తార్హ్ పీజుకు భారత్ అవార్డు ప్రకటించారు. సోదరుడిని కాపాడేందుకు చిరుతపులితో పోరాడిన ఉత్తరాఖండ్‌కు చెందిన సుమిత్‌కు సంజయ్ చోప్రా పురస్కారం లభించింది.

పేరు | రాష్ట్రం | అవార్డు |
ఎక్కా యాదగిరి రావు | తెలంగాణ | పద్మశ్రీ |
టి.హనుమాన్ చౌదరి | ఆంధ్రప్రదేశ్ | పద్మశ్రీ |
వి.కోటేశ్వరమ్మ | ఆంధ్రప్రదేశ్ | పద్మశ్రీ |
మహమ్మద్ అబ్దుల్ వహీద్ | తెలంగాణ | పద్మశ్రీ |
చంద్రకాంత్ పితావా | తెలంగాణ | పద్మశ్రీ |
చింతకింది మల్లేశం | తెలంగాణ | పద్మశ్రీ |
దారిపల్లి రామయ్య | తెలంగాణ | పద్మశ్రీ |
బి.వి.ఆర్. మోహన్ రెడ్డి | తెలంగాణ | పద్మశ్రీ |
పద్మ విభూషణ్ గ్రహీతలు1. యేసుదాసు (కేరళ)
2. సద్గురు జగ్గీ వాసుదేవ్ (తమిళనాడు)
3. శరద్ పవార్ (మహారాష్ట్ర)
4. మురళీ మనోహర్ జోషి (ఉత్తరప్రదేశ్)
5. ప్రొఫెసర్ ఉడిపి రామచంద్రరావు(కర్ణాటక)
6. సుందర్‌లాల్ పట్వా (మరణానంతరం)(మధ్యప్రదేశ్)
7. పీఏ సంగ్మా (మరణానంతరం) ( మేఘాలయ)
పద్మ భూషణ్ గ్రహీతలు1. విశ్వమోహన్ భట్ (రాజస్తాన్)
2. ప్రొఫెసర్ దేవీ ప్రసాద్ ద్వివేది (ఉత్తరప్రదేశ్)
3. తెహంతోన్ ఉద్వాదియా (మహారాష్ట్ర)
4. రత్న సుందర్ మహారాజ్ (గుజరాత్)
5. స్వామి నిరంజనానంద సరస్వతి (బిహార్)
6. చో రామస్వామి (మరణానంతరం) ( తమిళనాడు)
7. యువరాణి మహాచక్రి సిరింధోర్న్ (థాయ్‌లాండ్)
పద్మశ్రీ గ్రహీతలు
బసంతి బిస్త్ | కున్హిరామన్ నాయర్ | అరుణా మొహంతి |
భారతీ విష్ణువర్ధన్ | సాధు మెహర్ | టి.కె. మూర్తి |
బీరేంద్రకుమార్ సింగ్ | కృష్ణరామ్ చౌదరి | బవోవా దేవి |
తిలక్ గితాయ్ | ఎక్కా యాదగిరిరావు | జితేంద్ర హరిపాల్ |
కై లాష్ ఖేర్ | పరస్సల బి. పొన్నమ్మాళ్ | సుక్రి బొమ్మగౌడ |
ముకుంద్ నాయక్ | పురుషోత్తం ఉపాధ్యాయ్ | అనురాధా పౌడ్వాల్ |
వారెప్ప నబా నీల్ | టి. హనుమాన్ చౌదరి | టీకే విశ్వనాథన్ |
కన్వల్ సిబాల్ | బిర్ఖా లింబూ మురింగ్లా | ఎలి అహ్మద్ |
నరేంద్ర కోహ్లి | జి.వెంకటసుబ్బయ్య | అచ్యుతన్ నంబూద్రి |
కాశీనాథ్ పండిత | చాము కృష్ణశాస్త్రి | హరిహర్ కృపాళు త్రిపాఠి |
మైఖేల్ డానినో | పూనమ్ సూరి | వీజీ పటేల్ |
వి.కోటేశ్వరమ్మ | బల్బీర్ దత్ | భావనా సోమయ్య |
విష్ణు పాండ్య | సుబ్రతో దాస్ | భక్తియాదవ్ |
మహ్మద్ అబ్దుల్ వహీద్ | మదన్ మాధవ్ గోడ్బోలే | దేవేంద్ర దయాభాయ్ |
ప్రొఫెసర్ హరికిషన్ సింగ్ | ముకుట్ మింజ్ | అరుణ్ కుమార్ శర్మ |
సంజీవ్ కపూర్ | మీనాక్షి అమ్మ | జెనాభాయ్ పటేల్ |
చంద్రకాంత్ పిఠావా | అజోయ్ కుమార్ రే | చింతకింది మల్లేశం |
జితేంద్రనాథ్ గోస్వామి | దారిపల్లి రామయ్య | గిరీష్ భరద్వాజ్ |
కరీముల్ హక్ | బిపిన్ గణత్రా | నివేదితా రఘునాథ్ భిడే |
అప్పాసాహెబ్ ధర్మాధికారి | బాబా బల్బీర్ సింగ్ సీచేవల్ | విరాట్ కోహ్లి |
శేఖర్ నాయక్ | వికాస గౌడ | దీపా మాలిక్ |
మరియప్పన్ తంగవేలు | దీపా కర్మాకర్ | పీఆర్ శ్రీజేష్ |
సాక్షి మాలిక్ | మోహన్ రెడ్డి వెంకట్రామ | ఇమ్రాన్ ఖాన్ |
అనంత్ అగర్వాల్ | హెచ్ఆర్ షా | సునీతి సాల్మన్ |
అశోక్ కుమార్ భట్టాచార్య | డాక్టర్ మపుస్కర్ | అనురాధా కొయిరాలా |
డాక్టర్ రఘురామ్‌కు బీసీ రాయ్ అవార్డు హైదరాబాద్‌కు చెందిన రొమ్ము కేన్సర్ నిపుణుడు డాక్టర్ పి.రఘురామ్ ప్రతిష్టాత్మక బీసీ రాయ్ జాతీయ అవార్డు-2016కు ఎంపికయ్యారు. ‘అవుట్‌స్టాండింగ్ సర్వీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సోషియో మెడికల్ రిలీఫ్’ సేవకు గుర్తింపుగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆయనకు ఈ అవార్డు ప్రకటించింది. జూలై 1న వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకోనున్నారు.
డా.రఘునాథరావుకు బీసీ రాయ్ పురస్కారంవిశాఖలోని అగనంపూడి హోమీబాబా క్యాన్సర్ ఆసుపత్రి డెరైక్టర్ డాక్టర్ దిగమర్తి రఘునాథరావు 2016 సంవత్సరానికిగానూ ప్రతిష్టాత్మక డాక్టర్ బి.సి.రాయ్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. క్యాన్సర్ నిరోధక సేవలతోపాటు వైద్య రంగంలోని భిన్న విభాగాల నిపుణులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నందుకు ఆయన్ను అవార్డుకు ఎంపిక చేసినట్టు భారతీయ వైద్య మండలి ప్రకటించింది.
సైనిక పతకాలు ప్రకటించిన కేంద్రంగణతంత్ర దినోత్సవాల సందర్భంగా వివిధ దళాల సైనికులకు 398 శౌర్య, కీర్తి చక్ర ప్రకటించారు. ఉడీ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముష్కర స్థావరాలపై సర్జికల్ దాడి చేసిన 19 మంది సైనికులను కీర్తిచక్ర, యుధ్ సేవా తదితర మెడళ్లు, శౌర్యపతకాలతో సత్కరించారు.
4వ పటాలానికి చెందిన మేజర్ రోహిత్ సూరికి శాంతి సమయంలో ఇచ్చే రెండో అత్యున్నత శౌర్య పతకమైన కీర్తిచక్ర ప్రకటించారు. కమాండింగ్ అధికారులైన కపిల్ యాదవ్, హర్‌ప్రీత్ సంధులకు యుధ్‌సేవా అవార్డును ప్రకటించారు.
హంగ్‌పన్ దాదాకు అశోక్‌చక్రవీర జవాన్ హంగ్‌పన్ దాదాకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అశోక్‌చక్ర పురస్కారాన్ని ప్రకటించింది. ఈ పురస్కారాన్ని జనవరి 26న జరిగిన 68వ గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా హంగ్‌పన్ దాదా సతీమణి అందుకున్నారు. హంగ్‌పన్ జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టి వారి తూటాలకు బలయ్యారు.
అవార్డుల జాబితా
మేజర్ రోహిత్ సూరి | కీర్తి చక్ర |
హవల్దార్ ప్రేమ్ బహదూర్ రేస్మి మగర్ | కీర్తి చక్ర |
పాండురంగ్ మహదేవ్, నాయక్ విజయ్ కుమార్ | సేవా మెడల్స్ |
మేజర్ ప్రవీణ్ బక్షి, మేజర్ పీఎం హరీజ్ | పరమ్ విశిష్ట సేవా మెడల్స్ |
కపిల్ యాదవ్, హర్‌ప్రీత్ సంధు | యుధ్‌సేవా అవార్డు |
భారత సంతతి వ్యక్తులకు ఆస్ట్రేలియా అత్యున్నత పురస్కారం
ఆస్ట్రేలియా అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అవార్డు-2017 కు భారత సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఎంపికయ్యారు. వెద్యుడు పురుషోత్తమ్ సారికర్, న్యూరోరేడియాలజిస్ట్ మఖన్‌సింగ్ ఖన్గురే, న్యూక్లియర్ మెడిసన్ పరిశోధకుడు విజయ్ కుమార్‌లకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. వైద్య, సామాజిక సేవా రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఏటా ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారం ప్రదానం చేస్తారు.
జేఎన్‌టీయూహెచ్ కళాశాలకు ఎడ్యుకేషన్ లీడర్‌షిప్ అవార్డు హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలకు ప్రతిష్టాత్మక ఎడ్యుకేషన్ లీడర్‌షిప్ అవార్డు దక్కింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రెజైస్-IPE అందించే దివాంగ్ మెహతా జాతీయ విద్యా అవార్డుల్లో భాగంగా ఈ కళాశాలకు పురస్కారం దక్కింది. ఉత్తమ సాంకేతిక విద్య, సమర్థవంతంగా యూజీ కార్యక్రమాల అమలు, పరిశోధనా కార్యక్రమాల్లో విశేష కృషి చేస్తున్న దేశంలోని పది అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటిగా జేఎన్‌టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాల గుర్తింపు పొందింది.
సైన్స్ సిటీ సీఈవో కృష్ణారావుకు ఎల్లాప్రగడ అవార్డు ప్రతిష్ఠాత్మక డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు అవార్డుకు ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ సీఈవో, అమెరికన్ డాక్టర్ అప్పసాని కృష్ణారావు ఎంపికయ్యారు. బయాలజీ, కెమిస్ట్రీ, జెనటిక్స్, మెడికల్ సైన్‌సలో ఆయన చేసిన విశేష కృషికి ఈ అవార్డు లభించింది. నోబెల్ అవార్డ్ గ్రహీత ప్రొఫెసర్ హర్ గోవింద్ ఖొరానా లేబొరేటరీలో సింతటిక్ రోడోస్పిన్ జీన్‌ను మెదటిసారిగా కృష్ణారావు కనుగొన్నారు. పలు వ్యాధులకు మందులు కనుగొన్న ఎల్లాప్రగడ సుబ్బారావు పేరిట ఏటా ఫౌండేషన్ ఈ అవార్డు అందజేస్తుంది.
ప్రియాంకకు మరోసారి పీపుల్స్ చాయిస్ అవార్డు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా వరుసగా రెండోసారి పీపుల్స్ చాయిస్ అవార్డు అందుకుంది. అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికోలో ఆమె నటనకుగాను (ఫేవరేట్ డ్రమటిక్ టీవీ నటి విభాగం) ఆమె పీపుల్స్ చాయిస్ అవార్డు 2017 కు ఎంపికైంది. జనవరి 19న అమెరికాలోని లాస్ ఏంజిలెస్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రియాంక పురస్కారాన్ని అందుకుంది. 2016లోనూ క్వాంటికో సిరీస్ విభాగంలో ప్రియాంక పీపుల్స్ చాయిస్ అవార్డు పొందింది.
జానీ డెప్‌కు ‘పీపుల్స్ చాయిస్’ పురస్కారం పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్ చిత్రాల నటుడు జానీ డెప్ 2016కు గాను పీపుల్స్ చాయిస్ అవార్డు గెలుచుకున్నాడు. ‘ఫేపరేట్ మూవీ ఐకన్’ విభాగంలో డెప్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. జనవరి 18న లాస్ ఏంజెల్స్‌లో జరిగిన కార్యక్రమంలో జానీ డెప్ అవార్డు అందుకున్నాడు.
తెలుగు రాష్ట్రాల పోలీసులకు రాష్ట్రపతి సేవా పథకాలు విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసులకు గణతంత్ర దినోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పతకాలు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి 29 పతకాలు దక్కగా తెలంగాణ పోలీసులకు 16 పతకాలు లభించాయి.
ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన పతకాలు రాష్ట్రపతి ఉత్తమ సేవాపతకం: ఐజీ పి.వి సునీల్ కుమార్, ఏఎస్పీ వి సురేశ్ బాబు
- 15 మంది పోలీసులకు ప్రతిభా పురస్కారాలు
- 12 మంది పోలీసులకు శౌర్య పతకాలు
- 12 మంది పోలీసులకు సేవా పతకాలు
25 మంది బాలలకు సాహస పురస్కారాల ప్రదానం 2016 జాతీయ సాహస బాలల పురస్కారాలను ప్రధాని మోదీ జనవరి 23న న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవార్డులకు ఎంపికైన 25 మంది చిన్నారులకు జ్ఞాపికలను అందచేశారు. సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని ఏటా జనవరి 23న సాహస అవార్డులను ప్రదానం చేస్తారు.
ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తకు జాతీయ అవార్డుహైదరాబాద్‌లోని ఎన్‌జీఆర్‌ఐ చీఫ్ సైంటిస్టు ఎన్.పూర్ణచందర్‌రావు నేషనల్ జియోసైన్స్ అవార్డు - 2016కు ఎంపికయ్యారు. భూగర్భ అంశాల్లో అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్రం ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది. భూకంపాలు, భూగర్భంలో జరిగే అంతర్గత మార్పులపై పూర్ణచందర్‌రావు పలు పరిశోధనలు జరిపారు.
62వ ఫిలింఫేర్ అవార్డులు62వ ఫిలింఫేర్ అవార్డులను జనవరి 14న ముంబైలో ప్రదానం చేశారు.
ఉత్తమ చిత్రం: దంగల్, ఉత్తమ నటుడు: అమీర్‌ఖాన్ (దంగల్)
ఉత్తమ నటి: అలియాభట్ (ఉడ్తా పంజాబ్)
ఉత్తమ దర్శకుడు : నితేష్ తివారి (దంగల్)
జీవితకాల సాఫల్య పురస్కారం: శత్రుఘ్నసిన్హా
ఒడిషా బాలికకు జాతీయ బాలశ్రీ పురస్కారంఒడిశాకు చెందిన సిమ్రన్ స్వెయిన్‌కు 2015 సంవత్సరానికి గాను జాతీయ బాలశ్రీ పురస్కారం దక్కింది. ఒడిస్సీ నృత్యంలో చూపిన ప్రతిభకుగాను ఆమెకు ఈ అవార్డును ప్రకటించారు. పిల్లల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు జాతీయ బాల్ భవన్ 2015 నుంచి జాతీయ బాలశ్రీ పురస్కారాలను అందజేస్తోంది.
తమిళనాడు వాసికి ఆస్కార్ అవార్డు తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన కిరణ్ భట్ టెక్నికల్ అచీవ్‌మెంట్స్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. ఐఎల్‌ఎం ఫేషియల్ పర్‌ఫార్మెన్‌స - క్యాప్చర్ సాల్వింగ్ సిస్టమ్‌ని డెవలప్ చేసినందుకుగాను మరో ముగ్గురితో కలిసి కిరణ్‌కు ఈ అవార్డును ప్రకటించారు. ఫిబ్రవరిలో జరిగే 89వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ఆస్కార్‌ను అందుకుంటారు.
బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్‌లో డ్యూయల్ డిగ్రీ చేసిన కిరణ్ అమెరికాలోని కార్నీజ్ మెల్లన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో డాక్టరేట్ పూర్తిచేశారు. 2010లో సహోద్యోగులు మైకెల్ కూపర్వాస్, బ్రియాన్ క్యాంట్వెల్, పైగ్ వార్నర్‌తో కలిసి ఫేషియల్ పర్‌ఫార్మెన్స్ క్యాప్చరింగ్ సిస్టమ్‌ని డెవలప్‌చేశారు. దీనిని మొదటిసారిగా అవెంజర్స్ మూవీలో హక్ పాత్రకు హావభావాలు పలికించడం కోసం ఉపయోగించారు.
లాన్‌సనాయక్ హనుమంతప్పకు సేనా మెడల్హిమాలయాల్లో మంచు తుపాను వల్ల మరణించిన సైనికుడు లాన్‌స నాయక్ హనుమంతప్పను జనవరి 15న ఆర్మీడే సందర్భంగా సేనా పతకంతో సత్కరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సియాచిన్ యుద్ధభూమిలో 2016 ఫిబ్రవరి 3న మంచుతుపాన్‌లో 10 మంది సైనికులు సజీవ సమాధి కాగా, హనుమంతప్ప మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 11న మరణించాడు. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లా బెటాదుర్ గ్రామానికి చెందిన హనుమంతప్ప మద్రాస్ రెజిమెంట్‌లో సైనికుడిగా పనిచేశాడు.
జాతీయ సాహస పురస్కారాలు - 20162016వ సంవత్సరానికి జాతీయ సాహస పురస్కారాలను జనవరి 17న ప్రకటించారు. మొత్తం 25 మంది పిల్లల (13 మంది బాలురు, 12 మంది బాలికలు)ను ఈ ఏడాది సాహస పురస్కారాలకు ఎంపిక చేశారు. బాలికల అక్రమ రవాణాను అరికట్టేందుకు సహాయం చేసిన పశ్చిమ బెంగాల్ అమ్మాయిలు తేజస్వితా (18), శివాని(17)లు గీతా చోప్రా అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లో పచిన్ నదిలో కొట్టుకుపోతున్న ఇద్దరు పిల్లలను కాపాడుతుండగా మరణించిన తార్హ్ పీజుకు భారత్ అవార్డు ప్రకటించారు. సోదరుడిని కాపాడేందుకు చిరుతపులితో పోరాడిన ఉత్తరాఖండ్‌కు చెందిన సుమిత్‌కు సంజయ్ చోప్రా పురస్కారం లభించింది.
అవార్డుల జాబితా
గీతా చోప్రా అవార్డు
|
తేజస్వితా (18), శివాని(17)
|
సంజయ్ చోప్రా అవార్డు
|
సుమిత్ మామ్‌గెన్
|
భారత్ అవార్డు
|
తార్హ్ పీజు
|
బాపు గైదానీ అవార్డు
|
Roluahpuii, Tushar Verma and H Lalhriatpuii
|
అమితాబ్‌కు యూఎస్ ఎంబసీ అవార్డు
ట్యూబర్‌క్యులోసిస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అమితాబ్ చేస్తున్న కృషికి అమెరికా రాయబార కార్యాలయం యూఎస్ ఎంబసీ అవార్డును అందజేసింది. జనవరి 8న ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ ఆర్ వర్మ చేతుల మీదుగా అమితాబ్ పురస్కారాన్ని అందుకున్నారు.
ఇస్కా అవార్డులు ప్రదానం
తిరుపతిలో జరుగుతున్న 104వ సైన్స్ కాంగ్రెస్‌లో 20 మంది భారత శాస్త్రవేత్తలకు 2016కుగానూ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్(ఇస్కా) పురస్కారాలను ప్రదానం చేశారు. గతంలో ఇస్కా సదస్సులకు జనరల్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించిన అశోక్ కుమార్ సక్సేనాకు శాస్త్రవేత్త అశుతోష్ ముఖర్జీ మెమోరియల్ అవార్డు లభించింది. దీంతోపాటు నోబెల్ పురస్కార గ్రహీతలైన ప్రొ. మోర్నార్ విలియం ఎస్కో (అమెరికా), మహ్మద్ యూనస్ (బంగ్లాదేశ్), ప్రొ.టకాకి కజిటా (జపాన్), ప్రొ. సర్జే హరోచి (ఫ్రాన్స్), ప్రొ. అడా ఇ యనాత్ (ఇజ్రాయెల్), ప్రొ.టిరోలే (ఫ్రాన్స్)లకు బంగారు పతకాలను ప్రదానం చేశారు. బాలల సైన్స్ కాంగ్రెస్: జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా మూడు రోజుల బాలల కాంగ్రెస్‌ను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చంద్రబాబునాయడు జనవరి 4న ప్రారంభించారు.
లయన్ సినిమాకు జ్యూరిచ్ ఫిల్మ్ అవార్డుభారత సంతతి నటుడు దేవ్‌పాటిల్, సన్నీ పావర్‌లు నటించిన లయన్ సినిమాకు ప్రతిష్టాత్మక జ్యూరిచ్ ఫిల్మ్ ఫెస్టివల్ (డైవర్శిటీ ఇన్ ఫిల్మ్) అవార్డు లభించింది. 2016 సెప్టెంబరులో విడుదలైన ఈ సినిమాను గార్త్ డెవిస్ రూపొందించారు. రోనీ మారా, నికోల్ కిడ్‌మాన్‌లు ప్రధాన పాత్రలు పోషించారు.
ఆస్ట్రేలియాకు చెందిన సారూ బ్రీర్లీ గూగుల్ ఎర్త్ ఆధారంగా భారత్‌లో నివసిస్తున్న తన కుటుంబం ఆచూకీ తెలుసుకునే అంశంపై సినిమా సాగుతుంది.
భారతీయ ప్రొఫెసర్ శంకర్ సుబ్రమణియన్ కు నైట్‌హుడ్భారత సంతతికి చెందిన బ్రిటిష్ ప్రొఫెసర్ శంకర్ సుబ్రమణియన్(50)ను బ్రిటన్ ప్రభుత్వం నైట్‌హుడ్ హోదాతో సత్కరించింది. ప్రస్తుతం ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర విభాగంలో పనిచేస్తున్నారు. డీఎన్‌ఏ అనుక్రమణాన్ని కనుగొన్న పరిశోధకుల్లో ఒకరిగా శంకర్‌కు గుర్తింపు ఉంది. ‘సొలెక్సా సీక్వెన్సింగ్’ అని పిలిచే ఈ విధానం ద్వారా 1000 పౌండ్ల కన్నా తక్కువ ఖర్చుతో కేవలం ఒకటి లేదా రెండు రోజుల్లోనే జన్యువు అనుక్రమణాన్ని పూర్తి చేయొచ్చు. గతంలో దీనికి బిలియన్ పౌండ్ల వ్యయంతో పాటు కొన్నేళ్ల సమయం పట్టేది.
ఆండీ ముర్రే, మో ఫరాకు నైట్‌హుడ్ పురస్కారంబ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే, ప్రఖ్యాత అథ్లెట్ మో ఫరాలకు ప్రతిష్టాత్మక నైట్‌హుడ్ పురస్కారం దక్కింది. ఈ మేరకు డిసెంబర్ 30న రెండో ఎలిజబెత్ రాణి నూతన సంవత్సర గౌరవ పురస్కారాల జాబితాను ప్రకటించింది. వీరితో పాటు పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన లీ పియర్సన్‌కు కూడా ఈ అవార్డు దక్కింది.
29 ఏళ్ల ముర్రే 2016లో వింబుల్డన్ టైటిల్ నెగ్గడంతోపాటు రియో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించాడు. తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు.
మో ఫరా రియో ఒలింపిక్స్‌లో తొలిసారిగా నాలుగు స్వర్ణాలు గెలిచిన తొలి బ్రిటిష్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు.

No comments:
Post a Comment