AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

క్రీడలు జనవరి 2014

క్రీడలు జనవరి 2014
2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్:స్టానిస్లాస్ వావ్‌రింకా(స్విట్జర్లాండ్) రన్న రప్: రఫెల్ నాదల్, ఇది వావ్రింకాకు తొలి గ్రాండ్‌స్లామ్ 
మహిళల సింగిల్స్: నాలీ (చైనా), రన్నరప్: డొమినికా సిబుల్కోవా (స్లొవేకియా), నాలికి ఇది రెండో గ్రాండ్‌స్లామ్ 
పురుషుల డబుల్స్: లుకాష్‌కుబోట్ (పోలెండ్), రొబర్డ్ లిండ్ స్టెడ్ (స్వీడన్)
మహిళల డబుల్స్: సారా ఎర్రాని,రాబెర్టా విన్నీ (ఇటలీ)
మిక్స్‌డ్ డబుల్స్: క్రిస్టినా మ్లడోవిక్, డానియల్ నెస్టర్
రన్నరప్: సానియామీర్జా,హోరియా టెకావ్

సైనాకు ఇండియా గ్రాండ్ ప్రి గోల్డ్‌టోర్నీ 
లక్నోలో జరిగిన సయ్యద్‌మోడీ ఇంటర్నేషనల్ ఇండియా గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను భారత నంబర్ వన్ షట్లర్ సైనానె హ్వాల్ గెలుచుకుంది. 2014, జనవరి 26న తలపడిన తుది పోరులో సహచర హైదరాబాద్ క్రీడాకారిణి పీవీ సింధుపై ఆమె గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. కాగా పురుషుల విభాగంలో చైనా ఆటగాడు జు సంగ్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కి డాంబి శ్రీకాంత్‌ను ఓడించి టైటిల్ గెలుచుకున్నారు.

అంజూజార్జికి ఎనిమిదేళ్ల తర్వాత స్వర్ణం
2005 మొనాకో ప్రపంచ అథ్లెటిక్స్ పైనల్లో లాంగ్ జంపర్ అంజూబాబి జార్జికి ఎనిమిదేళ్ల తర్వాత స్వర్ణం దక్కింది. అప్పట్లో తొలి స్థానంలో నిలిచిన రష్యాకు చెందిన అథ్లెట్ తత్యానా కొటోవా డోపింగ్ పరీక్షలో పట్టుబడటంతో రెండో స్థానంలో నిలిచిన అంజూబాబి జార్జికి అంతర్జాతీయ అథ్లెటిక్ సంఘాల సమాఖ్య స్వర్ణం ప్రకటించింది. దీంతో ప్రపంచ అథ్లెటిక్ పోటీల్లో తొలి స్వర్ణం సాధించిన మహిళగా అంజూ ఘనత సాధించింది.

అభిజిత్‌కు గ్రాండ్‌మాస్టర్స్ ఇంటర్నేషనల్ చెస్ టైటిల్పార్శ్వనాథ్ గ్రాండ్‌మాస్టర్స్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెం ట్ టైటిల్‌ను అభిజిత్‌గుప్తా గెలుచుకున్నాడు. న్యూఢిల్లీలో 2014 జనవరి16న ముగిసిన పోటీలో ఉక్రెయిన్‌కు చెందిన ఎల్డర్ గాసనోవ్‌ను ఓడించి అభిజిత్ విజేతగా నిలిచాడు. 

హాకీ వరల్డ్ లీగ్ విజేత నెదర్లాండ్న్యూఢిల్లీ వేదికగా జరిగిన హాకీ వరల్డ్ లీగ్ పోటీల్లో నెదర్లాండ్స్ జట్టు విజేతగా నిలిచింది. జనవరి 18న ఏకపక్షంగా సాగిన అంతిమపోరులో ఈ జట్టు న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ లీగ్‌లో భారత్ ఆరో స్థానంలో నిలిచింది. 

నేషన్ కప్ బాక్సింగ్‌లో నిఖత్‌కు స్వర్ణం
ఆంధ్రప్రదేశ్ యువబాక్సింగ్ కెరటం నిఖత్ జరీన్ నేషన్స్ కప్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకం గెలిచింది. 51 కిలోల విభాగం ఫైనల్లో పాల్టో సెవా ఎక్తరీనా (రష్యా)ను ఓడించింది. నిఖిత్ కెరీర్‌లో ఇది నాలుగో అంతర్జాతీయ పతకం. నిజామాబాద్‌కు చెందిన నిఖత్ ప్రస్తుతం ప్లస్ టూ చదువుతోంది.

నేషనల్ టేబుల్‌టెన్నిస్ టోర్నీ జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ టైటిళ్లను పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కి చెందిన పురుషుల, మహిళ జట్లు గెలుచుకున్నాయి. పాట్నాలో జనవరి 9న ముగిసినపోటీల్లో పురుషుల టీమ్ ఫైనల్లో పశ్చిమబెంగాల్‌ను, మహిళల జట్టు ఉత్తర బెంగాల్‌ను ఓడించాయి.

ఫెడరేషన్ కప్ బాస్కెట్ బాల్28వ ఫెడరేషన్ కప్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల టైటిల్‌నుఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్, మహిళల టైటిల్‌ను ఛత్తీస్‌గఢ్ గెలుచుకున్నాయి. అహ్మదాబాద్‌లో జనవరి 9న ముగిసిన పోటీల్లో ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకును ఓడించి ఓఎన్‌జీసీ పురుషుల టైటిల్ కైవసం చేసుకోగా-మహారాష్ట్రను ఓడించి ఛత్తీస్‌గఢ్ మహిళల టైటిల్‌ను గెలుచుకున్నాయి.

ఆసీస్‌దే యాషెస్
 

ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదు క్రికెట్ టెస్టుల మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌ను ఆతిథ్య ఆసీస్ 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. యాషెస్ సిరీస్‌ను 5-0తో కైవసం చేసుకోవడం ఆస్ట్రేలియాకు ఇది మూడోసారి. ఇంతకుముందు ఆర్మ్ స్ట్రాంగ్ (1920-21), రికీపాంటింగ్(2006-07) నేత్రత్వంలో ఈ ఘనత సాధించగా ఇప్పుడు మైకేల్ క్లార్క్ వారి జాబితాలో చేరాడు. 

వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన అండర్సన్2014 జనవరి 1న క్వీన్స్‌టౌన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోరె అండర్సన్ కేవలం 36 బంతుల్లో సెంచరీ చేసి కొత్త రికార్డు సష్టించాడు. దీంతో ఇప్పటి వరకు షాహిద్‌ఆఫ్రిది (పాకిస్థాన్) శ్రీలంకపై 1996లో 37 బంతుల్లో సాధించిన శతకం రికార్డును అండర్సన్ అధిగమించాడు. 

చెన్నై ఓపెన్ విజేత వావ్రింకాచెన్నై ఓపెన్ టాప్‌సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) గెలుచుకున్నాడు. ఫైనల్లో ఫ్రాన్స్‌కు చెందిన ఎడ్వర్డ్ రోజర్ వాసెలిన్‌ను ఓడించాడు. చెన్నై ఓపెన్‌ను గెలుచుకోవడం వావ్రింకాకు ఇది రెండోసారి. డబుల్స్‌లో జోహాన్స్ బ్రెయిన్స్ (స్వీడన్), ఫ్రెడరిక్‌నీల్సన్ (డెన్మార్క్) జోడీ విజేతలుగా నిలిచారు. 

సెరెనాకు బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్బ్రిస్బేన్‌ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను సెరెనా విలియమ్స్ గెలుచుకుంది. బ్రిస్బేన్‌లో జనవరి 4న జరిగిన ఫైనల్లో విక్టోరియా అజరెంకా (బెలారస్)ను ఓడించింది. ఇది సెరెనాకు 58వ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్. పురుషుల సింగిల్స్‌ను లేటన్ హెవిట్ (ఆస్ట్రేలియా)సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో రోజర్ ఫెదరర్‌ను హెవిట్ మట్టికరిపించాడు.

నాదల్‌కు ఖతార్ ఓపెన్ఖతార్ ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను రఫెల్‌నాదల్ (స్పెయిన్) గెలుచుకున్నాడు. దోహాలో జనవరి 5న జరిగిన ఫైనల్లో గేల్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్)ను నాదల్ ఓడించాడు. 

ఫ్రాన్స్‌కు హాఫ్‌మన్‌కప్హాఫ్‌మన్‌కప్ మిక్స్‌డ్ టీమ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌ను ఫ్రాన్స్ గెలుచుకుంది. పెర్త్‌లో జనవరి 5న జరిగిన ఫైనల్లో పోలెండ్‌పై విజయం సాధించింది.

అండర్-19 ఆసియాకప్ క్రికెట్ విజేత భారత్షార్జా వేదికగా జరిగిన అండర్-19 ఆసియాకప్ క్రికెట్ విజేతగా భారత్ నిలిచింది. జనవరి 4న ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. భారత్ ఈ టైటిల్ గెలుచుకోవడం రెండోసారి. 2012లో భారత్-పాక్ సంయుక్త విజేతలుగా నిలిచాయి.

బాస్కెట్‌బాల్ ఆటగాడు ఖుషిరామ్ మృతి ఒకనాటి ప్రముఖ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు ఖుషిరామ్ (77) న్యూఢిల్లీలో 2013 డిసెంబర్ 29న మరణించారు. 1967లో ఆయనకు అర్జున అవార్డు లభించింది. 1970 మనీలా ఆసియన్ ఛాంపియన్‌షిప్‌లో ఖుషిరామ్‌ను అత్యంత విలువైన ఆటగాడు అవార్డు వరించింది.

No comments:

Post a Comment