క్రీడలు ఫిబ్రవరి 2014
టెస్ట్ సిరీస్ కివీస్‌దేభారత్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ను ఆతిథ్య న్యూజిలాండ్ గెలుచుకుంది. ఫిబ్రవరి 18న జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగియడంతో మొదటి టెస్టులో విజయం పొందిన కివీస్ విజేతగా నిలిచింది.
నాదల్‌కు రియో టైటిల్ప్రపంచ నెంబర్‌వన్ రఫెల్ నాదల్ రియో ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. రియో డి జెనెరోలో ఫిబ్రవరి 24న జరిగిన ఫైనల్‌లో ఉక్రెయిన్‌కు చెందిన అలెగ్జాండర్ డొల్గోపోలోను ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను కురుమీనారా గెలుచుకుంది. ఫైనల్లో క్లారా జెకోపలోవాపై విజయం సాధించింది.
దేవ్ వర్మన్‌కు ఢిల్లీ ఓపెన్ టైటిల్ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్‌ను భారత్‌కు చెందిన సోమ్‌దేవ్‌వర్మన్ గెలుచుకున్నాడు. ఫిబ్రవరి 23న ఢిల్లీలో జరిగిన ఫైనల్‌లో కజకిస్థాన్‌కు చెందిన అలెగ్జాండర్ నెదోవ్ యెసోవ్‌ను దేవ్ వర్మన్ ఓడించాడు. డబుల్స్ టైటిల్‌ను భారత్‌కు చెందిన సన మ్ సింగ్, సాకేత్ మైనేనీ గెలుచుకున్నారు. ఫైనల్స్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన సాంచయ్, సోన్‌చాట్ రతివతనాలను ఓడించారు.
ఢిల్లీకి హాకీ ఇండియా లీగ్ ట్రోఫీహాకీ ఇండియా లీగ్ (హెచ్.ఐ.ఎల్) ట్రోఫీని ఢిల్లీ వేవ్ రైడర్స్ జట్టు గెలుచుకుంది. ఫిబ్రవరి 23న ఢిల్లీలో జరిగిన అంతిమ పోరులో పంజాబ్ వారియర్స్‌ను ఢిల్లీ వేవ్‌రైడర్స్ ఓడించి విజేతగా నిలిచింది.
వింటర్ ఒలింపిక్స్‌లో రష్యాకు అగ్రస్థానంసోచిలో పదిహేను రోజులపాటు జరిగిన వింటర్ ఒలింపిక్స్ ఫిబ్రవరి 23న ముగిశాయి. ఈ పోటీల్లో ఆతిథ్య రష్యా ఎక్కువ పతకాలను సాధించి అగ్రస్థానంలో నిలిచింది. 13 స్వర్ణపతకాలతో రష్యా ప్రథమస్థానం కైవసం చేసుకుంది. 11 స్వర్ణాలతో నార్వే, 10 స్వర్ణాలతో కెనడా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. భారత్ తరపున పాల్గొన్న ముగ్గురు క్రీడాకారులకు ఒక పతకం కూడా దక్కలేదు. కాగా 2018 వింటర్ ఒలింపిక్స్ దక్షిణకొరియాలోని ప్యాంగ్‌చాంగ్‌లో జరగనున్నాయి.
సీసీఎల్-4 విజేతగా కర్ణాటకసెలబ్రిటీ క్రికెట్ లీగ్(సీసీఎల్) విజేతగా డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక బుల్డోజర్‌స నిలిచింది. ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లో జరిగిన ఫైనల్స్‌లో కేరళ స్ట్రైకర్‌సను కర్ణాటక ఓడించింది.
కర్ణాటకకు ఇరానీ కప్క్రికెట్ ఇరానీ కప్‌ను కర్ణాటక గెలుచుకుంది. బెంగళూరులో 2014 ఫిబ్రవరి 12న జరిగిన ఫైనల్స్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాను కర్ణాటక ఓడించింది. కర్ణాటక చివరగా 1998లో ఈ కప్‌ను గెలుచుకుంది.
ఐ.పి.ఎల్-7లో యువరాజ్‌సింగ్‌కు 14 కోట్లుఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్-7) కోసం బెంగళూరులో 2014 ఫిబ్రవరి 12న జరిగిన వేలంలో యువరాజ్‌సింగ్‌ను బెంగళూరు * 14 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మొత్తం తీసుకున్న తొలి క్రీడాకారుడిగా యువరాజ్‌సింగ్ నిలిచాడు. యువరాజ్ తర్వాత దినేశ్ కార్తీక్ అత్యధిక ధర పలికాడు. కార్తీక్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ *12.5 కోట్లకు దక్కించుకుంది. తర్వాత ఇంగ్లండ్‌కు చెందిన కెవిన్ పీటర్సన్‌ను ఢిల్లీ జట్టు * 9 కోట్లకు పొందింది.
ఏఐఎఫ్‌ఎఫ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా సునీల్ ఛెత్రీఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఎఫ్) ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సునీల్ ఛెత్రీకి 2014 ఫిబ్రవరి 13న ప్రదానం చేశారు. భారత ఫుట్‌బాల్ టీం కెప్టెన్ ఛెత్రీ 2007, 2011లో కూడా ఈ అవార్డును సాధించారు. మహిళా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా ఒయినమ్ బెంబెమ్ దేవి, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా జేజే లాల్‌పెక్‌లు అవార్డులు అందుకున్నారు.
ఫిక్కీ స్పోర్‌ట్స అవార్డులుఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్‌స అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) అవార్డులను న్యూఢిల్లీలో 2014 ఫిబ్రవరి 13న ప్రదానం చేశారు.
స్పోర్‌ట్స పర్సన్ ఆఫ్ ద ఇయర్: దీపికా కుమారి (ఆర్చరీ)
కోచ్ ఆఫ్ ద ఇయర్: బల్దేవ్ సింగ్ (హాకీ)
బ్రేక్‌త్రూ స్పోర్‌ట్స పర్సన్ ఆఫ్ ద ఇయర్: పి.వి. సింధూ (బ్యాడ్మింటన్)
టీం ఆఫ్ ద ఇయర్: ఇండియన్ ఉమెన్‌స ఆర్చరీ టీం
లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు: రాహుల్ ద్రావిడ్
భారత్‌పై నిషేధం ఎత్తివేసిన ఐఓసీభారత్ ఒలింపిక్ సంఘం(ఐఓఏ)పై ఉన్న నిషేధాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) 2014 ఫిబ్రవరి 11న ఎత్తివేసింది. ఐఓఏలో ప్రభుత్వ జోక్యం, ఒలింపిక్ చార్టర్‌కు విరుద్ధంగా పదవుల్లో కళంకిత వ్యక్తుల నియామకాలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఐఓఏపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 2012 డిసెంబర్ 4న నిషేధం విధించింది. 2014 ఫిబ్రవరి 9న ఐఓసీ సూచనల ప్రకారం ఐఓసీ పరిశీలకుల ఆధ్వర్యంలో ఐఓఏకి ఎన్నికలు జరిగాయి. పరిశీలకులు ఇచ్చిన సమాచారంతో తృప్తిపడిన ఐఓసీ భారత్‌పై నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో రష్యాలోని సోచిలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ముగ్గురు భారత క్రీడాకారులు స్వతంత్ర ఆటగాళ్లుగా కాకుండా భారత్ తరఫున ఆడేందుకు వీలుంటుంది. ముగింపు కార్యక్రమంలో భారత్ పతాకంతో పాల్గొంటారు.
ఐసీసీ చైర్మన్‌గా ఎన్. శ్రీనివాసన్ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చైర్మన్‌గా ఎన్. శ్రీనివాసన్ 2014 ఫిబ్రవరి 8న సింగపూర్‌లో జరిగిన బోర్డు సమావేశంలో ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం బీసీసీఐ చైర్మన్‌గా ఉన్నారు.
ఐఓఏ అధ్యక్షుడిగా ఎన్. రామచంద్రన్భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) అధ్యక్షుడిగా ఎన్. రామచంద్రన్ 2014 ఫిబ్రవరి 9న న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు.
ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఈ టోర్నమెంట్ బెంగళూరులో 2014 ఫిబ్రవరి 8న ముగిసింది.
విజేతలు: పురుషుల సింగిల్స్: అనూప్ శ్రీధర్(కర్ణాటక). ఫైనల్స్‌లో సౌరభ్ వర్మ(పెట్రోలియం)ను ఓడించాడు.
పురుషుల డబుల్స్: చోప్రా ప్రణవ్ జెర్రీ, అక్షయ్ దెవాల్కర్. వీరు ఫైనల్స్‌లో నందగోపాల్, హేమనాగేంద్రబాబులను ఓడించారు.
మహిళల సింగిల్స్: తాన్వి లాడ్. ఫైనల్స్‌లో రితూపర్ణాదాస్‌ను ఓడించింది.
మహిళల డబుల్స్: జె. మేఘన, సిక్కి రెడ్డి. వీరు ఫైనల్స్‌లో ప్రజక్తా సావంత్, ఆరతీ సారా సునీల్‌ను ఓడించారు.
వన్డేల్లో 8 వేల పరుగులు చేసిన ధోనీఎంఎస్ ధోనీ వన్డేల్లో 8 వేల పరుగుల మైలురాయిని దాటిన ఏడో భారత ఆటగాడుగా గుర్తింపు పొందాడు. న్యూజిలాండ్‌తో జనవరి 31న ముగిసిన ఐదో వన్డేలో ధోనీ 8,046 పరుగులకు చేరుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత వేగంగా 8వేల పరుగులు చేసిన నాలుగో క్రికెటర్‌గా కూడా ధోనీ గుర్తింపు పొందాడు.
ఐసీసీ ప్యానల్‌లో తొలి మహిళా అంపైర్న్యూజిలాండ్‌కు చెందిన కేథీక్రాస్ ఐసీసీ అంపైర్ ప్యానల్‌కు ఎంపికైన తొలిమహిళగా చరిత్ర పుటలకెక్కింది. 2014 సంవత్సరానికి అసోసియేట్, అఫిలియేట్ ఇంటర్నేషనల్ అధికారిణిగా ఆమెను ఐసీసీ ప్యానల్‌లోకి తీసుకోనున్నారు. కింగ్‌కౌంటీలోని టౌమరునీలో పుట్టిన 56 ఏళ్ల క్రాస్ ఇప్పుడు ఐసీసీ ప్రపంచ లీగ్ డివిజన్స్‌లో నియామకానికి అర్హత సాధించింది.
రంజీ విజేత కర్ణాటకరంజీ ట్రోఫీ విజేతగా కర్ణాటక జట్టు నిలిచింది. ఈ టైటిల్ నెగ్గడం కర్ణాటకకు ఇది ఏడోసారి. హైదరాబాద్ లో ఫిబ్రవరి 2న ముగిసిన ైఫైనల్లో మహారాష్ట్రను ఓడించి 1998-99 తర్వాత ఈ టైటిల్‌ను నెగ్గింది. విజేతకు రూ. 2 కోట్లు, రన్నరప్‌కు రూ. కోటి ప్రై జ్‌మనీ లభించింది.
సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ విజేత సింధు
ఆంధ్రప్రదేశ్ స్టార్‌షట్లర్ పి.వి. సింధు అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. కొచ్చిలో ఫిబ్రవరి 2న జరిగిన ఫైనల్లో పి.సి.తులసి (కేరళ)పై సింధు విజయం సాధించింది. మహిళల డబుల్స్‌లోనూ రాష్ట్రానికి చెందిన సిక్కిరెడ్డి జోడి టైటిల్ నెగ్గింది. అపర్ణ బాలన్‌తో జతగా బరిలోకి దిగిన సిక్కిరెడ్డి జోడి ప్రజక్తా సావన్, ఆరతి సారా జంటను ఓడించింది. కాగా పురుషుల సింగిల్స్ టైటిల్‌ను హెచ్. ఎస్. ప్రణయ్ కైవసం చేసుకున్నాడు.
అమృత్‌రాజ్‌కు డేవిస్‌కప్ అవార్డు
భారత మాజీ టెన్నిస్ ఆటగాడు విజయ్ అమృత్‌రాజ్‌కు డేవిస్‌కప్ కమిట్‌మెంట్ అవార్డు లభించింది. ఈ పురస్కారం గతంలో రామనాథన్ కృష్ణన్, జైదీప్ ముఖర్జీ, ఆనంద్ అమృత్‌రాజ్, రమేశ్ కృష్ణన్, లియాండర్ పేస్ , మహేశ్ భూపతిలకు దక్కింది.

No comments:
Post a Comment