AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

అవార్డులు మే 2014

అవార్డులు మే 2014
8 మంది భారతీయులకు ఐరాస అవార్డు
వివిధ దేశాల్లో శాంతిపరిరక్షణ బాధ్యతలు నిర్వహిస్తూ పలు దాడుల్లో గతేడాది మృతి చెందిన 106 మందికి ఐక్యరాజ్యసమితి ప్రతిష్టాత్మక డౌగ్ హామర్షల్డ్ అవార్డును ప్రకటించింది. వీరిలో 8 మంది భారతీయ సైనికులు, సిబ్బంది ఉన్నారు. వారు మనిపాల్ సింగ్, లాన్స్ నాయక్ నందకిషోర్, హవాల్దర్ హీరాలాల్, నాయక్ సుబేదార్ శివకుమార్‌పాల్, హవాల్దర్ భరత్ సాస్‌మాల్, సుబేదార్ ధర్మేష్ సంగ్వాన్, సుబేదార్ కుమార్‌పాల్ సింగ్, రామేశ్వర్ సింగ్. వీరు ఐరాస దక్షిణ సదన్ విభాగంలో విధులు నిర్వర్తించేవారు. అంతర్జాతీయ శాంతి పరిరక్షణ దళాల దినోత్సవం సందర్భంగా మే 29న ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఈ అవార్డును అందజేస్తారు. 
మొబైల్ సేవకు ఐరాస పురస్కారం
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘మొబైల్ సేవ’ ప్రాజెక్ట్‌కు ఐక్యరాజ్యసమితి పబ్లిక్ సర్వీస్ అవార్డుల్లో ద్వితీయ బహుమతి లభించింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఐటీ ద్వారా ప్రభుత్వ విధానాలను అమలు చేస్తున్నందుకుగాను ఈ పురస్కారం దక్కింది. ఈ విభాగంలో కొరియాకు చెందిన హెల్త్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫర్మేషన్ సర్వీస్‌కు మొదటి బహుమతి లభించింది. కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ 2012లో మొబైల్ గవర్నెన్స్‌లో భాగంగా ‘మొబైల్ సేవ’ పేరిట ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. దీని పరిధిలో దేశవ్యాప్తంగా 1,000 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి.
వింటర్‌స్లీప్‌కు కేన్స్ పురస్కారం 
ఫ్రాన్స్‌లో జరిగిన 67వ కేన్స్ పురస్కారోత్సవంలో ఉత్తమ చిత్రంగా టర్కీష్ చిత్రం వింటర్‌స్లీప్ ఎంపికైంది. ఇందుకుగాను పామ్ డి ఓర్ పురస్కారాన్ని ఆ చిత్ర దర్శకుడు నూరి బిల్జ్ సెలాన్ అందుకున్నారు. టర్కీ చిత్రానికి ఈ అవార్డు దక్కడం రెండోసారి (మొదటిసారి 1982లో ది వే ఉత్తమ చిత్రంగా నిలిచింది). రెండో అత్యున్నత పురస్కారం దిగ్రాండ్ ప్రిక్స్‌ను ఇటాలియన్ చిత్రం ది వండర్స్‌కు దక్కింది. మాప్స్ టు ది స్టార్స్ చిత్రంలో నటించిన జులియన్నే మూర్ ఉత్తమనటిగా, ఉత్తమ నటుడిగా మిస్టర్ టర్నర్‌లో నటించిన తిమోతీ స్పాల్ ఎంపికయ్యారు. ఫాక్స్ కేచర్ సినిమాకు బెన్నెట్ మిల్లర్ ఉత్తమ దర్శకుడి పురస్కారాన్ని అందుకున్నారు. 
భారత సంతతి విద్యార్థికి నేషనల్ జాగ్రఫిక్ అవార్డ్
అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన అఖిల్ రేకులపల్లి (13) అనే ఎనిమిదో తరగతి విద్యార్థి ప్రతిష్టాత్మకమైన నేషనల్ జాగ్రఫిక్ అవార్డ్‌కు ఎంపికయ్యాడు. ఈ పురస్కారం కింద 50 వేల డాలర్ల ఉపకారవేతనం లభించింది. అఖిల్ నేషనల్ జాగ్రఫిక్ సొసైటీ నిర్వహించిన జాతీయస్థాయి క్విజ్ పోటీలో మరో భారత సంతతి విద్యార్థి అమెయమజుందార్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. అమెరికా వ్యాప్తంగా వివిధ స్థాయిల్లో జరిగిన ఈపోటీలో సుమారు 40 లక్షలమంది విద్యార్థులు పాల్గొనగా వారిలో అఖిల్ గెలుపొందడం విశేషం. 
కలామ్‌కు ఎడింబర్గ్ వర్సిటీ గౌరవ డాక్టరేట్
భారత మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్‌కలామ్‌కు స్కాట్లాండ్‌లోని ఎడింబర్గ్ విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ డిగ్రీతో గౌరవించింది. ఈ అవార్డును ఎడింబర్గ్ విశ్వ విద్యాలయ ఇండియా ఇనిస్టిట్యూట్ ప్రారంభ కార్యక్రమంలో కలాం స్వీకరించారు.

రతన్ టాటాకు బ్రిటన్ అత్యున్నత పౌర పురస్కారం 
భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు యునెటైడ్ కింగ్‌డమ్ అత్యున్నత పౌరపురస్కారం లభించింది. స్వాతంత్య్రానంతరం ఈ అవార్డును పొందిన తొలి భారతీయుడు రతన్‌టాటానే. నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (జీబీఈ) పేరు కలిగిన ఈ పురస్కారాన్ని క్వీన్ ఎలిజబెత్-2 తరఫున భారత్‌లోని బ్రిటిష్ హై కమిషనర్ జేమ్స్ బెవాన్ మే 5న రతన్‌టాటాకు ప్రదానం చేశారు.

బీహార్ మహిళకు నైటింగేల్ పురస్కారం బీహార్‌కు చెందిన ఆరోగ్య శాఖ అధికారిణి మార్తా డోడ్రేను భారత ప్రభుత్వం ఫ్లోరెన్స్ నైటింగేల్-2014 అవార్డుకు ఎంపిక చేసింది. 40 ఏళ్ల మార్తా బీహార్‌కు పొరుగునే ఉన్న జార్ఖండ్‌లోని పలాము జిల్లాకు చెందిన గిరిజన మహిళ. బీహార్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తూ పోలియో నివారణకు విశేష కృషి చేశారు. ఈ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెను నైటింగేల్ పురస్కారంతో గౌరవించాలని నిర్ణయించింది. అవార్డు కింద మార్తాకు రూ.50 వేల నగదు, ప్రశంసా పత్రాన్ని అందిస్తారు. 2013 నవంబరులో ప్రకటించిన ఐక్యరాజ్యసమితి గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు కూడా డోడ్రేకు లభించింది.

బ్రిటన్‌లో భారత శాస్త్రవేత్తకు ఫెలోషిప్బ్రిటన్‌లోని గ్లాస్గో యూనివర్సిటీలో పరిశోధనలు సాగిస్తున్న భారత శాస్త్రవేత్త రవీందర్ దహియా రూ. 10.83 కోట్ల విలువైన ఇంజనీరింగ్ ఫెలోషిప్స్ ఫర్ గ్రోత్ గెలుచుకున్నారు. అడ్వాన్స్‌డ్ మెటీరియల్, రోబోటిక్ అండ్ అటానమస్ సిస్టమ్స్, సింథటిక్ బయాలజీ రంగాల్లో చేసిన పరిశోధనలకు గానూ రవీందర్‌కు ఈ ఫెలోషిప్ లభించింది.

No comments:

Post a Comment