AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday, 25 November 2017

క్రీడలు జూలై 2014

క్రీడలు జూలై 2014
లార్డ్స్ టెస్టులో భారత్ విజయం 
ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో లార్డ్స్ వేదికగా సాగిన రెండో టెస్టులో ధోనీసేన చారిత్రక విజయాన్ని సాధించింది. లార్డ్స్‌లో టీమిండియా ఆడిన 16 టెస్టుల్లో ఇది రెండో విజయం. 28 ఏళ్ల క్రితం 1986లో కపిల్ దేవ్ సారథ్యంలో తొలి విజయం నమోదయింది. ఏడు వికెట్లు తీసిన ఇషాంత్‌శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియామీర్జా 
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జాను రాష్ట్ర ప్రభుత్వం ఎంపికచేసింది. తెలంగాణ వికాసానికి విశిష్ట వ్యక్తులతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టెన్నిస్‌లో మరింతగా ప్రతిభా పాటవాలను ప్రదర్శించేందుకు అవసరమైన ప్రత్యేక శిక్షణ నిమిత్తం కోటిరూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది.
జర్మన్ గ్రాండ్‌ప్రి విజేత రోస్‌బర్‌‌గ
జర్మన్ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ విజయం సాధించాడు. జూలై 20న జరిగిన పోటీలో బొటాస్(విలియమ్స్ జట్టు) రెండో స్థానంలో నిలిచాడు. 

ప్రపంచకప్ విజేత జర్మనీ
బ్రెజిల్‌లో మారకానాలో జూలై 13న జరిగిన ప్రపంచకప్ ఫుట్‌బాల్ ఫైనల్లో జర్మనీ, అర్జెంటీనాను ఓడించి విజేతగా నిలిచింది. తద్వారా ఉత్తర,దక్షిణ అమెరికా ఖండంలో జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో విజేతగా నిలిచిన తొలి ఐరోపా దేశంగా జర్మనీ జట్టు చరిత్ర సృష్టించింది. జర్మనీకి ఇది నాలుగో ప్రపంచకప్. తదుపరి 2018 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు (21వ)కు రష్యా ఆతిథ్యమివ్వనుంది. ఈ సందర్భంగా ప్రకటించిన అవార్డుల వివరాలు.. గోల్డెన్‌బాల్ (అత్యుత్తమ ఆటగాడు): లియోనెల్ మెస్సి (అర్జెంటీనా), గోల్డెన్ బూట్ (అత్యధిక గోల్స్): రోడ్రిగెజ్ (కొలంబియా), గోల్డెన్ గ్లోవ్ (అత్యుత్తమ గోల్‌కీపర్): మాన్యుల్ న్యూర్ (జర్మనీ),ఉత్తమ యువ ఆటగాడు: పాల్ ఫోగ్బా (ఫ్రాన్స్), ఫెయిర్ ప్లే అవార్డు (కొలంబియా జట్టు) 
నిఖిత్ జరీన్‌కు బాక్సింగ్‌లో స్వర్ణంతెలంగాణకు చెందిన నిఖిత్‌జరీన్ గోల్డెన్‌గ్లవ్ ఆఫ్ వోజ్‌వోదినా అంతర్జాతీయ బాక్సింగ్‌చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించింది. సెర్బియాలోని వోజ్‌వోదినాలో జూలై 13న జరిగిన ఫైనల్‌లో 54 కిలోల విభాగంలో హంగేరికి చెందినపెరెన్జ్‌జూడిత్‌ను నిఖిత్ జరీన్ ఓడించింది.

నైజీరియా ఫుట్‌బాల్ జట్టుపై నిషేధం నైజీరియా ఫుట్‌బాల్ జట్టును ఫిఫా నిషేధించింది. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఫుట్‌బాల్ పోటీల్లో ఆ జట్టు పాల్గొనరాదని జూలై 9న ఆదేశాలు జారీచేసింది. నైజీరియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌లో అక్కడి ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఫిఫా ఈ చర్యకు పాల్పడింది.

వింబుల్డన్ విజేతలు మహిళల సింగిల్స్:పెట్రో క్విటోవా (చెక్ రిపబ్లిక్). ఫైనల్లో యూజీవ్ బౌచర్డ్ (కెనడా)పై విజయం. 
పురుషుల సింగిల్స్: నొవాక్ జొకోవిచ్ (సెర్బియా). ఫైనల్లో రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్)పై విజయం.
మహిళల డబుల్స్: సారాఎరాని, రాబెర్టావిన్సీ జోడి (ఇటలీ) 
పురుషుల డబుల్స్: వాసెక్ పాస్ప్‌పిసిల్ (కెనడా), జాక్‌సోక్(అమెరికా) జోడీ. మిక్స్‌డ్ డబుల్స్: నీనద్ జిమోంజిక్ (సెర్బియా), సమంతాస్టోసుర్ (ఆస్ట్రేలియా) జోడీ. 

బ్రిటీష్ గ్రాండ్ ప్రి విజేత హామిల్టన్ బ్రిటీష్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను లూయిస్ హామిల్టన్ కైవసం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో అతనికిది ఐదో విజయం. 

ఆనంద్‌కు రష్యా ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ అవార్డు భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ రష్యా సమాఖ్యకు చెందిన ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ అవార్డుకు ఎంపికయ్యారు. ఇజ్రాయెల్‌కు చెందిన మరో చెస్ క్రీడాకారుడు బోరిస్ గేల్‌ఫాండ్‌ను కూడా ఎంపికచేసినట్లు జూలై 4న ఫిడే ప్రకటించింది. ఈ అవార్డును ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రష్యాతో స్నేహ పూర్వక, సహకార సంబంధాల విస్తరణకు కృషిచేసిన విదేశీయులకు గుర్తింపుగా ప్రదానం చేస్తారు.

No comments:

Post a Comment