అవార్డులు ఆగష్టు 2014
భారత శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గ్రాంటుమానవ మెదడును మ్యాప్ చేసేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించిన కార్యక్రమం కింద భారత నాడీ శాస్త్రవేత్త పార్థా మిత్రాకు గ్రాంట్ లభించింది. నాడీశాస్త్రానికి సంబంధించిన ఆధునిక సాధనాలను రూపొందించడానికి గ్రాంటు కింద రెండేళ్లలో 3 లక్షల డాలర్లు అందుతాయి. దీని కింద వర్చువల్ న్యూరో అనాటమిస్ట్‌ను రూపొందించాలి. గ్రాంటు దక్కినవారిలో మిత్రాతోపాటు ఫ్లోరిన్ ఆల్బీన్ అనే మరో శాస్త్రవేత్త ఉన్నారు. ఎలుక మెదడులో అనుసంధానాలను మ్యాప్ చేయడానికి ఉద్దేశించిన ప్రయోగాత్మక ప్రాజెక్టుకు మిత్రా వ్యవస్థాపకుడిగా ఉన్నారు.
తెలుగు వారికి సాహిత్య అకాడమీ అవార్డులు2014 సంవత్సరానికి సాహిత్య అకాడమీ.. యువ, బాల సాహిత్య పురస్కారాలను ప్రకటించింది. వీరిలో ఇద్దరు తెలుగువారు ఉన్నారు. తెలుగు రచయిత అప్పిరెడ్డి హరి హర్‌రెడ్డి యువ పురస్కారానికి ఎంపికవగా, మరో రచయిత దాసరి వెంకట్రామన్‌కు బాల సాహిత్య పురస్కారం లభించింది.
స్వామినాథన్‌కు పాకిస్థాన్ వర్సిటీ డాక్టరేట్వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌ను పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌కు ఎంపిక చేసింది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఆగస్టు 21న యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

మంజుల్ భార్గవకు ఫీల్డ్స్ మెడల్
భారత సంతతికి చెందిన మంజుల్ భార్గవకు గణిత శాస్త్రంలో నోబెల్ గా భావించే ఫీల్డ్స్ మెడల్ లభించింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో అంతర్జాతీయ గణిత కాంగ్రెస్ - 2014లో ఆగస్టు 13న భార్గవ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. మంజుల్ భార్గవ్ ప్రస్తుతం ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసున్నారు. ఇరాన్ గణితశాస్త్రవేత్త మరియం మీర్జాఖానీ ఫీల్డ్ మెడల్ అందుకున్న తొలి మహిళగా గుర్తింపుపొందింది.
సల్మాన్ రష్దీకి డెన్మార్క్ సాహిత్య పురస్కారం
భారత సంతతికి చెందిన బ్రిటన్ రచయిత సల్మాన్ రష్దీకి డెన్మార్క్ అత్యున్నత సాహిత్య పురస్కారం లభించింది. ద హాన్స్ క్రిస్టియన్ అండర్సన్ లిటరేచర్‌గా పిలిచే ఈ పురస్కారాన్ని 2013కు గాను రష్దీకి డెన్మార్క్ యువరాణి మేరీ ఆగస్టు 17న ఓడెన్స్ నగరంలో అందజేశారు. రెండేళ్లకోసారి ప్రదానం చేసే ఈ అవార్డు కింద 500,000 డేనిస్ క్రోన్‌లు బహుకరిస్తారు.
ఉత్తమ పార్లమెంటేరియన్లు
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆగస్టు 12న న్యూఢిల్లీలో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులను ప్రదానం చేశారు. వివరాలు..2010-అరుణ్ జైట్లీ (బీజేపీ); 2011-కరణ్‌సింగ్ (కాంగ్రెస్); 2012-శరద్ యాదవ్ (జేడీయూ);
మేజర్ ముకుంద్ వరద రాజన్‌కు అశోకచక్ర
జమ్మూకాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌లో హతమార్చి, అమరుడైన ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్‌కు శాంతి సమయంలో ఇచ్చే అత్యున్నత శౌర్య పతకం అశోక చక్రను కేంద్రం ప్రకటించింది. అలాగే విధి నిర్వహణలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన మరో 12 మందిని దేశ మూడో అత్యున్నత శౌర్య పతకమైన శౌర్య చక్రతో గౌరవించింది. ఈ ఏడాది సాయుధ బలగాల సిబ్బందికి మొత్తం 55 శౌర్య పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో ఒక అశోక చక్ర, 12 శౌర్య చక్ర, 39 సేనా పతకాలు, ఒక నవో సేనా పతకం, 2 వాయు సేనా పతకాలు ఉన్నాయి. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సంద ర్భంగా పతకాలను ప్రదానం చేశారు.
జ్ఞాన్ కొరియన్‌కు గొల్లపూడి శ్రీనివాస్ అవార్డు
గుజరాతీ సినిమా ‘ద గుడ్ రోడ్’ దర్శకుడు జ్ఞాన్ కొరియన్ కు గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు-2013ను ఆగస్టు 12న చెన్నైలో ప్రదానం చేశారు.
సునీల్‌కుమార్‌కు గ్లోబల్ సౌత్ అవార్డు
ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన రాజనీతిశాస్త్ర ఆచార్యుడు సునీల్‌కుమార్ ప్రతిష్టాత్మక గ్లోబల్‌సౌత్ అవార్డుకు ఎంపికయ్యారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల తీరుతెన్నులపై సునీల్ కుమార్ సమర్పించిన పత్రానికి ఇంటర్నేషనల్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ ఈ అవార్డును ప్రకటించింది.
భారతీయ యువ రచయితకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
భారతీయ యువ రచయిత నిఖిల్ చంద్వానీ (20)కి ప్రతిష్ఠాత్మక అమెరికన్ లిటరరీ ఫోరం సొసైటీ పురస్కారం లభించింది. ఆయన రాసిన కోడెడ్ కాన్‌స్పిరసీ అనే నవలకు ఈ పురస్కారం దక్కింది.
2014- రామన్ మెగసెసె అవార్డుల ప్రకటన 2014 సంవత్సరానికి రామన్ మెగసెసె అవార్డులను కమిటీ జూలై 30న ప్రకటించింది. ఆసియా నోబెల్‌గా పిలిచే ఈ పురస్కారాలను ఐదుగురు వ్యక్తులు, ఒక సంస్థను ఎంపిక చేశారు. ఈ అవార్డులను 1957లో విమాన ప్రమాదంలో మరణించిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రామన్ మెగసెసె సంస్మరణార్థం ఏర్పాటు చేశారు. సామాజిక మార్పునకు కృషిచేసిన వ్యక్తులు, సంస్థలకు ఈ బహుమతిని అందజేస్తారు.
అవార్డు విజేతలు
హూషులి (చైనా): కైజింగ్ అనే బిజినెస్ మ్యాగజైన్ స్థాపకురాలు, ఎడిటర్. వ్యాపారం, ప్రభుత్వ పాలనలో పారదర్శకత, బాధ్యతలను నిర్భయంగా ప్రోత్సహించడంతోపాటు చైనాలో మీడియా కర్తవ్యాలను స్వతంత్ర భావాలతో నిర్వహించినందుకు, ఆమె నాయకత్వ ప్రతిభను గుర్తిస్తూ ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
సౌర్ మర్లినా మనురంగ్ (ఇండోనేషియా): మానవ శాస్త్రవేత్త, సామాజిక కార్యకర్త. ఇండోనేషియా అడవుల్లో నివశించే ప్రజల జీవితాలనూ మెరుగుపరిచేందుకు కృషి చేశారు. వీరితోపాటు పురస్కారాలకు ఎంపికైనవారిలో ఒమర్ ఖాన్ మసౌడీ (అఫ్గానిస్థాన్ నేషనల్ మ్యూజియం డెరైక్టర్), రాండీ హలసాన్ (ఫిలిప్పీన్స్ టీచర్), పాకిస్థాన్‌కు చెందిన స్వచ్చంద సంస్థ ద సిటిజన్స్ ఫౌండేషన్ ఉన్నాయి.
ముజఫర్ అలీకి రాజీవ్‌గాంధీ సద్భావనా పురస్కారం బాలీవుడ్ చిత్ర దర్శకుడు ముజఫర్ అలీ 22వ రాజీవ్‌గాంధీ జాతీయ సద్భావన పురస్కారానికి ఎంపికయ్యారు. మత సామరస్యం, శాంతి, సౌహార్థాన్ని పెంపొందించటానికి చేసిన కృషికిగాను ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. అవార్డు కింద ప్రశంసాపత్రం, రూ. 5లక్షల నగదు ఇస్తారు. అలీ ఉమ్రావ్‌జాన్‌తోపాటు గమన్, ఖైజన్‌తోపాటు పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2005లో ఆయన పద్మశ్రీ అందుకున్నారు.

No comments:
Post a Comment