AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

అవార్డులు ఆగష్టు 2016

అవార్డులు ఆగష్టు 2016
2016 క్రీడా అవార్డులు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 2016కు ఆగస్టు 22న అవార్డులను ప్రకటించింది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు, రెజ్లర్ సాక్షి మాలిక్, షూటర్ జీతూరాయ్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌లకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర దక్కింది. పురస్కారం కింద రూ.7.5 లక్షల నగదు ఇస్తారు. ఒకే ఏడాది నలుగురికి ఖేల్త్న్ర ఇవ్వడం భారత క్రీడల చరిత్రలో ఇదే తొలిసారి.

తెలంగాణకు చెందిన అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్‌కు ప్రతిష్టాత్మక ద్రోణాచార్య అవార్డు దక్కింది. ఆంధ్రప్రదేశ్ మాజీ అథ్లెట్ సత్తి గీత ధ్యాన్‌చంద్ అవార్డ్‌కు ఎంపికయ్యింది. క్రికెటర్ అజింక్య రహానే, హాకీ క్రీడాకారులు వీఆర్ రఘునాథ్, రాణీ రాంపాల్ అర్జున అవార్డు అందుకోనున్నారు. ఈ పురస్కారాలను ఆగస్ట్ 29 ధ్యాన్‌చంద్ పుట్టిన రోజున రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందిస్తారు.

అవార్డుల జాబితా
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న (రూ.7.5 లక్షలు)
పీవీ సింధు (బ్యాడ్మింటన్)
సాక్షి మలిక్ (రెజ్లింగ్)
దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్)
జీతూ రాయ్ (షూటింగ్).

అర్జున అవార్డులు (రూ.5 లక్షలు)అజింక్య రహానే (క్రికెట్), రజత్ చౌహాన్ (ఆర్చరీ), లలితా బబర్ (అథ్లెటిక్స్), సౌరవ్ కొఠారి (బిలియర్డ్స్,స్నూకర్), శివ థాపా (బాక్సింగ్), సుబ్రతా పాల్ (ఫుట్‌బాల్), రాణి రాంపాల్ (హాకీ), వి.ఆర్ రఘునాథ్ (హాకీ), గురుప్రీత్ సింగ్ (షూటింగ్), అపూర్వి చండీలా (షూటింగ్), సౌమ్యజిత్ ఘోష్ (టేబుల్ టెన్నిస్), వినేశ్ (రెజ్లింగ్), అమిత్ కుమార్ (రెజ్లింగ్), సందీప్ సింగ్ మాన్ (పారా అథ్లెటిక్స్), వీరేందర్ సింగ్ (రెజ్లింగ్). 

ద్రోణాచార్య అవార్డు లు(రూ.5 లక్షలు)నాగపురి రమేశ్ (అథ్లెటిక్స్), సాగర్ మాల్ దయాళ్ (బాక్సింగ్), రాజ్‌కుమార్ శర్మ (క్రికెట్), విశ్వేశ్వర్ నంది (జిమ్నాస్టిక్స్), ఎస్. ప్రదీప్ కుమార్ (స్విమింగ్), మహావీర్ సింగ్ (రెజ్లింగ్).

ధ్యాన్ చంద్ అవార్డులు (రూ.5 లక్షలు)సత్తి గీత (అథ్లెటిక్స్), సిల్వనస్ డుంగ్ డుంగ్ (హాకీ), రాజేంద్ర ప్రసాద్ షెల్కే ( రోయింగ్).

తెలంగాణ ఆరోగ్యశ్రీకి ఫిక్కీ అవార్డుప్రతిష్టాత్మక ఫిక్కీ హెల్త్ కేర్ ఎక్స్‌లెన్స్-2016కు తెలంగాణ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఎంపికైంది. తెలంగాణ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ 2016 ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రూపొందించిన జీపీఎస్ మొబైల్ యాప్‌ను అభినందిస్తూ ఫిక్కీ ఈ అవార్డు ప్రకటించింది.

భారతి, కల్‌బుర్గి సిమెంట్ ప్లాంట్లకు ఎనర్జీ ఎఫిసియెంట్ అవార్డులుభారత్‌లో వికాట్ సిమెంట్ తయారీ కర్మాగారాలు - కల్‌బుర్గి ప్లాంట్ (కల్‌బుర్గి సిమెంట్), కడప ప్లాంట్ (భారతి సిమెంట్ కార్పొరేషన్)లకు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రతిష్టాత్మక ఎనర్జీ ఎఫిసియెంట్ అవార్డులు లభించాయి. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో జరిగిన ‘సీఐఐ 2016 ఎక్స్‌లెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్’ 17వ జాతీయ కార్యక్రమంలో వీటిని ప్రకటించారు. సిమెంట్ విభాగంలో 80 ప్లాంట్స్ పోటీ పడగా 32 ప్లాంట్లకు అవార్డులు దక్కాయి.

బ్రిక్స్ ఫిలిం ఫెస్టివల్‌లో బాహుబలిభారత్‌లో తొలిసారిగా నిర్వహించనున్న బ్రిక్స్ దేశాల ఫిలిం ఫెస్టివల్‌లో బాహుబలి పోటీపడనుంది. సెప్టెంబరు 2 నుంచి ఐదు రోజులపాటు జరిగే ఈ ఫెస్టివల్‌లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాల నుంచి 20 చిత్రాలను ఎంపిక చేశారు. ఒక్కోదేశం 4 చిత్రాలను నామినేట్ చేయాలి. భారత్ నుంచి బాహుబలి, బాజీరావ్ మస్తానీ, తిథి, వీరమ్‌లున్నాయి.

No comments:

Post a Comment