క్రీడలు నవంబరు 2014
కర్ణాటకకు విజయ్ హ జారే ట్రోఫీ
క్రికెట్‌లో విజయ్ హజారే ట్రోఫీని కర్ణాటక గెలుచుకుంది. అహ్మదాబాద్‌లో నవంబరు 25న జరిగిన ఫైనల్‌లో పంజాబ్‌ను ఓడించి కర్ణాటక విజేతగా నిలిచింది. దీంతో ఆ జట్టు వరుసగా రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి
దేశవాళి క్రికెట్‌లో ఆడుతూ గాయపడిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ (25) సిడ్నీ ఆసుపత్రిలో నవంబరు 27న మరణించారు. బౌలర్ సీన్‌అబాట్ వేసిన బంతి హ్యూస్ తలకు తగలడంతో ఈ ప్రమాదం సంభవించింది.
పీవీ సింధుకు మకావ్ ఓపెన్ టైటిల్
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు మకావ్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నమెంట్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. నవంబరు 30న మకావ్‌లో జరిగిన ఫైనల్‌లో కిమ్ హ్యోమిన్ (దక్షిణ కొరియా) ను డిఫెండింగ్ ఛాంపియన్ సింధు ఓడించింది. విజేతకు రూ. 5.60 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. సింధుకు ఇది మూడో గ్రాండ్ ప్రి టైటిల్.
ఐబీఎస్‌ఎఫ్ అధ్యక్షుడిగా మోహన్
అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్‌ఎఫ్) కొత్త అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కెప్టెన్ పి.వి.కె.మోహన్ ఎన్నికయ్యారు. దీంతో ఈ పదవి చేపట్టిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు. కాగా ఆసియా నుంచి మూడో వ్యక్తి. ఈ హోదాలో ఆయన రెండేళ్లు కొనసాగుతారు.
స్నూకర్ టైటిల్ విజేత బింగ్ టావ్
ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను 14 ఏళ్ల చైనాకు చెందిన యాన్ బింగ్‌టావ్ కైవసం చేసుకున్నాడు. 12 సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన పంకజ్ అద్వానీ సహా హేమాహేమీలను ఓడిస్తూ ఫైనల్‌కు చేరిన యాన్... తుదిపోరులో మహ్మద్ సజ్జాద్ (పాకిస్థాన్) ను ఓడించాడు. దీంతో అత్యంత పిన్న వయసులో స్నూకర్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఘనత అతడికి దక్కింది. మహిళల విభాగంలో వాండీ జాన్స్ (బెల్జియం) రష్యాకు చెందిన అనస్తాషియా నెచెయివాను ఓడించి టైటిల్ సాధించింది.
వెంగ్‌సర్కార్‌కు సి.కె.నాయుడు జీవతకాల సాఫల్య పురస్కారం
భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు 2014 అవార్డులను నవంబరు 18న అందించింది. కల్నల్ సి.కె.నాయుడు జీవిత కాల సాఫల్య పురస్కారానికి భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్, ఉత్తమ అంతర్జాతీయ భారత క్రికెటర్ (పాలీ ఉమ్రిగర్ ట్రోఫీ)గా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌లు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు.
వరల్డ్ అథ్లెట్స్ ఆఫ్ ద ఇయర్‌గా రెనౌద్ లావిల్లేనీ, వాలెర్ ఆడమ్స్
2014 వరల్డ్ అథ్లెట్స్ ఆఫ్ ద ఇయర్‌గా పురుషుల విభాగంలో పోల్‌వాల్ట్ ఆటగాడు రెనౌద్ లావిల్లేనీ (ఫ్రాన్స్), మహిళల విభాగంలో షాట్‌పుట్టర్ వాలెరీ ఆడమ్స్ (న్యూజిలాండ్) ఎంపికైనట్లు ఐఏఏఎఫ్ నవంబరు 21న మొరాకోలో ప్రకటించింది.
చెస్ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్
నార్వేకి చెందిన మాగ్నస్ కార్ల్‌సన్ చెస్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. సోచిలో నవంబరు 23న ముగిసిన పోటీలో భారత్‌కు చెందిన విశ్వనాథన్ ఆనంద్‌ను కార్ల్‌సన్ ఓడించి టైటిల్ నిలబెట్టుకున్నాడు.
ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్ లూయీస్ హామిల్టన్
బ్రిటన్‌కు చెందిన మెర్సిడెజ్ డ్రైవర్ లూయీస్ హామిల్టన్ అబుదాబి గ్రాండ్ ప్రి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. అబుదాబిలో నవంబరు 23న జరిగిన రేసులో సాధించిన విజయంతో 2014 ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. అతనికిది రెండో ప్రపంచ టైటిల్.
స్విట్జర్లాండ్‌కు డేవిస్‌కప్ టైటిల్
స్విట్జర్లాండ్‌కు రోజర్ ఫెదరర్ తొలి డేవిస్‌కప్ టైటిల్ అందించాడు. లిల్లె (ఫ్రాన్స్)లో నవంబరు 23న జరిగిన ఫైనల్‌లో డేవిడ్ గాస్క్వెట్ (ఫ్రాన్స్)ను ఫెదరర్ ఓడించి టైటిల్ సాధించాడు.
రెండో డబుల్ సెంచరీతో రోహిత్‌శర్మ రికార్డు
శ్రీలంకతో జరిగిన వన్డేలో భారత క్రికెటర్ రోహిత్‌శర్మ 264 పరుగులతో వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా అరుదైన రికార్డు సృష్టించాడు. నవంబరు 13న కోల్‌కత ఈడెన్ గార్డెన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే. దీంతో సెహ్వాగ్ పేరిట ఉన్న 219 పరుగుల రికార్డును రోహిత్ అధిగమించాడు. గతంలో అతడు 2013లో ఆస్ట్రేలియాపై 209 పరుగులు చేశాడు.
2015 ప్రపంచ కప్ క్రికెట్ ప్రచారకర్తలు
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహించే 2015 ప్రపంచకప్ క్రికెట్ ప్రచారకర్తలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నవంబరు 13న ప్రకటించింది. వీరిలో విరాట్‌కోహ్లి (భారత్), షేన్‌వాట్సన్, మిచెల్ జాన్సన్ (ఆస్ట్రేలియా), బ్రెండన్ మెక్‌కల్లమ్ (న్యూజిలాండ్), కుమార సంగక్కర (శ్రీలంక) ఉన్నారు.
మిచెల్ జాన్సన్‌కు ఐసీసీ టెస్ట్ క్రికెటర్ అవార్డు
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ 2013-14 సంవత్సరానికి ఐసీసీ అత్యుత్తమ టెస్టు క్రికెటరు అవార్డుకు ఎంపికయ్యాడు. రికీపాంటింగ్ తర్వాత రెండోసారి ఈ అవార్డుకు ఎంపికైన ఆటగాడు జాన్సనే.
చైనా ఓపెన్ సిరీస్ విజేతలు సైనా, శ్రీకాంత్
చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ సింగిల్స్ టైటిళ్లను సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ గెలుచుకున్నారు. శ్రీకాంత్‌కు ఇది తొలి సూపర్ సిరీస్ టైటిల్. సైనా ఈ టైటిల్ గెలవడం ఇది తొలిసారి.
సచిన్ ఆత్మకథ ఆవిష్కరణ
మాజీ క్రికెటర్, భారత రత్న సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వే పుస్తకాన్ని అక్టోబరు 5న ముంబయిలో ఆవిష్కరించారు. తొలికాపీని తన తల్లి రజనికి అందించారు. తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఎదురైన అనుభవాలు, వివాదాలు, తదితర అంశాలను ఈ పుస్తకంలో వెల్లడించారు.
జాతీయ స్క్వాష్ విజేతలు సంధు, జ్యోష్న
జాతీయ సీనియర్ స్క్వాష్ ఛాంపియన్ షిప్ టైటిల్‌ను హరీందర్ పాల్ సింగ్ సంధు కైవసం చేసుకున్నాడు. నవంబర్ 8న ముంబయిలో జరిగిన ఫైనల్‌లో సౌరభ్ ఘోషల్‌పై విజయం సాధించాడు. సంధుకిదే తొలి జాతీయ టైటిల్. మహిళల టైటిల్‌ను జ్యోష్న చినప్ప గెలుచుకుంది. ఫైనల్‌లో సచికా ఇంగాలేని ఆమె ఓడించింది.
భువనేశ్వర్‌కు పీపుల్స్ ఛాయిస్ అవార్డు
భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్‌కుమార్‌కు ప్రతిష్టాత్మక ఎల్.జి పీపుల్స్ చాయిస్ అవార్డు వరించింది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఇందుకు జరిగిన ఓటింగ్‌లో పాల్గొని విజేతను ఎన్నుకొన్నారు. ఈ అవార్డు 2010లో సచిన్, 2011, 2012లో సంగక్కర, 2013లో ఎం.ఎస్. ధోనికి లభించింది.
హాకీ సిరీస్ భారత్ కైవసం
ఆస్ట్రేలియాతో జరిగిన హాకీ సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. నవంబరు 9న పెర్త్‌లో జరిగిన నాలుగో టెస్ట్‌ను భారత్ గెలవడంతో 3-1 తేడాతో సిరీస్‌ను చేజిక్కించుకుంది. ఆస్ట్రేలియాపై భారత్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి.
ఐఎస్‌ఎస్‌ఎఫ్ చైర్మన్‌గా అభినవ్ బింద్రాభారత షూటర్ అభినవ్ బింద్రా అంతర్జాతీయ షూటింగ్ క్రీడల సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) చైర్మన్‌గా ఎంపికయ్యాడు. ఈ నిర్ణయాన్ని ఐఎస్‌ఎస్‌ఎఫ్ అక్టోబరు 30న ప్రకటించింది. ప్రస్తుతం బింద్రా ఈ కమిటీలో సభ్యునిగా ఉన్నాడు. కాగా ఈ హోదాలో నియమితులైన తొలి భారతీయుడు ఆయనే.
రూ.250 కోట్లు చెల్లించాలని విండీస్‌కు బీసీసీఐ నోటీసువెస్టిండీస్ క్రికెట్ ఆటగాళ్లు సిరీస్‌ను రద్దుచేసుకొని అర్థంతరంగా తిరిగి వెళ్లడంతో నష్టపరిహారంగా రూ. 250 కోట్లు చెల్లించాలని వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ నోటీసు ఇచ్చింది. పారితోషికం విషయంపై విండీస్ ఆటగాళ్లు,బోర్డుకు మధ్య వివాదం నెలకొనడంతో భారత్‌లో జరగనున్న మ్యాచ్‌లు ఆగిపోయాయి. దీంతో బీసీసీఐకి పలు రూపాల్లో భారీ నష్టం వాటిల్లింది.
పంకజ్ అద్వానీకి ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్ టైటిల్భారత బిలియర్డ్స్ క్రీడాకారుడు పంకజ్ అద్వానీ టైమ్ ఫార్మాట్‌లో ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఇంగ్లండ్‌లోని లీడ్స్‌లో అక్టోబరు 29న జరిగిన ఫైనల్‌లో రాబర్డ్ హాల్ (ఇంగ్లండ్) ను ఓడించాడు. మూడోసారి గ్రాండ్ డబుల్ సాధించిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. కాగా కెరీర్‌లో 12వ ప్రపంచ టైటిల్. మహిళల టైటిల్ విజేత ఎమ్మా బోని (ఇంగ్లండ్). ఈమె రెవన్న ఉమాదేవి (భారత్)పై విజయం సాధించింది.
బ్రాడ్‌మన్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సచిన్, స్టీవ్‌వాకు చోటుమాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ (భారత్), స్టీవ్‌వా (ఆస్ట్రేలియా)లకు బ్రాడ్‌మన్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు లభించింది. అక్టోబరు 29న సిడ్నీ మైదా నంలో నిర్వహించిన కార్యక్రమంలో సచిన్, స్టీవ్‌వా పేర్లను గార్డ్ ఆఫ్ ఆనర్స్‌లో చేర్చినట్లు బ్రాడ్‌మన్ ఫౌండేషన్ ప్రకటించింది.
సెంట్రల్ జోన్‌కు దులీప్ ట్రోఫీదులీప్ ట్రోఫీని సెంట్రల్ జోన్ క్రికెట్ జట్టు గెలుచుకుంది. నవంబరు 2న న్యూఢిల్లీలో జరిగిన పైనల్‌లో సౌత్ జోన్‌ను సెంట్రల్‌జోన్ ఓడించి పదేళ్ల తర్వాత తిరిగి దులీప్‌ట్రోఫీని దక్కించుకుంది. ఈ ట్రోఫీని సెంట్రల్‌జోన్ గెలుచుకోవడం ఆరోసారి.

No comments:
Post a Comment