AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు అక్టోబరు 2012

వార్తల్లో వ్యక్తులు అక్టోబరు 2012
ఫోర్బ్స్ అత్యంత సంప‌న్న భార‌తీయుల జాబితాలో జోయ్ అలుక్కాస్‌
ఫోర్బ్స్ ప‌త్రిక విడుద‌ల చేసిన అత్యంత సంప‌న్న భార‌తీయుల జాబితాలో కేర‌ళ‌కు చెందిన‌ జోయ్ అలుక్కాస్‌కు స్థానం ద‌క్కింది. త్రిశూర్ కి చెందిన జోయ్ అలుక్కాస్, జోయ్ అలుక్కాస్ గ్రూప్ సంస్థల్ని నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ బంగారు ఆభ‌ర‌ణాలు, మ‌నీ ఎక్సేంజ్‌, ల‌గ్జరీ ఎయిర్ చార్టర్ ఫ్యాష‌న్ అండ్ సిల్క్స వ్యాపారాలు నిర్వహిస్తోంది. 

సంగీత స్వర చ‌క్రవ‌ర్తి పాల‌గుమ్మి విశ్వనాథం క‌న్నుమూత‌ల‌లిత సంగీత స్వర చ‌క్రవ‌ర్తి పాల‌గుమ్మి ప‌ద్మనాభం (93) అక్టోబ‌ర్ 26న హైద‌రాబాద్‌లో క‌న్నుమూశారు. ల‌లిత సంగీతంలో ప్రసిద్ధ విద్వాంసులుగా పాల‌గుమ్మి ప్రసిద్ధులు. ఈయ‌న 1956 నుంచి 1979 వ‌ర‌కు ఆలిండియా రేడియోలో లలిత సంగీత కార్యక్రమాల‌ను ప‌ర్యవేక్షించారు. సుమారు 15వేల పాట‌ల‌కు ఈయ‌న సంగీతాన్ని అందించారు. 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వై.వి.రెడ్డి
కేంద్ర కేబినెట్ 14 వ ఆర్థిక సంఘం ఏర్పాటుకు అక్టోబర్ 18న ఆమోదం తెలిపింది. రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ వై.వి.రెడ్డి ఈ కమిషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ రాజ్యాంగ సంస్థను ప్రతి ఐదేళ్ల కొకసారి ఏర్పాటు చేస్తారు. 2015 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రాలకు, ఇతర స్థానిక సంస్థలకు ప్రభుత్వం అందించే గ్రాంట్లకు సంబంధించి మార్గదర్శకాలను ఇది సూచిస్తుంది. ప్రస్తుత 13వ ఆర్థిక సంఘానికి విజయ్‌కేల్కర్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

బాలీవుడ్ దర్శకుడు యశ్‌చోప్రా మృతిప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత యశ్‌చోప్రా(80) ఆనారోగ్యం తో ముంబైలో అక్టోబర్ 20న మరణించారు. గత ఆరు దశాబ్దాలుగా వక్త్, దీవార్, త్రిశూల్, సిల్‌సిలా, చాందినీ, దిల్‌తో పాగల్‌హై, డర్, వీర్‌జారా వంటి అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన చివరి చిత్రం జబ్ తక్ హై జాన్ (2012). ఆయనకు ఫిల్మ్‌ఫేర్, పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతోపాటు మరెన్నో పురస్కారాలు లభించాయి.

ఏయూసీ చైర్‌పర్సన్‌గా దామిని జుమాఆఫ్రికన్ యూనియన్ కమిషన్ (ఏయూసీ) చైర్‌పర్సన్‌గా నొసజానా దామిని జుమా అడీస్ అబాబాలో అక్టోబర్ 15న బాధ్యతలు స్వీకరించారు. జుమా ఈ పదవి చేపట్టిన తొలి మహిళ. ఈమె గతంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జోకోబ్ జుమా మంత్రివర్గంలో హోం మంత్రిగా పని చేశారు. ఈ సందర్భంగా మాలీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, ఐక్యరాజ్యసమితి, పశ్చిమాఫ్రికా దేశాల ఆర్థిక సమాజంతో మరింత సమన్వయంతో పని చేస్తానని జుమా తెలిపారు. 

యూఎన్‌ఈపీ దూతగా పవన్ సుఖదేవ్భారత బ్యాంకర్, పర్యావరణ ఆర్థికవేత్త పవన్ సుఖదేవ్ ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్ ఈపీ) నూతన రాయబారిగా (అంబాసిడర్)గా ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో ముగిసిన జీవ వైవిధ్య సదస్సు సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. యేల్ యూనివర్సిటీ విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్న సుఖదేవ్ కన్సెల్టింగ్ సంస్థ జీఐఎస్‌టీ అడ్వైజరీ ప్రైవేట్ లిమిడెట్ వ్యవస్థాపకుడు. ప్రకృతి, మానవ సంపదపై ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థల ప్రభావంపై అవగాహన కల్పించేందుకు, ఉత్తమ నిర్వహణకు ఆ సంస్థ తోడ్పడుతుంది. 

లోకాయుక్తగా జస్టిస్ సుభాషణ్ రెడ్డి 
ఆంధ్రప్రదేశ్ నూతన లోకాయుక్తగా జస్టిస్ బి. సుభాషణ్ రెడ్డి అక్టోబర్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. ప్రస్తుత లోకాయుక్త జస్టిస్ ఎస్. ఆనందరెడ్డి అక్టోబర్ 10న పదవీ విరమణ చేయడంతో సుభాషణ్ రెడ్డి నియమితులయ్యారు. గతంలో సుభాషణ్ రెడ్డి తమిళనాడు, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా (2005-10) పనిచేశారు. 
బ్రిటన్ చరిత్ర కారుడు ఎరిక్ హాబ్స్ బామ్ మృతి 
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మార్క్సిస్ట్ చరిత్రకారుడు ఎరిక్‌హాబ్స్(95) లండన్లో అక్టోబర్ 1న మరణించారు. ఆయన రాసిన 300లకు పైగా పుస్తకాల్లో ఏజ్ ఆఫ్ రెవెల్యూషన్, ఏజ్ ఆఫ్ క్యాపిటల్, ఏజ్ ఆఫ్ ఎంపైర్ వంటి రచనలు బాగా ప్రాచుర్యం పొందాయి.
పీటీఐ చైర్మన్‌గా లక్ష్మీపతి
ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) బోర్డు చైర్మన్‌గా తమిళ దినపత్రిక ‘దినమలార్’ ప్రచురణకర్త ఆర్. లక్ష్మీపతి ఎన్నికయ్యారు. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 24న జరిగిన వార్షిక సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. 

గుల్జార్‌కు ఇందిరా పురస్కారంసుప్రసిద్ధ కవి, సినీ గేయరచయిత, దర్శకుడు గుల్జార్.. 
ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం-2011కి ఎంపికయ్యారు. దేశంలో సమైక్యతా స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు గుల్జార్ చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆయణ్ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు అవార్డు సలహా కమిటీ సభ్య కార్యదర్శి మోతీలాల్ వోరా ప్రకటించారు. అక్టోబర్ 31న ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా గుల్జార్‌కు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. అవార్డు కింద ప్రశంసా పత్రాన్ని, రూ. 5 లక్షల నగదు బహూకరిస్తారు. ఇంతకు ముందు ఈ పురస్కారాన్ని అందుకున్న ప్రముఖులలో దర్శకుడు శ్యామ్ బెనగళ్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, మాజీ రాష్ట్రపతులు ఏపీజే అబ్దుల్ కలామ్, శంకర్ దయాళ్ శర్మ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, సంగీత విద్వాంసురాలు ఎంఎస్. సుబ్బులక్ష్మి తదితరులు ఉన్నారు.

బ్రజేశ్ మిశ్రా మృతిదేశ తొలి జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) బ్రజేశ్ మిశ్రా (83) సెప్టెంబర్ 28న న్యూఢిల్లీలో మరణించారు. విదేశాంగ శాఖలో కార్యదర్శిగా, ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా ఆయన పనిచేశారు. 1998 నుంచి 2004 వరకు భారత తొలి జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరించారు.

No comments:

Post a Comment