AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు సెప్టెంబరు 2012

వార్తల్లో వ్యక్తులు సెప్టెంబరు 2012
కొండా లక్ష్మణ్ బాపూజీ మృతి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ సారధి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ(97) హైదరాబాద్‌లో సెప్టెంబర్ 21న మరణించారు. 1915 సెప్టెంబర్ 27న ఆదిలాబాద్‌లో జన్మించిన బాపూజీ పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1938లో హైదరాబాద్ సంస్థాన్ పౌర విమోచనోద్యమంలో పాల్గొని తొలిసారి అరెస్టయ్యారు. 

1914-42 ఖాదీ ఉద్యమం, 1942 క్విట్ ఇండియా ఉద్యమం, 1948లో నిజాం పాలనపై సాగిన సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. 1952లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్‌గా, రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 1969 తెలంగాణా ఉద్యమంలో పాల్గొనేందుకే మంత్రి పదవికి రాజీనామా చేశారు. 

‘ది హిందూ’ మాజీ ఎడిటర్ కస్తూరి మృతి 
ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ది హిందూ’ మాజీ ఎడిటర్, మేనేజింగ్ డెరైక్టర్ జి. కస్తూరి (87) సెప్టెంబర్ 21న చెన్నైలో మరణించారు. ఆయన 1965 నుంచి 1991 వరకు ‘ది హిందూ’ ఎడిటర్‌గా పనిచేశారు. 1990లో పీటీఐ బోర్డు డెరైక్టర్‌గా, భారత వార్తా పత్రికల సంఘం(ఐఎన్‌ఎస్) చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. 

మళయాల నటుడు తిలకన్ మృతిప్రముఖ మళయాళ నటుడు తిలకన్ (77) సెప్టెంబర్ 24న మరణించారు. మళయాళం, తమిళ, తెలుగు భాషల్లో 200 పైగా చిత్రాల్లో తిలకన్ నటించారు. 2009 లో పద్మశ్రీ పురస్కారం ఆయనకు దక్కింది. 


సూకీకి అమెరికా కాంగ్రెస్ అవార్డుమయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత, పార్లమెంటు సభ్యురాలు అంగ్‌సాన్‌సూకీ అమెరికా కాంగ్రెస్ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. 2008లో ప్రకటించిన ‘కాంగ్రెసనల్ గోల్డ్‌మెడల్’ను సూకీకి సెప్టెంబర్ 20న ప్రదానం చేశారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు గతంలో జార్జి వాషింగ్టన్ , టిబెట్ బౌద్ధ మత గురువు దలైలామా, పోప్ జాన్‌పాల్-2కు లభించింది. 

ఫోర్బ్స్ జాబితాలో బిల్‌గేట్స్‌కు మొదటి స్థానం అమెరికాలోని అత్యంత ధనవంతుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మొదటి స్థానంలో నిలిచారు. అమెరికాలోని 400 మంది బిలియనీర్ల జాబితాను ఫోర్బ్స్ పత్రిక సెప్టెంబర్ 20న ప్రకటించింది. గేట్స్ వరుసగా 19వ సారి మొదటి స్థానంలో నిలిచారు. 2012లో ఆయన సంపద 66 బిలియన్ డాలర్లు. బెర్క్‌షైర్ హాత్‌వే చైర్మన్ వారెన్ బఫెట్ రెండోస్థానం (46 బిలియన్ డాలర్లు), ఒరాకిల్ కార్ఫో సీఈవో లారీ ఎలిసన్ మూడోస్థానం(41 బిలియన్ డాలర్లు)లో ఉన్నారు. ఈ జాబితాలో భారత సంతతికి చెందిన ఐదుగురు.. భరత్ దేశాయ్ (సింటెల్), రోమేష్ వాద్వానీ(సింఫనీ), కవితార్క్ రామ్ శ్రీరామ్ (గూగుల్ బోర్డ్ సభ్యుడు), మనోజ్ భార్గవ (ఎనర్జీ డ్రింక్), వినోద్ ఖోస్లా(సిలికాన్ వ్యాలీ) ఉన్నారు. 

యూఎన్ ఎయిడ్స్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఐశ్వర్యరాయ్ బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఐక్యరాజ్య సమితి సౌహార్థ రాయబారి (గుడ్‌విల్ అంబాసిడర్)గా సెప్టెంబర్ 24న నియమితులయ్యారు. తల్లి నుంచి శిశువులకు హెచ్‌ఐవి సోకకుండా అవగాహన పెంచే కార్యక్రమాల్లో ఆమె పాల్పంచుకుంటారు. 


గురజాడ జన్మదినోత్సవాలు మహాకవి గురజాడ అప్పారావు 150వ జన్మదినోత్సవాలు సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఐదుగురు ప్రముఖులు.. కాశీపట్నం రామారావు (శ్రీకాకుళం), అవత్సా సోమసుందర్ (పిఠాపురం), యు.ఎ. నర్సింహమూర్తి (విజయనగరం), రవ్వా శ్రీహరి(తిరుపతి), సి.ఎస్. రావు(హైదరాబాద్)లకు ‘గురజాడ ప్రతిభా పురస్కారాలు’ ప్రదానం చేశారు. ఈ పురస్కారం కింద ఒక్కొక్కరికి లక్ష రూపాయల నగదు బహూకరించారు. 

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అల్తమాస్ కబీర్ సుప్రీంకోర్టు 39వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అల్తమాస్ కబీర్ నియమితులయ్యారు. ఈయన సెప్టెంబర్ 29న బాధ్యతలు స్వీకరిస్తారు. 2013 జూలై 18వరకు ప్రధాన న్యాయమూర్తిగా పదవిలో కొనసాగుతారు. 

మాజీ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా మృతి సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా సెప్టెంబర్ 13న భువనేశ్వర్‌లో మరణించారు. 1990 సెప్టెంబర్ 25 నుంచి 1991 నవంబర్ 24 వరకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. 1998 నుంచి 2004 వరకు రాజ్యసభ సభ్యుడిగా, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. 

ఆర్‌ఎస్‌ఎస్ మాజీ అధినేత సుదర్శన్ మృతిరాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) మాజీ అధినేత కె.ఎస్. సుదర్శన్(81) రాయపూర్‌లో సెప్టెంబర్ 15న మరణించారు. ఈయన ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రచారక్‌గా ఆరు దశాబ్దాలపాటు పనిచేశారు. 2000లో ఆర్‌ఎస్‌ఎస్ సంఘ్‌చాల్ (అధినేత)గా బాధ్యతలు స్వీకరించి 2009 వరకు కొనసాగారు. 

నటుడు సుత్తి వేలు మృతిప్రముఖ హాస్యనటుడు సుత్తివేలు (65) సెప్టెంబర్ 16న చెన్నైలో మరణించారు. 200 వరకు చిత్రాల్లో నటించారు. వందేమాతరం ప్రతిఘటన వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరుతెచ్చాయి. 
 
 
ప్రపంచ బ్యాంకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బసుభారత్‌కు చెందిన ఆర్థిక వేత్త కౌశిక్ బసు ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకానమిస్ట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా సెప్టెంబర్ 5న నియమితులయ్యారు. జస్టిస్ యుపు లిన్ స్థానంలో నియమితులైన బసు అక్టోబర్ 1 నుంచి బాధ్యతలు చేపడతారు. బసు ఇటీవల భారత ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుగా పని చేశారు. ప్రస్తుతం అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో అర్థశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
 
స్పేస్ వాక్‌లో సునీత రికార్డు భారత సంతతికి చెందిన మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ అత్యధిక సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. సెప్టెంబర్ 5న ఆమె ఆరో స్పేస్ వాక్‌తో 44 గంటల 2 నిమిషాలు పూర్తి చేశారు. ఈ వాక్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మరమ్మతులు చేశారు. గతంలో పెగ్గీ విట్సన్ పేరుతో 39గంటల 46 నిమిషాలు ఉన్న స్పేస్ వాక్ రికార్డును సునీతా విలియమ్స్ అధిగమించారు.
అణు శాస్త్రవేత్త రోహిణీ ప్రసాద్ మృతిరచయిత, అణు శాస్త్రవేత్త కొడవటిగంటి రోహిణి ప్రసాద్ (63) సెప్టెంబర్ 8న ముంబైలో మరణించారు. ఈయన ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్)లో అణు శాస్త్రవేత్తగా ఎలక్ట్రానిక్స్ విభాగంలో పని చేశారు. విశ్వాంతరాళం, జీవ విజ్ఞానం- సమాజం, మానవ పరిణామం, అణువులు దేవుడు చేసిన మనుషులు వంటి అత్యంత ఆదరణ పొందిన సైన్స్ పుస్తకాలు రాసారు. ఈయన ప్రముఖ రచయిత కొడవగంటి కుటుంబరావు కుమారుడు.
 
ప్రాదేశిక సైన్యంలో సచిన్ పైలట్కేంద్ర కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి సచిన్ పైలట్ (35) ప్రాదేశిక సైన్యం (టెరిటోరియల్ ఆర్మీ)లో సెప్టెంబర్ 6న అధికారిగా చేరారు. టెరిటోరియల్ ఆర్మీలో రెగ్యులర్ అధికారిగా చేరిన తొలి కేంద్ర మంత్రిగా సచిన్ రికార్డు సృష్టించారు. సిక్ రెజిమెంట్ కు చెందిన 124 టి.ఎ బెటాలియన్‌లో అధికారిగా చేరారు. ఇందుకోసం ఆయన ప్రిలిమినరీ ఇంటర్వ్యూ బోర్డు, సర్వీసెస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. మెడికల్ పరీక్షలను కూడా పూర్తి చేసుకున్నారు. టెరిటోరియల్ ఆర్మీలో ఆయన శిక్షణ పూర్తి చేయాల్సి ఉంది. రాజస్థాన్‌లోని దేసా నియోజకవర్గం నుంచి సచిన్ పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. క్రికెటర్లు క పిల్‌దేవ్, ఎం.ఎస్. ధోని, నటుడు మోహన్‌లాల్ ప్రాదేశిక సైన్యంలో గౌరవ లెఫ్ట్‌నెంట్ కల్నల్స్‌గా చేరారు.
 
నౌకా దళాధిపతిగా డి.కె. జోషి
నౌకా దళాధిపతిగా అడ్మిరల్ దేవేందర్ కుమార్ జోషి ఆగస్టు 31న బాధ్యతలు స్వీకరించారు. యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ స్పెషలిస్టుగా జోషి గుర్తింపు పొందారు. పదవీ విరమణ చేసిన నిర్మల్ వర్మ స్థానంలో జోషి నియమితులయ్యారు.
చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్‌గా బ్రౌనే
చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ(సీఓఎన్‌సీ) చైర్మన్‌గా వైమానిక దళాధిపతి మార్షల్ ఎన్.ఎ.కె. బ్రౌనే సెప్టెంబర్ 1న బాధ్యతలు స్వీకరించారు. మూడు దళాల అధిపతుల్లో అత్యంత సీనియర్ అయిన బ్రౌనే అడ్మిరల్ నిర్మల్ వర్మ స్థానంలో నియమితులయ్యారు. మూడు దళాలకు సంబంధించిన విధాన పరమైన నిర్ణయాల్లో సీఓఎన్‌సీ సమన్వయాన్ని చేకూరుస్తుంది.
టైమ్ మ్యాగజీన్‌పై అమీర్ ఖాన్
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న ‘సత్యమేవ జయతే’ టీవీ కార్యక్రమంతో కొత్త ఒరవడి సృష్టించిన బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ ‘టైమ్’ మ్యాగజీన్ ముఖచిత్ర కథనానికి ఎంపికయ్యారు. ఆసియా నుంచి వెలువడే టైమ్ మేగజీన్ ఎడిషన్‌లో ఆమిర్ కనిపించనున్నారు.
సింగపూర్ సీజేగా భారత సంతతి జడ్జి
సింగపూర్ కొత్త ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా భారత సంతతికి చెందిన జడ్జి సుందరేశ్ మీనన్ నియమితులయ్యారు. భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి సింగపూర్‌లో ఈ అత్యున్నత పదవిని చేపట్టడం తొలిసారి. ప్రస్తుతం సింగపూర్ అప్పీల్ జడ్జిగా ఉన్న మీనన్ నవంబర్ 6న కొత్త బాధ్యతలు చేపడతారు.

No comments:

Post a Comment