క్రీడలు మార్చి 2016
హాకీ ఇండియా ఉత్తమ క్రీడాకారులుగా శ్రీజేష్, దీపిక
హాకీ ఇండియా 2015 వార్షిక అవార్డులను మార్చి 26న బెంగళూరులో ప్రదానం చేశారు. ఉత్తమ క్రీడాకారులకు రూ.25 లక్షల నగదు బహూకరించారు.
ప్రముఖ ఫుట్‌బాల్ మాజీ ప్లేయర్ యోహాన్ క్రాఫ్ మృతినెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ మాజీ క్రీడాకారుడు యోహాన్ క్రాఫ్ (68) క్యాన్సర్‌తో మార్చి 24న మరణించారు. క్రాఫ్.. 1974లో నెదర్లాండ్ ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఆయన ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా గోల్డెన్ బాల్ అందుకోవడంతో పాటు మూడుసార్లు యూరోపియన్ కప్ గెలిచిన నెదర్లాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నారు.
టి20 ర్యాంకింగ్స్‌లో కోహ్లి నంబర్‌వన్భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఐసీసీ అంతర్జాతీయ టి20 ఆటగాళ్ల ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో నంబర్‌వన్‌గా నిలిచాడు. ఐసీసీ టి20 ప్రపంచకప్ టోర్నీకి ముందు టాప్‌లో ఉన్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఆరోన్ ఫించ్‌ను వెనక్కినెట్టిన కోహ్లి (871 పాయింట్లు) అగ్రస్థానాన్ని అందుకున్నాడు. బౌలింగ్ విభాగంలో వెస్టిండీస్‌కు చెందిన శామ్యూల్ బద్రి టాప్‌కు చేరుకున్నాడు. భారత స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఒకటి నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. జడేజా ఏడు, బుమ్రా 13వ స్థానాల్లో ఉన్నారు. టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు తమ అగ్రస్థానాన్ని కాపాడుకుంది. ఇటీవలే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆసీస్ బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్ టి20లో నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు.
రోస్‌బర్గ్‌కు ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రి
ఫార్ములావన్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను మెర్సిడెస్ డ్రైవర్ నికో రోస్‌బర్గ్ గెలుచుకున్నాడు. మెల్‌బోర్‌నలో మార్చి 20న జరిగిన పోటీలో రోస్‌బర్గ్ తొలిస్థానంలో నిలవగా, లూయిస్ హామిల్టన్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
ఓఎన్‌జీసీ, కేరళకు బాస్కెట్ బాల్ ఫెడరేషన్ కప్ టైటిల్స్
ఫెడరేషన్ కప్ బాస్కెట్ బాల్ పురుషుల టైటిల్‌ను ఓఎన్‌జీసీ (డెహ్రాడూన్), మహిళల టైటిల్‌ను కేరళ గెలుచుకున్నాయి. పనాజీలో మార్చి 14న జరిగిన ఫైనల్స్‌లో ఐఓబీపై ఓఎన్‌జీసీ గెలుపొందగా, ఛత్తీస్‌గఢ్‌ను కేరళ ఓడించింది.
ఆసియా చాంపియన్‌షిప్‌లో గుర్మీత్‌కు స్వర్ణం
భారత్‌కు చెందిన వాకర్ గుర్మీత్ సింగ్ ఆసియా 20 కిలోమీటర్ల రేస్ వాక్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. జపాన్‌లోని నోమిలో మార్చి 20న జరిగిన రేస్‌లో గుర్మీత్‌కు స్వర్ణం దక్కగా, ఇసాము పుజిసావా (జపాన్) రజతం, జియోర్జి షెకో (కజకిస్థాన్) కాంస్య పతకాలను సాధించారు. ఈ చాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకం గెలిచిన తొలి భారత క్రీడాకారుడిగా గుర్మీత్‌సింగ్ గుర్తింపు పొందాడు.
స్విస్ ఓపెన్ విజేత ప్రణయ్
భారత బ్యాడ్మింటన్ యువతార హెచ్.ఎస్.ప్రణయ్ తన ఖాతాలో రెండో గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. మార్చి 20న ముగిసిన స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీలో ఈ కేరళ ప్లేయర్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో ప్రపంచ 27వ ర్యాంకర్ ప్రణయ్ 19వ ర్యాంకర్ మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ)పై గెలిచాడు. ప్రణయ్ తొలిసారి 2014లో ఇండోనేసియా గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్‌ను సాధించాడు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన స్విస్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించిన రెండో భారతీయ క్రీడాకారుడిగా ప్రణయ్ గుర్తింపు పొందాడు. 2015లో హైదరాబాద్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ విజేతగా నిలిచాడు. మహిళల విభాగంలో సైనా నెహ్వాల్ రెండుసార్లు ఈ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
ఇండియన్ వెల్స్ ఓపెన్ విజేత జొకోవిచ్
ఇండియన్ వెల్స్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ గెలుచుకున్నాడు. దీంతో వరుసగా మూడో ఏడాది టైటిల్‌ను సొంతం చేసుకొని హ్యాట్రిక్ సాధించాడు. ఫైనల్లో జొకోవిచ్ 6-2, 6-0తో మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)ను చిత్తుగా ఓడించి విజేతగా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ టైటిల్‌ను ఐదోసారి నెగ్గిన జొకోవిచ్ ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా కెరీర్‌లో 27వ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను నెగ్గి అత్యధిక మాస్టర్స్ టైటిల్స్‌ను సాధించిన క్రీడాకారుడిగా రాఫెల్ నాదల్ (స్పెయిన్) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.
ఆసియా బిలియర్డ్స్ టైటిల్ నెగ్గిన ధ్రువ్ సిత్వాలా
భారత్‌కు చెందిన ధ్రువ్ సిత్వాలా ఆసియా బిలియర్డ్స్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. కొలంబోలో మార్చి 8న జరిగిన ఫైనల్లో భాస్కర్ బాలచంద్రపై (భారత్) సిత్వాలా గెలుపొందాడు.
సర్వీసెస్‌కు సంతోష్ ట్రోఫీ
జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను (సంతోష్ ట్రోఫీ) సర్వీసెస్ జట్టు గెలుచుకొంది. నాగ్‌పూర్‌లో మార్చి 13న జరిగిన ఫైనల్లో మహారాష్ట్రను సర్వీసెస్ ఓడించింది. సర్వీసెస్ జట్టు గత ఐదేళ్లలో నాలుగోసారి ఈ టైటిల్‌ను దక్కించుకొంది.
లిన్‌డాన్, ఒకుహారాలకు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్స్
బ్యాడ్మింటన్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను లిన్ డాన్ (చైనా), మహిళల సింగిల్స్ టైటిల్‌ను నొజోమి ఒకుహారా(జపాన్) గెలుచుకున్నారు. బర్మింగ్‌హామ్‌లో మార్చి 13న జరిగిన ఫైనల్లో తియాన్ హువీపై లిన్ డాన్, వాంగ్ షిక్సియాన్ పై ఒకుహారా గెలుపొందారు. లిన్ డాన్ ఇప్పటి వరకు ఈ టైటిల్‌ను ఆరుసార్లు గెలుచుకున్నాడు.
టి20 ప్రపంచకప్‌లో గేల్ వేగవంతమైన సెంచరీ
టి20 ప్రపంచకప్‌లో తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన రికార్డును వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ నెలకొల్పాడు. 2016 టి20 ప్రపంచకప్ ‘సూపర్ 10’లో భాగంగా మార్చి 16న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ 47 బంతుల్లో సెంచరీ సాధించాడు. టి20 అంతర్జాతీయ పోటీల్లో ఇది సంయుక్తంగా మూడో వేగవంతమైన సెంచరీ. రిచర్డ్ లెవీ (దక్షిణాఫ్రికా-45 బంతుల్లో), డు ప్లెసిస్ (దక్షిణాఫ్రికా-46 బంతుల్లో), ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా-47 బంతుల్లో) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. అలాగే టి20 ప్రపంచకప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (10) కొట్టిన బ్యాట్స్‌మన్‌గా గతంలో తన పేరిట ఉన్న రికార్డును ఈ మ్యాచ్‌లో గేల్ (11 సిక్సర్లు) సవరించాడు. టి20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా గేల్ (98 సిక్సర్లు) నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్-91 సిక్సర్లు) పేరిట ఉండేది.
ప్రొ కబడ్డీ లీగ్ విజేతగా పట్నా పైరేట్స్ప్రొ కబడ్డీ లీగ్ నూతన చాంపియన్‌గా పట్నా పైరేట్స్ అవతరించింది. మార్చి 5న ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో పట్నా జట్టు 31-28 పాయింట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ యు ముంబాను ఓడించింది. సూపర్ రైడింగ్‌తో పాటు అద్భుత డిఫెన్స్‌తో దుమ్మురేపిన పట్నా పైరేట్స్‌కు ఇది తొలి టైటిల్. విజేతకు రూ. కోటి ప్రైజ్ మనీగా లభించగా.. రన్నరప్‌కు రూ.50 లక్షలు ప్రైజ్ మనీ దక్కింది.
ఆసియా కప్ భారత్ సొంతం ఆసియా కప్‌ను భారత్ గెలుచుకొంది. మార్చి 6న మిర్పూర్‌లో జరిగిన ఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. వర్షం వల్ల అంతరాయం కలగడంతో మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 13.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (60 పరుగులు), విరాట్ కోహ్లి (41 పరుగులు) విజయంలో కీలకపాత్ర పోషించారు. శిఖర్ ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
న్యూజిలాండ్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మార్టిన్ క్రో మృతి న్యూజిలాండ్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మార్టిన్ క్రో (53) క్యాన్సర్ వ్యాధితో మార్చి 3న ఆక్లాండ్‌లో మరణించారు. 13 సంవత్సరాల పాటు న్యూజిలాండ్ టీంలో కొనసాగిన మార్టిన్ క్రో 1995లో రిటైర్ అయ్యారు. ఆయన మొత్తం 77 టెస్టు మ్యాచులు, 143 వన్డే మ్యాచులు ఆడారు. రెండు ఫార్మాట్‌ల్లో 10వేలకు పైగా పరుగులు చేశారు.
టి20ల్లో భారత్ నం.1సొంతగడ్డపై తొలిసారి నిర్వహిస్తున్న ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో భారత్ నం.1 హోదాలో బరిలోకి దిగనుంది. తాజాగా ప్రకటించిన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ (127 పాయింట్లు) తొలిస్థానంలో నిలిచింది. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ నుంచి విరాట్ కోహ్లి(2వ స్థానం) అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ(11వ), సురేశ్ రైనా(16వ), యువరాజ్ సింగ్(22వ), కెప్టెన్ ఎంఎస్ ధోని(43వ), శిఖర్ ధావన్(48వ) తర్వాతి ర్యాంకుల్లో ఉన్నారు. బౌలర్లలో వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ మొదటి ర్యాంకులో ఉన్నాడు. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 2వ ర్యాంకు సాధించాడు. భారత్ నుంచి రవీంద్ర జడేజా (11వ), జస్పీత్ బుమ్రా(27వ) ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఆల్ రౌండర్లలో యువరాజ్ ఆరోస్థానంలో ఉన్నాడు.
డోపింగ్ పరీక్షలో దొరికిన షరపోవారష్యా టెన్నిస్ స్టార్, ఐదు గ్రాండ్‌స్లామ్‌ల విజేత మరియా షరపోవా డోపింగ్ టెస్టులో పట్టుబడింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా ఆమె నిషేధిత ఉత్ప్రేరకం ‘మెల్డోనియం’ను వాడినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో షరపోవాపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ప్రకటించింది. ఇది మార్చి 12 నుంచి అమల్లోకి రానుంది. జనవరి 26న నిర్వహించిన డోప్ పరీక్షలో షరపోవా మెల్డోనియం వాడినట్లు తేలడంతో మార్చి 2న ఈ విషయాన్ని ఆమెకు తెలియజేశారు. కేసు విచారణలో ఉండటంతో నిషేధం, జరిమానా ఎంత విధిస్తారన్న దానిపై స్పష్టత లేదు. అయితే ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిబంధనల ప్రకారం అథ్లెట్లు ఉద్దేశపూర్వకంగా ఈ మందును తీసుకున్నారని తేలితే గరిష్టంగా నాలుగేళ్ల నిషేధం, తెలియక జరిగిన తప్పుగా భావిస్తే రెండేళ్ల నిషేధం, స్వల్ప జరిమానా విధించే అవకాశాలున్నాయి.

- ఉత్తమ క్రీడాకారుడు: పి.ఆర్. శ్రీజేష్
- ఉత్తమ క్రీడాకారిణి: దీపిక
- మేజర్ ధ్యాన్ చంద్ జీవిత సాఫల్య పురస్కారం: దివంగత కెప్టెన్ శంకర్ లక్ష్మణ్ (రూ.30 లక్షల నగదు, ట్రోఫీ)
- ఇన్‌వాల్యుబుల్ కంట్రిబ్యూషన్: బల్‌దేవ్ సింగ్
- అవుట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్: మధ్యప్రదేశ్ హాకీ అకాడెమీ

No comments:
Post a Comment