AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

క్రీడలు మే 2017

క్రీడలు మే 2017
బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్‌లో సింధు భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి, తెలుగు అమ్మాయి పూసర్ల వెంకట (పీవీ) సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా ఎన్నికైంది. సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్ సందర్భంగా మే 24న నిర్వహించిన ఎన్నికల్లో పీవీ సింధుకు అత్యధికంగా 129 ఓట్లు పడ్డాయి. మొత్తం మూడు స్థానాల కోసం ఎన్నికలు నిర్వహించారు. సింధుతోపాటు మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ-108 ఓట్లు), కిర్‌స్టీ గిల్మూర్ (స్కాట్లాండ్-103 ఓట్లు) కూడా బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్‌లో సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ ముగ్గురూ నాలుగేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్‌లో సింధు 
ఎప్పుడు : మే 24 
ఎవరు : ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య 

మొనాకో గ్రాండ్‌ప్రీ విజేత వెటెల్ మొనాకో గ్రాండ్‌ప్రి టైటిల్‌ను ఫెరారీ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ సొంతం చేసుకున్నాడు. మే 29న జరిగిన 78 ల్యాప్‌ల రేసుని గంటా 44 నిమిషాల 44.340 సెకన్లలో పూర్తి చేసి తొలి స్థానంలో నిలిచిన వెటెల్.. ఈ సీజన్‌లో మూడో టైటిల్‌ను దక్కించుకున్నాడు. 
భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్, ఒకాన్ వరుసగా 12వ, 13వ స్థానాల్లో నిలిచారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : మొనాకో గ్రాండ్ ప్రీ - 2017 విజేత
ఎప్పుడు : మే 28
ఎవరు : సెబాస్టియన్ వెటెల్ 
ఎక్కడ : మొనాకో 

సుదిర్మన్ కప్ విజేత దక్షిణ కొరియా సుదీర్మన్ కప్ ప్రపంచ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్షిణ కొరియా దక్కించుకుంది. మే 29న జరిగిన ఫైనల్లో కొరియా 3-2 తేడాతో చైనాను ఓడించి టైటిల్ విజేతగా నిలిచింది. 28 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో కొరియా టైటిల్ నెగ్గడం ఇది నాలుగోసారి. గతంలో కొరియా 1991, 1993, 2003లలో చాంపియన్‌గా నిలిచింది. రెండేళ్లకోసారి జరిగే ఈ మెగా ఈవెంట్‌లో చైనా పదిసార్లు విజేతగా నిలిచింది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : సుదిర్మన్ కప్ - 2017 విజేత
ఎప్పుడు : మే 27
ఎవరు : దక్షిణ కొరియా 
ఎక్కడ : ఆస్ట్రేలియా 

అంతర్జాతీయ ఫెన్సింగ్ టోర్నీలో భవానీకి స్వర్ణంఅంతర్జాతీయ ఫెన్సింగ్ టోర్నమెంట్‌లో భారత ఫెన్సింగ్ క్రీడాకారిణి చదలవాడ భవానీ దేవి స్వర్ణం గెలుచుకుంది. ఐస్‌లాండ్‌లోని రెక్జావిక్‌లో జరిగిన టర్నోయ్ శాటిలైట్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్ సాబెర్ ఈవెంట్ ఫైనల్లో భవాని 15-13తో సారా జేన్ హాంప్సన్ (బ్రిటన్)పై విజయం సాధించింది. తద్వారాఈ క్రీడకు సంబంధించిన అంతర్జాతీయ ఈవెంట్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : అంతర్జాతీయ ఫెన్సింగ్ టోర్నమెంట్ - 2017
ఎప్పుడు : మే 28
ఎవరు : సాబెర్ ఈవెంట్లో భవానీకి స్వర్ణం 
ఎక్కడ : ఐస్‌లాండ్ 

ఫిఫా కార్యక్రమానికి ఎంపికైన అనన్య కాంబోజ్ రష్యాలో జూన్ 26 నుంచి జూలై 3 వరకు జరగనున్న ఫుట్‌బాల్ ఫర్ ఫ్రెండ్‌షిప్ (ఎఫ్4ఎఫ్) సామాజిక కార్యక్రమానికి చంఢీగఢ్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలిక అనన్య కాంబోజ్ ఎంపికైంది. ఎనిమిదో తరగతి చదువుతున్న అనన్య ఈ కార్యక్రమంలో విలేకరిగా వ్యవహరించనుంది. చిన్నారుల్లో ఫుట్‌బాల్ క్రీడపై ఆసక్తి పెంపొందించుట కోసం ఫిఫా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 60 దేశాలకు చెందిన చిన్నారులు ఈ ప్రొగ్రామ్‌లో పాల్గొననున్నారు. 
2017 అక్టోబర్‌లో భారత్‌లో జరుగనున్న అండర్-17 ప్రపంచకప్ కోసం ఫిఫా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.

ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత్‌కు స్వర్ణం ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నమెంట్ కాంపౌండ్ ఈవెంట్‌లో భారత పురుషుల జట్టు పసిడి పతకం గెలుచుకుంది. ఈ మేరకు చైనాలోని షాంఘైలో మే 20న జరిగిన ఫైనల్లో అభిషేక్ వర్మ, రాజు చిన్న శ్రీధర్, అమన్‌జీత్ సింగ్‌లతో కూడిన భారత జట్టు 226-221 స్కోరుతో కార్డొనా, డానియెల్ మునోజ్, కార్లొస్‌లతో కూడిన కొలంబియా జట్టును ఓడించి విజేతగా నిలిచింది. తద్వారా ప్రపంచకప్ కాంపౌండ్ విభాగం చరిత్రలో భారత్‌కు తొలి స్వర్ణం లభించింది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నమెంట్ 
ఎప్పుడు : మే 20
ఎవరు : భారత్‌కు స్వర్ణం 
ఎక్కడ : చైనా 

ముంబై ఇండియన్‌‌సకు ఐపీఎల్-10 టైటిల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2017 టైటిల్‌ను ముంబై ఇండియన్‌‌స సొంతం చేసుకుంది. మే 21న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఒక్క పరుగు తేడాతో రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌పై విజయం సాధించిన ముంబై.. మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. కృనాల్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద ఫైనల్ అవార్డు లభించింది. 
ఐపీఎల్-10 అవార్డీలు
  • అరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు; రూ.10 లక్షలు) : వార్నర్ (641 పరుగులు; హైదరాబాద్)
  • పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు; రూ.10 లక్షలు) : భువనేశ్వర్ (26 వికెట్లు; హైదరాబాద్)
  • ఫర్‌ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ (రూ.10 లక్షలు) : సురేశ్ రైనా
  • ఎమర్జింగ్ ప్లేయర్ (రూ. 10 లక్షలు) : బాసిల్ థంపీ
  • ఫెయిర్ ప్లే అవార్డు : గుజరాత్ లయన్‌‌స
  • మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (రూ. 10 లక్షలు) : బెన్ స్టోక్స్
  • రన్నరప్ (రూ. 10 కోట్లు) : రైజింగ్ పుణే సూపర్‌జెయింట్
  • విన్నర్ (రూ. 15 కోట్లు) : ముంబై ఇండియన్‌‌స
ఐపీఎల్ విజేతలు 2008 - రాజస్థాన్ రాయల్స్ 
2009 - డెక్కన్ ఛార్జర్స్ 
2010 - చెన్నై సూపర్ కింగ్స్ 
2011 - చెన్నై సూపర్ కింగ్స్ 
2012 - కోల్‌కతా నైట్ రైడర్స్ 
2013 - ముంబయి ఇండియన్స్ 
2014 - కోల్‌కతా నైట్ రైడర్స్ 
2015 - ముంబయి ఇండియన్స్ 
2016 - సన్‌రైజర్స్ హైదరాబాద్ 
2017 - ముంబయి ఇండియన్స్ 
క్విక్ రివ్యూ:
ఏమిటి :
 ఐపీఎల్ - 10 (2017)
ఎప్పుడు : మే 21
ఎవరు : విజేత ముంబయి ఇండియన్స్ 
ఎక్కడ : హైదరాబాద్‌లో 


ఆసియా చెస్‌లో వైశాలికి స్వర్ణంఆసియా సీనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో మహిళల బ్లిట్జ్ ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి ఆర్.వైశాలి స్వర్ణ పతకం సాధించింది. ఈ మేరకు మే 21న చైనాలో ముగిసిన టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత వైశాలి ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకొని పసిడి పతకం సొంతం చేసుకుంది. భారత్‌కే చెందిన మరో క్రీడాకారిణి పద్మిని రౌత్ ఏడు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకుంది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ఆసియా సీనియర్ చెస్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : మే 21
ఎవరు : ఆర్. వైశాలికి స్వర్ణం 
ఎక్కడ : చైనాలో 


ఆసియా యూత్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు ఆసియా యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి. ఈ మేరకు మే 22న జరిగిన 10 కిలో మీటర్ల నడక విభాగంలో సంజయ్ కుమార్... డిస్కస్ త్రో ఈవెంట్‌లో అభయ్ గుప్తా విజేతలుగా నిలిచారు. సంజయ్ 45 నిమిషాల 30.39 సెకన్లలో గమ్యానికి చేరుకొని స్వర్ణం దక్కించుకోగా.. అభయ్ గుప్తా డిస్క్‌ను 56.47 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని గెలుచుకున్నాడు. డిస్కస్ త్రోలోనే భారత్‌కే చెందిన సాహిల్ సల్వాల్(54.58 మీటర్లు) రజతం గెల్చుకున్నాడు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ఆసియా యూత్ అథ్లెటిక్స్ - 2017 
ఎప్పుడు : మే 22
ఎవరు : సంజయ్ కుమార్, అభయ్ గుప్తాలకు స్వర్ణాలు 
ఎక్కడ : బ్యాంకాక్ 

ఆసియా యూత్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు 14 పతకాలుబ్యాంకాక్‌లో జరిగిన ఆసియా యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత్ మొత్తం 14 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. ఇందులో ఐదు స్వర్ణాలు, ఐదు రజతాలు, నాలుగు కాంస్యాలు ఉన్నాయి. చైనా 30 పతకాలతో (16 స్వర్ణాలు, 9 రజతాలు, 5 కాంస్యాలు) అగ్రస్థానాన్ని సంపాదించింది. చైనీస్ తైపీ 15 పతకాలతో (6 స్వర్ణాలు, 7 రజతాలు, 2 కాంస్యాలు) రెండో స్థానంలో నిలిచింది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ఆసియా యూత్ అథ్లెటిక్స్ - 2017 
ఎప్పుడు : మే 20 - 23 
ఎక్కడ : బ్యాంకాక్ 

ప్రో కబడ్డీ సీజన్ - 5 వేలం ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్ 5 వేలం మే 23, 24 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగింది. టోర్నీలో పాల్గొంటున్న 12 జట్లు మొత్తం 227 మంది ఆటగాళ్ల కోసం రూ.47 కోట్లు ఖర్చు చేశాయి. ఆటగాళ్ల కోసం ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా రూ. 4 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. యు ముంబా అత్యధికంగా రూ.3.98 కోట్లు ఖర్చు చేసింది. పుణెరి పల్టాన్ అత్యల్పంగా రూ. 3.8 కోట్లు వెచ్చించింది. సచిన్ సహ యజమానిగా ఉన్న తమిళనాడు అత్యధికంగా 25 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకోగా పుణెరి అత్యల్పంగా 15 మందిని ఎంపిక చేసుకుంది
ఏ ఆటగాడికి ఎంత..
  • పీకేఎల్‌లో కొత్తగా చేరిన ఉత్తరప్రదేశ్ రూ.93 లక్షలకు నితిన్ తోమర్‌ను దక్కించుకుంది. ఈ వేలంలో ఇదే అత్యధికం.
  • రోహిత్ కుమార్ - బెంగళూరు - రూ. 81 లక్షలు
  • మంజీత్ చిల్లార్ - జైపూర్ - రూ. 75.50 లక్షలు
  • సెల్వమణి - జైపూర్ - రూ. 73 లక్షలు
  • రాజేశ్ నర్వాల్ - ఉత్తరప్రదేశ్ - రూ. 69 లక్షలు
పీకేఎల్ - 5 జట్లు
తెలుగు టైటాన్స్బెంగాల్ వారియర్స్
తమిళనాడుదబాంగ్ దిల్లీ
గుజరాత్హరియాణా
జయపుర పింక్ పాంథర్స్పట్నా పైరేట్స్
పుణెరి పల్టాన్బెంగళూరు బుల్స్
ఉత్తరప్రదేశ్యు ముంబా

4 దేశాల వన్డే టోర్నీ నెగ్గిన భారత మహిళలు
నాలుగు దేశాల మహిళల వన్డే టోర్నీని భారత్ గెలుచుకుంది. పోట్చెఫ్‌స్ట్రూమ్‌లో మే 21న దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఆసియా రెజ్లింగ్‌లో హర్‌ప్రీత్ సింగ్‌కు కాంస్యం 
న్యూఢిల్లీలో జరుగుతున్న ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో హర్‌ప్రీత్ సింగ్ కాంస్యం గెలుచుకున్నాడు. ఈ మేరకు మే 10న జరిగిన పురుషుల గ్రీకో రోమన్ 80 కేజీల విభాగంలో జున్‌జీ నా (చైనా)తో జరిగిన బౌట్‌లో హర్‌ప్రీత్ 3-2 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. 
ఆసియా చాంపియన్‌షిప్‌లో హర్‌ప్రీత్‌కు ఇది రెండో కాంస్యం. 2016లో బ్యాంకాక్‌లో జరిగిన ఇదే ఈవెంట్లో కాంస్యం నెగ్గాడు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : మే 10
ఎవరు : హర్‌ప్రీత్ సింగ్‌కు కాంస్యం 
ఎక్కడ : న్యూఢిల్లీ 

ఐసీసీ చైర్మన్ పదవిలో కొనసాగనున్న మనోహర్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా పూర్తి కాలం పదవిలో కొనసాగేందుకు శశాంక్ మనోహర్ అంగీకరించారు. ఇందుకు అనుగుణంగా 2018 జూన్ వరకు ఆయన చైర్మన్‌గా కొనసాగుతారు. 
వ్యక్తిగత కారణాలతో ఐసీసీ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు శశాంక్ మనోహర్ మార్చిలో ప్రకటించారు. అయితే ఐసీసీలో పలువురు సభ్యులు ఆయన కొనసాగాలని పట్టుబట్టడంతో జూన్‌లో జరిగే ఐసీసీ వార్షిక సమావేశం వరకు మాత్రమే ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం మనసు మార్చుకొని పూర్తి కాలం పదవిలో ఉండేందుకు అంగీకరించారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : కొనసాగనున్న ఐసీసీ ఛైర్మన్ 
ఎప్పుడు : పదవికాలం పూర్తయ్యే వరకూ 
ఎవరు : శశాంక్ మనోహర్ 

ఫార్ములావన్‌లో మరో భారతీయుడికి అవకాశం
బెంగళూరుకు చెందిన 19 ఏళ్ల అర్జున్ మైనికి అంతర్జాతీయ ఫార్ములావన్ డ్రైవర్‌గా అవకాశం దక్కింది. ఈ మేరకు అమెరికా ఫార్ములావన్ జట్టు హాస్ ఎఫ్-1 మే 11న అర్జున్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం జీపీ3 రేసుల్లో అర్జున్ నిలకడగా రాణిస్తున్నాడు. భారత్‌కు చెందిన నారాయణ్ కార్తికేయన్, కరుణ్ చందోక్ తర్వాత ఫార్ములావన్ (ఎఫ్1) అవకాశం పొందిన మూడో డ్రైవర్ అర్జున్ మైని.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఫార్ములావన్ మరో భారతీయుడికి అవకాశం
ఎప్పుడు : మే 11
ఎవరు : అర్జున్ మైని

ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో అనిల్‌కు కాంస్యం
ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పురుషుల గ్రీకో రోమన్ 85 కేజీల విభాగంలో అనిల్ కుమార్ కాంస్యం గెలుచుకున్నాడు. కాంస్య పతక బౌట్‌లో అనిల్ 7-6 తో మొహమ్మద్ అలీ షమ్సీద్దినోవ్ (ఉజ్బెకిస్తాన్)పై విజయం సాధించాడు. మరోవైపు మహిళల ఫ్రీస్టయిల్ 75 కేజీల విభాగంలో జ్యోతి 0-10తో మసాకా ఫురుచి (జపాన్) చేతిలో ఓడిపోయి కాంస్యం దక్కించుకుంది.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు కాంస్యాలు
ఎప్పుడు : మే 11
ఎవరు : అనిల్ కుమార్, జ్యోతి

ఎంసీసీ క్లబ్‌లో లక్ష్మణ్‌కు చోటుభారత మాజీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్‌కు ప్రతిష్టాత్మక మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) జీవితకాల గౌరవ సభ్యత్వాన్ని అందజేసింది. తద్వారా ఈ క్లబ్‌లో చోటు సంపాదించిన ఐదో భారత క్రికెటర్‌గా లక్ష్మణ్ నిలిచాడు. సచిన్, ద్రవిడ్, గంగూలీ, జహీర్ ఖాన్‌లు ఇంతకుముందే ఎంసీసీలో సభ్యులుగా ఉన్నారు. 16 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన లక్ష్మణ్ 134 టెస్టుల్లో 45.97 సగటుతో 8,781 పరుగులు, 86 వన్డేల్లో 30.76 సగటుతో 2,338 పరుగులు సాధించాడు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : వీవీఎస్ లక్ష్మణ్‌కు ఎంసీసీలో సభ్యత్వం
ఎప్పుడు : మే 11
ఎవరు : మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్

ఆసియా రెజ్లింగ్‌లో సాక్షి, వినేశ్, దివ్యలకు రజతం ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో భారత్‌కు మూడు రజతాలు, ఒక కాంస్యం దక్కింది. ఈ మేరకు మే 12న జరిగిన మహిళల 60 కేజీల కేటగిరీ ఫైనల్లో సాక్షి మలిక్ 0 - 10 తో రియో స్వర్ణ పతక విజేత రిసాకో కవాయి (జపాన్) చేతిలో ఓడిపోయింది. తద్వారా సాక్షికి రజతం దక్కింది. 
మహిళల 55 కేజీల ఫైనల్లో నాన్జో సే చేతిలో ఓడిపోయిన వినేశ్ ఫోగట్‌కు, 69 కేజీ కేటగిరీ ఫైనల్లో సారా దొషో (జపాన్) చేతిలో ఓడిన దివ్య కక్రున్‌కు రజతాలు దక్కాయి. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : మే 12 
ఎవరు : సాక్షి మలిక్, వినేశ్, దివ్యలకు రజతం
ఎక్కడ : న్యూఢిల్లీలో 

ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో బజరంగ్‌కు స్వర్ణం ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ బజరంగ్ పూనియా స్వర్ణం సాధించాడు. ఈ మేరకు మే 13న జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగం ఫైనల్లో బజరంగ్ 6-2తో సెయుంగ్‌చుల్ లీ (దక్షిణ కొరియా)పై గెలిచి టోర్నమెంట్‌లో భారత్‌కు తొలి పసిడి అందించాడు. 
మే 14న జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 125 కేజీల విభాగంలో రన్నరప్‌గా నిలిచిన సుమీత్ రజతం సాధించాడు. మొత్తంగా ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు ఒక స్వర్ణం, ఐదు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో కలిపి మొత్తం 10 పతకాలు సొంతం చేసుకున్నారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : మే 2017
ఎవరు : భారత్‌కు 10 పతకాలు (బజరంగ్ పూనియాకు స్వర్ణం)

అర్జున్ మైనికి జీపీ-3 టైటిల్ బెంగళూరుకు చెందిన 19 ఏళ్ల డ్రైవర్ అర్జున్ మైని గ్రాండ్‌ప్రి (జీపీ)-3 సిరీస్ రేసులో విజేతగా నిలిచాడు. ఈ మేరకు మే 14న స్పెయిన్‌లో జరిగిన 17 ల్యాప్‌ల రేసులో అందరికంటే ముందుగా గమ్యాన్ని చేరి టైటిల్ గెలుచుకున్నాడు. తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి డ్రైవర్‌గా గుర్తింపు పొందాడు. 
ఈ రేసులో అర్జున్ జెన్‌జెర్ మోటార్‌స్పోర్ట్ జట్టు తరఫున బరిలోకి దిగాడు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : స్పెయిన్ గ్రాండ్ ప్రీ - 3 
ఎప్పుడు : మే 14, 2017
ఎవరు : విజేత అర్జున్ మైని 
ఎక్కడ : బార్సిలోనా, స్పెయిన్ 

స్పెయిన్ గ్రాండ్‌ప్రి విజేత హామిల్టన్
స్పెయిన్ గ్రాండ్ ప్రీలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. ఈ మేరకు మే 14న జరిగిన రేసులో హామిల్టన్ 66 ల్యాప్‌లను గంటా 35 నిమిషాల 56.497 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ రెండో స్థానంలో, రికియార్డో (రెడ్‌బుల్) మూడో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్ (4వ స్థానం), ఒకాన్ (5వ స్థానం) టాప్-5లో స్థానం సంపాదించారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : స్పెయిన్ గ్రాండ్ ప్రీ - 2017
ఎప్పుడు : మే 14
ఎవరు : విజేత లూయిస్ హామిల్టన్
ఎక్కడ : బార్సిలోనా, స్పెయిన్

క్రికెట్‌లో భారత మహిళల రికార్డు భాగస్వామ్యం భారత మహిళా ఓపెనర్లు దీప్తి శర్మ (188 పరుగులు), పూనమ్ రౌత్ (109 పరుగులు) తొలి వికెట్‌కు 320 పరుగుల భాగస్వామ్యంతో రికార్డు సృష్టించారు. దక్షిణాఫ్రికాలో జరిగిన నాలుగు దేశాల మహిళల వన్డే టోర్నీలో భాగంగా మే 15న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరు ఈ ఘనతను నమోదు చేశారు. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఏ వికెట్‌కై నా ఇదే అత్యధిక పరుగుల భాగస్వామ్యం. 
గతంలో ఈ రికార్డు సారా టేలర్, కరోలైన్ అట్కిన్స్‌ (ఇంగ్లండ్) పై ఉండేది. వారు 2008లో లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికాపై తొలి వికెట్‌కు 268 పరుగులు సాధించారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహిళల వన్డే క్రికెట్‌లో రికార్డు భాగస్వామ్యం 
ఎప్పుడు : మే 15
ఎవరు : దీప్తి శర్మ, పూనమ్ రౌత్
ఎక్కడ : దక్షిణాఫ్రికా (ఐర్లాండ్‌తో)

మాడ్రిడ్ మాస్టర్స్ సిరీస్ సింగిల్స్ విజేత నాదల్ 
మాడ్రిడ్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్ సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ సొంతం చేసుకున్నాడు. ఈ మేరకు మే 14న జరిగిన ఫైనల్లో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)పై విజయం సాధించాడు. ఈ గెలుపుతో నాదల్ అత్యధికంగా 30 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుడిగా నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. ఈ జాబితాలో ఫెడరర్ (26 టైటిల్స్), అగస్సీ (17 టైటిల్స్), ఆండీ ముర్రే (14 టైటిల్స్), పీట్ సంప్రాస్ (11 టైటిల్స్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 
మొత్తంగా మాడ్రిడ్ ఓపెన్ చరిత్రలో చాంపియన్‌గా నిలువడం నాదల్‌కిది ఐదోసారి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : మాడ్రిడ్ మాస్టర్స్ సిరీస్ - 2017
ఎప్పుడు : మే 14
ఎవరు : సింగిల్స్ విజేత నాదల్ 
ఎక్కడ : స్పెయిన్ 

ఇండియన్ గ్రాండ్‌ప్రి అథ్లెటిక్స్‌లో ద్యుతీచంద్‌కు స్వర్ణంఇండియన్ గ్రాండ్‌ప్రి అథ్లెటిక్స్ మూడో అంచె పోటీల్లో ఒడిశా స్ప్రింటర్ ద్యుతీచంద్ మహిళల 100 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచింది. ఈ మేరకు మే 15న న్యూఢిల్లీలో జరిగిన ఫైనల్ రేసును 11.30 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మెర్లిన్ జోసెఫ్ (కేరళ-11.72 సెకన్లు) రజతం, హిమశ్రీ రాయ్ (బెంగాల్-11.95 సెకన్లు) కాంస్యం గెలిచారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ఇండియన్ గ్రాండ్‌ప్రి అథ్లెటిక్స్ - 3 ఫేజ్ 
ఎప్పుడు : మే 15
ఎవరు : 100 మీటర్ల విభాగంలో ద్యుతీచంద్‌కు స్వర్ణం 
ఎక్కడ : న్యూఢిల్లీలో 

భారత మహిళల జట్టు కెప్టెన్‌గా మిథాలీ రాజ్అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుకు మిథాలీ రాజ్ కెప్టెన్‌గా ఎంపికైంది. ఈ మేరకు 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ మే 16న ప్రకటించింది. 
మహిళల ప్రపంచ కప్ 2017 జూన్ 24 నుంచి ఇంగ్లండ్‌లో జరగుతుంది. 
భారత మహిళల జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ ప్రీత్ కౌర్, వేదా కృష్ణమూర్తి, మోనా మెషమ్,్ర పునమ్ రౌత్, దీప్తి శర్మ, జులన్ గోస్వామి, శిఖా పాండే, ఏక్తా బిస్త్, సుష్మ వర్మ, మాన్సి జోషి, రాజేశ్వరి గైక్వాడ్, పునమ్ యాదవ్, నుజ్‌హత్ పార్వీన్, స్మృతీ మందనా.
క్విక్ రివ్యూ:ఏమిటి : మహిళల వన్డే ప్రపంచ కప్‌కు భారత జట్టు 
ఎప్పుడు : మే 16
ఎవరు : కెప్టన్‌గా మిథాలీ రాజ్

వింబుల్డన్ ప్రైజ్‌మనీ పెంపుప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రైజ్‌మనీని 2 లక్షల పౌండ్ల మేర పెంచుతున్నట్లు ఆల్ ఇంగ్లండ్ క్లబ్ మే 3న ప్రకటించింది. ఈ మేరకు 2017 పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 22 లక్షల పౌండ్ల చొప్పున (రూ. 18 కోట్ల 23 లక్షల 42 వేలు) అందజేస్తారు. 2016 వరకు ఈ మొత్తం 20 లక్షల పౌండ్లుగా ఉండింది.
క్విక్ రివ్యూ:ఏమిటి : వింబుల్డన్ ప్రైజ్‌మనీ పెంపు
ఎప్పుడు : మే 3
ఎవరు : ఆల్ ఇంగ్లండ్ క్లబ్ 

ఫిఫా ర్యాంకింగ్స్‌లో 100వ ర్యాంకులో భారత్ ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ర్యాంకింగ్‌‌సలో భారత జట్టు 21 ఏళ్ల తర్వాత మరోసారి టాప్-100లోకి వచ్చింది. ఈ మేరకు మే 4న ‘ఫిఫా’ ప్రకటించిన ర్యాంకుల్లో భారత్ 100వ స్థానాన్ని దక్కించుకుంది. జనవరిలో 129వ స్థానంలో ఉన్న భారత జట్టు తక్కువ వ్యవధిలోనే 29 స్థానాలు ఎగబాకి ఈ స్థానానికి చేరుకుంది. చివరిసారిగా భారత్ 1996 ఏప్రిల్‌లో 94వ ర్యాంకు సాధించింది
క్విక్ రివ్యూ:ఏమిటి : 21 ఏళ్ల తర్వాత 100వ ర్యాంకులో భారత్ 
ఎప్పుడు : మే 4 
ఎవరు : ఫిఫా ర్యాంకింగ్స్ 
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా

అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీలో భారత్‌కు కాంస్యం మలేసియాలో జరిగిన అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత్‌కు కాంస్యం దక్కింది. ఈ మేరకు మే 6న న్యూజిలాండ్ జట్టుతో జరిగిన కాంస్య పతక పోరులో టీమిండియా 4-0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. 
34 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో భారత్ కాంస్య పతకం సాధించడం ఇది ఏడోసారి. గతంలో భారత్ 1983, 2000, 2006, 2007, 2012, 2015లో కాంస్య పతకాలు గెలిచింది. 
ఈ టోర్నీ ఫైనల్లో బ్రిటన్ 4-3తో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా జట్టును ఓడించి విజేతగా నిలిచింది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్ - 2017
ఎప్పుడు : మే 6
ఎవరు : విజేత బ్రిటన్, భారత్‌కు కాంస్యం 
ఎక్కడ : మలేసియా

ఆసియా బాక్సింగ్‌లో శివ, సుమీత్‌లకు రజతాలు ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు శివ థాపా, సుమీత్ సాంగ్వాన్‌లు రజతాలు సాధించారు. ఈ మేరకు మే 6న తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్)లో జరిగిన ఫైనల్లో శివ థాపా (60 కేజీలు) తొలి రౌండ్ ముగియకముందే గాయం కారణంగా వైదొలగగా... సుమీత్ సాంగ్వాన్ (91 కేజీలు) 0-5తో టాప్ సీడ్ వాసిలీ లెవిట్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. 
కాగా ఈ టోర్నమెంట్‌లో శివ థాపాకిది వరుసగా మూడో పతకం. 2013లో స్వర్ణం నెగ్గిన శివ 2015లో కాంస్య పతకం గెలిచాడు. తద్వారా వరుసగా మూడు ఆసియా చాంపియన్‌షిప్‌లలో పతకాలు నెగ్గిన ఏకైక భారత బాక్సర్‌గా శివ థాపా గుర్తింపు పొందాడు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : మే 6
ఎవరు : శివ, సుమీత్‌లకు రజతాలు 
ఎక్కడ : ఉజ్బెకిస్తాన్

జులన్ గోస్వామి ప్రపంచ రికార్డు భారత క్రికెటర్ జులన్ గోస్వామి వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళ బౌలర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ మేరకు మే 9న దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా బ్యాట్స్‌వుమెన్ రైసిబి నటోజాకేను అవుట్ చేయడంతో జులన్ ఈ ఘనత సాధించింది. ఓవరాల్‌గా 153 మ్యాచ్‌ల్లో 181 వికెట్లను పడగొట్టి క్యాతీఫిజ్‌పాట్రిక్ (ఆస్ట్రేలియా) పేరు మీదున్న రికార్డును అధిగమించింది. 
జులన్ గోస్వామి భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, అర్జున అవార్డులు అందుకున్నారు. ఐసీసీ ఆమెకు 2007లో వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని ఇచ్చింది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళా క్రికెటర్ 
ఎప్పుడు : మే 9
ఎవరు : జులన్ గోస్వామి ( భారత్ )
ఎందుకు : క్యాతీఫిజ్‌పాట్రిక్ (ఆస్ట్రేలియా) రికార్డును అధిగమించినందుకు

No comments:

Post a Comment