వార్తల్లో వ్యక్తులు మే 2016
ఐరాస యూనివర్సిటీ కౌన్సిల్ సభ్యురాలిగా రాధా కుమార్ఐక్యరాజ్య సమితి (ఐరాస) యూనివర్సిటీ కౌన్సిల్ సభ్యురాలిగా ఢిల్లీ పాలసీ గ్రూప్ డెరైక్టర్ జనరల్ రాధా కుమార్ నియమితులయ్యారు. ఆమెతో సహా 12 మందిని ఈ పదవిలో నియమిస్తూ ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీమూన్ ఉత్తర్వులు జారీచేశారు. మే నెలలో వీరందరూ బాధ్యతలు స్వీకరించనున్నారు. పదవీకాలం మూడు లేదా ఆరేళ్లు ఉంటుంది. యూనివర్సిటీ విధానాలను రూపొందించడం, దాని పాలనను పర్యవేక్షించడం, ద్వైవార్షిక బడ్జెట్‌ను పరిశీలించి, ఆమోదించడం వీరి విధులు. శాంతి పరిరక్షణలో రాధాకుమార్‌కు విశేషానుభవం ఉందని ఐరాస ఏప్రిల్ 28న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. జమ్మూ కశ్మీర్‌పై భారత ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల సంప్రదింపుల బృందంలో ఆమె కూడా ఉన్నారని తెలిపింది.
భారత గుడ్‌విల్ అంబాసిడర్లుగా అభినవ్ బింద్రా, సచిన్రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందానికి సుహృద్భావ రాయబారాలు (Goodwill Ambassadors)గా మేటి షూటర్ అభినవ్ బింద్రా, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌లను భారత ఒలింపిక్ సంఘం (ఐఏఓ) నియమించింది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌లాగానే వివిధ రంగాలకు చెందిన మరికొంత మందిని కూడా రాయబారులుగా నియమించనున్నట్లు ఐఏఓ వెల్లడించింది.
‘జనసంఘ్’ మధోక్ కన్నుమూతభారతీయ జనతా పార్టీ మాతృసంస్థ అయిన భారతీయ జన సంఘ్ మాజీ అధ్యక్షుడు, ఆ సంస్థ వ్యవస్థాపక సభ్యుడు బలరాజ్ మధోక్(96) మే 2న న్యూఢిల్లీలో కన్నుమూశారు. మధోక్ 1920లో అవిభక్త కశ్మీర్‌లోని స్కార్దులో జన్మించారు. జన సంఘ్‌కు ముందు ఆరెస్సెస్‌లో పనిచేశారు. 1966లో ఆ సంస్థ అధ్యక్ష పదవి చేపట్టారు. భారతీయ జన సంఘ్ ఆయన సారథ్యంలో 1967 నాటి లోక్‌సభ ఎన్నికల్లో 35 సీట్లు గెలిచి సత్తా చాటింది. ఆయన రెండు పర్యాయాలు ఎంపీగా ఉన్నారు. వాజ్‌పేయి, అద్వానీ వంటి నేతలు తెరపైకి వచ్చాక ప్రాధాన్యం లేకుండా పోయింది. క్రమశిక్షణ రాహిత్యం పేరుతో 1973లో ఆయనను సంస్థ నుంచి బహిష్కరించారు కూడా.
గిన్నీస్ బుక్‌లోకి ఎక్కిన బంగారు చొక్కాఅత్యంత విలువైన బంగారు చొక్కా కలిగిన మహారాష్ట్ర వ్యాపారి పంకజ్ పరఖ్(47)కు గిన్నీస్ బుక్‌లో చోటు లభించింది. ఈయన 2014లో తన 45వ పుట్టినరోజున రూ. 98,35,099 విలువ గల చొక్కాను తయారుచేయించారు. ప్రపంచంలో ఇదే అత్యంత ఖరీదైన చొక్కా అంటూ గిన్నీస్ బుక్ వారు మే 3న పరఖ్‌కు సర్టిఫికెట్ ఇచ్చారు. వస్త్రాల వ్యాపారం చేసే పరఖ్ ముంబైకి 260 కి.మీ దూరంలో ఉన్న యోలా పట్టణానికి డిప్యూటీ మేయర్ కూడా. ఆయన చేయించుకున్న బంగారు చొక్కా బరువు 4.10 కిలోలు. దీని ప్రస్తుత విలువ కోటి ముప్పై లక్షలు. దీనితో పాటు బంగారు గడియారం, గోల్డ్ చైన్లు, ఉంగరాలు, బంగారు మొబైల్ కవర్, బంగారు కళ్లజోడు మొత్తం పది కిలోల బరువు కలిగిన వస్తువులు ఈయన దగ్గర ఉన్నాయి. వీటిని సంరక్షించడానికి లెసైన్స్‌డ్ రివాల్వర్‌తో పాటు ఇద్దరు ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నారు.
పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ ప్రమాణస్వీకారం
పశ్చిమ బెంగాల్ సీఎంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మే 27న ప్రమాణస్వీకారం చేశారు. ఆమెతోపాటు 41 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మమతా బెనర్జీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడం ఇది రెండోసారి (2011లో తొలిసారి).
నేవీ నూతన సారథిగా సునీల్ లాంబా
భారత నావికాదళం అధిపతిగా అడ్మిరల్ సునీల్ లాంబా మే 31న బాధ్యతలు స్వీకరించారు. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. భారత నావికాదళానికి లాంబా 21వ చీఫ్. మాజీ చీఫ్ అడ్మిరల్ ఆర్‌కే ధోవన్ పదవీ కాలం పూర్తవడంతో ఆ స్థానంలో లాంబా నియమితులయ్యారు. నేవీలోని పలు కీలక విభాగాల్లో సేవలు అందించిన లాంబా హైదరాబాద్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కళాశాల పూర్వ విద్యార్థి. గతంలో ఆయన ఐఎన్‌ఎస్, సింధుదుర్గ్ నౌకలకు నావిగేటింగ్ అధికారిగా పనిచేశారు. సికింద్రాబాద్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ కళాశాలలో ఉపాధ్యాయుడిగానూ పనిచేశారు. నావికాదళానికి సేవలందించినందుకుగానూ పరమ విశిష్ట సేవాపతకం కూడా అందుకున్నారు.
ప్రధాని మోదీతో టిమ్ కుక్ భేటీ
భారత్‌లో తొలిసారి పర్యటిస్తున్న ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సీఈఓ టిమ్ కుక్... మే 21న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య దేశంలో యాపిల్ ఉత్పత్తుల తయారీ అవకాశాలపై, యువత నైపుణ్యాలు, ఉపాధి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. అలాగే సైబర్ సెక్యూరిటీ, డేటా ఎన్‌స్క్రిప్షన్ విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో యాపిల్ భాగస్వామిగా మారాలని మోదీ కోరారు. నరేంద్ర మోదీ మొబైల్ యాప్‌లో కొత్త వెర్షన్‌ని ఈ సందర్భంగా టిమ్ కుక్ ఆవిష్కరించారు.
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బేడీ
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బీజేపీ నాయకురాలు, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ నియమితులయ్యారు. ఈ మేరకు మే 22న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. బేడీ గతంలో ఢిల్లీ పోలీసు శాఖలో పనిచేశారు. రిటైరైన తర్వాత సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో కలసి ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఏడాది క్రితం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి ఘోరంగా ఓడారు. కృష్ణానగర్ నుంచి పోటీచేసి ఢిల్లీ సీఎం కే జ్రీవాల్ చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎట్టకేలకు బీజే పీ ప్రభుత్వం ఆమెకు లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని కట్టబెట్టింది.
అస్సాం సీఎంగా సోనోవాల్ ప్రమాణం
అస్సాం 14వ ముఖ్యమంత్రిగా సర్బానంద సోనోవాల్ మే 24న ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాన మంత్రి నరే ంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు ఇతర ప్రముఖుల సమక్షంలో ఖానాపార వెటర్నరీ కళాశాల మైదానంలో ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్య.. సోనోవాల్‌తో పాటు మరో 10 మంది మంత్రులచే ప్రమాణస్వీకారం చేయించారు. బీజేపీ నుంచి ఆరుగురు, అస్సాం గణ పరిషత్, బోడో పీపుల్స్ ఫ్రంట్ నుంచి చెరో ఇద్దరు మంత్రులుగా ప్రమాణం చేశారు.
ఆరోసారి సీఎంగా జయలలిత ప్రమాణం
తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే అధినేత్రి జె.జయలలిత ఆరోసారి ప్రమాణస్వీకారం చేశారు. 32 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఏడాది కాలంలో జయ రెండు సార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో మే 23, 2015న జయ ఐదోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఎం.జి. రామచంద్రన్ తరువాత వరుసగా రెండోసారి ఎన్నికైన ముఖ్యమంత్రిగా జయలలిత రికార్డు సృష్టించారు. రాష్ట్రంలో అత్యధికంగా ఐదుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కరుణానిధి రికార్డును జయ ఆరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ద్వారా చెరిపేశారు.
కేరళ సీఎంగా విజయన్ ప్రమాణం
సీపీఎం సీనియర్ నేత, 72 ఏళ్ల పినరయి విజయన్.. కేరళ 12వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మే 25న తిరువనంతపురంలో ఆయనతో పాటు లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్)కు చెందిన 19 మంది సభ్యులు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు కాగా, 13 మంది కొత్త వారున్నారు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సదాశివమ్ వీరితో ప్రమాణం చేయించారు. విజయన్ ప్రమాణం మలయాళంలో సాగింది. 19 మంది కేబినెట్ మంత్రుల్లో సీఎం సహా 12 మంది సీపీఎం, నలుగురు సీపీఐకి చెందినవారు. ఎన్‌సీపీ, జనతాదళ్(ఎస్), కాంగ్రెస్(ఎస్)నుంచి ఒకరు చొప్పున ఉన్నారు.
జమాతే ఇస్లామీ అధినేత నిజామీకి ఉరి
బంగ్లాదేశ్ ప్రభుత్వం జమాతే ఇస్లామీ పార్టీ అధినేత మొతీర్ రహ్మాన్ నిజామీ (73)తో పాటు మరో నలుగురిని మే 10న ఉరితీసింది. 1971 నాటి యుద్ధనేరాల కేసులో ఆయనకు 2014లో ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆ తీర్పు రద్దుకు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడా ఆయనకు చుక్కెదురైంది.
‘రియో’కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఏఆర్ రెహమాన్
ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ రియో ఒలింపిక్స్‌లో భారత బృందానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఇప్పటికే సచిన్ టెండూల్కర్, అభినవ్ బింద్రా, సల్మాన్‌ఖాన్ అంబాసిడర్స్‌గా వ్యవహరిస్తున్నారు. తమ ప్రతిపాదనకు రెహమాన్ ఆమోదం తెలుపుతూ లేఖ పంపారని భారత ఒలింపిక్ సంఘం (IOA) తెలిపింది.
స్విట్జర్లాండ్‌లో యశ్ చోప్రాకు కాంస్య విగ్రహం
దశాబ్దాల పాటు స్విట్జర్లాండ్ ప్రకృతి సౌందర్యాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించినందుకు గాను సినీ దర్శకుడు దివంగత యశ్ చోప్రాను ఆ దేశ ప్రభుత్వం గౌరవించింది. దాదాపు 350 కిలోల కాంస్యంతో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించింది. యష్‌చోప్రా సతీమణి పమేలా, కోడలు రాణీముఖర్జీ మే 4న ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
బంగ్లా జమాతే నేత నిజామీకి ఉరి
బంగ్లాదేశ్‌కు చెందిన జమాతే ఇస్లామీ పార్టీ అధినేత మోతీర్ రహ్మాన్ నిజామీ(73)ని మే 10వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు ఢాకా సెంట్రల్ జైల్లో ఉరితీశారు. రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరేందుకు నిజామీ తిరస్కరించడంతో ఉరితీసినట్లు హోం మంత్రి అసదుజ్జామాన్ ఖాన్ తెలిపారు. 1971 యుద్ధ నేరాల కేసులో మే 10న మరో నలుగురిని ఉరితీశారు. నిజామీకి ఉరిశిక్ష విధిస్తూ 2014లో ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పునే సుప్రీంకోర్టు ఖరారుచేసింది. ఉరిని రద్దుచేయాలంటూ సుప్రీం పునర్విచారణ బెంచ్‌ను ఆశ్రయించినా ఊరట దక్కలేదు.
పపంచ టాప్-10 వేతన సీఈఓల్లో భారతీయులు
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వేతనాలందుకునే తొలి పదిమంది సీఈఓల జాబితాలో భారత సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులకు చోటు లభించింది. ఈక్విలార్ సంస్థ రూపొందించిన ఈ జాబితాలో పెప్సికో ఇంద్రా నూయి 8వ స్థానంలో, ల్యాండెల్‌బాసెల్స్ సీఈఓ భవేశ్ పటేల్ 6వ స్థానంలో నిలిచారు. ఇక అత్యధికంగా వేతనాలందుకునే తొలి వందమంది జాబితాలో భారత సంతతి వ్యక్తి, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఉన్నారు. వివరాలు..

- రసాయనాల కంపెనీ ల్యాండెల్‌బాసెల్ ఇండస్ట్రీస్ సీఈఓ భవేశ్ వి. పటేల్ 2.45 కోట్ల డాలర్ల వేతనంతో ఆరవ స్థానంలో ఉన్నారు.
- 2.22 కోట్ల డాలర్ల వేతనంతో పెప్సికో ఇంద్రా నూయికి ఎనిమిదవ స్థానం లభించింది.
- మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 26వ స్థానంలో ఉన్నారు. ఆయన వేతనం 1.83 కోట్ల డాలర్లు.
- ఒరాకిల్ కార్పొరేషన్‌కు చెందిన మార్క్ వి. హర్డ్, సఫ్ర ఏ కాట్జ్‌లు 5.32 కోట్ల డాలర్ల వేతనాలతో మొదటి స్థానంలో నిలిచారు.
- వాల్ట్ డిస్ని రాబర్ట్ ఏ ఐగర్ 4.35 కోట్ల డాలర్ల వేతనంతో రెండో స్థానంలో ఉండగా, హనీవెల్ ఇంటర్నేషనల్ సీఈఓ డేవిడ్ ఎం. కోట్ 3.31 కోట్ల డాలర్ల వేతనంతో మూడో స్థానంలో, జనరల్ ఎలక్ట్రిక్ చీఫ్ జెఫ్రీ ఆర్ ఇమ్మెల్ట్ 2.64 కోట్ల డాలర్లతో నాలుగో స్థానంలో ఉన్నారు.
ఐరాస యూనివర్సిటీ కౌన్సిల్ సభ్యురాలిగా రాధా కుమార్ఐక్యరాజ్య సమితి (ఐరాస) యూనివర్సిటీ కౌన్సిల్ సభ్యురాలిగా ఢిల్లీ పాలసీ గ్రూప్ డెరైక్టర్ జనరల్ రాధా కుమార్ నియమితులయ్యారు. ఆమెతో సహా 12 మందిని ఈ పదవిలో నియమిస్తూ ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీమూన్ ఉత్తర్వులు జారీచేశారు. మే నెలలో వీరందరూ బాధ్యతలు స్వీకరించనున్నారు. పదవీకాలం మూడు లేదా ఆరేళ్లు ఉంటుంది. యూనివర్సిటీ విధానాలను రూపొందించడం, దాని పాలనను పర్యవేక్షించడం, ద్వైవార్షిక బడ్జెట్‌ను పరిశీలించి, ఆమోదించడం వీరి విధులు. శాంతి పరిరక్షణలో రాధాకుమార్‌కు విశేషానుభవం ఉందని ఐరాస ఏప్రిల్ 28న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. జమ్మూ కశ్మీర్‌పై భారత ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల సంప్రదింపుల బృందంలో ఆమె కూడా ఉన్నారని తెలిపింది.
భారత గుడ్‌విల్ అంబాసిడర్లుగా అభినవ్ బింద్రా, సచిన్రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందానికి సుహృద్భావ రాయబారాలు (Goodwill Ambassadors)గా మేటి షూటర్ అభినవ్ బింద్రా, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌లను భారత ఒలింపిక్ సంఘం (ఐఏఓ) నియమించింది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌లాగానే వివిధ రంగాలకు చెందిన మరికొంత మందిని కూడా రాయబారులుగా నియమించనున్నట్లు ఐఏఓ వెల్లడించింది.
‘జనసంఘ్’ మధోక్ కన్నుమూతభారతీయ జనతా పార్టీ మాతృసంస్థ అయిన భారతీయ జన సంఘ్ మాజీ అధ్యక్షుడు, ఆ సంస్థ వ్యవస్థాపక సభ్యుడు బలరాజ్ మధోక్(96) మే 2న న్యూఢిల్లీలో కన్నుమూశారు. మధోక్ 1920లో అవిభక్త కశ్మీర్‌లోని స్కార్దులో జన్మించారు. జన సంఘ్‌కు ముందు ఆరెస్సెస్‌లో పనిచేశారు. 1966లో ఆ సంస్థ అధ్యక్ష పదవి చేపట్టారు. భారతీయ జన సంఘ్ ఆయన సారథ్యంలో 1967 నాటి లోక్‌సభ ఎన్నికల్లో 35 సీట్లు గెలిచి సత్తా చాటింది. ఆయన రెండు పర్యాయాలు ఎంపీగా ఉన్నారు. వాజ్‌పేయి, అద్వానీ వంటి నేతలు తెరపైకి వచ్చాక ప్రాధాన్యం లేకుండా పోయింది. క్రమశిక్షణ రాహిత్యం పేరుతో 1973లో ఆయనను సంస్థ నుంచి బహిష్కరించారు కూడా.
గిన్నీస్ బుక్‌లోకి ఎక్కిన బంగారు చొక్కాఅత్యంత విలువైన బంగారు చొక్కా కలిగిన మహారాష్ట్ర వ్యాపారి పంకజ్ పరఖ్(47)కు గిన్నీస్ బుక్‌లో చోటు లభించింది. ఈయన 2014లో తన 45వ పుట్టినరోజున రూ. 98,35,099 విలువ గల చొక్కాను తయారుచేయించారు. ప్రపంచంలో ఇదే అత్యంత ఖరీదైన చొక్కా అంటూ గిన్నీస్ బుక్ వారు మే 3న పరఖ్‌కు సర్టిఫికెట్ ఇచ్చారు. వస్త్రాల వ్యాపారం చేసే పరఖ్ ముంబైకి 260 కి.మీ దూరంలో ఉన్న యోలా పట్టణానికి డిప్యూటీ మేయర్ కూడా. ఆయన చేయించుకున్న బంగారు చొక్కా బరువు 4.10 కిలోలు. దీని ప్రస్తుత విలువ కోటి ముప్పై లక్షలు. దీనితో పాటు బంగారు గడియారం, గోల్డ్ చైన్లు, ఉంగరాలు, బంగారు మొబైల్ కవర్, బంగారు కళ్లజోడు మొత్తం పది కిలోల బరువు కలిగిన వస్తువులు ఈయన దగ్గర ఉన్నాయి. వీటిని సంరక్షించడానికి లెసైన్స్‌డ్ రివాల్వర్‌తో పాటు ఇద్దరు ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నారు.
No comments:
Post a Comment