క్రీడలు ఫిబ్రవరి 2017
భారత మహిళలకు ప్రపంచకప్ అర్హత టోర్నీ టైటిల్ ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ టోర్నీ ఫైనల్లో భారత్ విజేతగా నిలిచింది. కొలంబోలో ఫిబ్రవరి 21న జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించింది. మొత్తం పది జట్లు పాల్గొన్నఈ టోర్నీలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్‌లు జూన్‌లో ఇంగ్లండ్‌లో జరగనున్న ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి.
హెచ్‌ఐఎల్ టైటిల్ గెలుచుకున్న కళింగ లాన్సర్స్కళింగ లాన్సర్స్ జట్టు హాకీ ఇండియా లీగ్-2017 టైటిల్ గెలుచుకుంది. ఛండీగఢ్‌లో ఫిబ్రవరి 26న జరిగిన ఫైనల్లో దబాంగ్ ముంబైపై విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్ విజార్డ్స్ జట్టు మూడో స్థానంలో నిలిచింది.
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో హారికకు కాంస్యంఇరాన్‌లో జరిగిన ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్ (నాకౌట్ ఫార్మాట్)లో ద్రోణవల్లి హారిక కాంస్య పతకం సాధించింది. ఫిబ్రవరి 25న తాన్ జోంగి (చైనా)తో జరిగిన సెమీఫైనల్ టైబ్రేక్‌లో హారిక 3-4 తేడాతో ఓడిపోయింది. దీంతో ఈ టోర్నీలో హారిక వరుసగా మూడోసారి కాంస్యంతో సరిపెట్టుకుంది. 2012, 2015 ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో హారిక కాంస్యం నెగ్గింది.
జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్హైదరాబాద్లోజరిగిన జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణాకు చెందిన బబిత జాక్వెలిన్ స్వర్ణం గెలుచుకుంది. మహిళల 45 ప్లస్ విభాగంలో 5000 మీ. పరుగు పందెంలో బబిత 25 నిమిషాల 21.6 సెకండ్లలో గమ్యం చేరుకొని విజేతగా నిలిచిది. ఈ టోర్నీలో బబితకిది మూడో స్వర్ణం. 35 ప్లస్ పురుషుల డిస్కస్‌త్రోలో ఢిల్లీకి చెందిన ఆకాశ్ మాథూర్ తొలిస్థానంలో నిలవగా పర్వేశ్ తోమర్ (ఢిలీ), సుఖ్వీందర్ సింగ్ (తెలంగాణ) తర్వాతి స్థానాల్లో నిలిచారు.
ప్రపంచకప్ షూటింగ్లోజీతూ-హీనా జోడికి స్వర్ణం భారత్‌లో తొలిసారి (న్యూఢిల్లీ) జరుగుతున్నఅంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య-ISSF ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన జీతూ రాయ్-హీనా సిద్ధూ జోడి స్వర్ణం గెలుచుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో జీతూ రాయ్-హీనా సిద్ధూ ద్వయం జపాన్‌కు చెందిన యుకారి కొనిషి-తొమొయుకి మత్సుదా జోడీపై గెలిచింది.
పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో అంకుర్ మిట్టల్ రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకోగా జేమ్స్ విలెట్ (ఆస్ట్రేలియా) 75 పాయింట్లతో (ప్రపంచ రికార్డు) స్వర్ణ పతకాన్ని గెలిచాడు. జేమ్స్ డీడ్మన్ (బ్రిటన్-56 పాయింట్లు) కాంస్య పతకాన్ని నెగ్గాడు.
భారత షూటర్ పూజా ఘాట్కర్ కాంస్యం గెలుచుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మహారాష్ట్రకు చెందిన పూజా మూడో స్థానంలో నిలిచి పతకాన్ని దక్కించుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో చైనా షూటర్ బుహాన్ సాంగ్ పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు.
2020 టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టనున్న డబుల్స్ ఈవెంట్‌ను ప్రపంచ కప్‌లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు.
అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో హుస్సాముద్దీన్‌కు రజతం 68వ స్ట్ట్రాన్‌జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్ రజత పతకం సాధించాడు. బల్గేరియాలోని సోఫియాలో ఫిబ్రవరి 27న ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో హుస్సాముద్దీన్ 56 కేజీల విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. ఉక్రెయిన్‌కు చెందిన మికోలా బుత్సెంకో స్వర్ణం గెలుపొందాడు. ఇదే టోర్నీలో భారత్‌కు చెందిన అమిత్ ఫంగల్ పురుషుల 49 కేజీల విభాగంలో, మీనా కుమారి మహిళల 54 కేజీ కేటగిరీలో కాంస్య పతకాలు సాధించారు.
బీడబ్ల్యూఎఫ్‌లో ఒలింపిక్ కమిటీ ప్రతినిధిగా సైనా భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య-BWFలో ఒలింపిక్ కమిటీ ప్రతినిధిగా వ్యవహరించనుంది. ఈ మేరకు ఆ సంస్థ ఫిబ్రవరి 26న ఓ ప్రకటన విడుదల చేసింది. 2016లో రియో ఒలింపిక్స్ తర్వాత అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలోని అథ్లెట్స్ కమిషన్స్ సభ్యురాలిగా సైనా నియమితులయ్యారు.
జోవిల్‌ఫ్రెడ్‌కు ఓపెన్ 13 టెన్నిస్ టైటిల్ఓపెన్ 13 టెన్నిస్ టైటిల్‌ను ప్రాన్స్ ఆటగాడు జోవిల్ ఫ్రెడ్ సొంగా మరోసారి సొంతం చేసుకున్నాడు. ఫిబ్రవరి 27న జరిగిన ఫైనల్స్‌లో లుకాస్ పోలీపై 6-4, 6-4తో గెలుపొందాడు. 2009, 2013లో సొంగా ఈ టైటిల్‌ను దక్కించుకున్నాడు. అతడి కెరీర్‌లో ఇది 14వ టైటిల్.
ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో అవార్డులు-2017 ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ espncricinfo 2017 ఉత్తమ క్రికెటర్స్ అవార్డులను ఫిబ్రవరి 27న ప్రకటించింది. 2016లో ఆటగాళ్ల ప్రతిభ ఆధారంగా వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రేయర్స్‌ను నిర్ణయించింది. ఈ జాబితాలో చోటు సంపాదించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు. 2016లో భారత్ ఆడిన 12 టెస్టులో తొమ్మిందింటిలో విజయం సాధించినందుకు గాను కోహ్లిని ఈ అవార్డుకు నామినేట్ చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది.
అవార్డు గ్రహీతలు
మహిళల విభాగంలో అవార్డులు
లారెస్ ఉత్తమ క్రీడాకారులుగా బోల్ట్, బైల్స్ప్రముఖ అథ్లెట్లు ఉసేన్ బోల్ట్, సిమోన్ బైల్స్‌లు లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు-2017కు ఎంపికయ్యారు. ఫిబ్రవరి 15న మొనాకాలో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవంలో జమైకాకు చెందిన ఉసేన్ బోల్ట్ స్పోర్ట్స్‌మెన్ ఆఫ్ ద ఇయర్, ఆస్ట్రేలియా జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణి సిమోన్ బైల్స్ స్పోర్‌ట్స ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు అందుకున్నారు. కమ్ బ్యాక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అమెరికా దిగ్గజ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్‌ని వరించింది. రియో ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శనకుగాను వీరు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డులను ఆస్కార్ ఆఫ్ స్పోర్ట్స్‌గా పరిగణిస్తారు.
అవార్డుల జాబితా
అంతర్జాతీయ క్రికెట్‌కు అఫ్రిది గుడ్ బై:
పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది ఫిబ్రవరి 19న అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. 1996లో కెన్యాపై అరంగ్రేటం చేసిన అఫ్రిది 27 టెస్టులు, 398 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 1996లో శ్రీలంకపై 37 బంతుల్లో శతకం చేసి అత్యధిక వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ రికార్డును తర్వాతి కాలంలో అండర్సన్, ఏబీ డివిలియర్స్ అధిగమించారు.
ఆఫ్రిది కెరీర్
ఈస్ట్‌జోన్‌కు జాతీయ టీ20 క్రికెట్ టోర్నమెంట్ టైటిల్ఇంటర్ జోనల్ ఫార్మాట్‌లో తొలిసారి జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జాతీయ టీ20 క్రికెట్ టైటిల్‌ను ఈస్ట్‌జోన్ గెలుచుకుంది. ముంబైలో ఫిబ్రవరి 18న జరిగిన ఫైనల్లో వెస్ట్‌జోన్‌ను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది.
మహిళల వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించిన భారత్
భారత మహిళల క్రికెట్ జట్టు 2017లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 17న కొలంబోలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది.
ఇంగ్లండ్‌లో జూన్ 24 నుంచి జూలై 23 వరకూ మహిళల వన్డే ప్రపంచ కప్ జరుగుతుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లు టోర్నీకి ముందే నేరుగా అర్హత సాధించాయి.
ఐపీఎల్ పదో సీజన్ వేలం
ఇండియన్ ప్రీమియర్ లీగ్-IPL పదో సీజన్(IPL-2017) వేలం ఫిబ్రవరి 20న బెంగళూరులో జరిగింది. మొత్తం 357 మంది ఆటగాళ్లు వేలం జాబితాలో ఉండగా కేవలం 66 మందిని వివిధ జట్లు కొనుగోలు చేశాయి. పుణే సూపర్ జెయింట్స్ జట్టు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను రికార్డు స్థాయిలో రూ.14.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకూ జరిగిన ఐపీఎల్ వేలంలో ఇది రెండో అత్యధిక మొత్తం. గతంలో ఢిల్లీ యువరాజ్ సింగ్‌ను రూ.16 కోట్లకు దక్కించుకుంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఉన్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ అందరికన్నా ఎక్కువ రూ.15 కోట్లు అందుకుంటున్నాడు.
పదో సీజన్ వేలం
ప్యూమాతో కోహ్లీ రూ. 110 కోట్ల ఒప్పందంభారత కెప్టెన్ విరాట్ కోహ్లీ జర్మనీకి చెందిన ప్యూమా సంస్థతో భారీ ఒప్పందం చేసుకున్నాడు. ఎనిమిదేళ్ల కాలానికి చేసుకున్న ఈ ఒప్పందం విలువ రూ.110 కోట్లు. తద్వారా రూ. వంద కోట్లకు మించి ఒప్పందం చేసుకున్న తొలి భారత క్రీడాకారుడిగా కోహ్లీ గుర్తింపు పొందాడు. జమైకా స్ప్రింటర్స్ ఉసేన్ బోల్ట్, అసఫా పావెల్, ఫుట్‌బాల్ క్రీడాకారులు హెన్రీ, అలివర్ గిరౌడ్‌లు ఇప్పటికే ప్యూమా సంస్థకు గ్లోబల్ అంబాసిడర్లుగా ఉన్నారు.
ఐసీసీ వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ విజేత భారత్
శ్రీలంకలో జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ క్యాలిఫైయింగ్ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. ఫిబ్రవరి 21న ముగిసిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించింది.
ఈ టోర్నీలో మొత్తం పది జట్లు పాల్గొనగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్ జట్లు 2017 జూన్‌లో జరిగే ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌కు అర్హత సాధించాయి.
కొహ్లీ డబుల్ సెంచరీల రికార్డు హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కొత్త రికార్డులు సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగులు సాధించడం ద్వారా వరుసగా నాలుగు టెస్టు సిరీస్‌ల్లో డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇంతకు ముందు ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్, భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మాత్రమే వరుసగా మూడు సిరీస్‌లలో డబుల్ సెంచరీలు చేశారు. అలాగే సొంతగడ్డపై ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఘనత కూడా కోహ్లి (1,168) సొంతం చేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు సెహ్వాగ్ (1,105) పేరిట ఉంది.
ఈ మ్యాచ్‌లో 687 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భారత్ వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో 600కుపైగా పరుగులు చేసిన తొలి జట్టుగా గుర్తింపు పొందింది. ముంబై, చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టుల్లో భారత్ 600కు పైగా స్కోరు సాధించింది.
డబుల్ సెంచరీలు
అంధుల టీ-20 ప్రపంచకప్ విజేత భారత్అంధుల టీ-20 ప్రపంచకప్ టైటిల్‌ను భారత్ రెండోసారి గెలుచుకుంది. ఫిబ్రవరి 12న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్స్‌లో పాకిస్థాన్‌పై తొమ్మది వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్ ప్రకాశ్ 99, ఆంధ్ర ఆటగాడు అజయ్ కుమార్ రెడ్డి 43 పరుగులు సాధించారు. టైటిల్‌తో పాటు భారత్‌కు రూ. 3లక్షల నగదు బహుమతి లభించగా ప్రకాశ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది ఫైనల్’ పురస్కారం దక్కింది. 2012లో జరిగిన అంధుల టీ-20 మొదటి ప్రపంచ కప్‌లోనూ పాకిస్థాన్‌ను ఓడించి భారత్ చాంపియన్‌గా నిలిచింది.
టెస్టుల్లో కోహ్లీ కెప్టెన్సీ రికార్డు హైదరాబాద్ వేదికగా ఫిబ్రవరి 9-13 వరకూ బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 208 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా టీమిండియా వరసగా ఆరో సీరీస్‌ని గెలుచుకుంది. అలాగే విరాట్ కోహ్లీ నాయకత్వంలో వరుసగా 19 టెస్టు విజయాలు నమోదు చేసిన భారత జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో సునీల్ గవాస్కర్ కెప్టెన్సీలో భారత్ వరుసగా 18 టెస్టుల్లో విజయం సాధించింది.
కుశ్ భగత్‌కు కాండిడేట్ మాస్టర్ టైటిల్ప్రపంచ చెస్ సమాఖ్య- ఫిడేకు చెందిన ప్రతిష్టాత్మక కాండిడేట్ మాస్టర్ టైటిల్-2017ను భారత్‌కు చెందిన కుశ్ భగత్ దక్కించుకున్నాడు. గత 6 నెలల్లో అంతర్జాతీయ చెస్ సర్యూట్‌లో సాధించిన విజయాలకు గుర్తింపుగా కుశ్‌కు ఈ టైటిల్ దక్కింది. తొలుత మహారాష్ట్ర అండర్-7 రాష్ట్ర చాంపియన్‌గా నిలిచిన కుశ్ అనంతరం రష్యాలోని సోచి నగరంలో జరిగిన వరల్డ్ స్కూల్స్ అండర్-7 బ్లిట్జ్ చాంపియన్‌గా అవతరించాడు. యూఏఈలో తొలిసారిగా జరిగిన వెస్టర్న్ యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో మూడు బంగారు పతకాలు సాధించాడు.
81వ జాతీయ బ్యాడ్మింటిన్ చాంపియన్‌షిప్ 81వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో సౌరభ్ వర్మ, మహిళల విభాగంలో రితూపర్ణ దాస్ టైటిల్స్ గెలుచుకున్నారు. ఫిబ్రవరి 7న జరిగిన ఫైనల్స్‌లో సౌరభ్ లక్ష్య సేన్‌ను ఓడించిగా, తెలంగాణకు చెందిన రితూపర్ణ దాస్ రేష్మా కార్తీక్‌పై విజయం సాధించింది. పుురుషుల డబుల్స్‌లో ఏపీకి చెందిన సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయం నందగోపాల్-సాన్యమ్ శుక్లా జంటపై గెలిచింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో తెలంగాణకు చెందిన కె.మనీషాతో జతకట్టిన సాత్విక్ ఫైనల్లో వెంకట్ గౌరవ్ ప్రసాద్-జూహీ దేవాంగన్ పై విజయం సాధించాడు.
జాతీయ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్జాతీయ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను శరత్ కమల్, మహిళల సింగిల్స్ టైటిల్‌ను మధురిక పాట్కర్ గెలుచుకున్నారు. మనేసర్ (హరియాణా)లో ఫిబ్రవరి 5న జరిగిన ఫైనల్లో సౌమ్యజిత్ ఘోశ్‌పై శరత్ కమల్ గెలుపొందగా, మహిళల సింగిల్స్ ఫైనల్లో మధురిక పాట్కర్ ఆరుసార్లు చాంపియన్ పౌలోమి ఘాటక్‌ను ఓడించింది. తాజా టైటిల్‌తో కలిపి శరత్ ఏడుసార్లు ఈ టైటిల్‌ను గెలుచుకున్నాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను సౌమ్యజిత్ ఘోశ్, జుబిన్ కుమార్‌ల జోడి గెలుచుకుంది. వీరు ఫైనల్లో సుస్మిత్ శ్రీరామ్, అనిర్బన్ ఘోశ్‌లను ఓడించారు. మహిళల డబుల్స్ టైటిల్‌ను అనిందితా చక్రవర్తి, సుతిత్రా ముఖర్జీ గెలుచుకున్నారు. వీరు ఫైనల్లో పౌలోమి ఘాటక్, మౌమాదాస్‌లను ఓడించారు.
ఆసియా జూనియర్ స్క్వాష్ టోర్నీ విజేత భారత్ చైనాలోని హాంకాంగ్‌లో జరిగిన ఆసియా జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత్ విజేతగా నిలిచింది. ఫిబ్రవరి 5న హాంగ్‌కాంగ్‌లో జరిగిన ఫైనల్లో భారత్ 2-0 తేడాతో మలేషియాను ఓడించింది. తొలుత జరిగిన మ్యాచ్‌లో భారత అగ్రశ్రేణి ప్లేయర్ వెళ్లవన్ సెంథిల్ కుమార్ 12-10, 11-0, 11-2తో ఓమ్ సాయ్ హున్‌పై విజయం సాధించాడు. అనంతరం జరిగిన మరో సింగిల్స్‌లో అభయ్ సింగ్ 10-12, 7-11, 11-5, 14-12, 11-6తో డారెన్ రాహుల్‌పై గెలుపొందాడు.
ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్సీకి కుక్ గుడ్ బై ఇంగ్లండ్ క్రికెట్ టెస్టు జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి అలిస్టెర్ కుక్ ఫిబ్రవరి 6న తప్పుకున్నాడు. 59 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన కుక్ మొత్తం 140 టెస్టులు ఆడి 11,057 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 53 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కుక్ 2013 ఐసీసీ ప్రపంచ టెస్ట్ కెప్టన్‌గానూ ఎంపికయ్యాడు.
అన్ని ఫార్మాట్లలో డీఆర్‌ఎస్ కు ఐసీసీ ఆమోదం టెస్టులు, వన్డేల్లో కొనసాగుతున్న అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి-DRS ని ఇకపై అన్ని ఫార్మాట్లలో అమలు చేయాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి-ICC నిర్ణయించింది. దుబాయ్‌లో ఫిబ్రవరి 4 నుంచి 6 వరకూ రెండు రోజుల పాటు జరిగిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. 2017 అక్టోబర్ నుంచి ఇది అమల్లోకి రానుంది.
టీ-20లో మోహిత్ ఆహ్లావత్ ట్రిపుల్ సెంచరీ ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల మోహిత్ ఆహ్లావత్ టీ-20లో ట్రిపుల్ సెంచరీ సాధించి అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఫిబ్రవరి 7న న్యూఢిల్లీలోని లిలితా పార్క్ మైదానంలో స్థానిక టోర్నీలో భాగంగా మావి ఎలెవన్, ఫ్రెండ్స్ ఎలెవన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మావి ఎలెవన్ జట్టుకి ప్రాతినిధ్యం వహించిన మోహిత్ 72 బంతుల్లో 300 పరుగులు సాధించాడు. ఇందులో 39 సిక్సర్లు, 14 ఫోర్లు ఉన్నాయి. గతంలో ఇంగ్లండ్‌లోని లాంకషైర్ సాడిల్‌వర్త్ లీగ్‌లో శ్రీలంక ఆటగాడు ధనుక పతిరణ 72 బంతుల్లో అత్యధికంగా 277 పరుగులు చేశాడు.

కెప్టెన్ ఆఫ్ ది ఇయర్
|
- విరాట్ కోహ్లీ(భారత్)
|
ఉత్తమ టెస్ట్ బ్యాటింగ్
|
- బెన్ స్టోక్స్ - ఇంగ్లండ్ (198 బంతుల్లో 258)
|
ఉత్తమ టెస్ట్ బౌలింగ్
|
- స్టువర్ట్ బ్రాడ్ - ఇంగ్లండ్
|
ఉత్తమ వన్డే బ్యాటింగ్
|
- క్వింటన్ డికాక్ - దక్షిణాఫ్రికా (178)
|
ఉత్తమ వన్డే బౌలింగ్
|
- సునీల్ నరైన్ - వెస్టిండీస్ (6/27)
|
ఉత్తమ టీ20 బ్యాటింగ్
|
- కార్లోస్ బ్రాత్‌వైట్ - వెస్టిండీస్
|
ఉత్తమ టీ20 బౌలింగ్
|
- ఎమ్ రహ్మాన్ - బంగ్లాదేశ్ (5/22)
|
ఉత్తమ ఆరంగేట్ర ఆటగాడు
|
- మెహ్‌దీ హసన్ మిరాజ్ - బంగ్లాదేశ్
|
మహిళల విభాగంలో అవార్డులు
ఉత్తమ బ్యాట్స్‌విమెన్
|
- హేలీ విలియమ్స్-వెస్టిండీస్
|
ఉత్తమ బౌలర్
|
- లీ కాస్పెరెక్-న్యూజిలాండ్
|
లారెస్ ఉత్తమ క్రీడాకారులుగా బోల్ట్, బైల్స్ప్రముఖ అథ్లెట్లు ఉసేన్ బోల్ట్, సిమోన్ బైల్స్‌లు లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు-2017కు ఎంపికయ్యారు. ఫిబ్రవరి 15న మొనాకాలో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవంలో జమైకాకు చెందిన ఉసేన్ బోల్ట్ స్పోర్ట్స్‌మెన్ ఆఫ్ ద ఇయర్, ఆస్ట్రేలియా జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణి సిమోన్ బైల్స్ స్పోర్‌ట్స ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు అందుకున్నారు. కమ్ బ్యాక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అమెరికా దిగ్గజ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్‌ని వరించింది. రియో ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శనకుగాను వీరు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డులను ఆస్కార్ ఆఫ్ స్పోర్ట్స్‌గా పరిగణిస్తారు.
అవార్డుల జాబితా
- స్పోర్ట్స్‌మెన్ ఆఫ్ ద ఇయర్ : ఉసేన్ బోల్ట్
- స్పోర్ట్స్‌ఉమెన్ ఆఫ్ ద ఇయర్ : సిమోన్ బైల్స్
- కమ్ బ్యాక్ ఆఫ్ ద ఇయర్ : మైఖేల్ ఫెల్ప్స్
- బ్రేక్‌త్రూ ఆఫ్ ద ఇయర్ : నికో రోస్‌బర్గ్
- టీం ఆఫ్ ద ఇయర్ : చికాగో కబ్స్
అంతర్జాతీయ క్రికెట్‌కు అఫ్రిది గుడ్ బై:
పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది ఫిబ్రవరి 19న అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. 1996లో కెన్యాపై అరంగ్రేటం చేసిన అఫ్రిది 27 టెస్టులు, 398 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 1996లో శ్రీలంకపై 37 బంతుల్లో శతకం చేసి అత్యధిక వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ రికార్డును తర్వాతి కాలంలో అండర్సన్, ఏబీ డివిలియర్స్ అధిగమించారు.
ఆఫ్రిది కెరీర్
మ్యాచ్‌లు | సంఖ్య | పరుగులు | శతకాలు | వికెట్లు |
టెస్టులు | 27 | 1,176 | 5 | 48 |
వన్డేలు | 398 | 8,064 | 6 | 395 |
టి20లు | 98 | 1,405 | - | 97 |
ఈస్ట్‌జోన్‌కు జాతీయ టీ20 క్రికెట్ టోర్నమెంట్ టైటిల్ఇంటర్ జోనల్ ఫార్మాట్‌లో తొలిసారి జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జాతీయ టీ20 క్రికెట్ టైటిల్‌ను ఈస్ట్‌జోన్ గెలుచుకుంది. ముంబైలో ఫిబ్రవరి 18న జరిగిన ఫైనల్లో వెస్ట్‌జోన్‌ను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది.
మహిళల వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించిన భారత్
భారత మహిళల క్రికెట్ జట్టు 2017లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 17న కొలంబోలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది.
ఇంగ్లండ్‌లో జూన్ 24 నుంచి జూలై 23 వరకూ మహిళల వన్డే ప్రపంచ కప్ జరుగుతుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లు టోర్నీకి ముందే నేరుగా అర్హత సాధించాయి.
ఐపీఎల్ పదో సీజన్ వేలం
ఇండియన్ ప్రీమియర్ లీగ్-IPL పదో సీజన్(IPL-2017) వేలం ఫిబ్రవరి 20న బెంగళూరులో జరిగింది. మొత్తం 357 మంది ఆటగాళ్లు వేలం జాబితాలో ఉండగా కేవలం 66 మందిని వివిధ జట్లు కొనుగోలు చేశాయి. పుణే సూపర్ జెయింట్స్ జట్టు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను రికార్డు స్థాయిలో రూ.14.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకూ జరిగిన ఐపీఎల్ వేలంలో ఇది రెండో అత్యధిక మొత్తం. గతంలో ఢిల్లీ యువరాజ్ సింగ్‌ను రూ.16 కోట్లకు దక్కించుకుంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఉన్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ అందరికన్నా ఎక్కువ రూ.15 కోట్లు అందుకుంటున్నాడు.
పదో సీజన్ వేలం
ఆటగాడు | కొనుగోలు చేసిన జట్టు | విలువ |
బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్) | పుణె | రూ.14.50 కోట్లు |
టైమల్ మిల్స్(ఇంగ్లండ్) | బెంగళూరు | రూ.12 కోట్లు |
రబడ (దక్షిణాఫ్రికా) | ఢిల్లీ | రూ.5 కోట్లు |
బౌల్ట్(న్యూజిలాండ్) | కోల్‌కతా | రూ.5 కోట్లు |
కమిన్‌స(ఆస్ట్రేలియా) | ఢిల్లీ | రూ.4.5 కోట్లు |
క్రిస్ వోక్స్(ఇంగ్లండ్) | కోల్‌కతా | రూ.4.2 కోట్లు |
రషీద్ ఖాన్(ఆఫ్గనిస్తాన్) | హైదరాబాద్ | రూ.4 కోట్లు |
సిరాజ్ (భారత్) | హైదరాబాద్ | రూ.2.6 కోట్లు |
ప్యూమాతో కోహ్లీ రూ. 110 కోట్ల ఒప్పందంభారత కెప్టెన్ విరాట్ కోహ్లీ జర్మనీకి చెందిన ప్యూమా సంస్థతో భారీ ఒప్పందం చేసుకున్నాడు. ఎనిమిదేళ్ల కాలానికి చేసుకున్న ఈ ఒప్పందం విలువ రూ.110 కోట్లు. తద్వారా రూ. వంద కోట్లకు మించి ఒప్పందం చేసుకున్న తొలి భారత క్రీడాకారుడిగా కోహ్లీ గుర్తింపు పొందాడు. జమైకా స్ప్రింటర్స్ ఉసేన్ బోల్ట్, అసఫా పావెల్, ఫుట్‌బాల్ క్రీడాకారులు హెన్రీ, అలివర్ గిరౌడ్‌లు ఇప్పటికే ప్యూమా సంస్థకు గ్లోబల్ అంబాసిడర్లుగా ఉన్నారు.
ఐసీసీ వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ విజేత భారత్
శ్రీలంకలో జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ క్యాలిఫైయింగ్ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. ఫిబ్రవరి 21న ముగిసిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించింది.
ఈ టోర్నీలో మొత్తం పది జట్లు పాల్గొనగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్ జట్లు 2017 జూన్‌లో జరిగే ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌కు అర్హత సాధించాయి.
కొహ్లీ డబుల్ సెంచరీల రికార్డు హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కొత్త రికార్డులు సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగులు సాధించడం ద్వారా వరుసగా నాలుగు టెస్టు సిరీస్‌ల్లో డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇంతకు ముందు ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్, భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మాత్రమే వరుసగా మూడు సిరీస్‌లలో డబుల్ సెంచరీలు చేశారు. అలాగే సొంతగడ్డపై ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఘనత కూడా కోహ్లి (1,168) సొంతం చేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు సెహ్వాగ్ (1,105) పేరిట ఉంది.
ఈ మ్యాచ్‌లో 687 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భారత్ వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో 600కుపైగా పరుగులు చేసిన తొలి జట్టుగా గుర్తింపు పొందింది. ముంబై, చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టుల్లో భారత్ 600కు పైగా స్కోరు సాధించింది.
డబుల్ సెంచరీలు
- 200, వెస్టిండీస్‌పై అంటిగ్వాలో-జూలై, 2016
- 211, న్యూజిలాండ్‌పై ఇండోర్‌లో, అక్టోబర్- 2016
- 235, ఇంగ్లండ్‌పై ముంబైలో, డిసెంబర్- 2016
- 204, బంగ్లాదేశ్‌పై హైదరాబాద్‌లో, ఫిబ్రవరి-2017
అంధుల టీ-20 ప్రపంచకప్ విజేత భారత్అంధుల టీ-20 ప్రపంచకప్ టైటిల్‌ను భారత్ రెండోసారి గెలుచుకుంది. ఫిబ్రవరి 12న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్స్‌లో పాకిస్థాన్‌పై తొమ్మది వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్ ప్రకాశ్ 99, ఆంధ్ర ఆటగాడు అజయ్ కుమార్ రెడ్డి 43 పరుగులు సాధించారు. టైటిల్‌తో పాటు భారత్‌కు రూ. 3లక్షల నగదు బహుమతి లభించగా ప్రకాశ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది ఫైనల్’ పురస్కారం దక్కింది. 2012లో జరిగిన అంధుల టీ-20 మొదటి ప్రపంచ కప్‌లోనూ పాకిస్థాన్‌ను ఓడించి భారత్ చాంపియన్‌గా నిలిచింది.
టెస్టుల్లో కోహ్లీ కెప్టెన్సీ రికార్డు హైదరాబాద్ వేదికగా ఫిబ్రవరి 9-13 వరకూ బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 208 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా టీమిండియా వరసగా ఆరో సీరీస్‌ని గెలుచుకుంది. అలాగే విరాట్ కోహ్లీ నాయకత్వంలో వరుసగా 19 టెస్టు విజయాలు నమోదు చేసిన భారత జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో సునీల్ గవాస్కర్ కెప్టెన్సీలో భారత్ వరుసగా 18 టెస్టుల్లో విజయం సాధించింది.
కుశ్ భగత్‌కు కాండిడేట్ మాస్టర్ టైటిల్ప్రపంచ చెస్ సమాఖ్య- ఫిడేకు చెందిన ప్రతిష్టాత్మక కాండిడేట్ మాస్టర్ టైటిల్-2017ను భారత్‌కు చెందిన కుశ్ భగత్ దక్కించుకున్నాడు. గత 6 నెలల్లో అంతర్జాతీయ చెస్ సర్యూట్‌లో సాధించిన విజయాలకు గుర్తింపుగా కుశ్‌కు ఈ టైటిల్ దక్కింది. తొలుత మహారాష్ట్ర అండర్-7 రాష్ట్ర చాంపియన్‌గా నిలిచిన కుశ్ అనంతరం రష్యాలోని సోచి నగరంలో జరిగిన వరల్డ్ స్కూల్స్ అండర్-7 బ్లిట్జ్ చాంపియన్‌గా అవతరించాడు. యూఏఈలో తొలిసారిగా జరిగిన వెస్టర్న్ యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో మూడు బంగారు పతకాలు సాధించాడు.
81వ జాతీయ బ్యాడ్మింటిన్ చాంపియన్‌షిప్ 81వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో సౌరభ్ వర్మ, మహిళల విభాగంలో రితూపర్ణ దాస్ టైటిల్స్ గెలుచుకున్నారు. ఫిబ్రవరి 7న జరిగిన ఫైనల్స్‌లో సౌరభ్ లక్ష్య సేన్‌ను ఓడించిగా, తెలంగాణకు చెందిన రితూపర్ణ దాస్ రేష్మా కార్తీక్‌పై విజయం సాధించింది. పుురుషుల డబుల్స్‌లో ఏపీకి చెందిన సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయం నందగోపాల్-సాన్యమ్ శుక్లా జంటపై గెలిచింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో తెలంగాణకు చెందిన కె.మనీషాతో జతకట్టిన సాత్విక్ ఫైనల్లో వెంకట్ గౌరవ్ ప్రసాద్-జూహీ దేవాంగన్ పై విజయం సాధించాడు.
జాతీయ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్జాతీయ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను శరత్ కమల్, మహిళల సింగిల్స్ టైటిల్‌ను మధురిక పాట్కర్ గెలుచుకున్నారు. మనేసర్ (హరియాణా)లో ఫిబ్రవరి 5న జరిగిన ఫైనల్లో సౌమ్యజిత్ ఘోశ్‌పై శరత్ కమల్ గెలుపొందగా, మహిళల సింగిల్స్ ఫైనల్లో మధురిక పాట్కర్ ఆరుసార్లు చాంపియన్ పౌలోమి ఘాటక్‌ను ఓడించింది. తాజా టైటిల్‌తో కలిపి శరత్ ఏడుసార్లు ఈ టైటిల్‌ను గెలుచుకున్నాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను సౌమ్యజిత్ ఘోశ్, జుబిన్ కుమార్‌ల జోడి గెలుచుకుంది. వీరు ఫైనల్లో సుస్మిత్ శ్రీరామ్, అనిర్బన్ ఘోశ్‌లను ఓడించారు. మహిళల డబుల్స్ టైటిల్‌ను అనిందితా చక్రవర్తి, సుతిత్రా ముఖర్జీ గెలుచుకున్నారు. వీరు ఫైనల్లో పౌలోమి ఘాటక్, మౌమాదాస్‌లను ఓడించారు.
ఆసియా జూనియర్ స్క్వాష్ టోర్నీ విజేత భారత్ చైనాలోని హాంకాంగ్‌లో జరిగిన ఆసియా జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత్ విజేతగా నిలిచింది. ఫిబ్రవరి 5న హాంగ్‌కాంగ్‌లో జరిగిన ఫైనల్లో భారత్ 2-0 తేడాతో మలేషియాను ఓడించింది. తొలుత జరిగిన మ్యాచ్‌లో భారత అగ్రశ్రేణి ప్లేయర్ వెళ్లవన్ సెంథిల్ కుమార్ 12-10, 11-0, 11-2తో ఓమ్ సాయ్ హున్‌పై విజయం సాధించాడు. అనంతరం జరిగిన మరో సింగిల్స్‌లో అభయ్ సింగ్ 10-12, 7-11, 11-5, 14-12, 11-6తో డారెన్ రాహుల్‌పై గెలుపొందాడు.
ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్సీకి కుక్ గుడ్ బై ఇంగ్లండ్ క్రికెట్ టెస్టు జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి అలిస్టెర్ కుక్ ఫిబ్రవరి 6న తప్పుకున్నాడు. 59 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన కుక్ మొత్తం 140 టెస్టులు ఆడి 11,057 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 53 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కుక్ 2013 ఐసీసీ ప్రపంచ టెస్ట్ కెప్టన్‌గానూ ఎంపికయ్యాడు.
అన్ని ఫార్మాట్లలో డీఆర్‌ఎస్ కు ఐసీసీ ఆమోదం టెస్టులు, వన్డేల్లో కొనసాగుతున్న అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి-DRS ని ఇకపై అన్ని ఫార్మాట్లలో అమలు చేయాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి-ICC నిర్ణయించింది. దుబాయ్‌లో ఫిబ్రవరి 4 నుంచి 6 వరకూ రెండు రోజుల పాటు జరిగిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. 2017 అక్టోబర్ నుంచి ఇది అమల్లోకి రానుంది.
టీ-20లో మోహిత్ ఆహ్లావత్ ట్రిపుల్ సెంచరీ ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల మోహిత్ ఆహ్లావత్ టీ-20లో ట్రిపుల్ సెంచరీ సాధించి అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఫిబ్రవరి 7న న్యూఢిల్లీలోని లిలితా పార్క్ మైదానంలో స్థానిక టోర్నీలో భాగంగా మావి ఎలెవన్, ఫ్రెండ్స్ ఎలెవన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మావి ఎలెవన్ జట్టుకి ప్రాతినిధ్యం వహించిన మోహిత్ 72 బంతుల్లో 300 పరుగులు సాధించాడు. ఇందులో 39 సిక్సర్లు, 14 ఫోర్లు ఉన్నాయి. గతంలో ఇంగ్లండ్‌లోని లాంకషైర్ సాడిల్‌వర్త్ లీగ్‌లో శ్రీలంక ఆటగాడు ధనుక పతిరణ 72 బంతుల్లో అత్యధికంగా 277 పరుగులు చేశాడు.
No comments:
Post a Comment