AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు జూలై 2012

వార్తల్లో వ్యక్తులు జూలై 2012
వందనాశివకు ఫుకువోకా అవార్డుప్రముఖ పర్యావరణ ఉద్యమకర్త వందనాశివకు జపాన్‌కు చెందిన ప్రతిష్టాత్మక ఫుకువోకా అవార్డును జూలై 22న ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణకు ఆమె చేసిన కృషికిగాను ఈ పురస్కారం ద క్కింది. గతంలో ఈ అవార్డు భారత్‌కు చెందిన పండిట్ రవిశంకర్, పద్మా సుబ్రహ్మణ్యం, రోమిల్లా థాపర్, ఆశిష్ నందిలకు లభించింది. ఆసియాలో కళలు, సంస్కృతి, విద్య, తదితర అంశాల్లో కృషి చేసిన వారికి జపాన్‌లోని ఫుకువోకా నగర ప్రభుత్వం ఈ అవార్డు ప్రదానం చేస్తుంది.

కొత్త రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీప్రణబ్ ముఖర్జీ 13వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. మాజీ రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ రెండో పదవి కాలాన్ని లెక్కలోకి తీసుకుంటే ప్రణబ్ ముఖర్జీ భారత 14వ రాష్ట్రపతి. జూలై 19న రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో మొత్తం 4,659 ఓట్లు పోలయ్యాయి, వీటి విలువ 10,29,750. ఇందులో 4578 ఓట్లు చెల్లగా, 81 ఓట్లు చెల్లనివి ఉన్నాయి. యూపీఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి 3095 ఓట్లు వచ్చాయి. వీటి విలువ 7,13,763 (69.3శాతం). కాగా బీజేపీ, బీజేడీ, ఏఐఏడీఎంకే తదితర పార్టీలు మద్దతు తెలిపిన పి.ఎ. సంగ్మాకు 1483 ఓట్లు వచ్చాయి. వీటి విలువ 3,15,987.
పశ్చిమ బెంగాల్‌లోని బిర్చం జిల్లా మిరాట్ గ్రామంలో 1935 డిసెంబర్ 11న ప్రణబ్ ముఖర్జీ జన్మించారు. 1969లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తర్వాత 1975, 81, 93, 99లో రాజ్యసభకు తిరిగి ఎన్నికయ్యారు. 2004లో పశ్చిమ బెంగాల్‌లోని జంగీపూర్ నియెజకవర్గం నుంచి లోక్‌సభకు తొలిసారి ఎన్నికయ్యారు. ఆయన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా, ఆర్థిక, రక్షణ, విదేశాంగ, వాణిజ్య శాఖల మంత్రిగా పనిచేశారు. 1997లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపికయ్యారు. కేంద్రప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో ఆయనను సత్కరించింది.
సోషలిస్టు నాయకురాలు మృణాల్ గోరే మృతిమాజీ ఎంపీ, సీనియర్ సోషలిస్టు నాయకురాలు మృణాల్‌గోరే(84) ముంబయిలో జూలై 17న మరణించారు. మహారాష్ట్ర చివరితరం సోషలిస్టు నాయకుల్లో ఆమె ఒకరు. 1997లో జనతాపార్టీ అభ్యర్థిగా మృణాల్ గోరే పార్లమెంటుకు ఎన్నికయ్యారు.
నటుడు రాజేష్ ఖన్నా మృతిప్రముఖ హిందీ చలన చిత్ర నటుడు, మాజీ ఎంపీ రాజేష్ ఖన్నా(69) ముంబయిలో జూలై 18న మరణించారు. ఆయన 163 చిత్రాల్లో నటించారు. తొలి చిత్రం ‘ఆఖరీ ఖత్’. రొమాంటిక్ హీరోగా, తొలి సూపర్‌స్టార్‌గా వెలుగొందిన ఖన్నా వరుసగా 15 హిట్ చిత్రాలను అందించిన ఏకైక హీరోగా గుర్తింపు పొందారు. ఆరాధన, ఆనంద్, హాతీమేరీ సాతీ, అమర్ ప్రేమ, ఆవాజ్, చిత్రాలు ఆయనకు మంచి పేరుతెచ్చాయి. ఖన్నా 1992 నుంచి 1996 వరకు కాంగ్రెస్ ఎంపీగా పనిచేశారు.
ఇందిరాగాంధీ సలహాదారు పి.ఎన్ ధార్ మృతిప్రముఖ ఆర్థిక వేత్త 1970లో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి ప్రిన్సిపల్ సెక్రెటరీగా పనిచేసిన పృథ్వినాధ్ ధార్(94) న్యూఢిల్లీలో జూలై19న మరణించారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వ్యవస్థాపకుల్లో ధార్ ఒకరు.
కెప్టెన్ లక్ష్మి సెహగల్ మృతిస్వాతంత్య్ర సమరయోధురాలు కెప్టెన్ లక్ష్మి సెహగల్(98) జూలై 23న కాన్పూర్‌లో మరణించారు. ఆమె నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’(ఐఎన్‌ఏ)లో పని చేశారు. ఐఎన్‌ఏలో ‘రాణీ ఝూన్సీ’ రెజిమెంట్‌కు నాయకత్వం వహించారు. 1971లో సీపీఐ(ఎం) తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2002 రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి అబ్దుల్ కలాంపై ఓడిపోయారు.

No comments:

Post a Comment