AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday, 26 November 2017

వార్తల్లో వ్యక్తులు మార్చి 2014

వార్తల్లో వ్యక్తులు మార్చి 2014
రచయిత, పాత్రికేయుడు కుష్వంత్‌సింగ్ మృతి ప్రముఖ రచయిత, పాత్రికేయుడు కుష్వంత్‌సింగ్ (99) న్యూఢిల్లీలో మార్చి 20న మతి చెందారు. ఆయన 30 నవలలు రాశారు. ఇందులో స్వీయ కథ ట్రూత్, లవ్ అండ్ ఏ లిటిల్ మ్యాలీస్‌తో పాటు దసన్ సెట్ క్లబ్, కుష్వంత్ నామా, ద లెసన్స్ ఆఫ్ మై లైఫ్, ట్రై న్‌టు పాకిస్థాన్, విత్ మలైస్ టువార్డ్స్ వన్ అండ్ ఆల్, ఐ షల్ నాట్ హియర్ ద నైటింగేల్, ద కంపెనీ అండ్ ఉమెన్, ద మార్క్ ఆఫ్ విష్ణు అండ్ అదర్ స్టోరీస్, బ్లాక్ జాస్మిన్, పోట్రయిట్ ఆఫ్ ఎ లేడీ, వంటి అత్యంత ఆదరణ పొందిన రచనలు చేశారు. ఈయన 1915, ఫిబ్రవరి 2న జన్మించారు. 1947 తర్వాత విదేశీ సర్వీసుల్లో చేరారు. లండన్,పారిస్, ఒట్టావాలలో దౌత్యవేత్తగా పనిచేశారు. ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, హిందూస్థాన్ టైమ్స్, నేషనల్ హెరాల్డ్ లో సంపాదకుడిగా పనిచేశారు. యోజన పత్రిక (1951-53)కు ఆయన వ్యవస్థాపక సంపాదకుడుగా పనిచేశారు. ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో ఆయన రాజ్యసభ (1980 -1986)కు నియమితులయ్యారు. 1974లో పొందిన పద్మభూషణ్‌పురస్కారాన్ని స్వర్ణమందిరంపై సైనిక చర్యకు నిరసనగా 1984లో తిరస్కరించారు. 

ఈసీ ప్రచారకర్తగా అమీర్‌ఖాన్ 
బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రచార కర్తగా ఎంచుకుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేందుకు అమీర్‌సేవలను వినియోగించుకోనుంది. ముఖ్యంగా యువత ఓటు హక్కును వినియోగించుకునేలా చేయడమే ఈసీ చేపట్టిన కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే ఈసీ తరపున మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్, భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రచారకర్తలుగా సేవలందిస్తున్నారు. 

ఐ.ఎన్.ఎలో పనిచేసిన బాల ఎ చంద్రన్ మృతినేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐ.ఎన్.ఎ)కి చెందిన యూత్‌వింగ్ లో పనిచేసిన బాల ఎ చంద్రన్ (86) సింగపూర్‌లో మార్చి 20న మరణించారు. ఐ.ఎన్.ఎలో పనిచేసిన చివరి సభ్యుల్లో చంద్రన్ ఒకరు. కేరళకు చెందిన చంద్రన్ 1940లో ఏర్పాటు చేసిన ఐ.ఎన్.ఎ యూత్‌వింగ్ బాలక్ సేనలో పనిచేశారు.

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ చక్రవర్తి రాజీనామారిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ కె.సి.చక్రవర్తి మార్చి 20న వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. ఈ ఏడాది జూన్ 30న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈయన 2009, జూన్ 15న ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా చేరారు. మడేళ్ల పదవీ కాలం 2012లో ముగియగా మరో రెండేళ్లు పొడిగించారు.

కేరళ గవర్నర్‌గా షీలా దీక్షిత్ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కేరళ గవర్నర్‌గా మార్చి 5న నియమితులయ్యారు. కేరళ గవర్నర్‌గా ఉన్న నిఖిల్ కుమార్ లోక్‌సభ ఎన్నికల్లో బీహార్ నుంచి పోటీచేసేందుకు రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో షీలా దీక్షిత్‌ను రాష్ర్టపతి నియమించారు. షీలాదీక్షిత్ 1998 నుంచి 2013 వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

No comments:

Post a Comment