AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

క్రీడలు జూలై 2017

క్రీడలు జూలై 2017
జోర్డాన్ ఓపెన్ చాంప్ స్నేహిత్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) జూనియర్ సర్క్యూట్ జోర్డాన్ ఓపెన్ టీటీ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ సురవజ్జుల ఫిడేల్ రఫీక్ స్నేహిత్ విజేతగా నిలిచాడు. జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో జూలై 27న జరిగిన బాలుర సింగిల్స్ ఫైనల్లో స్నేహిత్ 4-1 (12-10, 7-11, 11-9, 11-4, 11-6)తో జీత్ చంద్ర (భారత్)పై గెలుపొందాడు. డబుల్స్‌లో భారత్‌కే చెందిన అనుక్రమ్ జైన్‌తో కలిసి రజతాన్ని గెలిచిన స్నేహిత్ ఒకరోజు వ్యవధిలోనే సింగిల్స్‌లో స్వర్ణాన్ని కై వసం చేసుకున్నాడు. కాగా స్నేహిత్ కెరీర్‌లో ఇదే తొలి అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జోర్డాన్ ఓపెన్ జూనియర్ చాంపియన్‌షిప్ 
ఎప్పుడు : జూలై 27
ఎవరు : విజేత సురవజ్జుల ఫిడేల్ రఫీక్ 
ఎక్కడ : అమ్మాన్, జోర్డాన్ 

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు ద్యుతీచంద్అర్హత ప్రమాణ సమయం (11.26 సెకన్లు) అందుకోలేకపోయినా... ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు రావాలని భారత మహిళా స్ప్రింటర్ ద్యుతీచంద్‌కు ఆహ్వానం లభించింది. మహిళల 100 మీటర్ల విభాగంలో నిర్ణీత ఎంట్రీల సంఖ్య 56కు చేరుకోకపోవడంతో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన వారిని ఆహ్వానించాలని నిర్ణయించింది. దాంతో ద్యుతీచంద్‌కు ఈ అవకాశం దక్కింది. ఈ సీజన్‌లో ద్యుతీచంద్ అత్యుత్తమ సమయం 11.30 సెకన్లు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఆగస్టు 4 నుంచి 13 వరకు లండన్‌లో జరుగుతుంది. ఒడిషాకు చెందిన ద్యుతీచంద్‌కు కోచ్‌గా తెలంగాణకు చెందిన నాగపురి రమేశ్ వ్యవహరిస్తున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌కు అర్హత
ఎప్పుడు : ఆగస్టు 4 - 13, 2017
ఎవరు : ద్యుతీచంద్ 
ఎక్కడ : లండన్ 

పారిస్‌లో 2024 ఒలింపిక్స్2024, 2028లలో జరిగే ఒలింపిక్స్ క్రీడల వేదికలను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) జూలై 31న ప్రకటించింది. 2024లో ఈ క్రీడలకు పారిస్ (ఫ్రాన్‌‌స), 2028లో లాస్ ఏంజిల్స్ (అమెరికా) నగరాలు ఆతిథ్యమిస్తాయి. గతంలో పారిస్‌లో రెండుసార్లు (1900, 1924)లో ఒలింపిక్స్ జరిగాయి. సరిగ్గా వందేళ్ల తర్వాత ఈ ‘సిటీ ఆఫ్ లవ్’ మళ్లీ ఒలింపిక్స్ కోసం సిద్ధం కానుంది. లాస్ ఏంజిల్స్ (1932, 1984) కూడా ఇప్పటికే రెండుసార్లు ఒలింపిక్స్‌ను నిర్వహించింది. 2020లో జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్ పోటీలు జరగనున్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 2024, 2028 ఒలింపిక్స్ వేదికలు ఖరారు
ఎప్పుడు : జూలై 31
ఎవరు : అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 
ఎక్కడ : పారిస్, లాస్ ఎంజిల్స్

ఒకే రోజు 3 స్వర్ణాలు సాధించిన అమెరికా స్విమ్మర్ అమెరికా స్విమ్మర్ సెలెబ్ డ్రెస్సెల్ ఒకే రోజు 3 స్వర్ణాలు సాధించి అరుదైన రికార్డు నెలకొల్పాడు. హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన ఫినా వరల్డ్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్ - 2017లో భాగంగా జూలై 31న జరిగిన 50 మీటర్ల ఫ్రీ స్టయిల్, 100 మీటర్ల బటర్‌ఫ్లై, 4 × 100 మీటర్ మిక్స్‌డ్ ఫ్రీ స్టయిల్ ఈవెంట్లలో తొలి స్థానంలో నిలిచాడు. తద్వారా 3 స్వర్ణాలు గెలిచి అంతర్జాతీయ పోటీల్లో ఈ తరహా రికార్డును నెలకొల్పిన తొలి ఆటగాడిగా డ్రెస్సెల్ గుర్తింపు పొందాడు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో ఒకే రోజు 3 స్వర్ణాలు సాధించిన అథ్లెట్ 
ఎప్పుడు : జూలై 31
ఎవరు : సెలెబ్ డ్రెస్సెల్ 
ఎక్కడ : హంగేరి 

వెటెల్‌కు హంగేరీ గ్రాండ్ ప్రి టైటిల్ఫార్ములావన్ రేసులో హంగేరీ గ్రాండ్ ప్రి టైటిల్‌ను ఫెరారీ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ గెలుచుకున్నాడు. బుడాపెస్ట్‌లో జూలై 30న జరిగిన రేసులో వెటెల్ మొదటి స్థానంలో నిలవగా, రైకోనెన్‌కు రెండో స్థానం లభించింది.

జూడోలో భారత్‌కు నాలుగు పతకాలుకామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో తొలిరోజు భారత జట్టు నాలుగు పతకాలు గెలుచుకుంది. బహమాస్‌లోని నసావూ నగరంలో జరిగిన జూడో క్రీడాంశంలో భారత్‌కు ఒక స్వర్ణం, 3 కాంస్య పతకాలు లభించాయి. బాలుర 73 కేజీల విభాగంలో హరియాణాకు చెందిన సోని 10-0తో ఉరోస్ (ఆస్ట్రేలియా)పై గెలిచి విజేతగా నిలిచాడు. కాగా ఆశిష్ (60 కేజీలు), బాలికల విభాగంలో చానమ్ రెబీనా దేవి (57 కేజీలు), అంతిమ్ యాదవ్ (48 కేజీలు) కాంస్య పతకాలను సాధించారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జూడోలో భారత్‌కు నాలుగు పతకాలు
ఎప్పుడు : జూలై 19
ఎవరు : సోని, ఆశిష్, చానమ్ రెబీనా దేవి, అంతిమ్ యాదవ్
ఎక్కడ : కామన్వెల్త్ యూత్ గేమ్స్, బహమాస్

మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరింది. జూలై 20న ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో భారత్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. హర్మన్ ప్రీత్ కౌర్ 115 బంతుల్లో 171 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచింది. జూలై 23న లార్డ్స్ మైదానంలో జరిగే ఫైనల్లో ఇంగ్లండ్ జట్టుతో భారత్ తలపడుతుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత్ 
ఎప్పుడు : జూలై 20
ఎవరు : భారత మహిళల క్రికెట్ జట్టు 
ఎక్కడ : ఇంగ్లండ్‌లో
ఎందుకు : సెమీస్‌లో ఆస్ట్రేలియాపై విజయంతో 

డోపింగ్‌లో పట్టుబడ్డ మన్‌ప్రీత్ కౌర్భారత మేటి అథ్లెట్ మన్‌ప్రీత్ కౌర్ జూలై 19న డోపింగ్‌లో పట్టుబడింది. ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో షాట్‌పుట్‌లో స్వర్ణం నెగ్గిన ఆమె ఆగస్టులో లండన్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. తాజాగా డోపింగ్‌లో దొరకడంతో ఇప్పుడు స్వర్ణం, బెర్త్ రెండూ కోల్పోనుంది. ఆమె నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా ‘ఎ’ శాంపిల్‌లో నిషిద్ధ డిమిథైల్‌బుటిలమైన్ ఉత్ప్రేరకాన్ని తీసుకున్నట్లు తేలింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : డోపింగ్‌లో దొరికిన భారత అథ్లెట్
ఎప్పుడు : జూలై 19
ఎవరు : మన్‌ప్రీత్ కౌర్
ఎందుకు : నిషిద్ధ డిమిథైల్‌బుటిలమైన్ ఉత్ప్రేరకం వాడినందుకు

మహిళల ప్రపంచకప్ విజేత ఇంగ్లండ్తొలిసారి వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలవాలని భావించిన భారత మహిళల జట్టుకు నిరాశే మిగిలింది. జూలై 23న లార్డ్స్‌లో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ 9 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అన్య షబ్‌స్రోల్ (6/46) కు దక్కగా అత్యధిక పరుగులు చేసిన బీమాంట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మహిళల ప్రపంచ కప్ విజేత
ఎప్పుడు : జూలై 23 
ఎవరు : ఇంగ్లండ్
ఎక్కడ : లార్డ్స్, లండన్

పారా అథ్లెటిక్స్‌లో శరద్‌కు రజతంప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు రెండు పతకాలు గెల్చుకున్నారు. జూలై 23న జరిగిన పురుషుల హైజంప్ టి-42 ఈవెంట్‌లో శరద్ కుమార్ రజతం... వరుణ్ భాటి కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. బిహార్‌కు చెందిన శరద్ 1.84 మీటర్ల ఎత్తు ఎగిరి రెండో స్థానాన్ని పొందగా... ఉత్తరప్రదేశ్‌కు చెందిన వరుణ్ భాటి 1.77 మీటర్ల ఎత్తుకు ఎగిరి మూడో స్థానాన్ని సాధించాడు. సామ్ గ్రెవీ (అమెరికా-1.86 మీటర్లు) స్వర్ణ పతకాన్ని కై వసం చేసుకున్నాడు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పారా అథ్లెటిక్స్ హైజంప్ లో భారత్‌కు పతకాలు 
ఎప్పుడు : జూలై 23 
ఎవరు : శరద్ కుమార్, వరుణ్ భాటి

పారా అథ్లెటిక్స్‌లో కరమ్‌జ్యోతికి కాంస్యంప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన కరమ్‌జ్యోతి దలాల్‌కు కాంస్య పతకం లభించింది. మహిళల ఎఫ్-55 డిస్కస్ త్రో ఈవెంట్‌లో ఆమె డిస్క్‌ను 19.02 మీటర్ల దూరం విసిరి మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇంతకుముందు జావెలిన్ త్రోలో సుందర్ సింగ్ గుర్జర్ స్వర్ణం, క్లబ్ త్రోలో అమిత్ సరోహా రజతం సాధించారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు కాంస్య పతకం
ఎప్పుడు : జూలై 21
ఎవరు : కరమ్‌జ్యోతి దలాల్ 

విష్ణు జోడీకి ప్రెసిడెంట్స్ కప్ టైటిల్హైదరాబాద్‌కు చెందిన విష్ణువర్ధన్ ప్రెసిడెంట్స్ కప్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పురుషుల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. కజకిస్తాన్‌లోని అస్తానా నగరంలో జూలై 22న జరిగిన ఫైనల్లో విష్ణువర్ధన్ (భారత్)-తొషిహిదె మత్సుయ్ (జపాన్) జోడీ ‘సూపర్ టైబ్రేక్’లో ఎవ్‌గెని కర్లోవ్‌స్కీ-తుర్నెవ్ (రష్యా) జంటపై గెలిచింది. జూన్‌లో భారత్‌కే చెందిన శ్రీరామ్ బాలాజీతో కలిసి విష్ణు ఫెర్గానా ఓపెన్ టైటిల్‌ను గెలిచాడు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రెసిడెంట్స్ కప్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్ విజేత
ఎప్పుడు : జూలై 22
ఎవరు : విష్ణువర్ధన్ (భారత్)-తొషిహిదె మత్సుయ్ (జపాన్)
ఎక్కడ : అస్తానా, కజకిస్తాన్

ప్రణయ్‌కు యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి టైటిల్భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా నిలిచాడు. జూలై 24న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత్‌కే చెందిన పారుపల్లి కశ్యప్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. ప్రణయ్‌కి ఇది నాలుగో అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్. గతంలో వియత్నాం ఓపెన్ గ్రాండ్‌ప్రి, ఇండోనేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ (2014లో), స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ (2016లో) టోర్నీలలో టైటిల్స్ సాధించాడు. విజేతగా నిలిచిన ప్రణయ్‌కు 9,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షల 79 వేలు)తోపాటు 7,000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ కశ్యప్‌కు 4,560 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 93 వేలు)తోపాటు 5,950 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్ విజేత
ఎప్పుడు : జూలై 24
ఎవరు : హెచ్‌ఎస్ ప్రణయ్

కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో జీల్, సచిన్‌కు స్వర్ణాలుబహమాస్‌లో జూలై 24న ముగిసిన కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో భారత్ ఓవరాల్‌గా నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఆరు కాంస్య పతకాలను సాధించి మొత్తం 11 పతకాలతో ఏడో స్థానంలో నిలిచింది. చివరిరోజు టెన్నిస్‌లో జీల్ దేశాయ్ బాలికల సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించగా... బాక్సింగ్‌లో సచిన్ స్వర్ణం సాధించాడు. బాలుర సింగిల్స్‌లో సిద్ధాంత్ బంతియా కాంస్య పతకాన్ని గెలిచాడు. మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో జీల్ దేశాయ్-సిద్ధాంత్ ద్వయం బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు
ఎప్పుడు : జూలై 24
ఎవరు : జీల్ దేశాయ్ - సిద్ధాంత్ బంతియా (బాలికల సింగిల్స్, డబుల్స్)

ఐదేళ్ల తర్వాత భారత్‌లో డబ్ల్యూటీఏ టోర్నీఐదేళ్ల తర్వాత డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నమెంట్‌కు భారత్ వేదికైంది. ముంబై ఓపెన్ పేరుతో 2017 నవంబర్‌లో డబ్ల్యూటీఏ టోర్నమెంట్ జరగనుంది. 2012లో చివరిసారిగా పుణేలో డబ్ల్యూటీఏ టోర్నీ జరిగింది. దీని వల్ల ప్రపంచ టాప్-50 క్రీడాకారిణులతో తలపడే అవకాశం భారత అమ్మాయిలకు లభిస్తుంది. మెయిన్ డ్రా, క్వాలిఫయింగ్‌లో చెరో నాలుగు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇస్తారు. చెన్నై ఓపెన్ ఏటీపీ టోర్నీ కూడా ఈ సారి మహారాష్ట్రకు తరలింది. ఇప్పుడిది ‘మహారాష్ట్ర ఓపెన్’ పేరుతో పుణేలో జరగనుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 5 ఏళ్ల తర్వాత భారత్‌లో డబ్ల్యూటీఏ టోర్నమెంట్ 
ఎప్పుడు : నవంబర్ 2017
ఎవరు : డబ్ల్యూటీఏ 
ఎక్కడ : ముంబై

భారత్‌లో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ప్రపంచ పురుషుల బాక్సింగ్ తొలి చాంపియన్‌షిప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మేరకు మాస్కోలో జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబా)ఆతిథ్య వేదికల్ని ఖరారు చేసింది. 2019 టోర్నీకి సోచి, 2021 ఈవెంట్‌కు భారత్ ఆతిథ్యమిస్తాయని ఐబా అధ్యక్షుడు చింగ్ కూవు తెలిపారు. ఇప్పటికే వచ్చే ఏడాది మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ భారత్‌లో ఖరారైంది. 1990లో ప్రపంచకప్ ముంబైలో, 2010లో కామన్వెల్త్ గేమ్స్ న్యూఢిల్లీలో జరిగాయి. క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ 
ఎప్పుడు : 2021
ఎవరు : ఐబా
ఎక్కడ : భారత్‌లో

మహిళల వన్డే క్రికెట్‌లో మిథాలీ అత్యధిక పరుగుల రికార్డు భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు సాధించింది. 183 వన్డేల్లో ఆమె 6,028 పరుగులు సాధించింది. చార్లోటి ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్) పేరిట ఇంత కాలం ఉన్న 5,992 పరుగుల రికార్డును మిథాలీ అధిగమించింది. ఎడ్వర్డ్స్ 180 ఇన్నింగ్‌‌సలలో ఈ రికార్డు సాధించగా, మిథాలీకి 164 ఇన్నింగ్‌‌సలు మాత్రమే సరిపోయాయి. ఈ క్రమంలో మహిళల వన్డేల్లో 6 వేల పరుగులు చేసిన తొలి క్రీడాకారిణిగా కూడా మిథాలీ గుర్తింపు తెచ్చుకుంది. 
35 ఏళ్ల మిథాలీ రాజ్ 1999 జూన్ 26న ఐర్లాండ్‌తో తొలి వన్డే మ్యాచ్ ఆడింది. 106 మ్యాచ్‌లలో ఆమె జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం. వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ భారత్‌కే చెందిన జులన్ గోస్వామి (189) పేరిట రికార్డు ఉండగా, ఇప్పుడు బ్యాట్స్‌మన్ జాబితాలో కూడా భారతీయురాలే అగ్రస్థానానికి చేరింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 మహిళల వన్డే క్రికెట్ అత్యధిక పరుగుల రికార్డు 
ఎప్పుడు : జూలై 12
ఎవరు : మిథాలీ రాజ్ 

జావెలిన్ త్రోలో సుందర్ సింగ్‌కు స్వర్ణంలండన్‌లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పురుషుల ఎఫ్-46 జావెలిన్ త్రో ఈవెంట్‌లో సుందర్ సింగ్ గుర్జర్ స్వర్ణం గెలుచుకున్నాడు. జూలై 15న జరిగిన ఈవెంట్‌లో సుందర్ ఈటెను 60.36 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 
ఎప్పుడు : జూలై 15
ఎవరు : జావెలిన్‌త్రోలో సుందర్‌సింగ్ కు స్వర్ణం 
ఎక్కడ : లండన్ 

విక్టోరియా ఓపెన్ టోర్నీ విజేత హరీందర్ఆస్ట్రేలియాలో జరిగిన విక్టోరియా ఓపెన్ టోర్నీ టైటిల్‌ను భారత స్క్వాష్ ప్లేయర్ హరీందర్ పాల్ సంధూ కైవసం చేసుకున్నాడు. జూలై 16న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ సంధూ 12-14, 11-3, 11-4, 11-7తో టాప్ సీడ్, స్థానిక ప్లేయర్, రెక్స్ హెండ్రిక్స్‌పై విజయం సాధించి టైటిల్‌ను గెలుచుకున్నాడు. గతవారం సౌత్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను సంధూ నెగ్గాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 విక్టోరియా స్క్వాష్ ఓపెన్ టోర్నమెంట్ 
ఎప్పుడు : జూలై 16
ఎవరు : విజేత హరీందర్ పాల్ సంధూ
ఎక్కడ : ఆస్ట్రేలియా 

వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత ముగురుజా వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్ స్టార్ గార్బిన్ ముగురుజా దక్కించుకుంది. జూలై 15న జరిగిన ఫైనల్లో అమెరికాకు చెందిన వీనస్ విలియమ్స్‌ను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. విజేతగా నిలిచిన ముగురుజాకు 22 లక్షల పౌండ్లు (రూ. 18 కోట్ల 53 లక్షలు), రన్నరప్ వీనస్‌కు 11 లక్షల పౌండ్లు (రూ. 9 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 
వింబుల్డన్ - 2017
ఎప్పుడు : జూలై 15
ఎవరు : మహిళల సింగిల్స్ విజేత ముగురుజా 

వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేత ఫెడరర్ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్విట్జర్లాండ్‌కు చెందిన రోజర్ ఫెడరర్ సొంతం చేసుకున్నాడు. జూలై 16న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్, మూడోసీడ్ ఫెడరర్ 6-3, 6-1, 6-4తో ప్రపంచ ఆరో ర్యాంకర్, ఏడోసీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై విజయం సాధించాడు. తద్వారా ఓపెన్ శకంలో వింబుల్డన్‌ను అత్యధికంగా ఎనిమిది సార్లు నెగ్గిన ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు.
క్విక్ రివ్యూ: ఏమిటి : వింబుల్డన్ - 2017
ఎప్పుడు : జూలై 16
ఎవరు : పురుషుల సింగిల్స్ విజేత - ఫెడరర్ 

జాతీయ అథ్లెటిక్స్‌లో ఓవరాల్ చాంప్ కేరళ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జరిగిన జాతీయ సీనియర్ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కేరళ జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. కేరళ 159 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా.. 110 పాయింట్లతో తమిళనాడు రెండో స్థానంలో, 101.500 పాయింట్లతో హరియాణా మూడో స్థానంలో నిలిచాయి. ఒక స్వర్ణం, మూడు రజతాలు గెలిచిన ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ జట్టు 42.500 పాయింట్లతో తొమ్మిదో స్థానంతో, ఒక కాంస్య పతకం సాధించిన తెలంగాణ ఐదు పాయింట్లతో 20వ స్థానంతో సరిపెట్టుకున్నాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : జూలై 18
ఎవరు : ఓవరాల్ చాంపియన్ కేరళ 
ఎక్కడ : గుంటూరు, ఆంధ్రప్రదేశ్

భారత్ క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ భారత క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ ఎంపికయ్యారు. ఇప్పటి వరకు బ్యాటింగ్ కోచ్‌గా పని చేస్తున్న సంజయ్ బంగర్‌కు అసిస్టెంట్ కోచ్ హోదా దక్కగా.. ఆర్. శ్రీధర్ ఫీల్డింగ్ కోచ్‌గా కొనసాగుతారు. జూలై 18న బీసీసీఐ ఈ ఎంపికను ప్రకటించింది. హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు ఈ ముగ్గురి పదవీ కాలం కూడా 2019 వన్డే వరల్డ్ కప్ వరకు ఉంటుంది. గతంలో రవిశాస్త్రి డెరైక్టర్‌గా ఉన్న సమయంలో కూడా ఈ ముగ్గురే ఆయనతో కలిసి పని చేశారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 భారత్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ సహాయక సిబ్బంది 
ఎప్పుడు : జూలై 18
ఎవరు : బౌలింగ్ కోచ్ - భరత్ అరుణ్, అసిస్టెంట్ కోచ్ - సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ్- ఆర్.శ్రీధర్ 

బ్రిటిష్ గ్రాండ్ ప్రి టైటిల్ నెగ్గిన హామిల్టన్
ఫార్ములావన్ బ్రిటిష్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను లూయిస్ హామిల్టన్ వరుసగా నాలుగోసారి సొంతం చేసుకున్నాడు. సిల్వర్‌స్టోన్(బ్రిటన్) లో జూలై 16న జరిగిన రేసులో హామిల్టన్ మొదటి స్థానంలో నిలవగా, వాల్టేరి బొట్టాస్ రెండో స్థానం సాధించాడు.

ఆసియా స్నూకర్ చాంపియన్ భారత్  ఆసియా స్నూకర్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ‘ఎ’ జట్టు విజేతగా నిలిచింది. పాకిస్తాన్ ‘బి’తో జూలై 5న జరిగిన ఫైనల్లో భారత్ ‘ఎ’ జట్టు 3-0తో విజయం సాధించింది. ఈ టోర్నీలో పంకజ్ అద్వానీ అజేయంగా నిలిచి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. పంకజ్ అద్వానీ, లక్ష్మణ్ రావత్, మల్కీత్ సింగ్‌లతో కూడిన భారత బృందానికి అశోక్ శాండిల్య కోచ్‌గా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆసియా స్నూకర్ టీమ్ చాంపియన్‌షిప్ 
ఎప్పుడు : జూలై 5
ఎవరు : విజేత భారత్ ఏ జట్టు 
ఎక్కడ : కి ర్గిస్తాన్ 

ఆసియా అథ్లెటిక్స్‌లో మన్‌ప్రీత్, లక్ష్మణన్‌కు స్వర్ణాలుఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత అథ్లెట్లు 2 స్వర్ణాలు, ఒక రజతం, 4 కాంస్య (మొత్తం 7) పతకాలు సాధించారు. మన్‌ప్రీత్‌తో పాటు జి. లక్ష్మణన్ స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. మహిళల షాట్‌పుట్ విభాగంలో మన్‌ప్రీత్ గుండును 18.28మీ. దూరం విసిరి విజేతగా నిలిచి పసిడి పతకం గెలుచుకుంది. పురుషుల 5000మీ. పరుగు ఈవెంట్‌ను గోవిందన్ లక్ష్మణన్ 14ని.54.48 సెకన్లలో పూర్తిచేసి స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. దీంతో లండన్ వేదికగా ఆగస్టులో జరుగనున్న వరల్డ్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాడు. మన్‌ప్రీత్ ఇప్పటికే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 
ఎప్పుడు : జూలై 6
ఎవరు : మన్‌ప్రీత్, జి. లక్ష్మణన్‌కు స్వర్ణాలు 
ఎక్కడ : భువనేశ్వర్, ఒడిశా 

ఆసియా అథ్లెటిక్స్‌లో భారత్‌కు 4 స్వర్ణాలు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ రెండో రోజు పోటీల్లో భారత అథ్లెట్లు 4 స్వర్ణాలు గెలుచుకున్నారు. పురుషుల, మహిళల 400 మీటర్ల విభాగాల్లో వరుసగా మొహమ్మద్ అనస్ (45.77 సెకన్లు), నిర్మలా షెరోన్ (52.01 సెకన్లు) స్వర్ణం గెలుచుకోగా.. 1500 (పురుషులు, మహిళలు) మీటర్ల విభాగాల్లో వరుసగా అజయ్ కుమార్ సరోజ్ (3ని:45.85 సెకన్లు), పీయూ చిత్రా (4ని:17.92 సెకన్లు) విజేతలుగా నిలిచి పసిడి పతకాలను గెల్చుకున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ - 2017 
ఎప్పుడు : జూలై 7
ఎవరు : మొహమ్మద్ అనస్, నిర్మలా షెరోన్, అజయ్ కుమార్ సరోజ్, పియూ చిత్రాలకు స్వర్ణ్ణాలు 
ఎక్కడ : భువనేశ్వర్, ఒడిశా 

ఫెడరర్ అత్యధిక గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌ల రికార్డుగ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లలో అత్యధిక మ్యాచ్‌లు (317) గెలిచిన ఆటగాడిగా స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ రికార్డును సృష్టించాడు. వింబుల్డన్‌లో భాగంగా జూలై 8న జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో ఫెడరర్ 7-6 (7/3), 6-4, 6-4తో 27వ సీడ్ మిషా జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచాడు. తద్వారా అత్యధికంగా 317 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. సెరెనా విలియమ్స్ (అమెరికా-316 విజయాలు) పేరిట ఉన్న రికార్డును ఫెడరర్ అధిగమించాడు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన ప్లేయర్
ఎప్పుడు : జూలై 8 
ఎవరు : రోజర్ ఫెడరర్ 
ఎందుకు : సెరెనా విలియమ్స్ రికార్డుని అధిగమించిన ఫెడరర్ 

ఆసియా అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలిస్థానం ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ 12 స్వర్ణాలు, 5 రజతాలు, 12 కాంస్యాలలు కలిపి మొత్తం 29 పతకాలతో తొలిసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 20 పతకాలతో చైనా (8 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాలు) రెండో స్థానంలో నిలిచింది. 1985, 1989 ఆసియా చాంపియన్‌షిప్‌ల్లో భారత్ అత్యధికంగా 22 పతకాలు గెలిచింది. 
చివరి రోజైన జులై 9న జరిగిన పోటీల్లో భారత్‌కు ఐదు స్వర్ణ పతకాలు లభించాయి. హెప్టాథ్లాన్‌లో స్వప్న బర్మన్ (5,942 పాయింట్లు)... 10 వేల మీటర్ల రేసులో లక్ష్మణన్ (29ని:55.87 సెకన్లు)... జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా (85.23 మీటర్లు) పసిడి పతకాలు గెలిచారు. పురుషుల, మహిళల 4×400 మీటర్లలో భారత రిలే జట్లు స్వర్ణాలు నెగ్గాయి. జూలై 8న జరిగిన పోటీల్లో మహిళల 3000 మీటర్ల రేసులో భారత అథ్లెట్ సుధా సింగ్ స్వర్ణం గెలుచుకుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : జూలై 6 
ఎవరు : 29 పతకాలతో తొలి స్థానంలో భారత్ 
ఎక్కడ : భువనేశ్వర్, ఒడిశా 

కామన్వెల్త్ చెస్ చాంపియన్ అభిజిత్భారత్‌లో జరిగిన కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ అభిజిత్ గుప్తా విజేతగా నిలిచాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్‌లు ముగిశాక అభిజిత్ గుప్తా 7.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వైభవ్ సూరి రెండో స్థానంలో, తేజస్ బాక్రే మూడో స్థానంలో నిలిచారు. తెలంగాణ ప్లేయర్ ఎరిగైసి అర్జున్ 6.5 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : జూలై 10
ఎవరు : విజేత అభిజిత్ గుప్తా 
ఎక్కడ : భారత్‌లో 

శ్రీలంకపై తొలి వన్డే సిరీస్ గెలిచిన జింబాబ్వే శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను జింబాబ్వే 3-2తో కైవసం చేసుకుంది. జూలై 10న జరిగిన ఐదో వన్డేలో జింబాబ్వే జట్టు 3 వికెట్ల తేడాతో లంకపై నెగ్గింది. తద్వారా 2009 తర్వాత విదేశాల్లో తొలి వన్డే సిరీస్ విజయాన్ని సొంతం చేసుకున్న ఆ జట్టు.. శ్రీలంకపై తొలి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : శ్రీలంకపై తొలి వన్డే సిరీస్ కైవసం చేసుకున్న జింబాబ్వే 
ఎప్పుడు : జూలై 10
ఎక్కడ : శ్రీలంకలో 
ఎందుకు : ఐదు వన్డేల సీరీస్‌లో 3-2 తేడాతో జింబాబ్వే విజయం 

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా 55 ఏళ్ల రవిశంకర్ జయధ్రిత శాస్త్రిని నియమిస్తున్నట్లు బీసీసీఐ జూలై 11న ప్రకటించింది. అలాగే.. మాజీ పేసర్ జహీర్ ఖాన్ బౌలింగ్ కోచ్‌గా, విదేశీ పర్యటనల్లో బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రవిడ్‌ను నియమించింది. ఇప్పటికే భారత ‘ఎ’, అండర్-19 జట్లకు కోచ్‌గా ఉన్న ద్రవిడ్‌కు ఇది అదనపు బాధ్యత. జూలై 26 నుంచి శ్రీలంకతో జరిగే సిరీస్ నుంచి రవిశాస్త్రి పదవీకాలం ప్రారంభమవుతుంది. వచ్చే రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత క్రికెట్ హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి
ఎప్పుడు : జూలై 11
ఎవరు : బీసీసీఐ 

జోత్స్న చినప్పకు ప్రభుత్వ ఉద్యోగంప్రముఖ స్క్వాష్ క్రీడాకారిణి, జోత్స్న చినప్పకు తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించింది. రాష్ట్ర విద్యుత్ శాఖకు చెందిన తమిళనాడు ఉత్పత్తి, పంపిణీ సంస్థ (టీఏఎన్‌జీఈడీసీఓ) సీనియర్ స్పోర్‌‌ట్స అధికారిణిగా నియమిస్తు జూలై 11న ఉత్తర్వులు జారీ చేసింది. 
ఆసియా వ్యక్తిగత చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడంతోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్స్‌కు చేరిన చినప్ప మెరుగైన ప్రదర్శన కనబర్చింది. మరోవైపు కామన్వెల్త్ గేమ్స్ మహిళల డబుల్స్ విభాగంలో చినప్ప స్వర్ణపతకాన్ని సాధించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జోత్స్న చినప్పకు ప్రభుత్వ ఉద్యోగం
ఎప్పుడు : జూలై 11
ఎవరు : తమిళనాడు ప్రభుత్వం 
ఎక్కడ : తమిళనాడు ఉత్పత్తి, పంపిణీ సంస్థలో

కోచ్‌గా ద్రవిడ్‌కు రెండేళ్లు పొడిగింపు భారత్ ‘ఎ’, అండర్-19 క్రికెట్ జట్ల కోచ్‌గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలాన్ని బీసీసీఐ మరో రెండేళ్లకు పొడిగించింది. 2015లో ద్రవిడ్ తొలిసారిగా కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన శిక్షణలో ఆటగాళ్లు అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు వెళ్లి రన్నరప్‌గా నిలిచారు. అలాగే భారత్ ‘ఎ’ జట్టు నాలుగు దేశాల సిరీస్‌లో విజేతగా నిలిచింది. 
రెండేళ్ల పూర్తి స్థాయి కోచింగ్ బాధ్యతలు తీసుకోనుండటంతో ద్రవిడ్ ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు మెంటార్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కోచ్‌గా ద్రవిడ్‌కు 2 ఏళ్ల పొడిగింపు
ఎప్పుడు : జూన్ 30
ఎవరు : బీసీసీఐ
ఎందుకు : భారత్ - ఏ, అండర్ - 19 క్రికెట్ జట్టు కోచ్‌గా

No comments:

Post a Comment