AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

క్రీడలు సెప్టెంబరు 2017

క్రీడలు సెప్టెంబరు 2017
బెల్జియం ఓపెన్ చాంప్ వైష్ణవి  బెల్జియం ఓపెన్ అండర్-19 మహిళల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ వైష్ణవి రెడ్డి విజేతగా నిలిచింది. సెప్టెంబర్ 24న జరిగిన ఫైనల్లో రెండోసీడ్ వైష్ణవి 21-19, 17-21, 21-12తో టాప్ సీడ్, వివియన్ సందోర్ఘాజీని ఓడించి చాంపియన్‌గా అవతరించింది. 
మరోవైపు ఇథియోపియా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన అర్జున్-రామచంద్రన్ శ్లోక్ జోడీ విజేతగా నిలిచింది. టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన అర్జున్ జంట ఫైనల్లో 21-6, 21-19తో జోర్డాన్‌కు చెందిన బహర్డీన్ అహ్మద్-మహ్మద్ నసీర్‌లపై అలవోక విజయం సాధించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బెల్జియం ఓపెన్ అండర్ - 19 చాంపియన్‌షిప్ 
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : విజేత భారత ప్లేయర్ వైష్ణవి రెడ్డి

‘పద్మభూషణ్’కు ధోని పేరుని నామినేట్ చేసిన బీసీసీఐదేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మభూషణ్’ కోసం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరును బీసీసీఐ నామినేట్ చేసింది. ధోని కెప్టెన్సీలో భారత జట్టు 2007లో టి20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్‌ను సాధించింది. ధోని వన్డేల్లో దాదాపు పది వేల పరుగులు చేయడంతోపాటు 90 టెస్టులు ఆడాడు. 
గతంలో కపిల్‌దేవ్, సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, చందూ బోర్డే, దేవధర్, సీకే నాయుడు, లాలా అమర్‌నాథ్, రాజా భళీంద్ర సింగ్, విజయ ఆనంద్ ‘పద్మభూషణ్’ పురస్కారం అందుకున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పద్మభూషణ్‌కు ధోని పేరు
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : నామినేట్ చేసిన బీసీసీఐ

‘పద్మభూషణ్’కు పీవీ సింధు పేరు ప్రతిపాదన 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పేరును కేంద్ర క్రీడా శాఖ దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మభూషణ్’ కోసం ప్రతిపాదించింది. 2015లోనే ఆమె పద్మశ్రీ పురస్కారం పొందింది. 
వరుసగా రెండు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో (2013, 2014) సింధు కాంస్యాలు సాధించింది. 2016లో చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్, ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌లను గెలుచుకుంది. 2017 ఆగస్టులో గ్లాస్గో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం.. సెప్టెంబర్‌లో కొరియా ఓపెన్ రూపంలో కెరీర్‌లో మూడో సూపర్ సిరీస్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. అలాగే మూడుసార్లు మకావు ఓపెన్ చాంపియన్‌గా నిలవడంతో పాటు ఈ ఏడాది భారత్‌లో జరిగిన సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పద్మభూషణ్‌కు పీవీ సింధు పేరు ప్రతిపాదన
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ

జపాన్ ఓపెన్ విజేతలు మరిన్, అక్సెల్‌సన్జపాన్ ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ సింగిల్స్ విభాగంలో కరోలినా మరిన్ (స్పెయిన్), విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్) విజేతలుగా నిలిచారు. సెప్టెంబర్ 24న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్, ఐదోసీడ్, మరిన్ 23-21, 21-12తో డిఫెండింగ్ చాంపియన్, ఆరోసీడ్ హే బింగ్ జియావో (చైనా)పై విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. 
పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్, మూడోసీడ్, అక్సెల్‌సన్ 21-14, 19-21, 21-14తో ప్రపంచ మాజీ నం.1, ఏడోసీడ్, లీ చోంగ్ వీ (మలేసియా)పై విజయం సాధించాడు. 
పురుషుల డబుల్స్ విభాగంలో మూడోసీడ్, ఇండోనేసియా ద్వయం, మార్కస్ ఫెర్నాల్డి గిడియోన్-కెవిన్ సంజయ విజేతలుగా నిలిచింది. మహిళల డబుల్స్‌లో స్థానిక ద్వయం, టాప్‌సీడ్, మిసాకి మతుటొమో-అయాకా తకహషి టైటిల్‌ను కై వసం చేసుకుంది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో చైనీస్ జోడీ, వాంగ్ యిల్వ్-హువాంగ్ డోంగ్‌పిన్ విజేతగా నిలిచింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జపాన్ ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ - 2017
ఎప్పుడు : సెప్టెంబర్ 24 
ఎవరు : మహిళల సింగిల్స్ విజేత -కరోలినా మరిన్, పురుషుల సింగిల్స్ విజేత విక్టర్ అక్సెల్‌సన్

ఆసియా ఇండోర్ క్రీడల్లో సౌరవ్ కొఠారికి స్వర్ణం ఆసియా ఇండోర్ క్రీడల్లో భారత బిలియర్డ్స్ ప్లేయర్ సౌరవ్ కొఠారి స్వర్ణం సాధించాడు. సెప్టెంబర్ 25న జరిగిన బిలియర్డ్స్ సింగిల్స్ ఫైనల్లో సౌరవ్ కొఠారి 3-1 (100-80, 101-0, 29-101, 101-88) ఫ్రేమ్‌ల తేడాతో ప్రపంచ బిలియర్డ్స్ మాజీ చాంపియన్ ప్రప్‌రుట్ చైతనాసకున్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించాడు. ఈ క్రీడల్లో క్యూ స్పోర్‌‌ట్స (బిలియర్డ్స్, స్నూకర్) విభాగంలో భారత్‌కిది తొలి పతకం.
టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ రజత పతకం సాధించాడు. ఫైనల్లో విష్ణువర్ధన్-ప్రార్థన తొంబారే (భారత్) ద్వయం 7-5, 4-6, 2-6తో నటనన్ కద్‌చాపనాన్-నిచా లెర్ట్‌పితాక్‌సిన్‌చాయ్ (థాయ్‌లాండ్) జంట చేతిలో ఓడిపోయింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆసియా ఇండోర్ క్రీడలు 
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : బిలియర్డ్స్‌ల్రో భారత ప్లేయర్ సౌరవ్ కొఠారికి స్వర్ణం 

మిథాలీరాజ్‌పై బయోపిక్భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌పై వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంస్థ బయోపిక్‌ను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సంస్థ నుంచి ఇప్పటికే భాగ్ మిల్కా భాగ్ (మిల్కాసింగ్‌పై), మేరీకామ్ సినిమాలు వచ్చాయి. మహిళల వన్డే క్రికెట్‌లో మిథాలీ ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా కొనసాగుతోంది. వన్డేల్లో 6 వేల పరుగులతో పాటు వరుసగా ఏడు అర్ధ సెంచరీలు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గానూ ఖ్యాతికెక్కింది. అలాగే 2005, 2017 వన్డే ప్రపంచకప్‌లలో భారత జట్టును ఫైనల్స్‌కు చేర్చిన కెప్టెన్‌గా నిలిచింది.
బాలీవుడ్‌లో ఇప్పటికే అథ్లెట్ మిల్కాసింగ్, బాక్సర్ మేరీకామ్, క్రికెటర్లు ధోని, అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్‌లపై చిత్రాలు రాగా... బ్యాడ్మింటన్ స్టార్స్ సింధు, సైనా నెహ్వాల్, మహిళా క్రికెటర్ జులన్ గోస్వామిలపై చిత్రాలు కూడా వరుసలో ఉన్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్‌పై బయోపిక్
ఎప్పుడు : సెప్టెంబర్ 26 
ఎవరు : వయాకామ్ 18 మోషన్

ఆసియా ఇండోర్ క్రీడల్లో విష్ణు-జయ్‌కి స్వర్ణం ఆసియా ఇండోర్ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ విష్ణువర్ధన్ పురుషుల డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. సెప్టెంబర్ 26న జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో విష్ణువర్ధన్-విజయ్ నటరాజన్ (భారత్) ద్వయం 6-3, 6-4తో డెనిస్ యెవ్‌సెయెవ్-తిముర్ (కజకిస్తాన్) జంటపై విజయం సాధించింది. మహిళల డబుల్స్ విభాగంలో అంకిత రైనా-ప్రార్థన తొంబారే (భారత్) జోడీకి రజత పతకం లభించింది. ఫైనల్లో అంకిత-ప్రార్థన జంట 6-3, 3-6, 6-7 (5/7)తో తమాచాన్-వరుణ్య (థాయ్‌లాండ్) ద్వయం చేతిలో ఓడిపోయింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆసియా ఇండోర్ క్రీడలు - 2017 
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : పురుషుల డబుల్స్ టెన్నిస్‌లో విష్ణువర్దన్ - విజయ్ నటరాజన్‌కు స్వర్ణం

152 మంది 'టాప్' అథ్లెట్లకు నెలకు రూ. 50 వేలు  టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకంలో భాగంగా ఉన్న 152 మంది అథ్లెట్లకు ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి నెలకు రూ. 50 వేల చొప్పున ‘పాకెట్‌మనీ’గా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అభినవ్ బింద్రా నేతృత్వంలోని ఒలింపిక్ టాస్క్ ఫోర్స్ ఈ 152 మంది పేర్లను ప్రతిపాదించింది. 2017 సెప్టెంబర్ 1 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రకటించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 'టాప్' అథ్లెట్లకు నెలకు రూ. 50 వేల పాకెట్‌మనీ 
ఎప్పుడు : సెప్టెంబర్ 1 నుంచి
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : క్రీడాకారులను ప్రోత్సహించేందుకు

ఐటీఎఫ్ మహిళ టోర్నీలో ప్రాంజల జోడీకి టైటిల్ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల, భారత్‌కే చెందిన జీల్ దేశాయ్ ద్వయం డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. ఫెనల్లో ప్రాంజల-జీల్ దేశాయ్ ద్వయం 6-2, 7-5తో రుతుజా భోస్లే (భారత్)-అలెగ్జాండ్రా వాల్టర్స్ (ఆస్ట్రేలియా) జంటపై గెలుపొందింది. ఈ ఏడాది ప్రాంజలకిది రెండో డబుల్స్ టైటిల్. గత జూన్‌లో ఔరంగాబాద్‌లో జరిగిన టోర్నీలో జియావోజి జావో (చైనా)తో కలిసి ప్రాంజల తొలి టైటిల్‌ను నెగ్గింది. 
డబుల్స్‌లో ఓడినప్పటికీ... సింగిల్స్‌లో రుతుజా భోస్లే విజేతగా నిలిచింది. ఫైనల్లో రుతుజా 6-4, 2-6, 7-5తో హువా చెన్ లీ (చైనీస్ తైపీ)పై గెలిచింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్ - 2017
ఎప్పుడు : సెప్టెంబర్ 16
ఎవరు : డబుల్స్ విజేత ప్రాంజల, జీల్ దేశాయి 

10 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ భారత్ 2028 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానానికి చేరుకుంటుందని బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ పేర్కొంది. 7 లక్షల కోట్ల డాలర్ల విలువ గల ఆర్థిక వ్యవస్థగా అవతరించి జపాన్, జర్మనీలను అధిగమించి ముందుకు వెళుతుందని అంచనా వేసింది. అదే సమయంలో జర్మనీ ఆర్థిక వ్యవస్థ 6 లక్షల కోట్ల డాలర్లు, జపాన్ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని నివేదికలో పేర్కొంది. 
2015-16 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 2.3 లక్షల కోట్ల డాలర్లతో ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 2028 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ 
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : హెచ్‌ఎస్‌బీసీ
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా 

కొరియా ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత పీవీ సింధుదక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగిన కొరియా ఓపెన్ సూపర్ సీరీస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు సొంతం చేసుకుంది. ఈ మేరకు ప్రపంచ చాంపియన్, తొమ్మిదో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)తో 83 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 22-20, 11-21, 21-18తో విజయం సాధించింది. విజేతగా నిలిచిన సింధుకు 45 వేల డాలర్ల (రూ. 28 లక్షల 83 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 
సింధు కెరీర్‌లో ఇది మూడో సూపర్ సిరీస్ టైటిల్. గతంలో ఆమె చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ (2016), ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ (2017)లో టైటిల్స్ గెలిచింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కొరియా ఓపెన్ సూపర్ సీరీస్ - 2017
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : మహిళల సింగిల్స్ విజేత పీవీ సింధు 
ఎక్కడ : సియోల్, దక్షిణకొరియా 

సింగపూర్ గ్రాండ్ ప్రీ విజేత లూయిస్ హామిల్టన్ సింగపూర్ గ్రాండ్ ప్రీ టైటిల్‌ను మెర్సిడీస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. సెప్టెంబర్ 17న జరిగిన రేసుని హామిల్టన్ 2 గంటల 45 ని.008 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. రెడ్‌బుల్ డ్రైవర్ రికియార్డో రెండో స్థానం పొందగా, వాల్టెరి బొటాస్ (మెర్సిడెజ్) మూడో స్థానంలో నిలిచాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్ ఐదు, ఈస్టెబన్ ఒకాన్ పదో స్థానం సాధించారు.
ఈ సీజన్ గ్రాండ్ ప్రీలలో హామిల్టన్‌కు ఇది హ్యాట్రిక్ విజయం. ఇంతకముందు ఇటలీ, బెల్జియం గ్రాండ్‌ప్రిలలోను హామిల్టన్ విజేతగా నిలిచాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సింగపూర్ గ్రాండ్ ప్రీ - 2017 
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : టైటిల్ విజేత లూయిస్ హామిల్టన్ 
ఎక్కడ : సింగపూర్ 

ఆసియా ఇండోర్, మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో భారత్‌కు స్వర్ణాలుఆసియా ఇండోర్, మార్షల్ ఆర్‌‌ట్స క్రీడల్లో సెప్టెంబర్ 19న భారత అథ్లెట్స్ రెండు స్వర్ణాలు, ఒక కాంస్య పతకం సాధించారు. పురుషుల 5000 మీటర్ల రేసులో గోవిందన్ లక్ష్మణన్... మహిళల 1500 మీటర్ల రేసులో పీయూ చిత్ర పసిడి పతకాలను సొంతం చేసుకోగా... బెల్ట్ రెజ్లింగ్‌లో ధర్మేందర్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. లక్ష్మణన్ 8 నిమిషాల 2.30 సెకన్లలో గమ్యానికి చేరుకొని అగ్రస్థానాన్ని పొందాడు. చిత్ర 4 నిమిషాల 27.77 సెకన్లలో రేసును పూర్తి చేసి విజేతగా నిలిచింది. బెల్ట్ రెజ్లింగ్ 70 కేజీల విభాగం సెమీఫైనల్లో అనామిరదోవ్ (తుర్క్‌మెనిస్తాన్) చేతిలో ధర్మేందర్ ఓడిపోయి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆసియా ఇండోర్, మార్షల్ ఆర్ట్స్ క్రీడలు - 2017
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎక్కడ : అష్గబాత్, తుర్క్‌మెనిస్తాన్

కామన్‌వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్‌లో దీక్షితకు స్వర్ణంకామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో జూనియర్ మహిళల 58 కేజీల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ లిఫ్టర్ ఎర్ర దీక్షిత స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. మహబూబాబాద్ జిల్లాలోని మానుకోట పట్టణానికి చెందిన దీక్షిత స్నాచ్‌లో 73 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 94 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 167 కేజీలతో పసిడి పతకాన్ని కై వసం చేసుకుంది. యూత్ బాలుర 62 కేజీల విభాగంలో ముత్తుపాండి రాజా స్వర్ణం, జూనియర్ పురుషుల విభాగంలో రజతం గెలిచాడు. సీనియర్ మహిళల 58 కేజీల విభాగంలో సరస్వతి రౌత్ కాంస్యం నెగ్గింది. యూత్ బాలుర, జూనియర్ పురుషుల 69 కేజీల విభాగంలో దీపక్ లాథెర్ రెండు స్వర్ణాలు, సీనియర్ పురుషుల విభాగంలో కాంస్యం సాధించాడు. మొత్తంగా చాంపియన్‌షిప్‌లో భాగంగా సెప్టెంబర్ 6న జరిగిన వివిధ ఈవెంట్లలో భారత లిఫ్టర్లు 10 పతకాలు సొంతం చేసుకున్నారు. 
2019 కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 

కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్‌లో వెంకట్ రాహుల్‌కు రెండు స్వర్ణాలు కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ ఒకే రోజు రెండు స్వర్ణాలు సాధించాడు. సెప్టెంబర్ 7న జరిగిన సీనియర్, జూనియర్ పురుషుల 85 కేజీల విభాగాలలో బరిలోకి దిగిన రాహుల్ రెండు విభాగాల్లోనూ స్నాచ్‌లో 156 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 195 కేజీల బరువెత్తి ఓవరాల్‌గా 351 కేజీలతో విజేతగా నిలిచి రెండు స్వర్ణ పతకాలను దక్కించుకున్నాడు. ఈ ప్రదర్శనతో వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు రాహుల్ అర్హత సాధించాడు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : ఒకే రోజు రెండు స్వర్ణాలు నెగ్గిన రాగల వెంకట్ రాహుల్ 

భారత హాకీ జట్టు చీఫ్ కోచ్‌గా జియోర్డ్ మరీజినేభారత మహిళల హాకీ జట్ట్టు కోచ్‌గా ఉన్న జియోర్డ్ మరీజినేను పురుషుల సీనియర్ జట్టు కోచ్‌గా ఎంపిక చేస్తు హాకీ ఇండియా సెప్టెంబర్ 8న నిర్ణయం తీసుకుంది. నెదర్లాండ్‌‌సకు చెందిన మరీజినేకు గతంలో ఏ పురుషుల సీనియర్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన అనుభవం లేదు. 
కొన్ని నెలలుగా హాకీ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నెదర్లాండ్‌‌సకే చెందిన రోలంట్ ఓల్ట్‌మన్‌‌సను కోచ్ పదవి నుంచి హాకీ ఇండియా ఇటీవల తొలగించించింది. మరోవైపు జూనియర్ టీమ్ కోచ్‌గా ఉన్న హరేంద్ర సింగ్‌ను మరీజినే స్థానంలో మహిళల సీనియర్ జట్టు హై పెర్ఫామెన్‌‌స స్పెషలిస్ట్ కోచ్‌గా నియమించారు. కోచ్‌లు ఇద్దరూ 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్ వరకు బాధ్యతలు నిర్వర్తిస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 
భారత పురుషుల హాకీ జట్టుకి కొత్త కోచ్ 
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : జియోర్డ్ మరీజినే

దక్షిణాఫ్రికా లీగ్‌లో స్టెలెన్‌బాష్ జట్టుని కొన్న ప్రీతి జింటాదక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్వహించనున్న గ్లోబల్ టి20 లీగ్‌లో ‘స్టెలెన్‌బాష్’ టీమ్‌ను ప్రీతి జింటా కొనుగులు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్‌‌స ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఆమె యజమానిగా ఉన్నారు. గతంలో నిర్వహించిన గ్లోబల్ టీ 20 లీగ్ జట్ల వేలంలో స్టెలెన్‌బాష్‌ను దక్షిణాఫ్రికాకే చెందిన బ్రిమ్‌స్టోన్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కొనుక్కుంది. అయితే ఆర్థికపరమైన సమస్యలతో బ్రిమ్‌స్టోన్ తాము లీగ్‌నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగా...ఆ స్థానంలో ఇప్పుడు ప్రీతి జింటా వచ్చింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : స్టెలెన్‌బాష్ జట్టుని కొనుగోలు చేసిన ప్రీతి జింటా 
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎక్కడ : దక్షిణాఫ్రికాలోని గ్లోబల్ టీ 20 లీగ్‌లో 

ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్‌లో సోనమ్‌కు స్వర్ణం గ్రీస్‌లో జరిగిన ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్ సోనమ్ మాలిక్ బంగారు పతకాన్ని సాధించింది. 56 కేజీల విభాగంలో బరిలోకి దిగిన 15 ఏళ్ల సోనమ్ ఫైనల్లో 3-1తో సెనా నగమొటో (జపాన్)పై ఘనవిజయం సాధించింది. 43 కేజీల విభాగంలో బరిలోకి దిగిన భారత ప్లేయర్ నీలమ్ కాంస్య పతకం గెలుచుకుంది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : సోనమ్ మాలిక్‌ను స్వర్ణం

‘బెస్ట్ లిఫ్టర్’ రాగల వెంకట రాహుల్ కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో సంచలన ప్రదర్శనతో 16 రికార్డులు కొల్లగొట్టిన ఆంధ్రప్రదేశ్ వెయిట్ లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్ తాజాగా రెండు అవార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. సీనియర్ పురుషులు, జూనియర్ పురుషుల 85 కేజీల విభాగాల్లో ‘బెస్ట్ లిఫ్టర్’ అవార్డులను రాహుల్ చేజిక్కించుకున్నాడు. ఈ చాంపియన్‌షిప్‌లో భారత బృందానికి నాలుగు అవార్డులు రాగా... అందులో రెండు ఏపీ లిఫ్టర్‌కే దక్కాయి. 
మీరాబాయి చానుకు సీనియర్ మహిళల కేటగిరీలో, దీపక్ లాథెర్‌కు యూత్ బాలుర విభాగంలో అవార్డులు లభించాయి. మొత్తంగా ఈ టోర్నీలో 34 రికార్డుల్ని భారత లిఫ్టర్లు నెలకొల్పారు. సెప్టెంబర్ 9న చివరి రోజు పోటీల్లో పర్దీప్ సింగ్ బంగారు పతకం సాధించి, వచ్చే ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సంపాదించాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 బెస్ట్ లిఫ్టర్‌గా రాగల వెంకట రాహుల్ 
ఎప్పుడు : సెప్టెంబర్ 9
ఎక్కడ : కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ 
ఎందుకు : 16 రికార్డులను తిరగరాసినందుకు గాను 

2018లో మంచిర్యాలలో స్టూడెంట్ ఒలింపిక్స్ 
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలోని మంచిర్యాలలో ‘స్టూడెంట్ ఒలింపిక్స్’ను 2018 నవంబర్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు క్రీడలు, పర్యాటక యువజనాభ్యుదయ శాఖ దీనికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ముంబైకి చెందిన ‘స్పోర్‌‌ట్స ఫర్ ఆల్’ సంస్థ సహకారంతో ఈ క్రీడలను నిర్వహించనున్నారు. 
దేశంలోనే తొలిసారిగా..
ఇప్పటి వరకు మన దేశంలో నిర్బంధ క్రీడల నిర్వహణ విధానం లేదు. దేశంలోనే తొలిసారి ఈ ప్రయోగానికి తెలంగాణ శ్రీకారం చుడుతోంది. మంచిర్యాల జిల్లాలో ప్రతి విద్యార్థి తొలుత పాఠశాల స్థాయి పోటీల్లో పాల్గొనాలి. విజయం సాధించిన వారితో మండల స్థాయి పోటీలు నిర్వహిస్తారు. అందులో టాప్‌లో ఉన్న వారి మధ్య డివిజన్ స్థాయి, ఆ తర్వాత జిల్లా స్థాయి పోటీలు నిర్వహించి విజేతలను ఎంపిక చేస్తారు. వారికి బంగారు, వెండి, కంచు పతకాలు, ప్రశంసా పత్రాలు, ర్యాంక్ కార్డులు అందజేస్తారు. కేజీ నుంచి కళాశాల స్థాయి వరకు.. ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థ అన్న తేడా లేకుండా ప్రతీ విద్యార్థి కనీసం ఒక క్రీడలో విధిగా పాల్గొనేలా చేసి వారిలో క్రీడలంటే భయం పోగొట్టాలన్నది ప్రధాన ఆలోచన. 
క్విక్ రివ్యూ: ఏమిటి : దేశంలోనే తొలి స్టూడెంట్ ఒలింపిక్స్ 
ఎప్పుడు : 2018 నవంబర్‌లో 
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం 
ఎక్కడ : మంచిర్యాలలో 

యూఎస్ ఓపెన్ - 2017 
యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ దక్కించుకున్నాడు. సెప్టెంబర్ 10న జరిగిన ఫైనల్లో నాదల్ 6-3, 6-3, 6-4 తేడాతో దక్షిణాఫ్రికాకు చెందిన కెవిన్ ఆండర్స్‌ను ఓడించి.. కెరీర్‌లో 16వ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఇదే ఏడాది జూన్‌లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను నాదల్ గెలుచుకున్నాడు. 

మహిళల సింగిల్స్ విజేత స్లోన్ స్టీఫెన్స్ యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను అమెరికా టెన్నిస్ ప్లేయర్ స్లోన్ స్టీఫెన్స్ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 10న సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ క్రీడాకారిణి స్లోన్ స్టీఫెన్‌‌స 6-3, 6-0తో 15వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)ను ఓడించింది. తద్వారా కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను దక్కించుకుంది. 
విజేతలుగా నిలిచిన ప్లేయర్‌లకు 37 లక్షల డాలర్లు (రూ. 23 కోట్ల 61 లక్షలు)... రన్నరప్‌లకు 18 లక్షల 25 వేల డాలర్లు (రూ. 11 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 
జామీ ముర్రే-హింగిస్‌లకు ‘మిక్స్‌డ్’ టైటిల్ఇదే టోర్నీ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో జామీ ముర్రే (బ్రిటన్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) విజేతలుగా నిలిచారు. ఫైనల్లో టాప్‌సీడ్ హింగిస్ జంట 6-1, 4-6, 10-8తో మైకేల్ వీనస్ (న్యూజిలాండ్)-చాన్ హావో చింగ్ (చైనీస్‌తైపీ)లపై సూపర్ టైబ్రేకర్‌లో విజయం సాధించారు. జత కట్టినప్పటి నుంచి హింగిస్ జోడికిది వరుసగా పదో విజయం కావడం విశేషం.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : యూఎస్ ఓపెన్ - 2017 
ఎప్పుడు : సెప్టెంబర్ 9
ఎవరు : పురుషుల సింగిల్స్ విజేత రాఫెల్ నాదల్, మహిళల సింగిల్స్ విజేత స్లోన్ స్టీఫెన్స్, మిక్స్‌డ్ టైటిల్ విజేత జామీ ముర్రే-హింగిస్

ఖార్కివ్ ఇంటర్నేషనల్‌లో నందగోపాల్‌కు రెండు టైటిల్స్ 
ఉక్రెయిన్‌లో జరిగిన ఖార్కివ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ కిడాంబి నందగోపాల్ రెండు టైటిల్స్ సాధించాడు. పురుషుల డబుల్స్‌లో రోహన్ కపూర్‌తో, మిక్స్‌డ్ డబుల్స్‌లో మహిమా అగర్వాల్‌తో జతకట్టి అతను విజేతగా నిలిచాడు. 
మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ పోరులో మూడో సీడ్ నందగోపాల్-మహిమ జంట 21-14, 21-15తో సౌరభ్ శర్మ-అనౌష్క పారిఖ్ (భారత్) జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో నందగోపాల్-రోహన్ ద్వయం 18-21, 24-22, 21-18తో కోన తరుణ్-ఫ్రాన్సిస్ అల్విన్ (భారత్) జోడీపై విజయం సాధించింది. మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో తెలుగు అమ్మాయి శ్రీకృష్ణప్రియ 21-18, 16-21, 21-23తో ఏడో సీడ్ నటాలియా వొయెత్సెక్ (ఉక్రెయిన్) చేతిలో పరాజయం పాలైంది.

జాతీయ జూనియర్ చెస్ చాంప్ హర్ష జాతీయ జూనియర్ అండర్-19 ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ఆటగాడు హర్ష భరతకోటి విజేతగా నిలిచాడు. 11 రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో అతను 9.5 పాయింట్లతో అజేయంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్తీక్ వెంకట రామన్ కూడా సరిగ్గా 9.5 పాయింట్లు సాధించాడు. అయితే ఈ టోర్నీలో అతనిపై ముఖాముఖి పోరులో అంతర్జాతీయ మాస్టర్ (ఐఎమ్) హర్ష గెలుపొందడంతో అతడిని విజేతగా డిక్లేర్ చేశారు. బాలికల కేటగిరీలో మహాలక్ష్మి (తమిళనాడు) చాంపియన్‌గా నిలిచింది. 

త్వరలో ఎంజీఆర్ స్మారక రూ.100 నాణెంభారతరత్న గ్రహీత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ శత జయంతిని పురస్కరించుకుని త్వరలో రూ.100, రూ.5 స్మారక నాణేలను కేంద్రం ముద్రించనుంది. ఈ నాణేలపై ఎంజీఆర్ ముఖచిత్రంతోపాటు ‘డాక్టర్ ఎంజీఆర్ బర్త్ సెంటినరీ’ అని ఇంగ్లిష్ అక్షరాల్లో, దేవనాగరి లిపిలో ముద్రించి ఉంటుందని ప్రభుత్వం ఓ నోటిఫికేషన్‌లో పేర్కొంది. నాణేనికి మరోవైపు నాలుగుసింహాలున్న అశోక స్తూపంతోపాటు కింద ‘సత్యమేవ జయతే’ అని రాసి ఉంటుంది. రూ.100 నాణెం బరువు 35 గ్రాములుకాగా, రూ.5 నాణెం బరువు ఆరు గ్రాములు. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ ధాతువులతో రూ.100 నాణెం తయారుచేస్తారు. 75 శాతం రాగి, 20 శాతం జింక్, 5 శాతం నికెల్ ధాతు మిశ్రమంతో రూ.5 నాణెం తయారుచేస్తారు. 
ఎంజీఆర్‌గా ప్రఖ్యాతిగాంచిన రామచంద్రన్ తమిళనాడును పరిపాలిస్తున్న అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం(అన్నాడీఎంకే) పార్టీని స్థాపించారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ఎంజీఆర్ స్మారక నాణేలు
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : భారతరత్న గ్రహీత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ శత జయంతిని పురస్కరించుకుని 

విరాట్ కోహ్లీ రికార్డుఅంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో(టెస్టులు, వన్డేలు, టీ20) కలిపి వేగంగా 15,000 పరుగులు పూర్తి చేసిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. మొత్తం 304 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. వరల్డ్ క్రికెట్‌లో 15000 పరుగులు చేసిన 33వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అయితే 50కిపైగా సగటుతో ఈ రికార్డు సాధించిన బ్యాట్స్‌మన్ మాత్రం ఇతనొక్కడే. సెప్టెంబర్ 6న శ్రీలంకతో టీ20 మ్యాచ్‌లో 82 పరుగులు చేయడంతో కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నాడు.

ప్రపంచ బాక్సింగ్‌లో గౌరవ్ బిధురికి కాంస్యం ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో వైల్డ్ కార్డు ద్వారా ప్రవేశించిన భారత బాక్సర్ గౌరవ్ బిధురి కాంస్య పతకం సాధించాడు. ఈ మేరకు హాంబర్గ్‌లో జరిగిన సెమీఫైనల్లో (56 కేజీల విభాగం) గౌరవ్, డ్యూక్ రగన్ (అమెరికా) చేతిలో పరాజయం చెందాడు. దీంతో భారత్ నుంచి ఈ టోర్నీలో పతకం సాధించిన విజేందర్ (2009), వికాస్ క్రిషన్ (2011), శివ థాపా (2015) సరసన 24 ఏళ్ల గౌరవ్ కూడా చేరాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : ఆగస్టు 31
ఎవరు : భారత బాక్సర్ గౌరవ్ బిధురికి కాంస్యం 
ఎక్కడ : హాంబర్గ్, జర్మనీ

మొయినుద్దౌలా గోల్ట్‌కప్ విజేత హెచ్‌సీఏ ఎలెవన్ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను హెచ్‌సీఏ ఎలెవన్ దక్కించుకుంది. ఆగస్టు 31న ఎయిరిండియాతో జరిగిన ఫైనల్లో హెచ్‌సీఏ ఎలెవన్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. విజేతగా నిలిచిన హెచ్‌సీఏ ఎలెవన్ జట్టుకు రూ. 5లక్షలు, రన్నరప్‌గా నిలిచిన ఎయిరిండియాకు రూ. 3లక్షల ప్రైజ్‌మనీ లభించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మొయినుద్దౌలా గోల్ట్‌కప్ - 2017
ఎప్పుడు : ఆగస్టు 31
ఎవరు : విజేత హెచ్‌సీఏ ఎలెవన్ 
ఎందుకు : ఫైనల్లో ఎయిరిండియాపై విజయం 

ఇటలీ గ్రాండ్‌ప్రి టైటిల్ విజేత హామిల్టన్ ఇటలీ గ్రాండ్ ప్రి టైటిల్‌ను మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సొంతం చేసుకున్నాడు. ఈ మేరకు సెప్టెంబర్ 3న జరిగిన ఫైనల్ రేసులో 53 ల్యాప్‌లను గంటా 15 నిమిషాల 32.310 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ రెండో స్థానాన్ని దక్కించుకోగా... వెటెల్ (ఫెరారీ) మూడో స్థానాన్ని పొందాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు ఒకాన్ ఆరో స్థానంలో, మరో డ్రైవర్ పెరెజ్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. 
20 రేసుల ఈ సీజన్‌లో ఇప్పటికి 13 రేసులు పూర్తయ్యాయి. తాజా విజయంతో హామిల్టన్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో 238 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. వెటెల్ (235 పాయింట్లు) రెండో స్థానానికి పడిపోగా.. బొటాస్ (197 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఇటలీ గ్రాండ్ ప్రీ - 2017
ఎప్పుడు : సెప్టెంబర్ 3
ఎవరు : విజేత లూయిస్ హామిల్టన్ 

శ్రీలంకతో వన్డే సీరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్ శ్రీలంకతో జరిగిన వన్డే సీరీస్‌ను భారత్ 5 - 0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 3న కొలంబోలో జరిగిన ఆఖరి వన్డేలో భారత్ 6 వికెట్లతో గెలుపొందింది. భారత బౌలర్ బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది సీరిస్ పురస్కారం లభించింది. ఈ మ్యాచ్‌లో శతకం బాదిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో పాంటింగ్ (30 సెంచరీలు) సరసన చేరాడు. 49 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 
శ్రీలంకతో ఇటీవల జరిగిన మూడు టెస్టుల సీరీస్‌ను కూడా భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. 

స్టంపింగ్‌లలో ధోని వరల్డ్ రికార్డుభారత వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని వన్డేల్లో అత్యధిక స్టంపింగ్‌లు చేసిన రికార్డును సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో ధోని ఈ ఘనతను సాధించాడు. లంక ఆటగాడు అకిల దనంజయను అవుట్ చేయడం ద్వారా వన్డేల్లో ధోని వంద స్టంపింగ్‌ల రికార్డును సాధించిన వికెట్ కీపర్‌గా రికార్డులెక్కాడు. తద్వారా శ్రీలంక మాజీ వికెట్ కీపర్ సంగక్కర పేరిట ఉన్న 99 స్టంపింగ్‌ల రికార్డును ధోని అధిగమించాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వన్డేల్లో వంద స్టంపింగ్‌లు చేసిన వికెట్ కీపర్ 
ఎప్పుడు : సెప్టెంబర్ 3
ఎవరు : మహేంద్ర సింగ్ ధోని 
ఎక్కడ : కొలంబో
ఎందుకు : శ్రీలంకతో జరిగిన ఐదవ వన్డేలో

స్టార్ ఇండియాకు ఐపీఎల్ ప్రసార హక్కులు ఐదేళ్లపాటు ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసే హక్కులను స్టార్ ఇండియా రూ.16,347.50 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. వేలంలో స్టార్ ఇండియా-సోనీ మధ్య ప్రధాన పోటీ నెలకొనగా.. చివరికి టీవీ ప్రసార హక్కులతో పాటు డిజిటల్ హక్కులనూ స్టార్ ఇండియా కై వసం చేసుకుంది. ఈ ఒప్పందం 2018 నుంచి 2022 వరకు ఉంటుంది. 
2008లో పదేళ్ల కాలానికి సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ రూ.8,200 కోట్ల్ల ఒప్పందం చేసుకుంది. 2015లో నోవి డిజిటల్ మూడేళ్లకు రూ.302.2 కోట్లతో డిజిటల్ హక్కులను గెలుచుకుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఐపీఎల్ ప్రసార హక్కులు 
ఎప్పుడు : 2018-2022 
ఎవరు : స్టార్ ఇండియా 
ఎందుకు : రూ. 16,347.50 కోట్లకు సొంతం

అండర్-17 ఫుట్‌బాల్ ప్రపంచకప్ అధికారిక గీతం ఆవిష్కరణ ఈ ఏడాది అక్టోబరులో భారత్ ఆతిథ్యమివ్వనున్న ‘ఫిఫా’ అండర్-17 ప్రపంచకప్‌నకు సంబంధించి అధికారిక గీతాన్ని ఆవిష్కరించారు. ‘కర్‌కే దిక్లా దే గోల్’ అనే పేరుతో ఉన్న ఈ గీతాన్ని అమితాబ్ భట్టాచార్య రచించగా... ప్రీతమ్ సంగీత దర్శకత్వం వహించారు. ప్రముఖ సింగర్స్ సునిధి చౌహాన్, నీతి మోహన్, బాబుల్ సుప్రియో, షాన్, పాపోన్, మికాలు పాడారు. 
ఈ మ్యూజిక్ వీడియోలో ఫుట్‌బాల్ దృశ్యాలతో పాటు భారతీయ సంస్కృతిని చాటిచెప్పే వివిధ రాష్ట్రాల వేషధారణ, నృత్యంతో కళాకారులు అలరిస్తారు. సింగర్ షాన్, బాబుల్ సుప్రియో, బైచుంగ్ భూటియాతో పాటు చివర్లో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నమస్కారం పెడుతూ కనిపిస్తారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అండర్-17 ఫుట్‌బాల్ ప్రపంచకప్ అధికారిక గీతం ఆవిష్కరణ 
ఎప్పుడు : సెప్టెంబర్ 4 
ఎవరు : రచన - అమితాబ్ భట్టాచార్య, సంగీత దర్శకత్వం - ప్రీతమ్ 

కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సంతోషికి రజతం ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి మత్స్య సంతోషి రజతం సాధించింది. సెప్టెంబర్ 5న జరిగిన సీనియర్ మహిళల 53 కేజీల విభాగం ఫైనల్లో సంతోషి ఓవరాల్‌గా 194కేజీల బరువునెత్తి రెండో స్థానంలో నిలిచింది. స్నాచ్ విభాగంలో 86కేజీల లిఫ్ట్ చేసిన సంతోషి క్లీన్ అండ్ జర్క్ ఈవెంట్‌లో 108 కేజీల బరువునెత్తింది. ఈ విభాగంలో భారత్‌కే చెందిన సంజిత చాను ఓవరాల్‌గా 195 కేజీల బరువునెత్తి పసిడి పతకాన్ని కై వసం చేసుకుంది. సీనియర్ మహిళల 48 కేజీల విభాగంలో మీరాబాయి చాను విజేతగా నిలిచింది. ఈ విజయాలతో మీరాబాయి, సంజిత వచ్చే ఏడాది ఇదే వేదికపై జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించారు.

No comments:

Post a Comment