వార్తల్లో వ్యక్తులు అక్టోబరు 2013
మిస్ న్యూజెర్సీగా భారతీయ యువతి ఎమిలీ షాభారత సంతతి యువతి ఎమిలీ షా (18) ‘మిస్ న్యూజెర్సీ యూఎస్‌ఏ-2014’ టైటిల్‌ను గెలుచుకుంది. పోటీలో 130 మంది యువతులు పోటీపడ్డారు. ఈ విజయంతో ఎమిలీ ‘మిస్ అమెరికా-2014’కు అర్హత సాధించింది. ఇందులోనూ విజయం సాధిస్తే మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనవచ్చు. ఎమిలీ ఇప్పటికే పలు హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ‘ది గ్రేట్ న్యూ వండర్‌ఫుల్’ అనే హాలీవుడ్ చిత్రంలో, ‘అవుట్ ఆఫ్ కంట్రోల్’ అనే బాలీవుడ్ సినిమాలో నటించింది.
లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన లాలూ, శర్మఆర్‌జేడీ అధ్యక్షుడు లోక్‌సభ ఎంపీ లాలూప్రసాద్ యాదవ్, జేడీయూ ఎంపీ జగదీశ్ శర్మలను లోక్‌సభకు అనర్హులుగా ప్రకటిస్తూ అక్టోబర్ 22న లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఎస్.బాల్ శేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వీరిద్దరూ జైలు నుంచి విడుదలైన తేదీ నుంచి ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారు. పశుదాణా కుంభకోణంలో సీబీఐ కోర్టు లాలూప్రసాద్ యాదవ్‌కు ఐదేళ్లు, జగదీశ్ శర్మకు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత లోక్‌సభ ఎంపీలను అనర్హులుగా ప్రకటించడం ఇదే తొలిసారి. అవినీతి కేసులో శిక్షకు గురైన ఎంపీలు, ఎంఎల్‌ఏలు వెంటనే అనర్హతకు గురవుతారని జూలై 10న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
గాయకుడు మన్నాడే మృతిప్రముఖ గాయకుడు మన్నాడే (94) బెంగళూరులో అక్టోబర్ 24న మరణించారు. ఆయన అసలుపేరు ప్రబోధ్ చంద్ర డే. 1919లో మే 1న కోల్‌కతాలో జన్మించారు. 1943లో తమన్నా చిత్రంలో తొలిపాట పాడారు. 1991లో విడుదలైన ప్రహార్ ఆయన చివరి చిత్రం. ఆయన తన 50 ఏళ్ల సినీ జీవితంలో హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడం, అస్సామీ చిత్రాల్లో 3500కుపైగా పాటలు పాడారు. అత్యధికం హిందీ చిత్రాలే. మన్నాడేకు 2005లో పద్మభూషణ్, 2009లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు లభించాయి. ఎంపీ పదవిని కోల్పోయిన రషీద్ మసూద్శిక్షకు గురైన రాజ్యసభ సభ్యుడు రషీద్ మసూద్ తన సభ్యత్వాన్ని కోల్పోయారు. శిక్ష వల్ల పదవి కోల్పోయిన తొలి ప్రజా ప్రతినిధి రషీద్ మసూద్. ఆయనకు అవినీతి కేసులో ఢిల్లీ కోర్టు సెప్టెంబర్ 19న నాలుగు ఏళ్ల జైలుశిక్ష విధించింది. క్రిమినల్ కేసుల్లో రెండేళ్లకుపైన శిక్ష పడిన ప్రజా ప్రతినిధులు (ఎంపీ, ఎంఎల్‌ఏలు) వెంటనే తమ సభ్యత్వం కోల్పోతారని జూలై 10న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
ప్రముఖ రచయిత రావూరి భరద్వాజ కన్నుమూతప్రముఖ తెలుగు సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ (87) అక్టోబర్ 18న హైదరాబాద్‌లో మరణించారు. కృష్ణా జిల్లా నందిగామ తాలూకా మోగులూరులో 1927 జూలై 5న జన్మించిన భరద్వాజ 17వ ఏట నుంచి రచనలు చేయడం మొదలుపెట్టారు. అచ్చు అయిన తొలి కథ విమల. దాదాపు 43 పిల్లల కథలు, 17 నవలలు, 11 సాహిత్య గ్రంథాలు, 33 సైన్స్ కథలను రాశారు. 1968, 1983ల్లో రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డులు, 1987లో సోవియట్‌ల్యాండ్ నెహ్రూ అవార్డు, భారతీయ భాషాపరిషత్ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వంటి అనేక పురస్కారాలు ఆయనకు దక్కాయి. ఆయన అనేక రచనలు ఆంగ్లం, హిందీ, తమిళం, కన్నడం, మళయాలం భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆంధ్రా, జేఎన్‌టీయూ, నాగార్జున విశ్వవిద్యాలయాలు ఆయనకు డాక్టరేట్లు ప్రదానం చేశాయి. 2012 సంవత్సరానికి గానూ ఆయన రాసిన నవల పాకుడురాళ్లుకు జ్ఞానపీఠ్ అవార్డు దక్కింది. ఈ అవార్డు పొందిన మూడో తెలుగు రచయిత భరద్వాజ. గతంలో విశ్వనాథ సత్యనారాయణకు, సి.నారాయణరెడ్డిలకు జ్ఞానపీఠ్ లభించింది.
రైల్వే బోర్డ్ చైర్మన్‌గా అరుణేంద్ర కుమార్రైల్వే బోర్డ్ చైర్మన్‌గా అరుణేంద్ర కుమార్ అక్టోబర్ 9న నియమితులయ్యారు. రైల్వే బోర్డు సభ్యుడిగా ఉన్న అరుణేంద్ర పదవీ విరమణ చేసిన చైర్మన్ వినయ్‌మిట్టల్ స్థానంలో జూన్ 30 నుంచి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఎస్‌బీఐ చైర్‌పర్సన్‌గా అరుంధతీ భట్టాచార్యస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్‌పర్సన్‌గా అరుంధతీ భట్టాచార్య అక్టోబర్ 7న నియమితులయ్యారు. మూడేళ్లపాటు ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. బ్యాంక్ చరిత్రలో ఒక మహిళ ఈ అత్యున్నత స్థాయి బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఆమె ఎస్‌బీఐ మేనేజింగ్ డెరైక్టర్(ఎండీ), చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.
యూకేలో హైకమిషనర్‌గా రంజన్ మథాయ్‌భారత మాజీ విదేశాంగ కార్యదర్శి రంజన్ మథాయ్ యునెటైడ్ కింగ్‌డమ్‌లో భారత హైకమిషనర్‌గా అక్టోబర్ 1న నియమితులయ్యారు. ప్రస్తుత హైకమిషనర్ జైమిని భగవతీ స్థానంలో మథాయ్ బాధ్యతలు చేపడతారు. ఆయన ఫ్రాన్స్‌లో భారత రాయబారిగా కూడా పనిచేశారు.
ఒబామా ప్రభుత్వంలో అసిస్టెంట్ సెక్రటరీగా అరుణ్‌అమెరికా అంతర్జాతీయ వాణిజ్య విభాగం అసిస్టెంట్ సెక్రటరీగా భారత సంతతికి చెందిన అరుణ్ ఎం.కుమార్‌ను అక్టోబర్ 4న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించారు. ఆయన కె.పి.ఎం.జి కన్సల్టెన్సీ సంస్థలో భాగస్వామిగా, బోర్డు సభ్యుడిగా పనిచేశారు. విదేశీ వాణిజ్య విభాగం అసిస్టెంట్ సెక్రటరీతోపాటు అంతర్జాతీయ వాణిజ్య పరిపాలన విభాగం డెరైక్టర్ జనరల్‌గా కూడా అరుణ్‌కుమార్ నియమితులయ్యారు.

No comments:
Post a Comment