వార్తల్లో వ్యక్తులు అక్టోబరు 2014
హర్యానా ముఖ్యమంత్రిగా ఖట్టర్
హర్యానా 10వ ముఖ్యమంత్రిగా మనోహర్‌లాల్ ఖట్టర్ (60) అక్టోబరు 26న బాధ్యతలు చేపట్టారు. ఆ రాష్ట్ర గవర్నర్ సోలంకి సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. హర్యానా రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత బీజేపీ సర్కారు కొలువు దీరడం ఇదే తొలిసారి. హర్యానా ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న తొలి పంజాబీ ఖట్టర్.
ఇండోనేసియా అధ్యక్షునిగా జోకో విడోడో
ఇండోనేసియా ఏడో అధ్యక్షునిగా జోకో విడోడో అక్టోబరు 20న ప్రమాణ స్వీకారం చేశారు. రాజకీయాలకు, సైన్యానికి చెందని తొలి అధ్యక్షుడు ఆయనే కావడం విశేషం. జూలైలో జరిగిన ఎన్నికల్లో మాజీ సైనికాధికారి ప్రబోవో సుబియాంతోపై జోకో విజయం సాధించారు.
బ్రెజిల్ అధ్యక్షురాలిగా రౌసెఫ్ తిరిగి ఎన్నిక
బ్రెజిల్ అధ్యక్షురాలిగా వర్కర్స్ పార్టీకి చెందిన దిల్మా రౌసెఫ్ తిరిగి ఎన్నికయ్యారు. అక్టోబరు 26న ప్రకటించిన ఫలితాల్లో ఆమెకు 51.6 శాతం ఓట్లు రాగా, ప్రతిపక్ష ఆసియో నెవెస్‌కు 48.36 శాతం ఓట్లు దక్కాయి.
సుప్రీం కోర్టు సెక్రటరీ జనరల్‌గా అవధాని
సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌గా వి.ఎస్.ఆర్. అవధాని అక్టోబరు 26న బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా నరసరావుపేట.
సుస్థిరాభివృద్ధిపై ప్రపంచ పరిశోధన మండలి చైర్మన్‌గా జైరాం రమేశ్
సుస్థిరాభివృద్ధిపై ఏర్పాటైన ప్రపంచ పరిశోధన మండలి చైర్మన్‌గా మాజీ కేంద్రమంత్రి జైరాం రమేశ్‌ను అక్టోబరు 25న ఖరారు చేశారు. ఫ్యూచర్ ఎర్త్ ఎంగేజ్‌మెంట్ అనే ఈ వేదికను యూఎన్‌ఈపీ (యునెప్), యునెస్కో, ప్రపంచ పర్యావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) ఏర్పాటు చేశాయి. ప్రపంచ పర్యావరణ మార్పునకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కోవడంలో ఈ మండలి వ్యూహాత్మక సలహాలను అందిస్తుంది.
యూఎస్ హక్కుల విభాగంలో వనితా గుప్తా
భారతీయ అమెరికన్ మహిళా న్యాయవాది, అమెరికా పౌర హక్కుల సంఘం డిప్యూటీ లీగల్ డెరైక్టర్ వనితా గుప్తా (39) అరుదైన గౌరవం పొందారు. అమెరికా న్యాయశాఖలో కీలకమైన పౌర హక్కుల విభాగం సహాయక అటార్నీ జనరల్‌గా అక్టోబరు 15న నియమితులయ్యారు. తద్వారా ఈ పదవి పొందిన తొలి దక్షిణాసియా అమెరికన్‌గా వనితా గుప్తా గుర్తింపు పొందారు. మోల్లీ మోరాన్ స్థానంలో నియమితులైన ఆమె ఈ నెల 20న పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఆర్థిక సలహాదారుగా అరవింద్
ప్రముఖ ఆర్థిక వేత్త, విద్యావేత్త అరవింద్ సుబ్రమణియన్ కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా అక్టోబరు 16న బాధ్యతలు చేపట్టారు. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. గతంలో ఆయన అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో ఆర్థికవేత్తగా పనిచేశారు.
బొలీవియా అధ్యక్షుడిగా మొరాల్స్
బొలీవియా అధ్యక్ష ఎన్నికల్లో ఎవో మొరాల్స్ మూడోసారి విజయం సాధించారు. అక్టోబరు 12న జరిగిన ఎన్నికల్లో ఆయనకు 60 శాతం ఓట్లు లభించాయి. ప్రత్యర్థి డోరియా మెడినాకు 25 శాతం దక్కాయి. ఆర్థిక, రాజకీయ సుస్థిరతను అందించేందుకు మొరాల్స్‌కు మూడోసారి ప్రజలు పట్టం కట్టారు. గతంలో దక్షిణ అమెరికాలో అత్యంత పరిపాలించలేని దేశాల్లో బొలీవియా ఒకటి.
భారత్‌లో పర్యటించిన ఫేస్‌బుక్ సీఈఓ
ఫేస్‌బుక్ సీఈఓ, సహ వ్యవస్థా పకుడు మార్క్ జుకర్‌బెర్గ్ తొలిసారి భారత్‌లో పర్యటించారు. అక్టోబర్ 9న ఢిల్లీలో జరిగిన ఇంటర్నెట్ ఆర్గ్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీని కలిసి డిజిటల్ ఇండియా కార్యక్రమానికి సాయం అందిస్తామని తెలిపారు.
యునిసెఫ్ రాయబారిగా అమీర్‌ఖాన్
బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ అక్టోబర్ 9న ఐక్యరాజ్యసమితి బాలల అత్యవసర నిధి (యునిసెఫ్) దక్షిణ ఆసియా రాయబారిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పిల్లల పోషకాహారంపై విస్తృత అవగాహన కల్పించేందుకు కృషి చేస్తారు.
హెచ్‌యూఎల్ డెరైక్టర్‌గా కల్పనా
హిందూస్థాన్ యునీ లీవర్ (హెచ్‌యూఎల్) డెరైక్టర్‌గా కల్పనా మోర్పారియా అక్టోబర్ 9న బాధ్యతలు స్వీకరించారు. హెచ్‌యూఎల్‌కు డెరైక్టర్‌గా పగ్గాలు చేపట్టిన తొలి మహిళ ఈమె. ప్రస్తుతం జేపీ మోర్గాన్ ఇండియాలో ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అంతేకాకుండా రెడ్డీస్ ల్యాబొరేటరీస్, బెన్నెట్ కోల్ మేన్ అండ్ కో తదితర సంస్థలలో ఆమె కీలక బాధ్యతలు నిర్విహిస్తున్నారు.
నాటో సెక్రటరీ జనరల్‌గా స్టోలెన్‌బర్గ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో)సెక్రటరీ జనరల్ గా జెన్స్ స్టోలెన్‌బర్గ్(55) అక్టోబర్ 1న బాధ్యతలు చేపట్టా రు. ఈయన నార్వే మాజీప్రధాని. అండర్స్ ఫాగ్ రాస్ ముస్సేన్ స్థానంలో స్టోలెన్‌బర్గ్ బాద్యతలు చేపట్టారు. 65 ఏళ్ల నాటోకు ఆయన 13వ సెక్రటరీ జనరల్. నాటో కూటమిలో ఉత్తర అమెరికా, ఐరోపాలకు చెందిన 28 దేశాలు ఉన్నాయి.
కిలిమంజారోను అధిరోహించిన విశాఖ బాలికవిశాఖ జిల్లా వడ్డాది గ్రామానికి చెందిన జాహ్నవి అనే పన్నెండేళ్ల బాలిక ఆఫ్రికాలో అత్యంత ఎత్తై పర్వత శిఖరం కిలిమంజారోను అక్టోబరు 2న అధిరోహించింది. సముద్ర మట్టానికి 5,895 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ శిఖరాన్ని ఎక్కిన భారతీయుల్లో అత్యంత పిన్నవయస్కురాలిగా ఆమె అరుదైన ఘనత సాధించింది.

No comments:
Post a Comment