AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు ఏప్రిల్ 2013

వార్తల్లో వ్యక్తులు ఏప్రిల్ 2013
ఏడీబీ అధ్యక్షునిగా తకిహితో నకావోఆసియా అభివద్ధి బ్యాంకు (ఏడీబీ) తొమ్మిదో అధ్యక్షునిగా జపాన్ ఆర్థిక శాఖ మాజీ ఉపమంత్రి తకిహితో నకావో (57) ఎన్నికయ్యారు. రాజీనామా చేసిన హరుహికో కురోడా స్థానంలో నకావో ఎన్నికైనట్లు ఫిలిపైన్‌‌స కేంద్రంగా పనిచేస్తున్న ఏడీబీ ఏప్రిల్ 26న ప్రకటించింది. 2016 నవంబర్ వరకు నకావో ఈ పదవిలో కొనసాగుతారు.

శైలేంద్రనాథ్ రాయ్ మృతి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించిన శైలేంద్రనాథ్ రాయ్ (45) మరో సాహస విన్యాసం చేస్తూ ఏప్రిల్ 28న మరణించారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి సమీపంలో తీస్తా నదిపై తాడుతో విన్యాసం చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. 70 అడుగుల ఎత్తులో 600 అడుగుల పొడవైన తీగ చక్రానికి జుట్టు పిలకను కట్టి ముందుకు కదిలాడు. మధ్యలో గుండెపోటుతో మరణించాడు. 2011లో రాజస్థాన్‌లో తీగకు జుట్టు పిలకను కట్టి వేలాడుతూ 82.5 మీటర్ల దూరం కదిలి గిన్సిస్ రికార్డు సష్టించాడు.

ఎడిటర్‌‌స గిల్డ్ అధ్యక్షునిగా ఎన్.రవి‘ద హిందూ’ ఆంగ్ల దినపత్రిక మాజీ సంపాదకులు ఎన్. రవి ఎడిటర్‌‌స గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఇంతవరకూ ఈ పదవిలో బిజినెస్ స్టాండర్‌‌డ చైర్మన్ టి.ఎన్. నైనన్ ఉన్నారు.

గాయని శంషాద్ బేగం మృతి తొలితరం సినీ నేపథ్యగాయని శంషాద్ బేగం (94) ముంబై లో ఏప్రిల్ 24న మరణించారు. 1941లో ఆమె తొలిసారి ‘కజాంచి’ చిత్రంలో పాటలు పాడారు. హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, తమిళ్, పంజాబీ భాషల్లో వందలాది పాటలు పాడారు. 1945-55 మధ్య కాలంలో హిందీ చిత్రాల్లో ప్రధాన గాయనిగా కొనసాగారు. 2009లో ఆమెను పద్మభూషణ్ పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది.
 
ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి అశోక్ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా సీనియర్ దౌత్యవేత్త అశోక్ కుమార్ ముఖర్జీ ఏప్రిల్ 17న బాధ్యతలు స్వీకరించారు. 

జస్టిస్ జె.ఎస్. వర్మ మృతి సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ శరణ్ (జె.ఎస్.) వర్మ (80) అనారోగ్యంతో న్యూఢిల్లీలో మరణించారు. అత్యాచార నిరోధక చట్టాన్ని మరింత కఠినతరం చేసేందుకు కేంద్రం జస్టిస్ వర్మ నేతత్వంలో కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సులకనుగుణంగానే నేర న్యాయ సవరణ చట్టం -2013 రూపొందించారు. వర్మ 1933 జనవరి 18న మధ్యప్రదేశ్‌లో జన్మించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 1997 మార్చి 25 నుంచి 1998 జనవరి 18 వరకు బాధ్యతలు నిర్వర్తించారు.

సీఆర్‌పీఎఫ్ స్పెషల్ డీజీగా అరుణా బహుగుణసీఆర్‌పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) స్పెషల్ డెరైక్టర్ జనరల్‌గా ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిణి అరుణా బహుగుణ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఏప్రిల్ 18న ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా ఈ పదవిలో నియమితులైన తొలి మహిళా అధికారిగా అరుణ గుర్తింపు తెచ్చుకున్నారు. 

గణిత మేధావి శకుంతలా దేవి కన్నుమూతప్రపంచ ప్రఖ్యాత గణిత మేధావి, హ్యూమన్ కంప్యూటర్‌గా గుర్తింపు పొందిన శకుంతలాదేవి (80) ఏప్రిల్ 21న బెంగళూరులో మరణించారు. శకుంతలాదేవి 1939 నవంబర్ 4న బెంగళూరులో జన్మించారు. 1977లో అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 188138517 సంఖ్యకు క్యూబ్ రూట్ చెప్పడంలో కంప్యూటర్‌తో పోటీపడి మరీ గెలుపొందారు. దీంతో అప్పటి నుంచి హ్యూమన్ కంప్యూటర్‌గా ఆమె పేరు గాంచారు. జ్యోతిష్కురాలిగా, న్యూమరాలజిస్ట్‌గా, రచయిత్రిగా కూడా ప్రసిద్ధి చెందారు. ‘ఫన్ విత్ నంబర్స్’, ‘ఆస్ట్రాలజీ ఫర్ యూ’, ‘పజిల్స్ టు పజిల్ యూ’, ‘మ్యాథబ్లిట్’ వంటి పలు పుస్తకాలు రాశారు. 

వి.ఎస్. రమాదేవి మృతికర్ణాటక మాజీ గవర్నర్ వి.ఎస్. రమాదేవి (78) ఏప్రిల్17న బెంగళూరులో మరణించారు. రమాదేవి ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా 1990లో టీఎన్ శేషన్ కంటే ముందు నవంబర్ 26 నుంచి 1990 డిసెంబర్ 11 వరకు పని చేశారు. తద్వారా ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. 1997 నుంచి 1999వరకూ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా, 1999 నుంచి 2002 వరకు కర్ణాటక గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా, కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా కూడా ఆమె సేవలందించారు. రమాదేవి 1934 మార్చి 15న జన్మించారు.
 
ఐఐసీటీ డెరైక్టర్‌గా లక్ష్మీకాంతంఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) డెరైక్టర్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లక్ష్మీ కాంతం ఏప్రిల్ 9న నియమితులయ్యారు. ఈ సంస్థకు ఆమె తొలి మహిళా డెరైక్టర్. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐఐసీటీ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) కింద పని చేస్తున్న 37 పరిశోధన కేంద్రాల్లో ఒకటి.

నాస్కామ్ చైర్మన్‌గా కష్ణ కుమార్2013-14 సంవత్సరానికి నాస్కామ్ (ది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్) చైర్మన్‌గా మైండ్ ట్రీ సీఈఓ కష్ణ కుమార్ నటరాజన్, వైస్ ప్రెసిడెంట్‌గా ఆర్. చంద్రశేఖరన్ (కాగ్నిజెంట్) నియమితులయ్యారు.

ఏఎఫ్‌పీపీడీ చైర్మన్‌గా కురియన్రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ప్రతిష్టాత్మక ఏషియన్ ఫోరమ్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఏఎఫ్‌పీపీడీ) చైర్మన్‌గా ఎన్నికయ్యారు. బ్యాంకాక్‌లో ఏప్రిల్ 11న జరిగిన ఏఎఫ్‌పీపీడీ 73వ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఏఎఫ్‌పీపీడీని 1981లో స్థాపించారు. కురియన్ ప్రస్తుతం ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

జస్టిస్ చిన్నపరెడ్డి మృతి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, రాజ్యాంగ నిపుణులు జస్టిస్ ఒ.చిన్నపరెడ్డి(91) హైదరాబాద్‌లో ఏప్రిల్ 13న మరణించారు. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఆయన 1967లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 1978లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1987లో పదవీ విరమణ చేశారు. మానవ హక్కులకు సంబంధించి కీలక తీర్పులిచ్చారు. ఆయన రాసిన ‘ది కోర్ట్ అండ్ ది కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా’ పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది. 

ఆర్.పి. గోయెంకా మృతిప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్.పి.జి గ్రూప్ వ్యవస్థాపకులు రామ్‌ప్రసాద్ గోయెంకా (83) ఏప్రిల్ 14న కోల్‌కతాలో మరణించారు. ఆయన 1979లో ఆర్‌పీజీ ఎంటర్ ప్రెజెస్‌ను ఏర్పాటు చేశారు. 1980లో గోయెంకా అనేక కంపెనీలను కొనుగోలు చేశారు. ఆయన సంస్థల టర్నోవర్ దాదాపు రూ. 30 వేల కోట్లు. గోయెంకా 2000 -2006 వరకు రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు.

గాయకుడు పీబీ శ్రీనివాస్ మృతిప్రముఖ గాయకుడు పి.బి. శ్రీనివాస్ (82) చెన్నైలో ఏప్రిల్ 14న మరణించారు. కాకినాడకు చెందిన ఆయన ఏడు భాషల్లో 3000పైగా పాటలు పాడారు. 1952లో ‘మిస్టర్ సంపత్’ అనే హిందీ చిత్రంలో తొలిసారి పాటలు పాడారు. తెలుగులో ఆయన పాడిన తొలిచిత్రం ‘జాతక ఫలం’. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ, సంస్కతంలో ప్రావీణ్యం సంపాదించారు. అనేక కవితలు గజల్స్ రాశారు. తమిళనాడు ప్రభుత్వ పురస్కారం కళైమామణి, వొకేషనల్ ఎక్స్‌లెన్సీ, విద్వత్ శిరోమణి పురస్కారాలతో సహా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ఆయన పూర్తి పేరు ప్రతివాది భయంకర శ్రీనివాస్.

హిలరీ కోప్రొవ్స్కీ మృతిపోలియోకు తొలిసారి ఓరల్ వ్యాక్సిన్ విజయవంతంగా రూపొందించిన పోలెండ్‌కు చెందిన డాక్టర్ హిలరీ కోప్రొవ్స్కీ(96)ఏప్రిల్ 11న ఫిల్‌డెల్ఫియాలో మరణించారు. 1950లో కోప్రోవిస్కీ పోలియో వ్యాక్సిన్‌ను తయారు చేశారు.

రాబర్ట్ ఎడ్వర్డ్స్ మృతిబ్రిటన్ శాస్త్రవేత్త, టెస్ట్‌ట్యూబ్ బేబీ సష్టికర్త రాబర్ట్ ఎడ్వర్డ్స్(87) ఏప్రిల్ 10న లండన్‌లో మరణించారు. 1978లో మరో శాస్త్రవేత్త డాక్టర్ పాట్రిక్ స్టెప్ట్యూతో కలిసి టెస్ట్‌ట్యూబ్ బేబీ ‘లూయిస్ బ్రౌన్’ను సష్టించారు. ప్రస్తుతం ఐదు మిలియన్లకు పైగా కుటుంబాలు ఈ విధానాన్ని అనుసరించి సంతానం పొందాయి. టెస్ట్‌ట్యూబ్ బేబీని సష్టించే ఇన్ విట్రో ఫైర్టిలైజేషన్(ఐవీఎఫ్) విధానాన్ని కనుగొన్నందుకు 2010లో ఆయనకు నోబెల్ అవార్డు లభించింది. 

ప్రపంచాన్ని చుట్టి వచ్చిన అభిలాష్లెఫ్ట్‌నెంట్ కమాండర్ అభిలాష్ టోమీ 150 రోజులు ఆగకుండా సముద్రంలో ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పారు. ఈ క్రమంలో ‘ఐఎస్‌ఎస్‌వీ మహదీ’ లో సాగర్ పరిక్రమ్-2 పేరుతో ముంబై నుంచి 2012 నవంబర్ 1న తన యాత్ర ప్రారంభించిన టోమీ.. హిందూ, దక్షిణ, ఫసిఫిక్ అట్లాంటిక్ సముద్రాల్లో ఆగకుండా 22,000 నాటికల్ మైళ్లు ప్రయాణించి ఈ ఏడాది ఏప్రిల్ 6న ముంబై చేరుకున్నాడు. భారత్‌కు చెందిన వారు యాత్రను చేయనప్పటికీ విదేశాలకు చెందిన 80 మంది ఇటువంటి యాత్రను చేశారు.

బ్రిటన్ మాజీ ప్రధాని థాచ ర్ మృతి బ్రిటన్ తొలి మహిళా ప్రధానమంత్రి మార్గరెట్ థాచర్(87) ఏప్రిల్ 8న లండన్‌లో మరణించారు. ఉక్కు మహిళగా పేరుగాంచిన ఆమె 20వ శతాబ్దాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఒకరుగా నిలిచారు. కన్సర్వేటివ్ పార్టీ నాయకురాలైన మార్గరెట్ 1979 నుంచి 1990 వరకు మూడు సార్లు బ్రిటన్ ప్రధానిగా పనిచేశారు. బ్రిటన్ ప్రధానిగా సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తిగా ఆమె నిలిచింది. సోవియట్ యూనియన్ అణచివేత విధానాలను వ్యతికేకిస్తూ 1976లో ఆమె ఉపన్యాసం చేశారు. దాంతో రష్యాపత్రిక ఆమెను ఉక్కు మహిళగా అభివర్ణించింది.

రచయిత్రి రూత్ ప్రవెర్ మృతి ప్రఖ్యాత స్క్రిప్ట్, నవలా రచయిత్రి రూత్ ప్రవెర్ ఝూబ్‌వాలా (85) అనారోగ్యంతో మన్‌హట్టన్‌లో ఏప్రిల్ 3న మరణించారు. ఆస్కార్, బుకర్ ప్రెజ్‌లు రెండూ గెలుచుకున్న ఒకే ఒక వ్యక్తి రూత్ ప్రవెర్. రూత్ 25ఏళ్లపాటు ఢిల్లీలో జీవించారు. జర్మనీలో పుట్టిన ఆమె భారతీయ పార్సీ ఆర్కిటెక్ట్ సైరస్ హెచ్ ఝూబ్‌వాలాను వివాహమాడారు. 19 నవలలు రాసిన ఆమె సినిమా రచయిత్రిగా కూడా పనిచేశారు. ఆమె పనిచేసిన ‘ఏ రూత్ విత్ ఎ వ్యూ’, ‘హార్ట్స్ ఎండ్’ చిత్రాలకు ఆస్కార్ అవార్డులు లభించాయి. ఆమె ‘హీట్ అండ్ డస్ట్’ నవలా రచనకు బుకర్ ప్రెజ్ పొందారు.

No comments:

Post a Comment