AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

చరిత్రలో ఈ నెల నవంబరు 2017

చరిత్రలో ఈ నెల నవంబరు 2017
అంతర్జాతీయంసింగపూర్ పాస్‌పోర్ట్ అత్యంత శక్తిమంతం ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టులను జారీచేస్తున్న దేశాల జాబితాలో సింగపూర్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ జాబితాలో ఒక ఆసియా దేశం తొలి స్థానంలో నిలవడం ఇదే తొలిసారి. ఆర్థిక సలహాల సంస్థ ఆర్టన్ క్యాపిటల్ విడుదల చేసిన 'గ్లోబల్ పాస్‌పోర్టు పవర్ ర్యాంక్-2017'జాబితాలో రెండో స్థానంలో జర్మనీ నిలవగా భారత్ 75వ ర్యాంకును పొందింది. గత ఏడాది 78వ స్థానంలో నిలిచిన ఇండియా ఈసారి మూడుస్థానాలు మెరుగుపరుచుకుంది. భారతీయులకు 51 దేశాల్లో వీసా మినహాయింపు, లేదా వీసా ఆన్ అరైవల్ (విదేశీ విమానాశ్రయాల్లో దిగిన వెంటనే వీసా మంజూరు చేస్తారు) సౌకర్యం ఉంది. అఫ్గానిస్తాన్ చివరిదైన 94వ స్థానానికి పరిమితమవగా, పాకిస్తాన్, ఇరాక్‌లు సంయుక్తంగా 93వ స్థానంలో నిలిచాయి. 
టాప్-10 శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌లు 

ర్యాంకు
దేశం
స్కోరు
1
సింగపూర్
159
2
జర్మనీ
158
3
స్వీడన్, దక్షిణ కొరియా
157
4
డెన్మార్క్, ఫిన్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, నార్వే, జపాన్, యూకే
156
5
లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్‌‌స, బెల్జియం, ఆస్ట్రియా, పోర్చుగల్
155
6
మలేసియా, ఐర్లాండ్, కెనడా, అమెరికా
154
7
ఆస్ట్రేలియా, గ్రీస్, న్యూజిలాండ్
153
8
మాల్టా, చెక్ రిపబ్లిక్, ఐస్‌లాండ్
152
9
హంగెరీ
150
10
స్లోవేనియా, స్లోవేకియా, పోలండ్, లిథువేనియా, లాత్వియా
149
ర్యాంకు ఎలా నిర్ణయిస్తారు..
వివిధ దేశాల మధ్య అమలులో ఉన్న ఒప్పందాల ప్రకారం ఏ దేశ పౌరులకై తే అత్యధిక దేశాల్లో వీసా అవసరం ఉండదో సదరు దేశ పాస్‌పోర్ట్‌ను అత్యంత శక్తిమంతమైనదిగా పరిగణిస్తారు. సింగపూర్ దేశస్తులు వీసా అవసరం లేకుండా ఏకంగా 159 దేశాలకు వెళ్లే ఆస్కారం ఉంది కాబట్టి దానికి ప్రథమ స్థానం దక్కింది. ఇదివరకు జర్మనీతో కలిసి సింగపూర్ తొలి స్థానాన్ని పంచుకునేది. అయితే ఇటీవల సింగపూర్ ప్రజలకు పరాగ్వే వీసా మినహాయింపునిచ్చింది. దాంతో జర్మనీని రెండోస్థానానికి నెట్టిన సింగపూర్ తొలి స్థానానికి ఎగబాకింది. ఆసియా నుంచి దక్షిణకొరియా, జపాన్, మలేసియాలు కూడా మొదటి పది దేశాల్లో చోటు దక్కించుకున్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : గ్లోబల్ పాస్‌పోర్టు పవర్ ర్యాంక్-2017 
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : ఆర్టన్ క్యాపిటల్
ఎక్కడ : తొలి స్థానంలో సింగపూర్, 75వ స్థానంలో భారత్ 

చైనా అధ్యక్షుడిగా మరో ఐదేళ్లు జిన్‌పింగ్చైనాలోని అధికార కమ్యూనిస్టు పార్టీ.. దేశాధ్యక్షుడు షి జిన్‌పింగ్ నేతృత్వంలో కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షుడిగా మరో ఐదేళ్ల పాటు (రెండోసారి) జిన్‌పింగ్‌కు అవకాశం కల్పించింది.
జిన్‌పింగ్, కెకియాంగ్ (కమ్యూనిస్ట్ పార్టీ రెండో ర్యాంక్ నాయకుడు, ప్రధాని) కాక రూలింగ్ కౌన్సిల్‌లో జిన్‌పింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లీ జాన్షు(67), ఉప ప్రధాని వాంగ్ యాంగ్(62), కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతకర్త వాంగ్ హనింగ్(62), పార్టీ ఆర్గనైజేషన్ డిపార్ట్‌మెంట్ హెడ్ జావో లెజీ(60), షాంఘై పార్టీ చీఫ్ హాన్ జెంగ్ (63) చోటు దక్కించుకున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : చైనా అధ్యక్షుడిగా మరో ఐదేళ్లు జిన్‌పింగ్ 
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : చైనా జాతీయ కమ్యూనిస్ట్ కాంగ్రెస్
ఎక్కడ : బీజింగ్ 

హవాయిలో రోడ్లపై ఫోన్లు వినియోగిస్తే జరిమానాహవాయిలోని హోనొలులు నగరం రోడ్లపై నడిచేప్పుడు ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు చూడటంపై నిషేధం విధిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. అక్టోబర్ 25 నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం రోడ్లపై ఫోన్లు చూస్తూ నడిచిన వారికి 35 డాలర్ల (రూ.2,200) జరిమానా విధిస్తారు. 
ఇటీవల అమెరికాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్క 2016లోనే 5,987 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది రోడ్డుపై వస్తున్న వాహనాలను చూసుకోకపోవడంతో ప్రమాదానికి గురయ్యారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : రోడ్లపై ఫోన్లు చూస్తూ నడిస్తే 35 డాలర్ల జరిమానా 
ఎప్పుడు : అక్టోబర్ 25 నుంచి 
ఎక్కడ : హోనొలులు, హవాయి, అమెరికా 
ఎందుకు : రోడ్డు ప్రమాదాల నివారణకు 

స్వాతంత్ర తీర్మానాన్ని ఆమోదించిన కాటలోనియా స్వాతంత్య్రానికే మొగ్గు చూపుతూ జరిగిన రెఫరెండానికి కొనసాగింపుగా స్పెయిన్ నుంచి స్వాతంత్య్రం కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానానికి అక్టోబర్ 27న బార్సిలోనాలోని కాటలోనియా పార్లమెంటు ఆమోదం తెలిపింది. ‘గణతంత్ర స్వతంత్ర దేశంగా కాటలోనియాను ప్రకటిస్తున్నాం’ అనే ఆ తీర్మానానికి అనుకూలంగా 70 మంది, వ్యతిరేకంగా 10 మంది ఓటేశారు. 
అయితే ఆ నిర్ణయం చట్టబద్ధం కాదని, అమలుకు వీలుకాదని స్పెయిన్ తేల్చిచెప్పింది. కాటలోనియాపై ప్రత్యక్ష పాలన విధించేలా ప్రధాని రజోయ్‌కి అధికారాలను అప్పగిస్తూ స్పెయిన్ సెనెట్ తీర్మానం చేసింది. ఐక్య స్పెయిన్‌కే యూరోపియన్ యూనియన్, అమెరికాలు మద్ధతు ప్రకటించాయి. కాటలోనియా పార్లమెంట్‌ను రద్దు చేసి, డిసెంబర్ 21న ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని నిర్ణయించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కాటలోనియా స్వాతంత్ర తీర్మానానికి ఆమోదం 
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : కాటలోనియా పార్లమెంట్ 
ఎందుకు : స్పెయిన్ నుంచి విడిపోయేందుకు 

సౌదీలో క్రీడా మైదానాల్లోకి మహిళలకు అనుమతిఇటీవల మహిళలను డ్రైవింగ్‌కు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న సౌదీ అరేబియా తాజాగా వారిని క్రీడా మైదానాల్లోకి కూడా అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం 2018 నుంచి అమల్లోకొస్తుందని, దీంతో వారు దేశంలోని మూడు ప్రధాన మైదానాలైన రియాద్, జెడ్డా, దామన్ స్టేడియాల్లో జరిగే మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించవచ్చని రాజు మహ్మద్ బిన్ సల్మాన్ తెలిపారు. అక్కడి గార్డియన్‌షిప్ చట్టం ప్రకారం మహిళలు చదువుకోవాలన్నా, ప్రయాణాలు చేయాలన్నా తండ్రి, భర్త లేదా సోదరుడి నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ మహిళల ప్రగతి కోసం పురుషులతోపాటు సమాన హక్కులు కల్పించేందుకు పలు సంస్కరణలు తీసుకొచ్చారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : క్రీడా మైదానాల్లోకి మహిళలకు అనుమతి
ఎప్పుడు : 2018 నుంచి
ఎవరు : రాజు మహ్మద్ బిన్ సల్మాన్ 
ఎక్కడ : సౌదీ అరేబియా
ఎందుకు : పురుషులతోపాటు సమాన హక్కులు కల్పించేందుకు

రోబోకు పౌరసత్వం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక రోబోకి పౌరసత్వం లభించింది. ‘సోఫియా’ అనే హ్యూమనాయిడ్ రోబోకి పౌరసత్వం ఇస్తున్నట్లు అక్టోబర్ 27న సౌదీ అరేబియా ప్రకటించింది.

జాతీయంగుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల  గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 9, 14 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అలాగే... హిమాచల్‌ప్రదేశ్‌తో పాటుగానే డిసెంబర్ 18న గుజరాత్ ఎన్నికలకు కౌంటింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ ఏకే జోతి అక్టోబర్ 25న వెల్లడించారు. 
182 సీట్లున్న గుజరాత్ అసెంబ్లీలో తొలి దశలో 89 స్థానాలకు, రెండో దశలో 93 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రంలోని 50,128 పోలింగ్ కేంద్రాల్లో ఓటరు ధ్రువీకరణ పత్రాల (వీవీపీఏటీ)తో కూడిన ఈవీఎంలతో ఎన్నికలు జరగనున్నాయి. దీంతోపాటుగా ప్రతి నియోజకవర్గంలో ఒక పూర్తిస్థాయి మహిళా పోలింగ్ కేంద్రాన్ని ఈసారి ఏర్పాటు చేయనున్నారు. 

నవంబర్ 8న ‘నల్లధన వ్యతిరేక దినం’నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని నవంబర్ 8తో ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో ఆ రోజును ‘నల్లధన వ్యతిరేక దినం’గా జరుపుకోవాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. నల్లధనం వ్యతిరేక కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులతో పాటు కేంద్ర మంత్రులు పాల్గొంటారని ఆయన మీడియాకు వెల్లడించారు. 
మరోవైపు నవంబర్ 8న ‘బ్లాక్ డే’గా జరుపుకోవాలని కాంగ్రెస్, కమ్యూనిస్టులతో సహా 18 పార్టీలు పిలుపునిచ్చాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : నల్లధన వ్యతిరేక దినం 
ఎప్పుడు : నవంబర్ 8న
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : దేశవ్యాప్తంగా 
ఎందుకు : నోట్ల రద్దు నిర్ణయం తీసుకొని ఏడాది పూర్తయిన సందర్భంగా 

బుల్లెట్ రైలుకు ‘చిరుత’ లోగో ఖరారుకేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ.1.08లక్షల కోట్ల బుల్లెట్ రైలు ప్రాజెక్టు ‘లోగో డిజైన్’ పోటీలో 27 ఏళ్ల గ్రాఫిక్ డిజైనర్ చక్రధర్ ఆళ్ల విజేతగా నిలిచారు. మెరుపు వేగంతో దూసుకెళ్తున్న చిరుత పులి రైలు ఇంజన్‌పై కనిపించేలా ‘లోగో’ను సృష్టించి కాంపిటీషన్‌లో గెలిచాడు. ఈ మేరకు సతీశ్ గుజ్రాల్ నేతృత్వంలోని కమిటీ చక్రధర్ లోగోను తుది విజేతగా ప్రకటించింది. ఇకపై బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అధికారిక పత్రాలపై ఈ లోగోనే వాడనున్నారు. 
ప్రస్తుతం చక్రధర్ అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ)లో గ్రాఫిక్ డిజైన్ పీజీ రెండో సంవత్సరం అభ్యసిస్తున్నాడు. అహ్మదాబాద్, ముంబై నగరాలను కలుపుతూ 500 కి.మీ. పొడవైన బుల్లెట్ రైలు ప్రాజెక్టును నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ చేపడుతోంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బుల్లెట్ రైలు లోగో ఖరారు 
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : డిజైనర్ చక్రధర్ ఆళ్ల 

ఆధార్ లింక్ గడువు మార్చి 31 వరకు పొడగింపువివిధ పథకాల ద్వారా లబ్ధిపొందడానికి ఆధార్ తప్పనిసరి చేస్తూ ఇచ్చిన గడువును 2018, మార్చి 31వ వరకు పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. 2017, డిసెంబర్ 31 వరకు ఉన్న ఈ గడువును ఇప్పటికీ ఆధార్ లేని వారికి (కొత్తగా నమోదు చేసుకొని లింక్ చేసుకోవాలి) మాత్రమే పెంచుతున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనానికి అక్టోబర్ 25న వివరించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎంకే ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ సభ్యులుగా ఉన్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వివిధ పథకాలకు ఆధార్ అనుసంధానం గడువు పెంపు
ఎప్పుడు : 2018 మార్చి వరకు
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీలో అంతర్జాతీయ వినియోగదారుల వ్యవహారాల సదస్సు అంతర్జాతీయ వినియోగదారుల వ్యవహారాల సదస్సు అక్టోబర్ 26న న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సుకి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ.. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై కఠినంగా వ్యవహరించేలా త్వరలోనే కొత్త వినియోగదారుల చట్టం తీసుకొస్తున్నట్లు తెలిపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అంతర్జాతీయ వినియోగదారుల వ్యవహారాల సదస్సు 
ఎప్పుడు : అక్టోబర్ 26
ఎక్కడ : న్యూఢ్లిలీలో 
ఎవరు : సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ 

బోర్డింగ్ పాస్‌తో ఆధార్ కార్డు అనుసంధానం బోర్డింగ్ పాస్, తనిఖీల వంటివేవీ లేకుండా నేరుగా విమానం ఎక్కే వ్యవస్థ త్వరలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు టికెట్ బుకింగ్‌ను ఆధార్‌తో అనుసంధానించడం ద్వారా ప్రయాణికులు విమానాశ్రయంలోకి చేరుకోగానే ముఖ గుర్తింపు వ్యవస్థ ద్వారా బోర్డింగ్, సెల్ఫ్ చెకిన్, బ్యాగేజ్ వంటివి పూర్తయ్యేలా ఏర్పాట్లు చేయనున్నట్లు హైదరాబాద్ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్ సంస్థ తెలియజేసింది. ప్రభుత్వంతో చర్చించిన అనంతరం.. ఫేస్ రికగ్నిషన్, వేలిముద్ర, ఐరిస్ వంటి వాటిని పరిశీలించామని, వీటిల్లో ఆధార్ అనుసంధానం ద్వారా ముఖ గుర్తింపు వ్యవస్థను ఎంచుకున్నామని ఎయిర్‌పోర్టు సీఈఓ కిశోర్ వెల్లడించారు. 2 నెలల్లో ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థను ప్రయోగాత్మకంగా ఆరంభిస్తామని, ఫలితాలు పరిశీలించాక, నియంత్రణ సంస్థల అనుమతి తీసుకున్నాక ఈ సేవల్ని ఆరంభిస్తామని తెలియజేశారు. దశల వారీగా బెంగళూరుతో పాటూ ఇతర విమానాశ్రయాలకూ దీన్ని విస్తరిస్తామని చెప్పారు.

అత్యాధునిక ఆయుధాలకు 40 వేలకోట్లుఅత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేసేందుకు భారత ఆర్మీ రూ.40 వేల కోట్లు వెచ్చించనుంది. ఇందులో భాగంగా 7 లక్షల రైఫిళ్లు, 44 వేల తేలికపాటి మెషిన్ గన్లు (ఎల్‌ఎంజీ), దాదాపు 44,600 కార్బైన్లను ఆర్మీ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు సరిహద్దులో చైనా, పాకిస్తాన్‌ల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అత్యాధునిక ఆయుధాలు అవసరమని ఆర్మీ పలుమార్లు చేసిన విజ్ఞప్తిని కేంద్రం ఆమోదించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అత్యాధునిక ఆయుధాలకు 40 వేల కోట్ల ఖర్చు
ఎప్పుడు : త్వరలో 
ఎవరు : భారత ఆర్మీ
ఎందుకు : చైనా, పాకిస్తాన్‌ల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో

రాజ్యాంగ ధర్మాసనానికి ‘ఆధార్ అనుసంధానం’ పిటిషన్వివిధ సేవలు, సంక్షేమ పథకాల లబ్ధ్దికి ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడంపై దాఖలైన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనం నవంబర్ చివరి వారంలో విచారిస్తుందని సుప్రీంకోర్టు అక్టోబర్ 30న వెల్లడించింది. అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ విజ్ఞప్తి మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం కేసును రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది.
క్విక్ రివ్యూ:ఏమిటి : రాజ్యాంగ ధర్మాసనానికి ఆధార్ అనుసంధానం కేసు
ఎప్పుడు : నవంబర్ చివరివారం 
ఎవరు : సుప్రీంకోర్టు

పటేల్ 142వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని భారత తొలి హోంమంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 142వ జయంతి వేడుకలను అక్టోబర్ 31న న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సందర్భంగా మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియం నుంచి.. ఇండియాగేట్ వరకు జరిగిన ఐక్యతా పరుగును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన మోదీ... తొలి కేంద్ర హోం మంత్రి రాజనీతిజ్ఞత, రాజకీయ చతురత కారణంగానే దేశం నేడు ఐక్యంగా ఉందని అన్నారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : సర్దార్ వల్లభాయ్ పటేల్ 142వ జయంతి వేడుకలు 
ఎప్పుడు : అక్టోబర్ 31 
ఎవరు : ఐక్యతా పరుగును ప్రారంభించిన ప్రధాని మోదీ 
ఎక్కడ : న్యూఢిల్లీలో 

కర్ణాటకలో ఉపేంద్ర "ప్రజ్ఞావంత జనతా పార్టీ"కన్నడతో పాటు తెలుగు సినీరంగంలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ‘కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ (కేపీజేపీ)’ పేరిట రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు అక్టోబర్ 31న ప్రకటించారు. బెంగళూరులోని గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉపేంద్ర పార్టీ ప్రకటన చేశారు. డ్రెస్‌కోడ్‌ను ఖాకీ యూనిఫాంగా నిర్ణయించినట్లు చెప్పారు. తమ పార్టీలో చేరాలనుకునే వారికి డబ్బు అవసరం లేదని, కేవలం కొత్త ఆలోచనలు, ప్రజల కోసం కష్టపడే తత్వం ఉంటే చాలని ఉపేంద్ర అన్నారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ప్రజ్ఞావంత జనతా పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన 
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : సినీ నటుడు ఉపేంద్ర
ఎక్కడ : కర్ణాటకలో 

రోడ్డు ప్రమాద కేసులపై వయసు ఆధారంగా పరిహారం రోడ్డు ప్రమాద బాధితులకు అందాల్సిన పరిహారంపై అక్టోబర్ 31న సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. బాధితుడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అతనికి పరిహారం అందాలని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. ఇన్సూరెన్‌‌స సంస్థలు బాధితులకు చెల్లించాల్సిన పరిహారంపై వేసిన పిటిషన్లను విచారించిన అనంతరం కోర్టు ఈ తీర్పునిచ్చింది. 
తీర్పు వివరాలు..
  • బాధితుడు పర్మినెంట్ ఉద్యోగి అయి అతని వయసు 40 ఏళ్ల లోపు ఉన్నట్లయితే.. అతడి భవిష్యత్ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని వాస్తవ వేతనం (యాక్చువల్ శాలరీ) లో 50 శాతం అదనంగా చెల్లించాలి.
  • బాధితుడి వయసు 40-50 ఏళ్లలోపున్నట్లయితే 30 శాతం అదనంగా, 50-60 ఏళ్ల లోపుంటే 15 శాతం అదనంగా చెల్లించాలి.
  • బాధితుడు స్వయం ఉపాధి లేదా నిర్ణీత వేతన జీవి అయి 40 ఏళ్ల లోపు వాడైతే.. ఎస్టాబ్లిష్డ్ ఆదాయానికి అదనంగా 40 శాతం చెల్లించాలి.
  • రోడ్డు ప్రమాద ఘటనల్లో బాధితుడు చనిపోయిన పక్షంలో.. అతని అంత్యక్రియలకు రూ.15వేలు చెల్లించాలి. ఇది కూడా ప్రతీ మూడేళ్లకోసారి 10 శాతం పెరుగుతుంది.

ఆధార్ లేదని రేషన్ నిరాకరించొద్దుప్రజా పంపిణీ వ్యవస్థ కింద పేదలకు అందించే రేషన్ సరుకులను ఆధార్ లేదని, రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం కాలేదనే కారణాలతో నిరాకరించొద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం స్పష్టం చేసింది. ఇలాంటి సాకులతో లబ్ధిదారులను జాబితా నుంచి తొలగించరాదని అక్టోబర్ 26న జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది. జార్ఖండ్‌లో రేషన్ సరుకులు నిరాకరించడంతో ఓ కుటుంబంలోని 11 ఏళ్ల బాలిక ఆకలిని తట్టుకోలేక మరణించిన నేపథ్యంలో తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

వినియోగదారుల పరిరక్షణపై అంతర్జాతీయ సదస్సుయునెటైడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (యూఎన్‌సీటీఏడీ) ఆధ్వర్యంలో వినియోగదారుల పరిరక్షణపై ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 26న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాలకు అనుగుణంగా 1986 నాటి వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని సవరించి కొత్త చట్టం తీసుకొస్తామన్నారు.

ద్వైపాక్షికంఇటలీ ప్రధాని భారత పర్యటన ఇటలీ ప్రధాని పాలో జెంటిలోని రెండు రోజుల భారత పర్యటన కోసం అక్టోబర్ 29న న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన జెంటిలోని ద్వైపాక్షిక వాణిజ్యం, విద్యుత్ సహా పలు రంగాల్లో సహకారానికి సంబంధించి విసృ్తతమైన చర్చలు జరిపారు. అనంతరం రైల్వే భద్రత, విద్యుత్, సంయుక్త పెట్టుబడుల ప్రోత్సాహం తదితర ఆరు ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.
2018 మార్చిలో ఇటలీతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు 70 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఓ లోగోను విడుదల చేశారు. ఇరుదేశాల మధ్య ప్రస్తుతం 8.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 57 వేల కోట్లు) ద్వైపాక్షిక వ్యాపారం జరుగుతోంది.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఇటలీ ప్రధాని భారత పర్యటన
ఎప్పుడు : అక్టోబర్ 30 - 31
ఎవరు : పాలో జెంటిలోని
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం

ఫ్రాన్స్ రక్షణ మంత్రి భారత్ పర్యటనఫ్రాన్స్ రక్షణ శాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ భారత పర్యటనలో భాగంగా అక్టోబర్ 27న రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వ్యూహాత్మకంగా కీలకమైన ఇండో-పసిఫిక్ ప్రాంతంలో రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

యూఎస్ విదేశాంగ మంత్రి పర్యటనభారత పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లెర్సన్ అక్టోబర్ 25న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో భేటీ అయ్యారు. ఉగ్రవాదం, ద్వైపాక్షిక సంబంధాలు, ఉత్తర కొరియా, హెచ్-1బీ వీసాలు, దక్షిణాసియాపై ట్రంప్ విధానం సహా పలు అంశాలపై చర్చలు జరిపారు.

అఫ్గాన్ అధ్యక్షుడు అషఫ్ర భారత పర్యటనఒక రోజు పర్యటనకు భారత్ వచ్చిన అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అషఫ్రఘనీ అక్టోబర్ 24న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అఫ్గాన్ అవసరాల కు అనుగుణంగా అక్కడి రక్షణ, పోలీసు దళాలకు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మోదీ హామీ ఇచ్చారు. పర్యటనలో భాగంగా ఘనీ ఢిల్లీలోని వివేకానంద అంతర్జాతీయ ఫౌండేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

ఆసియాన్ రక్షణ మంత్రుల సదస్సుఆసియాన్ దేశాల రక్షణ మంత్రుల నాలుగో సదస్సు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో అక్టోబర్ 24న ముగిసింది. ఈ సందర్భంగా ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) తీవ్రవాద అనుకూల శక్తులను సమర్థంగా నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని ఆగ్నేయాసియా దేశాల సంఘం(ఆసియాన్) నిర్ణయించింది. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ఈ సదస్సులో భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.

రాష్ట్రీయంతెలంగాణలో ప్రైవేటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణలో ప్రైవేటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. రైల్వే లోకోమోటివ్‌‌స తయారీలో ఖ్యాతి గడించిన ప్రముఖ హైదరాబాదీ కంపెనీ మేధా సర్వో డ్రైవ్‌‌స రూ.600 కోట్ల నుంచి రూ.800 కోట్ల పెట్టుబడితో సంగారెడ్డి జిల్లాలోని కొండకల్ గ్రామంలో ఈ పరిశ్రమను స్థాపించనుంది. ఈ పరిశ్రమతో 2 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో మేధా సర్వో డ్రైవ్‌‌స సంస్థ యాజమాన్యం అక్టోబర్ 27న హైదరాబాద్‌లో ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : తెలంగాణలో ప్రైవేటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఒప్పందం 
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : మేధా సర్వో డ్రైవ్స్ సంస్థ
ఎక్కడ : సంగారెడ్డి జిల్లా

‘మిషన్ కాకతీయ’తో వ్యవసాయాదాయంలో పెరగుదలతెలంగాణలో చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ వల్ల చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయాధారిత ఆదాయం పెరిగిందని నాబార్డ్ కు చెందిన ‘నాబ్కాన్’ సంస్థ వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో సాగు, పంటల విస్తీర్ణం, దిగుబడి, రసాయన ఎరువుల వినియోగం, చేపల పెంపకం, రైతుల ఆదాయం తదితర అంశాలపై రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
సర్వే ముఖ్యాంశాలు 

  • 2016 ఖరీఫ్‌లో పూర్వ ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల పరిధిలో 51.5% సాగు విస్తీర్ణం పెరగగా వ్యవసాయ ఆదాయంలో 47.4 శాతం పెరుగుదల కనిపించింది.
  • చెరువుల నుంచి తీసిన పూడిక మట్టితో రసాయనిక ఎరువుల వాడకం 35 నుంచి 50 శాతం తగ్గగా రసాయనిక ఎరువుల కొనుగోళ్లపై 27.6 శాతం ఆర్థిక భారం తగ్గింది.
  • చెరువు ఆయకట్టు పరిధిలోని కుటుంబాల సరాసరి ఆదాయం 78.5 శాతం పెరగ్గా.. వ్యవసాయ ఆదాయం 47.4 శాతం పెరిగింది.
  • భూగర్భ జల మట్టాల్లో సరాసరి పెరుగుదల 2013-14లో 6.91 మీటర్లు ఉంటే.. 2016-17లో అది 9.02 మీటర్లకు పెరిగింది. 17 శాతం ఎండిపోయిన బావులు, బోరు బావులు పునర్జీవం పొందాయి.
  • చెరువుల్లో చేపల ఉత్పత్తి 2013-14లో పోలిస్తే 2016-17లో 36 నుంచి 39 శాతానికి పెరిగింది.
  • పథకం అమలుకు ముందు 63% మంది చెరువులు బాగా లేవని చెప్పగా మొదటి దశ తర్వాత 46.7 శాతం మంది చెరువులు చాలా బాగున్నాయన్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మిషన్ కాకతీయ వల్ల వ్యవసాయాదాయంలో పెరుగుదల
ఎప్పుడు : 2016-17లో 
ఎవరు : నాబ్కాన్, నాబార్డు
ఎక్కడ : ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాలు 

ఆధార్ నమోదులో హైదరాబాద్ టాప్ఆధార్ నమోదులో హైదరాబాద్ నగరం దేశంలోనే అగ్రస్థానాన్ని కై వసం చేసుకుంది. నగరంలో ఉన్న జనాభా కంటే దాదాపు 17.66% అధికంగా ఆధార్ యూఐడీలు జారీ అయినట్లు యూఐడీఏఐ వెల్లడించింది. 2011 నాటికి హైదరాబాద్ జనాభా 93 లక్షలుకాగా.. 2017 సెప్టెంబర్ చివరి నాటికి ఆధార్ జారీ అయిన వారి సంఖ్య 1.09 కోట్లకు చేరింది.
ఆధార్ నమోదు శాతంలో దేశ రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో నిలవగా.. ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాలు వరుసగా తర్వాతి స్థానాలు పొందాయి. ఢిల్లీలోనూ జనాభా కంటే 16 శాతం అధికంగా ఆధార్ నమోదైంది. 
మెట్రో నగరాల్లో ఆధార్ నమోదు తీరు

నగరం
జనాభా
ఆధార్ నమోదు
శాతం
హైదరాబాద్
93,06,636
1,09,50,043
117.66
ఢిల్లీ
1,81,10,349
2,10,95,906
115.00
ముంబై
1,24,78,447
1,20,57,231
96.62
బెంగళూర్
95,88,910
78,71,589
82.09
చెన్నై
46,81,087
38,34,893
81.92
కోల్‌కతా
44,86,679
35,74,553
79.67
క్విక్ రివ్యూ:ఏమిటి : ఆధార్ నమోదులో హైదరాబాద్ నగరం టాప్
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : యూఐడీఏఐ
ఎక్కడ : మెట్రోనగరాల్లో

ఎమ్మేల్యే పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామాతెలుగుదేశం పార్టీ నేత అనుముల రేవంత్‌రెడ్డి శాసనసభ సభ్యత్వంతో పాటు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు అక్టోబర్ 28న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుని కలిసి రాజీనామా లేఖలను అందించారు. కేసీఆర్ నియంతృత్వ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగించేందుకు, కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణలో భాగంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎమ్మేల్యే పదవికి రాజీనామా
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎవరు : రేవంత్ రెడ్డి

ఖమ్మంలో రైతుల కోసం కో ఆపరేషన్ స్టార్ ఆస్పత్రిఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆధ్వర్యంలో అత్యాధునిక హంగులతో.. కార్పొరేట్ స్థాయిలో రైతుల కోసం ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. పూర్తి మల్టీ స్పెషాలిటీ వసతులతో కో ఆపరేషన్ స్టార్ (సీ-స్టార్) పేరుతో నెహ్రూనగర్‌లో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదు అంతస్తుల్లో ఈ ఆస్పత్రిని నిర్మించారు. పూర్వపు ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రాథమిక సహకార సంఘాల్లో ఉన్న 1.60 లక్షల మంది సభ్యులు స్వచ్ఛంద వాటా ధనం రూ.5 కోట్ల నిధులతో ఆస్పత్రి నిర్మితమైంది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : రైతుల కోసం కో ఆపరేషన్ స్టార్ ఆస్పత్రి 
ఎవరు : కేంద్ర సహకార బ్యాంకు ఆధ్వర్యంలో
ఎక్కడ : ఖమ్మంలో

ఏపీ స్థానికత మరో రెండేళ్లు పెంపురాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నుంచి ఏపీకి తరలివచ్చే వారికి స్థానికత కల్పించడానికి ఉన్న గడువును మరో రెండేళ్లు పెంచే ప్రతిపాదనకు రాష్ట్రపతి అక్టోబర్ 30న ఆమోదముద్ర వేశారు. తొలుత విధించిన గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగియగా మరో రెండేళ్లు పెంచాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం కేంద్ర హోం శాఖకు లేఖ రాసింది. 

ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తుల విభజనఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియలో భాగంగా న్యాయమూర్తుల పోస్టులు, కేటాయింపులను కేంద్రం అక్టోబర్ 24న ఖరారు చేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ప్రభుత్వాధికారులను జనాభా ప్రాతిపదికన 58ః42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణలకు కేటాయించారు. కాగా, న్యాయాధికారులు, న్యాయమూర్తుల విభజనకు 60ః40 నిష్పత్తిని తీసుకున్నారు. ఇందులో భాగంగా ఏపీకి 37, తెలంగాణకు 24 న్యాయమూర్తుల పోస్టులు మంజూరయ్యాయి.

కొత్తగా 3 పట్టణాభివృద్ధి సంస్థలుతెలంగాణలో కొత్తగా మూడు పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అక్టోబర్ 24న ఉత్తర్వులు జారీ చే సింది. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం నగరపాలక సంస్థల పరిధిలోని గ్రామాలను కలిపి వీటిని ఏర్పాటు చే శారు.

ఆర్థికంఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ 2018ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ - 2018లో భారత్ 100వ ర్యాంకులో నిలిచింది. గత ఏడాది ఇదే ర్యాంకింగ్స్‌లో 130వ స్థానంలో భారత్ ఈసారి 30 స్థానాలు మెరుగుపరుచుకుంది. ‘డూయింగ్ బిజినెస్ 2018, ఉపాధి కల్పనకు సంస్కరణలు’ పేరిట ప్రపంచ బ్యాంక్ ఈ నివేదికను విడుదల చేసింది. పన్నులు, లెసైన్సింగ్ వ్యవస్థలో సంస్కరణలతో పాటు పెట్టుబడిదారు ప్రయోజనాల పరిరక్షణ, దివాలా సమస్యల సత్వర పరిష్కారం వంటి అంశాల్లో భారత్ వేగంగా పురోగమించడం ఈ ర్యాంక్ మెరుగుదలకు దోహదపడింది. 
నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు...
  • 2003 నుంచి భారత్ దాదాపు 37 సంస్కరణాత్మక చర్యలను తీసుకువచ్చింది. అందులో సగానికి సగం సంస్కరణలు మంచి ఫలితాలను అందించాయి. ప్రత్యేకించి గడచిన నాలుగేళ్లలో ఈ సంస్కరణల అమలు తీరు బాగుంది. ర్యాంకింగ్ మెరుగుదలలో ఇది ఎంతగానో దోహదపడింది.
  • ఈ ఏడాది తమ ర్యాంకులను భారీగా పెంచుకున్న 10 దేశాల్లో భారత్ ఒకటి.
  • భారత్ 100 ర్యాంక్ క్లబ్‌లోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఇలాంటి భారీ రికార్డు నమోదుచేసిన అతిపెద్ద దేశం భారత్ కావడమూ మరో విశేషం. భారత్ తన స్కోర్‌ను 4.71 పాయింట్ల మేర పెంచుకుని 60.76 పాయింట్లకు చేరింది.
  • గత రెండేళ్లుగా భారత్ ర్యాంక్ 130గా ఉంది. 2014లో దేశం ర్యాంక్ 142.

న్యూజిలాండ్ టాప్..
సులువైన వ్యాపార నిర్వహణకు సంబంధించి ప్రపంచబ్యాంక్ జాబితాలో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉంది. తరువాతి నాలుగు స్థానాల్లో సింగపూర్ (2), డెన్మార్క్ (3), దక్షిణ కొరియా (4), హాంకాంగ్ (5) నిలిచాయి. అమెరికా 6వ స్థానం, బ్రిటన్ 7వ స్థానంలో నిలిచాయి. ఇక బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల్లో రష్యా అగ్ర స్థానంలో 35వ ర్యాంక్ పొందింది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : డూయింగ్ బిజినెస్ 2018, ఉపాధి కల్పనకు సంస్కరణల నివేదిక
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : ప్రపంచ బ్యాంకు 
ఎక్కడ : 100వ ర్యాంకులో భారత్ 

సైన్స్ అండ్ టెక్నాలజీ2018 మార్చిలో చంద్రయాన్-2  ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూన్ మిషన్.. చంద్రయాన్-2పై కేంద్ర అంతరిక్ష, అణు, ఇంధనశాఖ మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టత ఇచ్చారు. చంద్రయాన్-2 ప్రయోగం 2018 మార్చిలో ఉంటుందని ప్రకటించారు. జీఎస్‌ఎల్వీ ఎంకే-2 రాకెట్ ద్వారా చంద్రయాన్-2 ప్రయోగాన్ని నిర్వహిస్తామని తెలిపారు. చంద్రయాన్-2 ప్రయోగం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జరుగుతుంది. 
ఈ ప్రయోగంలో భాగంగా చంద్రుని ఉపరితలంపై సంచరించగల ఒక మోటార్ జెడ్ రోబోట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇలాంటి ఒక రోవర్ చంద్రుడిపై చక్రాలతో నడుస్తూ మృత్తిక, రాళ్ళ నమూనాలను సేకరించి వాటి రసాయన విశ్లేషణలను జరిపి, చంద్రుడి చుట్టూ ఎత్తయిన కక్ష్యలో పరిభ్రమించే చంద్రయాన్-2కు అందిస్తుంది. చంద్రయాన్-2 నుంచి సమాచారం గ్రౌండ్‌స్టేషన్‌లోని యాంటెనా అందుకుంటుంది. 2020 కల్లా చంద్రుడిపైకి ఒక మానవ సహిత ప్రయోగాన్ని చేపట్టాలని కూడా ఇస్రో భావిస్తోంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : చంద్రయాన్ - 2
ఎప్పుడు : 2018లో 
ఎవరు : ఇస్రో 
ఎందుకు : చంద్రుడి ఉపరితల వాతావరణాన్ని పరిశోధించేందుకు 

చైనాలో తొలి హైడ్రోజన్ ట్రామ్ ప్రారంభంప్రపంచంలోనే తొలి పర్యావరణహిత, హైడ్రోజన్‌తో నడిచే ట్రామ్‌ను చైనా అక్టోబర్ 27న ప్రారంభించింది. దీని ద్వారా నార్త్ చైనాలోని హెబీ ప్రావిన్‌‌సలోని తంగ్షన్‌లో కమర్షియల్ సర్వీసులను అందించనున్నారు. మూడు బోగీలతో కూడిన ట్రామ్‌లో మొత్తం 66 సీట్లు ఉంటాయి. 12 కేజీల హైడ్రోజన్‌ను ఒకసారి నింపుకోగల సామర్థ్యమున్న ట్రామ్ గంటకు నలభై నుంచి 70 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచంలో తొలి హైడ్రోజన్ ట్రామ్ ప్రారంభం 
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎక్కడ : చైనాలో 
ఎందుకు : ప్రజా రవాణా కోసం 

‘డెత్ జోన్’లోకి వెళ్లే డ్రోన్లను పరీక్షించిన చైనాఎక్కువ ఎత్తుకు వెళ్లే గూఢచార డ్రోన్‌ను చైనా విజయవంతంగా పరీక్షించింది. క్రికెట్ బ్యాట్ సైజులో ఉండే ఈ డ్రోన్ రక్షణ రంగంలో ఎంతగానో సహాయపడనుంది. సముద్రమట్టానికి 20 కిలోమీటర్ల ఎత్తు పైనుంచి అంతరిక్ష సమీప ప్రాంతం ప్రారంభమవుతుంది. అక్కడ గాలి పలుచగా ఉండటం, చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉండటంతో ఆ జోన్‌ను డ్రోన్లకు ‘డెత్ జోన్’గా పరిగణించేవారు. తక్కువ గాలి ఉండటంతో అక్కడ డ్రోన్ ఎగరడం సాధ్యం కాదు. తక్కువ ఉష్ణోగ్రతల వల్ల డ్రోన్‌లోని బ్యాటరీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు విఫలమయ్యే ప్రమాదముంది. అయితే చైనా తయారు చేసిన ఈ డ్రోన్ ఆ పరిస్థితులను తట్టుకుంటుంది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ఎక్కువ ఎత్తుకు వెళ్లే డ్రోన్లను పరీక్షించిన చైనా 
ఎప్పుడు : అక్టోబర్ 31 
ఎందుకు : గూఢచర్యం కోసం 

క్రీడలుటెన్నిస్‌కు మార్టినా హింగిస్ వీడ్కోలు  స్విట్జర్లాండ్ దిగ్గజం, ప్రపంచ మాజీ నంబర్‌వన్ మార్టినా హింగిస్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది. సింగపూర్‌లో ప్రస్తుతం జరుగుతోన్న డబ్ల్యూటీఏ ఫైనల్స్ తన ఆఖరి టోర్నీ అని 37 ఏళ్ల హింగిస్ అక్టోబర్ 26న ప్రకటించింది. 23 ఏళ్ల క్రితం ప్రొఫెషనల్‌గా మారిన హింగిస్ తన కెరీర్‌లో 5 సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సహా మొత్తం 25 గ్రాండ్‌స్లామ్‌లు సాధించింది. 17 ఏళ్ల వయసులో అతి పిన్న వయసులో సింగిల్స్ నంబర్‌వన్ ర్యాంక్ సాధించిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన హింగిస్... ప్రస్తుతం డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. గతంలో వేర్వేరు కారణాలతో రెండు సార్లు పదేళ్ల పాటు ఆటకు దూరమైన హింగిస్ 2013 నుంచి రెగ్యులర్‌గా డబుల్స్ ఆడుతోంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ ప్రపంచ నవంబర్ వన్ 
ఎప్పుడు : అక్టోబర్ 26
ఎవరు : మార్టినా హింగిస్ 

అమెరికాలో గావస్కర్ గ్రౌండ్భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ పేరిట అమెరికాలో ఓ క్రికెట్ గ్రౌండ్ రూపుదిద్దుకుంది. కెంటకీ రాష్ట్రంలోని లూయిస్ విల్లేలో కొత్తగా నిర్మించిన ఈ మైదానాన్ని స్వయంగా గావస్కరే ప్రారంభించారు. ఇటీవలే జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లూయిస్ విల్లే మేయర్ గ్రెగ్ ఫిష్చెర్ పాల్గొన్నారు. 42 జట్లు తలపడే ‘మిడ్‌వెస్ట్ క్రికెట్ లీగ్’లో ఈ మైదానం లూయిస్ విల్లే క్రికెట్ క్లబ్‌కు హోమ్ గ్రౌండ్‌గా ఉపయోగపడుతుంది.

షూటింగ్ ఫైనల్స్‌లో సంగ్రామ్, అమన్‌లకు పతకాలు సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ కప్ షూటింగ్ ఫైనల్స్‌లో సంగ్రామ్ దహియా, అమన్‌ప్రీత్ సింగ్ గురికి భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. పురుషుల ‘డబుల్ ట్రాప్’ ఈవెంట్‌లో సంగ్రామ్ రజత పతకం సాధించగా... పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో అమన్‌ప్రీత్ సింగ్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. 
ఆరుగురు పాల్గొన్న డబుల్ ట్రాప్ ఫైనల్లో సంగ్రామ్ 76 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలువగా.. హు బిన్‌యువాన్ (చైనా-79 పాయింట్లు) ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని కై వసం చేసుకున్నాడు. గాస్‌పరానీ దవీ (ఇటలీ-56 పాయింట్లు) కాంస్య పతకాన్ని సంపాదించాడు. భారత్‌కే చెందిన ప్రపంచ నంబర్‌వన్ అంకుర్ మిట్టల్ 45 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో అమన్‌ప్రీత్ సింగ్ 202.2 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. 

శ్రీకాంత్కు ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ కైవసం చేసుకున్నాడు. పారిస్‌లో అక్టోబర్ 29న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ శ్రీకాంత్ 21-14, 21-13తో 40వ ర్యాంకర్, క్వాలిఫయర్ కెంటా నిషిమోటో (జపాన్)పై గెలిచాడు. తద్వారా లిన్ డాన్ (చైనా), లీ చోంగ్ వీ (మలేసియా), చెన్ లాంగ్ (చైనా) తర్వాత ఒకే ఏడాది కనీసం నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన నాలుగో ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. దీంతోపాటు ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. 
శ్రీకాంత్ 2017లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఇండోనేసియా ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గాడు. సింగపూర్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా శ్రీకాంత్ కెరీర్‌లో ఇది ఆరో సూపర్ సిరీస్ టైటిల్. విజేతకు 24,375 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 15 లక్షల 85 వేలు)తోపాటు 9,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ విజేత
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : కిడాంబి శ్రీకాంత్
ఎక్కడ : పారిస్

బోపన్న జంటకు ఎర్‌స్టీ ఓపెన్ ఏటీపీ టైటిల్ఎర్‌స్టీ ఓపెన్ ఏటీపీ-500 టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత డబుల్స్ నంబర్‌వన్ ప్లేయర్ రోహన్ బోపన్న టైటిల్ సాధించాడు. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో అక్టోబర్ 29న జరిగిన ఫైనల్లో బోపన్న-పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే) ద్వయం మార్సెలో డెమోలైనర్ (బ్రెజిల్)-సామ్ క్వెరీ (అమెరికా) జంటపై గెలిచింది.
బోపన్నకు ఈ ఏడాది ఇది మూడో డబుల్స్ టైటిల్ కాగా ఓవరాల్‌గా 16వ టైటిల్. విజేతకు 1,32,030 యూరోల (రూ. 9 లక్షల 96 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎర్‌స్టీ ఓపెన్ ఏటీపీ-500 టెన్నిస్ టోర్నమెంట్ విజేత
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : బోపన్న-పాబ్లో క్యువాస్
ఎక్కడ : ఆస్ట్రియా రాజధాని వియన్నా

వియత్నాం ఓపెన్ టైటిల్ విజేత సాకేత్ మైనేనిఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని వియత్నాం ఓపెన్ టోర్నమెంట్‌లో డబుల్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. అక్టోబర్ 29న హో చి మిన్ సిటీలో జరిగిన ఈ టోర్నీలో సాకేత్-విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) ద్వయం గో సొయెదా-బెన్ మెక్లాచ్లాన్ (జపాన్) జంటపై విజయం సాధించింది. సాకేత్ కెరీర్‌లో ఇది ఏడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్. విజేతకు 3,100 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షలు)తోపాటు 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : వియత్నాం ఓపెన్ డబుల్స్ టైటిల్ విజేత
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : సాకేత్ మైనేని-విజయ్ సుందర్ ప్రశాంత్
ఎక్కడ : హో చి మిన్ సిటీ, వియత్నాం

టీ20ల్లో మిల్లర్ వేగవంతమైన సెంచరీదక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్ బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో వంద పరుగులు చేసి అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. దీంతో దక్షిణాఫ్రికాకే చెందిన రిచర్డ్ లెవీ (న్యూజిలాండ్‌పై 45 బంతుల్లో 100) పేరిట ఉన్న రికార్డును తిరగ రాశాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : టీ20ల్లో వేగవంతమైన సెంచరీ
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా)

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ భారత్ కైవసంన్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. అక్టోబర్ 29న జరిగిన చివరి వన్డేలో న్యూజిలాండ్‌పై 6 పరుగుల తేడాతో గెలిచింది. రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కాయి. 
ఇదే మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 9000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా అతి తక్కువ కాలంలో (9 ఏళ్ల 72 రోజులు) 9 వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మైలురాయిని చేరుకోవడానికి ద్రవిడ్‌కు 9 ఏళ్ల 322 రోజులు, డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)కు 12 ఏళ్లు పట్టాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ విజేత
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : భారత్

అండర్-17 ఫుట్‌బాల్ ప్రపంచకప్ విజేత ఇంగ్లండ్భారతదేశంలో తొలిసారి నిర్వహించిన ‘ఫిఫా’ అండర్-17 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. అక్టోబర్ 28న కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ 5-2 తేడాతో స్పెయిన్‌ను ఓడించింది. టోర్నీలో నాలుగోసారి ఫైనల్‌కు చేరిన స్పెయిన్ మళ్లీ రన్నరప్‌గా నిలిచింది. ఫాడెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్’ అవార్డు దక్కింది. ఇంగ్లండ్ 2017లోనే అండర్-20 ప్రపంచకప్‌ను కూడా గెలుచుకుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : అండర్-17 ఫుట్‌బాల్ ప్రపంచకప్ విజేత 
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎవరు : ఇంగ్లండ్
ఎక్కడ : కోల్‌కతా

ప్రొ కబడ్డీ లీగ్ విజేత పట్నా పైరేట్స్ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్-5 విజేతగా పట్నా పైరేట్స్ నిలిచింది. అక్టోబర్ 28న చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో 55-38 స్కోరుతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌ను ఓడించింది. తద్వారా వరుసగా మూడోసారి పీకేల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఈ టోర్నీలో ప్రదీప్ నర్వాల్‌ను పర్‌ఫెక్ట్ రైడర్ (రూ. 50 వేలు), బెస్ట్ డూ ఆర్ డై రైడర్ (రూ.50 వేలు), స్టార్ స్పోర్‌‌ట్స మూమెంట్ ఆఫ్ ద మ్యాచ్ (రూ. 50 వేలు), ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ (రూ. 50 వేలు), లీగ్ టాప్ స్కోరర్ (రూ.10 లక్షలు), రైడర్ ఆఫ్ ద టోర్నీ (రూ. 10 లక్షలు), మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (రూ. 15 లక్షలు) అవార్డులు వరించాయి. ఉత్తమ అరంగేట్ర ఆటగాడు అవార్డు సచిన్ (గుజరాత్; రూ. 10 లక్షలు), డిఫెండర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు సురేందర్ నాడా (హరియాణా; రూ. 10 లక్షలు)కు లభించాయి.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-5 విజేత 
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎవరు : పట్నా పైరేట్స్
ఎక్కడ : చెన్నై

హామిల్టన్‌కు ఫార్ములావన్ ప్రపంచ టైటిల్బ్రిటన్‌కు చెందిన మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ నాలుగోసారి ఫార్ములావన్ ప్రంపంచ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. టైటిల్ కోసం సెబాస్టియన్ వెటెల్‌తో నెలకొన్న మెక్సికో గ్రాండ్ ప్రి పోటీలో రెడ్‌బుల్ డ్రైవర్ వెర్‌స్టాపెన్ టైటిల్ గెలిచాడు. దీంతో వెటెల్ (ఫెరారీ టీమ్) మిగిలి ఉన్న రెండు గ్రాండ్‌ప్రి (బ్రెజిలియన్, అబుదాబి)లను గెలిచినా హామిల్టన్‌ను చేరుకోలేడు. తద్వారా 2017 ప్రపంచ టైటిల్ హామిల్టన్ వశమైంది.
తొలి సారి 2008లో మెక్‌లారెన్ తరఫున టైటిల్ గెలిచిన హామిల్టన్ తర్వాత మెర్సిడెస్‌తో చేరాడు. 2014, 2015 సంవత్సరాల్లో వరుసగా రెండుసార్లు డ్రైవర్స్ చాంపియన్‌షిప్ గెలిచాడు. ఈ సీజన్‌లో అతను 9 రేసుల్లో గెలిచి 333 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. వెటెల్ 277 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఫార్ములావన్ ప్రపంచ టైటిల్ విజేత
ఎప్పుడు : అక్టోబర్ 29 
ఎవరు : లూయిస్ హామిల్టన్

ఐసీసీ ర్యాంకుల్లో కోహ్లి, మిథాలీ రాజ్ టాప్భారత క్రికెట్ కెప్టెన్లు విరాట్ కోహ్లి, మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్‌‌సలో అగ్రస్థానంలో ఉన్నారు.
అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో 263 పరుగులు చేసిన కోహ్లి 889 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ వన్డే బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్‌‌సలో అగ్రస్థానంలో నిలిచాడు. తద్వారా 1998లో సచిన్ పేరిట ఉన్న 887 రేటింగ్ పాయింట్ల రికార్డును అధిగమించాడు. 
తాజా వన్డే బ్యాట్స్‌ఉమెన్ ర్యాంకింగ్‌‌సలో మిథాలీ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని 753 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. తదుపరి రెండు, మూడు ర్యాంకుల్లో ఎలైస్ పెర్రీ (ఆస్ట్రేలియా; 725), అమి శాటెర్త్‌వైట్ (న్యూజిలాండ్; 720) నిలిచారు.
న్యూజిలాండ్‌పై గెలిచినప్పటికీ భారత్ (119) 2 పాయింట్ల లోటుతో రెండో స్థానంలోనే ఉంది. దక్షిణాఫ్రికా (121) అగ్రస్థానంలో ఉంది.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఐసీసీ వన్డే ర్యాంకింగ్‌‌సలో అగ్రస్థానం
ఎప్పుడు : అక్టోబర్ 30 
ఎవరు : విరాట్ కోహ్లీ

సీనియర్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో మనోజ్‌కు స్వర్ణంవిశాఖపట్నంలో ముగిసిన జాతీయ సీనియర్ ఎలైట్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మనోజ్ కుమార్ స్వర్ణపతకం గెలుచుకున్నాడు. అక్టోబర్ 30న జరిగిన 69 కేజీల విభాగం ఫైనల్లో మనోజ్ 4-1తో దుర్యోధన్‌సింగ్‌పై విజయం సాధించాడు.
60 కేజీల విభాగంలో శివ థాపా మనీశ్ చేతిలో ఓడిపోయి రజతం గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో మనోజ్ ‘బెస్ట్ బాక్సర్’గా నిలవగా.. మనీశ్ ‘మోస్ట్ ప్రామిసింగ్ బాక్సర్’ ఘనత దక్కించుకున్నాడు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాకర శ్యామ్ కుమార్ 49 కేజీల విభాగంలో ఎన్టీ లాల్‌బియాకిమా (మిజోరం)పై 3-2తో గెలిచి స్వర్ణపతకం సాధించాడు.
క్విక్ రివ్యూ:ఏమిటి : సీనియర్ బాక్సింగ్ టోర్నమెంట్ విజేత
ఎప్పుడు : అక్టోబర్ 30
ఎవరు : మనోజ్ కుమార్
ఎక్కడ : విశాఖపట్నం

కామన్వెల్త్ షూటింగ్‌లో హీనాకు స్వర్ణంకామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ హీనా సిద్ధూ స్వర్ణం సాధించింది. అక్టోబర్ 31న ప్రారంభమైన మహిళల 10 మీ. ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో హీనా 240.8 పాయింట్లు స్కోర్ చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఎలీనా గాలియాబొవిచ్ (238.2), క్రిస్టీ గిల్‌మెన్ (213.7) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. హీనా ఇటీవలే ఢిల్లీలో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్స్ షూటింగ్ టోర్నీ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలోనూ పసిడి పతకాన్ని సాధించింది. 
క్విక్ రివ్యూ:ఏమిటి : కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్ - 2017 
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : భారత షూటర్ హీనా సిద్ధూకు స్వర్ణం
ఎక్కడ : బ్రిస్బేన్, ఆస్ట్రేలియా 
ఎందుకు : 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 

వార్తల్లో వ్యక్తులుపాక్ మాజీ ప్రధాని షరీఫ్‌పై అరెస్టు వారంట్అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై అరెస్టు వారంట్ జారీ అయ్యింది. పనామా పేపర్ల కుంభకోణంతో పదవి కోల్పోయిన షరీఫ్‌ను అవినీతి ఆరోపణలపై అక్కడి అకౌంటబిలిటీ కోర్టు విచారణ చేస్తోంది. కోర్టు విచారణకు షరీష్ పలుమార్లు హాజరు కాకపోవడంతో అక్టోబర్ 26న ఆయనపై న్యాయస్థానం బెయిలబుల్ అరెస్టు వారంట్‌ను జారీచేసింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : నవాజ్ షరీఫ్‌పై అరెస్టు వారంట్ జారీ 
ఎప్పుడు : అక్టోబర్ 26
ఎందుకు : పనామా పేపర్ల కుంభకోణం కేసు విచారణకు హాజరు కానందుకు 

మిస్ వర్జీనియాగా హిమాన్వి భారత సంతతికి చెందిన పనిదెపు హిమాన్వి(17)ని మిస్ వర్జీనియా టీన్ యూఎస్‌ఏ 2018 టైటిల్ వరించింది. ఈ కిరీటాన్ని దక్కించుకున్న మొదటి ఇండియన్ అమెరికన్‌గా హిమాన్వి నిలిచింది. క్లిఫ్టన్లోని సెంట్రెవిల్లె హైస్కూల్లో చదువుకుంటున్న హిమాన్వి... 39 మంది యువతులతో పోటీపడి ఈ అందాల కిరీటాన్ని చేజిక్కించుకుంది. డౌన్ టౌన్ నార్ఫోక్‌లోని టైడ్ వాటర్ కమ్యూనిటీ కాలేజీలోని రోపర్ థియేటర్‌లో మిస్ వర్జీనియా టీన్ యూఎస్‌ఏ 2018 టైటిల్‌ను హిమాన్వికి బహూకరించారు. మానసిక ఆరోగ్యం, డ్రగ్‌‌స, ఆల్కహాల్‌లపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు హిమాన్వి తనవంతుగా కృషి చేస్తున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మిస్ వర్జీనియా టీన్ యూఎస్‌ఏ - 2018 
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : పనిదెపు హిమాన్వి

బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో జెఫ్ బెజోస్‌కు అగ్రస్థానంఅంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చీఫ్ జెఫ్ బేజోస్ బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ మేరకు సవరించిన జాబితాను బ్లూమ్‌బర్గ్ అక్టోబర్ 29న ప్రకటించింది. జాబితాలో బేజోస్ 9,380 కోట్ల డాలర్ల ఆస్తితో మొదటి స్థానంలో నిలవగా, 8,870 కోట్ల డాలర్ల సంపదతో బిల్‌గేట్స్ రెండో స్థానంలో ఉన్నారు. బిల్‌గేట్స్ కంటే బేజోస్ ఆస్తి 510 కోట్ల డాలర్లు అధికం. ఈ జాబితాలో 2013 సంవత్సరం నుంచి బిల్‌గేట్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో అగ్రస్థానం
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : జెఫ్ బెజోస్

బీసీసీఐ మాజీ జీఎం ఎంవీ శ్రీధర్ మృతిభారత క్రికెట్ నియంత్రణ మండలి మాజీ జనరల్ మేనేజర్ (క్రికెట్ ఆపరేషన్‌‌స), హైదరాబాద్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మాటూరి వెంకట శ్రీధర్ మృతి చెందారు. అక్టోబర్ 30న గుండెనొప్పితో హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్ను మూశారు.
1966 ఆగస్టు 2న విజయవాడలో జన్మించిన ఎంవీ శ్రీధర్ హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 1988లో హైదరాబాద్ రంజీ జట్టు తరఫున తొలిసారి ఆడారు. 2000లో క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. కెరీర్‌లో 97 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన శ్రీధర్ 21 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలతో మొత్తం 6,701 పరుగులు సాధించారు.
2000 నుంచి 2006 వరకు హెచ్‌సీఏ సంయుక్త కార్యదర్శిగా, 2010 నుంచి 2012 వరకు ఉపాధ్యక్షుడిగా, 2012 నుంచి 2014 వరకు కార్యదర్శిగా పనిచేశారు. 2010-2011 సీజన్‌లో హైదరాబాద్ రంజీ జట్టు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించారు. 2013లో బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్‌‌స జనరల్ మేనేజర్ (జీఎం)గా నియమితులై 2017 సెప్టెంబర్ 27 వరకు కొనసాగారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : బీసీసీఐ మాజీ జీఎం, హైదరాబాద్ రంజీ మాజీ కెప్టెన్ మృతి
ఎప్పుడు : అక్టోబర్ 30
ఎవరు : మాటూరి వెంకట శ్రీధర్ 
ఎక్కడ : హైదరాబాద్

ఎన్‌ఐఏ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన మోదీజాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డెరైక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి యోగేశ్ చందర్ మోదీ అక్టోబర్ 30న బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో కొనసాగిన శరద్‌కుమార్ పదవీకాలం ముగియడంతో కేంద్ర ప్రభుత్వం మోదీని నియమించింది. ఆయన 2021 మే 31 వరకు పదవిలో కొనసాగుతారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : ఎన్‌ఐఏ చీఫ్ బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : అక్టోబర్ 30 
ఎవరు : యోగేశ్ చందర్ మోదీ
ఎందుకు : శరద్‌కుమార్ పదవీకాలం ముగియడంతో

న్యూజిలాండ్ ప్రధానిగా జసిండా ఆర్డెర్న్న్యూజిలాండ్ ప్రధానిగా జసిండా ఆర్డెర్న్ అక్టోబర్ 26న వెల్లింగ్టన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. ఈమె న్యూజిలాండ్‌కు మూడో మహిళా ప్రధాని కాగా, గత 150 ఏళ్లలో ప్రధానైన అతి పిన్న వయస్కురాలు.

కశ్మీర్ చర్చల దూతగా దినేశ్వర్ శర్మకశ్మీర్ సమస్యకు చర్చల ద్వారా శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా ప్రభుత్వ దూతగా ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ దినేశ్వర్ శర్మను నియమించినట్లు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అక్టోబర్ 24న ప్రకటించారు.

అవార్డులుఏపీ ఓబీఎంఎస్‌కు నిహిలెంట్ ఈ గవర్నెన్స్ అవార్డుకంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా అందించే ‘నిహిలెంట్ ఈ గవర్నెన్స్ అవార్డ్-2017’కు ఆంధ్రప్రదేశ్ ఆన్‌లైన్ బెనిఫిషరీ మానిటరింగ్ సిస్టం (ఏపీ ఓబీఎంఎస్) అప్లికేషన్ ఎంపికైంది. ఈ - గవర్నెన్‌‌సలో ఉత్తమ కంప్యూటర్ అప్లికేషన్‌కు ఈ అవార్డు అందజేస్తారు. ప్రస్తుతం ఓబీఎంఎస్‌కు ఎస్సీ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలోని కార్పొరేషన్ల సమాచారాన్ని ఓబీఎంఎస్‌లో పొందుపరుస్తారు. లబ్ధిదారుల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. లబ్ధిదారుడు యూనిట్‌ను ఎలా ఉపయోగించుకుంటున్నాడు, బ్యాంకు లోన్ ప్రతినెలా చెల్లిస్తున్నాడా లేదా అనే వివరాలు కూడా పొందిపరిచే విధంగా యాప్‌ను అప్‌డేట్ చేశారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఏపీ ఓబీఎంఎస్‌కు నిహిలెంట్ ఈ గవర్నెన్‌‌స అవార్డు - 2017
ఎప్పుడు : అక్టోబర్ 26
ఎవరు : కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా 
ఎందుకు : ఈ - గవర్నెన్‌‌సలో ఉత్తమ కంప్యూటర్ అప్లికేషన్‌కు గాను 

టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు ఐపీపీఏఐ అవార్డుదక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్)కు ఇన్నోవేషన్ కేటగిరీలో ‘ఐపీపీఏఐ పవర్ అవార్డు- 2017‘ లభించింది. అక్టోబర్ 28న కర్ణాటకలోని బెల్గామ్‌లో 18వ రెగ్యులేటర్స్ అండ్ పాలసీ మేకర్స్ సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎండీ జి.రఘుమారెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు ఐపీపీఏఐ అవార్డు 
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎక్కడ : 18వ రెగ్యులేటర్స్ అండ్ పాలసీ మేకర్స్ సదస్సు

గిరీష్ కర్నాడ్‌కు టాటా లిట్ లైఫ్‌టైమ్ అవార్డు ప్రముఖ నటుడు, నాటక రచయిత గిరీష్ కర్నాడ్‌ను 2017 సంవత్సరానికి గానూ టాటా లిటరేచర్ లైవ్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు వరించింది. ముంబైలోని నారిమన్ పాయింట్ వద్ద ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ ద ఫెర్ఫార్మింగ్ ఆర్‌‌ట్స (ఎన్‌సీపీఏ)లో నవంబర్ 19న జరగనున్న సాహిత్య వేడుకల్లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : టాటా లిట్ లైఫ్ టైమ్ అవార్డు - 2017
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : గిరీష్ కర్నాడ్

అంతర్జాతీయంఫెడ్ చైర్మన్‌గా జెరోమ్ పావెల్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్‌గా జెరోమ్ పావెల్ (64) పేరును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సెనేట్ కూడా ఆమోదముద్ర వేస్తే పావెల్ నియామకం ఖరారు కానుంది. ప్రస్తుత ఫెడ్ చైర్మన్ జానెట్ యెలెన్ పదవీకాలం ఫిబ్రవరితో ముగియనుంది. రిపబ్లికన్ పార్టీకి చెందిన పావెల్ 2012 నుంచి ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో ఒకరిగా కొనసాగుతున్నారు. ప్రపంచ ఎకానమీకే దిశానిర్దేశం చేసే ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పదవిని అమెరికా ప్రభుత్వంలో రెండో అత్యంత శక్తిమంతమైన హోదాగా పరిగణిస్తారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ నియామకం 
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : జెరోమ్ పావెల్ 
ఎక్కడ : అమెరికా

ప్యారడైజ్ పత్రాల్లో 714 మంది భారతీయుల పేర్లుఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) నవంబర్ 5న విడుదల చేసిన ప్యారడైజ్ పత్రాల్లో భారత్‌కు చెందిన 714 మందితో పాటు ప్రపంచంలోని 120 మంది రాజకీయ ప్రముఖుల పేర్లున్నాయి. ఇందులో బ్రిటన్ రాణి ఎలిజబెత్-2, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కేబినెట్ సహచరుడు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితుల పేర్లూ ఉన్నాయి. జర్మన్ పత్రిక సుడుషె జైటంగ్ పత్రిక ఈ వివరాలను సేకరించిందని ఐసీఐజే తెలిపింది.
విదేశీ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి దాదాపు కోటి 34 లక్షల పేపర్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఐసీఐజే ఈ జాబితాను వెల్లడిచింది. ముఖ్యంగా బెర్ముడా చుట్టూ ఉన్న దీవుల కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీల్లో 180 దేశాలకు చెందిన ప్రముఖులు పెట్టుబడులు పెట్టగా, 714 పేర్లతో భారత్ 19వ స్థానంలో ఉందని తెలిపింది. అలాగే యాపిల్, నైక్, ఉబర్ సహా.. దాదాపు 100 బహుళజాతి సంస్థలు డొల్ల కంపెనీల ఏర్పాటుకు ప్రయత్నించాయని తెలిపింది.
ప్యారడైజ్ పత్రాల జాబితాలో భారత్ నుంచి కేంద్ర మంత్రి జయంత్ సిన్హా, రాజ్యసభ బీజేపీ ఎంపీ ఆర్కే సిన్హా, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్, చిదంబరం కుమారుడు కార్తీ, అమితాబ్ బచ్చన్, విజయ్ మాల్య, నీరా రాడియా, సంజయ్‌దత్ భార్య మాన్యతాదత్ (దిల్‌నాషిన్) తదితరులున్నారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : ప్యారడైజ్ పత్రాల్లో 714 మంది భాతీయుల పేర్లు
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారి జాబితా

జపాన్ చక్రవర్తితో ట్రంప్ భేటీఆసియా పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జపాన్ చక్రవర్తితోపాటు ఆ దేశ ప్రధాని షింజో అబేతో నవంబర్ 6న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉత్తర కొరియాతో పాటు ఇతర అంతర్జాతీయ సమస్యలపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ట్రంప్ 12 రోజులపాటు జపాన్, చైనా సహా పలు ఆసియా దేశాల్లో పర్యటిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జపాన్ చక్రవర్తితో ట్రంప్ భేటీ 
ఎప్పుడు : నవంబర్ 6
ఎక్కడ : జపాన్
ఎందుకు : ఆసియా పర్యటనలో భాగంగా

వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ‘ఫేక్ న్యూస్’ 
2017 సంవత్సరానికి వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ‘ఫేక్ న్యూస్’ను కొల్లిన్స్ డిక్షనరీ నవంబర్ 3న లండన్‌లో ప్రకటించింది. ఈ పదాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కువగా వాడారు. దీని వాడకం గత 12 నెలల్లో 365 శాతం పెరిగింది. సంచలనం కలిగించే రీతిలో అసత్య వార్తలను అందించడాన్ని ఫేక్ న్యూస్‌గా పేర్కొంటారు.

లెబనాన్ ప్రధాని రాజీనామా లెబనాన్ ప్రధానమంత్రి సాద్ హరిరి తన పదవికి నవంబర్ 4న అనూహ్యంగా రాజీనామా చేశారు. పాలనా పగ్గాలు చేపట్టిన ఏడాది వ్యవధిలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దేశంలో రాజకీయ పరిణామాలు మారడం, హరిరి హత్యకు దారి తీసే పరిస్థితులు నెలకొనడం, లెబనాన్‌తోపాటు మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఆధిపత్యం పెరుగుతుండటం దీనికి కారణాలని భావిస్తున్నారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా హరిరి గతంలో పలుమార్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

అంతర్జాతీయ వాతావరణ సదస్సుఅంతర్జాతీయ వాతావరణ సదస్సు జర్మనీలోని బాన్‌లో నవంబర్ 6న ప్రారంభమైంది. వాతావరణ మార్పులతో తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్న అనేక ద్వీప దేశాల్లో ఒకటైన ఫిజీ సదస్సుకు అధ్యక్షత వహిస్తోంది. ఈ కార్యక్రమం 12 రోజుల పాటు జరగనుంది. వాతావరణ మార్పులపై తక్షణ చర్యలు అవసరమని ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఫిజీ ప్రధానమంత్రి ఫ్రాంక్ బైనిమరామా ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. వాతావరణ మార్పులను భారత్ పెద్ద ముప్పుగా భావిస్తోందని మన దేశం తరఫున ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్దన్ పేర్కొన్నారు. 

జాతీయంఢిల్లీలో పేపర్ పరిశ్రమల అంతర్జాతీయ సమ్మేళనం పేపర్ పరిశ్రమల 13వ అంతర్జాతీయ సమ్మేళనాన్ని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ నవంబర్ 1న ఢిల్లీలో ప్రారంభించారు. సదస్సులో 22 దేశాల నుంచి ప్రముఖ సంస్థలు పొల్గొని పేపర్ తయారీలో ఆయా సంస్థలు అనుసరిస్తున్న సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించాయి. ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో వ్యర్థాల రీసైకిల్ ద్వారా పేపర్ తయారీ, దేశ ఆర్థిక ప్రగతి, ఉద్యోగ కల్పనలో పేపర్ పరిశ్రమల పాత్ర వంటి అంశాలపై చర్చించారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : పేపర్ పరిశ్రమల 13వ అంతర్జాతీయ సమ్మేళనం
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : పేపర్ తయారీలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి

తొమ్మిది ప్రధాన బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించిన తొమ్మిది కీలకమైన బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. వీటిలో పశ్చిమ బెంగాల్ ఇండస్ట్రియల్ అమెండ్‌మెంట్ బిల్లు, గుజరాత్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తదితరాలు ఉన్నట్లు రాష్ట్రపతిభవన్ వర్గాలు నవంబర్ 5న వెల్లడించాయి. గుజరాత్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం నిర్బంధ ఖైదీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో మాట్లాడే అవకాశం కల్పిస్తారు. దీంతో కీలక కేసుల్లో శిక్ష పడిన ఖైదీల రక్షణ, వారిని కోర్టులకు తీసుకొచ్చే ఇబ్బందులు పోలీసులకు ఉండవు. 

అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘం పునరుద్ధరణ 2016లో ఏర్పాటైన అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘం పదవీ కాలం ముగియడంతో దాన్ని పునరుద్ధరిస్తూ కేంద్ర హోం శాఖ అక్టోబర్ 31న ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటైంది. కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, తావర్‌చంద్ గెహ్లట్; పంజాబ్, ఛత్తీస్‌గఢ్, త్రిపుర, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇతర సభ్యులు. 

భారతీయ కిచిడీకి గిన్నిస్ రికార్డు భారతీయుల సంప్రదాయ వంటకాల్లో ఒకటైన కిచిడీ గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించింది. ఢిల్లీలో నిర్వహించిన గ్రేట్ ఇండియన్ ఫుడ్ స్ట్రీట్ ఉత్సవంలో నవంబర్ 4న దాదాపు 918 కేజీల కిచిడీని తయారుచేసి చరిత్ర సృష్టించారు. అక్షయ పాత్ర అనే స్వచ్ఛంద సంస్థ, సంజీవ్ కపూర్ అనే పాకశాస్త్ర ప్రవీణుడి నేతృత్వంలో 50 మంది బృందం ఈ కిచిడీని తయారుచేసింది. 

లడఖ్‌లో అత్యంత ఎత్తయిన రహదారి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ) జమ్మూ కశ్మీర్‌లోని లడఖ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రహదారిని విజయవంతంగా పూర్తి చేసింది. ఈశాన్య ప్రాంతంలోని ఇండో-చైనా సరిహద్దులోని చిసూమ్లే, డెమ్‌చోక్ గ్రామాలను కలుపుతూ 86 కి.మీ. పొడవుగల రోడ్డును భూ ఉపరితలానికి 19,300 అడుగుల ఎత్తులో నిర్మించింది. 
వేసవిలో ఇక్కడి ఉష్ణోగ్రత మైనస్ 10 నుంచి 20 డిగ్రీలు ఉంటుంది. ఎత్తయిన ప్రాంతం కావడంతో ఆక్సిజన్ స్థాయి మిగతా ప్రాంతాలతో పోలిస్తే 50 శాతం తక్కువగా ఉంటుంది. తద్వారా ఇక్కడ పనిచేసేవారు ప్రతి పది నిమిషాలకు ఓసారి ఆక్సిజన్ కోసం కిందకు వెళ్లాల్సి వచ్చేది. చాలామంది జ్ఞాపక శక్తి లోపం, కంటిచూపు మందగించడం, అధిక రక్తపోటు వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని రహదారి నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన చీఫ్ ఇంజనీర్, ప్రాజెక్ట్ హిమాంక్ అధికారి డీఎమ్ పుర్విమత్ తెలిపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచంలో అత్యంత ఎత్తై రహదారి 
ఎప్పుడు : నవంబర్ 1 
ఎవరు : బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 
ఎక్కడ : లడఖ్, జమ్మూకాశ్మీర్ 

ఫోర్ వీలర్లకు ఫాస్టాగ్ పరికరం తప్పనిసరి డిసెంబర్ 1 నుంచి విక్రయించే కొత్త ఫోర్ వీలర్ వాహనాలన్నింటికి ‘ఫాస్టాగ్’ పరికరం తప్పనిసరిగా అమర్చాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ నవంబర్ 2న ఉత్తర్వులు జారీ చేసింది. 
వాహనం విండ్‌స్క్రీన్‌పై అమర్చే ఈ డివైజ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. దీనిని ఆయా వాహనదారుల సేవింగ్‌‌స ఖాతా లేదా ప్రీపెయిడ్ ఖాతాకు అనుసంధానం చేస్తారు. టోల్ గేట్ల నుంచి ప్రయాణించేటప్పుడు ఈ ఫాస్టాగ్‌లలో నిక్షిప్తమైన సమాచారం ఆధారంగా చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుంది. ప్రస్తుతం జాతీయ రహదారులపై 370 టోల్ ప్లాజాల్లో ఫాస్టాగ్ విధానం అమల్లో ఉంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఫోర్ వీలర్లకు ఫాస్టాగ్ తప్పనిసరి 
ఎప్పుడు : డిసెంబర్ 1 
ఎవరు : కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ 
ఎందుకు : టోల్‌గేట్ల దగ్గర చెల్లింపుల ప్రక్రియను సులభతరం చేయడం కోసం 

ఎత్తయిన వంతెనకు ఇండియన్ రైల్వే శ్రీకారం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైలు వంతెన నిర్మాణ పనులను భారత్‌కు చెందిన కొంకణ్ రైల్వే నవంబర్ 6న ప్రారంభించింది. దీన్ని కశ్మీర్ లోయలోగల చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. ఇది కుతుబ్ మినార్ కంటే ఐదు రెట్లు ఎక్కువ ఎత్తులో ఉంటుంది. ఉధమ్‌పూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా దీనిని ప్రారంభించారు. ప్రాజెక్టు వ్యయం రూ.5,005 కోట్లు. 1,315 మీటర్ల పొడవుగల వంతెన నిర్మాణానికి 25 వేల మిలియన్ టన్నుల స్టీల్‌ను ఉపయోగిస్తున్నారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెన నిర్మాణం ప్రారంభం 
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : కొంకణ్ రైల్వే (భారతీయ రైల్వే)
ఎక్కడ : కశ్మీర్ లోయలోగల చినాబ్ నదిపై
ఎందుకు : ఉధమ్‌పూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా

రాష్ట్రీయంఆంగ్ల వెబ్‌సైట్‌లో సింగరేణి ఉద్యోగి పదాలు సింగరేణిలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న యార్లగడ్డ పోలీస్ రాసిన పదాల (Words)కు ప్రఖ్యాత ఆంగ్ల వెబ్‌సైట్‌లో చోటు దక్కింది. అమెరికాకు చెందిన ఎ కలెక్షన్ ఆఫ్ వరల్డ్ అడిటీ అండ్ ట్రివియా (A COLLECTION OF WORLD ODDITY AND TRIVIA) వెబ్‌సైట్ ఆయన రాసిన పది పదాలు ప్రచురించేందుకు సమ్మతించింది. ఈ పదాలు పోటీ పరీక్షలు, సినిమాలు, క్విజ్, స్క్రాబుల్, ఫన్‌విత్ వర్డ్స్, ప్యాన్‌గ్రామ్, క్రాస్‌వర్డ్ ఫజిల్, రేబస్ వంటి ఆటలకు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.
యార్లగడ్డ గతంలో ఆసియాలో అతిపొడవైన పాలిన్‌డ్రోమ్, క్రాస్‌వర్డ్ పజిల్(పదకేళి) తయారు చేసినందుకు గాను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు, చైనా బుక్ ఆఫ్ రికార్డు, నేపాల్ బుక్ ఆఫ్ రికార్డు, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్ సింగపూర్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సాధించారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : ఆంగ్ల వెబ్‌సైట్‌లో సింగరేణి ఉద్యోగి పదాలు
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : యార్లగడ్డ పోలీస్
ఎక్కడ : అమెరికాకు చెందిన ఎ కలెక్షన్ ఆఫ్ వరల్డ్ అడిటీ & ట్రివియా వెబ్‌సైట్‌లో

కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్రాష్ట్ర అనుమతికాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అంతర్రాష్ట్ర అనుమతులు (ఇంటర్ స్టేట్ క్లియరెన్‌‌స) ఇస్తూ కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నవంబర్ 3న ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ప్రాజెక్టుకు పర్యావరణ, అటవీ, హైడ్రాలజీ అనుమతులు లభించాయి. తెలంగాణ ప్రభుత్వం అంతర్రాష్ట్ర ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో 2016 ఆగస్ట్ 23న ఒప్పందం కుదుర్చుకుంది. దీంతోపాటు తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత, ప్రాజెక్టులో చేపట్టే రిజర్వాయర్ల సామర్థ్యంపై కేంద్ర జల సంఘం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రీడిజైనింగ్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా చేపట్టింది.
కాళేశ్వరం ప్రాజెక్టుతో 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు మరియు 18 లక్షల ఎకరాల స్థిరీకరణ జరగడంతో పాటు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో 45 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. తమ్మిడిహెట్టితో తెలంగాణలో రెండు లక్షల ఎకరాలకు, మహారాష్ట్రలోని గడ్చిరోలీ, చంద్రాపూర్ జిల్లాల్లో 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్ర అంతరాష్ట్ర ఒప్పందం చేసుకుంది.
క్విక్ రివ్యూ:ఏమిటి : కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్రాష్ట్ర అనుమతి
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : కేంద్ర జల సంఘం
ఎక్కడ : తెలంగాణలో

హైదరాబాద్‌లో అర్బన్ మొబిలిటీ ఇండియా సదస్సునగరీకరణ పెరిగిపోతున్న నేపథ్యంలో సుస్థిర రవాణా వ్యసవ్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో నవంబర్ 4 నుంచి 6 వరకు జరిగిన అర్బన్ మొబిలిటీ ఇండియా సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన కీలకోపన్యాసం చేశారు. 
సదస్సులో 56 దేశీయ నగరాలు, 30 విదేశీ నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థ తీరుతెన్నులపై ప్రదర్శనలిచ్చారు.
ఈ సదస్సును కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద పనిచేసే Institute of Urban Transport (India) 2006 నుంచి ఏటా నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రవాణా రంగంలో చోటు చేసుకుంటున్న విప్లవాత్మక పరిణామాలతో నగరాల్లో మెరుగైన రవాణా వ్యవస్థలను కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. గ్రీన్ అర్బన్ మొబిలిటీ ఇండియా తర్వాతి సదస్సును 2018 నవంబర్ 2 నుంచి 4 వరకు నాగపూర్‌లో నిర్వహించనున్నారు.
పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణాపై అవార్డులు
బెస్ట్ సిటీ:సూరత్ మున్సిపల్ కార్పొరేషన్
బెస్ట్ నాన్ మోటరైజ్డ్ ట్రాన్‌‌సపోర్ట్: మైసూర్
బెస్ట్ అర్బన్ ట్రాన్‌‌సపోర్ట్ ప్రాక్టీసెస్: జీహెచ్‌ఎంసీ, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్
క్విక్ రివ్యూ:
ఏమిటి : అర్బన్ మొబిలిటీ ఇండియా సదస్సు
ఎప్పుడు : నవంబర్ 4 - 6
ఎవరు : Institute of Urban Transport (India)
ఎక్కడ : హైదరాబాద్‌లో
ఎందుకు : సుస్థిర, మెరుగైన రవాణా సౌకర్యాల కల్పన కోసం

తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ విడుదలనవంబర్ 4న ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా-2017 సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ ప్రాసెసెంగ్ పాలసీని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు విడుదల చేశారు. ఈ పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు లక్షా 25 వేల ఉద్యోగాల కల్పనకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు.
ఈ సదస్సులో కేటీఆర్ వివిధ సంస్థలతో సుమారు రూ.7,200 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. బికనీర్‌వాలా, ప్రయాగ్ న్యూట్రియన్‌‌స ఫుడ్, అన్నపూర్ణ ఫుడ్‌‌స, కరాచీ బేకరీస్, బ్లూక్రాఫ్ట్ ఆగ్రో, సంప్రీ గ్రూప్, క్రీమ్‌లైన్ డైరీ, పుష్య ఫుడ్‌‌స సంస్థలు తదితర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.
పాలసీలోని ముఖ్యాంశాలు
  • పాలసీ కాలపరిమితి ఐదేళ్లు. సగటు ఫుడ్ ప్రాసెసింగ్ స్థాయిని 20 శాతం పెంచడం
  • ఐదేళ్లలో రూ.20 వేల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ
  • 1,25,000 ఉద్యోగాల కల్పనకు ప్రణాళిక
  • రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యం. దీని కోసం గొర్రెలు, చేపల పెంపకం, పశుసంపద పంపిణీ కార్యక్రమాలను అనుసంధానం చేయడం
  • అంతర్జాతీయ ప్రమాణాలతో వ్యవసాయం-ఆహార ఉత్పత్తుల వ్యాల్యూ చైన్ ఏర్పాటు చేయడం. దీని కోసం ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లు, ఫుడ్ పార్కుల అభివృద్ధి
  • పాలసీలో భాగంగా స్టార్టప్స్ కోసం అగ్రి నిధి ఏర్పాటు
క్విక్ రివ్యూ:ఏమిటి : తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ విడుదల
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : కె.తారక రామారావు
ఎక్కడ : వరల్డ్ ఫుడ్ ఇండియా-2017 సదస్సు

అధిక బరువు సమస్యలో ఆంధ్రప్రదేశ్ టాప్దేశంలో అధిక బరువు సమస్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల వయసున్న మహిళలు, పురుషుల్లో (నగరాలు/పట్టణాలు, గ్రామాలు) అధిక బరువు సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఏపీలోని పట్టణాల్లోని 45.6 శాతం మంది మహిళలు, 44.4 శాతం మంది పురుషులు అధిక బరువు సమస్య కలిగి ఉండగా తెలంగాణలోని పట్టణాల్లో మహిళలలో 39.5 శాతం మంది, పురుషులలో 31 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. 
రాష్ట్రాల వారీగా నగర/పట్టణ ప్రాంతాల్లో స్థూలకాయుల శాతం
రాష్ట్రం
మహిళలు
పురుషులు
ఆంధ్రప్రదేశ్‌
45.6
44.4
తెలంగాణ
39.5
31.9
గోవా
36.3
35.3
తమిళనాడు
36.2
30.6
సిక్కిం
34.1
41.5
పశి్చమబెంగాల్‌
30.6
20.7
కర్ణాటక
31.8
28.6
ఉత్తరఖండ్‌
28.4
23.0
హర్యానా
24.3
21.0
మధ్యప్రదేశ్‌
23.8
17.6
బీహార్‌
23.5
20.1
త్రిపుర
23.5
18.2
మేఘాలయ
18.4
17.1
క్విక్ రివ్యూ:
ఏమిటి : అధిక బరువు సమస్యలో ఆంధ్రప్రదేశ్ టాప్
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే
ఎక్కడ : దేశవ్యాప్తంగా

వాస్తుశిల్పి బీఎన్ రెడ్డి కన్నుమూతప్రముఖ వాస్తు శిల్పి, రచయిత మాజీ ఎంపీ బద్దం నర్సింహారెడ్డి(86) నవంబర్ 6న కన్నుమూశారు. బీఎన్ రెడ్డిగా సుపరిచితులైన నర్సింహారెడ్డి 1931 జూన్ 21న నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో జన్మించారు. ఉస్మానియా వర్సిటీలో బీటెక్, అమెరికా కొలరాడో విశ్వ విద్యాలయంలో ఎంటెక్ పూర్తి చేశారు.
ఓయూలో కొంతకాలం లెక్చరర్‌గా పని చేసిన ఆయన 1989, 1996, 1998లో కాంగ్రెస్ నుంచి మూడుసార్లు మిర్యాలగూడ ఎంపీగా గెలిచారు. 1968లో విర్గో పేరుతో ఆర్కిటెక్ట్ సంస్థను స్థాపించారు. 1979లో చైతన్య భారతి విద్యాసంస్థలను ఏర్పాటు చేసిన ఆయన వాటికి మూడుసార్లు చైర్మన్‌గా పని చేశారు.
రచయిత కూడా అయిన బీఎన్‌రెడ్డి సామాజిక అంశాలపై ‘సామాన్యుడి సందేశం’, ‘బీఎన్ భాషితాలు’, ‘బీఎన్. భావతరంగిణి’ వంటి కవితలు రాశారు. ఆయన రాసిన ‘పెళ్ళికాని పెళ్ళి’ కథకు ఉత్తమ కథకుడిగా నంది పురస్కారం, రాజీవ్‌గాంధీ పురస్కారం లభించాయి. 1994లో బీఎన్ సాహితీ పురస్కారం స్థాపించారు. వాస్తు శాస్త్రానికి సంబంధించిన ‘గ్లిమ్‌సెస్ ఆఫ్ వాస్తు’ అనే గ్రంథం రాశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
క్విక్ రివ్యూ:ఏమిటి : వాస్తుశిల్పి బద్దం నర్సింహా రెడ్డి కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 6 
ఎక్కడ : హైదరాబాద్

హైదరాబాద్‌లో ఇమేజ్ టవర్‌కు శంకుస్థాపన యానిమేషన్, గేమింగ్ రంగాల్లో తెలంగాణను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ఇమేజ్ టవర్‌కు నవంబర్ 4న శంకుస్థాపన జరిగింది. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో 10 ఎకరాల్లో ఇమేజ్ టవర్‌ను రూ.946 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. దాదాపు 15 లక్షల మందికి ఉపాధి కల్పించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. హైదరాబాద్‌కు మకుటాయమానంగా నిలుస్తున్న చార్మినార్ స్ఫూర్తితో ఇమేజ్ సౌధం నమూనాను సిద్ధం చేశారు. ఎటు చూసినా టీ ఆకారంలో ఈ నిర్మాణం ఉంటుంది. టీ అంటే తెలంగాణ. టీ అంటే టెక్నాలజీ. దీని నిర్మాణాన్ని మూడేళ్లలో (2020 నాటికి) పూర్తి చేస్తారు. 

విశాఖ నుంచి మూడు పోర్టులకు జల రవాణా ప్రారంభం విశాఖ ఉక్కు ఉత్పత్తులను ఇక్కడి నౌకాశ్రయం నుంచి సముద్ర మార్గం మీదుగా ముంబై, కొచ్చి, అహ్మదాబాద్‌కు రవాణా చేసే ఎస్.ఎస్.ఎల్. శబరిమలై నౌకను నవంబర్ 1న ప్రారంభించారు. 

ఆర్థికంరాష్ట్రీయ కృషి వికాస్ యోజన పేరు మార్పువ్యవసాయ అనుబంధ పరిశ్రమల అభివృద్ధే లక్ష్యంగా ప్రస్తుతం ఉన్న రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (RKVY) పథకంను రఫ్తార్ (వ్యవసాయం, అనుబంధ రంగాల పునరుత్తేజానికి లాభసాటి విధానాలు - Remunerative Approaches for Agriculture and Allied sector Rejuvenation -RAFTAAR) గా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలో నవంబర్ 1న జరిగిన సమావేశంలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
ఈ పథకానికి కేంద్రం, రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో (ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంత రాష్ట్రాల్లో 90:10) నిధులను సమకూరుస్తాయి. వార్షిక వ్యయంలో 50 శాతం నిధులను వ్యవసాయ మౌలిక వసతులు, ఆస్తుల కల్పన, 30 శాతం వాల్యూ అడిషన్ అనుసంధానిత ఉత్పత్తి ప్రాజెక్టులు, 20 శాతం స్థానిక అవసరాలకు అనుగుణంగా వెచ్చిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పేరు రఫ్తార్ గా మార్పు
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : వ్యవసాయ అనుబంధ పరిశ్రమల అభివృద్ధే లక్ష్యంగా

వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సులో 68,000 కోట్ల ఎంవోయూలు న్యూఢిల్లీలో నవంబర్ 3న ప్రారంభమైన ‘వరల్డ్ ఫుడ్ ఇండియా 2017’ సదస్సు తొలిరోజు రూ.68,000 కోట్ల విలువైన 13 ఒప్పందాలు కుదిరాయి. దేశీయ ఆహార, వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఐటీసీ, పెప్సికో, హెర్షీ, పతంజలి, కోకకోలా తదితర కంపెనీలు తమ ప్రణాళికలు వెల్లడించాయి.
మొదటిరోజు సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీ వ్యాపార సులభతర నిర్వహణ సూచీలో 2014లో 142వ స్థానంలో ఉన్న భారత్ 2017లో 100వ స్థానానికి చేరుకోవడం గొప్ప పురోగతిగా అభివర్ణించారు. గత మూడేళ్లలో చేపట్టిన సంస్కరణలే ఇందుకు కారణమని తెలిపారు.
ఒప్పందాల ముఖ్యాంశాలు
  • ఐటీసీ రూ.10,000 కోట్ల రూపాయలతో 20 సమగ్ర ఆహార ప్రాసెసింగ్, లాజిస్టిక్ పార్క్‌లను ఏర్పాటు చేయనుంది.
  • పతంజలి రూ.10,000 కోట్ల రూపాయిలను పెట్టుబడులుగా పెట్టనుంది.
  • పెప్సికో ఐదేళ్లలో 2 బిలియన్ డాలర్లు (రూ.12,800 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తుంది.
  • అమెరికాకు చెందిన చాక్లెట్ తయారీ సంస్థ హెర్షీ ఐదేళ్లలో 50 మిలియన్ డాలర్లు (రూ.320 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది.
క్విక్ రివ్యూ:ఏమిటి : వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సులో రూ.68,000 కోట్ల ఒప్పందాలు
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : ఐటీసీ, పెప్సికో, హెర్షీ, పతంజలి, కోకకోలా తదితర కంపెనీలు
ఎక్కడ : భారత్‌లో

ఎన్‌పీఎస్ గరిష్ట వయోపరిమితి 65 సంవత్సరాలున్యూ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్)లో చేరేందుకు గరిష్ట వయోపరిమితిని పెన్షన్ ఫండ్ నియంత్రణ సంస్థ పీఎఫ్‌ఆర్‌డీఏ పెంచింది. ప్రస్తుతం ఉన్న 60 సంవత్సరాల నుంచి 65 కు పెంచుతూ నవంబర్ 1న ప్రకటన విడుదల చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌పీఎస్ గరిష్ట వయోపరిమితి 65 సంవత్సరాలకు పెంపు
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : పెన్షన్ ఫండ్ నియంత్రణ, అభివృద్ధి సంస్థ 
ఎందుకు : పథకంను మరింత విస్తరింపచేయడానికి

లింగ వ్యత్యాస సూచీలో భారత్‌కు 108 వ ర్యాంక్ప్రపంచ లింగ వ్యత్యాస సూచీ (Global Gender Gap Index) 2017లో భారత్ 108వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోల్చితే ఈ సారి 21 స్థానాలు దిగజారింది. ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 144 దేశాల్లో ఆర్థిక, విద్య, ఆరోగ్యం, ఉద్యోగం, రాజకీయాల్లో మహిళల స్థితిగతులపై అధ్యయనం చేసి విడుదల చేసిన నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. రాజకీయ సాధికారత, ఆయుః ప్రమాణం, అక్షరాస్యతలో లింగ వ్యత్యాసం పెరగడమే భారత్ ర్యాకింగ్‌లో వెనకబడటానికి ప్రధాన కారణం అని డబ్ల్యూఈఎఫ్ వివరించింది.
జాబితాలో ఐస్‌లాండ్ తొలి స్థానంలో నిలవగా, తర్వాతి స్థానాల్లో నార్వే(2), ఫిన్‌లాండ్(3), రువాండా(4), స్వీడన్(5) ఉన్నాయి. 
నివేదిక ముఖ్యాంశాలు:
  • మొత్తం జాబితాలో భారత ర్యాంక్ 108
  • పనిచేసే చోట లింగ వ్యత్యాసం, మహిళలకు వేతన చెల్లింపుల్లో 136వ స్థానం
  • ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాల్లో 139వ స్థానం
  • ఆరోగ్యం, అస్తిత్వం విషయంలో 141వ స్థానం
  • భారత్ లింగ వ్యత్యాసాన్ని 67% పూరించింది. ఇది బంగ్లాదేశ్, చైనాలతో పోల్చితే తక్కువే
  • ప్రపంచ వ్యాప్తంగా 68 శాతం లింగ వ్యత్యాసాన్ని పూరించారు. 2016లో ఇది 68.3 శాతంగా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ లింగ వ్యతాస సూచీ 2017 
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : ప్రపంచ ఆర్థిక ఫోరం
ఎక్కడ : భారత్‌కు 108వ ర్యాంక్
ఎందుకు : రాజకీయ సాధికారత, ఆయుఃప్రమాణం, అక్షరాస్యతలో లింగ వ్యత్యాసం పెరగడం వల్ల

విదేశాల్లోని భారతీయులకు పీఎఫ్ సౌకర్యంవిదేశాల్లో పనిచేసే భారతీయులకు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)లో చేరే అవకాశాన్ని కల్పించినట్లు కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వీపీ జాయ్ నవంబర్ 3న తెలిపారు. దీని కోసం కేంద్రం 18 దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో చేరాలంటే ఆయా దేశాల్లో వారు పొందుతున్న సోషల్ సెక్యూరిటీ పథకాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. పీఎఫ్ కోసం సర్టిఫికెట్ ఆఫ్ కవరేజ్(సీవోసీ)ను ఆన్‌లైన్‌లో పొందవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విదేశాల్లోని భారతీయులకు పీఎఫ్ సౌకర్యం
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : కేంద్ర ప్రావిడెంట్ ఫండ్

35 వేల కంపెనీల రిజిస్ట్రేషన్లు రద్దునోట్ల రద్దు తర్వాత సుమారు 35 వేల కంపెనీలు బ్యాంకుల్లో రూ.17 వేల కోట్లకు పైగా అక్రమంగా డిపాజిట్ చేశాయని కేంద్ర ప్రభుత్వం నవంబర్ 5న వెల్లడించింది. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన ఆ కంపెనీల రిజిస్ట్రేషన్లు రద్దు చేసింది. అలాగే 3.09 లక్షల మంది డెరైక్టర్లపై అనర్హత వేటు వేసినట్లు పేర్కొంది. నల్లధనం, అవినీతిని రూపుమాపేందుకు 2016 నవంబర్ 8న ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 35 వేల కంపెనీల రిజిస్ట్రేషన్లు రద్దు
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : నోట్ల రద్దు తర్వాత అక్రమ డిపాజిట్లు చేసినందుకు

ఓడరేవుల అభివృద్ధికి ‘సాగరమాల’ ప్రతిష్ఠాత్మక సాగరమాల కార్యక్రమంలో భాగంగా తీరప్రాంత ఓడ రేవుల పథకం కింద రూ.2,302 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సహా ఎనిమిది రాష్ట్రాల్లో 47 ప్రాజెక్టులు చేపడుతున్నట్లు కేంద్ర నౌకాయాన శాఖ నవంబర్ 3న వెల్లడించింది. ఈ జాబితాలో మధ్యప్రదేశ్‌లో 12; ఏపీ, గోవాల్లో 10 చొప్పున; కర్ణాటకలో 6; కేరళ, తమిళనాడుల్లో మూడు చొప్పున; గుజరాత్‌లో 2; పశ్చిమ బెంగాల్‌లో ఒక ప్రాజెక్టు ఉన్నాయి. ఇందులో రూ.1,075 కోట్ల విలువైన 23 ప్రాజెక్టులను ఇప్పటికే మంజూరు చేశారు. నౌకాయాన శాఖ ఈ పథకం పరిధిని విస్తరించడంతోపాటు అమలు గడువును 2020 మార్చి 31 వరకు పొడిగించింది.

సైన్స్ అండ్ టెక్నాలజీభారీ గ్రహంను గుర్తించిన బ్రిటన్ శాస్త్రవేత్తలు ఒక చిన్న నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న భారీ గ్రహాన్ని బ్రిటన్‌లోని వార్విక్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. గురుగ్రహం పరిమాణంలో ఉన్న ఈ గ్రహానికి ఎన్జీటీఎస్-1బీ అని నామకరణం చేశారు. నక్షత్రం, గ్రహం పరిమాణాల నిష్పత్తి, వాటి మధ్య దూరం ఆధారంగా చిన్న నక్షత్ర మండలాల చుట్టూ భారీ గ్రహాలు ఏర్పడవని చెబుతున్న అనేక సిద్ధాంతాలకు ఇది విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. భూమి, సూర్యుడి మధ్య దూరంతో పోల్చితే ఈ నక్షత్రానికి, ఎన్జీటీఎస్-1బీ మధ్య ఉన్న దూరం కేవలం మూడు శాతమే. 2.6 రోజుల్లో తన పరిభ్రమణాన్ని పూర్తి చేసే ఈ గ్రహం ఉపరితలంపై ఉష్ణోగ్రతలు కూడా చాలా అధికంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారీ గ్రహం ఎన్జీటీఎస్-1బీ ని గుర్తించిన శాస్త్రవేత్తలు
ఎప్పుడు : నవంబర్‌లో
ఎవరు : బ్రిటన్ శాస్త్రవేత్తలు
ఎక్కడ : ఒక చిన్న నక్షత్రం చుట్టూ

నిర్భయ్ పరీక్ష విజయవంతంస్వదేశంలో తయారైన అణ్వాయుధ సామర్థ్యం గల క్రూయిజ్ క్షిపణి నిర్భయ్‌ను భారత్ తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందిపూర్ ఐటీఆర్ కేంద్రం నుంచి నవంబర్ 7న ఈ పరీక్ష నిర్వహించింది. 2013 నుంచి ఇప్పటి వరకు జరిపిన నాలుగు పరీక్షల్లో నిర్భయ్ విఫలమైంది.
భూ ఉపరితలం నుంచి ప్రయోగించే ఈ సబ్‌సోనిక్ క్షిపణి(ఎల్‌ఏసీఎం) 300 కిలోల బరువు గల అణు వార్‌హెడ్లను మోసుకెళ్లగలదు. ప్రత్యర్థుల రాడార్లు, క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకుని ప్రయాణం చేసేలా డీఆర్‌డీఓ దీన్ని రూపొందించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తొలిసారి నిర్భయ్ క్షిపణి పరీక్ష విజయవంతం
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : డీఆర్‌డీవో (భారత ప్రభుత్వం)
ఎక్కడ : చాందిపూర్ ఐటీఆర్ కేంద్రం, ఒడిశా

గ్లెడ్ బాంబు పరీక్ష విజయవంతం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి గ్లెడ్ బాంబును రక్షణ శాఖ నవంబర్ 2న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న సమీకృత పరీక్షా కేంద్రం (ఐటీఆర్) వద్ద వాయు సేన విమానం నుంచి దీన్ని జారవిడిచింది. 70 కిలోమీటర్లకుపైగా దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించిందని రక్షణ శాఖ వెల్లడించింది. ఈ బాంబును ఇమారత్ పరిశోధన కేంద్రం(ఆర్‌సీఐ), రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో), వాయు సేన సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. శత్రు వైమానిక స్థావరాలను ధ్వంసం చేయగల సామర్థ్యం దీనికి ఉంది. 

క్రీడలుకామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలుకామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజు భారత్ షూటర్లు రెండు స్వర్ణ పతకాలు గెలిచారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో షాజర్ రిజ్వీ 240.7 పాయింట్లతో స్వర్ణాన్ని దక్కించుకోగా, 236 పాయింట్లతో ఓంకార్ సింగ్ రజతం, 214.1 పాయింట్లతో జీతూ రాయ్ కాంస్యం సాధించారు.
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో పూజా ఘాట్కర్ 249.8 పాయింట్లతో స్వర్ణం సాధించగా అంజుమ్ మౌద్గిల్ 248.7 పాయింట్లతో రజతం గెలిచింది. పోటీల తొలి రోజు హీనా సిద్ధూ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్) స్వర్ణం, దీపక్ కుమార్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్) రజతం గెలిచారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : భారత షూటర్లకు రెండు స్వర్ణాలు
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : షాజర్ రిజ్వీ (పురుషులు) పూజా ఘట్కర్ (మహిళలు)
ఎక్కడ : కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో

కామన్వెల్త్ షూటింగ్‌లో గగన్‌కు రజతం 
 ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ షూటర్ గగన్ నారంగ్ రజత పతకం గెలుచుకున్నాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్ ఫైనల్‌లో గగన్ 246.3 పాయింట్లు సాధించి రజతం గెలవగా, స్వప్నిల్ కుసాలే 225.6 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకున్నాడు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో అన్నురాజ్ సింగ్ కాంస్య పతకం గెలుచుకుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కామన్వెల్త్ షూటింగ్‌లో రజత పతకం 
ఎప్పుడు : నవంబర్ 2 
ఎవరు : గగన్ నారంగ్ 
ఎక్కడ : ఆస్ట్రేలియా 

పద్మశ్రీ కి శ్రీకాంత్ పేరు సిఫారసు భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ పేరును కేంద్ర పౌర పురస్కారం ‘పద్మశ్రీ’కు సిఫారసు చేశారు. ఈ ఏడాది శ్రీకాంత్ నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ గెలవడంతోపాటు మరో సూపర్ సిరీస్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. దీంతో నామినేషన్ల గడువు సెప్టెంబర్ 15తో ముగిసినప్పటికీ కేంద్ర మాజీ క్రీడల మంత్రి విజయ్ గోయల్ ప్రత్యేక చొరవతో శ్రీకాంత్ పేరును పరిశీలించాలని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ‘పద్మశ్రీ’ పురస్కారానికి పేరు సిఫారసు 
ఎప్పుడు : నవంబర్ 1 
ఎవరు : కిడాంబి శ్రీకాంత్ 
ఎందుకు : 2017లో నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచినందుకు 

క్రికెట్‌కు ఆశిష్ నెహ్రా వీడ్కోలు భారత మీడియం ఫేస్ బౌలర్ (లెఫ్టార్మ్) ఆశిష్ నెహ్రా (38) క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికారు. నవంబర్ 1న న్యూఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో తన రిటైర్మెంట్ ప్రకటించాడు. 1999లో అజారుద్దీన్ కెప్టెన్సీలో ఆరంగేట్రం చేసిన నెహ్రా 18 ఏళ్ల 250 రోజుల సుదీర్ఘ కెరీర్ కొనసాగించారు. 17 టెస్టులు, 120 వన్డేలు, 26 టీ20 మ్యాచ్‌లాడిన నెహ్రా మొత్తం 235 వికెట్లు తీసుకున్నాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : క్రికెట్‌కు ఆశిష్ నెహ్రా వీడ్కోలు 
ఎప్పుడు : నవంబర్ 1 
ఎక్కడ : ఫిరోజ్‌షా కోట్ల మైదానం, ఢిల్లీ 

కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ప్రకాశ్, అంకుర్ కు స్వర్ణాలు కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు ప్రకాశ్ సంజప్ప, అంకుర్ మిట్టల్ స్వర్ణ పతకాలు గెలిచారు. పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో ప్రకాశ్ నంజప్ప స్వర్ణం నెగ్గగా, అమన్‌ప్రీత్ సింగ్ రజతం, జీతూ రాయ్ కాంస్యం సాధించారు. పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో ప్రపంచ నంబర్‌వన్ అంకుర్ మిట్టల్ పసిడి నెగ్గగా మహిళల డబుల్ ట్రాప్‌లో శ్రేయసి సింగ్ రజతం గెలిచింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్ 15 పతకాలు సాధించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ కు రెండు స్వర్ణాలు 
ఎప్పుడు : నవంబర్ 3 
ఎవరు : ప్రకాశ్ సంజప్ప, అంకుర్ మిట్టల్ 
ఎక్కడ : ఆస్ట్రేలియా 

జాతీయ అంధుల వన్డే టోర్నీ విజేత ఆంధ్రప్రదేశ్ జాతీయ అంధుల వన్డే క్రికెట్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు టైటిల్‌ను సొంతం చేసుకుంది. ముంబైలో నవంబర్ 3న ముగిసిన ఫైనల్లో ఏడు వికెట్ల తేడాతో గుజరాత్‌ను ఓడించింది. గుజరాత్ నిర్ణీత 35 ఓవర్లలో 250 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా ఏపీ జట్టు 31.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రపంచ కప్‌ను గెలిచిన జట్టు సారథి అజయ్‌రెడ్డి ఈ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జాతీయ అంధుల వన్డే టోర్నీ విజేత 
ఎప్పుడు : నవంబర్ 3 
ఎవరు : ఆంధ్రప్రదేశ్ 
ఎక్కడ : ముంబై 

ఆసియా కప్ మహిళల హకీ విజేత భారత్ భారత మహిళల జట్టు ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ విజేతగా నిలిచింది. నవంబర్ 5న జపాన్‌లో జరిగిన ఫైనల్లో ‘పెనాల్టీ షూటౌట్’లో 5-4తో చైనాపై విజయం సాధించింది. తద్వారా 2018లో లండన్‌లో జరిగే ప్రపంచకప్‌కు ఆసియా చాంపియన్ హోదాలో నేరుగా అర్హత సాధించింది. 
భారత్ ఈ కప్ గెలవడం ఇది రెండోసారి. గతంలో 1999, 2004, 2009లలో ఫైనల్‌కు చేరినప్పటికీ 2004లో మాత్రమే టైటిల్ నెగ్గింది. ఈ టోర్నీలో సవిత ‘బెస్ట్ గోల్‌కీపర్’ అవార్డును గెల్చుకుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆసియా కప్ మహిళల హకీ విజేత 
ఎప్పుడు : నవంబర్ 5 
ఎవరు : భారత్ 
ఎక్కడ : జపాన్ 

ఆసియా టూర్ టైటిల్ విజేత శివ్ కపూర్ భారత స్టార్ గోల్ఫర్ శివ్ కపూర్ ఆసియా టూర్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. నవంబర్ 5న ఢిల్లీలో జరిగిన పానాసోనిక్ ఓపెన్ టోర్నీలో అతను విజేతగా నిలిచాడు. ఈ ఏడాది శివ్ కపూర్‌కిది రెండో ఆసియా టూర్ టైటిల్ కాగా కెరీర్‌లో మూడోది. 2005లో శివ్ కపూర్ తొలిసారి వోల్వో మాస్టర్స్ ఆసియా టూర్ టైటిల్‌ను గెలిచాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆసియా టూర్ టైటిల్ విజేత 
ఎప్పుడు : నవంబర్ 5 
ఎవరు : భారత స్టార్ గోల్ఫర్ శివ్ కపూర్ 
ఎక్కడ : న్యూఢిల్లీ 

కామన్వెల్త్ షూటింగ్‌లో సత్యేంద్రకు స్వర్ణం కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో చివరిరోజు (నవంబర్ 6) భారత్‌కు పసిడి పతకంతోపాటు రజతం లభించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో సత్యేంద్ర సింగ్ బంగారు పతకం సొంతం చేసుకోగా.. సంజీవ్ రాజ్‌పుత్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 
ఆస్ట్రేలియాలో నవంబర్ 6న ముగిసిన కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఓవరాల్‌గా ఆరు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఏడు కాంస్యాలతో కలిపి మొత్తం 20 పతకాలు దక్కించుకుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కామన్వెల్త్ షూటింగ్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో స్వర్ణం 
ఎప్పుడు : నవంబర్ 6 
ఎవరు : సత్యేంద్ర సింగ్ (భారత్) 
ఎక్కడ : ఆస్ట్రేలియా 

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ భారత్ కైవసం న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో గెలుచుకుంది. కేరళలో నవంబర్ 7న ముగిసిన మూడో టీ20లో 6 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. దీంతో సిరీస్ భారత్ సొంతం అయింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు రెండూ బుమ్రానే గెలుచుకున్నాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ విజేత 
ఎప్పుడు : నవంబర్ 7 
ఎవరు : భారత్ 
ఎక్కడ : తిరువనంతపురం, కేరళ 

చెన్నైలో ఏటీపీ చాలెంజర్ టోర్నీ 2018 ఫిబ్రవరి నుంచి చెన్నై ఓపెన్ చాలెంజర్ టోర్నీని నిర్వహించనున్నట్లు తమిళనాడు టెన్నిస్ సంఘం (టీఎన్‌టీఏ) నవంబర్ 7న తెలిపింది. ఇందుకోసం ది అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ), అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) నుంచి అనుమతి తీసుకున్నట్లు వెల్లడించింది. 50వేల డాలర్ల (దాదాపు రూ.33 లక్షలు) ప్రైజ్‌మనీతో ఈ టోర్నీని నిర్వహిస్తారు. భారత ప్లేయర్లు అంతర్జాతీయ ఆటగాళ్లతో పోటీ పడేందుకు ఈ టోర్నీ ఉపయోగపడనుందని టీఎన్‌టీఏ చీఫ్ అలగప్పన్ తెలిపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఏటీపీ చాలెంజర్ టోర్నీ నిర్వహణ 
ఎప్పుడు : ఫిబ్రవరి 2018 
ఎవరు : తమిళనాడు టెన్నిస్ సంఘం 
ఎక్కడ : చెన్నై 

వార్తల్లో వ్యక్తులు పాక్‌లో భారత హైకమిషనర్‌గా అజయ్ బిసారియా 
 పాకిస్తాన్‌లో భారత హైకమిషనర్‌గా 1987 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి అజయ్ బిసారియా నియమితులయ్యారు. పాక్‌లో భారత హైకమిషనర్‌గా పనిచేస్తున్న గౌతమ్ బంబావలే ఇటీవల చైనా రాయబారిగా వెళ్లిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అజయ్‌ను నియమించింది. ప్రస్తుతం అజయ్ పోలెండ్‌లో భారత రాయబారిగా ఉన్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పాక్‌లో భారత హైకమిషనర్ నియామకం 
ఎప్పుడు : నవంబర్ 1 
ఎవరు : అజయ్ బిసారియా 

ఆసియా కుబేరుడుగా అవతరించిన ముకేశ్ రిలయన్‌‌స ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చైనాకు చెందిన హు కా యాన్‌ను అధిగమించి ఆసియా కుబేరుడిగా అవతరించారు. ఆర్‌ఐఎల్ షేరు ధర నవంబర్ 1న 1.22 శాతం పెరగడంతో ముకేశ్ వ్యక్తిగత సంపద విలువ ఒక్కరోజే 466 మిలియన్ డాలర్ల మేర (రూ.3,000) పెరిగింది. దీంతో 42.1 బిలియన్ డాలర్ల సంపద విలువతో (రూ.2.7 లక్షల కోట్లు) ఆసియా కుబేరుల్లో అగ్రస్థానంలో నిలిచారు. చైనా ఈవర్‌గ్రాండ్ గ్రూపు చైర్మన్ హు కా యాన్ సంపద నవంబర్ 1 నాటికి నాటికి 1.28 బిలియన్ డాలర్ల మేర తగ్గి 40.6 బిలియన్ డాలర్లు (రూ.2.60 లక్షల కోట్లు) కు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ముకేశ్ అంబానీ 14వ స్థానంలో ఉన్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆసియా కుబేరుల్లో అగ్రస్థానం 
ఎప్పుడు : నవంబర్ 1 
ఎవరు : ముఖేష్ అంబానీ (రిలయన్‌‌స ఇండస్ట్రీస్) 

దక్షిణ కొరియా కాన్సులేట్ జనరల్‌గా సురేష్ చుక్కపల్లి హైదరాబాద్‌లో దక్షిణ కొరియా గౌరవ కాన్సుల్ జనరల్‌గా ఫినిక్స్ గ్రూప్ చైర్మన్ సురేష్ చుక్కపల్లి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని ధ్రువీకరిస్తూ విదేశాంగ శాఖ నవంబర్ 1న ఒక ప్రకటన వెలువరించింది. గతంలో ఈయన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : దక్షిణ కొరియా గౌరవ కాన్సుల్ నియామకం 
ఎప్పుడు : నవంబర్ 1 
ఎవరు : సురేష్ చుక్కపల్లి 
ఎక్కడ : హైదరాబాద్ 

ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల్లో ఐదుగురు భారతీయులుఫోర్బ్స్ పత్రిక 2017 సంవత్సరానికి ప్రకటించిన ప్రపంచ వంద మంది అత్యంత శక్తిమంతమైన మహిళల్లో జర్మనీ చాన్‌‌సలర్ ఏంజెలా మెర్కెల్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈమె ఈ స్థానాన్ని దక్కించుకోవటం ఇది 12వ సారి. వరుసగా ఏడోసారి.
మెర్కెల్ తర్వాత రెండు, మూడు స్థానాల్లో వరుసగా యూకే ప్రధాని థెరెసా మే, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకురాలు మిలిందా గేట్స్ నిలిచారు. ఫేస్‌బుక్ సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్ 4వ స్థానంలో, జనరల్ మోటార్స్ సీఈవో మేరీ బర్రా ఐదో స్థానంలో నిలిచారు. భారత సంతతికి చెందిన పెప్సికో సీఈవో ఇంద్రా నూయి 11వ స్థానం, ఇండో-అమెరికన్ నిక్కీ హేలీ 43వ స్థానంలో ఉన్నారు. జాబితాలో కొత్తగా 23 మంది స్థానం దక్కించుకోగా, అందులో ఇవాంకా ట్రంప్ (19వ స్థానం) కూడా ఉన్నారు. 
ఈ జాబితాలో బారత్ నుంచి ఐదుగురు మహిళలు చోటు దక్కించుకున్నారు. వీరిలో ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ చీఫ్ చందా కొచర్ అగ్రస్థానం (మొత్తంగా 32వ స్థానం) లో నిలిచారు. తర్వాతి స్థానాల్లో హెచ్‌సీఎల్ కార్ప్ సీఈవో రోష్ని నాడార్ మల్హోత్రా (57), బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా (71) హెచ్‌టీ మీడియా చైర్‌పర్సన్, ఎడిటోరియల్ డెరైక్టర్ శోభన భర్తియా (92) బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా (97) ఉన్నారు.
టాప్ 10 శక్తిమంతమైన మహిళలు
శక్తిమంతమైన భారత మహిళలు
ర్యాంక్
పేరు
పేరు
ర్యాంక్
1
ఏంజెలా మెర్కెల్
చందా కొచ్చర్
32
2
థెరెసా మే
రోష్ని నాడార్ మల్హోత్రా
57
3
మిలిండా గేట్స్
కిరణ్ మజుందార్ షా
71
4
షెరిల్ శాండ్‌బర్గ్
శోభన భర్తియా
92
5
మేరీ బర్రా
ప్రియాంక చోప్రా
97
6
సుసన్ వోజిస్కీ
7
అబిగెయిల్ జాన్సన్
8
క్రిస్టినా లగార్డే
9
అనా ప్యాట్రిసియా బోటిన్
10
గిన్నీ రోమెట్టీ

క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల్లో ఐదుగురు భారతీయులు
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : చందా కొచ్చర్, రోష్ని నాడార్ మల్హోత్రా, కిరణ్ మజుందార్ షా, శోభన భర్తియా, ప్రియాంక చోప్రా
ఎక్కడ : ప్రపంచంలో 100 మంది శక్తిమంతమైన మహిళలు

మహమ్మద్ అలీ జిన్నా కూతురు కన్నుమూతపాకిస్థాన్ నిర్మాత మహమ్మద్ అలీ జిన్నా కూతురు దీనా వాడియా (99) నవంబర్ 3న అమెరికాలో కన్నుమూశారు. వాడియా గ్రూపు చైర్మన్ నుస్లీ వాడియా ఆమె కుమారుడు. దీనా తన తండ్రితో విభేదించి వాడియాను పెళ్లి చేసుకొని తండ్రికి దూరంగా ఉన్నది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహమ్మద్ అలీ జిన్నా కూతురు కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : దీనా వాడియా
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా

తెలుగులో ‘హిట్ రీఫ్రెష్’మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల రాసిన ‘హిట్ రీఫ్రెష్’ పుస్తకం తెలుగులో అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటూ హిందీ, తమిళ భాషల్లోనూ ఈ పుస్తకంను అనువదించారు.‘హిట్ రీఫ్రెష్’ పుస్తకంలో తన వ్యక్తిగత జీవితంతో పాటూ మైక్రోసాఫ్ట్‌లో తన ప్రయాణం, ఇతర అనుభవాలను నాదెళ్ల వివరించారు. పుస్తక ప్రచారం నిమిత్తం భారత్‌కు వచ్చిన నాదెళ్ల నవంబర్ 6న హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ అభివృద్ధి కేంద్రాన్ని సందర్శించారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : తెలుగులో హిట్ రీఫ్రెష్ పుస్తకం
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : సత్య నాదెళ్ల 

కర్ణాటకకు తొలిసారి మహిళా డీజీపీ 
కర్ణాటక తొలి మహిళా డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా నీలమణి రాజు అక్టోబర్ 31న బాధ్యతలు చేపట్టారు. 1983 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన ఆమె ఈ పదవిలో 2020 జనవరి వరకు ఉంటారు. నీలమణి స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని రూర్కీ. 

అవార్డులుకృష్ణ సోబతీకి జ్ఞానపీఠ్ పురస్కారం ప్రముఖ హిందీ సాహితీవేత్త కృష్ణ సోబతీ(92) ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కారం 2017 కు ఎంపికైంది. ఆమె ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న గుజరాత్‌లో జన్మించారు. ప్రయోగాత్మక, విలక్షణ శైలి కృష్ణ సోబతి ప్రత్యేకత. ఆమె రాసిన ‘దార్ సే బిఛుడీ, మిత్రో మర్జానీ, జిందగీనామా’ తదితర రచనలు ప్రఖ్యాతి గాంచాయి. దేశ విభజన, స్త్రీ, పురుష సంబంధాలు, మారుతున్న భారతీయ సమాజ స్థితిగతులు, పతనమవుతున్న మానవ విలువలు వంటివి ఆమె రచనల్లో ముఖ్యంగా కన్పిస్తాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : జ్ఞాన్‌పీఠ్ పురస్కారం 2017
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : కృష్ణ సోబతీ
ఎందుకు : హిందీ సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు

బ్రహ్మానందం, జగపతిబాబులకు జీవన సాఫల్య పురస్కారంతెలుగు నటులు బ్రహ్మానందం, జగపతిబాబుకు ఢిల్లీ తెలుగు అకాడమీ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. ఈ మేరకు నవంబర్ 5న అకాడమీ 29వ వార్షికోత్సవంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ వారికి అవార్డులు ప్రదానం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రహ్మానందం, జగపతిబాబులకు జీవన సాఫల్య పురస్కారం
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : ఢిల్లీ తెలుగు అకాడమీ

పవర్‌గ్రిడ్‌కు ఇన్‌ఫ్రా అవార్డుప్రభుత్వ రంగ విద్యుత్తు కంపెనీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు పవర్ ట్రాన్స్‌మిషన్ రంగంలో 2017 సంవత్సరానికి గాను డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఇన్‌ఫ్రా అవార్డు లభించింది. నవంబర్ 6న ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో పవర్ గ్రిడ్ ఈడీ వి.కె. ఖరే, జీఎమ్(హెచ్‌ఆర్) అనిల్ గైక్వాడ్, ఏజీఎమ్ అజయ్ హొలాని ఈ అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఇన్‌ఫ్రా అవార్డు 2017
ఎప్పుడు : నవంబర్ 6 
ఎవరు : పవర్‌గ్రిడ్ కార్పోరేషన్

అంతర్జాతీయంబ్రెగ్జిట్‌కు ముహూర్తం 2019, మార్చి 29 ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి బ్రిటన్ విడిపోయేందుకు ముహూర్తం ఖరారైంది. 2019, మార్చి 29 ఈయూ నుంచి అధికారికంగా నిష్క్రమిస్తామని ప్రధాని థెరిసా మే నవంబర్ 10న ప్రకటించారు. బ్రెగ్జిట్ తేదీ, సమయాన్ని చేరుస్తూ సవరణలు చేసిన తరువాత ఈయూ నిష్క్రమణ చట్టాన్ని వచ్చే వారంలో హౌస్ ఆఫ్ కామన్‌‌సలో ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవడం ఖాయమని, ఈ విషయంలో ప్రభుత్వం నిబద్ధత, నిజాయతీపై సందేహం అక్కర్లేదని ది డైలీ టెలిగ్రాఫ్’కు రాసిన వ్యాసంలో ఆమె తెలిపారు. చారిత్రక ఈయూ నిష్క్రమణ చట్టం ముందరి పేజీలోనే బ్రెగ్జిట్ తేదీ, సమయాన్ని స్పష్టంగా ప్రచురిస్తామని వెల్లడించారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రెగ్జిట్‌కు ముహూర్తం ఖరారు 
ఏమిటి : 2019, మార్చి 29 
ఎవరు : బ్రిటన్ ప్రధాని థెరెసా మే 
ఎందుకు : యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయేందుకు

అంతరిక్ష పిల్లికి కాంస్య విగ్రహం అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన ఏకైక పిల్లిగా గుర్తింపు పొందిన ఫెలికిట్టె’కి మరో అరుదైన గౌరవం లభించనుంది. ఫ్రాన్స్లో ఐదడుగుల ఫెలికిట్టె’ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి లండన్‌కు చెందిన మాథ్యూ గై అనే వ్యక్తి కిక్‌స్టార్టర్ వెబ్‌సైట్‌లో నిధుల సేకరణను ప్రారంభించారు. 
1963 అక్టోబర్ 18న ఫ్రాన్స్ ప్రయోగించిన వెరొనిక్ ఏజీ1 రాకెట్‌లో ఈ పిల్లి భూమి నుంచి 157 కి.మీ. మేర అంతరిక్షంలోకి ప్రయాణించి, 15 నిమిషాల అనంతరం సురక్షితంగా భూమిపైకి చేరుకుంది. ఒక పిల్లి అంతరిక్షంలోకి వెళ్లిన సంగతిని ప్రజలకు తెలిపేందుకే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నానని మాథ్యూ తెలిపారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన పిల్లి ఫెలికిట్టెకు కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన 
ఏమిటి : నవంబర్ 12
ఎవరు : మాథ్యా గై 
ఎక్కడ : ఫ్రాన్స్ లో 

ఇరాక్ - ఇరాన్ సరిహద్దులో భారీ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం ఇరాక్-ఇరాన్ సరిహద్దుల్లో భారీ విధ్వంసం సృష్టించింది. భూకంప తీవ్రతకు భారీ భవనాలు, ఇళ్లు నేలమట్టవడంతో రెండు దేశాల్లో మొత్తం 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 7 వేల మంది గాయపడ్డారు. 
ఇరాక్‌లోని హలబ్జ పట్టణానికి 31 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలం నుంచి 23.2 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అమెరికా భూ పరిశీలన సంస్థ తెలిపింది. ఇరాన్, ఇరాక్ స్థానిక కాలమానం ప్రకారం నవంబర్ 12న రాత్రి 9.48 గంటల (భారత కాలమానం నవంబర్ 12న రాత్రి 11.48 గంటలు) సమయంలో భూప్రకంపనలు మొదలయ్యాయి. కొద్ది క్షణాల్లో ఇరాన్ పశ్చిమ ప్రాంతంలోని కెర్మన్‌షా ప్రావిన్సు, ఇరాక్ ఉత్తర భాగంలోని కుర్దిష్ ప్రావిన్సుల్లో పలు ప్రాంతాలు శిథిలాల దిబ్బగా మారిపోయాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇరాక్ - ఇరాన్ సరిహద్దులో భారీ భూకంపం 
ఏమిటి : నవంబర్ 12
ఎక్కడ : ఇరాక్‌లోని హలబ్జ పట్టణానికి 31 కిలోమీటర్ల దూరంలో 

దక్షిణ చైనా సముద్రంపై చైనా, వియత్నాం రాజీదక్షిణ చైనా సముద్రం వివాదం విషయంలో చైనా, వియత్నాం రాజీకొచ్చాయి. ఆ విషయంలో వెనక్కి తగ్గేందుకు ఇరు దేశాలు నవంబర్ 13న అంగీకరించాయి. దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల నౌకా రవాణా వాణిజ్యం జరిగే ఈ దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనా, వియత్నాంతో పాటు బ్రూనై, తైవాన్, ఫిలిప్పీన్‌‌స మధ్య ఎంతో కాలంగా వివాదం నలుగుతోంది. ఈ సముద్రంలో చైనా ఓ అడుగు ముందుకేసి మిలిటరీ కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా ఏకంగా కృత్రిమ ద్వీపాలను నిర్మించింది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హనోయ్ పర్యటన సందర్భంగా ఈ సముద్రం విషయంలో శాంతి నెలకొల్పేందుకు కృషి చేస్తామని రెండు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో అంగీకరించాయి. 
క్విక్ రివ్యూ:ఏమిటి : దక్షిణ చైనా సముద్రంపై రాజీ
ఏమిటి : నవంబర్ 13
ఎవరు : చైనా, వియత్నాం

మనీలాలో ఆసియాన్, తూర్పు ఆసియా సదస్సు ఉగ్రవాదం, తీవ్రవాదంతో పాటు సీమాంతర ఉగ్రవాదం మనం ఎదుర్కొం టున్న ప్రధాన సవాళ్లని, అన్ని దేశాలు వాటిని సమష్టిగా ఎదుర్కొనే సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలాగే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నిబంధనల ఆధారిత ప్రాంతీయ భద్రతా విధానం ఎంతో అవసరమని ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరిగిన 31వ ఆసియాన్-భారత్’ సదస్సులో నవంబర్ 14న మోదీ పేర్కొన్నారు. 
ఆసియాన్ దేశాధినేతలకు ఆహ్వానం 
భారత్, ఆసియాన్ మధ్య పరస్పర విలువలు, ఉమ్మడి లక్ష్యం’పై ప్రసంగించిన ప్రధాని మోదీ.. 25, జనవరి 2018న న్యూఢిల్లీలో ఇండో-ఆసియాన్ ప్రత్యేక సదస్సుకి దేశాధినేతలను ఆహ్వానించారు. 
ఆసియాన్ సభ్య దేశాలు.. 
ఆసియాన్‌లో థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, మయన్మార్, కంబోడియా, లావోస్, బ్రూనైలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రభావవంతమైన కూటమిలో ఒకటైన ఆసియాన్‌లో భారత్, అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియాలు చర్చల్లో భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. ఆసియాన్ సదస్సుతో పాటు.. ప్రధాని నరేంద్ర మోదీ రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్’(ఆర్‌సీఈపీ) సదస్సులో కూడా పాల్గొన్నారు. ఆర్‌సీఈపీలో 10 ఆసియాన్ సభ్య దేశాలతో పాటు, భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ భాగస్వాములుగా ఉన్నాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై ఈ దేశాలు చర్చలు కొనసాగించాయి. 
తూర్పు ఆసియా’ది కీలక పాత్ర 
ఆసియాన్-భారత్ సదస్సుతో పాటు.. తూర్పు ఆసియా సదస్సులో కూడా ప్రధాని ప్రసంగించారు. తూర్పు ఆసియా ప్రాంతంలో రాజకీయ, భద్రత, వాణిజ్యపర అంశాల పరిష్కారంలో భారత్ పూర్తి సహకారం అందిస్తుందని, ఆ కూటమితో కలిసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఈస్ట్ ఆసియా సదస్సు ఎంతో ముఖ్యమైన వేదిక. 2005లో ప్రారంభమైన ఈ సదస్సు వ్యూహాత్మక అంశాలు, అంతర్జాతీయ రాజకీయాలు, తూర్పు ఆసియా ఆర్థిక వికాసంలో గణనీయమైన పాత్ర పోషిస్తోంది. తూర్పు ఆసియా సదస్సులో ఆసియాన్ సభ్య దేశాలతో పాటు, భారత్, చైనా, జపాన్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యాలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. 

నాలుగు దేశాల చతుర్భుజ కూటమి !ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఎదురులేని ఆర్థిక, సైనిక శక్తిగా అవతరించిన చైనా ఆధిపత్య ధోరణిని కట్టడిచేయడానికి రంగం సిద్ధమైంది. దక్షిణ చైనా సముద్రంపై పూర్తి పెత్తనం కోరుతున్న చైనా ఆటలు సాగకుండా అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్‌తో కూడిన నాలుగుదేశాల కూటమి (క్వాడ్రిలేటరల్-క్వాడ్) అవసరమని జపాన్ ప్రధాని షింజో అబే 2007లోనే భారత పార్లమెంటులో ప్రసంగిస్తూ సూచించారు. తర్వాత నెల రోజులకే ఆయన పదవి నుంచి వైదొలిగాక ఈ ‘చైనా వ్యతిరేక’ చతుర్భుజం ప్రతిపాదన మరుగునపడిపోయింది. మళ్లీ ఇన్నేళ్లకు అబే ప్రధానిగా తన స్థానం బలోపేతం చేసుకున్నాక ఈ ప్రతిపాదనకు గట్టి ఆమోదముద్ర లభించింది. 31వ ఆగ్నేయాసియా, 12వ తూర్పు ఆసియా సదస్సుల్లో పాల్గొనడానికి ఫిలిప్పీన్‌‌స వచ్చిన ఈ నాలుగు దేశాల అధికారులు మనీలాలో నవంబర్ 12న సమావేశమయ్యారు. నాలుగు రాజ్యాల కూటమి ప్రతిపాదనపై ఉన్నతాధికారుల స్థాయిలో అక్కడ చర్చలు జరిగాయి. 
షింజో లక్ష్యమేంటి?
అంతర్జాతీయ ఆర్థిక ప్రపంచంలో ప్రధానపాత్ర పోషించే ఆసియా, పసిఫిక్ దేశాలకు రవాణాపరంగా దక్షిణ చైనా సముద్రం ఎంతో కీలకమైనది. అయితే ప్రపంచీకరణ ఫలాలతో బలమైన ఆర్థికశక్తిగా ఎదిగిన చైనా ఈ సముద్ర ప్రాంతంపై పూర్తి ఆధిపత్యం సాధించేలా దుందుడుకుగా వ్యవహరిస్తోంది. పొరుగు దేశాలను బెదిరించే ధోరణిలో ప్రకటనలు చేస్తోంది. అలాగే గతంలో జపాన్ చైనాతో ప్రాదేశిక వివాదాలను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు రాజ్యం అనుసరించే పెత్తందారీ ధోరణులకు వ్యతిరేకంగా సంకీర్ణం నిర్మించాలనే పట్టుదలతో జపాన్ ఉంది. తాజా పరిణామాల ఫలితంగా చైనాకు ఇండియా మరింత దూరం కావడంతో భారత్‌ను ఈ కూటమిలో చేర్చుకోవడానికి ఇదే మంచి తరుణమని కూడా అబే భావిస్తున్నారు. అలాగే అధ్యక్షపదవి చేపట్టినప్పటి నుంచీ చైనాను కట్టడి చేయడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అమెరికా కూడా ఈ కూటమి ప్రతిపాదనపై ఆసక్తి ప్రదర్శిస్తోంది. అమెరికాను అనుసరించే ఆస్ట్రేలియా కూడా ఇప్పుడు ‘చతుర్భుజం’ లో భాగంకావడానికి సిద్ధమైంది.
కూటమిలోకి భారత్? 
హిందూ మహాసముద్రం, ఆగ్నేయాసియా ప్రాంతం మీదుగా ముడి చమురు చైనాకు రవాణా అవుతోంది. అందుకే ఈ ప్రాంతాలపై తన ప్రభావం, ఆధిపత్యం ఉండేలా చైనా పావులు కదుపుతూ చాలా వరకు అనుకున్నది సాధించింది. దౌత్య, ప్రాంతీయ సంబంధాల్లో భారత్ కొంత వెనుకబడటం చైనాకు ఇప్పటి వరకూ కలిసొచ్చింది. అయితే ఇటీవల రెండు నెలలకు పైగా డోక్లామ్ వివాదంతో భారత్ విసిగిపోయింది. ఈ నేపథ్యంలో చైనాను కట్టడి చేసేందుకు ‘క్వాడ్’ కూటమిలో చేరడం ఇప్పుడు భారత్‌కు మంచి అవకాశంగా కనిపిస్తోంది. మనీలాలో జరిగిన అధికారుల స్థాయి చతుర్భుజ కూటమి సమావేశంలో నాలుగు దేశాల ప్రతినిధులూ వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అందరూ అంతర్జాతీయ చట్టాలను అనుసరించడం, సముద్రాల్లో నౌకలు, ఆకాశంలో విమానాల రవాణాకు అడ్డంకులు లేకుండా చూడడం, ఓడలకు భద్రత కల్పిస్తూ, ఉగ్రవాదుల నుంచి సవాళ్లను దీటుగా ఎదుర్కోవడం వంటి అంశాలపై చర్చించారు. చైనా తన ఆర్థిక అవసరాలకు అనుగుణంగా వన్ బెల్డ్- వన్ రోడ్ ప్రాజెక్టును ఆర్భాటంగా చేపడుతుండగా, ఇందుకు ప్రత్యామ్నాయంగా ట్రంప్ కూడా ఓ ఆర్థిక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టును ఈ ప్రాంతంలో సూచిస్తున్నారు. ఈ కూటమి బలపడితే కొత్త ప్రాజెక్టు పని సులువవుతుందనీ పలువురు భావిస్తున్నారు. ఏదేమై నా ఆర్థికంగా బలమైన 4 పెద్ద దేశాలు అంతర్జాతీయ చట్టాల పరిరక్షణ పేరుతో చేతులు కలపడం చైనాకు పెద్ద సవాలే. 

జాతీయంయునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో చెన్నై  ప్రతిష్టాత్మక యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో భారత్‌లోని చెన్నై నగరం చోటు దక్కించుకుంది. ఈ మేరకు చెన్నైతో కలిపి 44 దేశాల నుంచి 64 నగరాలకు ఈ నెట్‌వర్క్‌లో చోటు కల్పిస్తూ యునెస్కో డెరైక్టర్ జనరల్ ఇరినా బొకొవా నవంబర్ 8న నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ జాబితాలో స్థానం పొందిన నగరాల సంఖ్య 180కి చేరింది. 
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి(సిటీ ఆఫ్ మ్యూజిక్), రాజస్తాన్‌లోని జైపూర్(సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్) నగరాలు 2015 డిసెంబర్‌లోనే ఈ జాబితాలో స్థానం పొందాయి. యూనెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌ను 2004లో ప్రారంభించారు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, సంగీతం, పర్యావరణ అంశాల్లో గుర్తింపు పొందిన నగరాల అభివృద్ధి కోసం ఈ వేదికను ప్రారంభించారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : యూసీసీఎన్‌లో స్థానం పొందిన చెన్నై 
ఏమిటి : నవంబర్ 8
ఎవరు : యునెస్కో 
ఎందుకు : సంగీతం విభాగంలో

ఢిల్లీలో వాతావరణ అత్యవసర పరిస్థితి దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యంతో కూడిన పొగ మంచు కప్పేయడంతో జాతీయ కాలుష్య నియంత్రణ మండలి నవంబర్ 8న అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. వృద్ధులు, పిల్లలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. పాఠశాలలకు ఐదు రోజులు సెలవు ప్రకటించారు. ఢిల్లీ మీదుగా వెళ్లే కాలుష్య కారక భారీ వాహనాలను నియంత్రిస్తున్నారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో వాహన, పారిశ్రామిక కాలుష్యం ఎక్కువ. అందువల్ల అక్కడ అధిక క్యూబిక్ సెంటీ మీటర్ డీజిల్ వాహనాల వాడకంపై ఆంక్షలు అమలవుతున్నాయి. పదేళ్లు పైబడిన వాహనాలను నిషేధించారు. కాలుష్యం తీవ్రత దృష్ట్యా ఈ ఏడాది దీపావళికి టపాసులను సుప్రీంకోర్టు అనుమతించలేదు. ఢిల్లీ పొరుగు రాష్ట్రాలు పంజాబ్, హరియాణాల్లో రైతులు వరి పంటను కోసిన తర్వాత రెల్లు గడ్డిని, వరి మొదళ్లను పొలాల్లోనే తగలబెడుతున్నారు. దీంతో వెలువడే పొగ ఢిల్లీ మీదుగా వ్యాపిస్తోంది.

హిమాచల్‌ప్రదేశ్‌లో 74% పోలింగ్హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 9న జరిగిన ఎన్నికల్లో ఆ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 74.45 శాతం పోలింగ్ నమోదయిందని ప్రధాన ఎన్నికల అధికారి పుష్పేందర్ రాజ్‌పుత్ తెలిపారు. మొత్తం 68 నియోజకవర్గాల్లోని 7,525 పోలింగ్ కేంద్రాల్లో 11,283 రసీదు ఇచ్చే ఓటింగ్ యంత్రాల (వీవీపీఏటీ)ను ఏర్పాటు చేశారు. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 18న ప్రకటిస్తారు. 

విపత్తు నిర్వహణకు ఫేస్‌బుక్ సాయం విపత్తు నిర్వహణకు సాయం అందించేందుకు సిద్ధమని ఫేస్‌బుక్ ప్రకటించింది. భారత దేశంలోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌డీఎమ్‌ఏ)తో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించిది. ఇందుకోసం డిజాస్టర్ మ్యాప్‌ను రూపొందించినట్లు తెలిపింది. ఇప్పటికే ఇది ఫేస్‌బుక్ వినియోగదారులందరికీ అందుబాటులోకి తెచ్చినట్లు ఇండియా, దక్షిణ, మధ్యఆసియా దేశాల ప్రాజెక్ట్ అధికారిగా వ్యవహరిస్తున్న రితేష్ మెహతా వెల్లడించారు. 
సాధారణంగా విపత్తుల సమయంలో అందరూ ఆన్‌లైన్‌లో ఉంటారన్న గ్యారెంటీ లేదు, ఒకవేళ ఆన్‌లైన్‌లో ఉన్నా సర్వీసులన్నీ బిజీ అని రావచ్చు, అయితే ఇటువంటి సమయాల్లో కూడా సమాచారం అందుబాటులో ఉండేలా చూడడం కోసం ఫేస్‌బుక్ కొత్త సాధనాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఈ మ్యాపులను జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ విపత్తు నిర్వహణకు డయాస్టర్ మ్యాప్‌లు 
ఏమిటి : నవంబర్ 9
ఎవరు : ఫేస్‌బుక్ 

హోం శాఖ కింద రెండు కొత్త విభాగాలు ఉగ్రవాదంవైపు యువత ఆకర్షితులు కాకుండా చూసేందుకు, సైబర్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్తగా రెండు విభాగాలను ఏర్పాటు చేసింది. హోం శాఖ కింద పనిచేసే పలు విభాగాల్లో శుక్రవారం కొన్ని మార్పులు జరిగాయి. ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన వ్యూహాలను రచించేందుకు CTCR (కౌంటర్ టైజం, కౌంటర్ ర్యాడికలైజేషన్)ను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ మోసాలు, హ్యాకింగ్ వంటి సైబర్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ (CIS) కొత్తగా ఏర్పాటైంది. మరికొన్ని విభాగాలను ఒకదానిలో మరొకటి విలీనం చేశారు. ఇకపై హోం మంత్రిత్వ శాఖ కింద 18 విభాగాలు ఉంటాయి. 
క్విక్ రివ్యూ:ఏమిటి : కేంద్ర హోంశాఖ కింద 18 విభాగాలు 
ఏమిటి : నవంబర్ 18
ఎవరు : కేంద్ర హోంశాఖ
ఎందుకు : కొత్తగా సీటీసీఆర్, సీఐఎస్ విభాగాల ఏర్పాటు 

జడ్జీల వేతనాల పెంపుపై కమిషన్ దిగువ కోర్టుల్లో విధులు నిర్వహిస్తున్న 21 వేల మంది జడ్జీల వేతనాల పెంపును సిఫార్సు చేసే కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నవంబర్ 10న జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పి.వెంకట రామారెడ్డి నేతృత్వంలో ఏర్పాటుకానున్న ఈ కమిషన్‌లో కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్.బసంత్ సభ్యుడిగా ఉంటారు. 18 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు కమిషన్ సిఫార్సుల్ని అందచేస్తుంది. జడ్జీలు, కింది కోర్టుల్లోని జ్యుడీషియల్ అధికారులకు 2010లో చివరిసారిగా జీతాలు పెంచినా.. జనవరి1, 2006 నుంచి జీతాల పెంపును అమలు చేశారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి :జడ్జీల వేతనాల పెంపు కోసం జస్టిస్ వెంకట రామారెడ్డి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు 
ఏమిటి : నవంబర్ 10 
ఎవరు : కేంద్ర కేబినెట్ 

ఢిల్లీకి భారీ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ కేంద్రం ఎగ్జిబిషన్ మార్కెట్‌లో షాంఘై, హాంకాంగ్, సింగపూర్‌తో పోటీ పడేందుకు దేశ రాజధాని న్యూఢిల్లీ శివారు ప్రాంతం ద్వారకాలో రూ. 25,703 కోట్లతో ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ కేంద్రం(ఈసీసీ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ), నాన్-పీపీపీ పద్ధతిలో 2025 నాటికి ఈసీసీని పూర్తి చేయనున్నారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ కేంద్రం ఏర్పాటుకు ఆమోదం 
ఏమిటి : నవంబర్ 10
ఎవరు : కేంద్ర కేబినెట్ 
ఎక్కడ : న్యూఢిల్లీ శివారులో 

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదంఉన్నత విద్యా సంస్థల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఏన్‌టీఏ) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రారంభంలో సీబీఎస్‌ఈ నిర్వహిస్తున్న పరీక్షల్ని ఎన్‌టీఏ నిర్వహిస్తుందని, క్రమంగా మిగతా పరీక్షల్ని నిర్వహణను చేపడుతుందని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటుకు ఆమోదం 
ఏమిటి : నవంబర్ 10
ఎవరు : కేంద్ర కేబినెట్ 
ఎందుకు : ఉన్నత విద్యా సంస్థల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు

కశ్మీర్‌లోని కౌరిలో భూకంపాలను తట్టుకునే వంతెనఅత్యంత వినాశకర భూకంపాలు, పేలుళ్లను తట్టుకునేలా కశ్మీర్‌లోని చినాబ్ నదిపై అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనను నిర్మిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై ఎనిమిది తీవ్రత గత భూకంపాలను, 30 కేజీల పేలుడు పదార్థం సృష్టించే విస్ఫోటనాన్ని సైతం ఈ వంతెన తట్టుకోగలదని చెప్పారు. ఇందుకోసం ఐఐటీ రూర్కీ, బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్, రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)లకు చెందిన నిపుణుల పర్యవేక్షణలో వారు అందించిన డిజైన్‌తో వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. 
నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్న ఈ వంతెన నిర్మాణ వ్యయం రూ.1250కోట్లు. పారిస్‌లోని ప్రఖ్యాతిగాంచిన ఈఫిల్ టవర్ కంటే ఈ వంతెన 30 మీటర్లు ఎత్తులో ఉంటుంది. 2019 మే నెలకల్లా ప్రాజెక్టు పూర్తిచేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. భారత భూభాగాన్ని కశ్మీర్ లోయను కలుపుతూ చేపట్టిన ఉధంపూర్-రేసి-అనంత్‌నాగ్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెనను నిర్మిస్తున్నారు. వంతెన మొత్తం పొడవు 1,315 మీటర్లుకాగా అందులో నదిపై పూర్తిగా ఉక్కుతో నిర్మిస్తున్న భాగం పొడవు 476 మీటర్లు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భూకంపాలను సైతం తట్టుకునే వంతెన నిర్మాణం 
ఎక్కడ : కశ్మీర్‌లోని చినాబ్ నదిపై 
ఎందుకు : భారత భూభాగాన్ని కశ్మీర్ లోయను కలుపుతూ చేపట్టిన ఉధంపూర్-రేసి-అనంత్‌నాగ్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా 

వైష్ణోదేవీ ఆలయంలో రోజుకు 50 వేల మందికే దర్శనంకశ్మీర్‌లోని ప్రఖ్యాత వైష్ణోదేవీ ఆలయంలోకి రోజుకు 50 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ నవంబర్ 13న ఆదేశాలు జారీచేసింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రిబ్యునల్ చైర్మన్ స్వతంతర్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
బ్యాటరీ కార్లతోపాటు కాలినడకన ఆలయానికి చేరుకునేవారి కోసం రూ.40 కోట్లతో ప్రత్యేకంగా నిర్మించిన రహదారిని నవంబర్ 24న ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రారంభించాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ దారిలో యాత్రికుల, సరకు రవాణా కోసం గుర్రాలు, గాడిదలు తదితర జంతువులను అనుమతించకూడదంది. పాత మార్గం నుంచి కూడా జంతువుల చేత రవాణాను క్రమక్రమంగా తొలగిస్తామంది. రోడ్లపైన, కాట్రా పట్టణ బస్టాండ్ సమీపాన చెత్త వేసే వారికి రూ.2,000 జరిమానా విధించాలని ఆదేశించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైష్ణోదేవీ ఆలయంలో రోజుకు 50 వేల మందికే దర్శనం 
ఏమిటి : నవంబర్ 13
ఎవరు : జాతీయ హరిత ట్రిబ్యునల్ 
ఎందుకు : అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు

పశ్చిమ బెంగాల్‌కు రసగుల్లా జీఐ గుర్తింపు రసగుల్లా స్వీట్ మా ప్రాంతానిదేనంటూ భౌగోళిక గుర్తింపు (జీఐ) కోసం పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు పోటీపడ్డాయి. అయితే, ఈ రసగుల్లా పశ్చిమ బెంగాల్‌కే చెందుతుందని ప్రపంచ వాణిజ్య సంస్థకు చెందిన అనుబంధ సంస్థ జీఐ గుర్తింపునిచ్చింది. దీంతో పశ్చిమ బెంగాల్ తమతో పోటీ పడ్డ ఒడిశా మీద విజయం సాధించినట్లయింది. రసగుల్లా స్వీట్ పశ్చిమ బెంగాల్‌దేనని దీనికి భౌగోళిక గుర్తింపు లభించడం బెంగాలీ ప్రజలందరికీ తీయని వార్త అని ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : రసగుల్లా భౌగోళిక గుర్తింపు 
ఎప్పుడు : నవంబర్ 14
ఎవరు : పశ్చిమ బెంగాల్‌కు

న్యూఢిల్లీలో 37వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన 37వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నవంబర్ 14న ప్రారంభించారు. 14 రోజుల పాటు జరిగే ఈ ఫెయిర్‌ను ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ITPO) నిర్వహిస్తోంది. వియత్నాం భాగస్వామ్య దేశంగా.. జార్ఖండ్ భాగస్వామ్య రాష్ట్రంగా వ్యవహరిస్తున్నాయి. 22 దేశాలకు చెందిన 7 వేల మంది ప్రతినిధులు తమ ఉత్పత్తులను ఈ ఫెయిర్‌లో ప్రదర్శనకు ఉంచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 37వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 
ఎప్పుడు : నవంబర్ 14 - 28
ఎవరు : ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్
ఎక్కడ : ప్రగతి మైదాన్, న్యూఢిల్లీ 

దంతెవాడలో భారత తొలి గిరిజన ఎంట్రెప్రెన్యూర్‌షిప్ సదస్సు భారత తొలి ఎంట్రెప్రెన్యూర్‌షిప్ సదస్సుని ఛత్తీస్‌గఢ్ బస్తర్ ప్రాంతంలోని దంతెవాడలో నవంబర్ 14న నిర్వహించారు. భారత్‌లో జరుగుతున్న 8వ గ్లోబల్ ఎంట్రెప్రెన్యూర్‌షిప్ సదస్సులో భాగంగా.. నీతి ఆయోగ్, అమెరికా ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. గిరిజన యువతలో వ్యాపార దృక్పథాన్ని పెంపొందించేందుకు ఈ సదస్సు నిర్వహించారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : భారత తొలి గిరిజన ఎంట్రెప్రెన్యూర్‌షిప్ సదస్సు 
ఎప్పుడు : నవంబర్ 
ఎవరు : నీతి ఆయోగ్, అమెరికా ప్రభుత్వం 
ఎక్కడ : దంతెవాడ, ఛత్తీస్‌గఢ్ 

ద్వైపాక్షికంభారత్ - బంగ్లా వీక్లీ ‘బంధన్’ రైలు ప్రారంభం  భారత్‌లోని కోల్‌కతా నుంచి బంగ్లాదేశ్‌లోని ఖుల్నా వరకు నడిచే ‘బంధన్’ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు నవంబర్ 9న ప్రారంభమయ్యాయి. ఈ మేరకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైలు సర్వీసులని ప్రారంభించారు. పూర్తి ఎయిర్ కండిషన్ సదుపాయం ఉన్న ఈ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది. రూ. 650 కోట్లతో నిర్మించిన బైరట్, టైటాస్ రైల్వే వంతెనలను కూడా ఇద్దరు ప్రధానులు ప్రారంభించారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : బంధన్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు ప్రారంభం 
ఏమిటి : నవంబర్ 9 
ఎవరు : భారత ప్రధాని మోదీ, బంగ్లా ప్రధాని హసీనా 
ఎక్కడ : భారత్ - బంగ్లా మధ్య 

ప్రధాని నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్ పర్యటన ఇండియా-ఆసియాన్ (ఆగ్నేయాసియా దేశాల మండలి) 15వ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 12 నుంచి మూడు రోజులపాటు ఫిలిప్పీన్‌‌సలో పర్యటిస్తున్నారు. ఇండియా-ఆసియాన్‌తోపాటు మోదీ 12వ తూర్పు ఆసియా దేశాల సదస్సులోనూ పాల్గొంటారు. ఆసియాన్ 50వ వార్షికోత్సవ సంబరాలు, ప్రాంతీయ ఆర్థిక సమగ్ర భాగస్వామ్య (ఆర్‌సీఈపీ) నేతల సమావేశం, ఆసియాన్ వాణిజ్య, పెట్టుబడుల సదస్సులో పాల్గొననున్నారు. ఫిలిప్పీన్‌‌స అధ్యక్షుడు రొడ్రిగో దుతర్తేతోపాటు అక్కడకు వచ్చే అన్ని దేశాల ప్రతినిధులతో ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొననున్నారు. 
ఈ సదస్సుల్లో పాల్గొనేందుకు వచ్చిన దేశాధినేతల కోసం ఫిలిప్పీన్‌‌స అధ్యక్షుడు రోడ్రిగో ద్యుతెర్తె ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో మోదీ పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబే, రష్యా ప్రధాని మెద్వెదెవ్, మలేసియా ప్రధాని నజీబ్ రజాక్‌తో మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. మోదీతో పాటు ఇతర దేశాధినేతలు కూడా ఫిలిప్పీన్‌‌స జాతీయ దుస్తులైన తెల్లని ‘బారంగ్ టాగలాంగ్’ను ధరించి విందులో పాల్గొన్నారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫిలిప్పీన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన 
ఏమిటి : నవంబర్ 12 - 14
ఎందుకు : ఇండియా-ఆసియాన్, 12వ తూర్పు ఆసియా దేశాల సదస్సులో పాల్గొనేందుకు 

మనీలాలో ట్రంప్‌తో ప్రధాని మోదీ చర్చలు ఫిలిప్పీన్‌‌సలోని మనీలాలో జరుగుతున్న ఆసియాన్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ ప్రత్యేకంగా 45 నిమిషాల సేపు భేటీ అయ్యారు. విసృ్తతాంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. అమెరికా అంచనాలను భారత్ అందుకుంటుందని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారత్-అమెరికా సంబంధాలు ద్వైపాక్షిక బంధాల పరిధిని మించి మరింత విసృ్తతంగా, బలంగా ఎదిగేందుకు అవకాశం ఉందని చెప్పారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక మార్పుల దృష్ట్యా ఆసియా భవిష్యత్తు కోసం భారత్-అమెరికాలు సంయుక్తంగా పనిచేయాలని నిర్ణయించినట్లు మోదీ పేర్కొన్నారు. 
ఆసియాన్ బిజినెస్ ఫోరంతో మోదీ సమావేశం 
ఆసియాన్ బిజినెస్ ఫోరం బృందంతో మోదీ సమావేశమయ్యారు. భారత ఆర్థిక సంస్కరణలు శరవేగంగా జరుగుతున్నాయని తద్వారా వాణిజ్యం, పెట్టుబడులకు సువర్ణావకాశం ఉందని సమావేశంలో ప్రధాని అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం చాలా రంగాల్లో నిబంధనలను సరళీకృతం చేశామన్నారు. 
ఫిలిప్పీన్స్‌కు భారత వంగడాలు
ఫిలిప్పీన్స్‌లోని మనీలా సమీపంలోని అంతర్జాతీయ వరి పరిశోధనాసంస్థ (ఐఆర్‌ఆర్‌ఐ)ను ప్రధాని సందర్శించారు. ఈ సందర్భంగా ఐఆర్‌ఆర్‌ఐ జీన్ బ్యాంక్‌కు రెండు భారత వరి వంగడాలను అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆకలి తీర్చే లక్ష్యంతో ఐఆర్‌ఆర్‌ఐ పనిచేస్తోంది. ప్రకృతి విపత్తులను, వరదలను తట్టుకునేలా రూపొందించిన వరి వంగడాలను శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు. 18 రోజుల పాటు నీటిలో మునిగినా హెక్టారుకు 1-3 టన్ను ల వరి ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ చర్చలు 
ఏమిటి : నవంబర్ 13
ఎక్కడ : మనీలా, ఫిలిప్పీన్స్ 
ఎందుకు : ఆసియాన్ సదస్సు సందర్భంగా

రాష్ట్రీయంకాళేశ్వరంపై ఎన్‌జీటీ మధ్యంతర ఉత్తర్వులు రద్దు  తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులన్నింటినీ ఆపేయాలంటూ గత నెల 5న ఢిల్లీలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ప్రధాన బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు రద్దు చేసింది. పనులు కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే పర్యావరణ అనుమతులు వచ్చేంత వరకు కాలువలు, పిల్ల కాలువల నిర్మాణ పనులతోపాటు ఇతర అనుబంధ పనులను మాత్రం చేయరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అటవీ అనుమతులు వచ్చేంత వరకు అటవీ భూములను తాకరాదని సూచించింది. ఈ ప్రాజెక్టు కారణంగా అటవీ ప్రాంతంలో ఒక్క చెట్టు కూడా కూలరాదని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఇప్పటికే ఏవైనా పనులు చేపట్టి ఉంటే కేవలం తాగునీటి అవసరాలకే వాటిని పరిమితం చేయాలని స్పష్టం చేసింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్‌జీటీ మధ్యంతర ఉత్తర్వులు రద్దు 
ఏమిటి : నవంబర్ 8
ఎవరు : హైదరాబాద్ హైకోర్టు 

ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య కన్నుమూతఒగ్గు కథా పితామహుడు, పల్లె సుద్దులకు జీవం పోసిన మహనీయుడు చుక్క సత్తయ్య (82) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నవంబర్ 9న జనగామ జిల్లాలోని తన స్వగ్రామం మాణిక్యాపురంలో తుదిశ్వాస విడిచారు. 
జనగామ జిల్లాలోని లింగాలఘణపురం మండలం మాణిక్యాపురంలో ఆగయ్య-సాయమ్మ దంపతులకు 1935 మార్చి 29న సత్తయ్య జన్మించారు. కులవృత్తి అయిన ఒగ్గు కళను నేర్చుకుని 14 ఏళ్ల నుంచే ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక ప్రదర్శనలు ఇచ్చి ఒగ్గుకళను సరికొత్త తీరాలకు చేర్చారు. ఒగ్గు కథల రూపంలోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలైన కుటుంబ నియంత్రణ, వరకట్న నిషేధం, వయోజన విద్య, మద్యపాన నిషేధం, కేంద్ర ప్రభుత్వం 20 సూత్రాల పథకాలపై ప్రదర్శనలు ఇచ్చారు.
అవార్డులు.. 
  • 2004లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
  • 2005లో అప్పటి గవర్నర్ సుశీల్‌సుమార్ షిండే చేతుల మీదుగా కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్
  • తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్
  • ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వెంగళరావు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, పీవీ నర్సింహరావు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా చేతుల మీదుగా సన్మానాలు
  • తమిళనాడు ప్రభుత్వం నుంచి కళాసాగర్ అవార్డు
  • 2014లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి విశిష్ట పురస్కారం
  • 2014లో తానా అవార్డు
  • ఏపీ ప్రభుత్వం నుంచి రాజీవ్ సాగర్ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం నుంచి కీర్తి పురస్కార్
  • తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2015లో ఉత్తమ కళాకారుడి అవార్డు
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య కన్నుమూత
ఏమిటి : నవంబర్ 9
ఎక్కడ : జనగామ 

ప్రయాణికుల సదుపాయాల్లో సికింద్రాబాద్ స్టేషన్ నంబర్ 1 సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మరో ఘనతను సొంతం చేసుకుంది. ప్రయాణికుల సదుపాయాల కల్పనలో దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలిచింది. ఈ మేరకు రైల్వేశాఖ ఏర్పాటు చేసిన కేంద్ర రైల్వే ప్రయాణికుల సదుపాయాల కమిటీ కితాబు నిచ్చింది. తాము ఇప్పటివరకు పరిశీలించిన 600 రైల్వేస్టేషన్‌లలో సికింద్రాబాద్ చాలా బాగుందని, విమానాశ్రయం తరహాలో సదుపాయాలు ఏర్పాటు చేశారని కమిటీ ప్రతినిధులు ప్రశంసించారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వేస్టేషన్‌లలో ప్రయాణికులకు అందజేసే సదుపాయాలపై ఈ కమిటీ విసృ్తతస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తుంది. 

తెలంగాణ ఇన్‌చార్జ్ డీజీపీగా మహేందర్‌రెడ్డిరాష్ట్ర ఇన్‌చార్జ్ డీజీపీగా మహేందర్‌రెడ్డి నియమితులయ్యారు. అనురాగ్ శర్మ ఆదివారం పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో డీజీపీగా హైదరాబాద్ పోలీసు కమిషనర్, 1986 బ్యాచ్‌కు చెందిన ఎం.మహేందర్‌రెడ్డిని నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం శాంతి భద్రతల విభాగం అదనపు కమిషనర్‌గా ఉన్న వీవీ శ్రీనివాస్‌రావును హైదరాబాద్ ఇన్‌చార్జి కమిషనర్‌గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. 
అనురాగ్ శర్మను రాష్ట్ర అంతర్గత భద్రతా సలహదారుగా నియమిస్తూ సంబంధిత ఫైల్‌పై సీఎం సంతకం చేశారు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : తెలంగాణ ఇన్‌చార్జ్ డీజీపీ
ఏమిటి : నవంబర్ 10
ఎవరు : మహేందర్‌రెడ్డి 
ఎందుకు : అనురాగ్ శర్మ పదవీ విరమణతో 

కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్‌లలో ఐటీ హబ్స్కరీంనగర్‌లో ఐటీ హబ్ ఏర్పాటు కోసం రూ.25 కోట్లతో జీ+5 అంతస్తులతో భవనాన్ని నిర్మించేందుకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిజైన్లు సిద్ధం చేయగా, సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదముద్ర వేశారు. కరీంనగర్‌తోపాటు ఖమ్మం, వరంగల్, నిజామాబాద్‌లకు కూడా ఐటీ టవర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటి నిర్మాణానికి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్‌ఐఐసీ) టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. 

కృష్ణా నది బోటు ప్రమాదంలో 17 మంది మృతి విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలో నవంబర్ 12న బోటు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డారు. ఏడుగురి జాడ తెలియకుండా పోయింది. ప్రమాద సమయంలో 15 మందిని సహాయక బృందాలు రక్షించాయి. మృతుల్లో ఎక్కువ మంది ప్రకాశం జిల్లా ఒంగోలు రంగరాయ చెరువు వాకర్స్ క్లబ్‌కు చెందినవారు. పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మ హారతులను చూసేందుకు వెళుతుండగా బోటు బోల్తా పడింది. అనుమతిలేకుండా నిర్వహిస్తున్న బోటు మితిమీరిన సంఖ్యలో పర్యాటకులను ఎక్కించుకోవడం.. బోటు సిబ్బందికి తగిన నైపుణ్యం లేకపోవడం, నదీ మార్గంపై డ్రైవర్‌కు అవగాహన లేకపోవడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు ప్రాథమికంగా తేల్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కృష్ణా నది బోటు ప్రమాదంలో 17 మంది మృతి 
ఏమిటి : నవంబర్ 12
ఎక్కడ : ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద

ఆర్థికంరెస్టారెంట్లపై జీఎస్టీ 5 శాతానికి తగ్గింపు  వస్తు, సేవల పన్ను శ్లాబుల్లో జీఎస్టీ కౌన్సిల్ కీలక మార్పులు చేసింది. 28% పన్ను భారాన్ని తగ్గించింది. ఇప్పటివరకు 28% పన్ను పరిధిలో 228 వస్తువులుండగా వాటిని 50కి కుదించింది. అంటే 178 వస్తు, సేవలపై పన్నును 18% పరిధిలోకి మార్చింది. ఇప్పటివరకు ఏసీ రెస్టారెంట్లపై 18%, నాన్ ఏసీ రెస్టారెంట్లపై 12% జీఎస్టీ విధిస్తుండగా ఏసీ, నాన్ ఏసీ రెస్టారెంట్లపై పన్ను భారాన్ని 5% తగ్గించింది. ఈ మార్పులతో వినియోగదారులకు తక్కువ ధరకే వస్తువులు అందుబాటులోకి వస్తాయని ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. 
రెస్టారెంట్లకు భారీ లాభం 
ప్రస్తుతం నాన్-ఏసీ రెస్టారెంట్లలో భోజనంపై 12%, ఏసీ రెస్టారెంట్లలో 18% జీఎస్టీ అమలవుతోంది. వీటన్నింటికీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ ఉంటుంది. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను రెస్టారెంట్లు వినియోగదారులకు ఇవ్వట్లేదు. దీనిపై గువాహటి సమావేశంలో చర్చించిన మండలి ఏసీ, నాన్-ఏసీ రెస్టారెంట్లను 5% పరిధిలోకి తీసుకొచ్చి ఐటీసీని ఎత్తేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెస్టారెంట్లపై జీఎస్టీ 18 నుంచి 5 శాతానికి తగ్గింపు 
ఏమిటి : నవంబర్ 10
ఎవరు : జీఎస్టీ మండలి 
ఎక్కడ : గువాహటి సమావేశంలో

సెప్టెంబర్‌లో పారిశ్రామిక వృద్ధి 3.8% దేశ పారిశ్రామిక రంగ ఉత్పత్తి (ఐఐపీ) సెప్టెంబర్ నెలలో కాస్తంత నిదానించింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో 4.5 శాతంగా ఉన్న ఐఐపీ వృద్ధి మరుసటి నెల సెప్టెంబర్‌లో మాత్రం 3.8 శాతం వద్దే ఆగిపోయింది. గతేడాది సెప్టెంబర్ మాసంనాటి వృద్ధి 5 శాతంతో పోల్చుకున్నా తగ్గినట్టుగానే తెలుస్తోంది. ఈ మేరకు తాజా వివరాలను కేంద్ర గణాంక విభాగం నవంబర్ 10న విడుదల చేసింది. వీటిని గమనిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఐఐపీ 2.5 శాతం వృద్ధి చెందగా, అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఉన్న 5.8 శాతంతో పోల్చుకుంటే సగానికి పైగా తగ్గినట్టు తెలుస్తోంది. 
విభాగాల వారీగా...
  • ఐఐపీలో 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగం వృద్ధి సెప్టెంబర్‌లో 3.4 శాతానికే పరిమితమైంది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో ఇది 5.8 శాతంగా ఉండడం గమనార్హం. ఏప్రిల్-సెప్టెంబర్ ఆరు నెలల కాలంలో 1.9 శాతమే వృద్ధి సాధించింది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో ఇది 6.1 శాతంగా ఉంది.
  • కన్జ్యూమర్ డ్యూరబుల్స్ (ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, హోమ్‌అప్లియెన్సెస్ తదితర) ఉత్పత్తి 4.8 శాతం మేర వృద్ధి చెందింది.
  • విద్యుదుత్పత్తి రంగం వృద్ధి సైతం అంతకుముందు ఏడాది ఇదే నెలలో 5.1 శాతంగా ఉండగా, అది తాజాగా 3.4 శాతానికి పడిపోయింది.
క్విక్ రివ్యూ:ఏమిటి : సెప్టెంబర్ పారిశ్రామిక వృద్ధి 3.8 శాతం
ఏమిటి : నవంబర్ 10
ఎవరు : కేంద్ర గణాంక విభాగం 

పదేళ్లు పెరిగిన భారతీయుల ఆయుష్షు 1990వ దశకం నుంచి ఇప్పటి వరకు భారతీయుల సగటు ఆయుష్షు సంభావ్యత 10 ఏళ్లు పెరిగింది. ప్రతిష్టాత్మక లాన్సెట్ జర్నల్ చేసిన తాజా అధ్యయనంలో ఈ జీవనరేఖలు బయటపడ్డాయి. పురుషుల సగటు జీవిత కాలం 66.9 సంవత్సరాలకు పెరగ్గా, మహిళల జీవన సంభావ్యత 70.3 సంవత్సరాలకు పెరిగిందని జర్నల్ ప్రచురించింది. మహిళల ఆయుష్షు సంభావ్యత కేరళలో అధికంగా 78.7 ఏళ్లు ఉండగా, ఉత్తర ప్రదేశ్‌లో అత్యల్పంగా 66.8 ఏళ్లు ఉన్నట్లు అధ్యయనం తేల్చింది. సగటు జీవిత కాలం పెరగటానికి భారత దేశంలో పెరుగుతున్న అత్యాధునిక వైద్యసదుపాయాలతో పాటు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేనని లాన్సెట్ స్పష్టం చేసింది. కాని దేశవ్యాప్తంగా మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయని సర్వే తెలిపింది. అభివృద్ధి చెందిన కేరళ, గోవా వంటి రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరప్రదేశ్, అసోం వంటి రాష్ట్రాలు అన్ని రకాల వైద్య సేవల్లో 4 రెట్లు వెనుకబడి ఉన్నాయని పేర్కొంది. మరోవైపు దేశవ్యాప్తంగా 5 ఏళ్లలోపు చిన్నారుల మరణాలు తగ్గాయని నివేదిక వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 1990వ దశకం నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్లు పెరిగిన భారతీయుల సగటు ఆయుష్షు సంభావ్యత 
ఎప్పుడు : నవంబర్ 14
ఎవరు : లాన్సెట్ జర్నల్

‘భారత్ నెట్’ రెండో దశ ప్రారంభం దేశంలోని మొత్తం 1.5 లక్షల గ్రామ పంచాయతీలకు 2019 మార్చి నాటికి బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్ ప్రాజెక్టు రెండో/తుది దశను నవంబర్ 13న ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.34,000 కోట్లు. ఇందులో భాగంగా అదనంగా 10 లక్షల కిలో మీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను విస్తరించనున్నారు. గ్రామాల్లో బ్రాడ్ బ్యాండ్, వైఫై సేవలను అందించే టెలికం కంపెనీలకు 75 శాతం తక్కువ ధరకే బ్యాండ్ విడ్త్ సౌకర్యం కల్పిస్తామని, ఆయా సంస్థలు సెకన్‌కు రెండు మెగా బిట్ల వేగంతో డేటా సేవలు అందిస్తాయని భావిస్తున్నట్లు కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి అరుణా సుందరరాజన్ పేర్కొన్నారు.

సైన్స్ అండ్ టెక్నాలజీమొబైల్ గేమింగ్‌లో మూడోస్థానంలో భారత్  మొబైల్ గేమ్స్ ఇన్‌స్టాలేషన్‌లో భారత్ మూడోస్థానానికి ఎగబాకింది. బ్రెజిల్, రష్యాలు భారత్‌కంటే ముందు వరుసలో నిలిచాయి. హైదరాబాద్‌కు చెందిన గేమింగ్ క్రియేటర్ యూనిటీ టెక్నాలజీస్ నవంబర్ 9న ఈ విషయాన్ని వెల్లడించింది. సరిగ్గా పదినెలల కిందటి గణాంకాల ప్రకారం గేమ్స్ ఇన్‌స్టాలేషన్‌లో భారత్ తొమ్మిదో స్థానంలో ఉంది. కేవలం 300 రోజుల వ్యవధిలోనే మూడోస్థానానికి ఎగబాకడం గమనార్హం. అయితే మొదటి రెండుస్థానాల్లో అప్పుడూ, ఇప్పుడూ బ్రెజిల్, రష్యాలే ఉన్నాయి. 
క్విక్ రివ్యూ:ఏమిటి : మొబైల్ గేమింగ్‌లో 3వ స్థానంలో భారత్ 
ఏమిటి : నవంబర్ 9 
ఎవరు : గేమింగ్ క్రియేటర్ యూనిటీ టెక్నాలజీస్, హైదరాబాద్ 

ట్వీటర్‌లో డిస్‌ప్లే నేమ్ ‘పరిమితి’ పెంపు ప్రముఖ సామాజిక మాధ్యమం ట్వీటర్ ఖాతాదారులు ఇకపై తమ డిస్‌ప్లే నేమ్‌ను 50 అక్షరాల వరకు పెట్టుకోవచ్చు. ఇప్పటివరకు ఈ పరిమితి 20 అక్షరాలే ఉండగా నవంబర్ 11 నుంచి దానిని ట్వీటర్ 50కి పెంచింది. ఏదేనీ ట్వీట్‌లో ఉండాల్సిన అక్షరాల పరిమితిని కూడా ట్వీటర్ గతవారమే 140 నుంచి 280కి రెట్టింపు చేయడం తెలిసిందే. పొడవైన పేర్లు కలిగినవారు తమ పూర్తి పేరును ఇకపై డిస్‌ప్లే నేమ్‌గా పెట్టుకునేందుకు తాజా చర్య ఉపయోగకరంగా ఉండనుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ట్వీటర్ డిస్ ప్లే నేమ్ పరిమితి పెంపు 
ఏమిటి : నవంబర్ 12
ఎవరు : ట్వీటర్ 
ఎందుకు : 20 అక్షరాల నుంచి పరిమితి 50 అక్షరాలకు పెంపు 

క్రీడలుజాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంప్స్ సైనా, ప్రణయ్ పదేళ్ల తర్వాత జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మూడోసారి విజేతగా నిలిచింది. నవంబర్ 8న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ సైనా 21-17, 27-25తో టాప్ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ పీవీ సింధు (ఆంధ్రప్రదేశ్)పై విజయం సాధించింది. సైనా 2006, 2007లలో కూడా జాతీయ టైటిల్స్‌ను గెల్చుకుంది. పెట్రోలియం స్పోర్‌‌ట్స ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) తరఫున బరిలోకి దిగిన సైనా విజేత హోదాలో రూ. రెండు లక్షల ప్రైజ్‌మనీని అందుకుంది. 
ప్రణయ్‌కు పురుషుల టైటిల్
జాతీయ పురుషుల సింగిల్స్ ఫైనల్లో కేరళ ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్.. కిడాంబి శ్రీకాంత్‌ను ఓడించి తొలిసారి టైటిల్‌ను గెలుచుకున్నాడు. పీఎస్‌పీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్ సిక్కి రెడ్డి ఐదోసారి మహిళల డబుల్స్ టైటిల్‌ను సాధించింది. ఫైనల్లో సిక్కి-అశ్విని ద్వయం 21-14, 21-14తో సంయోగిత-ప్రాజక్తా జంటపై గెలిచింది. 2012లో అపర్ణా బాలన్‌తో, 2014, 2015, 2016లలో ప్రద్న్యా గాద్రెతో కలిసి సిక్కి జాతీయ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ - 2017 
ఏమిటి : నవంబర్ 8
ఎవరు : మహిళల సింగిల్స్ విజేత - సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్ విజేత - హెచ్ ఎస్ ప్రణయ్ 
ఎక్కడ : నాగపూర్ 

ఆసియా సీనియర్ బాక్సింగ్‌లో మేరీకోమ్‌కు స్వర్ణం ఆసియా సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా మేటి బాక్సర్ మేరీకోమ్ (34) చాంపియన్‌గా నిలిచింది. 48 కేజీల విభాగం ఫైనల్లో ఆమె 5-0తో కిమ్ హ్యాంగ్ మి (ఉత్తర కొరియా)పై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి పసిడి పతకాన్ని గెలుచుకుంది. 57 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన సోనియా లాథెర్ రజత పతకంతో సంతృప్తి పడింది. ఫైనల్లో యిన్ జాన్‌హువా (చైనా) చేతిలో సోనియా ఓడిపోయింది. ఈ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం, రజతం, ఐదు కాంస్యాలు లభించాయి. 
2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో పసిడి పతకం గెలిచిన తర్వాత మేరీకోమ్ ఖాతాలో చేరిన మరో స్వర్ణం ఇదే. మొత్తంగా ఆసియా చాంపియన్‌షిప్‌లో మెరీకోమ్‌కు ఇది ఐదో స్వర్ణం. గతంలో ఆమె 2003లో (46 కేజీలు), 2005లో (46 కేజీలు), 2010లో (51 కేజీలు), 2012లో (51 కేజీలు) స్వర్ణాలు సాధించింది. 2008లో (46 కేజీలు) రజతం దక్కించుకుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ - 2017
ఏమిటి : నవంబర్ 8
ఎవరు : 48 కేజీల విభాగంలో మేరీకోమ్‌కు స్వర్ణం 
ఎక్కడ : వియత్నాం

జాతీయ ప్రీమియర్ చెస్ చాంపియన్ లలిత్ బాబుఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్. లలిత్ బాబు దేశవాళీ ప్రతిష్టాత్మక జాతీయ ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. బిహార్‌లోని పట్నాలో నవంబర్ 10న ముగిసిన ఈ టోర్నమెంట్‌లో లలిత్ తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ టోర్నీలో 24 ఏళ్ల లలిత్ బాబు పెట్రోలియం స్పోర్‌‌ట్స ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 8.5 పాయింట్లతో అరవింద్ చిదంబరం రన్నరప్‌గా నిలువగా... 7.5 పాయింట్లతో మురళి కార్తికేయన్ మూడో స్థానాన్ని సంపాదించాడు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్ - 2017
ఏమిటి : నవంబర్ 10
ఎవరు : విజేత లలిత్ బాబు

జేఎస్‌డబ్ల్యూ-సీసీఐ స్వ్కాష్ టోర్నీలో సౌరవ్‌కు టైటిల్ భారత నంబర్‌వన్ స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ ఘోషాల్ తన కెరీర్‌లో ఏడో ప్రొఫెషనల్ టైటిల్‌ను సాధించాడు. నవంబర్ 10న ముగిసిన జేఎస్‌డబ్ల్యూ-సీసీఐ అంతర్జాతీయ స్క్వాష్ సర్క్యూట్ టోర్నీలో ప్రపంచ 21వ ర్యాంకర్ సౌరవ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో సౌరవ్ 11-6, 11-8, 11-8తో ఐదో సీడ్ నికొలస్ ముల్లర్ (స్విట్జర్లాండ్)పై గెలుపొందాడు. విజేతగా నిలిచిన సౌరవ్‌కు 7,671 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షలు) లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జేఎస్‌డబ్ల్యూ-సీసీఐ స్క్వాష్ సర్క్యూట్ టోర్నమెంట్ 
ఏమిటి : నవంబర్ 10
ఎవరు : విజేత సౌరవ్ ఘోషాల్

17వ ప్రపంచ బిలియర్డ్స్ చాంప్‌గా పంకజ్ అద్వానీ భారత క్యూ స్పోర్‌‌ట్స (బిలియర్డ్స్, స్నూకర్) ప్లేయర్ పంకజ్ అద్వానీ 17వ సారి ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్(150 అప్ ఫార్మాట్)గా నిలిచాడు. నవంబర్ 12న జరిగిన ఫైనల్లో పంకజ్ అద్వానీ 6-2 (0-155, 150-128, 92-151, 151-0, 151-6, 151-0, 150-58, 150-21) ఫ్రేమ్‌ల తేడాతో తన చిరకాల ప్రత్యర్థి మైక్ రసెల్ (ఇంగ్లండ్)ను ఓడించాడు. 2016లో బెంగళూరులో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లోనూ పంకజ్ చాంపియన్‌గా నిలిచాడు. 
గతంలో పంకజ్ ఐదుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (150 అప్ ఫార్మాట్-2017, 2016, 2014, 2008, 2005) టైటిల్స్‌ను... ఏడుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (టైమ్ ఫార్మాట్-2015, 2014, 2012, 2009, 2008, 2007, 2005) టైటిల్స్‌ను... రెండుసార్లు ప్రపంచ స్నూకర్ (2015, 2003) టైటిల్స్‌ను... రెండుసార్లు ప్రపంచ సిక్స్ రెడ్ స్నూకర్ (2015, 2014) టైటిల్స్‌ను... ఒకసారి ప్రపంచ టీమ్ బిలియర్డ్స్ (2014) టైటిల్‌ను సాధించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ - 2017
ఏమిటి : నవంబర్ 12
ఎవరు : విజేత పంకజ్ అద్వానీ 

యూఏఈలో ధోని అకాడమీ ప్రారంభం భారత క్రికెటర్ ధోని అకాడమీ.. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ప్రారంభమైంది. దుబాయ్‌కి చెందిన పసిఫిక్ స్పోర్‌‌ట్స క్లబ్, ఆర్కా స్పోర్‌‌ట్స క్లబ్‌తో కలిసి ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కేంద్రానికి ఎం.ఎస్.ధోని క్రికెట్ అకాడమీ (ఎంఎస్‌డీసీఏ) అని పేరు పెట్టారు. నవంబర్ 11న ఈ అకాడమీని ధోని లాంఛనంగా ప్రారంభించాడు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ధోని క్రికెట్ అకాడమీ ప్రారంభం 
ఏమిటి : నవంబర్ 11
ఎక్కడ : యూఏఈ

బ్రెజిల్ గ్రాండ్‌ప్రి విజేత సెబాస్టియన్ వెటెల్ బ్రెజిల్ గ్రాండ్‌ప్రి రేసులో ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ విజేతగా నిలిచాడు. 71 ల్యాప్‌ల ఈ రేసును రెండో స్థానం నుంచి ప్రారంభించిన వెటెల్ గంటా 31 నిమిషాల 26.262 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని పొందాడు. రెండో స్థానంలో వాల్తెరి బొటాస్ (మెర్సిడెస్), కిమీ రైకోనెన్ (ఫెరారీ) మూడో స్థానంలో, హామిల్టన్ నాలుగో స్థానంలో నిలిచారు. 
తాజా గెలుపుతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ విభాగంలో వెటెల్‌కు (302 పాయింట్లు) రెండో స్థానం ఖాయమైంది. రెండు వారాల క్రితం మెక్సికో గ్రాండ్‌ప్రిలో హామిల్టన్‌కు (345 పాయింట్లు) ప్రపంచ టైటిల్ ఖరారైంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రెజిల్ గ్రాండ్ ప్రీ - 2017
ఏమిటి : నవంబర్ 13
ఎవరు : విజేత సెబాస్టియన్ వెటెల్ 

పేస్ - రాజాకు నాక్స్‌విల్లె ఏటీపీ చాలెంజర్ టైటిల్ భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్.. భారత్‌కే చెందిన పురవ్ రాజా ద్వయం అమెరికాలో జరిగిన నాక్స్‌విల్లె ఏటీపీ చాలెంజర్ టోర్నీలో డబుల్స్ టైటిల్‌ను సాధించింది. నవంబర్ 13న జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ పేస్-పురవ్ రాజా ద్వయం 7-6 (7/4), 7-6 (7/4)తో జేమ్స్ సెరాటిని (అమెరికా)-జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన పేస్ జంటకు 4,650 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షలు)తోపాటు 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : నాక్స్‌విల్లె ఏటీపీ చాలెంజర్ - 2017
ఏమిటి : నవంబర్ 13
ఎవరు : డబుల్స్ టైటిల్ విజేత లియాండర్ పేస్ - పురవ్ రాజా

ఫెడ్‌కప్ విజేత అమెరికా ప్రపంచ మహిళల టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ‘ఫెడ్ కప్’ను అమెరికా జట్టు సొంతం చేసుకుంది. యూఎస్ ఓపెన్ చాంపియన్ స్లోన్ స్టీఫెన్‌‌స, ప్రపంచ పదో ర్యాంకర్ కోకో వాండెవె, షెల్బీ రోజర్స్, అలీసన్ రిస్కీ సభ్యులుగా ఉన్న అమెరికా ఫైనల్లో 3-2తో బెలారస్‌పై గెలిచింది. చివరిసారి 2000లో ఫెడ్ కప్‌ను దక్కించుకున్న అమెరికా తాజా విజయంతో 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫెడ్ కప్ - 2017
ఏమిటి : నవంబర్ 13
ఎవరు : విజేత అమెరికా 

వార్తల్లో వ్యక్తులుబ్రిటన్ కేబినెట్ మంత్రి ప్రీతి రాజీనామాబ్రిటన్‌లో భారత సంతతి కేబినెట్ మంత్రి, బ్రెగ్జిట్‌కు గట్టి మద్దతుదారు ప్రీతి పటేల్ (45) పదవికి రాజీనామా చేశారు. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా అనుమతి లేకుండా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో పాటు పలువురు నేతలతో రహస్యంగా భేటీ కావడంతో పాటు ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలపకపోవడంతో అంతర్జాతీయ అభివృద్ధి మంత్రిగా పనిచేస్తున్న ప్రీతిపై వేటు పడింది. ఇజ్రాయెల్ నేతలతో భేటీ విషయం వివాదాస్పదంగా మారడంతో ఆఫ్రికా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని రావాలని ప్రధాని థెరిసా మే ప్రీతిని ఆదేశించారు. దీంతో నవంబర్ 8న ప్రధాని కార్యాలయానికి చేరుకున్న ఆమె థెరిసాకు రాజీనామా సమర్పించారు. సాధారణంగా విదేశీ పర్యటనలు జరిపే బ్రిటిష్ మంత్రులు ఆ వివరాలను తమ విదేశాంగ శాఖకు తప్పనిసరిగా తెలపాల్సి ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిటన్ కేబినెట్ మంత్రి ప్రతి పటేల్ రాజీనామా 
ఏమిటి : నవంబర్ 8 
ఎందుకు : ఇజ్రాయెల్ పర్యటనలో అనుమతి లేకుండా ఆ దేశ నేతలతో సమావేశం కావటంతో 

‘నాడా’ అప్పీల్ ప్యానెల్‌లో సెహ్వాగ్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)కు చెందిన యాంటీ డోపింగ్ అప్పీల్ ప్యానెల్ (ఏడీఏపీ)లో సభ్యునిగా వీరేంద్ర సెహ్వాగ్ ఎంపికయ్యాడు. క్రికెట్‌ను కూడా ‘నాడా’ పరిధిలోకి తీసుకురావాలని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఇటీవలే హెచ్చరించిన నేపథ్యంలో కమిటీలో సెహ్వాగ్ ఎంపిక ప్రాధాన్యతను సంతరించుకుంది. సెహ్వాగ్‌తో పాటు డిల్లీ మాజీ క్రికెటర్ వినయ్ లాంబా తదితరులు ఆరుగురు సభ్యుల ఈ కమిటీలో ఉన్నారు. అప్పీల్ ప్యానెల్‌తో పాటు డోపింగ్ నిరోధక క్రమశిక్షణా కమిటీ (యాంటీ డోపింగ్ డిసిప్లినరీ ప్యానెల్- ఏడీడీపీ)ని కూడా ‘నాడా’ నియమించింది. ఈ కమిటీలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు చోటు కల్పించింది. 2001లో డోపింగ్ కారణంగా ఆరు నెలల పాటు సస్పెన్షన్‌కు గురైన వెయిట్ లిఫ్టర్ కుంజరాణికి ఈ కమిటీలో సభ్యురాలిగా నియమించారు. కుంజరాణితో పాటు ఏడీడీపీ కమిటీలో అఖిల్ కుమార్ (బాక్సింగ్), రీత్ అబ్రహం (అథ్లెటిక్స్), జగ్బీర్ సింగ్ (హాకీ), రోహిత్ రాజ్‌పుట్ (టెన్నిస్) తదితరులు ఉన్నారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : ‘నాడా’ అప్పీల్ ప్యానెల్
ఏమిటి : నవంబర్ 9
ఎవరు : వీరేంద్ర సెహ్వాగ్ కు చోటు 

నాస్కామ్ తొలి మహిళా ప్రెసిడెంట్‌గా దేబ్‌జానీ ఘోష్  దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్‌గా దేబ్‌జానీ ఘోష్ ఎంపికయ్యారు. 2018 మార్చిలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ పదవీకాలం అప్పటితో ముగుస్తుంది. నాస్కామ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన తొలి మహిళ.. ఘోష్. ఆమె ఇంటెల్ దక్షిణాసియా విభాగం ఎండీగా పనిచేశారు. నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో ఘోష్ సభ్యురాలు కాగా.. నాస్కామ్ ఫౌండేషన్ ట్రస్టీగా కూడా ఉన్నారు. 
దేశీ ఐటీ, బీపీవో రంగం ప్రస్తుతం 150 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : నాస్కామ్ తొలి మహిళా ప్రెసిడెంట్
ఏమిటి : నవంబర్ 10 
ఎవరు : దేబ్‌జానీ ఘోష్ 

భార్యను కలిసేందుకు జాధవ్‌కు అనుమతి భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్ తన భార్యను కలుసుకునేందుకు పాకిస్తాన్ అనుమతించింది. జాధవ్‌ను కలుసుకునేందుకు వీలుగా ఆయన తల్లికి మానవతా దృక్పథంతో వీసా మంజూరు చేయాలని భారత్ పలుమార్లు చేసిన విజ్ఞప్తిపై పాక్ ఈ మేరకు స్పందించింది. మానవతా దృక్పథంతోనే జాధవ్ తన భార్యను పాక్‌లో కలుసుకునేందుకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. పాక్‌లో ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై జాధవ్‌కు పాక్ మిలటరీ కోర్టు ఏప్రిల్‌లో మరణశిక్ష విధించింది. దీనిపై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లడంతో మరణశిక్షపై స్టే లభించింది. 

యునెస్కోకి రెండోసారి మహిళాధిపతి ‘ఐక్యరాజ్యసమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ(యునెస్కో)’ నూతన డెరైక్టర్ జనరల్(డీజీ)గా ఫ్రాన్స్ సాంస్కృతిక, సమాచార శాఖ మాజీ మంత్రి ఆద్రే అజోలే నియమితులయ్యారు. ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను యునెస్కో సర్వ సభ్య సదస్సు నవంబర్ 12న ఆమోదించింది. యునెస్కోకి 11వ డీజీగా నియమితులైన అజోలే ఈ పదవిని అలంకరించనున్న రెండో మహిళ కావడం గమనార్హం. ఈమె ఇరినా బొకోవా స్థానంలో నియమితులయ్యారు.

అంతర్జాతీయంజింబాబ్వేలో సైనిక పాలన జింబాబ్వే సైన్యం ఆ దేశాన్ని తన చేతుల్లోకి తీసుకుని అధ్యక్షుడు రాబర్ట్ ముగాబేను ఆయన ఇంట్లోనే నిర్బంధించింది. అయితే ఇది సైనిక తిరుగుబాటు కాదనీ, అధ్యక్షుడు, ఆయన కుటుంబీకులు ఇంట్లో క్షేమంగానే ఉన్నారనీ, ముగాబే చుట్టూ ఉన్న నేరస్తులే తమ లక్ష్యమని ఆర్మీ జనరల్స్ నవంబర్ 15న వెల్లడించారు. తమ లక్ష్యం పూర్తయిన వెంటనే దేశంలో సాధారణ స్థితులు నెలకొంటాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 
1980 నుంచీ ఆయనే.. 
గతంలో రొడీషియా అనే పేరున్న జింబాబ్వే నల్లజాతివారి సాయుధ పోరాటం ద్వారా బ్రిటిష్ పాలన నుంచి 1965లో స్వాతంత్య్రం ప్రకటించుకుంది. 1980 ఎన్నికల్లో విమోచన పోరాటం నడిపిన రాబర్ట్ ముగాబే నాయకత్వంలోని జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్ (జాను) విజయం సాధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ముగాబేనే అధికారంలో ఉన్నారు. 93 ఏళ్ల ముగాబే ప్రస్తుతం పదవిలో ఉన్న ప్రపంచదేశాల అధ్యక్షుల్లోకెల్లా వయసులో పెద్దవారు. అలాగే 1980 నుంచి ఇప్పటికీ ఒక దేశాధ్యక్షుడిగా కొనసాగుతున్న వ్యక్తి ప్రపంచంలో ఈయన ఒక్కరే. ఇన్నేళ్ల పాలనలో సైన్యం ఆయనకు ఎదురుతిరగడం ఇదే తొలిసారి. 
క్విక్ రివ్యూ:ఏమిటి : జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే గృహ నిర్బంధం 
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : జింబాబ్వే సైన్యం 

యూరప్‌యేతర దేశాలకు బ్రిటన్ వీసాలు రెట్టింపు బ్రెగ్జిట్ అనంతర వ్యూహంలో భాగంగా బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో టెక్నాలజీ, కళలు, సృజనాత్మక పరిశ్రమల్లో పనిచేసే యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలకు చెందని నిపుణులకు ప్రస్తుతం జారీచేస్తున్న వీసాలను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. అసాధారణ ప్రతిభ(ఎక్సెప్షనల్ టాలెంట్) ఉండే విదేశీయులకు టైర్-1 రూట్ ద్వారా ప్రస్తుతం 1,000 వీసాలు ఇస్తుండగా, దీన్ని 2 వేలకు పెంచుతామంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూరప్‌యేతర దేశాలకు బ్రిటన్ వీసాలు రెట్టింపు 
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : బ్రిటన్ 
ఎందుకు : బ్రెగ్జిట్ అనంతర వ్యూహంలో భాగంగా

డావెన్సీ చిత్రానికి 450 మిలియన్ డాలర్లు అత్యంత ప్రాచీన కళాసృష్టిలో ఒకటైన లియోనార్డో డావెన్సీ వేసిన దాదాపు 500 ఏళ్ల నాటి పెయింటింగ్ వేలంలో రికార్డు ధర పలికింది. న్యూయార్క్‌లో క్రిస్టీస్ నిర్వహించిన వేలంలో డావెన్సీ వేసిన సాల్వేటర్ ముండి’ జీసస్ క్రైస్ట్ చిత్రం 450.3 మిలియన్ డాలర్లు పలికింది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.2,941వేల కోట్లు. 
అత్యంత ఖరీదైన పెయింటింగ్‌గా డావెన్సీ జీసస్ క్రైస్ట్ పెయింటింగ్ నిలిచినట్లు క్రిస్టీస్ వెల్లడించింది. గతంలో 2015 క్రిస్టీస్ నిర్వహించిన వేలంలో పాబ్లో పికాసో వేసిన పెయింటింగ్ 179.4 మిలియన్ డాలర్లు పలికింది. ఈ రికార్డును డావెన్సీ పెయింటింగ్ అధిగమించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : డావెన్సీ చిత్రానికి వేలంలో 450.3 మిలియన్ డాలర్లు 
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : క్రిస్టీస్ 
ఎక్కడ : న్యూయార్క్‌లో 

అమెరికా రక్షణ బడ్జెట్ 700 బిలియన్ డాలర్లువచ్చే ఏడాదికి అమెరికా భారీ రక్షణ బడ్జెట్‌ను ప్రకటించింది. నేషనల్ డిఫెన్‌‌స ఆథరైజేషన్ చట్టం-2018(ఎన్‌డీఏఏ) పేరిట రూపొందించిన 700 బిలియన్ డాలర్ల(సుమారు 45.44 లక్షల కోట్లు) బడ్జెట్‌ను అమెరికా కాంగ్రెస్ నవంబర్ 17న ఆమోదించింది. సైనిక, భద్రత సాయం పొందడానికి ఇందులో పాకిస్తాన్‌పై కఠిన ఆంక్షలు విధించారు. అదే సమయంలో భారత్‌తో రక్షణ సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని ప్రతిపాదించారు. ఈ బిల్లుకు అమెరికా పార్లమెంట్‌లోని ఉభయ సభలు ప్రతినిధుల సభ, సెనేట్ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపాయి. ఇటీవలే దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన దక్షిణాసియా వ్యూహానికి ఇందులో చోటు కల్పించారు.
భారత్‌కు అమెరికా కల్పించిన ప్రధాన రక్షణ భాగస్వామి’ హోదాపై ఉమ్మడి నిర్వచనం ఇవ్వాలని విదేశాంగ, రక్షణ శాఖ మంత్రులను బిల్లు కోరింది. 2017 రక్షణ బడ్జెట్‌లోనే భారత్‌కు అమెరికా ప్రధాన రక్షణ భాగస్వామి హోదా ప్రకటించింది. ఈ గౌరవం భారత్‌కే ప్రత్యేకమని, దీని వల్ల రెండు దేశాల మధ్య రక్షణ వ్యాపారం, సాంకేతిక సహకారం అమెరికా మిత్ర దేశాలతో సమాన స్థాయికి చేరుతుందని కాంగ్రెస్ సభ్యులు అభిప్రాయపడ్డారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూఎస్ నేషనల్ డిఫెన్‌‌స ఆథరైజేషన్ చట్టం-2018కి ఆమోదం 
ఎప్పుడు : నవంబర్ 17
ఎవరు : అమెరికా కాంగ్రెస్ 
ఎందుకు : 700 బిలియన్ డాలర్లతో రక్షణ బడ్జెట్ 

కిల్లర్ రోబోలపై ఐరాస కమిటీ చర్చలుమానవ ప్రమేయం లేకుండానే శత్రువుల్ని గుర్తించి హతమార్చే రోబోల వినియోగంపై చర్చించేందుకు, నిబంధనల్ని రూపొందించేందుకు ఐక్యరాజ్యసమితి (ఐరాస)కు చెందిన ఓ కమిటీ నవంబర్ 17న అంగీకారం తెలిపింది. ఐదు రోజుల పాటు కిల్లర్ రోబో’ల వినియోగంపై సాగిన ఈ సమావేశంలో ఈ రోబోల్ని నిషేధించాలని పలు దేశాలు డిమాండ్ చేశాయి. ఈ రోబోల వినియోగంలో కొంతైనా మానవ ప్రమేయం ఉండాలన్నాయి. సైనిక బడ్జెట్‌తో పాటు సాంకేతికత తక్కువగా ఉన్న 22 దేశాలు ఈ మేరకు స్పందించాయి. ఈ సమావేశం నిబంధనల రూపకల్పనలో తొలి అడుగు అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కిల్లర్ రోబోల వినియోగంపై వచ్చే ఏడాది మళ్లీ సమావేశమయ్యేందుకు పలు దేశాలు అంగీకరించాయి.

పార్టీ పదవి నుంచి రాబర్ట్ ముగాబే తొలగింపు జింబాబ్వే అధికార జాను-పీఎఫ్ పార్టీ చీఫ్ పదవి నుంచి ఆ దేశ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబేను తొలగించింది. ఆ స్థానంలో మాజీ ఉపాధ్యక్షుడు ఎమర్సన్ ఎమ్‌నాంగా గ్వా ని నియమించింది. 2018లో జరిగే ఎన్నికల్లో తమ అధ్యక్ష అభ్యర్థి ఎమర్సన్ అని ప్రకటించింది. ముగాబే భార్య గ్రేస్‌ను కూడా పార్టీ నుంచి తొలగించారు. ఇంతకముందు జింబాబ్వే ఆర్మీ ముగాబేను గృహ నిర్బంధంలోకి తీసుకుంది. 

ఉగ్ర ప్రోత్సాహ జాబితాలో ఉత్తర కొరియాఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల జాబితాలో ఉత్తర కొరియాను చేరుస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నవంబర్ 19న వైట్‌హౌస్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఉత్తర కొరియాను ఎప్పుడో ఉగ్రవాద ప్రోత్సాహ దేశంగా గుర్తించాల్సిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. తాజా నిర్ణయం నేపథ్యంలో ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షల్ని అమెరికా ఆర్థిక శాఖ వెల్లడిస్తుందని ఆయన చెప్పారు. 

జింబాబ్వే అధ్యక్షుడు ముగాబే రాజీనామా జింబాబ్వే అధ్యక్ష పదవికి రాబర్ట్ ముగాబే రాజీనామా చేశారు. పదవి నుంచి దిగిపోవాలని నలువైపులా పెరుగుతున్న ఒత్తిడి, ఆయన్ని అభిశంసించే ప్రక్రియను జింబాబ్వే పార్లమెంట్ ప్రారంభించడంతో ముగాబే దిగిరాక తప్పలేదు. దీంతో సుమారు 4 దశాబ్దాలుగా నిర్విరామంగా కొనసాగిన ఆయన పాలనకు తెరపడినట్లయింది. ఈ మేరకు నవంబర్ 21న ముగాబే పంపిన రాజీనామా లేఖను పార్లమెంట్ స్పీకర్ జాకబ్ ముడెండా పార్లమెంట్ ఉమ్మడి సమావేశంలో చదివి వినిపించారు. 
భార్య గ్రేస్‌ను తన వారసురాలిగా చేయాలనుకుని ఆమెకు పోటీగా ఉన్న ఉపాధ్యక్షుడు ఎమర్సన్‌ను ముగాబే పదవి నుంచి తొలగించడంతో దేశంలో అస్థిరత ఏర్పడింది. ఎమర్సన్‌కు అండగా నిలిచిన సైన్యం ముగాబే, ఆయన భార్యను గృహ నిర్బంధంలోకి తీసుకుంది. ముగాబే గద్దె దిగాల్సిందేనని దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళలు నిర్వహించారు. సొంత పార్టీ జాను-పీఎఫ్ ముగాబేను తమ చీఫ్‌గా తొలగించి ఎమర్సన్‌ను నియమించింది. 1980 నుంచి ముగాబేనే జింబాబ్వే అధ్యక్షుడిగా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జింబాబ్వే అధ్యక్షుడి రాజీనామా 
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : రాబర్ట్ ముగాబే 
ఎక్కడ : జింబాబ్వే 

కాలుష్యం’పై మానవాళికి మరో హెచ్చరిక కాలుష్య కోరల్లో చిక్కుకుపోతున్న పుడమిని కాపాడాల్సిన సమయం మించిపోతోందని 15 వేల మందిపైగా శాస్త్రవేత్తలు నవంబర్ 13న హెచ్చరించారు. ధరిత్రిని రక్షించేందుకు తక్షణ చర్యలు అవసరమని ఉద్ఘాటించారు. ఇంత పెద్ద సంఖ్యలో శాస్త్రవేత్తలు ప్రకటన చేయడం ఇదే తొలిసారి. పాతికేళ్ల కిందట పలువురు నోబెల్ శాస్త్రవేత్తలు వాతావరణంపై ఒక అప్రమత్తత లేఖ రాయగా, ఇప్పుడు జారీ చేసిన ప్రకటన రెండో హెచ్చరిక. వరల్డ్ సైంటిస్ట్స్ వార్నింగ్ టు హ్యుమానిటీ: ఏ సెకండ్ నోటీస్’ పేరిట వెలువడిన ఈ హెచ్చరిక వ్యాసంపై 184 దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు సంతకాలు చేశారు.

బాన్‌లో ముగిసిన వాతావరణ సదస్సు పారిస్ ఒప్పందం అమలుకు ఉద్దేశించిన ఐరాస చర్చలు నవంబర్ 17న ముగిశాయి. జర్మనీలోని బాన్‌లో రెండు వారాలు సాగిన ఈ సంప్రదింపుల్లో 200 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, ఈ సదస్సులో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. వాతావరణ మార్పులను తట్టుకోవడానికి పేద దేశాలకు చేయాల్సిన సాయం, పారిస్ ఒప్పందం కింద పంచుకోవాల్సిన బాధ్యతలు వంటి అంశాల్లో ధనిక, వర్థమానదేశాల నడుమ విభేదాలు తలెత్తాయి. ఒప్పందం నుంచి త్వరగా వైదొలగనున్నట్లు అమెరికా పునరుద్ఘాటించింది. ఒడంబడిక తమ దేశానికి లబ్ధి చేకూర్చేదిగా ఉంటే భవిష్యత్‌లో తిరిగి చేరే వీలుందని పేర్కొంది.

యోగాకి సౌదీ అరేబియా అనుమతి యోగాభ్యాసం ఒక క్రీడ అని, దాన్ని అందరూ నేర్చుకోవచ్చని సౌదీ అరేబియా ప్రభుత్వం నవంబర్ 14న పేర్కొంది. శిక్షణ లెసైన్స్ ఉన్న టీచర్ల వద్ద ఎవరైనా యోగా నేర్చుకోవచ్చని తెలిపింది. సౌదీలో మొదటి యోగా ట్రైనర్‌గా పేరొందిన నూఫ్ మార్వాయి అనే మహిళ తమ దేశంలో యోగా గుర్తింపు కోసం పోరాడి విజయం సాధించారు. సౌదీ, గల్ఫ్ ప్రాంతాల్లో యోగా, ఆయుర్వేదాన్ని చాలాకాలంగా ప్రోత్సహిస్తున్న ఆమె యోగాకు, మతానికి సంబంధం లేదని మొదటి నుంచీ వాదిస్తున్నారు.

జాతీయంఇంటర్నెట్ స్వేచ్ఛలో 41వ స్థానంలో భారత్ ఇంటర్నెట్ స్వేచ్ఛ విషయంలో భారత్ 41వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఫ్రీడం హౌస్ అనే సంస్థ.. ఫ్రీడమ్ ఆన్ ది నెట్ - 2017 నివేదికను విడుదల చేసింది. ప్రపంచంలో 87 శాతం ఇంటర్నెట్ సేవలను వినియోగించే 65 దేశాల్లో ఇంటర్నెట్ స్వేచ్ఛపై ఈ సంస్థ అధ్యయనం చేసింది. 2016 జూన్ నుంచి 2017 మే మధ్య చోటు చేసుకున్న పరిణామాలతోపాటు పలు తాజా అంశాలను చేర్చి ఈ నివేదికను రూపొందించింది. 
నివేదిక ప్రధాన అంశాలు 
  • సర్వే చేసిన 65 దేశాలకుగాను 30 దేశాల్లోని ప్రభుత్వాలు సోషల్ మీడియాపై బలవంతపు ఆధిపత్యాన్ని సాధించాయి. చైనాలోని టిబెట్, ఇథియోపియాలోని ఒరోమో, భారత్‌లోని కశ్మీర్‌లలో ఈ సేవలపై తరచూ ఆంక్షలు పెడుతున్నారు.
  • ఆయా అంశాల ప్రాధాన్యతను తగ్గించేందుకు ఇంటర్నెట్ స్వేచ్ఛపై 14 దేశాలు నియంత్రణలు విధించాయి.
  • వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లు (వీపీఎన్)లను అడ్డుకోవడం కోసం ప్రస్తుతం 14 దేశాలు సెన్సార్‌షిప్‌ను విధించాయి. ఆరుదేశాల్లో వీపీఎన్ నెట్‌వర్క్‌లను పూర్తిగా నిషేధించారు.
  • ప్రతిపక్షాల విమర్శలను సామాజిక మాధ్యమాల ద్వారా తిప్పికొట్టేందుకు టర్కీలో ప్రభుత్వం ఆరు వేల మందిని నియామించుకుంది.
  • రష్యా అనుకూల ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఉక్రెయిన్ అధికారులు రష్యా ఆధారిత సేవలను నిలిపివేశారు.
  • వరుసగా మూడో ఏడాది కూడా చైనా ఇంటర్నెట్ స్వేచ్ఛను అధికంగా నియంత్రించిన దేశంగా నిలిచింది. తర్వాతి స్థానాల్లో సిరియా, ఇథియోపియా ఉన్నాయి.
ఇంటర్నెట్ ఉన్నా.. స్వేచ్ఛలో వెనుకబాటే! ఇంటర్నెట్ అందుబాటు, వేగం విషయంలో భారత్ ర్యాంకు మెరుగుపడింది. కానీ ఇంటర్నెట్ స్వేచ్ఛ విషయంలో మాత్రం భారత్ 41వ స్థానంలో నిలిచింది. పాకిస్తాన్, సౌదీ అట్టడుగున ఉన్నాయి. ఇంటర్నెట్ స్వేచ్ఛలో ఇస్టోనియా, ఐస్‌లాండ్ ప్రథమస్థానంలో ఉండగా, కెనడా 2, జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికా సంయుక్తంగా మూడోస్థానంలో నిలిచాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంటర్నెట్ స్వేచ్ఛలో 41వ స్థానంలో భారత్ 
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : ఫ్రీడమ్ ఆన్ ది నెట్-2017 సర్వే 
ఎక్కడ : 65 దేశాల జాబితాలో 

ప్రజాదరణలో తొలిస్థానంలో ప్రధాని మోదీ దేశ రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని మోదీ కొనసాగుతున్నారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సర్వే సంస్థ ప్యూ నవంబర్ 15న వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ జాబితాలో 88 శాతం పాయింట్లతో మోదీ అగ్రస్థానంలో, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 58 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తరువాత వరుసగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి 57%, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 39% పాయింట్లు దక్కాయి. 
ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 మధ్య 2,464 భారతీయులపై ఈ సర్వే నిర్వహించించారు. దీని ప్రకారం.. ప్రతి పది మందిలో 8 మంది దేశ ఆర్థి క పరిస్థితులు మెరుగ్గా ఉన్నట్లు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ రాష్ట్రాల్లో మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రతి 10 మందిలో 9 మంది మోదీపై సానుకూలంగా స్పందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశ రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని మోదీ
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : ప్యూ రీసెర్చ్ సర్వే 

నితీశ్ కుమార్‌కే జేడీ(యూ): ఈసీజేడీ(యూ)పై ఆధిపత్య పోరులో బిహర్ సీఎం నితీశ్ కుమార్ విజయం సాధించారు. పార్టీని, బాణం’ గుర్తును ఆయనకే కేటాయిస్తున్నట్లు నవంబర్ 17న ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. జేడీ(యూ) పార్టీలోని మెజారిటీ శాసనసభ్యులు, జాతీయ కౌన్సిల్ నితీశ్‌కే మద్దతు తెలిపినట్లు పేర్కొంది. ఈ మేరకు పార్టీని, గుర్తును తమకే కేటాయించాలంటూ శరద్ యాదవ్ వర్గం దాఖలు చేసిన పిటిషన్ ఈసీ తిరస్కరించింది. 
బీజేపీకి మద్దతు, ఆర్జేడీతో తెగదెంపుల విషయంలో ఇరువురు నేతల మధ్య విభేదాలు రావడంతో పార్టీ రెండుగా చీలింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నితీశ్ కుమార్‌కే జేడీ(యూ)
ఎప్పుడు : నవంబర్ 17
ఎవరు : కేంద్ర ఎన్నికల కమిషన్ 

భారత్‌లో 73 కోట్ల మంది మరుగుదొడ్లకు దూరంప్రపంచంలో అత్యధిక మంది మరుగుదొడ్లకు దూరంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానంలో ఉందని వాటర్ ఎయిడ్ సంస్థ వెల్లడించింది. నవంబర్ 19న వరల్డ్ టాయిలెట్ డే’ సందర్భంగా ఔట్ ఆఫ్ ఆర్డర్: ది స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ టాయ్‌లెట్స్-2017 పేరిట మూడో వార్షిక నివేదికను వెలువరించింది. దీని ప్రకారం భారత్‌లో ఏకంగా 73.22 కోట్ల మందికి మరుగుదొడ్డి సౌకర్యం లేదు. అంటే 130 కోట్లకుపైగా ఉన్న దేశ జనాభాలో సగానికిపైగా (56 శాతం) ప్రజలు ఆరు బయటే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. 
ఈ జాబితాలో భారత్ తర్వాత చైనా రెండో స్థానంలో ఉంది. ఆ దేశంలో 34.35 కోట్ల మంది(జనాభాలో 25%)కి టాయిలెట్ సౌకర్యం లేదని నివేదిక తెలిపింది. తర్వాతి స్థానాల్లో వరుసగా నైజీరియా(12.28 కోట్లు- దేశ జనాభాలో 67%), ఇథియోఫియా(9.24 కోట్లు- జనాభాలో 93%), బంగ్లాదేశ్(8.55 కోట్లు- జనాభాలో 85.5%) నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 230 కోట్ల మందికి టాయిలెట్ సౌకర్యం అందుబాటులో లేదని నివేదిక తెలిపింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఔట్ ఆఫ్ ఆర్డర్: ది స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ టాయ్‌లెట్స్-2017 నివేదిక
ఎప్పుడు : నవంబర్ 18 
ఎవరు : వాటర్ ఎయిడ్ సంస్థ
ఎక్కడ : ప్రపంచంలో అత్యధిక మందికి మరుగుదొడ్లు లేని దేశాల జాబితాలో మొదటి స్థానంలో భారత్ 

విశాఖ, ముంబైలో సీఈఎంఎస్ సంస్థలు షిప్పింగ్ అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముంబై, విశాఖపట్నం నగరాల్లో ప్రపంచస్థాయి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్‌‌స ఇన్ మారిటైమ్ అండ్ షిప్ బిల్డింగ్ (సీఈఎంఎస్) సంస్థలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు కేంద్ర షిప్పింగ్‌శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కొచ్చిన్‌లో ప్రకటించారు. సాగర్‌మాల పథకంలో దీనిని ప్రధాన అంశంగా తీసుకోనున్నారు. షిప్పింగ్ పరిశ్రమ సంబంధిత నైపుణ్యంలో శిక్షణ ఇచ్చేందుకు రూ.766 కోట్లతో ఈ రెండు క్యాంపస్‌లను ఏర్పాటు చేయనున్నారు. బహుళజాతి సంస్థ సిమెన్‌‌స, ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ (ఐఆర్‌ఎస్) సంస్థల భాగస్వామ్యంతో కేంద్ర షిప్పింగ్ శాఖ వీటిని ఏర్పాటు చేయనుంది. షిప్ డిజైన్, తయారీ, నిర్వహణ, మరమ్మతులు తదితర సేవల్లో అవసరమైన నైపుణ్యాలను అందించడం ఈ క్యాంపస్‌ల ప్రధాన లక్ష్యం. 
సాంకేతికత, నైపుణ్యాలతో పాటు 87 శాతం నిధులను సిమెన్‌‌స సంస్థ గ్రాంటుగా అందిస్తోంది. విశాఖపట్నం క్యాంపస్ కోసం ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ (ఐఎంయూ) స్థలం, భవనం సమకూర్చింది. క్యాంపస్‌లను తొలి రెండేళ్లపాటు సీమెన్‌‌స సంస్థ నిర్వహిస్తుంది. తదుపరి ఐఆర్‌ఎస్ ఏర్పాటు చేసే ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ నిర్వహిస్తుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : విశాఖ, ముంబైలో సీఈఎంఎస్ సంస్థలు 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : షిప్పింగ్ అవసరాలు తీర్చేందుకు

వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు 51వ స్థానం ప్రముఖ గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఐఎండీ’ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో భారత్ 51వ స్థానంలో నిలిచింది. నైపుణ్యం కలిగిన వారిని నియమించుకోవడం, విదేశీ నిపుణులను ఆకర్షించడం, స్థానిక ప్రతిభను మెరుగుపరచుకోవడం వంటి అంశాల పరంగా భారత్ ఈ ర్యాంకును సొంతం చేసుకుంది. ఇక స్విట్జర్లాంట్ అగ్రస్థానం దక్కించుకుంది. దీని తర్వాతి స్థానంలో డెన్మార్క్, బెల్జియం ఉన్నాయి. ఆస్ట్రియా, ఫిన్‌లాండ్, నెదర్లాండ్‌‌స, నార్వే, జర్మనీ, స్వీడన్, లక్సెంబర్గ్ వంటివి టాప్-10లో నిలిచాయి. 
ఇన్వెస్ట్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్, అప్పీల్, రెడీనెస్ వంటి అంశాల్లో భారత్ వరుసగా 62, 43, 29 ర్యాంకులను సొంతం చేసుకుందని ఐఎండీ తెలిపింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : వర ల్డ్ టాలెంట్ ర్యాంకింగ్స్ - 2017 
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : ఐఎండీ 
ఎక్కడ : 51వ స్థానంలో భారత్ 

ద్వైపాక్షికంభారత్‌తో సమాచార మార్పిడికి స్విస్ ఒప్పందం  స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన భారతీయుల సమాచారం పొందడానికి కీలక ముందడుగు పడింది. భారత్‌తో ఆటోమేటిక్‌గా ఈ వివరాలు పంచుకోవడానికి ఉద్దేశించిన ఒప్పందానికి స్విట్జర్లాండ్ పార్లమెంట్ కమిటీ నవంబర్ 18న ఆమోదం తెలిపింది. భారత్‌తో పాటు మరో 40 దేశాలకు వర్తించే ఈ ఒప్పందానికి స్విట్జర్లాండ్ ఎగువ సభలోని ఆర్థిక వ్యవహారాలు, పన్ను ఎగవేతల కమిషన్ ఆమోదం తెలిపింది. సమాచార మార్పిడి జరిగిన తరువాత తలెత్తే వివాదాలను ఎదుర్కొనేలా నిబంధనలను పటిష్టం చేయాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి సూచించింది. ఇక తదుపరి దశలో ఈ ఒప్పందాన్ని నవంబర్ 27 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఎగువ సభలో ప్రవేశపెడతారు. అక్కడ కూడా ఆమోదం లభిస్తే 2019 నుంచి ఇరు దేశాల మధ్య ఆటోమేటిక్ సమాచార మార్పిడి ప్రారంభమవుతుంది. 

రాష్ట్రీయంలక్కంపల్లిలో పతంజలి’ యూనిట్
 నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం లక్కంపల్లిలో పతంజలి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు బాబా రామ్‌దేవ్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సమక్షంలో పతంజలి సంస్థ సీఈవో ఆచార్య బాలకృష్ణ, తెలంగాణ టీఎస్‌ఐఐసీ ఎండీ ఇ.వి.నర్సింహారెడ్డి నవంబర్ 15న ఎంఓయూ కుదుర్చుకున్నారు. తెలంగాణలో విత్తనాభివృద్ధి, జంతువుల దాణా ఉత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు కూడా పతంజలి సంస్థ ఆసక్తి కనబరిచింది.
లక్కంపల్లిలో ఏర్పాటు చేయనున్న ఆహార శుద్ధి కర్మాగారంలో పసుపు, మిర్చి, మక్కలు, సోయా తదితర సుగంధ ద్రవ్యాలు, తృణ ధాన్యాల్ని సేకరించి శుద్ధి చేస్తారు. యూనిట్‌కు కావలసిన పసుపు, మిరప, సోయా, మక్కలు ఆ ప్రాంతంలోనే కొనుగోలు చేస్తారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా అనేక మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరకడంతో పాటు ఆ ప్రాంత రైతులకు పంటలను ఒకేసారి అమ్ముకోడానికి వీలవుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణలో పతంజలి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ 
ఎప్పుడు : నవంబర్ 15 
ఎవరు : పతంజలి, టీఎస్ ఐఐసీ మధ్య అవగాహన ఒప్పందం 
ఎక్కడ : లక్కంపల్లి, నిజామాబాద్ జిల్లా 

గోదావరి పుష్కరాలు’ డాక్యుమెంటరీకి అవార్డుతూర్పు గోదావరి జిల్లా గోదావరి పుష్కరాలు’ పేరుతో తీసిన డాక్యుమెంటరీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవార్టు ప్రకటించింది. అమరావతిలో నవంబర్ 14న వివిధ పేర్లతో ప్రకటించిన వివిధ కేటగిరీల్లో గోదావరి పుష్కరాలు’కు 2015 ఏడాదికిగాను ఉత్తమ ద్వితీయ డాక్యుమెంటరీ అవార్డు వరించింది. ఈ డాక్యుమెంటరీ తీసిన నిర్మాత, దర్శకుడి పేరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు. 
క్విక్ రివ్యూ:ఏమిటి : గోదావరి పుష్కరాల డాక్యుమెంటరీకి అవార్డు 
ఎప్పుడు : నవంబర్ 14
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఏపీకి మరో 28 ఐఏఎస్ పోస్టులుఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐఏఎస్ పోస్టుల సంఖ్య పెరిగింది. కేడర్ రివ్యూలో భాగంగా కొత్తగా 28 ఐఏఎస్ పోస్టులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ నవంబర్ 15న నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రానికి 211 ఐఏఎస్ పోస్టులు ఉండగా ఆ సంఖ్య ఇప్పుడు 239కి పెరిగింది. ప్రస్తుతం ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెండు అదనపు ప్రధాన కార్యదర్శులు పోస్టులు ఉండగా కేడర్ రివ్యూలో భాగంగా మూడు అదనపు ప్రధాన కార్యదర్శులు పోస్టులు వచ్చాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌కి మరో 28 ఐఏఎస్ పోస్టులు మంజూరు 
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎందుకు : ఏపీలో 239కి పెరిగిన ఐఏఎస్ పోస్టుల సంఖ్య 

తెలంగాణకు ఇండియా టుడే అవార్డులు ఆర్థిక రంగం, స్వచ్ఛతలో పురోగతికి గుర్తింపుగా తెలంగాణకు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. ఇండియా టుడే ఏటా నిర్వహిస్తున్న స్టేట్ ఆఫ్ ద స్టేట్స్ కాన్‌క్లేవ్-2017 సదస్సు నవంబర్ 16న ఢిల్లీలో జరిగింది. ఆర్థిక, స్వచ్ఛత రంగాల్లో పురోగతికి రాష్ట్రానికి రెండు బెస్ట్ పెర్ఫార్మింగ్ లార్జ్ స్టేట్ అవార్డులు ప్రదానం చేసింది. ఈ అవార్డులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా మంత్రులు కేటీఆర్, జోగు రామన్న అందుకున్నారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్టేట్ ఆఫ్ ద స్టేట్స్ కాన్‌క్లేవ్ - 2017
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : ఇండియాటుడే 
ఎక్కడ : న్యూఢిల్లీలో 
ఎందుకు : ఆర్థిక, స్వచ్ఛత రంగంలో తెలంగాణకు రెండు అవార్డులు 

ఈ-నామ్‌లో తెలంగాణకు అగ్రస్థానంఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ-నామ్) ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.7,454 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు జరిగాయని కేంద్ర వ్యవసాయశాఖ నవంబర్ 16న ప్రకటించింది. 18.71 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను రైతులు ఆన్‌లైన్ ద్వారా వ్యాపారులకు అమ్ముకున్నారని పేర్కొంది. ఇలా రాష్ట్రంలో 44 మార్కెట్ల ద్వారా ఈ-నామ్‌ను విజయవంతంగా అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది. ఈ మేరకు వివిధ రాష్ట్రాలను పోల్చుతూ తెలంగాణలో ఈ-నామ్ అమలు తీరును కేంద్రం తన నివేదికలో ప్రస్తావించింది. 
ఒడిశాలో ఈ-నామ్ మార్కెట్లకు వచ్చిన వ్యవసాయ ఉత్పత్తుల్లో కేవలం 2 శాతం మాత్రమే ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా విక్రయించగా, తెలంగాణలో ఏకంగా 85 శాతం ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారానే విక్రయించారు. ఏ రాష్ట్రంలోనూ ఆన్‌లైన్ ద్వారా ఈ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం జరగలేదని కేంద్ర నివేదికలో ప్రస్తావించారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈ - నామ్ అమలులో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ 
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : కేంద్ర వ్యవసాయశాఖ 
ఎందుకు : ఈ - నామ్ ద్వారా రూ.7,454 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు 

అమరావతి నిర్మాణంపై ఎన్జీటీ షరతులుఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణకు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) పలు షరతులు విధించింది. సుస్థిరమైన అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణ కూడా ఒక భాగమనే విషయం గుర్తించాలని పేర్కొంది. నదుల సహజ ప్రవాహ దిశను మార్చడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. వరద ముంపు ప్రాంతాల్లో మార్పులు చేపట్టాలంటే అందుకు సంబంధించి అధ్యయనం చేయాలని తెలిపింది. పర్యావరణ అనుమతి (ఈసీ)కి అదనంగా పలు షరతులు విధించింది. తమ ఆదేశాల అమలుకు వీలుగా, పర్యావరణ పరిరక్షణకు రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్జీటీ తెలిపింది. ఈ మేరకు ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం 145 పేజీల తీర్పును నవంబర్ 17న వెలువరించింది. 
ఈసీకి అదనంగా విధించిన ముఖ్యమైన షరతులు..
  • నది గానీ, సహజ వరద నీటి ప్రవాహ పద్ధతిని గానీ, ప్రవాహ దిశను గానీ మార్చేందుకు అనుమతి లేదు. ప్రవాహ దిశను స్ట్రెయిట్‌గా చేయడానికి అనుమతించడం లేదు. అలాంటి మార్పుల వల్ల నేల కోతకు గురవుతుంది. భూగర్భ నీరు తగ్గుతుంది.
  • కొండవీటి వాగు, దాని ఉప వాగులు, ఇతర వరద కాలువల పరీవాహక ప్రాంతంలో నీటి సంరక్షణ దిశగా చర్యలు చేపట్టాలి. ఉపరితలంపై ప్రవాహ వేగం తగ్గించేందుకు, భూగర్భ నీటి నిల్వ పెంచేందుకు అటవీకరణ చేపట్టాలి.
  • రాజధాని నగరంలో ఉన్న 251 ఎకరాల అటవీ స్థలాన్ని సంరక్షించాలి. అటవీయేతర అవసరాలకు వినియోగించరాదు. కనీసం పార్కులు, వినోద కార్యక్రమాలకు ఆ భూమిని వినియోగించరాదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమరావతి నిర్మాణానికి షరతులతో కూడిన అనుమతి 
ఎప్పుడు : నవంబర్ 17 
ఎవరు : జాతీయ హరిత ట్రిబ్యునల్ 
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ 

ఆంధ్రప్రదేశ్ అగ్రిటెక్ సమావేశం - 2017 ఆంధ్రప్రదేశ్ అగ్రిటెక్ శిఖరాగ్ర సమావేశం - 2017 విశాఖపట్నంలో నవంబర్ 15-17 వరకు జరిగింది. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా.. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయరంగంలో అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌తో కలసి పనిచేస్తామని బిల్‌గేట్స్ ప్రకటించారు. భారత్‌లో మూడు అంశాల్లో తమ ఫౌండేషన్ ఆసక్తి చూపుతోందని చెప్పారు. సామాజికాభివృద్ధి, అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం, ప్రపంచానికి ఎంతో అవసరమైన ఆహార ఉత్పత్తిని పెంచడం తమ ఫౌండేషన్ లక్ష్యాలన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ అగ్రిటెక్ సమావేశం - 2017 
ఎప్పుడు : నవంబర్ 15 -17
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 
ఎక్కడ : విశాఖపట్నం 

తెలంగాణలో రెండో అధికార భాషగా ఉర్దూ రాష్ట్రవ్యాప్తంగా ఇకపై రెండో అధికార భాషగా ఉర్దూ చలామణిలోకి రానుంది. ఈ మేరకు తెలంగాణ అధికార భాషల చట్ట సవరణకు శాసనసభ నవంబర్ 16న ఆమోదముద్ర వేసింది. 1966లోనే ఉర్దూను రెండో భాషగా ప్రకటించినా అప్పట్లో ఇది జిల్లా యూనిట్‌గా అమలైంది. పూర్వపు ఖమ్మం జిల్లా పరిధిలో ఉర్దూ మాట్లాడే వారి సంఖ్య తక్కువగా ఉండటంతో అక్కడ దాన్ని అమల్లోకి తీసుకురాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 31 జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో జిల్లా యూనిట్‌గా కాకుండా రాష్ట్రం యూనిట్‌గా ఉర్దూను రెండో అధికార భాషగా చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణలో రెండో అధికార భాషగా ఉర్దూ
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : తెలంగాణ అధికార భాషల చట్ట సవరణకు శాసనసభ ఆమోదం 

బొటానికల్ గార్డెన్‌లో పాలపిట్ట సైక్లింగ్ పార్కు హైదరాబాద్ కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన పాలపిట్ట సైక్లింగ్ పార్క్‌ను రాష్ట్ర మున్సిపల్, ఐటీ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా సైక్లింగ్ పార్క్‌ను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బొటానికల్ గార్డెన్‌లో పాలపిట్ట సైక్లింగ్ పార్కు ప్రారంభం 
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : మంత్రి కేటీఆర్
ఎక్కడ : హైదరాబాద్‌లో 

ఏపీలో స్థానికత మరో రెండేళ్లు పెంపుఉద్యోగ, విద్య రంగాల్లో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలి వచ్చిన వారికి మరో రెండేళ్ల పాటు స్థానికతకు అర్హత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 20న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రం విడిపోయిన తేదీ నుంచి మూడేళ్లలోగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన వారికి మాత్రమే స్థానికతకు అర్హత ఉంటుందని గతంలో ఉత్తర్వులిచ్చారు. అయితే, ఉద్యోగ సంఘాల నుంచి మరో రెండేళ్ల పాటు స్థానికతకు అర్హత కల్పించాలని విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో మరో రెండేళ్లలోపు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన వారికి స్థానికత అర్హత కలిగించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్‌లో ఐటీ వరల్డ్ కాంగ్రెస్ప్రతిష్టాత్మక వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సదస్సుకు హైదరాబాద్ వేదికవుతోంది. ఫిబ్రవరి 19- 21 తేదీల్లో హెచ్‌ఐసీసీలో ఈ కార్యక్రమం జరుగనుంది. 80 దేశాల నుంచి 5,000 మంది వివిధ రంగాల నిపుణులు హాజరవుతారని టెక్ మహీంద్రా సీఈవో సి.పి.గుర్నాని నవంబర్ 19న తెలిపారు. భారత సిలికాన్ వ్యాలీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ను ప్రోత్సహించేందుకు ఈ సదస్సులు జరుపుతున్నట్టు వెల్లడించారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐటీ వరల్డ్ కాంగ్రెస్ 
ఎప్పుడు : ఫిబ్రవరి 19 - 21
ఎక్కడ : హైదరాబాద్‌లో 

ఏపీలో ఆంధ్రాబ్యాంకు ఎస్‌బీజీ పథకం ప్రారంభం ఆంధ్రాబ్యాంకు రూపొందించిన పట్టాభి సీతారామయ్య స్వయం వ్యాపార సంఘాల పథకం’ (ఎస్‌బీజీ)ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవంబర్ 21న విజయవాడలో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకులు పట్టాభి సీతారామయ్య పేరుతో స్వయం సహాయక సంఘాల తీరుతెన్నులను మార్చే విధంగా పథకం ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు. ఎస్‌బీజీ పథకం ద్వారా 184 గ్రూపులకు చెందిన 1100 మంది మహిళలకు రూ.13.14 కోట్ల మేర రుణాలు అందించామన్నారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలను మ్యారేజ్ మిత్రలుగా నియమిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. 

మత్స్యకారులకు 50 ఏళ్లకే పింఛన్మత్స్యకారులందరికీ 50 ఏళ్లకే పింఛను సౌకర్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ఈ మేరకు ప్రకటించారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : పట్టాభి సీతారామయ్య స్వయం వ్యాపార సంఘాల పథకం ప్రారంభం 
ఎప్పుడు : నవంబర్ 21 
ఎవరు : ఆంధ్రాబ్యాంక్ 
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో 
ఎందుకు : స్వయం వ్యాపార సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు 

హైదరాబాద్‌లో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం 20వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం హైదరాబాద్‌లో నవంబర్ 14న ముగిసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చిత్రోత్సవ చైర్మన్ ముకేష్ ఖన్నా, సీఈవో శ్రావణ్‌కుమార్, ప్రత్యేక అతిథి శ్రద్ధాకపూర్ (బాలీవుడ్ నటి) తదితరులు పాల్గొన్నారు.

ఆర్థికంపప్పుధాన్యాల ఎగుమతికి కేంద్రం అనుమతి  రైతులకు మేలు చేకూర్చేలా అన్ని రకాల పప్పుధాన్యాల ఎగుమతులకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నవంబర్ 16న జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఆ మేరకు ఎగుమతులపై నిషేధం ఎత్తివేతకు ఆమోదం తెలిపారు. 
మన అవసరాలకు మించి అధికంగా పండే పప్పుధాన్యాలకు ప్రత్యామ్నాయ మార్కెట్‌గా ఈ ఎగుమతులు ఉపయోగపడతాయని కేంద్రం భావిస్తోంది. పప్పు దినుసులపై ఎగుమతి, దిగుమతి విధానాన్ని సమీక్షించేందుకు కేంద్ర ఆహార, పౌర సరఫరా కార్యదర్శి నేతృత్వంలోని కమిటీకి అధికారం కల్పిస్తూ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) నిర్ణయం తీసుకుంది. పప్పు ధాన్యాల నిల్వల పరిమాణం, ఉత్పత్తికి అనుగుణంగా దిగుమతి సుంకాల్లో మార్పులు, డిమాండ్, స్థానిక, అంతర్జాతీయ ధరలు తదితర అంశాల్ని కూడా ఈ కమిటీ పరిశీలిస్తుంది. 2016-17లో ప్రభుత్వం 20 లక్షల టన్నుల పప్పుధాన్యాల్ని మద్దతు ధర చెల్లించి సేకరించింది. అంత భారీ మొత్తంలో పప్పుధాన్యాల్ని సేకరించడం ఇదే తొలిసారి.
కేబినెట్ నిర్ణయాలు...
  • ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (పీఎంఏవై-అర్బన్) పథకంలో ఇళ్ల నిర్మాణాల కార్పెట్ ఏరియాను పెంచేందుకు అనుమతి.
  • జీఎస్టీలో భాగంగా నేషనల్ యాంటీ-ప్రాఫిటీరింగ్ అథారిటీ ఏర్పాటుకూ ఆమోదం. జీఎస్టీలో పన్ను తగ్గింపు లాభం వినియోగదారుడికి అందకపోతే.. ఈ అథారిటీకి ఫిర్యాదు చేయొచ్చు. ఐదుగురు సభ్యుల ఈ కమిటీకి కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా నేతృత్వం వహిస్తారు. రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా, సీబీఈసీ చైర్మన్ వనజా సర్నా, రెండు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. చైర్మన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండేళ్ల పాటు కమిటీ కొనసాగుతుంది.
  • ఐసీడీఎస్‌లో నాలుగు పథకాల్ని నవంబర్ 2018 వరకూ కొనసాగించాలని నిర్ణయం. ఇందులో అంగన్‌వాడీ సేవలు, సబల, బాలల పరిరక్షణ సేవలు, జాతీయ శిశు సంరక్షణ పథకాలు ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పప్పు ధాన్యాల ఎగుమతికి అనుమతి 
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : కేంద్ర కేబినెట్ 

తలసరి ఆదాయంలో భారత్ ర్యాంకు 126 స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) ఆధారంగా తలసరి ఆదాయానికి సంబంధించి భారత్ 7,170 డాలర్ల ఆదాయంతో 126వ ర్యాంకులో నిలిచింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ ఈ మేరకు నవంబర్ 18న తాజా గణాంకాలు విడుదల చేసింది. గతేడాది(2016) ఐఎంఎఫ్ గణాంకాల్లో భారత్ 6,690 డాలర్ల తలసరి ఆదాయంతో 127వ ర్యాంకులో ఉంది. 
కొనుగోలు శక్తి ఆధారంగా(పర్చేజ్ పవర్ ప్యారిటీ) ప్రపంచంలోని 200 దేశాల జీడీపీలను లెక్కలోకి తీసుకొని ఐఎంఎఫ్ ఈ ర్యాంకింగ్‌‌సను నిర్ణయించింది. ఇటీవలి ప్రపంచ ఆర్థిక ముఖచిత్రం’ నివేదికలో భాగంగానే ఈ జాబితాను కూడా ప్రవేశపెట్టింది. ర్యాంకింగ్స్ లో 1,24,930 డాలర్ల తలసరి ఆదాయంతో ఖతార్ ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో నిలిచింది. 2,3 స్థానాల్లో మకావూ(1,14,430 డాలర్లు), లగ్జెంబర్గ్(1,09,190 డాలర్లు) నిలిచాయి. 
బ్రిక్స్ దేశాల్లో రష్యా తలసరి ఆదాయం 27,900 డాలర్లు, చైనా 16,620 డాలర్లు, బ్రెజిల్ 15,500 డాలర్లు, దక్షిణాఫ్రికా 13,440 డాలర్లతో భారత్‌కంటే చాలా మెరుగైన స్థితిలో ఉన్నాయి. 
పర్చేజ్ పవర్ ప్యారిటీ(పీపీపీ) అంటే..: 
ఏదైనా ఒక దేశం కరెన్సీని మరో దేశం కరెన్సీలోకి మార్పిడి చేసినప్పుడు మొదటి దేశంలోని నిర్ధేశిత కరెన్సీతో ఏ విధంగా వస్తు, సేవల పరిమాణం లభిస్తుందో.. అదే విధంగా రెండో దేశంలో కూడా నిర్ధేశిత మొత్తం(కరెన్సీని మార్పిడి చేయడం ద్వారా లభించే సొమ్ము)తో అంతే పరిమాణంలో సేవలు, వస్తువులను కొనుగోలు చేయగలగడం. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : తలసరి ఆదాయంలో 126వ ర్యాంకులో భారత్ 
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : ఐఎంఎఫ్ 
ఎక్కడ : 200 దేశాల జాబితాలో 

ఆరేడు నెలల గరిష్ట స్థాయికి ద్రవ్యోల్బణంఅక్టోబర్‌లో హోల్‌సేల్ ధరలు పెరిగాయి. సెప్టెంబర్‌లో 2.6 శాతం ఉన్న టోకు ధరల ఆధారిత సూచీ (డబ్ల్యూపీఐ) అక్టోబర్‌లో 3.59 శాతానికి పెరిగింది. ఇది ఆరు నెలల గరిష్ట స్థాయి. గత ఏడాది ఇది 1.27 శాతం వద్ద ఉండటం గమనార్హం. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం ఏడు నెలల గరిష్ట స్థాయికి చేరింది. ఈ గణాంకాలను కేంద్ర గణాంక కార్యాలయం నవంబర్ 14న విడుదల చేసింది.

జీఎస్‌టీ అక్రమాల నిరోధానికి ప్రాధికార సంస్థ వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) శ్లాబ్‌ల పరిధి తగ్గించినా ఆ ప్రయోజనాలు వినియోగదారులకు పంచకుండా సొమ్ము చేసుకుంటున్న వ్యాపారుల అక్రమాలను అరికట్టడానికి జాతీయ అనుచిత లాభ నిరోధక ప్రాధికార సంస్థ (నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ) ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నవంబర్ 16న జరిగిన మంత్రివర్గ సమావేశం దీనికి ఆమోద ముద్ర వేసింది. 178 వస్తువులను 28 శాతం పన్ను పరిధి నుంచి 18 శాతంలోపు పన్ను పరిధిలోకి చేర్చిన నేపథ్యంలో ఆ ప్రయోజనాలు వినియోగదారులకు చేరేలా చూడటానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.

సైన్స్ అండ్ టెక్నాలజీవరద ముప్పును గుర్తించే పరికరం అభివృద్ధి  భూతాపోన్నతి కారణంగా మంచు ఫలకాలు కరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఏయే నగరాలు వరదల బారిన పడతాయో తెలిపే పరికరాన్ని అభివృద్ధి చేసినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. భూభ్రమణంతో పాటు గురుత్వాకర్షణ ప్రభావాల ఆధారంగా నీటి పంపిణీ ఎలా జరుగుతుందో ఈ పరికరం అంచనా వేస్తుందని వెల్లడించింది. వాయవ్య గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు ఫలకాలు కరగటం వల్ల లండన్ సముద్ర మట్టం పెరుగుతుందని శాస్త్రవేత్త ఎరిక్ ఇవాన్ చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరద ముప్పును గుర్తించే పరికరం అభివృద్ధి 
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : నాసా 

మంచు పలకలతో ముంబై, మంగళూరులకు ముప్పునానాటికీ కరిగిపోతున్న మంచు పలకల వల్ల తీరప్రాంత నగరాలైన ముంబై, మంగళూరుకు పెను ముప్పు పొంచి ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా హెచ్చరించింది. సముద్ర తీరాలు కుచించుకుపోవడం వల్ల భూమ్యాకర్షణ, భ్రమణ శక్తులు ప్రభావితమవుతాయని, సముద్ర మట్టాల పెరుగుదలల్లో అసాధారణ పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొంది. ఇదే ధోరణి కొనసాగితే వచ్చే 100 ఏళ్లలో మంగళూరు సముద్ర మట్టం 15.98 సెం.మీ., ముంబైలో అయితే 15.26 సెం.మీ.లు పెరుగుతుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ తీరానికి(15.16 సెం.మీ.) ఇదే తరహా ముప్పు ఉందని అంచనా వేసింది. 
గ్రేడియంట్ ఫింగర్ ప్రింట్ మ్యాపింగ్’ అనే పరికరం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 293 తీర ప్రాంత నగరాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం జరిపారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : కరుగుతున్న మంచు పలకలతో ముంబై, మంగళూరు నగరాలకు ముప్పు 
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : నాసా 

అణు జలాంతర్గామి అరిధామన్ ప్రవేశంభారత నౌకాదళం అమ్ముల పొదిలోకి మరో శక్తిమంతమైన అస్త్రం వచ్చి చేరింది. భారత అణు జలాంతర్గాముల శ్రేణిలో తొలి న్యూక్లియర్ సబ్‌మెరైన్ ఐఎన్‌ఎస్ అరిహంత్ 2009 జూలై 26న ప్రారంభమైంది. 2016 అక్టోబర్ నుంచి ఇది నావికాదళంలో చేరి సేవలందిస్తోంది. సుమారు ఎనిమిదేళ్ల తర్వాత అదే శ్రేణిలోని రెండో అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిధామన్ నవంబర్ 19న విశాఖలోని నేవల్ డాక్ యార్డులో జలప్రవేశం చేసింది. 
ఆరో దేశం.. భారత్ 
ఇప్పటివరకూ ప్రపంచంలో అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనాలు మాత్రమే అణు జలాంతర్గాములను కలిగి ఉన్నాయి. ఐఎన్‌ఎస్ అరిహంత్‌తో న్యూక్లియర్ సబ్‌మెరైన్లు కలిగిన ఆరో దేశంగా భారత్ చేరింది. అడ్వాన్‌‌సడ్ టెక్నాలజీ వెసల్ ప్రాజెక్టు కింద మొత్తం ఐదు అణు జలాంతర్గాములను నావికా దళం కోసం భారత్ నిర్మించతలపెట్టింది. ఇందులో మొదటిది ఐఎన్‌ఎస్ అరిహంత్, రెండోది అరిధామన్. స్వదేశీ పరిజ్ఞానంతో విశాఖ నేవల్ డాక్‌యార్డులోని షిప్ బిల్డింగ్ సెంటర్‌లో ఈ ఐదు అణు జలాంతర్గాముల నిర్మాణం జరుగుతోంది. ఐఎన్‌ఎస్ అరిహంత్‌కంటే అరిధామన్ రెట్టింపు శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటుంది. అరిధామన్ సముద్ర సన్నాహాలు, ఇతర అవసరమైన పరీక్షలు పూర్తి చేసుకుని నేవీలో చేరడానికి మరో రెండేళ్ల సమయం పడుతుందని భావిస్తున్నారు.
ఇదీ సామర్థ్యం..
బరువు : 6,000 టన్నులు 
టెస్ట్ డెప్త్ : 400 మీటర్ల వరకు 
వేగం : గంటకు సముద్ర ఉపరితలంపై 12 - 15 నాటికల్ మైళ్లు, నీటి అడుగున 24 నాటికల్ మైళ్లు
ఆయుధాలు : 750 - 1900 కి.మీల లక్ష్యాన్ని ఛేదించే కె - 15 ఎస్‌ఎల్‌బీఎం అణు క్షిపణులు - 24. కె- 4 ఎస్‌ఎల్‌బీఎం క్షిపణులు 8 ( 3,500 కీ.మీ.ల పరిధి)
టార్పెడోలు : 21 అడుగుల పొడవుండే టార్పెడోలు - 6

2018లో చైనా అమ్ముల పొదిలోకి డాంగ్‌ఫెంగ్ -41 ప్రపంచంలోని ఏ మూలనున్న లక్ష్యాలనైనా తాకేలా.. ఒకేసారి 10 అణ్వాయుధాల్ని మోసుకుపోయే ఖండాతర క్షిపణి వచ్చే ఏడాదికల్లా చైనా అమ్ముల పొదిలోకి చేరనుంది. డాంగ్‌ఫెంగ్ -41గా పిలుస్తున్న ఈ కొత్త క్షిపణి.. మాక్ 10 కంటే వేగంతో దూసుకుపోగలదు. ప్రత్యర్థి క్షిపణి రక్షణ వ్యవస్థలోకి చొచ్చుకుపోయి తన దారికి అడ్డువచ్చే వేటినైనా తునాతునకలు చేయగల సత్తా ఈ ఖండాంతర క్షిపణి సొంతమని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. 2012లో ప్రకటించిన ఈ క్షిపణిని ఇంతవరకూ ఏడు సార్లు పరీక్షించగా.. తాజాగా మరోసారి నవంబర్ మొదటి వారంలో పరీక్షించినట్లు సమాచారం. 2018 ప్రథమార్ధానికి ఈ అత్యాధునిక క్షిపణి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి అందుబాటులోకి రానుంది. 12 వేల కి.మి. దూరంలో లక్ష్యాల్ని ఛేదించే డాంగ్‌ఫెంగ్-41లో మూడంచెల ఘనరూప ఇంధన వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఇది ఒకేసారి 10 అణ్వాయుధాల్ని మోసుకుపోయి వాటిని వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించగలదని గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : చైనా అమ్ముల పొదిలోకి డాంగ్‌ఫెంగ్ -41 క్షిపణి
ఎప్పుడు : 2018 ప్రథమార్ధానికి 
ఎవరు : చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 
ఎందుకు : ఒకేసారి 10 అణ్వాయుధాల్ని మోసుకుపోయే సామర్థ్యం

‘స్పైక్ క్షిపణుల’ ఉపసంహరణకు భారత్ నిర్ణయం ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేయాలని భావించిన స్పైక్ యాంటి ట్యాంక్ మిస్సైళ్ల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని భారత్ నిర్ణయించింది. ఈ తరహా క్షిపణుల్ని దేశీయ పరిజ్ఞానంతో తయారుచేసే బాధ్యతను రక్షణరంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు అప్పగించింది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్పైక్ క్షిపణుల సాంకేతికతను పూర్తిస్థాయిలో భారత్‌కు బదిలీ చేసేందుకు ఇజ్రాయెల్ వైపు నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ తరహా క్షిపణుల రూపకల్పనకు డీఆర్‌డీవోకు నాలుగేళ్ల గడువు ఇచ్చినట్లు వెల్లడించాయి. 
ఇజ్రాయెల్‌కు చెందిన రాఫెల్ అడ్వాన్‌‌సడ్ డిఫెన్‌‌స సిస్టమ్స్, భారత్‌కు చెందిన కళ్యాణి గ్రూప్ స్పైక్ మిస్సైళ్లను రూపొందించడానికి హైదరాబాద్‌లో రూ.70 కోట్లతో ఉత్పత్తి కేంద్రాన్ని ఆగస్టులో ప్రారంభించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘స్పైక్ క్షిపణుల’ ప్రతిపాదనల ఉపసంహరణకునిర్ణయం 
ఎప్పుడు : నవంబర్ 20 
ఎవరు : భారత్ 
ఎందుకు : దేశీయ పరిజ్ఞానంతో తయారు చేయాలని నిర్ణయం 

2036లో అపోఫిస్ భూమిని ఢీకొనే అవకాశం : నాసాఅపోఫిస్ అనే గ్రహశకలం భూమిని ఢీకొట్టడం వల్ల 2036లో భారీ విధ్వంసం జరగొచ్చని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) అంచనా వేస్తోంది. ఈ గ్రహశకలం ఢీకొట్టడం వల్ల మానవాళి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉండొచ్చని హెచ్చరిస్తోంది. అపోఫిస్ అనే గ్రహశకలాన్ని 2004లో నాసా తొలిసారిగా గుర్తించింది. దీని పరిమాణం దాదాపుగా రెండున్నర ఫుట్‌బాల్ మైదానాలంత ఉంటుందని అంచనా. అప్పటి నుంచి దాని కదలికలను నిశితంగా గమనిస్తోంది. 2036లో అపోఫిస్ భూమిని ఢీకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు నాసా వర్గాలు పేర్కొన్నాయి. కచ్చితంగా చెప్పాలంటే 2036 ఏప్రిల్ 13 మన భూగ్రహానికి చివరిరోజు కావొచ్చని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 
2029లో కూడా అపోఫిస్ గ్రహశకలం భూమికి సమీపంలో, 32 వేల కిలోమీటర్ల దూరంలోనే వెళ్లొచ్చనీ, అప్పుడు దాని మార్గంలో ఏ చిన్న తేడా వచ్చినా, భూమిపై పెను విధ్వంసం జరగొచ్చని రష్యా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2036లో అపోఫిస్ గ్రహశకలం భూమిని ఢీకొనవచ్చని అంచనా 
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : నాసా 

ప్రపంచంలోనే తొలి పూర్తి స్థాయి విద్యుత్ నౌక ప్రపంచంలోనే తొలి పూర్తి స్థాయి విద్యుత్ నౌకను దక్షిణ చైనాలోని గువాంగ్‌డన్ ప్రావిన్స్‌లో నవంబర్ 13న ప్రారంభించారు. దీని బరువు 600 టన్నులు, పొడవు 70.5 మీటర్లు. 26 టన్నుల లిథియం బ్యాటరీతో నడిచే ఈ నౌకకు రెండు గంటలు చార్జింగ్ పెడితే 2 వేల టన్నుల సరకును 80 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లగలదు. గంటకు గరిష్టంగా 12.8 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ నౌకలో శిలాజ ఇంధనాలు ఉపయోగించరు. అందువల్ల దీని నుంచి హానికర ఉద్గారాలు వెలువడవు.

క్రీడలుపాకిస్తాన్ బౌలర్ హఫీజ్ పై మళ్లీ నిషేధం పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ మహమ్మద్ హఫీజ్ బౌలింగ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి - ఐసీసీ మరోసారి నిషేధం విధించింది. గత నెలలో శ్రీలంకతో సీరీస్‌లో భాగంగా జరిగిన మూడో వన్డేలో హఫీజ్ నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేశాడని గుర్తించిన ఐసీసీ.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 
వివాదాస్పద బౌలింగ్ యాక్షన్‌తో 2014 డిసెంబర్‌లో తొలిసారి ఐదు నెలల నిషేధం ఎదుర్కొన్న హఫీజ్.. రెండోసారి 2015 జూన్‌లో ఏడాది నిషేధానికి గురయ్యాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్తాన్ బౌలర్ హఫీజ్ పై మళ్లీ నిషేధం 
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : ఐసీసీ 
ఎందుకు : వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా

పుణే ఓపెన్ విజేత యూకీ  భారత్‌లో ఈ సంవత్సరం జరిగిన తొలి ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ పుణే ఓపెన్‌లో భారత స్టార్ యూకీ బాంబ్రీ విజేతగా నిలిచాడు. నవంబర్ 18న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో యూకీ 4-6, 6-3, 6-4తో భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌ను ఓడించాడు. యూకీ కెరీర్‌లో ఇది ఆరో ఏటీపీ చాలెంజర్ టైటిల్ కాగా ఈ ఏడాది తొలి టైటిల్.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పుణే ఓపెన్ - 2017 
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : పురుషుల సింగిల్స్ విజేత యూకీ బాంబ్రీ

ఏటీపీ వరల్డ్ టూర్ పురుషుల టైటిల్ విజేత దిమిత్రోవ్ పురుషుల టెన్నిస్ సీజన్ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో బల్గేరియా ప్లేయర్ గ్రిగోర్ దిమిత్రోవ్ చాంపియన్‌గా అవతరించాడు. నవంబర్ 19న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో... దిమిత్రోవ్ 7-6, 4-6, 6-3తో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై గెలిచాడు. తద్వారా 1998లో అలెక్స్ కొరెత్యా (స్పెయిన్) తర్వాత ఈ టోర్నీలో బరిలోకి దిగిన తొలిసారే టైటిల్ నెగ్గిన తొలి ప్లేయర్‌గా దిమిత్రోవ్ గుర్తింపు పొందాడు. 
విజేతగా నిలిచిన దిమిత్రోవ్‌కు 25,49,000 డాలర్లు (రూ. 16 కోట్ల 58 లక్షలు), రన్నరప్ గాఫిన్‌కు 11,58,000 డాలర్లు (రూ. 7 కోట్ల 53 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏటీపీ వరల్డ్ టూర్ - 2017 
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : పురుషుల టైటిల్ విజేత గ్రిగోర్ దిమిత్రోవ్

ఆఫ్గాన్‌కు అండర్-19 ఆసియా కప్ క్రికెట్ అండర్-19 ఆసియా కప్ వన్డే టైటిల్‌ను అఫ్గానిస్తాన్ గెలుచుకుంది. కౌలాలంపూర్‌లో నవంబర్ 19న జరిగిన ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించి కప్పును కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో భారత్ గ్రూప్ దశలోనే నిష్ర్కమించింది.

టెన్నిస్ క్రీడాకారిణి యానా నొవొత్నాకన్నుమూతచెక్ రిపబ్లిక్ టెన్నిస్ క్రీడాకారిణి యానా నొవొత్నా (49) నవంబర్ 19న మరణించారు. ఆమె కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్నారు. మహిళల డబుల్స్‌లో ప్రపంచ నంబర్ వన్‌గా నిలిచిన నొవొత్నా.. సింగిల్స్‌లో రెండో ర్యాంక్ అందుకున్నారు. 1993లో స్టెఫీగ్రాఫ్ 
(జర్మనీ) చేతిలో, 1997లో మార్టినా హింగిస్
(స్విట్జర్లాండ్) చేతిలో వింబుల్డన్ సింగిల్స్ ఫైనల్‌లో ఓడిపోయిన నొవొత్నా 1998లో నటాలీ తౌజియట్ (ఫ్రాన్స్)ను ఓడించి టైటిల్ సాధించారు. 1987 నుంచి 1999 వరకు సాగిన కెరీర్‌లో 24 సింగిల్స్, 76 డబుల్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఇందులో 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. 

వార్తల్లో వ్యక్తులుఆసియా సంపన్నుల్లో తొలి స్థానంలో ముకేశ్ కుటుంబం ఫోర్బ్స్ పత్రిక విడుదల ఆసియా టాప్ - 50 సంపన్న కుటుంబాలు - 2017 జాబితాలో ముకేశ్ అంబానీ ఫ్యామిలీ తొలి స్థానంలో నిలిచింది. ఈ కుటుంబం తాలూకు సంపద విలువ 19 బిలియన్ డాలర్ల పెరుగుదలతో ఏకంగా 44.8 బిలియన్ డాలర్లకు ఎగిసింది. శాంసంగ్ సామ్రాజ్యాన్ని స్థాపించిన కొరియాకు చెందిన లీ కుటుంబం 40.8 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచింది. హాంగ్‌కాంగ్‌కు చెందిన క్వాక్ కుటుంబం 40.4 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉంది. వీరి నికర సంపద విలువ 40.4 బిలియన్ డాలర్లు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా సంపన్న కుటుంబాలు - 2017 
ఎప్పుడు : నవంబర్ 17
ఎవరు : ఫోర్బ్స్ పత్రిక
ఎక్కడ : తొలిస్థానంలో ముకేశ్ అంబానీ కుటుంబం

మానుషి ఛిల్లర్‌కు మిస్ వరల్డ్ - 2017 టైటిల్ హరియాణాకు చెందిన 20 ఏళ్ల ‘మిస్ ఇండియా’ మానుషి ఛిల్లర్.. మిస్ వరల్డ్ 2017 టైటిల్‌ను సాధించింది. చైనాలోని సాన్యా నగరంలో నవంబర్ 18న నిర్వహించిన 67వ మిస్ వర్డల్‌పోటీలో 118 దేశాల నుంచి వచ్చిన సుందరాంగుల్ని తోసిరాజని ఛిల్లర్ ప్రపంచ సుందరి కిరీటాన్ని ైకైవసం చేసుకుంది. ప్రపంచంలో ఏ వృత్తికి అధిక వేతనం ఇవ్వడం సముచితం అన్న ప్రశ్నకు ‘తల్లి ఉద్యోగం’ అని చెప్పి ఆమె న్యాయ నిర్ణేతల మనసుల్ని గెలుచుకుంది. 
2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ టైటిల్ గెల్చుకున్నాక మరో భారతీయురాలు ఈ ఘనత సాధించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఛిల్లర్ హరియాణాలోని సోనెపట్‌లో వైద్య విద్య రెండో సంవత్సరం చదువుతోంది. 
బ్యూటీ విత్ పర్పస్ విభాగంలోనూ.. 
మిస్ వర్డల్ - 2017 పోటీల్లో టాప్ మోడల్, పీపుల్స్ చాయిస్, మల్టీమీడియా విభాగాల్లో ఛిల్లర్ సెమిఫైనల్‌కు చేరారు. అలాగే ‘బ్యూటీ విత్ పర్పస్’ విభాగంలో మరొకరితో కలిసి సంయుక్త విజేతగా నిలిచారు. బ్యూటీ విత్ పర్పస్ కోసం ఛిల్లర్ ఎంచుకున్న ప్రాజెక్టు ‘శక్తి’. రుతుస్రావ సమయంలో ఆరోగ్యంపై మహిళలకు అవగాహన కల్పించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 20 గ్రామాల్లో పర్యటించిన ఆమె 5 వేల మంది మహిళలకు చికిత్స అందించారు.
భారత్‌కు 6 మిస్‌వరల్డ్ టైటిల్స్ 
మానుషి ఛిల్లర్ సాధించిన కిరీటంతో భారత్ ఖాతాలో ఆరు మిస్ వరల్డ్ టైటిల్స్ చేరాయి. మొదటిసారి 1966లో రీటా ఫారియా మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్నారు. 1994లో ఐశ్వర్య రాయ్, 1997లో డయానా హేడన్, 1999లో యుక్తా ముఖీ, 2000లో ప్రియాంకా చోప్రాలు ప్రపంచ సుందరులుగా నిలిచారు.
భారత్‌కు రెండు సార్లు ‘మిస్ యూనివర్స్’ కిరీటం దక్కింది. 1994లో సుస్మితా సేన్, 2000లో లారాదత్తాలు మిస్ యూనివర్స్‌లుగా నిలిచారు. ప్రపంచంలో భారత్, వెనెజులాలు మాత్రమే ఆరేసి మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకున్నాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : మిస్ వరల్డ్ - 2017 టైటిల్ 
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : మానుషి ఛిల్లర్ (భారత్)
ఎక్కడ : సాన్యా నగరం, చైనా 

వెయిట్‌లిఫ్టర్ సులేమాన్ ఒగ్లు కన్నుమూత ఏడుసార్లు విశ్వవిజేత... వరుసగా మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్... టర్కీ దిగ్గజ వెయిట్‌లిఫ్టర్ నైమ్ సులేమాన్‌ఒగ్లు అనారోగ్యంతో నవంబర్ 18న కన్నుమూశారు. కేవలం 4.8 అడుగుల ఎత్తుండే సులేమాన్ ఒగ్లును వెయిట్‌లిఫ్టింగ్ ప్రపంచంలో ‘ద పాకెట్ హెర్క్యూలెస్’గా పిలుస్తారు. 
1988 సియోల్ (60 కేజీలు), 1992 బార్సిలోనా (60 కేజీలు), 1996 అట్లాంటా (64 కేజీలు) ఒలింపిక్స్ క్రీడల్లో ఆయన స్వర్ణ పతకాలు గెలిచారు. తన శరీర బరువుకు 2.5 రెట్లు బరువునెత్తిన తొలి, ఏకై క వెయిట్ లిఫ్టర్ ఆయనే. 22 ఏళ్లకే 32 ప్రపంచ రికార్డులు నెలకొల్పిన ఆయన 2000లో సిడ్నీ ఒలింపిక్స్ తర్వాత ఆట నుంచి వీడ్కోలు తీసుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వెయిట్‌లిఫ్టర్ సులేమాన్ ఒగ్లు కన్నుమూత 
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : ఏడుసార్లు విశ్వవిజేత. వరుసగా మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్. 

యూనిసెఫ్ బాలల హక్కుల ప్రచారకర్తగా త్రిష తమిళ సినీ నటి త్రిష ఐక్యరాజ్యసమితి బాలల నిధి(యూనిసెఫ్) సెలబ్రిటీ అడ్వకేట్‌గా వ్యవహరించనున్నారు. బాలల హక్కులు, వారి సమస్యలపై త్రిష ప్రజల్లో అవగాహన పెంపొందిస్తారని నవంబర్ 20న యూనిసెఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో చిన్నారుల ఆరోగ్యం, విద్య, బాల్య వివాహాలు, పిల్లల్లో రక్తహీనత, బాల కార్మిక వ్యవస్థ, చిన్నారులపై అకృత్యాలు తదితర సమస్యలపై పోరాటంలో త్రిష భాగస్వాములవుతారని యూనిసెఫ్ ఉన్నతాధికారి జాబ్ జకారియా చెప్పారు. కుటుంబాల్లో, సామాజిక వర్గాల్లో, బహిరంగ ప్రదేశాల్లో చిన్నారుల హక్కులకు భంగం వాటిల్లిన సందర్భాల్లో ఆమె క్రియాశీలంగా వ్యవహరిస్తారని జకారియా చెప్పారు. యూనిసెఫ్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న తొలి దక్షిణభారత నటి త్రిషనే. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూనిసెఫ్ బాలల హక్కుల ప్రచారకర్తగా త్రిష 
ఎప్పుడు : నవంబర్ 20
ఎందుకు : బాలల హక్కులు, వారి సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు 

దాతృత్వ నెట్‌వర్క్‌లోకి నీలేకని దంపతులుఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుతం ఆ కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్న నందన్ నీలేకని, ఆయన సతీమణి రోహిణి నీలేకని తాము సైతం సమాజ సేవకు సంపదను ధారపోస్తామంటూ ముందుకొచ్చారు. తమ సంపదలో సగం మేర సమాజానికి దానం చేసేందుకు ముందుకు వచ్చిన వ్యక్తుల సమూహం ‘ద గివింగ్ ప్లెడ్‌‌జ’లో నీలేకని దంపతులు చేరారు. ఇందుకు సంబంధించి అంగీకారం తెలుపుతూ నీలేకని రాసిన లేఖను ద గివింగ్ ప్లెడ్‌‌జ తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. 
గివింగ్ ప్లెడ్‌‌జను బిల్‌గేట్స్, ఆయన భార్య మిలిందా, వారెన్ బఫెట్ కలసి 2010లో ఏర్పాటు చేశారు. అధిక ధనవంతులను దాతృత్వం దిశగా ప్రోత్సహించేందుకు ఇది ఏర్పాటయింది. ఈ నెట్‌వర్క్‌లో మన దేశం నుంచి విప్రో అజీమ్ ప్రేమ్‌జీ, బయోకాన్ కిరణ్ మజుందార్ షా, శోభా డెవలపర్స్ ఎమిరటస్ చైర్మన్ పీఎన్‌సీ మీనన్ ఇంతకుముందే చేరగా, వీరి బాటలోనే నీలేకని దంపతులు నిర్ణయం తీసుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘ద గివింగ్ ప్లెడ్‌‌జ’లోకి నీలేకని దంపతులు 
ఎప్పుడు : నవంబర్ 20
ఎందుకు : సంపదలో సగం మేర సమాజానికి దానం చేసేందుకు

ఐసీజే న్యాయమూర్తిగా మళ్లీ ఎన్నికైన భండారి అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) న్యాయమూర్తిగా భారత్‌కు చెందిన జస్టిస్ దల్వీర్ భండారీ మరోసారి ఎన్నికయ్యారు. హోరాహోరీగా సాగుతుందనుకున్న పోటీ నుంచి నవంబర్ 21న బ్రిటన్ (అభ్యర్థి క్రిస్టోఫర్ గ్రీన్‌వుడ్ ) తప్పుకోగా.. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ, భద్రతా మండలిలు భండారీకి పూర్తి మద్దతు ప్రకటించాయి. దీంతో ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ అతి పెద్ద దౌత్య విజయం సాధించినటై్లంది. ఐరాస సాధారణ సభలో మొత్తం 193 ఓట్లకు గాను 183, భద్రతా మండలిలోని మొత్తం 15 ఓట్లనూ భండారీ దక్కించుకున్నారు. ఈ విజయంతో ఆయన మరో 9 ఏళ్ల కాలానికి ఐసీజే న్యాయమూర్తిగా పనిచేయనున్నారు. హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానంలో మొత్తం 15 మంది న్యాయమూర్తులుండగా.. ప్రతీ మూడేళ్లకు ఐదుగురిని ఎన్నుకుంటారు. 
2012 ఏప్రిల్ 27న ఐసీజే ఎన్నికల్లో ఫిలిప్పీన్‌‌స అభ్యర్థి ఫ్లారెంటినో ఫెలిషియానోను భండారీ ఓడించారు. భారత ప్రభుత్వం ఆయనను 2014లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2018 ఫిబ్రవరిలో ఐసీజే న్యాయమూర్తిగా ఆయన రెండో విడత పదవీకాలం మొదలవుతుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐసీజే న్యాయమూర్తిగా మరోసారి ఎన్నికైన దల్వీర్ భండారి 
ఎప్పుడు : నవంబర్ 20
ఎక్కడ : ది హేగ్, నెదర్లాండ్స్ 

అవార్డులు
అమితాబ్ బచ్చన్‌కు పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు  బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌ను పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారంతో సత్కరించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ నవంబర్ 16న ప్రకటించింది. నవంబర్ 20 - 28 వరకు గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.
అమితాబ్ బచ్చన్ ఐదు దశాబ్దాల సినీ కెరీర్‌లో 190కిపైగా చిత్రాల్లో నటించారు. 4 జాతీయ అవార్డులు, 15 ఫిల్మ్ ఫేర్ అవార్డులు పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమితాబ్ బచ్చన్‌కు పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 
ఎక్కడ : ఐఎఫ్‌ఎఫ్‌ఐ, గోవా 

రానా, దీపికాలకు సోషల్ మీడియా అవార్డులు దేశంలో తొలి సోషల్ మీడియా సదస్సు, సోషల్ మీడియా అవార్డుల ప్రదానోత్సవం - SMSA నవంబర్ 18, 19 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగింది. సౌత్ ఇండియా సోషల్ మీడియా బెస్ట్ హీరోగా దగ్గుబాటి రానాకు, సోషల్ మీడియా బెస్ట్ హీరోయిన్‌గా దీపికా పదుకునేకు పురస్కారాలు లభించాయి. సోషల్ మీడియాలో సంగీత సంచలనం అవార్డుని యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్‌కు దక్కింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ఈ అవార్డులను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విబ్రీ మీడియా సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : రానా, దీపికా పదుకునే, అనిరుధ్‌లకు సోషల్ మీడియా అవార్డులు 
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విబ్రీ మీడియా 
ఎక్కడ : అమరావతి

మన్మోహన్‌సింగ్‌కు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్.. ‘ఇందిరాగాంధీ శాంతి పురస్కారం- 2017’కి ఎంపిక య్యారు. పదేళ్ల పాటు (2004 నుంచి 2014 వరకు) ప్రధానిగా సేవలందించి శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి ద్వారా మన దేశాన్ని ప్రపంచంలో ఓ స్థాయిలో నిలబెట్టినందుకు ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారని ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్టు నవంబర్ 19న ప్రకటించింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని అంతర్జాతీయ న్యాయ నిర్ణేతల మండలి ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఈ పురస్కారాన్ని ఇందిరాగాంధీ ట్రస్టు 1986లో ఏర్పాటు చేసింది. అవార్డు కింద రూ.25 లక్షలు, ప్రశంసాపత్రం అందజేస్తారు. 

శ్రీలంక రచయితకు డీఎస్‌సీ ప్రైజ్ దక్షిణాసియా సాహిత్యానికిచ్చే డీఎస్‌సీ ప్రైజ్ 2017 సంవత్సరానికి శ్రీలంక రచయిత అనుక్ అరుద్ ప్రగసామ్‌కు లభించింది. ఆయన రాసిన ‘ది స్టోరీ ఆఫ్ ఏ బ్రీఫ్ మ్యారేజ్’కు ఈ బహుమతి దక్కింది. అవార్డు కింద 25 వేల డాలర్ల నగదును అందజేస్తారు.


No comments:

Post a Comment