వార్తల్లో వ్యక్తులు సెప్టెంబరు 2014
ఫోర్బ్స్ జాబితాలో ముకేశ్‌కే అగ్రస్థానం
ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ ఏడాది భారత కుబేరుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సారథి ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ఈ స్థానంలో నిలవడం ఆయనకిది వరుసగా ఎనిమిదో సారి. సన్ ఫార్మాస్యూటికల్ అధిపతి దిలీప్ సంఘ్వి రెండో స్థానం, విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ మూడోస్థానం దక్కించుకున్నారు. అలాగే అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ క్లబ్ సొంతదారునిగా ముకేశ్ అంబానీయే అగ్రగామిగా నిలిచారు.
భారత్‌లో బంగ్లా రాయబారిగా సయ్యద్
భారత్‌లో బంగ్లాదేశ్ రాయబారిగా సయ్యద్ మొవజ్జం అలీని ఆ దేశ ప్రభుత్వం సెప్టెంబర్ 28న నియమించింది. ఇప్పటివరకు రాయబారిగా కొనసాగిన తారిక్ ఏ కరీం స్థానంలో అలీ బాధ్యతలు చేపడతారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం
తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం సెప్టెంబర్ 29న బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ రోశయ్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. పన్నీర్‌సెల్వం ఇప్పటివరకు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి కావడం ఇది రెండోసారి.
ఐ.సి.ఎం. సెక్రటరీ జనరల్‌గా హర్దీప్‌సింగ్ పూరీ
బహుళ పాక్షిక సిద్ధాంతంపై స్వతంత్ర కమిషన్ (ఇండిపెండెంట్ కమిషన్ ఆన్ మల్టీ లేట్రలిజం-ఐ.సి.ఎం) సెక్రటరీ జనరల్‌గా హర్దీప్ సింగ్ పూరీ సెప్టెంబర్ 23 న నియమితులయ్యారు. ప్రపంచ సవాళ్లపై స్పందించేందుకు, విధాన పర ప్రతిపాదనలను గుర్తించేందుకు ఐసీఎం పనిచేస్తుంది.
ఐ.ఎస్.ఐ. డెరైక్టర్ జనరల్‌గా రిజ్వాన్ అక్తర్
పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐ.ఎస్.ఐ) కొత్త డెరైక్టర్ జనరల్‌గా లెఫ్టినెంట్ జనరల్ రిజ్వాన్ అక్తర్ నియమితులయ్యారు. అక్టోబర్ 1న పదవీ విరమణ చేయనున్న లెఫ్టినెంట్ జనరల్ జహీరుల్ ఇస్లాం స్థానంలో రిజ్వాన్ బాధ్యతలు చేపడతారు.
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌గా దత్తు
సుప్రీంకోర్టు 42వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హంద్యాల లక్ష్మీనారాయణ దత్తు సెప్టెంబర్ 27న ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటివరకు సీజేఐగా కొనసాగిన ఆర్.ఎం.లోధా రాజీనామా చేయడంతో జస్టిస్ దత్తు ఆ బాధ్యతలు స్వీకరించారు.
అంతర్జాతీయ పిల్లల శాంతి బహుమతికి భారత సంతతి బాలిక
2014 అంతర్జాతీయ పిల్లల శాంతి బహుమతికి భారత సంతతికి చెందిన నేహా (18) పేరు పరిశీలనకు వచ్చింది. అమెరికాకు చెందిన నేహా తన సొంత ఫౌండేషన్‌తో పిల్లల అవసరాలకు సాయమందిస్తోంది. రష్యాకు చెందిన అలెక్సీ (17) స్వలింగ సంపర్కులు, లింగమార్పిడి చేసుకొన్న వారి అణచివేతపై పోరాటం చేస్తోంది. ఘనాకు చెందిన ఆండ్వ్రె (13) దేశంలో కరవు నివారణ, ఆహార సహాయ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది.
కేంబ్రిడ్జ్‌లో న్యాయ శాస్త్ర అధ్యాపకురాలిగా భారత సంతతి యువతి
భారత సంతతికి చెందిన అంటారా హల్దార్ (28) ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయంలో న్యాయ శాస్త్ర అధ్యాపకురాలిగా సెప్టెంబర్ 15న బాధ్యతలు చేపట్టారు. దీంతో కేంబ్రిడ్స్ చరిత్రలో న్యాయశాస్త్ర అధ్యాపక హోదాలో నియమితులైన తొలి ఐరోపాయేతర వ్యక్తిగా అరుదైన ఘనత సాధించారు. ఆమె ముంబయికి చెందిన వారు.
మమ్ముట్టి ట్రీ ఛాలెంజ్
ఐస్ బకెట్...రైస్ బకెట్ ఛాలెంజ్ తరహాలో మలయాళ హీరో మమ్ముట్టి ట్రీ ఛాలె ంజ్ పేరుతో పర్యావరణ కార్యక్రమం చేపట్టారు. ఫేస్‌బుక్ ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.
నైతిక విలువల కమిటీ చైర్మన్‌గా అద్వానీ
లోక్‌సభ నైతిక విలువల కమిటీ అధ్యక్షుడిగా బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీని నియమిస్తూ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఉత్తర్వులిచ్చారు. కమిటీలో చైర్మన్‌తోపాటు 11 మంది సభ్యులు ఉంటారు. లోక్‌సభ సభ్యుల నైతిక ప్రవర్తనను కమిటీ పరిశీలిస్తుంది.
భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ రాహుల్ వర్మ
భారత సంతతికి చెందిన రిచర్డ్ రాహుల్ వర్మ (45)ను భారత్‌లో అమెరికా రాయబారిగా ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా సెప్టెంబర్ 18న నియమించారు. భారత సంతతి వ్యక్తిని అమెరికా రాయబారిగా నియమించడం ఇదే తొలిసారి.
ఐఈఏ అధ్యక్షుడిగా కౌశిక్‌బసు
ఇంటర్నేషనల్ ఎకనమిక్ అసోసియేషన్ (ఐఈఏ) అధ్యక్షుడిగా ప్రముఖ ఆర్థిక వేత్త కౌశిక్‌బసు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ప్రపంచ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఐఈఏకు అధ్యక్షత వహించనున్న రెండో భారతీయుడు కౌశిక్‌బసు. దీనికి గతంలో పనిచేసిన వారిలో నోబెల్ బహుమతి గ్రహీతలైన రాబర్డ్ సోలో, ఆమర్త్యసేన్, జోసెఫ్ స్టిగ్లిట్జ్‌లు ఉన్నారు.
ఫార్చ్యూన్ అత్యంత శక్తిమంతమైన బిజినెస్ ఉమెన్ జాబితా
ఈ ఏడాది ఫార్చ్యూన్ అత్యంత శక్తిమంతమైన మహిళా వ్యాపార వేత్తల జాబితాలో ఐబీఎమ్ చైర్‌పర్సన్, సీఈఓ జిన్నీ రోమెట్ అగ్రస్థానంలో నిలిచారు. పెప్సీకో ముఖ్య కార్యనిర్వహణాధికారి ఇంద్రానూయీకి మూడో స్థానం లభించింది. రెండో స్థానంలో జనరల్ మోటార్స్ సీఈఓ మేరీబరా నిలిచారు.
జాతీయ మహిళా కమిషన్ సారథిగా లలితా కుమార మంగళం
జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా లలితా కుమార మంగళంను సెప్టెంబర్ 17న కేంద్ర, మహిళా శిశు అభివృద్ధి శాఖ నియమించింది. తమిళనాడుకు చెందిన ఆమె ప్రకృతి అనే స్వచ్చంద సంస్థను నడుపుతున్నారు.
ప్రపంచ బ్యాంకు ఈడీగా సుభాష్‌చంద్ర గార్గ్
భారత్ తరపున ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా సుభాష్‌చంద్ర గార్గ్ సెప్టెంబర్ 10న నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఈ హోదాలో కొనసాగుతారు. ఆయన రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
అస్కి చైర్మన్‌గా నరేంద్ర అంబ్వానీ
అడ్వర్‌టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (అస్కి) చైర్మన్‌గా ఆగ్రోటెక్ ఫుడ్స్ డెరైక్టర్ నరేంద్ర అంబ్వానీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రకటనలకు ప్రమాణాలు నిర్దేశించే విషయంలో అస్కి కృషి చేస్తుంది.
విద్యావేత్త కీర్తి జోషి మృతి
విద్యావేత్త, కేంద్ర ప్రభుత్వ మాజీ విద్యా సలహాదారు కీర్తిజోషి (83) పుదుచ్చేరిలో సెప్టెంబర్ 14న మరణించారు. 1976లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయనను భారత ప్రభుత్వ విద్యాసలహాదారుగా నియమించింది. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివ ర్సిటీ, పాండిచ్చేరి యూనివర్సిటీ ఏర్పాటు ఆలోచన కీర్తిజోషిదే.
ఈయూ అధ్యక్షుడిగా డోనాల్డ్ టుస్క్పోలెండ్ ప్రధాన మంత్రి డోనాల్డ్ టుస్క్ యూరోపియన్ యూనియన్ (ఈయూ) అధ్యక్షుడిగా ఆగస్టు 30న ఎన్నికయ్యారు. ఇటలీ విదేశాంగ మంత్రి ఫెడరికా మొగెరినీని విదేశాంగ విధాన అధిపతిగా వ్యవహరిస్తారు.
మహారాష్ట్ర గవర్నర్‌గా విద్యాసాగర్‌రావుకేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ బీజేపీ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతోపాటు రాజస్థాన్ గవర్నర్‌గా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్, వాజూభాయ్ రూడాభాయ్‌వాలాను కర్ణాటక, మృదులా సిన్హాను గోవా గవర్నర్లుగా నియమితులయ్యారు.
బిపిన్ చంద్ర మృతిఆధునిక భారతదేశ చరిత్రను సాధారణ ప్రజలకు చేరువ చేసిన ప్రముఖ చరిత్ర కారుడు బిపిన్ చంద్ర(86) అనారోగ్యంతో ఆగస్టు 30న గుర్గావ్‌లో తుదిశ్వాస విడిచారు. 1928లో హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రాలో జన్మించారు. ‘ఇన్ ద నేమ్ ఆఫ్ డెమోక్రసీ: జేపీ మూవ్‌మెంట్ అండ్ ది ఎమర్జెన్సీ’, ‘ద రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ ఎకనమిక్ నేషనలిజం’, ‘నేషనలిజం అండ్ కలోనియలిజం ఇన్ మోడరన్ ఇండియా’, ‘ద మేకింగ్ ఆఫ్ మోడరన్ ఇండియా: ఫ్రమ్ మార్క్స్ టు గాంధీ’, ‘ద ఇండియన్ లెఫ్ట్: క్రిటికల్ అప్రైజల్’ తదితరాలు ఆయన రచనల్లో కొన్ని.
ఇంటర్ పోల్ అంబాసిడర్‌గా షారుక్‌ఖాన్అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్‌పోల్ ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు షారుక్‌ఖాన్ ఆగస్టు 28న ఎంపికయ్యారు. దీంతో ఇంటర్‌పోల్ ప్రచారకర్తగా ఎంపికైన తొలి భారతీయ నటుడిగా ఖాన్ గుర్తింపు పొందారు.
బీబీసీకి తొలి మహిళా చైర్ పర్సన్ రోనాబ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ)కు తొలి మహిళాచైర్ పర్సన్‌గా రోనా ఫెయిర్ హెడ్ ఆగస్టు 30న నియమితులయ్యారు.

No comments:
Post a Comment